జానపద సాహిత్యములో రామాయణ,భారత,భాగవతల్లొని దాదాపు ప్రముఖమయిన సంఘటనలను పాటలుగాపాడి నీతిబొధలుగాను అనేక విధములయిన వినొద సాధనములుగాను ఉపయొగించేవారు అన్నది సర్వులు విదితమే. అటువంటిదే ధర్మరాజ జూదము. ఈ జ్యూదవ్యసనము వలన ధర్మరాజు ఎమికొల్పొయాడు ఎంత ఇబ్బంది పడ్డాడో తెలపటమే పాట లక్ష్యం.
ఈ పాటలొని కధ మహభారతములోని సభాపర్వం లోని ద్వితీయాశ్వసం లోనిది.అంశం భారతములోనిది అయినా ఇది కేవలము జానపదుల ఉహజనితమయిన కల్పిత గాధ.
ఈ పాట ధర్మరాజు జూదమాడటానికి హస్తినాపురమునకు బయలుదేరటముతో ప్రారంభము అవుతుంది. అలా బయలు దేరేముందు ధర్మరాజును సహదేవుడు అతణ్ణి
"బింబకార్యములు చేయబొకయ్యా
ఆడకుమి జూదములు ఓడబొకయ్యా
ఓయన్న యెట్లయినా నామాట వినుమా
పతులు చూడగా మన సతి చెర బడుద్రు
ఈడ్చుకు బోదురు సభకు రాజల్లు "
అని హెచ్చరించాడు. సహదేవుడుని జానపదులు ఎంచుకొవటానికి కారణము. అతనికి పశుపక్ష్యాది భాషలు తెలుసు. సహదేవ పశువైద్య శాస్త్రము బాగా ప్రసిద్ధము.వారి దృష్టిలో ఇతడు చావుపుట్టకలు తెలిసినవాడని తామరకోలనులోని భమిడిగుండాన స్నానమాచరించి తడివస్త్రాలు ధరించి నిష్ఠతో భవితవ్యాన్ని అన్నకు చెప్పినట్లు ఇందు తెలుప బడినది.వ్యాస భారతములో కూడా సహదేవుడు అన్నను హెచ్చరిస్తాడు.
వీరు హస్తిన పొయేటప్పుడు
"నీళ్ళోసి పెంచిన నెలతలను
ఉగ్గొసి పెంచిన యువిదలను
పాలిచ్చి పెంచిన పణతులను" వెంట తీసుకోని వెళ్తారు.
హస్తినలో జూదము ప్రారంభము అయినది.ముందు ధర్మరాజు సింహాసనము మీద రారాజు లోహసింహాసనము మీద కూర్చోని జూదమాడగా రారాజు సర్వము కొల్పొతాడు.దీనితో రారాజు చేతిలోని పాచికలను శకుని చేతికిచ్చి జ్యేష్టాదేవి దగ్గరకు వేళ్ళి అమెను ప్రార్ధిస్తాడు.దీనితో అమె తన చెల్లెలు అయిన లక్ష్మీ వద్దకు పయనము అవుతుంది.లక్ష్మీ ఈమె రాక చూసి
"యెవ్వరిని చెరుప వచ్చేనో అక్క
పొకుడ్డ చాలవే పుట్టిలాజెల్లు
అరిచేత కలహంము పెంచుకొని వచ్చె" అని మదిలో తలచి అమెకు ఎదురెగి ముమ్మారు ప్రదక్షిణ చేసి సాష్టంగ దండ నమస్కారములుచేసి అమె వచ్చిన పని ఎమిటని అడుగుతుంది.రారాజు తనను శరణుజొచ్చాడని "శరణుజొచ్చినవారిని చేడగొట్టుటాకు - మనస్సు నొప్పదు నాకు ఓ మాలక్ష్మీ " అని తెలుపుతూ అదియి కాకుండా రాజసూయ యాగము చేసేణాదు తాను తన పిల్లలతో యఙ్ఞశాలలో భోజనాల పంక్తీలో ఆకులు వేసుకోని కూర్చొగా భీముడు "ఆడుదానివి నీవు ఇది నీతిగాదు - మగవారితో కుడువ పాటి లేదనచు" తనను ఆవమాన పరచాడని అప్పుడు తాను శాపం ఇచ్చను అని ఆ శాపం ఫలించే రోజు నేడు వచ్చింది కనుక తనతో సహకరించి ధర్మరాజును వదిలి రారాజును పొందమంటుంది. కానీ లక్ష్మీ ధర్మరాజు ధర్మం తప్పని వాడని అతడివదిలి అధర్మపరుడైన రారాజును పొందటానికి అంగీకరించదు. కానీ అక్క క్రోధానికి జడసి ధర్మరాజును విడచి రారాజును చేరుతుంది.
ఈ సారి ధర్మ్రాజు లోహసింహసనము మీద,రారాజు సింహసనము మీద కూర్చుని జూదమాడతారు.లోహసింహసనము శనికి సూచన.జూదములో ఏవరు జయించేది సింహసనములను బట్టి సూచన జరిగినది.పాచికలు శకుని హస్తాన్ని అలంకరిస్తాయి.ధర్మరాజు ఓక్కొక్కటిగా సర్వసంపదలు, చివరకు ద్రౌపదిని ఒడ్డి ఓడిపొతాడు.
తనను సభకు తొడ్కొని పొవడానికి వచ్చిన దుశ్శాసనునితో ద్రౌపది
"వదినగారిని సుమ్మి పరసతిని సుమ్మి - వావి తప్పగరాదు వరపుత్ర వినుమా" అని పలుకుతుంది.
అంత దుశ్శాసనుడు నీవు కేవలము దాసివి మాత్రమే అని ధ్వనింపచేస్తూ "వదినగారివి కావు వరుసలు లేవు" అని అంటాడు.
అంత అమె తను ఋతుస్నాత అని స్నానమయితేగాని సభకు రాజాలను అంటే ఆదుష్టుడు
"వెండి కాగులతో వెణ్ణీళ్ళు గాచి
భమిడి కాగులతో చన్నీళ్ళు దెచ్చి
వెణ్ణీళ్ళు చన్నీళ్ళు సమముగా తోలిపి
పాపకర్ముడు బోసే పాంచాలీమీద"