నేను గతనెల 25 వ తేదిన ఏకపత్ని వ్యవస్థ పై ఒక పోస్ట్ వ్రాసాను.
http://subhadrakeerthi.blogspot.in/2012/06/blog-post_25.html
ఈ పోస్టులో కామెంట్ విభాగంలో శ్రీమతి అనురాధ గారు ఒక పెద్ద కామెంట్ చేసారు. దానికి కొంత వివరణ ఇచ్చాను.కాని వారు సంతృప్తి పడి నట్లు లేదు దానికి ఉదాహరణగా వారి బ్లాగ్ నందు వారు కొ౦త వివరణ ఇచ్చారు.
http://aanamdam.blogspot.in/2012/07/blog-post_04.html ఈ పోస్ట్ తాలుకు కామె౦ట్ విభాగంలో మరలా వివరణ ఇచ్చే ప్రయత్నం మరియు కొంత ఆవేదన వ్యక్తం చేసినారు.మరలా ఆసమయములో సుదీర్ఘమైన ప్రత్యుత్తరాలు అక్కడే ఇచ్చాను కాని. సోదరిని పూర్తిగా మెప్పి౦చానో లేదో నాకు తెలియదు. కాని అనురాధ గారు మాత్రం మొదట నాబ్లాగ్ కామె౦ట్లో సనాతనమయితే ఆమె బ్లాగ్ చివరకు వచ్చుసరికి కొంత శాస్త్రీయ ఆలోచనకు వచ్చే ప్రయత్నం చేసారు.ఇది అభినందించాలి.విజ్ఞానం ఎప్పుడు ఆలోచన,అన్వేషణ ఫలితంగా ఉద్భవిస్తుంది.ఇది సత్యం.అలాగే శ్వేతకేతు అనేది పురుష శుక్రం నకు మరో పేరు గా కూడా ఆలోచించ వచ్చని నా భావన.
అలాగే శ్వేతకేతు గురించి మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఎలా.
అందుకే అసలు ఇటువంటి వారిని, ఇటు వంటి సంఘటనలు వుండే "పూర్వగాధలహరి" నీ , "పురాణనామ చంద్రిక" ను ఆశ్రయించా వాటిలో తెలిపిన విషయాలే నేటి పోస్ట్.
పూర్వగాధలహరి : ఓ మహర్షి. అరుణి లేక ఉద్దాలకుడు ఋషి కుమారుడు.గౌతమి గోత్రికుడు.ఇతని సోదరి సుజాత.సుజాత కుమారుడే అష్టావక్రుడు.అనగా శ్వేతకేతునికి అష్టావక్రుడు మేనల్లుడు.వీరిద్దరు ఉద్దాలకుని ఆశ్రమములోనే పెరిగారు.
శ్వేతకేతుని గర్వభంగం : తండ్రి వద్ద నేర్చుకొన్న విద్యతో గర్విష్టి కాగా తండ్రి నీవు విన్నవి,కన్నవి,నాదగ్గర నేర్చుకున్నవి కాక వినని కనని విషయాలు ఏమైనా నేర్చు కొన్నావా అనగా దానికి అతడు తెలియదని అ౦గీకర౦చగ పరమాత్మ అంటే మొదట ముగింపు లేనిది కారణం ఏమిటో తెలుసుకోమ్మన్నాడు తండ్రి విద్య అనంతరం పాంచాల దేశం వెళ్ళి రాజకుటుంబ౦ కొలువైన జైవాలి వెళ్లగా ప్రవాహానరాజు కొన్ని ప్రశ్నలు వేయగా వాటికి సమాధానం చెప్పలేక తండ్రి ఉద్దాలకుడికే చెప్పగా రాజు వద్దకే వెళ్ళి సమాధానం తెలుసుకొమంటాడు. అతడు తడబడగా ఉద్దాలకుడే రాజు వద్దకు వెళ్ళి వాటి సమాధానం తెలుసుకుంటాడు. (చా౦దోగ్యోపనిషత్)
యజ్ఞ విధానాల రూప శిల్పి : కౌసకి బ్రాహ్మణుల్లో శ్వేతకేతుడు అరాధ్యుడనదగ్గవాడు. యజ్ఞాలలో పాల్గొనే పురోహితులకు కొన్ని విధి విధానాలు ఏర్పరచాడు. ఇంతేకాక బ్రహ్మచారిణులకు,తపస్వినులకు ప్రత్యేకమైన ఆచారాలు రూపొందించాడు.ఇతనికి ముందు ధర్మ శాస్త్రాలలో తీపి రుచిగల పదార్ధాలు వీరికి నిషిద్దం.శ్వేతకేతు ఇది తప్పుడు సిద్ధాంతం అని తేల్చాడు.ఒకసారి జాతకర్న్యుడు అను బ్రాహ్మణుడు కాశి విదేహ కోసల రాజులకు పౌరోహిత్యం వెళ్లగా కోపించి తండ్రితో చెప్పగా పౌరోహిత్యం తెలివి తేటలను పెంచుకోవడంకోసం వెళ్ళాలి గాని భౌతిక అవసరాలకు కాదన్నాడు.
కామశాస్త్ర గ్రంధ రచన : ఇతడు నంది వ్రాసిన కామ శాస్త్ర గ్రంధాన్ని 500 అధ్యాయాలుగా సంక్షిప్తికారి౦చాడు తరువాత బాభ్రవ్యుడు మరి౦త స౦క్షిప్తి౦చెయగా దీనికి రెండు గ్రంధాలను జతపరచి సంక్షిప్తికారి౦చి తన ప్రసిద్ధ గ్రంధం కామసూత్ర రచించాడు.ఇతడు మద్యపానం,పరస్త్రీ పొందు బ్రాహ్మణులకు పాపమని ఎలుగెత్తి చాటిన మొదటి వాడు.దీనికి మహాభారతం లోని ఓ చిన్న కధ ఆధారముగా చెప్తారు.ఇతడు ఉద్దాలకుని భార్యకు వేరే అతని శిష్యుడి అక్రమసంభందం వల్ల జన్మి౦చాడు. ఆ తర్వాత తన తల్లిని వేరే బ్రాహ్మణుడు ఎత్తుకుపోయాడు.ఏకపత్ని,ఏకభర్త విధానాన్ని ఇతడు ప్రతిపాదించి ప్రచారం చేసాడు.
పురాణ నామ చంద్రిక : పుట 213 పరిశిలించగలరు. పై విషయాలే పునశ్చరణ. కాలం,శ్రమ దండుగని ఈ విధముగా తెలుపుచున్నాను.
అలాగే మరలా మరొక్కసారి నేను వ్రాసిన రెండు పోస్ట్ లు సాధికారము గా వ్రాసినవేనని గమనించ గలరు.
మన వేద,ఉపనిషత్తులు,ఇతిహాసాల్లో ప్రక్షిప్తాలు ఎక్కువ కారణం అవి ఉద్భవ కాలం నకు లిపి కాలమునకు మధ్య అనేక వందల సంవత్సరాలు ఉన్నాయని, అలాగే గత వేదకాల విద్యా విధానాలు ముఖతా, పునఃశ్చరణ విధానం లో అనేక విపరిణామాలు సంభవించాయి ఇది కూడా గమనించండి.
మన వాళ్ళు ఆ రోజుల్లో ఏమైనా కొత్త విషయం కనుగొన్న వాటికి పేరు కాని వాటి లక్షణాలు చూసి పెట్టే వాళ్ళు నా అభిప్రాయం ప్రకారం పురుష వీర్యం లోని శుక్ర కణములవలన సంతానం పుడుతున్నారు అన్న విషయం కనుగొని ఇటు వంటి విధానం పెట్టారు అన్నది నా అభిప్రాయం.
ఇక అనురాధ గారిని ఇబ్బంది పెట్టిన ఆచారం గురించి చర్చించ దలుచుకోలేదు.వాటి మీద చర్చ సోదరి మణులకు ఇబ్బంది గాను, అదుపు తప్పు తుంది కనుక ఎవరు ఏమనుకొన్న ఆవిషయం మీద చర్చ చేయను. నా వద్ద వాదనకు సరి పోను సమాచారం వున్నది కాని మౌనమే నా సమాధానం. వారి వారి బుద్ధి,కర్మలనుబట్టి వారి వద్దకు ఆ ప్రశ్నలకు సమాధానం లభిమ్చుతు౦ది.అప్పటి వరకు ఓ౦ నమో నారాయణ ఆశ్రయం.
http://archive.org/stream/puranicencyclopa00maniuoft#page/780/mode/2up
పై లింక్ నందు ఆంగ్లములో పురాణిక్ ఎన్ సైక్లోపీడియా లో కూడా శ్వేతకేతు తాలుకు వివరము ఉన్నది.ఆసక్తి వున్న వారు ప్రయత్నించండి.
rameshgariki, 2012 lo 100 postlu poorthi chesukunnanduku subhakanshalu. go ahead
రిప్లయితొలగించండిచదవలేకపోతున్నాను మీ టపాలు.
రిప్లయితొలగించండిLBS తాడేపల్లి గారు, ధన్యవాదాలు. అయ్యా మీరు మీ విలువలకు తగ్గ వాటిని ఎంచుకొండి.నా మానాన నన్ను వదిలేయండి. మీరు తెలుగు మాస్టారు లా వత్తులు,పల్లులు ప్రాధాన్యం. నాకు ఉన్న సమయభావాలు తక్కువ. పోనీ నేను బూతు సబ్జేక్ట్ గా వ్రాస్తే అభ్యంతరం తెలియ చేయండి.సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. అంతే కాని సున్నితం గా బాణ ప్రయోగాలు చేయవద్దు.మీరు బరహ వాడమన్నారు నాదగ్గర అంత సోమ్ములేదు.నాకున్న వత్తిడి తగ్గించుకోవడం కోసం నాకు పఠనం అలవాటు ఆప్రక్రియలో భాగంగా ఏవో కొన్ని వ్రాస్తున్న. మీకు నచ్చక పొతే వదిలేయండి. మీరు మీ బ్లాగ్ కలగూర గంప అనుకుంటా దానిని ఆస్వాదిస్తూ ప్రజలను చైతన్య వంతులు, విజ్ఞాన వంతులు చేయండి. మరొక్క సారి మీకు వందన సమర్పణలు.
రిప్లయితొలగించండిబాగా చెప్పారు రమేశ్ గారు. ఈ తాలబాసు చాదస్తం పెరిగి, పరుల పంచెలను సరి దిద్దే పనులు చేస్తున్నాడు. ఈయన మటుకు ఇంగ్లీషోడిలా సూట్ వేస్కుని పోసు ఇస్తుంటాడు.. లకసూమాపీనాకి..
రిప్లయితొలగించండి