5, జులై 2012, గురువారం

గాంధీజీని ఆకర్షించిన సీత సత్యాగ్రహ లక్షణము.

గాంధీజీని  మన జాతిపిత అన్నసంగతి సర్వులకు విదితమే. వారికి రామాయణభాగవతాలలొ వున్న ఆసక్తీ ఆయిన ఆత్మకధలో కూడ వున్నది.గాంధీజీకి ఈ రామాయణపఠనములో సీతకుగల సత్యాగ్రహ లక్షణము ఆయనను ఆకర్షించి భారత జాతియోద్యమానికి ఆయుధముగా ఎంచుకున్నాడు.ఆధునిక కాలములో మహాద్భుతపొరాటము చెయటమేకాదు లక్ష్యము సాధించాడు.ఈ విషయము హింది  పుస్తకము ధర్మపాలన్ నందు వున్నది.ఇది గాంధిజీ సబర్మతీ ఆశ్రమము లైబ్రరీ నందు పరిశీలించా. అందలి విశేషాలు క్లుప్తముగా మీముందుకు.    


రాముడు సత్యపరాక్రముడైనట్లు సీత సత్యాగ్రహస్వరూప.తానెన్ని కష్టముల్నైన నొర్చునుగాని తన నిశ్చతమునకు భంగమురానీయదు. ఎన్ని బాధలనైన సహించునుగాని తన ధర్మమునకు చిన్నమెత్తులోపమైన రానీయలేదు.ఆ వ్రతనిర్వాహణమున దేదీప్యమానముగా ప్రకాశించుచుండును.ఆ వ్రతనిర్వాహణమున తన వినయమును వీడలేదు.తన సాధుత్వమును సమసిపొనీయలేదు. తన శాంతమును చల్లారనీయలేదు.ఇట్టి సత్తువగల సత్యాగ్రహవ్రతము రామాయణమును బంగారమునకు పరీమళము కల్పించినది సత్యాగ్రహమే అనుటలో సంశయము ఎంతమాత్రము లేదు.ఇట్టి సత్యాగ్రహశక్తితో సమరము చేయబూనిన దుష్టబుద్ధియగు రావణుడు కూకటివేళ్ళతో కూలిపొవుట ఆశ్చర్యముకాదు.ఇట్లు సీతావ్రతమహత్యమువలనే చివికి క్షీణించిపొయిన రావణుని సంహరించుట రాముని కర్తవ్యపరాయణునికి ఒక లెక్కలొనిది కాదు.ధర్మప్రాణములకు దూరమయిన రావణుని తనువు నరకుటకు సీత సత్యాగ్రహ శక్తి రాముని కర్తవ్యమును సుగమమొనర్చెను.          

సీత పాత్ర ద్వారా సత్యాగ్రహవ్రత శక్తి తెలుసుకున్న గాంధీజీ బ్రిటిష్ వారిపై అదే ఆయుధము ప్రయోగించాడు.రావణుడే మట్టి కరఛాడు ఇక వీళ్ళు ఎంత.
సత్యాగ్రహముతో జాతియోద్యమము నిర్మించాడు సాధించాడు.

1 కామెంట్‌:

  1. బాగుందండి ఆ హిందీ పుస్తకం లో ఇలాంటి ఆసక్తి కరమయిన విషయాలను తెలుగులో అందించడానికి అవకాశం ఉంటే చూడండి

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.