16, జులై 2012, సోమవారం

అంబోధి,జలధి,పయోధి,ఉదధి, వారాంనిధి,వారిధి



 అంబోధి,జలధి,పయోధి,ఉదధి, వారాంనిధి,వారిధి ఈ ఆరు పదాలు సముద్రానికి పర్యాయపదాలుగా వాడుక. కాని ఇన్ని పదాలు వెనువెంటనే ఇదే క్రమములో పద్యము ఏవరైనా చెప్పగలరా అంటే ఈ నాటికాలములో కొద్దిగా కష్టము కాని పూర్వ కాలములో ఇది సులువుగా జరిగే  ఓ క్రియ. ఈ పద్యము శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రీ గారి కృషి ఫలితముగా వెలువడిన "చాటుపద్య మణిమంజరి" లోనిది. దీని తాత్పర్యము కూడా చిన్న కధలా చెప్పుకోనవచ్చును.
ఓకనాడు కైలాసములో సవతుల మధ్య రచ్చ జరిగింది. భవాని ఎమో తన పుత్రుడు కార్తికేయునితో ఫిర్యాదు చేసింది. తల్లి అంటే అభిమానము మెండుగా కలవాడైన షణ్ముఖుడు, అసలే కోపధారి తండ్రీ వద్దకు వేళ్ళి విషయము ప్రస్తావించాడు.ఆసమయములో శివుడు,షణ్ముఖుడు మధ్య జరిగిన సంభాషణే ఈ పద్యము.


శ్లో!! ఆంబా కువ్యతితాత!మూర్ధ్ని విహిత గంగేయ మత్సృజ్యతాం
 విద్వన్ షణ్ముఖ కాగతి ర్మయి చిరం తస్యాస్థ్సితాయ వద
 రోషోత్కర్షవశా దశేషవదనైః ప్రత్యుత్తరం దత్తవా
 నంబోధి ర్జలధిః పయోధి ర్వారాన్నిధి ర్వారిధిః.
   తాత్పర్యము: "నాన్న అమ్మకు కోపము వస్తున్నది. నీ తల మీద ఉన్న ఈ గంగను విడచిపెట్టు".కుమారాస్వామి! నీవు అన్నీ తెలిసినవాడవు కదా! ఇన్నాళ్ళూ నా నెత్తిమీద ఉన్న అమెగతి ఏం కావాలో చెప్పు. ఆ మాటవినగానే కోపం పట్టజాలక " అమెకు ఏమిగతి అంటావా-" అంబోధి,జలధి,పయోధి,ఉదధి, వారాంనిధి,వారిధి అని ఆరుముఖాలతో ఒక్కమాటే చెప్పాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.