18, జులై 2012, బుధవారం

"నారాయణీయం" గురించి కొన్ని విశేషాలు.


మేల్పత్తూర్ నారాయణ భట్టతిరి నంబూద్రి వంశ బ్రాహ్మణుడు. ఆయిన 1560 లో జన్మించారు.అనన్య సామాన్య అకుఠింతటదీక్షతో 16 సం లకే వేదవిద్యలు, ధర్మ శాస్త్రాలను ఆయిన గురువైన శ్రీ పిషరడీ గారివద్ద అభ్యసించారు.వీరు గురువు గారికి గురుదక్షణగా తనసంపూర్ణ అరోగ్యాన్ని సమర్పించి వారి దీర్ఘకాల వ్యాధీయిన వాత రొగాన్ని తాను స్వీకరించిన మహానుభావుడు.గురువు గరికి ఉపశమనము లభించినది కాని భట్టతిరి గారికి వాతరోగం దుర్భరమయినది.దీనిని తప్పుకొవటానికి భగవంతుని కరుణ తప్ప వేరు మార్గము లేదని తలచి గురువాయూర్ నందు నారాయణుడు స్వయంభూవుగా వున్నాడని గురువాయూర్ చేరి ఆ నారాయణుని ప్రస్తుతిస్తూ భాగవత రచనా కార్యక్రమాన్ని ప్రారంభించాడు.ఇది 100 రోజుల పాటు కొనసాగింది.నారాయణ భట్టతిరి రచన మరియు నారాయణుని గాధ కనుక "నారాయణీయము" అని పిలువ బడింది.
  ఈ రచనాకాలములో భట్టతిరీ గారి అనన్య భక్తికి మెచ్చి కృష్ణుడు స్వయముగా వినేవాడని,మధ్య మధ్యలో అంగీకార సూచికముగా తల,కరముల కదలికతో తన అంగీకారాన్ని తేలిపేవాడని అనేక గాధలు వున్నాయి.
నరసింహావతారాన్ని వ్రాసే ముందు అవతార అవిర్భావము  ఎలా వర్ణించను, సింహాన్ని ఎలా వర్ణించను అని చింతన చేస్తే ఎదురుగావున్న రాతి స్థంభము ఫెళ ఫెళా విరిగిపొతు అందులో భీమ ఉగ్ర నరసింహ రూపాన్ని కని నరసింహావతారము వ్రాశాడని.అలాగే సీత హనుమకు చూడామణి అనుగ్రహించే ఘట్టములో ఒక పదము వ్రాస్తే భావపరిపూర్ణత రాక మధనపడుతుంటే సరి అయినా ప్రత్యామ్నాయాన్ని కృష్ణుడు చూపించాడని ఇలా అనేక గాధలు ప్రచారములో వున్నాయి.

ఇలా నారాయణీయము పూర్తి అగిసమయానికి భట్టతీరి గారి ఆరొగ్యము గుణపడి సంపూర్ణారొగ్యం చేకూరినది.ఆయిన చరమ శ్లొకముగా ఇలా వ్రాసాడు


  "కృష్ణా! బుద్ధికి గాని, ఇంద్రియాలకు గాని కనిపించనది నీ అవ్యక్త రూపము.అది సామాన్యులకు ఉహకు కూడా అందదు.కనుక వారికి ఫలితము దుర్లభమే.కానీ ఈ గురువాయూర్ లో నీ ప్రత్యక్ష తేజ స్వరూపము అపూర్వము.అతి మనొహరము.ఈ శుద్ధ సత్వాన్ని అశ్రయించి పునః పునః ప్రమాణాలు అర్పణ చేస్తున్నాను నన్ను అనుగ్రహించు అని పలుకగా ఉత్తర క్షణములో పరమాత్మ ఎట్టేదుట సాక్షాత్కరించాడు.  

2 కామెంట్‌లు:

  1. చక్కటి పోస్టును అందించినందుకు కృతజ్ఞతలండి.

    రిప్లయితొలగించండి
  2. కేరళకు ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ కురువృద్ధుడు, దివంగత నేత కరుణాకరన్ నారాయణీయాన్ని ప్రతిరోజూ పారాయణం చేసేవరట. అది ఆయనకు కంఠతా వచ్చని ఎక్కడో చదివినట్లు గుర్తు.

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.