రామో విగ్రహన్ ధర్మః
ఈ వాక్యం రాముని ధర్మనిరతిని సూచిస్తూ పలువురు ప్రస్తావిస్తారు. అయితే రామాయణం లో ఈ వాక్యాన్ని వాల్మీకి గారు మారీచునితో అనిపిస్తాడు. వినటానికి మనకు గమ్మత్తుగా వున్నది. మారీచుడు ఏమిటి రాముని అంతలా విగ్రహన్ ధర్మః అనే అంతగా...వివరాలు లోకి వెళితే ...మారీచుడు రావణాసురిని వద్ధ ముఖ్యుడు. ఏంత అంటే రావణాసురిని అంతరింగక వర్గంలోని ముఖ్యుడు రావణాసురిని బంధువు. తాటకి కుమారుడు. తాటకి రావణాసురిని అమ్మమ్మ. అంటే మారీచుడు రావణాసురుని మేనమామ. ఇది వారి సంబంధం. ఇంత విశ్వసనీయత వారి మధ్య వున్నది.
రావణుడు మారీచుని సీతాపహరణంనకు ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో మారీచునకు అంతకు క్రితమే విశ్వామిత్రులతో యాగసంరక్షణార్ధం వచ్చిన రాముని చేతిలో తనతల్లి మరణం , తనసోదరుడు సుబాహు మరణం ఇత్యాదులవలన మరియు సహజ సిద్ధమైన తన రాక్షసమాయలతో ప్రజలద్వారా చారుల ద్వారా ఇలే అనేక విధాలుగా రామచంద్రుని ధర్మనిరతి ఆయన వీరత్వం కర్తవ్యపరాయణత్వం రాముని బాణం యొక్క వాడి వేడి తెలిసిన వాడగుటచేత రావణాసురునికి సీతాపహరణం కూడదు అని హితవు చెప్పే సమయంలో రావణాసురిని ఉద్దేశించి ఉద్దశేంచి " రామో విగ్రహన్ ధర్మః" అని ప్రస్తావిస్తాడు. రావణా విను రాముడు మామూలు వాడు కాదు ధర్మం పోత పోసి సశరీరంగా నడయాడే స్వరూపం అటువంటి ధర్మశిఖతో ప్రజ్వరిల్లే రాముని ధర్మపత్నిని అపహరించమంటున్నావు నీవు శలభంలా మాడిపోతావు అంతేకాదు నీవు , నీతో అనుసరించిన నేను , మేము కడకు ఈ రాక్షసజాతి వినాశనమునకు ,లంకకు మంగళకరము కాదు అని పలువిధాలా బ్రతిమలాడుతాడు కాని వినడు చివరకు విధిలేని పరిస్థితి లో బంగారు జింక వేషం ధరించి వెళ్ళి రామబాణం తగిలి మరణిస్తాడు కాని రాక్షస బుద్ధిగా చనిపోయో సమయంలో హలక్ష్మణా అనే ఆర్తనాదాలు చేసి చనిపోతాడు.తదుపరీ సీతాపహరణం , ఆతదుపరి రావణసంహరం . ఇది అంతా రాముని ధర్మనిరతిని తెలుసుకోవటమో. అందుకే రామో విగ్రహన్ ధర్మః.
అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
శ్రీరామ జయం.
ఆలపాటి రమేష్ బాబు
విజయవాడ.
94401 72262.
ఒక అందాల అద్బుతం, ఒక వసంత సమీరం, మెరిసే మెరుపు, అనంత ఆత్మీయత, ఒక అల్లరి, ఒక పెంకి, కొద్దిగా కోపం, ఇంకొద్దిగా అలక, అందరికన్నా చిన్నది, అన్నిటా తానే, ఒక అనంత శక్తీ రూపం, అమ్మకు బొమ్మ, అన్నయ్యకు ముద్దుల చెల్లి ,నాన్నకు "అమ్మ"........అమ్మ అంటే నిజంగా అమ్మ
4, ఆగస్టు 2020, మంగళవారం
రామో విగ్రహన్ ధర్మః
లోకఃసమస్తా సుఖినో భవంతు
లోకఃసమస్తా సుఖినో భవంతు.
*********************************
లోకః సమస్తా సుఖినోభవంతు. ఈ వాక్యం మనలో చాలా మంది అనేకసార్లు విని , చదవి వుంటారు. కాని దీని విశేషం తెలుపుటతో పాటు
వర్తమాన కాల అన్వయం చేసి మన భరతజాతి గొప్పదనాన్ని పునఃశ్చరణ చేయిటయే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం.
మన భరతజాతి లో హైందవం అనేది నేడు మతము అయినా ఇది ఓ జీవనమార్గం అనేది సత్యం.
మనం తెలుసుకో కోరే వాక్యం స్వస్తి వచనాలలో ఓ భాగంగా వున్నది. ఈ స్వస్తి వాక్యాలు మనం విశేషకార్యక్రమాలు నిర్వహించినప్పడు ఆకార్యక్రమం చివరలో బ్రహ్మగారు ఈ క్రింది మంత్రాలతో దీవిస్తారు అవి...
*******
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం!
న్యాయేన మార్గేణ మహీం మహీశాః!!
గోబ్రాహ్మణ్యేభ శ్శుభ మస్తు నిత్యం!
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు !!
కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యస్యాలినీ!
దేశోయం క్షోభ రహితో బ్రాహ్మణా స్సంతు నిర్భయాః!!
అపుత్రాః పుత్రిణస్సంత్తు,పుత్రిణస్సంత్తు పౌత్రిణః!
అధనా స్సధనా స్సంతు జీవంతు శరదాం శతం!!
యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే!
వృతనాళౌ సమభవత్ తత్తే భవతు మంగళం!!
ఋతవ స్సాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చతే!
మంగళాని మహారాహో దిశంతు తవ సర్వదా!!
పై శ్లోకాలు కి అర్ధం
శుభం కలుగుగాక! ప్రజలకి, న్యాయమార్గంలో వుండి ఈ భూమిని ప్రజలను ,రక్షించు ప్రభువులకి.
గోవులు , బ్రాహ్మణులకు సదా శుభం కలుగుగాక.
లోకములో అందరు శుభముగా వుందురుగాక.
అన్నీకాలములలోను భూమిపైన వర్షాలు కురిసి పంటలు పచ్చగా పండుగాక.
దేశాలు అన్నీ ఈతి భాధలు కరువు కాటకాలు లేకుండా వుండుగాక , బ్రాహ్మణులు వారి సంతానం వారి గురుకులాలు శుభంగా వుండుగాక.
పుత్రులు లేని వారికి పుత్రులు , పుత్రులు వున్నవారు పౌత్రులు ప్రపౌత్రులతో శుభంగా వుండుగాక.
ధనంలేని వారు ధనం కలిగి , ధనం కలిగిన వారు పాడి పంటలతో చల్లగా వందసంవత్సరాలు జీవింతురుగాక.
మాకు జయం కలిగించు ఇంద్రాది దేవతలకి శుభం.
ఈ జీవనచక్రమార్గం నుంచి ఆత్మదర్శనం కావించే భగవంతునికి శుభం.
సకల సమాయాలలో సకల దిక్కులలో శుభం కలుగుగాక.
చూశారా వేల సంవత్సరాలుగా ఈ వేదభూమిలో ప్రతి ఓక్కరి మనుగడ ప్రతి జీవ జాలం మనుగడే మన కాంక్ష ఆకాంక్ష...ఈ పద్ధతే మన జీవన విధానం.
కాని వర్తమానం లో ఈ భూగోళం పై జరుగుతున్న విధానం ఏమిటి... మేము మాత్రమే బాగుండాలి అన్న అహంకార పూరిత విధానం ప్రదర్శించిన ప్రతి సమయంలో కాలపురుషుడు ప్రకృతి రూపంలో ఈ వైపరిత్యం ను సమం చేసే వెళుతున్నారు...కాలపురుషుడు తన పాఠాలు నిర్దయగా చెప్పుకుంటూ వెళుతున్నా మూర్ఖ పద్ధతిలో వున్న అనేక దేశాలకి వర్తమాన వైరస్ ఓక దండనే...ఈ వైరస్ ప్రారంభ దేశం నుంచి గమనించండి...వాళ్ళు నిజం చెప్పటానికి సిద్ధంగా లేరు కాని..ఆ దేశంలో అనేక వేల మరణాలు...మరి అగ్ర రాజ్యంలో మరణాలు లెక్క కొనసాగుతుంది...మతవాదంతో , కుట్రలు కుహకాలతో నిండిన ఇటలి పీనుగల పోగు...మరి కొన్ని దేశాలది అదే పరిస్థితి... అంత ఎందుకు మన ప్రక్కనే వుండే పాకిస్థాన్ పరిస్థితి ఏమిటి వున్నవాడు ఎవరో చచ్చేవారు ఎవరో తెలియని దిక్కుమోక్కులేని స్థితి....
ఇలా గమనించండి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే భారతదేశం బాగానే వున్నది. మేమే బాగుండాలి అన్న ప్రతి ఓక్క దేశంనకు ఈ కరోనా వైరస్ శిక్ష గా తన భాధ్యత నేరవేర్చాడు కాలపురుషుడు.
"లోకః సమస్తా సుఖినో భవంతు"
" మన సంకల్పం ఓకటై వుండుగాక
మన భావం ఓకటై వుండుగాక
మన చింతన ఓకటై వుండుగాక
మన మధ్య అద్భుతమైన సామరస్యం నెలకొనుగాక"
(అధర్వ - 6 - 64 - 4)
ఓం శాంతి శాంతి శాంతిః.
శ్రీరామ జయం.
ఆలపాటి రమేష్ బాబు
విజయవాడ
94401 72262..
రుద్ర నమక చమక పారాయణ విశేషాలు
మార్కండేయుని చరిత్ర - మరి కొన్ని విశేషాలు
భావయామి గోపాలబాలం..నా భావనలు
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం..వివరణ
"జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఎనుగులు తిన్న వెలగపండు జీర్ణం గుర్రాలు తిన్న గుగ్గిళ్ళు జీర్ణం కృష్ణుని తిన్న వెన్న ముద్ద జీర్ణం ఈ పాపాయి తినే పాల బువ్వ జీర్ణం..."
బహుశా ఈ శ్లోకం తెలియని తెలుగువారు వుండరు. మన ఇండ్లలో పసివారికి పాలబువ్వ తినిపించిన తరువాత తల్లులు పాపాయికి తినిపించిన పాలబువ్వ గిన్నేను దిష్టి తీస్తూ
పై పద్యం చదువుతారు.
హైందవ సాంప్రదాయం లో జాతకర్మలైన షోడశకర్మలలో ఏడవది అన్నప్రాసన.
శిశువు జన్మ లగాయితు మాతృ స్తన్యం తో అతని జీవన అవసరాలు తీరుతాయి. ఆరు నెలల తరువాత శిశువు ఎదుగుదలకు శారీరక పటుత్వానికి స్తన్యం చాలదు. అదియును గాక మహిళ శారీరక నిర్మాణం వలనకాని , నిత్యకృత్యాలైన గృహకృత్యాల వలన కాని , సంసార జీవనం ప్రారంభం వలన కాని ఆమేయందు స్తన్యం లభించటం తగ్గుతుంది. అందువలన శిశువు కు ఘన ఆహరం పెట్టాలి. ఈ విషయం సుశ్రుతుడు కూడా తన గ్రంధాలలో తెలిపియున్నాడు. దీనినే మన వారు వేదోక్తంగా మంత్రబద్ధంగా షోడశ కర్మలలో ఓకటిగా ఆచరిస్తున్నారు. తదాదిగా శిశువుకు తెలికగా జీర్ణం అయ్యే పాల బువ్వ తినిపిస్తారు.
అన్నం ప్రాణ ఆధారం, జీవ ఆధారం. దీనిని ఆశ్రయించి అనేక పాప పుణ్యాలు వుంటాయి.
శిశువు భూవాతావరణం వచ్చిన తదాదిగా ఈ భూప్రపంచంలో వున్న కర్మలు ప్రారంభం అయితే అది స్టేజి ఓకటి అయితే అన్న ప్రాసన నుండి మరో స్టేజి .
ఇది అలావుంటే ఇక మన శ్లోక వివరణకు వస్తే...
అహరం ఆశ్రయించి అనేక సూక్ష్మ జీవులు , ఆహరం పులిసి పాడయిపోయి విషతుల్యం అయి ఓక్కోసారి ప్రాణం మీదకు వస్తాయి. దీనిని సూచిస్తూ రామాయణం లో ఓకధ వున్నది.
వాతాపి , ఇల్వలుడు అనే సోదరులు రాక్షసులు. వీరు అనేక కపట మాయోపాయాలతో ప్రజలను చంపి తింటారు. వీరిలో వాతాపి మేక రూపం ధరిస్తాడు. ఇక ఇల్వలుడు దారిన పోతున్న సాధుజనులను , బుషుల వద్దకు వెళ్ళి అయ్యా ఈ రోజు మాతండ్రిగారి ఆబ్దీకం మీరు భోక్తగా రావాలి అని ఆహ్వానిస్తాడు. సరే అని వెళ్ళిన అతిధికి మేక రూపంలో వున్న వాతాపిని వధించి భోజనంగా వడ్డిస్తాడు. అతిధి భోజనం ముగియగానే ఇల్వలుడు వాతాపి రా..అని పిలుస్తాడు..దానితో అతిధి కుక్షి చీల్చుకుంటూ వాతాపి వస్తాడు . దీనితో మరణించిన అతిధిని సోదరులు ఇరువురు శుభ్రంగా తినేస్తారు.
వీరి ఈ క్రూర కార్యం వలన ప్రజలు భయవిహ్వలు అయి అగస్త్యమహర్షిని శరణు కోరతారు. సరే అని అభయమిచ్చిన అగస్త్యులవారు వారి అతిధిగా వెళ్లి భోజన కార్యక్రమం అవగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే మంత్రం పలుకు తారు. దీనితో అగస్త్యులవారి మంత్రశక్తికి వాతాపి జీర్ణం అయిపోతాడు. ఇది తెలియని ఇల్వలుడు వాతాపి రా అని పిలుస్తాడు కాని ఇంకేక్కడ వాతాపి వాడు ఎప్పుడో అగస్త్యులవారి కుక్షిలో జీర్ణం. ఇది కధ కాని పరిశీలిస్తే...సోదరులు ఇద్దరు వైరస్ లు గా ఆహరాన్ని పాడుచేసేవారుగా భావన చేయాలి. ఇక వాతాపి మేక రూపం చూడండి..మేక ఓక్కటే కనపడిన ప్రతి ఆకును మేస్తాయి...ఇది అది అని లేదు ప్రతి ఆకును ఆబగా మేస్తూనే వుంటాయి. అందువలన వాటి జీర్ణవ్యవస్థ సరిగా వుండక మేక విసర్జన పెంటికలుగా గోలిలుగా వుంటుంది.
ఇటువంటి లక్షణాలు శిశువుకూడా వుంటాయి...శిశువు దోగాడుతున్నప్పుడు, పాకుతున్నప్పుడు ఏది కనపడితే అది ..అతనిని ఆకర్షించిన ప్రతి ఆహర , వస్తు సంచయాలను నోట్లో పెట్టుకుంటాడు దాని వలన అతనికి విరోచనాది లక్షణాలు కలుగుతాయి...అందుకే వాతాపి లాంటి రాక్షసుడే జీర్ణం అవ్వగా తల్లి తన మాతృహృదయ మమకారంతో తన బిడ్డకు అంతటి జీర్ణశక్తి కలగాలని కోరుకుంటుంది.
ఇక రెండోవ వాక్యం ఏనుగులు తిన్న వెలగుపండు జీర్ణం. సహజంగా ఏనుగు భారి పరిమాణంలో వున్నను దానికి దంతాలు బాహ్యంగా వుండి చమన పద్దతి అనగా నమిలే అవకాశం లేక అన్నీటిని అలా మ్రింగుతాయి . వెలగపండు లోపల గుజ్జు వుంటుంది. దాని చుట్టూ వున్న దాని ఉపరితల భాగం బాగా కఠినంగా వుంటుంది. కాని ఏనుగు పొట్టలోనికి వెళ్ళిన వెలగపండు అక్కడి ఉష్ణోగ్రత కి లోపలి గుజ్జు జీర్ణం అయి విసర్జకంగా పండు పండుగానే వస్తుంది. ఇది మనకి గమత్తుగా వింతగా వున్నను ఇది వాస్తవం. చూడండి ఏనుగు లక్షణం ఆహరభాగం మాత్రమే స్వీకరించి పిప్పి భాగాన్ని విసర్జిస్తుంది.
కనుక తల్లికి తన బిడ్డకు అంతటి జీర్ణశక్తి కావాలనే అర్ధం. ఇక ఇంకో అంతరంగీక అర్ధం వున్నది. గజముఖుడు వినాయకుడు అన్న సంగతి తెలిసినదే. మరి వినాయకుని విఘ్నాధిపతిగాను , విద్యలకెల్ల ఒజ్జ అయిన గణాధిప అనే భావంలో కొలుస్తాం. మరి ఇంతటి మహనీయిడి లక్షణం మాతాపితురుల ప్రదక్షిణం భూప్రదక్షిణం అని నమ్మీ విజయం పొంది విఘ్నాధిపత్యం స్వీకరిస్తాడు. కనుక తల్లికి తన బిడ్డ మంచి విషయాలు మంచి జ్ఞానం తల్లితండ్రులపట్ల ప్రేమ , బిడ్డశరిరంలో జీర్ణం అవ్వాలని కోరికతో ఏనుగులు తిన్న వెలగపండు జీర్ణం అంటారు.
ఇక మూడవ వాక్యం గుర్రాలు తిన్న గుగ్గిళ్ళు జీర్ణం. గుర్రం అత్యంత వేగంగా పరుగు తీయగల జీవి. అలాగే గుర్రం ఎన్నడూ నేలపై పడుకోదు ...నించునే నిద్రపోతాయి...వాటి శక్తి అనంతం . అందుకే మన మోటారులను కూడా అశ్వశక్తితో పోల్చుతాం. ఇంతటి చలన శక్తికి వాటి కాళ్ళకున్న గిట్టలే కారణం. వీటి వలన కొండలు లాంటి కఠిన ప్రదేశాలలో కూడా పయనం. మరి వీటి ఆహరం గుగ్గిళ్ళు. మరి తల్లి అందుకే తన బిడ్డకు అశ్వం లాంటి శక్తి కోరుతున్నది. ఇది జీవలక్షణం. ఇక దైవరహస్యం పరిశీలించుదాం. హయగ్రీవుడు వైష్ణవసాంప్రదాయంలో సకల విద్యాధిపతి. వీరి తల గుర్రం గా వుంటుంది. తలమాత్రమే గుర్రంగా వుండటం అంటే మన మేధ అంత వేగంగా వుండాలి అని. జ్ఞాన స్వీకరణలో అంత వేగంగాను అంత స్థిరంగా వుండాలని. మన మెదడు అనేక ఆలోచనలు స్వీకరించి శోషణ చేసి తృటిలో మంచి చెడులను మనకు తెలియచెప్పుతుంది. అంటే ఈనాటి అడ్వాన్స్ ప్రోసేసర్ పని అంతా మన మెదడు నిర్వహిస్తుంది. కాబట్టి తల్లి తనబిడ్డ అంత జ్ఞానసంపన్నుడు , వేగ కార్య నిపుణుడు కావాలని గుర్రాలు తినే గుగ్గిళ్ళు జీర్ణం అని పలుకుతుంది.
ఇక నాలుగో వాక్యం కృష్ణుడు తిన్న వెన్నముద్ద జీర్ణం. వెన్న ,పెరుగు చిలకగా మజ్జిగ మరియు వెన్న వస్తుంది అన్న విషయం సర్వులకి విదితమే. పాలు కాచి తోడు వేయగా పెరుగు ఏర్పడుతుంది. పాలు తోడు వేయటం వలన ఈష్ట్ గా మారి ..పెరుగు ఏర్పడుతుంది. దీనిని సైన్స్ పరిభాషలో ఫెర్మంటేషన్ అంటారు. పెరుగు రుచిగా వున్నను వాత లక్షణం కలది. అందుకే రాత్రి ఆహరంలో పెరుగు నిషిద్ధం. మరి ఈ పెరుగు చిలకగా ఆ ఉష్ణంనకు అందులోవున్న ప్రోటిన్ మరియి శక్తినిచ్చే పదార్థాలు వెన్నగాను . మిగిలిన ద్రవరూపం అంతా మజ్జిగ గాను ఏర్పడుతుంది. మరి కృష్ణుడికి ఇష్టమైన వెన్న వలనే ఆయన క్రీడా వినోదాలు , రాసలీలలు , లీలామానుషత్వ లక్షణాలు , సర్వులను అతను ఆకర్షించే లక్షణాలు , స్థిరమైన పురుషత్వ లక్షణాలు ఏర్పడుతాయని తల్లి నమ్మకం. అందుకే తన బిడ్డ కూడా కృష్ణుడంత మహనీయుడు కావాలని కృష్ణుడు తిన్న వెన్నముద్ద జీర్ణం అని పలికేది. చూశారా మన దేశంలో ప్రతి తల్లి దేవకి , యశోదలే ప్రతి శిశువు చిన్ని క్రిష్ణుడే....
ఇక చివరిదైన పాపాయి తిన్న పాల బువ్వ జీర్ణం.
ఇది మామూలే తన అనురాగతో ప్రేమతో తినిపించే పాల బువ్వ వలన శక్తితో ఆరోగ్యంతో తన బిడ్డ కలకాలం మనుగడ సాగించాలనే ఆకాంక్ష.
చూశారా మీకు ఓ చిన్న శ్లోకం లాగా పద్యపాదం లా కనపడే ఈ నాలుగు వాక్యాలలో మన పూర్వీకులు ఇంత అంతరార్ధం లో మనకు సాంప్రదాయాలుగా ఆచారాలుగా ఏర్చి కూర్చినారు.
ప్రతి శిశువు కి తల్లి చక్కని ఆరోగ్యవంతమైన ఆహరం అందచేయాలని , వారికి లభించాలని శ్రీరాముని ప్రార్ధిస్తున్నాను.
సకలం సర్వం శ్రీరామ జయం.
చదివి నచ్చినవారు ఓ చిన్న నవ్వు...సందేహం వున్నవారు తెలపండి నివృత్తికై...
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
94401 72262.
సామజ వర గమనా - శంకరాభరణం.. ఓ పరిశీలన
సామజవరగమన - శంకరాభరణం ఓక పరిశీలన.
మానవమేధో వికాసంలో లలిత కళలు ఓక విభిన్నపరిణామం. లలితకళలలో సంగీతం మరి విశిష్టమైనది. సప్తస్వరాలు స , రి , గ , మ , ప ,ద ,ని. ఈ ఏడు స్వరాల కలయికే అనంతకోటి రాగాలు . ఈ సంగీత శాస్త్రం బహు విస్తారమైనది. ఇందు లయ , శృతి ప్రధాన్యత వహిస్తాయి. ఈ సంగీత సాధనలో మనస్సు కేంద్రీకరించి శృతి ,లయలతో పాటు రాగయుక్త స్వరసహితంగా పాడగలిగినదే సాంప్రదాయ కర్నాటక సంగీతం. మన భారతదేశ సంగీతాన్ని దక్షిణ భారత సాంప్రదాయం కర్నాటక సంగీతంగా , ఉత్తర భారత సాంప్రదాయం హిందుస్తాని సంగీతంగా ప్రాధమికంగా విభజించారు. మరలా ప్రాంతాలని అనుసరించి మత పరంగా జరిగే కార్యక్రమాలను అనుసరించి అనేక విభజనలు. మరలా ఇందులో గాత్ర సంగీతం వాయిద్య సంగీతం అనే విభజనలు....
ఇలా మీకు కూలంకషగా వివరించాలని వున్నా ప్రస్తుత అంశంనకు అణుగుణంగా వివరించవలసి వున్నందున విస్తారభీతిచే ఇంతవరకూ చాలు...ఇక అంశం పరిధిలోకి వద్దాం......
మన దక్షిణ భారత సంగీతంలో విశిష్టమైనది త్యాగరాజకీర్తనలు. త్యాగరాజుగారు ప్రస్తుత తమిళనాడు లోని తిరువైయ్యారులో జన్మించిన అచంచల రామభక్తుడు. ఆయన రాముని పరంగా ఏన్నో వేల కీర్తనలను సృజించారు....
అందులో ఓక కీర్తన సామజవరగమన....
సామజవరగమనా” త్యాగరాయ కీర్తన :
హిందోళరాగం , ఆది తాళం...
పల్లవి: సామజవరగమనా! సాధుహృత్సారసాబ్జపాల! కాలాతీతవిఖ్యాత! ॥సామజ॥
అనుపల్లవి: సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల! దయాలవాల! మాంపాలయ! ॥సామజ॥
చరణం: వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా। స్వీకృత యాదవకులమురళీ!
గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥సామజ॥
ప్రతి పదార్ధం :
సామజ(ఏనుగు) వర(వంటి) గమనా(నడక కలిగిన వాడ) – ఏనుగు నడక లాంటి గంభీరమైన నడక కలవాడా
సాధుహృత్సారసాబ్జపాల – సాధువులు, సజ్జనుల హృదయపద్మములను పాలించేవాడా
కాలాతీతవిఖ్యాత – అన్నికాలములలోనూ కీర్తింపబడేవాడా
సామనిగమజ సుధామయగానవిచక్షణ – సామ వేదానికి మొదలు గా ఆ సంగీతముని నిత్యం పరిశీలిస్తూ పర్యవేక్షించేటి వాడ
గుణశీలదయాలవాల – గుణముకు దయకు ఉదాహరణగా నిలిచేటి వాడ
మాంపాలయ – నన్ను పాలించు
వేదశిరోమాతృజ – వేదములలో గొప్పదైన సామవేదమునుండి పుట్టిన
సప్తస్వరనాదాచలదీప – సప్తస్వరముల లయము వలన కలిగిన కదలని దీపమువంటి నాదమువలె ప్రకాశించువాడా
స్వీకృతయాదవకుల – యాదవకులములో జన్మించినవాడా
మురళీగానవినోదనమోహనకర – మురళీగానముచే వినోదించుచూ అందరిని ఆనదింప జేసేవాడా;
త్యాగరాజ వందనీయ – త్యాగరాజుచే నమస్కరింపబడినవాడా
అర్ధం:
ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో, మునులు మనిషులు హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరి, నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చేత పొగడ బడతావు..
సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకి, దయకి ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి..
సామావేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల, ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళి గానం తో మమ్మలందరిని ఆనంద పరుస్తూ.., ఈ త్యాగరాజ వందనములను అందుకో..
ఇది భక్తి పరంగా...శ్రీకృష్ణుని పరంగా...మన సాంప్రదాయ కీర్తన.....
ఇక శంకరాభరణం సినిమా తెలుగు సినిమా ప్రాశస్త్యం మనందరికి తెలిసినదే....అదో గర్వించదగ్గ తెలుగు సినిమా...
ఇందులో ఓ సాంప్రదాయ సంగీతకారుని జీవన వైభవాన్ని...కాల మహిమచే సమాజ నిరాదరణ వలన అతని జీవనంలో ఓడిదొడుకులను దర్శకులు విశ్వనాధ్ గారు ఏంతో చక్కగా దృశ్యకావ్యంలా వివరించారు...
శంకరశాస్త్రికి సంగీతం అంటే ప్రాణ సమానం...
ఓక రాగం ఆలాపన చేయాలంటే స్వరసహితంగా ఎక్కడా పొరపాటు పోనివ్వని నైజం...మనకు ఇదే విషయాన్ని శంకరశాస్త్రి తన కుమార్తె కి కృష్ణానదినీటిలో మంచులో గొంతువరకు చిన్న పాపను వుంచి సంగీత సాధన చేయించే దృశ్యం మనకు ఉపమానంగా చూపుతాడు. ఆ పాప సాధనలో ఓక స్వరం తప్పుగా పలకగానే..శంకరశాస్త్రి...ఊ ....అనే హూంకారంతో స్వరంను షరిదిద్దటం కూడా మీరు గమనించవచ్చు...ఈ దృశ్యం చూసిన వారికి శంకరశాస్త్రి శుద్ధ ఛాంధసుడిలాగా...ఫక్తూ సాంప్రదాయవాది లాగా కన పడతాడు...కాని సాంప్రదాయ సంగీత కారుల సాధన వైశిష్ట్యాన్ని మనకు దర్శకుడు ఈ విధంగా స్పృశించారను కోవచ్చు...
ఓక రాగా ఆలాపాన స్వరసహితంగా ఆరోహణ ,అవరోహణ స్వర ప్రస్తారాలు తప్పు పోకుండా వుండాలి అంటే కఠోర సాధన మరియి మానసిక పరిపక్వత , మానసిక నిగ్రహం తద్వారా శరీరం ప్రతి అణువు సంగీతంకై కేటాయించిన విధంగా తయారవుతుంది.
ఇక సినిమా విషయానికి వస్తే....శంకరశాస్త్రి జీవితం కాలమహిమచే కష్టాలపాలు...కచేరిలు లేవు సంపాదన లేదు...కాని అతని కూతురు యుక్తవయస్కురాలు అవుతుంది. యుక్తవయస్సు వచ్చిన అమ్మాయి సహజంగా తోడు కోరుకోవటం సహజం.....
శంకరశాస్త్రి తో స్నేహాతీతంగా మాటమంతి జరిపే అల్లు గారు...శంకరశాస్త్రి కూతురు రాజ్యలక్ష్మి ని తీసుకుని అన్నవరం వెళ్ళటం...అక్కడ గుడి ప్రాంగణంలో చంద్రమోహన్ , రాజ్యలక్ష్మి ల కలయిక తద్వారా ఓకరంటే ఓకరు మరులు కొలిపి అభిమానం కలిగి ఉభయుల మధ్య ప్రేమ పుడుతుంది....కాని సాంప్రదాయ కుటుంబాలు అవటం వలన ఆ ప్రేమ గుడి ప్రాంగణంలోనే విరామం....కాని అల్లు వారు చంద్రమోహన్ నే పెళ్ళి చూపులకు ఆహ్వానిస్తారు కధా పరంగా...ఇక పెళ్ళి చూపులలో మరలా చంద్రమోహన్ , రాజ్యలక్ష్మి ల పునః పరిచయం...కాకపోతే ఇద్దరూ వధు , వరుల గా ఓకరికొకరు పరిచయం.... దానితో ఇద్దరి మనస్సులో అన్నవరం తాలుకు తీపి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని...ఓకరంటే ఓకరు ఆసక్తి అనురక్తి తో ఉత్సాహంగా వున్నారు....ఆ సమయంలో... సాంప్రదాయ అనుసారం వధువు కి గల అర్హతలు పరిశీలనలో ఓక పాట పాడమంటే...రాజ్యలక్ష్మి...
సామజవరగమన పాట పాడుతుంది...
**********
సామజవరగమనా
సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీతవిఖ్యాత సామజవరగమన
సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీతవిఖ్యాత సామజవరగమన
ఆ ఆ ఆ...
సామనిగమజసుధా ఆ ఆ ఆ...
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ
సామజవరగమనా
ఆమని కోయిలా ఇలా నా జీవనవేణువు లూదగా
ఆమని కోయిలా ఇలా నా జీవనవేణువు లూదగా
మధురలాలసల మధుప లాలనల
మధురలాలసల మధుప లాలనల
పెదవిలోసి మధువులాను వ్రతము పూని జతకు చేరగా
నిసా దనీ మదా గమా
సమమగ గదదమ
మనిసద నసదమ గససని నిగగస
సనినిద దనినిస మదదని గమదని గమదని
సనిద మగసా
సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీతవిఖ్యాత సామజవరగమన
వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా
వేసవి రేయిలా ఇలా…
ఈ విధంగా జరుగుతున్న సన్నీవేశంలో శంకరశాస్త్రి " శారద" అనే పెద్ద కేకతో సన్నివేశం మొత్తం రసాభస అవుతుంది... శంకరశాస్త్రి తన కుమార్తె ను నీవు పాడుతున్న రాగం ఏమిటి... దాని ఆరోహణ అవరోహణ ఏమిటి అనే విషయంతో ప్రేక్షకుడు అది రాగం తప్పుగా భావిస్తాడు...కాని కఠోర సాధనతో మనస్సు నిగ్రహపరచి సంగీతం పాడుతుంటే...యుక్తవయస్కురాలు అయిన
రాజ్యలక్ష్మి , చంద్రమోహన్ పై ఆసక్తితో పాటలో తన భావిజీవితాన్ని ఊహించుకోవటం... తద్వారా ఇల్లాలుగా తన మధురోహలతో తనపై తాను అదుపు కోల్పోవుతుంది...దానితో రాగ ఆలాపనలో స్వరం తప్పుగా పాడుతుంది....
ఇదంతా పరిశీలిస్తున్న శంకరశాస్త్రి తన కుమార్తె మానసిక పరిస్థితి తదుపరి దేహపరిస్థితి అవగాహన వచ్చిన వాడు...కాని పెళ్ళి చేయలేని ఆర్ధిక స్థితి...కాని కుమార్తె వయస్సు వచ్చినందున ఎదుట వున్న వరునితో తన భావిజీవతం అనే భావనతో కుటుంబ సాంప్రదాయ కట్టు దాటిపోతున్న విషయం పరిగణలోకి తీసుకున్న దర్శకుడు... దాన్ని నర్మగర్భంగా రాగం పై మరలచి....నీవు నీ స్వాధీనం లో వున్నావా అని కుమార్తె ను అన్యాపదేశంగా ప్రశ్నించారు......
ఇలా ఈ చిత్రం లో మన దృశ్యమాన విషయం వేరు...అంతఃకోణంలో వివరం వేరు....
ఇది ఓక పరిశీలన మాత్రమే....
ఇక శంకరాభరణం సినిమాలోని సామజవరగమన పాట...పల్లవి , మకుటం త్యాగరాజకీర్తన లోనివి తదుపరి భావవ్యక్తీకరణ పార్ట్ వేటూరి సుందరరామ్ముర్తీ రాసినది.....
ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన సామజవరగమన గురించి వివరించాలని వున్నా వివరించలేని పరిస్థితి.... అది సీతారామశాస్త్రి మాత్రమే చెప్ప తగ్గరు....
ఇది నా పరిశీలన మాత్రమే....
సర్వులకు శ్రీరామ జయం.
మీ అభిప్రాయాలను తెలపవలసినది
ఆలపాటి రమేష్ బాబు...
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
9440172262.
మీ ఖండనలు , విమర్శలు కై ఎదురుచూపులు...
సత్యనారాయణ వ్రతం విశిష్టత అంతరార్ధం
సత్యనారాయణ వ్రతం విశిష్టత.
కార్తీక మాసంలో ను , మరి
విశిష్ట సమయంలో సర్వ బాహుళ్యం వారి నివాసంలోను , అన్నవరం లోను , వనభోజనం సమయంలో వ్రతం చేస్తారు కాని వీరిలో ఒక్క శాతం వారికి కూడా దీని విశిష్టత పై అవగాహన లేదు. మరి నేను నా కోణంలో తెలియచెప్పే ప్రయత్నం మాత్రమే అని గ్రహించ ప్రార్ధన.
మనకున్న అనేకానేక పూజా విధానములలో సత్యనారాయణ వ్రతం ఎంతో విశిష్టత కలది.
సహజంగా అందరు వివాహంతో గృహస్థులు కాగానే చేయి మొదటి దైవ కార్యం. చాలా మంది ఆసక్తిగా చేసినా తదనంతరం పరిణామం లో కొంత ఆసక్తి తగ్గుతుంది దానితో యాంత్రికత కలుగుతుంది. కాని వ్రతం శ్రద్ధగా చేయివారికి కొంగుబంగారంగా స్వామి వారిని కరుణిస్తారు అనటంలో సందేహం వలదు.
ఈ వ్రతం స్మార్త విధానంలో గణపతిపూజతోను వైష్ణవవిధానంలో విష్వక్సేన పూజతో ప్రారంభం.
అ తరువాత వ్రత కధ ప్రారంభం.
ఈ వ్రత కధ ఐదు అధ్యాయాలు కలదిగా బహుళ ప్రచారంలో వున్నను ఇది 9 అధ్యాయాల వ్రత కధ. ఇందు మొదటి ఐదు కధలు పూజ సమయంలోను. తదుపరి నాలుగు కధలు వ్రతం ముగిసిన తరువాత రాత్రి సమయంలో భగవత్సేవ కైంకర్యం సమయంలో వినాలి అని నిర్దేశించారు. మరి ఏ సమయంలో ఏ పెద్దలు ఈ క్రతువును ఐదు కధలు కలదిగా మార్చే సంకల్పం చేసి కల్పోక్తపూజవిధానంగా మార్పు చేసి సుజనరంజకము సుభోదకముగా చేశారనుటలో సందేహంలేదు.
ఈ విధానం మొత్తం రెండు భాగాలుగా విభజన. ప్రధమ భాగం దేవత ఆహ్వానం , వ్రత కధ రెండోవ భాగం.
ఈనాడు గృహస్థులు యాంత్రిక తో చేయిచున్నారు కాని వారికి అవగాహన వున్న శ్రద్ధగా చేయగలరు అనుటలో సందేహం లేదు. దేవతా ఆహ్వానం ను మండపారాధన అంటారు. సాధారణంగా మనం గృహమునకు అతిధి వస్తే ఆసనం,నీరు లాంటి మర్యాదపూర్వక చర్యలు చేస్తాం కాని నేడు మనం దేవాది దేవుడు అగు సత్యనారాయణ స్వామిని, మన వ్రత ప్రదేశం నకు స్వామిని అర్చారూపకంగా ఆహ్వానం పలికి కలశరూపంలో స్థాపన చేయిటయే మండపారాధన.
ఈ మండపారాధన కు, ఓ క్రమ పద్ధతి వున్నది.
వ్రతం ప్రదేశం నందు చక్కగా రంగవల్లులు తో తీర్చి ఆపై అరటిఆకు గాని , వెడల్పయిన పీటగాని వేసి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై ప్రాణం జీవనాధారం అగు ధాన్యం (బియ్యం) ను పరిచి
ఆపై గణేశాది పంచపాలకులు (గణపతి , బ్రహ్మ, విష్ణు, రుద్రుడు,గౌరి) తదనంతరం నవగ్రహాలు వాటి తాలూకు అధి దేవతా ప్రత్యధిదేవతా సహితంగా వీరిని క్రమంలో సమంత్రకంగా ఆహ్వానం చెపుతూ వారి వారి గ్రహ యొక్క శక్తి మన దేహంపై మన నిత్య జీవితంలో ఏవిభాగం పై వుంటుందో తెలుపుతూ ఆహ్వానిస్తారు.
(సూర్యుడు - ఆత్మ - అగ్ని - రుద్రుడు
చంద్రుడు - మనస్సు - ఆపః - గౌరి
కుజుడు - రోగ, - భూమి - క్షేత్రపాలకం.
బుధుడు - బుద్ధి - విష్ణుం - నారాయణం
గురువు - సంతానం - బ్రహ్మణం - ఇంద్రుడు
శుక్రుడు - కళత్ర - ఇంద్రాణి - ఇంద్రమరుత్తులు
శని - కర్మ - యమం - ప్రజాపతి
రాహువు - చక్షువు - గామం - సర్వాంగ
కేతువు - మోక్ష - చిత్రగుప్తుడు -బ్రహ్మణం)
తదనంతరం అష్టదిక్పాలకులు, వాస్తు పురుషుడు, క్షేత్ర పాలకుడు,భూమి,ఆకాశం ఇలా సమస్త దేవతలను వారు ,వారి కుటుంబ ,పరివారం,వాహనం,ఆయుధసమేతంగా విచ్చేయమని సమంత్రకంగా ఆృహ్వానిస్తూ వారి వారి స్థానాలకు వారిని ఉపస్థితులను కావింప చేయాలి.
మరి వీరితో పాటు గృహస్థులు యెక్క జన్మనక్షత్రం అధిదేవత ప్రత్యధిదేవత సహితంగా ఆహ్వానం. దీని వలన గృహస్థులు కు గోచార రీత్యా క్షేమం.
మరి వీరందరి ఆహ్వానంనకు ప్రతి ఒక్కరిని
ఓ తమలపాకు పై వక్క, పసుపు కొమ్ము, ఖర్జూరం, అక్షింతలు, రూపాయికాసు సహితంగా ఆహ్వానం చేస్తాం. ఇందు వక్క దేవతాంశ గాను , పసుపు కొమ్ము దేవతాంశ స్త్రీ రూపం గాను ఖర్జూరం నివేదనగాను , అక్షింతలు వారికి అర్చన గాను , రూపాయి కాసు హిరణ్యరూపకంగాను (పాపం మన వాళ్ళు ఈ రూపాయి కాసు అయ్యవారికి వెళుతుందని లోభిస్తారు ) ఇది లోపం లేకుండా వుండాలి.
కారణం విశ్వాంతరాళలలోనుండి వచ్చే దేవతలకు వారి పరివారాలకు ఆహ్వానం పలుకుటలో మనకు తెలియని లోపాలను నివృత్తి కై మరియి వారి నిమిత్తం దాన, దక్షిణకై...
ఇలా ఇవి అన్ని కలిపి సుమారు 50 పైగా అవుతాయి. ఇలా వీరందరి మధ్య స్వామి ని కలశరూపకంగా సకల నది జలాలు సకల దిజ్మండలాల మధ్య సకల పరివారం సహితంగా శ్రీ సత్యనారాయణ స్వామి ని ప్రతిష్ట చేస్తాం.
తదనంతరం స్వామి పురుష సూక్త పూజ , ఆ తదుపరి స్వామివారి రూపును పంచామృత అభిషేకం మన్యుసూక్తసహితంగా చేసి తదనంతరం స్వామి వారి అష్టోత్తర, సహస్రనామాలు తో స్తుతించడం తదనంతరం లక్ష్మీ దేవిని అష్టోత్తర పూజలతో వ్రతం నందు మొదటి భాగం పూర్తి.
తదుపరి వ్రతం యొక్క ఉత్తర భాగం కధ భాగంలో అడుగు పెడతాం.
మనం ఇప్పటి వరకూ వ్రత విధానం తెలుసుకున్నాం. మరి స్వామి వారు ఎవరు మన వ్రతం యెుక్క లక్ష్యం,ప్రసాదం మహిమ ఏమిటి చేస్తే వచ్చే ఫలితం ,చేయగలమని అనుకోని చేయకపోవటులో ఇబ్బంది తెలుసుకోవటమే కధ రూపకంగా.
* ప్రధమ అధ్యాయం*
వ్రతం ప్రధమ కధ నందు.
నైమిశారణ్యం నందు సూతమహాముని శౌనకాది మహర్షులు కు మానవులు కష్టనష్టాలు తీర్చుటకు తరుణోపాయం అన్న వ్యాఖ్యలు తో కధ ప్రారంభం .
ఈ సకల చరాచర విశ్వం నందు జీవంతో కలిగిన గోళం ఒక్క భూగోళం మాత్రం...ఇందు గల అనేకానేక జీవావరుణంలో మానవుడు మాత్రమే అన్య ప్రాణులకు భిన్న ప్రకృతి కలవాడై వున్నాడు. బుద్ధి మనస్సు వాక్కు కలిగిన వాడుగా వున్నాడు. మిగిలిన ప్రాణులు ఇవి లభించక తమ మనుగడకు ప్రకృతిపై ఆధారపడి ప్రకృతిలో ఒకటిగా మనుగడ సాగిస్తున్నాయి కాని మానవుడు తన భిన్న ప్రకృతి చే తనకు గల విశిష్టత ను వినియోగం పరిచి ప్రకృతి ని తన ఆధిపత్యాన్ని కి తెచ్చుకుని పంచ భూతాలయిన వాటిని తనకు అనుకూలమైన వినియోగం మైన విధముగా చేశారు.అయనను అతని ఆశ తీరిక ఇంకను ఇంకనూ అన్న స్వభావం వలన అతని జీవన పరిణామం క్రమం తప్పి అనేక కష్టనష్టాలను చవి చూస్తున్నాడు . దీని వలన మానసిక సంతులనం కోల్పోయి దిగులుగా ఇబ్బంది గా వున్నాడు...
ఈ సమయంలో నారదమహర్షి భూలోకం సంచారం చేయిచూ పై విషయాలను వైకుంఠ వాసుడైన విష్ణువుతో ప్రస్తావన...
ఆసమయంలో స్వామి వారి వర్ణన ....
స్వామి వారు తన అంశం రూపం అయిన సత్యనారాయణ వ్రతం చేసిన మానవుల కష్టాలు దూరం అవుతాయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని అంటారు.
ఇక్కడే మన పూర్వీకులు మహర్షులు చమత్కారం మనకు తెలియజేస్తుంది...
సాధారణ మానవుడు భోగలాలసతో జ్ఞాన శూన్యతతో భగవంతునికై కృషి సల్పుటలో అలసత్వం తో వుంటారు. మరి వారి మోక్ష ప్రాప్తి కి కొన్ని రకాల వ్రతం ,నోములు, పారాయణలు ప్రవేశం ...వీటి అన్నింటిలోను ఉత్తమమం నామధ్యానం....
అసలు నారాయణుడు అంటే ఎవరు?
మనం నారాయణుడు విష్ణ్వంశగా భావిస్తాం.
ఈయన పని లోక పాలన...
నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమమ్ అన్ని భాగవత వాక్యం అనుసరించి
ఆయన మహ పురుషుడు...మరి ఆయన నామం రూప ధ్యానమే సత్యనారాయణ వ్రతం అన్నది రహస్యం.
సత్ + య + నారాయణ అన్న పద సముచ్ఛయం సత్యనారాయణ గా వాడుక.
ఇందు సత్ అన్ని పదానికి అర్ధం ఎల్లప్పుడు , సతతం , అన్నివేళలా అని......
యం అన్నది మన దేహం నందు గల కుండలిని చక్రంలోని అనాహత చక్ర బీజాక్షరం.
ఈ అనాహత చక్రం దేహం నందు
హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం యం.
అనగా నారాయణ అన్న నామమును హృదయమందు ప్రతిష్టించుకోవాలి.
ఇంకను వ్రతం విధానం తెలుపుట మొదటి అధ్యాయం నందు కలదు. ఏ ఏ కాలాలు చేయాలి, ఏ విధంగా చేయాలి కావలసిన వస్తువులు అన్ని తెలుపుతుంది .
*రెండవ అధ్యాయం*
ఈ అధ్యాయం నందు
కాశీ పట్టణం నందు శతానందుడు అను బ్రాహ్మణుడు వేదం చదువుకున్న వాడయినను ఉపాధి లేక అనేక కష్టనష్టాలను చవి చూసి భగవత్ కృప వలన ఈ వ్రతం చేయిట మరియి ఈయన ను చూసిన కాలకష్ఠుడు అనే కట్టేలు కొట్టే వాడు అతని శక్త్యానుసారం చేసి తరించుట.
చూడండి శతానందుడు అన్ని రకాల ఆనందాలు అన్నది నామధేయం లో , విద్య కలవాడు కాని ఉపాధి లేకపోవటమే పెద్ద కష్టం...
కాలకష్ఠుడు అనేది దురదృష్టవంతుడు అనే పదానికి పర్యాయ పదం.
ఇటువంటి పరిస్థితుల్లో వున్నవారు స్వామి వారి వ్రతం చేసిన వారి కష్టం నివారణ జరుగుతుంది అని తెలుపుట రెండవ అధ్యాయం అంతరార్ధం.
*మూడవ అధ్యాయము*
ఈ అధ్యాయం నందు ఉల్కాముఖుడు అను రాజుగారి రాజ్యం నందు ఒక వైశ్యుడు ఈ వ్రతం కధ తెలుసుకుని సంతానలేమి చే బాధ పడుతున్న అతను భగవంతుని కృపచే సంతానం లభించటం అయినను వ్రతం చేయక వాయిదాలు వేయటం అలా తన కుమార్తె వివాహం సమయంలో కూడా వాయిదా వేసి తన సంపాదన నిమిత్తం చంద్రకేతు మహరాజు
పరిపాలనలోని రత్నసానుపురం వెళ్ళుట...ఇలా దైవ ధిక్కారం నకు పాల్పడుటతో అతని కుటుంబం ,అతను అనేక కష్టాలు గురి అవటం...దీనికి తరుణోపాయం గా వ్రతం చేసిన
కష్టాలు తీరును అన్న బుద్ధి కలిగించును...
ఈ క్రమంలో వ్రతం నిర్వాహణా లోపం శ్రద్ధాలోపం భక్తి లోపం వలన కలుగు ఇబ్బందులు తెలుపుట ఈ అధ్యాయం యెక్క ఉద్దేశ్యం.
*నాలుగవ అధ్యాయము*
ఈ అధ్యాయం నందు పై అధ్యాయం పాత్రలే వారి తప్పులు మన్నించి స్వామి వారు తరుణోపాయం చూపుట.
భగవంతుడు భక్త సులభుడు మీకు దొరుకు సహాయం ఆకాశవాణి గా అన్యాపదేశంగా అజ్ఞాతం గా జరుగగలదని తెలుపట ఈ అధ్యాయం యెక్క లక్ష్యం.
*ఐదవ అధ్యాయము*
ఈ అధ్యాయం నందు తుంగధ్వజ మహరాజు అడవికి వేటకు వెళ్ళి ఆ సమయంలో అడవిలోని గొల్లవారు స్వామి వారి ప్రసాదం ఇవ్వగా వారు అనాచారులు అని ఆక్షేపణ చేస్తూ ప్రసాద్ స్వీకరణ చేయక నిర్లక్ష్యం వహించిన దైవ ఆగ్రహంనకు గురి అయి రాజ్యం ,సంతానం పోవటం అన్న కష్టం నాకు గురి అయి దైవజ్ఞల వలన ప్రసాద్ స్వీకరణ నిర్లక్ష్యం అని తెలుసుకుని తప్పు సరిదిద్దుకునటచే స్వామి వారిని కరుణించుట.
ఈ అధ్యాయం లో ధర్మ సూక్ష్మం తుంగధ్వజుడు అన్న పేరుతో తెలిపారు. తుంగ ఎంతటీ నిస్సారవంతమైన భూమిలోను కూడా పెరుగుతుంది అంతేకాక తను పెరిగిన భూమి నిరుపయోగం అవుతుంది.
అలాగే ధ్వజం అనగా జెండా.
మనిషిలో అహంకారంతో, అధికార , ధనమదంతో
దైవదూషణ ధిక్కారం చేస్తే తగిన ఫలితం అనుభవిస్తారని తెలుపుట, భగవంతుని సన్నిధిలో రాజు పేద అన్నది లేదు కావలసినది శ్రద్ధ, భక్తి మాత్రమే.. అలాగే స్వామి వారి వ్రత ప్రసాదం నందు నిర్లక్ష్యం కూడదు అని తెలుపుట.
శ్రీరామ జయం.
****************************************
మిత్రులు నమస్కారం.
ఇందు తప్పు ఒప్పు లు మన్నించి మీ సమాధానం పంపగలరు.
Send your feedback to
Alapati Ramesh Babu
9440172262.
9, మార్చి 2014, ఆదివారం
:: ఆనోభద్రా క్రతవో యంతు విశ్వతః ::. శ్రీ రాజమౌళి గారి వ్యాసాలు - 3
రెండు కప్పలు ఒక లోతైన గుంటలో పడిపోయాయి. తన ఖర్మే దీనికి కారణం అనుకుని ఒక కప్ప అలానే ఉండిపోయింది. మరో కప్ప మాత్రం బయటికి రావడానికి అనేక విధాలుగా ప్రయత్నించి గట్టు చేరింది. అప్పటివరకు.. ‘మీరు బయటికి రావడం అసాధ్యం’ అని కేకలు వేసిన తోటి కప్పలు ఈ దృశ్యాన్ని చూసి... ‘మేము అంతలా అసాధ్యం అని అరుస్తుంటే నీకు విన్పించలేదా’? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... మీరు అరుస్తుండటం కన్పించింది కానీ విన్పించలేదు. మీరంతా నన్ను బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నారని భావించాను అని సమాధానమిచ్చింది. దీని సారాంశం ఏంటంటే... చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను నిందిస్తూ... స్పష్టమైన లక్ష్యం, గమ్యం లేకుండా సాగే నిరాశావాదులందరికీ, ఆశావాదులందరికీ కూడా బయటకు వచ్చిన కప్ప దృక్పథం అనుసరణీయం, ఆచరణీయం. ఇది ఆచరణ సాధ్యం కావాలంటే ఆత్మపరిశీలనకు అధిక సమయం కేటాయిస్తే... తద్వారా ఇతరుల తప్పులను ఎత్తి చూపడానికి మన దగ్గర సమయం ఉండదు. ఇతరుల నిరాశావాదాన్ని స్వీకరించడానికి మనసు ఇష్టపడదు.
సంభాషణ ఒక కళ. దీన్ని సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి. ఈ తరం పిల్లల్లో సమయస్ఫూర్తి, సంభాషణా చాతుర్యం, చమత్కారం తగ్గుముఖం పడుతున్నాయని ఇంటర్వ్యూలు నిర్వహించే మానవ వనరుల నిపుణుల అభిప్రాయం. సమయస్ఫూర్తి అంటే వితండవాదం, చమత్కారం అంటే అనారోగ్యకర హాస్యం చేయమని కాదు. సమయస్ఫూర్తి, జీవితానుభవం, ఆత్మావలోకనం ద్వారా చక్కటి సంభాషణ నైపుణ్యం అలవడుతుంది.
1926లో రాధాకష్ణ పండితులు అమెరికాలో ఒక ఉపన్యాసం ఇస్తూ... భారతీయ తత్వ విలువల్లో ప్రపంచాన్ని రక్షించే సందేశం ఉంది అని అన్నారు. భారతదేశం స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న రోజులవి. వెంటనే ఒక విద్యార్థి ఇండియా తనను తాను రక్షించుకోలేకపోతోంది. ప్రపంచాన్ని ఏమి రక్షిస్తుంది? అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా... ‘‘ఏసుక్రీస్తు ఇతరులను రక్షించడానికి పుట్టాడు కానీ తనను తాను రక్షించుకోవడానికి కాదు కదా’’ అని ఆయన చమత్కరించారు. ఆ సమయస్ఫూర్తి, చమత్కారం ఆయనను దేశంలోనే అత్యుత్తమ పరిపాలకునిగా తీర్చిదిద్దాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఉరస్థం కంఠగం వాక్యం వర్థతే మధ్య మన్వరం
సాధారణ వ్యక్తులు కాల, భావ ప్రవాహాల్లో కొట్టుకుపోతారు. కొందరు సమస్యలు, కష్టాల కడగండ్లు చుట్టుముడుతున్నా వాటిలో కొట్టుకుపోకుండా.. తాము సుఖపడుతూ, తమ చుట్టూ ఉన్నవారిని అర్థం చేసుకుంటూ తమకు చేతనైనంత ఆనందం పంచుతారు. దీనికి కారణం అభిరుచి కారణంగా వారిలో ఏర్పడిన అంతర్ముఖ అభివృద్ధి. దురదష్టవశాత్తూ నేటి సమాజంలో మనుషుల మధ్య ప్రేమానురాగాల కంటే సాంఘిక హోదాకే ఎక్కువ గౌరవం లభిస్తోంది. ప్రతివాళ్లకు తాము సుఖంగా జీవించే కంటే అందరూ తాము సుఖంగా జీవిస్తున్నట్లు అనుకోవాలని భావిస్తూ క్రమంగా జీవితంలో పై మెరుగులకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల జీవనం, జీవితం డొల్లగా మారిపోయి మానవసంబంధాల్లో మానవత్వం మృగ్యమవుతోంది. ప్రేమ లేకుండా పెట్టిన రొట్టె చేదుగా ఉండటమే కాకుండా ఆకలిని సగమే తీర్చినట్లు హృదయాలతో మానవసంబంధాలను నెరపని ప్రస్తుత స్థితి అంతర్ముఖ అభివృద్ధి లేని కారణంగా తన చుట్టూ వెగటుతనాన్నే వ్యాపింప జేస్తోంది. అందుకే ఆనందమయ జీవన శైలికి అభిరుచి అత్యవసరం. ‘నీ అభిరుచి చెబితే నువ్వేంటో నేను చెబుతా’ అంటారు ఐన్‌స్టీన్.
వివేకానందుని మాటల్లో... మనిషికి గల పాపాలు రెండు. అసహనం, అత్యాశ. అత్యాశవల్ల స్వర్గానికి దూరమయ్యాడు. అసహనం వల్ల స్వర్గాన్ని చేరుకోలేక పోయాడు. దీనికి కారణం మానవుడు సంపద సృష్టి, వినియోగంలో పొదుపు అనే మూల సూత్రాన్ని విస్మరించడమే. ప్రాథమిక అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు అనే నిచ్చెనలో ఏ మెట్టు మీద నిలబడాలో తెలియని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాడు.
ఉరుకులు, పరుగులతో కూడిన యాంత్రిక జీవనాన్ని సాగిస్తూ.. విశ్రాంతి కోసం టీవీ లాంటి ఉపకరణాన్ని ఆశ్రయిస్తే... మంచి నాన్న అనిపించుకోవాలంటే ఫలానా కారులో తిరగాలని... మంచి భర్త కావాలంటే... ఫలానా కంపెనీ డైమండ్ రింగ్ బహుమతిగా ఇవ్వాలని... కంప్లీట్ మ్యాన్ అనిపించుకోవాలంటే ఫలానా కోటు వేసుకోవాలంటూ చేసే ప్రకటనల దండయాత్రలకీ, పొందాలనుకునే విశ్రాంతికి బదులు అశాంతి, అసహనానికి లోనవుతున్నాం. ఆ అశాంతిలో ఆనందం ఏంటో మరిచిపోయి ఆ ప్రకటనల యద్ధంలో గుచ్చుకున్న బ్రాండ్ల గాయాలన్నీ మాన్పుకోవడానికి షాపింగ్‌మాళ్లకు పరుగెడతాం. ఈ బ్రాండ్ల గందరగోళంలో మన బ్రాండ్ ఏంటో మనమే తెలుసుకోలేని కత్రిమ అజ్ఞానానికి గురవుతున్నాం. ఇంట్లో వస్తువుల బ్రాండ్లన్నీ మార్చినా... మళ్లీ కొత్త బ్రాండ్స్.. కొత్త ప్రకటనలు.. మళ్లీ.. పాత అసహనం.
కూర్చుని టీవీ చూస్తే పొట్ట పెరుగుతుందని.. ట్రెడ్‌మిల్‌పై పరుగెడుతూ టీవీ చూడమని చెప్పే ప్రకటనను అమలు చేయడానికి పరుగెడతాం. ఈ పరుగులో ప్రశాంత జీవన గమనానికి కావాల్సిన శాంతి, సహనం, పొదుపు, తృప్తి అనే మౌలిక అంశాలను మరిచిపోయి... ప్రతి వస్తువు విషయంలో ఇతరులతో పోల్చుకుంటూ మన ఉనికిని కోల్పోతున్నాం. మానవ జీవనన ప్రాథమిక దశలో మనిషి తనకు అవసరమైనంతే వేటాడేవాడు. మరి ఇప్పుడు? ఏ పక్షి కూడా అవసరాన్ని మించి ఆహారాన్ని కూడా పోగేయదు. మరి మనం?
ఇటీవల కొందరు మిత్రులు జర్మనీలో ఒక హోటల్లో భోజనం చేస్తూ... అవసరానికి మించి ఆర్డర్ ఇవ్వడం వల్ల అవి తినలేక వదిలేశారు. ఇదంతా గమనిస్తున్న జర్మన్ మహిళ అభ్యంతరం వ్యక్తం చేస్తే... మా డబ్బు, మా ఆహారం, మా ఇష్టం అని ఆ మిత్రులన్నారు. దానికి ఆమె ఆవేదనతో స్పందిస్తూ... డబ్బు మీది కావచ్చు కానీ వనరులు సమాజానివి. మీ చర్య వల్ల సామాజిక శాంతికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటూ ఆ మహిళ సాంఘిక భద్రతా దళాలకు తెలపడం, ఆ యవకులు జరిమానా చెల్లించాల్సి రావడం జరిగింది.
ఆమెకు ఉన్న సామాజిక స్పృహ, పొదుపుపై అవగాహన అందరికీ ఆదర్శం. తనను కలవడానికి వచ్చిన సందర్శకులను చాణుక్యుడు.. ‘మీరు వచ్చిన పని వ్యక్తిగతమా? వృత్తి పరమైనదా’? అని ప్రశ్నించాడు. వారు వ్యక్తిగతం అని చెప్పడంతో.. తాను పనిచేస్తున్న పెద్ద (ప్రభుత్వ) దీపాన్ని ఆర్పివేసి చిన్న (వ్యక్తిగత) కొవ్వొత్తిని వెలిగించాడు. ఆశ్చర్యపోయిన సందర్శకులతో.. వ్యక్తిగత కార్యానికి వ్యక్తిగత వనరుల పరిమితంగా వాడటమే తన జీవనసూత్రమని చాణుక్యుడు వివరిస్తాడు. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు. బాట వేయడం.. దారి చూపడం. ఎంత దూరం వెళ్లాం, ఎన్ని వింతలు చూశాం అని కాదు ఎన్ని అనుభూతుల్ని మూటగట్టుకున్నాం? ఎంత ఆత్మ సంతప్తిని పొందగలిగాం అన్నది ముఖ్యం. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ బతికుండగానే మరణించినట్లు వార్తలు వచ్చాయట. డైనమెట్ కనిపెట్టి అనేక మంది వినాశనానికి కారణమయిన వ్యక్తి మరణించాడు అని పత్రికలు సంపాదకీయాలు రాశాయి. నిజంగా మరణించినా ఈ ప్రపంచం తనను ఇలానే గుర్తుంచుకుంటుందని భావించి... తన పేరు చెబితే మంచి గుర్తుకురావాలని ఆయన నోబెల్ బహుమతిని ప్రారంభించాడు. ఇపుడు నోబెల్ అనగానే బహుమతి గుర్తుకువస్తుంది కానీ డైనమెట్ కాదు.
అసంపూర్ణంగా ఉన్న జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు నింపుకోవటమే అభివృద్ధి. అందుకు అనుశీలన, అంతర్‌దృష్టి, అధ్యయనం, ఆలోచన అవసరం. ఆయా రంగాల్లోని మేధావులందరినీ అధ్యయనం చేయాలి. వారికి తట్టని అంశాలను పరిశీలించాలి. సమాజానికి మన వంతు తోడ్పాటును అందించాలి.
‘ఆనోభద్రా క్రతఓ యంతు విశ్వతః’
(అన్ని వైపుల నుంచి ఉదాత్త భావాలు మనకు సంక్రమించుగాక.)
6, మార్చి 2014, గురువారం
ధాన్యానాముత్తమం దాక్ష్యం - RAJAMOULI ESSAY'S - 2
అమెరికాలోని ఒక నిరుపేద నీగ్రో కుటుంబంలో పుడుతూనే బానిసగా జన్మించాడు. తండ్రిని బాల్యంలోనే కోల్పోయాడు. తనను, తన తల్లిని బానిసలుగా అమ్మడానికి ప్రయత్నించిన వర్తకులు తల్లిని అమ్మేశారు. కానీ జబ్బుపడ్డ అతడిని కష్టపడటానికి పనికిరాడని ఒక పండ్ల తోట వద్ద వదిలి వెళ్లిపోయారు. ఖాళీ సమయాల్లో బట్టలు ఇస్త్రీ చేయగా వచ్చిన డబ్బుతో.. వృక్షశాస్త్రాన్ని మధించి దాదాపు మొక్కలకు వచ్చే అన్ని రకాల వ్యాధులకు 300 రకాల మందులను వృక్షశాస్త్ర మెళకువలతోనే కనిపెట్టాడు. అతని క్రమశిక్షణ, అంకితభావం, మేధస్సు చూసి సంవత్సరానికి లక్ష డాలర్లు ఇస్తానని, తనతో కలిసి పని చేయాలని కోరాడు థామస్ ఆల్వా ఎడిసన్. కానీ తన కాలేజీలోనే తన విద్యను, పరిశోధనల ఫలితాలను అందరికీ పంచుతాననీ తద్వారా అమెరికా వ్యవసాయరంగం అతి తక్కువ ఖర్చులో ఎక్కువ ఉత్పాదకత గల దేశంగా అవతరించగలదని నమ్మి అనుకున్నది సాధించాడు. ‘నేను తయారుచేసిందంతా భగవంతుడు నాకు ఇచ్చింది. దాన్ని వేరొకరి లాభం కోసం ఎలా అమ్మగలను’ అనేవాడాయన. దేశమంతా లక్షలాది రైతులకు ఉచితంగా తన పరిశోధనల సారాన్ని అందించి వారిని, వారి పంటలను ఎప్పటికీ సురక్షితంగా ఉండేలా తోడ్పడ్డాడు.
ఆయన మరణించిన తర్వాత ఆయన సమాధిమీద ఇలా రాసి ఉంది. "He could have added fortune to fame, but caring for neither he found happiness and honour in being helpful to the World'' ‘‘కావాలనుకుంటే కీర్తితోపాటు సంపద కూడా వచ్చేది కానీ రెంటినీ లెక్కచేయక తన ఆనందం, గౌరవం ప్రపంచానికి సాయపడడంలోనే ఉంది అని భావించాడు’’ ఆయనే జార్జి వాషింగ్టన్ కార్వర్. చిన్న విషయాన్ని కనిపెట్టినా పేటెంటు కోసం పరుగులు పెట్టి రాయల్టీ కోసం రాద్ధాంతం చేసే రోజుల్లో ఒక్క పేటెంటు తీసుకోకుండా లాభాపేక్ష లేకుండా తనదేశ రైతులు పదికాలాలపాటు చల్లగా ఉండాలన్న అతని తపన అందరికి ఆదర్శనీయం. తన జీతంలో పొదుపు చేసిన మొత్తంతో కార్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇలా తను మరణించిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడాలనే అతని ఆశయాలు ఎంత ఉదాత్తమైనవో అర్థమవుతుంది. అంగణవేదీ వసుధా కుల్యా జలధి: స్థవీచ పాతాళమ్ వాల్మీక: చ సుమేరు: కృతప్రతిజ్ఞానస్య ధీరస్య పరోపకారం కోసం కృతనిశ్చయంతో ఉన్నవారికి భూ మండలమంతా చిన్న తోటలా, సముద్రం ఒక చిన్న కాల్వలా, పాతాళం ఒక విహార ప్రదేశం లాగా, మేరు పర్వతం ఒక చిన్న పుట్టలా కనిపిస్తుంది. అటువంటి వీరులకు ఎన్ని అవరోధాలొచ్చినా వాటికవే తొలగిపోతాయి. లేకపోతే తొలగించుకోగలరు. తన సోదరుని వివాహానికి బంధుమిత్రులందరికీ భోజనం పెట్టాలనుకున్నా... దేశంలో (భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత) ఆహార కొరత వల్ల, అప్పుడున్న నియమం ప్రకారం కేవలం 30 మందికి మాత్రమే పెట్టాలని తెలిసి... ఎలాగైనా దేశాన్ని వ్యవసాయరంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయించాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎస్‌కు ఎంపికైనా చేరకుండా.. హరితవిప్లవం ద్వారా భారతదేశాన్ని స్వావలంబన దిశగా అడుగులు వేయించిన ఎం.ఎస్. స్వామినాథన్ స్ఫూర్తిదాయక ప్రయాణం విద్యార్థులందరికీ దిక్చూచే. బాల్యం నుంచీ సమస్యలు సతమతం చేసినా, ధైర్యంగా ఎదుర్కొని, వాటిని అధిగమించి విఫలమవడానికి వేయి సాకులున్నా సఫలమైన ఈ మహానుభావులు.. విద్యార్థి దశలో నిర్ణయాత్మక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ ఇష్టం ఉన్నా లేకున్నా ఎవరో చెప్పారని, మరెవరో తీసుకున్నారని, వేరెవరో బాగా సంపాదిస్తున్నారనీ అస్పష్ట వైఖరితో అసమంజస నిర్ణయాలు తీసుకుని తమకూ, తమ వారికీ క్లేశ కారణమవుతున్న వారందరికీ ఆదర్శమే. చదువు అంటే కేవలం పాఠ్యపుస్తకం పఠనమే కాక మానవసంబంధాల సున్నితత్వాన్ని అర్థంచేసుకుని చదువుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు-వాదోడుగా ఉండటమే. ఇంటి పనులు చేసుకోవడం చిన్నతనంగా భావిస్తే అది విద్యాభ్యాసంలో లోపమే. కుటుంబం నడవడానికి, తన చదువుకు ఎంత ఖర్చువుతోంది? కుటుంబ ఆదాయం ఎంత? ఎక్కడి నుంచి వస్తోంది? తదితర అంశాలు విద్యార్థులు అర్థం చేసుకొంటే వారి ఆహారం, ఆహార్యం, అలవాట్లలో, ఆనందాలలో, అభిరుచులలో మితవ్యయం పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఇలా ఏర్పడే ఆర్థిక క్రమశిక్షణ చదివే చదువుపట్ల మరింత అంకితభావం పెంచడమే కాకుండా తల్లిదండ్రుల పట్ల గౌరవభావాన్ని ఇనుమడింప చేస్తుంది. అది కుటుంబ సభ్యుల మధ్య ఆరోగ్యకర, ప్రజాస్వామ్యబద్ధమైన సంభాషణ పెంపొందింపచేసి ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరికోసం ఒకరు జీవించే ఆహ్లాదకర వాతావరణం ఇంట్లో ఏర్పడుతుంది. ఇలా ఏర్పడే జీవితానుభవం జీవితంపట్ల వాస్తవిక దృక్పధాన్ని అలవరుస్తుంది. అలాకాకుండా చదివిన చదువును జీవితానికి అన్వయించుకుంటూ, అర్థవంతంగా నిజజీవితంలో గమనిస్తూ ముందుకు సాగాలి. ఇలా చదువు పెరిగే కొద్దీ, చదవాల్సిన పుస్తకాలు పెరిగే కొద్దీ విషయసేకరణపై, విషయంపై పట్టు పెరిగి అది విద్యార్థిలో అంతర్భాగం అయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఇది జరగాలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ చర్చించి ముందుకు కలిసి నడవాలి. లేకపోతే జీవితానికి అన్వయించని చదువు, చదివినా అర్థంకాని జీవితం ఇవే ప్రాథమిక సమస్యలుగా మిగిలిపోతాయి. అన్నం, కూర, నెయ్యి కలుపుకుని సమపాళ్లలో రుచిగా భుజించడం నేర్పిస్తే జీవితాంతం ఆ అలవాటు ఉపయోగపడుతుంది. అదే అన్నీ కలిపి ముద్దలుగా చేసి పెడితే తినడం సులభమే కానీ, ముద్ద తయారు చేయడం రాదు. పాఠ్యపుస్తకాలతోపాటు సమాజాన్ని కూడా అధ్యయనం చేయగలిగే వారుగా తయారైతేనే Intelligence quotient, Emotional quotient, Social quotient, Spiritual quotient అన్నీ సమపాళ్లలో కలిసిన వ్యక్తిగా రూపొందుతారు. ఐఐటీ మద్రాసులో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి వ్యవసాయం చేస్తానన్న మాధవన్‌ను తల్లిదండ్రులు వారించినా "I want to transform what I study in to what I love'' అనుకుని..పనిచేసి దాచుకున్న డబ్బుతో ఆరు ఎకరాలు కొని వ్యవసాయం చేస్తే.. మొదట్లో నష్టం వచ్చింది. అయినా పట్టువిడవకుండా ఇజ్రాయెల్‌లోని డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని (750 లీటర్లు అవసరం అయ్యే దగ్గర లీటరు నీరు సరిపోతుంది) అవలంభించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకున్నాడు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో వ్యవసాయ రుణాలు ఎలా తీసుకోవాలో చెప్పేకంటే ఆచరణాత్మక ప్రయోగాలు చేయాలంటారు. తన పొలంలో ప్రతి ఎకరాలో 10 సెంట్లు పరిశోధనలకు కేటాయిస్తారు. అమెరికాలో గంట పనిచేసి మూడు భోజనాలు సంపాదిస్తే ఇక్కడ రోజంతా పనిచేసినా ఒక్క భోజనం రాని పరిస్థితి. దీన్ని మార్చాలి. లేకపోతే ఆహార అభద్రత అణుబాంబు కంటే ప్రమాదకరమైంది అంటారు మాధవన్. ఆయన లాంటి ఎందరో ఇంజనీర్లు తమ ఇంజనీరింగ్ జ్ఞానాన్ని తమ హృదయానికి నచ్చిన రంగంలో వినియోగిస్తే మనదేశాన్ని ఎంతముందుకు తీసుకువెళ్లవచ్చో? మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాం మాధవన్ పొలాన్ని సందర్శించి అబ్బురపడి మనకు మిలియన్ మాధవన్‌లు కావాలన్నారు. జీవితంలో అన్నీ మనల్ని వెతుక్కుంటూ రావు. మనమే అన్వేషించాలి. జీవిత గమనంలోని ప్రతి మలుపులోనూ మనకు ఎన్నో పాఠాలు దొరుకుతాయి నేర్చుకోగలిగితే. ఉదయం నాలుగు గంటలకు లేచి, పేపర్లు వేసి, స్నానం చేసి చదువుకొని ఆ తర్వాత పై చదువులు ఉపకారవేతనంతో ఎంఐటీలో చదువుతున్నప్పుడు రెండురోజుల్లో ఆశించిన ఫలితం రాకపోతే ఉపకారవేతనం నిలిపివేస్తానన్న అధ్యాపకుని మాటలతో ఆ ఫలితాన్ని చెప్పిన సమయానికి అందించారు అబ్దుల్ కలాం. ఈ సంఘటన కాలం విలువ చెప్పడమే కాకుండా ఒక పని నిర్దేశిత సమయంలో పూర్తి కావడానికి కొంత ఆరోగ్యకరమైన ఒత్తిడి, మనసునిండా కాంక్ష అవసరమనే పాఠాన్ని నేర్పిందంటారు కలాం. అంతేకాకుండా ప్రతిమనిషి యజమానిగా మాత్రమే కాకుండా పనివాడిగా కూడా పనిచేయగలిగినపుడే విజయవంతమైన ఫలితాలు వస్తాయని తాను నేర్చుకున్న జీవితపాఠం అంటారాయన. స్కాలర్‌షిప్ ఆపేస్తానని టీచర్ అంటే ఎంతమంది ఇలాంటి పాఠాలు నేర్చుకుంటారు? కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్ఛతి ధీమతామ్ వ్యసనేనచ మూర్ఖాణాం నిద్రయా కలహేనచా బుద్ధిమంతుడు శాస్త్ర విజ్ఞాన విషయాలను అధ్యయనం చేస్తూ స్వానుభవంతో ప్రావీణ్యత సాధిస్తాడు. మూర్ఖులు వ్యసనాలు, నిద్ర, కలహాలతో కాలం వెళ్లదీస్తారు. గొప్పవారిని చూసినా, వారి గురించి విన్నా మనకు కూడా వారిలా పేరు ప్రఖ్యాతులు వస్తే బాగుండుననిపిస్తుంది. అయితే విపత్కర పరిస్థితుల్లో, అసాధారణ సమస్యలు వచ్చినపుడు మనోనిబ్బరం కోల్పోకుండా వివేకం, సహనం, సూక్ష్మ గ్రాహ్యత, లోకజ్ఞానం ఉపయోగించి వారు ప్రతిస్పందించే తీరు వారినడక, నడత, నైపుణ్యాలను మనకు చెప్పడమే కాకుండా మనం నేర్చుకోవాల్సిన విషయాలను గుర్తు చేస్తుంది. కాలేజీ చదువుల కోసం ట్యూషన్లు చెప్పి, స్వశక్తితో కొంతస్థాయికి ఎదిగి తర్వాత మైసూరు సంస్థానం వారి సాయంతో సివిల్ ఇంజనీరింగ్‌లో ప్రథమస్థానాన్ని సాధించి.. మొదటి ఉద్యోగంలోనే సింధునది నీటిని సుక్కూరు పట్టణానికి తెచ్చి ప్రజల దాహార్తిని తీర్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎక్కడ పనిచేసినా తనదైన ముద్రను వేసేవారు. మహానది డ్యామ్ నుంచి వరదనీరు వృథాగా పోతుందని దాన్ని వాడుకోవడానికి ఆటోమేటిక్ స్లూయిజ్ గేట్లు తయారు చేశారు. మూసీనది వరదల్లో విలవిలలాడిన హైదరాబాద్‌ను హైదరాబాద్ చీఫ్ ఇంజనీరుగా డ్యామ్‌లు, బండ్‌లు, పార్కులు కట్టి సురక్షితంగా, సుందరంగానూ మలిచారు. కర్ణాటకలో కృష్ణరాజసాగర్ డ్యామ్‌ను నిర్మించి లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చారు. ైమైసూరు దివానుగా తనను నియమించినపుడు బంధువులందరినీ భోజనానికి పిలిచి, తన పదవి ద్వారా వారు ఎటువంటి స్వలాభాలనూ ఆశించనంటేనే ఆ పదవి చేపడతానని వారి దగ్గర మాట తీసుకునే వరకు పదవి చేపట్టలేదు. కానీ ఏ బంధువుకు ఏ అవసరం వచ్చినా తన జీతంలో నుంచి ఇచ్చేవారు. ఆయన మాటల్లో చెప్పాలంటే "To give real service you must add something which cannot be bought or measured with money'' ‘‘డబ్బుతో కొనలేనిది, వెలకట్టలేనిది ఏదైనా జోడించగలిగితేనే మనం నిజంగా సేవచేసినట్లు’’ అంత మహానుభావుడు కాబట్టే ఆయన జన్మదినమైన సెప్టెంబరు 15ను ‘ఇంజనీర్‌స డే’గా జరుపుకుంటాం. ఆయన జీవితంలో నుంచి నేర్చుకోగలిగిన నేర్పు, నమ్రత ఉన్నవారికి ఎన్ని నాయకత్వ పాఠాలు. అభివాదస్య శీలస్య నిత్యం వృద్ధో పసేవిన: చత్వారి తస్య వర్ధన్త ఆయు: ప్రజ్ఞా యశో బలం ఎవరైతే విజ్ఞులు, మహానుభావుల పట్ల వినమ్రతతో, భక్తిభావంతో ఉంటారో వారి ఆయువు, వివేకం, యశస్సు, బలం వృద్ధి చెందుతాయి. ఒక ప్రముఖ కంపెనీ క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు ఎంపికైన విద్యార్థులకు ఇలా ఉత్తరం రాసింది.‘‘మీలో చాలామంది డిగ్రీ పూర్తి చేస్తున్నందుకు, మొదటి ఉద్యోగంలో చేరుతున్నందుకు చాలా ఆనందంగా గర్వంగా భావిస్తుంటారు. మీకు రాబోయే జీతాల గురించి, పదవుల గురించి చర్చించుకుంటూ ఉంటారు. కానీ మేము మాత్రం మీరు పంపిన బయోడేటాలు చూస్తూ మీ నాణ్యత, మీ నైపుణ్యం, మీ ఉత్పాదకత, మీ విశ్వసనీయత ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతూ రాస్తున్నాం. కానీ మీకు చెప్పకపోతే మీ తరం, మీ తర్వాతి తరం కూడా నేర్చుకోవాల్సినవి నేర్చుకోక నాణ్యతా ప్రమాణాలను తగ్గించి వేస్తాయనే ఆందోళనతో రాస్తున్నాం. మీరు ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడగలం, రాయగలం అని బయోడేటాలో రాస్తారు. కానీ సగానికిపైగా బయోడేటాల్లో ఇంగ్లిష్ తప్పుల తడకలు. ప్రపంచస్థాయిలో పనిచేయడానికి అవసరమైన భాషలో నైపుణ్యం సాధించాల్సిన అవసరం లేదా? ఆలోచించండి? సమస్యా పరిష్కార నైపుణ్యం పుష్కలంగా ఉందని రాస్తారు. ఇంతకుముందు మీ సీనియర్లు కూడా ఇలాగే రాశారు. ఎప్పుడు చిన్న సమస్య వచ్చినా నిబ్బరంగా పరిష్కారం ఆలోచించకుండా వెంటనే ఏం చేయాలని అడుగుతారు. మీస్థాయి సమస్య మీరు పరిష్కరించలేకపోతే మీరు మీ సంస్థలో ఆత్మవిశ్వాసంతో ఎలా పని చేయగలరు? ఇప్పటినుంచైనా ఈ అలవాటు చేసుకుంటారని ఆశించవచ్చా? మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త మెళకువలు నేర్చుకుంటామని మాట ఇచ్చి బాధ్యతలు చేపడతారు. విధుల్లో చేరిన తర్వాత నేర్చుకోవడమే మానేస్తున్నారు. నైపుణ్యాన్ని మెరుగుపరచుకోకుండా మెరుగైన జీతం ఇవడం ఎలా సాధ్యం? సంస్థ పట్ల పూర్తి నిబద్ధతతో సంస్థ పురోభివృద్ధికి తోడ్పతామని చెబుతారు. కానీ కాస్త మెరుగైన జీతం ఎవరైనా ఇస్తానంటే అవకాశం వచ్చిన వెంటనే సంస్థను వదిలి వెళ్లిపోతారు. మేము మిమ్మల్ని అర్ధంతరంగా సంస్థ నుంచి బయటకు పంపితే మీరు ఎంత బాధపడతారో అవసరమైన సమయంలో మీరు సంస్థను వదిలేస్తే ఆ సంస్థకు ఎంత కష్టమౌతుందో ఆలోచించారా? మీ విశ్వసనీయతను ఎలా విశ్వసించడం? మీకు వ్యక్తిగత అవసరం ఉన్నపుడు ఆఫీసుకు ఆలస్యంగా వచ్చినా ఏమీ అనకూడదని మీరు అనుకోవడం తప్పుకాదు. కానీ సంస్థకు అవసరమైనపుడు సహజమైన ఇష్టంతో మీరు సంస్థ సమస్యను పరిష్కరించడంలో తోడ్పడాలని ఆశించడం అత్యాశా? మీ కెరీర్ ఆరంభం-అంతం కూడా మీ చేతిలోనే ఉంది. ఒక మీరు వీలైనంత నైపుణ్యం, సామర్థ్యం పెంచుకుని మీకు, మీ కుటుంబానికీ, మీ సంస్థకూ, దేశానికీ ఒక తరగని ఆస్తిగా మారాలని - ఒక బాధ్యతాయుతమైన కంపెనీగా మా ఆకాంక్ష. భాషా నైపుణ్యం, జ్ఞాన తృష్ణ, స్వవివేకం, విలువలతో కూడిన భాగస్వామ్యం, Professionalism - ఇవి మీ ఎదుగుదలకు, మీ ద్వారా మా ఎదుగుదలకు మెట్లు/పునాదులు. నిజాయితీతో ఆత్మావలోకనం చేసుకుని, సుహృద్భావంతో అర్థం చేసుకుని సహకరిస్తూ సంస్థలో శాశ్వత భాగస్వాములవుతారని ఆశించవచ్చా? ఈ ఉత్తరం మనందరికీ ఏదో ఒక విషయంలో వర్తిస్తుంది. మరి వారు పేర్కొన్న ప్రొఫెషనలిజం అంటే ఏమిటి? తండ్రి లేని ఐదేళ్ల మహదేవ అనే చిన్న కుర్రవాడిని.. అతని తల్లి ఏదో ఒక పనిచేస్తూ పోషించేది. అనారోగ్యంతో చనిపోయిన తన తలి అంత్యక్రియలు అనాథలా జరిగాయిని భావించి తన తల్లిలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని భావించి... ఎవరూ లేనివారికి తనే శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేసేవాడు. ఇప్పటి వరకూ దాదాపు 45 వేల మందికి అలా శ్రద్ధగా అంత్యక్రియలు చేశాడు. ఇంకా చేస్తున్నాడు. అతను మృతదేహాలను ఏదైనా నదిలో పారేసినా అడిగేవారు లేరు. కానీ ఎటువంటి పర్యవేక్షణ లేకుండా తను నిర్ధారించుకున్న ప్రక్రియ ప్రకారం అంకితభావంతో పని పూర్తి చేసేవాడు. మరి జీతం తీసుకుంటూ మన పని మనం చేయడానికే 10 సార్లు చెప్పించుకుని, పర్యవేక్షకుడితో తిట్లు తిని, ఆ భయంతో పనిపూర్తి చేసే మనలో ప్రొఫెషనలిజం ఉందా? లేదా? ప్రశ్నించేవారు, పర్యవేక్షణ లేకున్నా పూర్తి నిబద్ధతతో మహదేవ చేసేపనిలో ప్రొఫెషనలిజం ఉందా? అనేది ప్రతి రంగంలో తమని తాము ప్రొఫెషనల్ అని పిలుచుకునే ప్రతివారూ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన వాస్తవ ఉదాహరణ. ప్రొఫెషనలిజం అంటే డిగ్రీలు, కోర్సులు, దుస్తులు, వాహనాలు, ఐడెంటిటీ కార్‌డ్స.... ఇవేనా? లేదా పర్యవేక్షణ ఉన్నా లేకున్నా తన పనిని పూర్తి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయడమా? కంపెనీవారు రాసిన ఉత్తరం, మహాదేవ ఉదాహరణ కింది సుభాషితాన్ని గుర్తుకు తెస్తాయి. గుణేషు క్రియతాం యత్నః కిమాటోపైః ప్రయోజనమ్ విక్రయన్తే న ఘంటాభిః గావః క్షీర వివర్జితాఃనాకీ గుణాలున్నాయని చెప్పడం కంటే ఆ గుణాలు అలవర్చుకోవడం అత్యవసరం. మెడలో గంటకట్టినంత మాత్రాన పాలివ్వని ఆవును మభ్యపెట్టి అమ్మినా.. వాస్తవం తెలిసి వదిలివేస్తారు. ప్రముఖ శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత చంద్రశేఖర్ తన పరిశోధనల సారాన్నంతా చక్కని సొంపైన భాషలో, ఒక చదివింపచేసే శైలిలో వ్యాసాలు రాసేవారు. క్లాసిక్స్‌తోపాటు ఆంగ్ల కవులైన టి.ఎస్.ఇలియట్, షేక్‌స్పియర్, హెమింగ్‌వే లాంటి ప్రముఖ రచయితల రచనలు చదువుతున్నప్పుడు, తన పరిశోధనల సారాన్ని వారిలాగా చదివింపచేసేలా, ఆనందింప చేసేలా ఎందుకుండకూడదని ఒక విలక్షణశైలిలో రాసేవారు. ఇది శాస్త్ర సాంకేతిక పరిశోధనా వ్యాసాల్లో బహు అరుదు. అందుకే అంత గొప్పవాడయ్యారు చంద్రశేఖర్. ఆయన ఏం చేసినా పరిపూర్ణత్వం, కళాత్మకత, సౌందర్యాభిలాష నిండుగా కనిపించేవి. ""Science is not only a way of making discoveries but a way of life'' సత్యం సౌందర్యం వీటిని విడదీయలేమని సైన్సుని ప్రోత్సహించి, కళని విస్మరించలేమనీ, సైన్సులో అవసరమయ్యే క్రమశిక్షణ, పట్టుదల, హేతుబద్ధత, దృక్పథం లాంటివి పాటిస్తూనే సంగీతం, కళలు, సాహిత్యంలో కూడా అభిరుచిని కలిగిఉండి పరిపూర్ణ మానవ నిపుణుడిగా వికసించడం ప్రతి విద్యార్థికి అవసరం. ఈ సమతుల్యత, సమన్వయం ఈనాటి యాంత్రిక జీవన గమనానికి పరిష్కారమేమైనా చూపిస్తుందేమో. ఒక వ్యక్తి విద్యాపరంగా/ కెరీర్ పరంగా ఉన్నతస్థానానికి ఎదగడానికి అతని పట్టుదల, పరిశ్రమ, పనితనంతోపాటు కుటుంబంలో అందరూ లేదా వీలైనంతమంది తమతమ స్థాయిలో వీలైనంత త్యాగాలు చేస్తారు. ఆ ఫలితం సామూహికంగా కుటుంబ సభ్యులందరిదీ. మూలాలు మరిచిన వారినీ, అసూయాపరులను, అహంకారులను, అజాగ్రత్తపరులనూ ప్రకృతి ప్రోత్సహించదు. యక్ష ప్రశ్నలలో ధర్మరాజు - సుఖానికి ఆధారమైనది ఏది అని యక్షుడడిగితే ‘శీలం’ అంటాడు. సంపద అనలేదు. సుఖాల్లో గొప్పది ఏది అనడిగితే సంతోషం అన్నాడు. ఎవరు సంతోషంగా ఉంటాడు అనడిగితే యాచించకుండా తనకున్న దానిని తనవారందరితో ఆనందంగా పంచుకుని తృప్తి చెందేవాడు అని సమాధానమిస్తాడు. అందువల్ల ఉన్నతికి కారణమైన వారందరిపట్లా జీవితాంతం కృతజ్ఞతాభావంతో ఉండటమే వారికి మనం ఇచ్చే మర్యాద. ఈ సందర్భంలో మార్టిన్ లూథర్ కింగ్ తను నోబెల్ ప్రైజ్ అందుకుంటూ అన్నమాటలు. ""we should be grateful not only to known pilots but also unknown ground crew'' విమానం ఎగురుతుందంటే అందరూ నడుపుతున్న పైలట్‌ను చూస్తారు కానీ ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్‌స్టాఫ్ పగలూ, రాత్రీ శ్రమించి విమానాన్ని ఎగరడానికి సమానంగా తోడ్పడతారని ఆలోచించరు. ఎందుకంటే వారు ముఖ్యాంశాల్లో ఉండరు. కానీ పైలట్ విజ్ఞడయితే వారి శ్రమను గుర్తుంచుకొని వారిని మనసునిండా ఉంచుకోవాలి. ఉన్నతస్థితికి ఎదిగినా తన ప్రాథమిక సూత్రాలను మరవకూడదు. ఢిల్లీ మెట్రోను, కొంకణ్ రైల్వేను అనుకున్న దానికంటే ముందే పూర్తిచేసిన కర్మయోగి శ్రీధరన్ ఇప్పటికీ తెల్లవారుజామునే నిద్రలేస్తారు. ధ్యానం, భగవద్గీతా పఠనానికి రెండు గంటలు కేటాయిస్తారు. పని సమయంలో పూర్తిగా పని, విశ్రాంతి సమయంలో పూర్తిగా విశ్రాంతి, ఆహార సమయానికి ఆహారం లేకపోతే రెండు అరటిపండ్లతో ఆకలి తీర్చుకోవడం, సాధారణ జీవనశైలినే అనుసరించడం అందరికీ ఆచరణీయం. ఎందుకంటే.. ఆచారాల్లభతేః ఆయుః ఆచారా దీప్సితాః ప్రజా ఆచారాద్ధనమక్షయ్యమ్ ఆచారోహన్త్యలక్షణమ్ మంచి శీలం, నడవడిక ఉంటే ఆయుర్వృద్ధి, సత్సంతానం, తరగని సంపద, (కీర్తి), లభించడమే కాకుండా ఏవైనా చిన్నలోపాలుంటే నశించిపోతాయి. Rudyard kipling మాటల్లో చెప్పాలంటే... If you can talk with crowds and keep your virtue or walk with the kings - nor loose the common touch yours is the earth and everything that's in it and which is more- you will be a man my son. జన సందోహంలో ఉంటూ కూడా తన విశిష్ట గుణాలను కోల్పోనివాడు, గొప్పవారితో తిరుగుతూ కూడా తన సామాన్య, సాధారణ ప్రవృత్తిని కోల్పోనివాడు అసలైన మనిషి. అందుకే నచ్చిన పనిని చేపడదాం చేపట్టిన పని పనిబడదాంఎందుకంటే ధర్మరాజు చెప్పినట్లు (యక్ష ప్రశ్నలకు సమాధానమిస్తూ) ధాన్యానాముత్తమం దాక్ష్యంగొప్పతనాల అన్నింటిలోనూ ఉత్తమమైన గొప్పదనం.. చేపట్టిన పనిలో నేర్పరితనమే. |
![]() |