మనం అందరం కలియుగ దైవం వేంకటేశ్వరుని
నివాసమైన తిరుమల దర్శన సమయంలో షుమారు 1980 ప్రాంతం నుండి వివిధ ప్రదేశాలు సందర్శన సమయంలో మనకు దేవస్థాన ప్రసారమాధ్యమాల ద్వారా అమ్మ M.S.సుబ్బలక్ష్మి మృధుమధురంగా "భావయామి గోపాలబాలం" అన్న కీర్తన వినని వారు అరుదు..మనవారు అందరు తెలియకుండా నే ఆ ముగ్ధమనోహర స్వరం, ఆ గోపాల బాలుని పాదవిన్యాసాలు మన హృదయంలో ముద్రపడి మనం కూడా శృతి కట్టి ఓక పదం అయినా పాడుతాం. అంతటి ఓ గొప్ప కీర్తన , అందులోను అమ్మ పాట పై ఓ నాలుగు మాటలు...
భావయామి గోపాలబాలం
రాగం: యమునా కళ్యాణి
తాళం : ఖాండ చాపు
ప|| భావయామి గోపాలబాలం మన- | స్సేవితం తత్పదం చింతయేయం సదా ||
చ|| కటి ఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా- | పటల నినదేన విభ్రాజమానం |
కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం | చటుల నటనా సముజ్జ్వల విలాసం ||
చ|| నిరతకర కలితనవనీతం బ్రహ్మాది- | సుర నికర భావనా శోభిత పదం |
తిరువేంకటాచల స్థిత మనుపమం హరిం | పరమ పురుషం గోపాలబాలం ||
ఇది ఆ కీర్తన... పూర్తి రూపం.
ఈ కీర్తన రచించినవారు అన్నమాచార్యులు.
వీరి సంస్కృత కీర్తన ఇది. ఇది దేవస్థానంలో వెలుగు చూసిన అన్నమయ్య కీర్తనలో స్వర్గీయ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పరిష్కరించిన రేకు నంబరు 23/1 గల దానిలో వున్నది.
ఇక కీర్తన వివరణలు వచన రూపంలోనే...
ఈ ప్రకృతి మొత్తం ఆ పరమపురుషుడైన గోవిందుని రూపమే.. మీరు ఆయన పట్ల అనురక్తితో వుంటే ఆయన మీకు బాలగోపాలునిగా మీ హృదయంలో ప్రతిష్టించుకుంటే..ఆ బాలగోపాలుని ఆలోచనలో వుంటే ఆ గోపాలుని అడుగుల సవ్వడి మీకు ఖచ్చితంగా వినపడుతుంది ..ఎంతలా అంటే..
ఆయన మొలకు కట్టబడిన చిరుగంటల సవ్వడి..తో కూడి రత్నాలు పొదగ బడిన మేఖల అంటే వడ్డాణం...సుందరంగా మనోహరంగా... అసలు క్రిష్ణుడంటేనే అలంకరణ ఆయినను ఎన్ని రూపాలలో ఎన్ని రకాలుగా అలంకరించిననూ మనకు తనివి తీరనంత కావాలంటే చూడండీ కంఠహారాలు , పూలమాలలు ,తులసి , కడియాలు.,దండకడియిలు ,బాజుబంద్ లు , నెమలిపింఛాలు ,మురళీ ,నిరంతరం ఆయన చేతిలో నవనీతం ఇలా అనేకం...
ఇన్నీ అలంకారలతో కూడిన ఆ బాలగోపాలుని పదవిన్యాసాల వలన మనకు వినబడే అలంకరణ భూషణముల శబ్దాలు ఎంతో మనోహరంగా వున్నాయి..ఈ బాలగోపాలుని దర్శించి మనం వివశులం అవుతున్నాం...ఈ బాలగోపాలుడే ఆలయంలో పరమపురుషుడు..ఆయనను దర్శించిటానికి బ్రహ్మాది దేవతలు, దేవతా సముహాలు కూడా పోటి పడుతున్నాయి.
మరి ఇంతటి మహత్తు గల ఆ బాలగోపాలుని మీ మనస్సులో నిలుపుకుంటే ఆ వేంకటాచలపతిని మనం సులువుగా దర్శించ వచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.