రాముడు - పరీశీలన - సీరిస్ 3
**************************
శివధనుర్భంగం
సీతా రామ కళ్యాణం మన తెలుగు వారు అందరికి ఓక పర్వదినం. అది ఏమిటో వివిధ దేవతా రూపాలకు మన తెలుగు నాట వున్న ఆచారంలో కళ్యాణం ఓకటి...ఇది మరే ఇతర ప్రాంతంలోను మనకు కనపడని ఆచారం.
మనం దేవతా రూపాలకు కళ్యాణం చేసి మురిసిపోతాం ఆనందపడిపోతాం. మరీ ఇక సీతారామకళ్యాణమంటే...ఇక ఆ హడావుడి ఊరందరిది...ఆ వైభోగమే కన్నులారా చూడవలిసినదే...అలా ఆ సమయంలో పాటలు పద్యాలు పూజలు..అబ్బో అదో సందడి అదో వేడుక...
రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యాగ సంరక్షణ చేసినారు. విశ్వామిత్రడు తన శిష్యులైన రామ లక్ష్మణులను వెంట పెట్టుకుని మిధిలా నగరానికి పయనం. అదే సమయంలో జనకుడు యాగ నిర్వాహణ ...సీతాస్వయంవరం...దీనికి ఓక పరిక్ష...మహ మహిమాన్వితమైన శివధనస్సుని ఎక్కు పెట్టుట...దీనికి " వీర్యశుల్క" గా సీతతో పరిణయం అని ప్రకటిస్తాడు.
మీకు ఇక్కడ జనకుని గురించి కొంత క్లుప్తంగా తెలియచేయాలి.
మిధిలానగరానికి రాజు జనకుడు. వీరు మహ యోగి పురుషులు ఆత్మజ్ఞాన సంపన్నులు.
వీరికి ఇంకో పేరున్నది సీరద్వజుడు. వీరు యాజ్ఞవల్క్యమహర్షి అనుగ్రహం చే...బ్రహ్మత్వం పొందుతారు. వీరి వంశం పేరు నిమి. వీరి వంశ మూల పురుషుడు మిధి. వీరి వంశంలో లో దేవరాతుడు ఆనే అతను దక్షయజ్ఞంలో పాల్గోన్నాడు. దక్షయజ్ఞంలో దక్షుని అవమానంచే సతిదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఈ విషయం తెలిసిన పరమేశ్వరుడు దక్షయజ్ఞవాటికపై తాను మరియి తన అంశ వీరభద్రడు , ప్రమధగణాలు కలసి భీభిత్స భయానకంతో దక్షుని శిరస్సు ఖండించి...సతిదేవి దేహంతో విరక్తితో వైరాగ్యంతో మరలిపోయే సమయంలో తన ధనస్సును ఆక్కడే వదలి వెళ్ళిపోతాడు....దీనితో దేవతలను ప్రసన్నం చేసుకుని దేవరాతుడు శివధనస్సుని దేవతల నుంచి పొంది తన గృహంనకు తెచ్చి ఓక మంజూషలో వుంచి పూజాదికాలు నిర్వహిస్తుంటాడు. ఈ శివధనస్సు పేరు "పినాకం". ఈ దేవరాతుడు తదనంతరం ఓకరి తరువాత ఓకరికి అది సంక్రమించ బడుతూ ఇప్పుడూ అది జనకుని ఆధినంలో వున్నది.
ఈ జనకుడు , యాజ్ఞవల్క్యమహర్షి నిర్వాహణలో ఓక యజ్ఞంచేయ నిశ్చయించి...ఆ యజ్ఞవాటికకు అవసరమైన భూమి దున్నతున్న సమయంలో ఆ నాగలి చాలు నందు ఓ బాలిక లభ్యం అవుతుంది... ఆమే సీత....ఆమే భూమి నందు లభించింనందున భూజాత అయినది...అందువల్లనే ఈమే అయోనిజ...అయినది....(సీత జన్మరహస్యం వాల్మీకి రహస్యంగా వుంచదలచినట్టున్నాడు. ఆమేకు అయోనిజ లాంటి విశిష్టత కల్పించి...జనకుని తండ్రి చేసి...మరి సంక్లిష్టం చేశాడు... కారణం జనకుడు ఎన్నడు ఎవరితోనైనా అనవసరార్ధం ఓక్క మాటలేదు. దీనితో సీతాదేవి జన్మ రహస్యం పై అనేకానేక విచిత్ర వాదనలు వున్నాయి వాటిని ఇంకోసారి వివరణ). ఆమే బాలికగానున్నప్పుడు ఆటలు ఆడుతున్న సమయంలో ఓక బంతి మంజూష క్రిందకు పోగా ఈమే మంజూషను అలవోకగా ప్రక్కకు జరిపి తన బంతి తీసుకుని వెడలిపోయి..తన ఆట తాను ఆడుకుంటున్నది...ఈ సంఘటనను నారదునితో ఆద్యాత్మిక చర్చలో వున్న నారద ,జనకులు ఇరువురూ గమనించిన వారై ఆశ్చర్య పోతారు....కాని అప్పటికే దేవరహస్యం తెలిసిన నారదుడు తెప్పరిల్లి జనకుని పరిశీలిస్తుంటాడు....ఆశ్చర్యం నుంచి తేరుకోని జనకుడు అలాగే నిశ్చేష్టుడైపోతాడు...ఎందుకంటే తానుగాని...తన వంశంలో మరి ఎవ్వరు కాని ఆ మంజూషను కదల్చిన దాఖలా లేదు...దానితో నారదసముఖంలో యుక్తవయస్కురాలు అయిన సీతను ఎవరికి ఎలా వివాహం చేయాలి అన్న ప్రశ్నకు దొరికిన వాడై ...ఆ ధనస్సును ఎక్కుపెట్ట కలిగిన వారికి సీతతో పరిణయం చేయ నిశ్చయం చేశాడు.
మరి ఇదే సమయంలో మిధిలానగరానికి రామలక్ష్మణులు తో విచ్చేసిన విశ్వామిత్రుని స్వాగతపరచి సకల సత్కార మర్యాదలు ఆచరించి వినమ్రంగా వున్న సమయంలో...విశ్వామిత్రడు రామలక్ష్మణులను పరిచయం చేయటం...వారికి శివధనస్సు దర్శనాభిలాష గురించి తెలపగా....అప్పటికే తాను ప్రకటించిన సీతాస్వయం వరం....అందు నియమం గురించి ప్రకటించినందున...రేపు సభలో చూడవచ్చు అనే వినమ్రసమాధానం నకు సమ్మతించిన వాడై విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కూడి తన బసకేగి మరునాడు సభకు విచ్చేస్తారు.
సభకు మంజూషను ఎంతో కష్టంతో ఏనుగులు , అనేక వందలవేల బల శాలురు అధికప్రయాసలతో సభలో ప్రవేశపెడతారు.
జనకుడు సీతా స్వయంవర నియమం మరియి వీర్యశుల్కం సీతతో పరిణయం అంటారు...
దానితో దేశ దేశాల రాజులు , రాజకుమారులు ఆ శివధనస్సుని ఎక్కు పెట్టే ప్రయత్నం చేయబోతారు...అందరూ అభాసుపాలు అవుతారు...
దానితో రాముడు విశ్వామిత్రుని ఆదేశంతో ఆ శివధనస్సుని అలవోకగా తన చేతిలోకి తీసుకుంటాడు.....దాని అల్లేత్రాడుని దాని నారిభాగంలో బంధించి....ఓక్కసారి నారి సారించబోవ....ఆ శివధనస్సు ఫెళ్ళున విరిగి పోతుంది..... ఇది గమనించిన సర్వులు ఆశ్చర్య చకితులు అవుతారు....ఆనందంలో మునిగినవారు...ఇద్దరే...సీత...తనకు ఇష్టపడిన వరుడు లభించాడని , జనకుడు... ఆశించిన వరడు లభించాడని...గుంభనంగా వున్నది విశ్వామిత్రుడు ఓక్కరే...ఆశించిన ,అప్పచెప్పిన కార్యనిర్వాసణ పూర్తి అయినదని .....
దానితో జనకుడు , రాముని సీతను పరిణయమాడ కోరతాడు... కాని రాముడు సమ్మతించక...తాను విశ్వామిత్ర ఆదేశానుసారం పాల్గోన్నొను...తన వివాహం తన తండ్రి దశరథుని నిర్ణయాను సారమే జరుగుతుంది.. ప్రస్తుతం తాను తన తండ్రి ఆదేశంపై విశ్వామిత్రుని ఆజ్ఞపాలన చేస్తున్నాను అన్న విషయం తెలపటంతో...విశ్వామిత్రుని సూచనపై వాయువేగాలతో పోవు వార్తాహరులని పంపి అన్నీ విషయాలు విశదికరించుతాడు.
ఈ విషయాలన్ని తెలిసిన దశరధుడు ఆనందంతో తన ఆమోదం తెలుపుతాడు.
దశరథుడు తన సకల జన పరివారంతో మిథిలా నగరానికి విచ్చేస్తాడు. అంత ఇరువురి పురోహితులు ఇరువురి గోత్ర ప్రవరలు మరోకరు తెలుపుకునే సమయంలో దశరథుడు తన మనోభిష్టం చెపుతాడు...తన మిగిలిన ముగ్గురు పుత్రులకి కూడా వివాహం చేయ నిశ్చయం... అంత జనకుడు తన సోదరుడు కుశధ్వజుని కుమార్తెలు ఉర్మీళ ను లక్ష్మణునికి , మాండవిని భరతునికి , శృతకీర్తిని శతృఘ్ననికి ఇచ్చి వివాహం జరుపుతారు.
బాగుంది ఇది అంతా పౌరాణిక కధ...కాకపోతే మరికొన్ని విషయాలు మనకి తెలిసినవి...కాకపోతే శివధనస్సు రహస్యం...అందరికి అలా అపరిష్కృతంగా వుండవలసినదేనా...సీత బాలిక గా వున్నప్పుడు ఆమేకి సాధ్యం... మరలా రామునికి సాధ్యం... మరి ఎవ్వరికి ఈ కార్య నిర్వాహణ సాధ్యపడలేదు...అన్నీ తరాలు జనకుని వద్ద వున్ననూ ఎవ్వరూ దానిని కదల్చలేక పోయారు...స్వయం వరంలో పాల్గోన్న వీరాధి వీరులైన రాజులకి సాధ్యపడలేదు...ఓక్క సీతా రాములకి తప్ప....
అదే దేవరహస్యం దాన్నీ విప్పి చెప్పటమే ఈనాటి లక్ష్యం....
సీత , రాములు వైకుంఠ వాసులైన లక్ష్మీనారాయణులని....వారే ఈ విధంగా ఉద్భవించారని ఈనాడు మనకు తెలుసు....ఆనాడు దేవతలకి తెలుసు...దేవతల కార్యనిర్వాహణలో వున్న విశ్వామిత్రునికి తెలుసు....కాని సీతా , రాములు ఉభయులకు తాము వైకుంఠ వాసులమని తెలియదు...కారణం మానవ జీవితం లోని ప్రకృతి ధర్మం అయిన స్త్రీ పురుష ఆకర్షణలను వారు అనుభవించాలని...దంపతులుగా వారి దాంపత్యం...దానిలోని ధర్మాచరణ ని వారు పాటించాలని..ఆచరించాలని....ఇది బాగుంది... మరి శివ ధనస్సు....
సీత , శివుని మధ్య సోదర సోదరి సంబంధం వున్నదని మీకు తెలుసు. క్షీరసాగర మధనంలో భాగంగా వచ్చిన లక్ష్మీ దేవిని విష్ణువు స్వీకరించారని...ఆమేతో ఉద్భవించిన హలాహలం ని శివుడు స్వీకరించారని బుధజనులకి తెలుసు...అందువల్లనే లక్ష్మీ దేవి శివునికి సోదరి అయినది. మరి సోదర సోదరిమణులు ఇరువురునూ సమాన శక్తి కలవారు...హలహలంతో ఆమె జన్మించితే....ఆయన హలాహలాన్ని గరళంలో నిలిపి లోక రక్షణ చేసినాడు. చాలామంది ధనం విషంతో సమానం అనే మాటకి అర్ధం ఇదే...ధనం , విషం కలిసే పుడతాయి అనే నానుడి కూడా ఇక్కడి నుంచే వాడుక....
మరి సోదరిగా శివశక్తి సీతకి వశపడటం అతి సులభం....
అందుకే సీత బాలికగా వున్నప్పుడు అది సాధ్యపడుతుందా లేదా అన్న దైవపరిక్షని జాగ్రత్తగా నిర్వహించినవాడు నారదుడు.
హమ్మయ్య అది సాధ్యపడింది దైవప్రణాళికలో ఓక భాగం పూర్తి అయినది....వారు చూడండి ఎంత జాగ్రత్తగా చేస్తున్నారో...ప్రకృతి అయిన సీతకి పరిక్షపెట్టి అందులో ఆమే ఉత్తీర్ణత నిశ్చయించి తదనంతరం మాత్రమే పురుష రూపం అయిన శ్రీరామచంద్ర పాత్ర ప్రవేశం....
మనం అయినా వ్యవసాయంలో దుక్కి దున్ని...దమ్ముచేసి...నీరు పెట్టి తదనంతరం విత్తనం చల్లుతాం...అందుకే క్షేత్ర రూపం స్త్రీ రూపం అయిన సీతకి ముందు బాలికగానే పరిక్ష...తదనంతరం బీజరూపం , పురుష రూపం అయిన రాముని ప్రవేశం...పరిక్షా నిర్వాహణ.
మరి సీత పరంగా మీరు నా ఆలోచన తెలుసు కున్నారు.... మరి రాముని పరంగా ఏమిటి అన్నది తెలుపుతాను....
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు అని సృష్టి స్థితి లయలు వారి నిర్వాహణ భాధ్యతలని మీకు తెలుసు.....
శివుని ధనస్సు ఏ పరిస్థితి లో దేవరాతుని వద్దకు వచ్చినది....సతీదేవి వియోగ సమయంలో శివధనస్సు అక్కడ విడవ బడుతుంది... శివుడు సతిదేవి వియోగాన్ని భరించలేడు....మరి నారాయణ స్వరూపం అయిన శ్రీరాముడు భవిష్యత్ లో వచ్చే భార్యవియోగం తట్టుకుంటాడా లేక శివుని వలే ప్రవర్తిస్తాడా అన్నదానికి ఓక సమాధానం మనకూ మార్మీకంగా తెలియచేస్తున్నారు. సతిదేవి వియోగం లోని శివధనస్సు ఇంకనూ శివుని స్పర్శ వలన ఆనాటి తాలూకు భావనలు దానిలో నిక్షిప్తమై వున్నాయి.....
అందుకే ఆభారం దాన్నీ ఆవహించినది....అసలే శివుడు లయకారుడు...అందునా ప్రళయ సమయంలోని ధనస్సు ...స్థితి కారుడైన నారయాణుడు ఎలా నిభాయించుతాడు....
ఆత్మనిగ్రహం , మనోనిగ్రహం పూర్తిగా కల రాముడు అలవోకగా శివధనస్సు తన చేతిలోకి తీసుకోగానే లయకారుని లయతత్వం స్థితికారుని చేతిలోకి అలా రాగానే తనలక్షణం కోల్పోతుంది....అందుకే రాముడు శివధనస్సు అల్లేత్రాడు దానికి బంధించి నారి సారించే సమయంలో ఫేటిల్లున అది విరిగి పోతుంది.... దైవనిర్ణయం సక్రమంగా అమలుపరచబడుతున్నదని విశ్వామిత్రుని కి తెలుస్తుంది.... తద్వారా మనకి....
సీత ఈనాడు పూర్ణ యవ్వన వతి. ఆమే శ్రీరాముని చూసి ఆకర్షణకు లోనవుతుంది...కాని రాముడు ఆమేని దర్శించిననూ తన ఆత్మనిగ్రహత వలన తన భావం ఏమిటో ఆంగీక వాచక లక్షణాలలో ప్రదర్శించక..గుంభనంగా...అంటే స్త్రీ పూర్వకంగా వచ్చే మార్పులకు రాముడు లోనవుతాడా లేదా అనే ప్రాధమిక పరిక్ష...
ఓకే ఇదంతా పౌరాణికం...ఏమిటో మీరు...ఏనాటి కాలంలో జరిగిన వాటిని మీ సంఘటనకి అన్వయింపచేస్తున్నారు అనే బుద్ధి జీవులకి ఇంకోక్కటి.....
శివధనస్సు... శివుని శక్తికి మరో రూపం అని.
శివుడు సదా కాలరూపునిగానే మనం భావించాలి.....
మీకు కాలం బాగున్నది...సరే కృతజ్ఞతతో పరమేశ్వరార్చన...మీకు కాలం బాగోలేదు...ఆయన కరుణకి పరమేశ్వరార్చన...
మన దైనందిన జీవితాలలో పరమేశ్వరార్చన అంత విశేషం ప్రాముఖ్యత వహిస్తుంది....
మరి సీత , రాములకి సాధ్య పడింది అంటే ఆ కాలం పెట్టే పరిక్షలకి ఎవరైతే తట్టుకొని నిలబడతారో వారికే శివధనస్సు యొక్క శక్తి వారికి మాత్రమే సమన్వయపరచ బడుతుంది అనేది మనం తెలుసుకోవాలి.
అందుకే త్రేతాయుగం నాటి సీతారాములు ఈనాటికి మనకు ఆరాధన పూర్వక దంపతులు అయ్యారు.
ఇది శివధనుర్భంగంపై శ్రీరాముని దయవలన నా ఆలోచనలు.....
సర్వులకు శ్రీరామ జయం.
సర్వం శ్రీరామజయం...
శ్రీరామ చరణం దొరికితే చాలు నా ఈ జీవితానికి...
ఆయన కృపాకటాక్షంకై....
శ్రీరామజయం...
మిత్రులకి , విమర్శకులకి సదా స్వాగతం.
మీ తాలుకు సందేహలకి సమాధానం
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
94401 72262.
94401722
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.