4, ఆగస్టు 2020, మంగళవారం

మా అమ్మతో వాట్సప్ డైరి - 1

ఈ బ్లాగు నామధేయమే..మా అమ్మ పేరు.
కాకపోతే ఈమే మా మమ్మి 2.0.
ఇదిగో ఈ మాట అంటేనే ఆమే అలిగేది ఆగ్రహించేది. నా తల్లి కీ.శే. సుభద్రాదేవి గారు నన్ను శ్రావణ బహుళ విదియ , 09/08/1968 న ఈ లోకానికి పరిచయం... నేను కన్న తల్లి సుభద్రాకీర్తి చైత్ర పౌర్ణమి రోజు 15/04/1995 న..నన్ను మురిపించటానికి , నాతో మాట్లాడటానికి , నాతో ఆడటానికి , నన్ను లాలించటానికి , నన్ను పాలించటానికి అబ్బో ఓకటేమిటి..అన్నియునూ ఆమే అంతట ఆమే అన్న రీతిలో , దీనికి తోడు ఆమే కృష్ణ అనురక్తురాలు , దానితో ఆమే నాకు సజీవ కృష్ఢ స్వరూపం... ఆమే ఆట, పాట, కోపం అన్నియునూ నాకు లీలా వైభవాలే...
దీనితో ఆమే నాకు అమ్మ , అమ్మి , అమ్మరో , స్వాములు , స్వామి వారు...ఇవే పదాలతో పిలుపు...
అదేమిటో నా హృదయ తంత్రి ఇంకనూ ఆమేను..చిన్ని బుజ్జి పిల్లగానే గుర్తింపు...
ఇన్ని విశేషాల మధ్య..ఆమే..MCA First class లో ఉత్తీర్ణత...
యుక్తవయస్కురాలు అయ్యారు మా మమ్మి వారు.
దైవం అనుకూలించిన అల్లుడు గారు... సతీష్ చంద్ర గుప్తా గారు... వీరి వివాహం ఫిబ్రవరి 14, 2019 న...వాలంటైన్స్ డే రోజున..
మా అమ్మాయి...ఓ చైతన్య ఝరి...మా అల్లుడు గారు నెమ్మది వివేక వంతులు...ఆయన మాకో వరప్రసాదం..మా అమ్మాయి కి కొంగు బంగారం... వారిద్దరి మధ్య స్నేహం మాకో ముచ్చట... నా భావన ప్రకారం.. దంపతుల మధ్య వుండ వలసినది ...మొదప స్నేహం...తదుపరి దాంపత్యం..
ఇన్ని సంగతుల మధ్య..మా అల్లుడు గారు..మా అమ్మాయి తో అమెరికా చేరిక...దానితో రోజు...నా వాట్సప్ సందేశాలు...
వాటిల్లో కొన్ని మీకు అలా...
10/3/2019, 6:33 PM
మమ్మి
జయహో మాత శ్రీ అనసూయ... రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి...
అమ్మరో...
జాగ్రత్త....
 శ్రీ చక్ర సంచారణి...నా తల్లి... నన్ను ఏలు నా కల్పవల్లి....
10/3/2019, 8:35 PM: స్వామి వారిని మరువ వద్దు...
 అన్నిటా అంతటా ఆయనే...సతతం నిరంతరం...ప్రతి పని ఆయనకు చెప్పు....నిరంతర నామ ధ్యానం...నీకు డెస్టిని చేరటానికి ఉపయోగపడుతుంది.
డబ్బు జాగ్రత్త....
18/03/2019
వరాలు
వజ్రాలు
వైఢూర్యాలు
రత్నాలు
పగడాలు
గోమేధికాలు
పుష్యరాగాలు
మరకతాలు
మాణిక్యాలు
ముత్యాలు
పచ్చలు
కెంపులు
ఇంద్రనీలమణులు
.ఇవి అన్నీ ...
మా బంగారం.

[19/3/2019, 10:28 AM] Alapati Ramesh Babu: లావోక్కింతయి లేదు ధైర్యం విలోలంబైయ్యే...

పై పద్యం నీకు చాలా సార్లు వినిపించా కాని ఆనాడు నీవు చిన్నదానివి , నా సంరక్షణ లో వున్నదానివి...కాని నీవు నేడు అమెరికాలో భర్త తో ఒంటరి కాపురం..
ఈ సమయంలో ఆత్మస్థైర్యం అన్ని విధాలా అవసరం.
 స్థిరంగా వుండు...
 స్వామి పై స్థిరచిత్తంతో ముందుకు వెళ్ళు...
సదా జాగురుకత...
21/03/2019
జిజ్జోయమ్మ...
గుడ్ మార్నింగ్...
ఈ రోజు హోలి.
స్వామికి వసంతం చల్లి...
మీ ఆయన మీద కూడ చల్లు...
అలాగే పాలు , తీపి ప్రసాదం గా పెట్టు...
హోళీ హోళి ర హోళి చమ్మ కేళిర హోళి...
అనందం సంతోషం నిండుగా మెండుగా ప్రతి రోజు పున్నమి వెన్నేల లా సరదాగా కలసి మెలసి వుండాలని 
హోళి శుభాకాంక్షలు.
01/04/2019
అమ్మ మీరు అమెరికా వెళ్ళి నెల రోజులు అయింది. ఆ దేశం వాతావరణం మీకు బాగున్నదా...
అల్లుడు గారు మీరు అరమరికలు లేకుండా చక్కగా వున్నారు అని భావిస్తున్నాను.
మీరు సతిష్ గారిని భర్త గా కాకుండా ఓ స్నేహితులు గా భావించండి....పొరపచ్చాలు లేకుండా చల్లగా చక్కగా సాగిపోండి. మిమ్మల్ని కూడా సతిష్ గారు భార్యగా కన్నా ఓ స్నేహితురాలుగా మెలిగే విధంగా చూడండి. జీవితంలో ప్రతిక్షణం మధురమే  దానిని అనుభవంనకు సదా సిద్ధంగా వుండండి.
మీ అమ్మ మంచిదే కాని ఇంటలెక్చువల్ కాదు అందువలన ఆమె స్థాయి కి నేను వెళ్ళినా నా భావజాలం ఆమెకు ఏన్నటికి అర్ధం కాదు...ఇది అలా కొనసాగుతున్న జీవన నాటకం.
 మీరు చదువుకున్నావారు జీవితం పట్ల ఓ దృక్పథం ఓ లక్ష్యం వున్నవారు అందులోను పరిణితి చెందిన కాలం.
మీకు మీ చిన్నప్పుడు సౌకర్యాలు తెలుసు పెరిగిన తరువాత నా ఆర్ధిక పరిస్థితి తెలుసు. 
ఇలా అనేక రకాల వత్తిడిలు ఇబ్బందులు మధ్య దైవకృపతో మీ వివాహం చేయగలిగా...
డబ్బు అనే సౌకర్యం తప్పితే మిగిలినవి బాగానే వుంటవని నామనసు చెపుతుంది.
నేను మిమ్మల్ని ఈ విషయం మీద ఏమన్నా ప్రశ్న వేసినా తప్పు , వేయకున్నా తప్పు... నా బంగారు తల్లి ఈ రెండిటికి మధ్య వున్న సన్నని గీతను మీరు అర్ధం చేసుకుంటారని నా భావం.
ఓ తండ్రిగా నా బిడ్డ సదా చిరునవ్వుతో వుండాలని కోరిక....

13/04/2019
అమ్మీ ! ఉదయాన్నే ఏన్నింటికి లేస్తున్నారూ...
ఇంకా 2 మినిట్స్ లీలలు కొనసాగుతున్నవా...
( మా అమ్మికి ఓ అలవాటు... నేను ఉదయాన్నే..ఎన్ని సార్లు లేపినా..2 మినిట్స్.. అదో ప్రహసనం..కాని వాళ్ళమ్మ..ఓక్క పిలుపే..ఈమే సిద్ధం)
15/04/2019
అమ్మరో!
మండువేసవిలో వెన్నేల ఉదయం అంటే ఈ బుజ్జి బంగారం ...ఓరే నేను వచ్చేస్తున్నా అని కొండమీద నుండి వచ్చారట....
కలిమితో , బలిమితో , సౌభాగ్యం తో కలకాలం వర్ధీల్లాలని... మా ఆకాంక్ష.....
శతమానం భవతి...
జయహోమాత శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి...
20/04/2019
No matter how old my daughter get , She'll always be my baby girl.
21/04/2019
ఇది ఏలా వున్నదో తెలుసా....
కోర్టు లో జడ్జిగారి దగ్గర "యువరానర్ ! అని ప్రారంభించి అనేక సెక్షన్లు అనేక క్లాజులు ఉదాహరించుతూ రెండు గంటలు పాటు అనర్గళంగా వాదించితే సింపుల్ గా వాదన "కొట్టివేయటమైనది" అని ఓక్కమాట లో తేల్చివేశారు.... అలా వున్నది...
అసలు మీ స్వామి వారు వచ్చి ఈ రోజు మీ అమ్మాయి పాలు ఇవ్వకుండా బజ్జీలు పెట్టిందంటూ ఏవో కంప్లైంట్స్ చెపితే పోవయ్యా బాబు మా మమ్మీ వారు మీ మాటే వింటారు కదా అంటే..అదేప్పటి మాట అమెరికా విమానం ఏక్కిన దగ్గర నుండి ఆమె నేనే వింటున్నా ...నా మాట వినటంలేదు...అని ఎదురుమాటలు.....
పోనిలే అని ఆయన చూపించిన బజ్జీల ఇమేజ్ తో అనాలసిస్ చేసి కారణం మీకు చెపితే....మీరేమో సింపుల్ గా ok అని ఓక్కమాటతో తేల్చారు...
అదిదా....ఈ రోజు కధ...
సరేనా తల్లీ.....
జయహోమాత శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి......
అంగరక్ష ఆదిరక్ష మా అమ్మకి సర్వకాల సర్వావస్థలందు సర్వేశ్వరుని రక్ష శ్రీరామ రక్ష...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.