5, ఆగస్టు 2020, బుధవారం

శ్రీరామచంద్రుడు - పరిశీలన - సీరిస్ - 1

రాముడు -   పరిశీలన సీరిస్ - 1
*******************************
రాముడు భరతవర్ష ఆత్మ. మిత్రులు గమనించారో లేదో నేను భారతదేశం అన్న పదం ఉపయోగించలేదు...భరతవర్ష అనే మన పూజాదికాలలో సంకల్పం లోని పదం... కారణం పౌరాణిక భారతవిస్తారం చాలా చాలా విస్తృతం కనుక...ఇంత భూభాగం పై రాముని ప్రభావమున్నది అనుటలో సందేహం లేదు. మిత్రులు ఈనాటి రాజకీయ ,మత ప్రాభవాలు కాదు...త్రేతాయుగం నాటి నుంచి నేటి కాలం వరకు రాముడు వారి వారి సమాజాలలో సాహిత్యం లో వారి మనస్సులో వారి కుటుంబ సాంప్రదాయాలలోకి చొచ్చుకుపోయేలా ఓ ప్రత్యేక స్థానం లభించేలా వుండటానికి...రాముని కధ జన కధగా ప్రతి ఓక్కరి జీవనానికి ఆధారసూచికలా మారటానికి గల కారణాలు మనం పరిశీలించటమే ఈ కధనం ముఖ్యోద్దేశ్యం.......
రాముడు దశవతారాలలో ఏడవదిగా మనకు మొదటసారిగా భాగవతం పరిచయం చేస్తుంది. వాల్మీకి రామాయణం రాముని వైశిష్ట్యాన్ని రాముని జీవనప్రయాణాన్ని మాత్రమే పరిచయం చేస్తుంది. రామాయణంలో మొదట ఉత్తర కాండ లేదని...తదనంతర కాలాల్లో అది ప్రక్షిప్తమని వాదించేవారు కోకొల్లలు. రాముని జీవనగాధ ఎంత సరళమో ఆచరణ అంత సంక్లిష్టమైనది...కారణం రాముని జీవతం లోని ప్రతిక్షణం ప్రతి అడుగు ధర్మబద్ధంగా వేదప్రమాణంగా పూర్వుల ఔన్నత్యం భంగపడని రీతిలో అదేసమయంలో తనతో కలసివున్నవారితో కల ఆత్మీయసంబంధాలు మానవ జీవత ప్రమాణాలలో ఉదాహరణకు నిలిపే విధంగా సాగింది. ఇంతటి సంక్లిష్టతగా మనకు తోచిననూ రాముడు అవలీలగా పాటించుతూ ఇది ధర్మం ఇది జీవనవిధానం అని పాటించి చూపాడు. ఈ మహకావ్య నాయకుని ఇంత గొప్పగా తీర్చిదీద్దటం వాల్మీకి వారికి తప్ప ప్రపంచంలో ఏభాషలోను మరే రచయిత చేయలేని చేయని ఓ అద్భుత పాత్ర రాముడు.
అది అలా అలా జనుల జీవన వేదం గా నిలచిపోయింది.
అసలు రాముడు వైశిష్ట్యాన్ని రామునితోనే ముడి పడినదా లేదంటారు రఘువంశకర్త కాళీదాసు... ఈ రఘువంశంలో రాముని పూర్వ తరాలు వారి విశిష్టత మనకు వివరంగా చెపుతారు...
సూర్యుడు , సంధ్య లు వంశమూల పురుషులైతే
రాముడు వీరి పరంపరలో 62వ తరం వాడు....
మనకు రఘువంశం లో రాముని పూర్వులు ఇక్ష్వాకుడు ,నాభాగుడు, మాంధాత ,సత్యవ్రతుడు ,హరిశ్చంద్రుడు ,సగరుడు, దీలిపుడు,భగీరధుడు ,అంబరీషుడు,రఘువు ,అజుడు ....ఈయన కుమారుడే దశరథుడు... ఇంతటి వంశక్రమంలో దశరధునికి మాత్రమే పుత్రకామేష్ఠి యాగ ఫలితంగా శ్రీరామ జననం గా మనకు తెలియవస్తుంది. మీకు ఇంత వివరంగా తెలుపుటకు కారణం...శ్రీమన్నారాయణుడు వైకుంఠం వీడి పూర్ణ మానవ అవతారంగా తన ప్రకటన వుండాలంటే ఆ వంశం ఏంత గొప్పగానో మరియు ఏంతటి ధర్మదీక్షాపరులో ఏంతటీ పట్టుదల కలవారిగా వుండాలో తెలిసిన వారు కాబట్టి ఏర్చి కూర్చి కోరి మరి ఈ వంశంలో తన జననం...పోని అది అయినా దశరధుడు , కౌసల్య సంయోగ ఫలితమా కాదే నిస్సాంతన పరితాపాన్ని కలిగించి ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ...పుత్రకామేష్ఠి యాగ ఫలితంగా మాత్రమే రాముని అవతార ప్రకటన....అనగా రాముడు అగ్నితః జన్మించినవాడయినాడు...అగ్ని సర్వాన్ని పునీతం చేయ గల శక్తి కలది....
అలాగే రాముని లక్షణాలు వారి వంశమూలపురుషుల ఓక్కోక్కరి శక్తి...రాముడు వీరందరి జీవనం లో కల మూలన్ని గ్రహించినవాడై సంపూర్తిగా ఆ విధంగా ఆచరించి చూపాడు....పట్టుదల సగరుని నుంచి... దీక్ష భగీరధుని నుంచి... సత్యవాక్పరిపాలన హరిశ్చంద్రుడు నుండి...ఇలా అనేకానేకం....
అందుకే రాముడు జీవితంలో కఠిన సందర్భం అరణ్యవాసం పాలంచే ముందు స్వయంగా తండ్రి సలహ ఇస్తాడు...నాయనా రామా! నేను వృద్ధుడను చాంచల్యం చే ఏనాడో వరం ఇచ్చాను...అది ఈనాడు కాలం తెచ్చిన కఠిన పరిక్షలా మారింది.... అదియినూ నేనూ నీ జీవితం పై నిర్ణయం తగదు కనుక నీవు నా నిర్ణయాన్ని తోసిరాజనే హక్కు వున్నది...ఎలాగు అంతఃపుర అధికారం నీ తల్లిదే కనుక...నీవు నన్ను ఖైదు చేసి రాజుగా వుండూ....అని కోరినా...రాముడు ఓకపరి సున్నితంగా మరొకంత కఠిన పదాలు ఉపయోగించిననూ...మీ సలహ విని నేను ఈనాడు రాజ్యపాలన చేస్తే...నేను వంశంలో తప్పు పుట్టినవాడినవుతాను....మీతో సహ నా పూర్వుల ఔన్నత్యాన్ని నేను కాలరాచిన వాడినవుతాను ....అయిననూ ఆత్మావై పుత్ర నామాసి అనే ఆర్యోక్తి ప్రకారం మీరే నేను....కనుక ..మీ వారసుడు గా మీ హక్కులు నాకు సంక్రమిస్తున్నప్పుడు యధావిధిగా మీ భాధ్యతలు నాకు దఖలు పడతాయి... అందునా ఈసమయంలో మీరు పాలకులు మేమంతా పాలితులం...కాకపోతే రేపు నేను పాలకుడను అవ్వాలి మరి ఇటువంటి సమయంలో మీ స్వార్థం గురించి నన్ను ధర్మం తప్పమనే హక్కు మీకు లేదు...పాలకుడుగా రాజశాసనం ఆచరించండి అని రేపు నేను చేయబోయే ఆజ్ఞకు ఈనాటి మీమాట ప్రకారం మిమ్మల్ని ఖైదు చేసి అధికారంలో వస్తే విలువ వుండదు...అయిననూ మన అంతఃపురం ఏవరు లేని ఏకాంతం కాదు...మీ అంతరంగం కాదు...ఇది ఓ బహిరంగ రహస్యం..దాసదాసీజన నిండిన ఈ అంతఃపుర విషయం రేపు రాజ్యం అంతా ప్రాకటానికి ఎంత సమయం పడుతుంది... మరి ఆసమయంలో నేను ప్రజల దృష్టిలో హినుడను హేయమైన పని చేసినవాడుగాను స్వార్థపూరిత వ్యక్తిగాను...అందులో భరతుడు లేని ఈ విపత్కర సమయంలో మీ వరప్రభావంచే అతనికి బదాలాయించవలసిన రాజ్యాధికారం నేను కుట్రతో కుయిక్తులతో నేను స్వాధినపరచుకున్నట్టు అవుతుంది.... ఏమి చేయగలం సిద్ధాన్నం సిద్ధించటానికి నాకు యోగ్యత వున్ననూ కాలం అనుకూలించటం లేదు....ఇలా కొనసాగుతుంది....ఇటువంటి ఆత్మవిచక్షణ రాముని ఆజీవనపర్యంతం కొనసాగుతుంది...సీతాగ్నిప్రవేశంలోను...సీతాపరిత్యజంలోను ఇటువంటి సన్నివేశం వచ్చింది...వీటి వివరణ మరియొక పరి....
మిత్రులు...
నమస్కారం.... అసలు ఈ రామ రావణ వైరుద్ధ్యాలను వివరంగా తెలియచెప్పాలనే ప్రయత్నం... అదేమిటో రాముని పై నా ఆలోచన కొనసాగుతున్నంత సేపు రావణునిపై రాయబుద్ధి కాలేదు...అందునా..ఇది ఓక వ్యాసంలో పూర్తి అయ్యే లక్షణం కనపడటం లేదు...రాముడు అనుగ్రహించ నంత వరకూ...ఇంకనూ ఇంకనూ నా అభిప్రాయం లను మీ సముఖానికి తీసుకుని రాగల ప్రయత్నం... అంతయినూ ఆయన కటాక్షము వల్లనే సాధ్యం.... సకలం సర్వం శ్రీరామ జయం.
మీ సందేహం సమాధానం....
ఆలపాటి రమేష్ బాబు...
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
94401 72262.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.