ఒక అందాల అద్బుతం, ఒక వసంత సమీరం, మెరిసే మెరుపు, అనంత ఆత్మీయత, ఒక అల్లరి, ఒక పెంకి, కొద్దిగా కోపం, ఇంకొద్దిగా అలక, అందరికన్నా చిన్నది, అన్నిటా తానే, ఒక అనంత శక్తీ రూపం, అమ్మకు బొమ్మ, అన్నయ్యకు ముద్దుల చెల్లి ,నాన్నకు "అమ్మ"........అమ్మ అంటే నిజంగా అమ్మ
2, ఆగస్టు 2012, గురువారం
22, జులై 2012, ఆదివారం
భారతదేశం లౌకికరాజ్యం అన్నమాట నిజమేనా?
ఈ శీర్షిక ఇలా పెట్టినందుకు చాల మందికి అభ్యంతరముగాను మరికొద్ది మందికి ఇబ్బందిగాను తోస్తుంది. కాని నేటి వార్తాపత్రికలలో ఈ క్రింది వార్త చదివిన తరువాత నాకు సందేహం వచ్చింది. అది కూడా తెలుపుతాను.
ముస్లిం ఉద్యోగులు ముందే వెళ్లొచ్చు..
రంజాన్ ప్రార్థనలకు అనుమతిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, జూలై 21: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం సాయంత్రం 4 గంటలకే ఆఫీసుల నుంచి వెళ్లేందుకు ఉత్తర్వులిచ్చిందని ఏపీ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ ఆలీ, మహమ్మద్ అబ్దుల్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పై వార్త నా సందేహం నకు కారణమైనది,
ముందుగా ముస్లిం సోదరులకు రమజాన్ మాస శుభాకాంక్షలు.వారికి పవిత్ర మాస౦ ప్రారంభం అయినది. వారి మత ఆచారం ప్రకారం ఈ మాస౦ లో దాదాపు ఆవకాశం వున్న ముస్లిం మత అవలంబీకులు ఉపవాస దీక్ష నిర్వహిస్తారని సర్వులకు తెలుసు. అది పవిత్రమైనది సంతోషకరమైనది.కారణ౦ వారి ధార్మిక ప్రవర్తనకు మనకు ఆనందమే.కాని వారికి మాత్రమే ఇటు వంటి ప్రత్యేక ప్రతిపత్తి ఈ మాసంలో కల్పిస్తున్నారు మంచిదే.
మరి హిందువులకు కార్తిక మాసం అంతే పవిత్రం అన్న సంగతికూడా లోక విదితమే. ఈ మాసంలో హిందువులకు ఉపవాస దీక్షలు,అభిషేకాలు,వ్రతాలు ఇలా ఎన్నో ఆచారవ్యవహారాలు ఉన్నాయి అన్నస౦గతి కూడా విదితమే. మరి ప్రభుత్వం ఆనాడు హిందువులకు అటువంటి ప్రత్యేక అవకాశం కల్పించ గలదా?
మరి ఇటువంటిదే క్రైస్తవులకు క్రిస్టమస్ మాసం ఉన్నప్పటికీ వారికి శుక్రవారం,ఆదివారం ప్రార్ధనలు మాత్రమే ఉన్నట్లు నాకు ఆవగాహన.మరి వారికి కూడా ఇవ్వగలరా?
అటువంటివి అందరికి కల్పించటం సాధ్యం కానప్పుడు వీరి ఒక్కరికే ఎలా ఇవ్వగలుగుతున్నారు?ఇదే బంతిలో వలపక్షం అన్న భావనలు తప్పు.
లౌకికరాజ్య భావనకు ఇది విరుద్ధం కాదా?
మెజారిటి వోట్లు సంపాదించిన వారు అధికారంలోకి వస్తారు. మరి ఈ సూత్రం మాత్రం అన్నిటా మాత్రం వర్తించదు.
వివక్ష వు౦డకుడదు.దీనికి కారణం మాత్రం వ్యక్తుల కుహనా లౌకిక వాదం, కొంతమంది స్వార్ధ బుద్ధి.
ఎవరైనా వారి వారి మతం తరుపున మాట్లాడటం తప్పా వారికి మతవాదులు అన్న ముద్ర ఎలా?
ఇలా ఎన్నో ప్రశ్నలు?
చెప్పండి భారతదేశం లౌకిక రాజ్యం అన్నది ఎంత వరకు సబబు.
21, జులై 2012, శనివారం
దశరధ కృత శని స్తోత్రమ్ - అసలు ప్రతి
పై స్తోత్రం దశరధ కృత శని స్తోత్రమ్ ఈ స్తోత్రమ్ చాల వెర్షన్స్ లో కనబడుతుంది. నేను షుమారు 10 రకాల వెర్షన్స్ చూసి వుంటాను. కాని శని తత్వానికి దగ్గరగా ప్రాచిన సాంప్రదాయంగా ఒక వరుసలో వుండేది ఇది మాత్రమే.
ఇది దేవనాగారలిపి లో వున్నది. తెలుగులోకి మార్చు కొని చదువుకోవాలి.
మిత్రుల స్పందన బట్టి ఆ కార్యక్రమం చేయాలి.
20, జులై 2012, శుక్రవారం
గోవర్ధనగిరి - కృష్ణ లీలా విశేషం
గోవర్ధన ఘట్టం మహాభాగవత౦ లోని శ్రీకృష్ణలీలావినోదాలలో ఒకటి గా కనిపించిన తరచి చూచిన ఒక చక్కని విశేషం మనకు గోచరిస్తుంది.
నందగోకులము లోని యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. మరి గోవులకు అవసరమైన గ్రాసం నకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి. ఈ పర్వతం పై వున్న పశు సంభంద ఆహారం గోవులకు ఆహారంగా స్వీకరించి యాదవులకు పాడి అనుగ్రహించేవి. ఈ పర్వతం పైన ఈ గ్రాసం పెరుగుటకు జలం అవసరం, ఈ జలం వర్షం ఆధారంగా వుండేది.
అందువలన యాదవులు మేఘాలకు ప్రభువైన ఇంద్రుడు తాము గోవుల్ని మేపే గోవర్ధన గిరి మీద వర్షాలు కురిపించి పంటలు పండించటానికి ప్రతి సంవత్సరం ఇంద్ర యాగం చేస్తుంటారు.
కాని ఒకనోకనాడు కృష్ణుడు ఈ యాగ నిర్వాహణను అడ్డుకొన్నాడు.మనకు ప్రధాన వనరు గోవర్ధనం కనుక నాకు గోవుల్ని,బ్రాహ్మణులని,గోవర్ధనం ను అరాధి౦చుదామ్, ఇంద్ర యజ్ఞం నాకు సమ్మతం కాదు అని సర్వులకు నచ్చచెప్పి ఇంద్ర యజ్ఞ నిర్వహణ నిలుపుదల చేస్తాడు.
దీనితో యాదవులందరు గోవర్ధన ప్రదక్షిణతో అచలవ్రతం చేయనారంభిస్తారు.
ఈ విషయం గమనించిన ఇంద్రుడు మహోగ్రంతో యాదవులను శిక్షించ పూనుకుంటాడు. ప్రళయకాల గర్జన్లతో విద్యుత్ సమాన మెరుపులతో కారు మబ్బులతో ధారపాతమైన వర్షం ను గోకులం పైన ఎడ తెరిపి లేకుండా కురిపిస్తాడు. కొద్ది సేపటికే ప్రజలు అక్కడ జీవనం సాగించలేని పరిస్థితి నెల కొన్నది. దీనితో యాదవులందరు శ్రీకృష్ణుని శరణాగతి కోరటం తో స్వామీ గోవర్ధనగిరిని తన చిటికిన వ్రేలిపై ధరించి సర్వప్రజలకు,గోవులకు రక్షణ కల్పిస్తాడు. ఈ విధంగా 7 రాత్రులు 7 పగళ్ళు నిరంతర వర్షం కురుస్తున్న తనను శరణాగతి కోరిన వారికి రక్షణ కల్పిస్తాడు.తన ఆశ్రయం లో వున్న వారికి తాము ఇన్ని రోజులు వున్నాం అనే భావన రాకు౦డా యోగమాయ ద్వార వారు ఆనందసాగరం లో వుండే విధంగా అనుగ్రహిస్తాడు.ఈ విధంగా ఇంద్రుని గర్వభంగం చేస్తాడు.
ప్రజలందరు గోవులను కాపాడిన వాడు కాబట్టి గోవిందుడు అని పొగడుతు తమ నివాసాలకు తిరిగి చేరుతారు.
స్థూలంగా భాగవతంలో ఈ ఘట్టంలోని కధ ఇది.
మరి మనం కధగా చదువుకొ౦దామా లేక స్వామీ లీల యొక్క విశేషం గ్రహి౦చుదామా?
ఈ విశేషం పై పండిత అంతరార్ధం వేరుగా వున్నది, స్వామీ వారి అనుగ్రహం పై కలిగిన భావనను ఇక్కడ తెలుపుచున్నాను.
గోవర్ధనం అనేది ఒక అచల పర్వతం.గోవులకు అవసరమైన ఆహరం సమృద్ధిగా లభించు ప్రదేశం. అలాగే కొ౦డ అంటేనే సకల జీవజాలంనకు ఆవాలం. గోవును కామధేను ప్రతి రూపముగా కొలుస్తాము.కామధేనువు సర్వదేవ ఆవాసం గా కొలుస్తాము.అలాగే గోవు ఆనాటి ప్రజల సిరిస౦పదలకు మూలం. ఎన్ని గోవులు వుంటే అంత సంపద. పురుషుడి వలన వంశం,గోవుల వలన పాడి సమృద్ధిగా పెరుగుతాయని ఆర్యుల నమ్మకం.అదే పౌరాణిక గాధలో నిక్షిప్తం.అలాగే ఇంద్రుడు అష్టదిక్పాలకులకు అధిపతి.రాజుతో సమానం. సర్వులు ఆయనకు లోబడి వుండాలి.
కాని విశ్వ సంరక్షకుడు విష్ణువు ఈనాడు శ్రీకృష్ణ అవతారంలో నందగోకులం లో వుండి శిష్ట రక్షణ చేస్తున్నాడు.
అ౦దువలన సర్వ ప్రజలు పరమాత్మను కొనియాడుతున్నారు.కాని కృష్ణుడు ఈ సమయములో ఇంద్రునికి పూజని అడ్డుకోవటము వలన ఇ౦ద్రునిలొ ఈర్ష్యతో రగలి ప్రకృతి నియమ విరుద్ధముగా వర్షము,తన పాలిత ప్రజలపై తానే దాడికి పూనుకొన్నాడు.దీని వలన ప్రాణకోటికి ఇబ్బంది.కాని ఆసమయములో కృష్ణుడు గోవర్ధనమును తన చిటికిన వ్రేలి పై నిలిపి ప్రాణకోటిని,ప్రకృతిని రక్షించాడు.
సర్వజన హితం కోరే కార్యం సాధించ పూనినప్పుడు ఎవరు ఎన్ని ఆటంకములు తలపెట్టిన,రాజు తాను గాని,తన ఆదినములోని వ్యవస్థల ద్వారా కాని అడ్డుకోవడం జరిగినప్పుడు.దిక్కులన్ని ఏకమైన ప్రకృతి నియమ నిభందనలకు విరుద్ధముగా జరిగిన,జరుగుచున్న కార్యక్రమములు అన్నిటిని అడ్డుకొని బహుజన హితమే తన లక్ష్యమని అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాను అని తెలపటమే ఈ గోవర్ధనగిరి ఘట్ట లక్ష్యం గా నేను భావిస్తున్నా!
19, జులై 2012, గురువారం
ఆది శంకరులు స్థాపించిన మఠ స్థాపనం - పంచలింగ స్థాపనం.
ప్రజలు,ప్రభువులు ఆదరిస్తున్న అద్వైత తత్వం శాశ్వతంగా కొనసాగాలనీ మానవులందరు ఒక్కటే అనే ఐక్యమత్య భావం వర్ధిల్లాలనీ శంకరులు భారతదేశం నాలుగు దిక్కులా నాలుగు అద్వైత ప్రచార స్థానాలు ఉండాలనీ సంకల్పించారు.
తూర్పున జగన్నధ క్షేత్రం పూరిలొ గొవర్ధన మఠం పేరుతో ఓక అద్వైత పీఠాన్ని ఏర్పరచి, దానికి అధిపతులుగా పద్మపాదాచార్యుల వారిని నియమించారు.ఇది ఋగ్వేద ప్రధాన క్షేత్రం.
దక్షిణములొ శృంగేరి శారదా పీఠం ఏర్పరచి దానికి సురేశ్వరాచార్యుల వారిని అధిపతులగా నీయమించారు.ఇది యజుర్వేద ప్రధాన క్షేత్రం.
పశ్చిమంలో ద్వారకలొ కాళికా పీఠాన్ని నెలకొల్పి దానికి హస్తామలకాచార్యుల వారిని అధిపతులు గా చేశారు.ఇది సామ వేద ప్రధాన క్షేత్రం.
ఉత్తరంలో బదరీ క్షేత్రములొ జ్యొతిర్మఠాన్ని ఎర్పరచి, దానికి అధిపతులుగా తోటకాచార్యులవారిని నియమించారు.ఇది అధర్వణ ప్రధాన క్షేత్రం.
ఈ విధంగా శంకరుల భాధ్యత శిష్యుల భుజస్కంధాలమీదకు వచ్చింది.ఆనంతరం ఆయన బదరికాశ్రమంలొ ఉండి, తమ పరమ గురువులైన గౌడపాదులవారిని దర్శించారట.
పంచలింగ స్థాపన: శంకరులు కైలాసం నుంచి ఐదు స్పటిక లింగాలను తీసుకొని మరలా దక్షిణాభిముఖంగా భారతదేశ పర్యటనకు బయలు దేరారు.
మొదట కేదార క్షేత్రంలొ ఒక స్ఫటిక లింగాన్ని స్థాపించారు. అది ముక్తిలింగం మని ప్రసిద్ధి చెందినది.నేపాల్ నీలకంఠ క్షేత్రంలొ వర లింగాన్ని,చిదంబరంలొ మోక్ష లింగాన్ని, శృంగేరిలో భోగ లింగాన్ని, కంచిలో యోగ లింగాన్ని ప్రతిష్టించారు.
శంకరులు ఈ విధముగా 4 మఠాలు, 5 స్ఫటిక లింగాలను స్థాపించి.కంచికామకోటి పీఠంలొ తామే అధిపతులుగా ఉంటూ సమస్త కార్యపర్యవేక్షణ సాగించారు.
18, జులై 2012, బుధవారం
"నారాయణీయం" గురించి కొన్ని విశేషాలు.
మేల్పత్తూర్ నారాయణ భట్టతిరి నంబూద్రి వంశ బ్రాహ్మణుడు. ఆయిన 1560 లో జన్మించారు.అనన్య సామాన్య అకుఠింతటదీక్షతో 16 సం లకే వేదవిద్యలు, ధర్మ శాస్త్రాలను ఆయిన గురువైన శ్రీ పిషరడీ గారివద్ద అభ్యసించారు.వీరు గురువు గారికి గురుదక్షణగా తనసంపూర్ణ అరోగ్యాన్ని సమర్పించి వారి దీర్ఘకాల వ్యాధీయిన వాత రొగాన్ని తాను స్వీకరించిన మహానుభావుడు.గురువు గరికి ఉపశమనము లభించినది కాని భట్టతిరి గారికి వాతరోగం దుర్భరమయినది.దీనిని తప్పుకొవటానికి భగవంతుని కరుణ తప్ప వేరు మార్గము లేదని తలచి గురువాయూర్ నందు నారాయణుడు స్వయంభూవుగా వున్నాడని గురువాయూర్ చేరి ఆ నారాయణుని ప్రస్తుతిస్తూ భాగవత రచనా కార్యక్రమాన్ని ప్రారంభించాడు.ఇది 100 రోజుల పాటు కొనసాగింది.నారాయణ భట్టతిరి రచన మరియు నారాయణుని గాధ కనుక "నారాయణీయము" అని పిలువ బడింది.
ఈ రచనాకాలములో భట్టతిరీ గారి అనన్య భక్తికి మెచ్చి కృష్ణుడు స్వయముగా వినేవాడని,మధ్య మధ్యలో అంగీకార సూచికముగా తల,కరముల కదలికతో తన అంగీకారాన్ని తేలిపేవాడని అనేక గాధలు వున్నాయి.
నరసింహావతారాన్ని వ్రాసే ముందు అవతార అవిర్భావము ఎలా వర్ణించను, సింహాన్ని ఎలా వర్ణించను అని చింతన చేస్తే ఎదురుగావున్న రాతి స్థంభము ఫెళ ఫెళా విరిగిపొతు అందులో భీమ ఉగ్ర నరసింహ రూపాన్ని కని నరసింహావతారము వ్రాశాడని.అలాగే సీత హనుమకు చూడామణి అనుగ్రహించే ఘట్టములో ఒక పదము వ్రాస్తే భావపరిపూర్ణత రాక మధనపడుతుంటే సరి అయినా ప్రత్యామ్నాయాన్ని కృష్ణుడు చూపించాడని ఇలా అనేక గాధలు ప్రచారములో వున్నాయి.
ఇలా నారాయణీయము పూర్తి అగిసమయానికి భట్టతీరి గారి ఆరొగ్యము గుణపడి సంపూర్ణారొగ్యం చేకూరినది.ఆయిన చరమ శ్లొకముగా ఇలా వ్రాసాడు
"కృష్ణా! బుద్ధికి గాని, ఇంద్రియాలకు గాని కనిపించనది నీ అవ్యక్త రూపము.అది సామాన్యులకు ఉహకు కూడా అందదు.కనుక వారికి ఫలితము దుర్లభమే.కానీ ఈ గురువాయూర్ లో నీ ప్రత్యక్ష తేజ స్వరూపము అపూర్వము.అతి మనొహరము.ఈ శుద్ధ సత్వాన్ని అశ్రయించి పునః పునః ప్రమాణాలు అర్పణ చేస్తున్నాను నన్ను అనుగ్రహించు అని పలుకగా ఉత్తర క్షణములో పరమాత్మ ఎట్టేదుట సాక్షాత్కరించాడు.
17, జులై 2012, మంగళవారం
భగవదారాధనలొ ముద్రలు
భగవదారాధనలొ ముద్రలకూడా స్థానం ఉన్నది. ముద్ర అంటే ఎమిటి? అంటే ఓక రూపానికి ప్రతీకాత్మకముగా వ్రేళ్ళను, చేతులను వివిధ ఆకారాలలొ ముడచి,పెనవేసి,ఆరాధన సమయాలలొ భగవంతునికి ఆరాధన పూర్వకముగా చూపటమని సూక్ష్మమముగా చెప్పవచ్చు.అంతే కాకుండా యోగవిధానలలో మొత్తం శరీర భాగం పంచుకోనే ఒక ఆచరణ అని కూడా చెప్పవచ్చు. నృత్యరీతులలొ సంగీతమునకు,లయ స్వరలకు తోడుగా, జతులు తో సహితముగా నృత్య భంగిమలో భాగముగా అది నటరాజ అర్చనలో ఓక భాగముగా అక్కడ భావిస్తారు.
" ముదం కుర్వంతి దేవానం రాక్షసాన్ ద్రావయంతీచ" అన్నదాన్ని బట్టి దేవతలకు సంతోషాన్ని,సంతృప్తిని కలిగిస్తుంది.రాక్షస శక్తులను పారద్రోలుతుంది కాబట్టి ముద్ర అనే పేరు వచ్చిందని విష్ణుసంహిత తెలుపుతున్నది.దేవతల యోక్క అర్చన,జప,ధ్యానములలొనే కాక కామ్యకర్మలలొ ను విగ్రహ ప్రతిష్ట,ఆవాహన,నైవేద్యము,విసర్జనలలో వివిధ ముద్రలు ఉపయోగించబడతాయి.
ముద్రలు అనేకాలు పురాణాలలో పేర్కోని వివరించబడ్డాయి బ్రహ్మండ,ఆగ్ని,నారద,బ్రహ్మ,దేవిభాగవతాలలొ ముద్రలను గురించిన విస్తృత వర్ణన వున్నది.గాయత్రీ జపం చేసటప్పుడు ఉపయోగించే 24 ముద్రలు,నిత్యం సంధ్యావందనం చేసే వారికి అనుభవమే.కాళికా పురాణములో 108 ముద్రలు ఉన్నాయని తెలుపుతున్నది. జైనులు.బౌద్ధమతస్థులు కూడా తమ ఆరాధనలో ముద్రలను ఉపయోగిస్తారు.
ముద్రలలొ ఆవాహని,స్థాపని,సన్నిధాపన మొదలైన తోమ్మిది ముద్రలు చాలా సాధారణముగా అన్నిరకాల అర్చనలలో అర్చన విధానలలో ఉపయోగించబడతాయి.శంఖముద్ర,గదాముద్ర,వారాహిముద్ర,పరశుముద్ర మొదలైనవి విష్ణువు ప్రియమైనవిగా మనపురాణాలు పేర్కోంటున్నాయి.
" ముదం కుర్వంతి దేవానం రాక్షసాన్ ద్రావయంతీచ" అన్నదాన్ని బట్టి దేవతలకు సంతోషాన్ని,సంతృప్తిని కలిగిస్తుంది.రాక్షస శక్తులను పారద్రోలుతుంది కాబట్టి ముద్ర అనే పేరు వచ్చిందని విష్ణుసంహిత తెలుపుతున్నది.దేవతల యోక్క అర్చన,జప,ధ్యానములలొనే కాక కామ్యకర్మలలొ ను విగ్రహ ప్రతిష్ట,ఆవాహన,నైవేద్యము,విసర్జనలలో వివిధ ముద్రలు ఉపయోగించబడతాయి.
ముద్రలు అనేకాలు పురాణాలలో పేర్కోని వివరించబడ్డాయి బ్రహ్మండ,ఆగ్ని,నారద,బ్రహ్మ,దేవిభాగవతాలలొ ముద్రలను గురించిన విస్తృత వర్ణన వున్నది.గాయత్రీ జపం చేసటప్పుడు ఉపయోగించే 24 ముద్రలు,నిత్యం సంధ్యావందనం చేసే వారికి అనుభవమే.కాళికా పురాణములో 108 ముద్రలు ఉన్నాయని తెలుపుతున్నది. జైనులు.బౌద్ధమతస్థులు కూడా తమ ఆరాధనలో ముద్రలను ఉపయోగిస్తారు.
ముద్రలలొ ఆవాహని,స్థాపని,సన్నిధాపన మొదలైన తోమ్మిది ముద్రలు చాలా సాధారణముగా అన్నిరకాల అర్చనలలో అర్చన విధానలలో ఉపయోగించబడతాయి.శంఖముద్ర,గదాముద్ర,వారాహిముద్ర,పరశుముద్ర మొదలైనవి విష్ణువు ప్రియమైనవిగా మనపురాణాలు పేర్కోంటున్నాయి.
16, జులై 2012, సోమవారం
అంబోధి,జలధి,పయోధి,ఉదధి, వారాంనిధి,వారిధి
అంబోధి,జలధి,పయోధి,ఉదధి, వారాంనిధి,వారిధి ఈ ఆరు పదాలు సముద్రానికి పర్యాయపదాలుగా వాడుక. కాని ఇన్ని పదాలు వెనువెంటనే ఇదే క్రమములో పద్యము ఏవరైనా చెప్పగలరా అంటే ఈ నాటికాలములో కొద్దిగా కష్టము కాని పూర్వ కాలములో ఇది సులువుగా జరిగే ఓ క్రియ. ఈ పద్యము శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రీ గారి కృషి ఫలితముగా వెలువడిన "చాటుపద్య మణిమంజరి" లోనిది. దీని తాత్పర్యము కూడా చిన్న కధలా చెప్పుకోనవచ్చును.
ఓకనాడు కైలాసములో సవతుల మధ్య రచ్చ జరిగింది. భవాని ఎమో తన పుత్రుడు కార్తికేయునితో ఫిర్యాదు చేసింది. తల్లి అంటే అభిమానము మెండుగా కలవాడైన షణ్ముఖుడు, అసలే కోపధారి తండ్రీ వద్దకు వేళ్ళి విషయము ప్రస్తావించాడు.ఆసమయములో శివుడు,షణ్ముఖుడు మధ్య జరిగిన సంభాషణే ఈ పద్యము.
శ్లో!! ఆంబా కువ్యతితాత!మూర్ధ్ని విహిత గంగేయ మత్సృజ్యతాం
విద్వన్ షణ్ముఖ కాగతి ర్మయి చిరం తస్యాస్థ్సితాయ వద
రోషోత్కర్షవశా దశేషవదనైః ప్రత్యుత్తరం దత్తవా
నంబోధి ర్జలధిః పయోధి ర్వారాన్నిధి ర్వారిధిః.
తాత్పర్యము: "నాన్న అమ్మకు కోపము వస్తున్నది. నీ తల మీద ఉన్న ఈ గంగను విడచిపెట్టు".కుమారాస్వామి! నీవు అన్నీ తెలిసినవాడవు కదా! ఇన్నాళ్ళూ నా నెత్తిమీద ఉన్న అమెగతి ఏం కావాలో చెప్పు. ఆ మాటవినగానే కోపం పట్టజాలక " అమెకు ఏమిగతి అంటావా-" అంబోధి,జలధి,పయోధి,ఉదధి, వారాంనిధి,వారిధి అని ఆరుముఖాలతో ఒక్కమాటే చెప్పాడు.
14, జులై 2012, శనివారం
కొన్ని మంచి మాటలు!
ధర్మఏవ హతో హంతి, ధర్మోరక్షతి రక్షతః
తస్మాద్ధర్మోన హంతవ్యో మానో ధర్మోహతోవధీత్
ధర్మాన్ని బాధిస్తే అది తిరిగి మనల్నే బాధిస్తుంది.ధర్మాన్ని రక్షిస్తే అది మనను రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నాశనం చేయకూడదు.ధర్మం నశించి మనలను నశింప చేయకుండుగాక.
----------------------------------------------------------------------------------------------
అష్టాదశ పురాణానం సారంసారం సముద్ధృతం
పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం.
18 పురాణాల సారాన్ని పిండగ పిండగా తేలినది ఏమనగా పరోపకారం చేస్తే పుణ్యం - పరపీడనం చేస్తే పాపం.
----------------------------------------------------------------------------------------------
అన్నంన నింద్యాత్, తద్రవతము - తైత్తరీయ సంహిత.
అన్నాన్ని పారవేయటము కాని, అగౌరపరచటముకాని,వ్యర్ధపరచటముకాని చేయరాదు.శ్రద్ధగా చేయాలి.
-----------------------------------------------------------------------------------------------
గుణాః పూజాస్థానం గుణిఘ నచ లింగం న చవ వయః
గుణాలే గౌరవానికి కారణం.గుణవంతుల విషయంలో లింగభేదం కాని వయోభేదం కాని పాటించకూడదు.
-----------------------------------------------------------------------------------------------
కరార విందేన పదార విదం,ముఖారవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటేశయానం,బాలం ముకుందం మనసాస్మరామి.
పద్మం వంటి తన పదాన్ని,పద్మంవంటి చేతితో, పద్మంవంటి నోటిలో చోప్పిస్తూ మర్రి ఆకుదొన్నెలో శయనించియున్న బాలముకుందునికి మనసా నమస్కరిస్తున్నాను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)