17, ఏప్రిల్ 2012, మంగళవారం

ప్రారబ్దము - నిజమయిన సంఘటన.



ప్రారబ్దము బహుశా ఈమాట తెలీయని ఆస్థిక జనులు వుండరు. మనము చేసిన కర్మల ఫలితము ప్రారబ్దము.ఈ విషయాన్ని నిరుపించటానికి శ్రీ పి.వి.అర్.కె.ప్రసాద్ గారి పుస్తకము "ఆసలేంజరిగిందంటే..." లొని ఆఖరి 2 పేజిలలొని వారుతెలిపిన వ్రుత్తాంతము మీరుకూడా తెలుసుకొవాలని ఇక్కడ పరిచయము చేస్తున్నాను.ఇక ఇక్కడినుంచి వారి మాటల్లొనే.

.
గుంటూరులో నేను చదివిన హిందు కలేజీ హైస్కూల్లో క్రిష్ణారావు మాష్టారని ఇంగ్లిష్ ఉపధ్యాయులుండేవారు. అందరు విద్యార్థులు గౌరవించే ఉపధ్యాయిడు.మహాదైవభక్తి పరుడు.అనునిత్యం జపతపాలు. ఆయినకు 13 మంది పిల్లలు.మాష్టారుగారి అబ్బాయి సదాశివ నాసహధ్యాయి.మాష్టారు ఉద్యొగములొ వున్నరొజుల్లొ పెద్దజబ్బు చేసి మాట పడిపొతే 2సం. శెలవు పెట్టి ఆధ్యాత్మిక సాధన చేసి మాట్లాడగలిగే గలిగే శక్తి సంపాదించుకున్నరు.కొద్దికాలము తరువాత సదాశివను కలిసేసమయానికి ఆతను టి.బితొ హాస్పటల్ లొవున్నాడు. అతనికిపైన చాలామంది అక్కలు,అన్నలు వుండాలి.కాని వాళ్ళంతా పెద్దవాళ్ళయ్యాక చనిపోయారు.నన్ను చూసి సదాశివ ఏడ్చేసాడు.                      
మానాన్నకు మిగిలింది నేను మాతమ్ముడూ.వాడింకా చిన్నవాడు.నేను సంపాదనకొచ్చే సమయానికి ఇలా జరిగింది,నేను బ్రతకను,మాకు ఆస్తిపాస్తులు లేవు మా అమ్మా,నాన్న ఎలానొ ....అంటు వలవలా ఏడ్చాడు. తరువాత కొద్దిరొజులకు సదాశివ చనిపొయినాడు.

మాష్టారి కుటుంబము ఎక్కడికెళ్ళీపోయారో తెలీదు ....14సం.తరువాత, ఒకమిత్రుడిద్వార మాష్టారు పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలొ వున్నారని,హైదరాబద్ మూసినది ఒడ్దున ఒక తాటాకులపాకలొ నివాసము. మాష్టారి దర్శనమునకు వెళ్ళాను.
నేను వెళ్ళెసరికి మాష్టారు చిన్న తుండుగుడ్డకట్టుకొని పూలుకొసుకుంటున్నారు.బాగాముసలివాళ్ళూఅయిపొయారు.ఆవిడా ఆలాగే ఆవస్థపడుతూ నీరు మొసుకొనివస్తొంది.ఆయిన నన్ను గుర్తు పట్టటానికి సమయముపట్టింది.ఆయిన చేప్పిన విషయాలు విని నిశ్చేష్టుడయినాను ! 
       రొజు కొన్ని గంటలుపాటు భగవద్ధ్యానము లొ మాత్రమే మునిగిపొయే భక్తుడి 13మంది పిల్లలొ ఒక్కడు కూడా ఆయిన వ్రుద్ధాప్యములొ మిగలలేదు.మరి ఆఖరివాడు ?...వాడు మానసికముగా ఎదగలేదు.మాతొనేవుంటే చచ్చిపొతాడని దత్తత ఇచ్చెసామయ్య  కాని వాడు కూడా బతకడు" అన్నారు నిర్వెదముతొ. ఆయిన అన్న ప్రతిమాట నాకు గుర్తుంది...నేను గంటలకొద్దిసమయము ఆసర్వేశ్వరుడి పూజలొనేగడుపుతున్నాను.నాకు ఇన్నికష్టాలు ఎందుకు ఇచ్చావని అడగటానికికాదు .నాకు తెలుసుకదా!ఎదొజన్మలొ చెసిన కర్మఫలాన్నె  అనుభవిస్తున్నాను.... 80ఎళ్ళు దాటాయి దుఖము అలావాటయిపొయింది.శరీరభాధ భాధనిపించదు.దుఖము ఎడుపుతెప్పించదు ...ఇంకా మంచిరొజులు ఎమివొస్తాయని ఆశించాలి ?. ఈచేతులమీదుగా పెళ్ళిడుకువొచ్చిన, చేతికి అందివొచ్చిన 12 మంది పిల్లలకు దహనకాండలు చేసిన తండ్రినయ్యా ...అయినా ఇప్పటికి గంటలతరబడి జపతపాల్లొ ఆరధిస్తున్నానంటె - ఈ కష్టాన్ని అనుభవించె శక్తి ఇమ్మని, కనీసము ఇతరులనయిన సుఖశాంతులతొ బ్రతకనిమ్మని కొరటంకొసమే." లొకాసమస్తాసుఖినొభవంతు  అని ప్రార్ధించటము ఒక్కటె చెస్తున్నను ... నాసమస్యల్లా నాభార్య వుండుండి రొదిస్తుంటె ఎలావొదార్చాలొ తెలియకపొవటము.జీవించినంతకాలము  పొట్టగడవాలి గదా? ఎలా?ఎలా? ఆందరు సుఖంగావుండాలని దేవునిప్రార్ధించటానికయినా నాకు శక్తి వుండాలిగదా...!?  ఆంతటి దుఖములొను,ఆంతటినిస్సహాయస్థితిలొను ప్రజలందరు బాగుండాలని దేవుని ప్రార్థించే మాష్టారుకు మించిన ఆదర్శంవుంటుందా?....


     ఇదండి ప్రారబ్దం అంటే.ప్రసాదుగారు తరువాత మాష్టారుకు తిరుమలనుంచి సహాయము ఇప్పించారు.        
        

7 కామెంట్‌లు:

  1. పి వి ర్ కె ప్రసాద్ గారు నిజంగ భగవంతుని దర్సించిన మహ మనిషి.ఆయన ప్రతి పనిలొ సామిని దర్సించిన మహ భక్థ సిఖామని. hare srinivasa.

    రిప్లయితొలగించండి
  2. nenu chadivaanandi aa pustakam ..మా ఇంటి ఎదురుగా ఒక కుటుంబం వుండి ..వారి అరవై సంవత్సరాల వయసు దాటిన సమయంలో ఒక్కగానొక్క కుమారుడు పక్షవాతంతో మంచాన పడ్డాడు. .ఇంజనీరింగ్ చేసి మంచి సాఫ్ట్వేర్ కంపనీలో వుద్యోగం చేసేవాడు . వున్నట్లుండి నేలకూలిన ఆ బాబుకి ఆ తల్లి, తండ్రి చేసే సేవ varnimpalemu ..తండ్రి హార్ట్ ఆపరేషన్ ఐన తర్వాత కూడా మంచి శక్తిని తెచ్చుకుని కొడుకు సేవలో వున్నారు ..ఏమిటి ఈ జీవితాలు .. ఎ జన్మ కర్మలో ఎప్పుడూ మోస్తూనే వుంటాము ..

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. ఏమని స్పందించాలో తెలియటం లేదు,
    ప్రారబ్ధ తీవ్రత ఇంత దారుణంగా ఉంటుందా అమ్మో! అనిపిస్తూనే ఉన్నది ...
    భగవాన్ రక్షా కరో !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమ్మినా నమ్మకున్నా ఇది నిజము. అందుకే తస్మాత్ జాగ్రత్త!

      తొలగించండి
  5. కలిచి వేసింది. ఇలాంటి వృద్ధులకు ఆసరాగా ఏవైనా ప్రైవేట్ ధార్మిక సంస్థలు ఏర్పడితే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  6. ఆ గురువు గారు నిజంగా చాలా గొప్పవారు.

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.