30, ఏప్రిల్ 2012, సోమవారం

శబరి, గుహులది భక్త పారవశ్యమా? మూఢత్వమా?


భగవంతుడు భక్త సులభుడు.ఈవిషయాన్ని అనేక ద్రుష్టాంతాల్లొ నిరూపణజరిగినది.
మరి మనం ఇన్ని పూజలు పునస్కారాలు అని ఇన్ని క్రియలు చేస్తున్నాము.మరి మనకు దర్శనము జరిగినదా అంటే?....... ఇది సమాధానము .కారణము మన వద్ద 'అర్పణ ' ఏది?  ఎవరయితే తన చిత్తాన్ని సకలధా,సర్వదా,ఆ పరంధాముని గురించి  పరితపిస్తారో వారి వద్దకు స్వయముగా తనకుతానుగా సశరీరముగా దర్శనము ఇస్తాడు.

  మరి గుహుని చూడండి అలామదిలో నిలిపినవాడు,రాముని సఖునిగాభావించినవాడు.అంతటి గుహుడు రాముడు నావ ఎక్కబొతె పాదాలుకడిగాడు మూఢత్వమా కాదు అమాయకత్వము.
శబరి వద్దకు రాముడు స్వయముగా  నడచి వస్తే ,ఆమె అంతటి ముదిమిలో ఏదొ చేయాలనే తపన,శరీరము సహరించనందుకూ వ్యధ.కన్నులుకానరాక క్షొభ,కాని మనొనేత్రముతో దగ్ధాయామానముగా రాముడు మదిలో.అలాంటీ రాముడు స్వయముగా తన గుడిసేకు వచ్చి "శబరి" అన్న కమ్మని పిలుపు, అంతకన్నా చల్లని స్పర్శ ప్రసాదించిన ఆశ్రీరామచంద్రునికీ ఆతిధ్యము ఇవ్వాలి! ఏలా? వున్నవొ ఎవొ కొన్ని ఆడవి పండ్లు అవే పెడదాము అన్న తలంపు కాని ఎలావున్నవొ ఎమిటో అని కన్నులకు తెలియక,తీపిగావున్నవా,పుల్లగావున్నవా అని తేలుసుకునేందుకు కొరకటము అదే ఏంగిలి ఆరామునికి అందివ్వటము. ఆయితే ఆయిన అంతకన్నా ఆనందముగా,ఆపేక్షగా ఆ పండ్ల ఆరగింపు.
మరి శబరిది రామునికి ఏంగిలి పెట్టెంతటి మూఢత్వమా ?

కాదు అమాయకత్వముతొ కూడిన భక్త పారవశ్యము.      
మూఢత్వము ఎప్పుడు కారు చీకటే.

కాని, పసిమనస్సులాంటి అమాయకత్వానికి ధ్యాన,యోగాలాంటీ భక్తపారవశ్యము తొడు అయితే.ఆపరంధాముడు సదా,సర్వదా మనతొనే,మనము ఆయినతొనే.

3 కామెంట్‌లు:

  1. గుఃహుడు రాముని కాళ్ళు కడగటం, శబరి రామునికి యెంగిలిపండ్లు పెట్టటం అనే రెండూ వాల్మీకికృత శ్రీమద్రామాయణంలోని సంఘటనలు కావు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామలీయం గారికి నమస్కారములు. వాల్మీకి రామయణానికి జనజీవనములోని రామయణానికి మధ్య అనేక కథలు గాథలు.కారణము రాముడు అందరివాడు. అందుకే ఇన్ని ప్రక్షిప్తాలు. ఇక్కడ నా భావము మూఢత్వానికి,అమాయకత్వ భక్త పారవశ్యానికి వున్న భేధము తెలపటమే కాని వాల్మీకి అంతటివాడిని కాదనే ధైర్యము సాహసము చేయలేను,చేయబొను.
      ఏది ఎమయినా పెద్దలు గురుతుల్యులు మీరు నా పొష్ట్ చదివి కామెంట్ ద్వారా ఆశ్వీరదించినందుకు ధన్యవాదాలు.వీలువున్న నా మిగతా పొష్ట్లు కూడా చదివి అభిప్రాయము తెలిపినా నాకు ప్రొత్సాహకరముగాను. తప్పులు వున్న సరిదిద్దుకొగలవాడను.

      తొలగించండి
    2. గుఃహుని సన్నివేశము ఆధ్యాత్మరామాయణములొ వున్నది.

      తొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.