మహభారతములొ సభాపర్వములొ జూదక్రిడయందు పాండవ ఓటమి తద్వారా ద్రౌపది పరాభవము సర్వులకు తెలిసినదే.ఆమేను నగ్నముగా చూడాలన్న పరిస్థితి వరకు వొచ్చినది.కాని భగవదనుగ్రహము వల్ల ఆమె రక్షించబడినది.ద్రౌపది పదే పదే ప్రశ్నించినా బదులు పలుకలేనతగా అక్కడ వాయు మండలము దూషితము,భారమయిపోయాయి.అధిక సంఖ్యాకులు తమ తలలు తిప్పుకున్నారు మరి భీష్ముడు? భీష్ముడు కూడా స్పష్టముగా సమాధానమివ్వక ధర్మరాజుకే వదిలేశాడు.
దీనికి సమాధానము మనకు భీష్మ నిర్యాణములొనే మనకు తెలుస్తుంది.ఇది మహభారతములో వున్నదా అన్నవిషయము తెలియదు కాని గురుజనుల ముఖతా వినవస్తున్నది.
మహభారత యుద్ధము ముగిసినది.అంపశయ్యపై భీష్ముడు. శ్రీక్రిష్ణ అదేశనుసారము ధర్మరాజు సతిసొదరసమేతుడై అంపశయ్యపై ఉత్తరాయణపుణ్యకాలనికై నిరీక్షిస్తున్న పితామహుని సన్నిధికి రాగా, భీష్ముడు ధర్మారాజకోరికపై సకలరాజ ధర్మాలు బొధిస్తున్నాడు.ఈ ధర్మొపదేశాలు జరుగుతుండగా ద్రౌపది నవ్వసాగింది.అది చూసి పితామహుడు "అమ్మాయి!నువ్వు నవ్వటానికి కారణము ఏమిటి? అని ప్రశ్న.
ద్రౌపది సంకొచిస్తు "పితామహ నావల్ల పొరపాటు జరిగినది" అనిపలుకగా.అంతమాత్రముచే సంతోషపడని వాడై "అమ్మా! శీలవతి ఆయిన ఏ కులవధువూ గురుజనుల,సభాముఖముగా అకారణముగా నవ్వదు.నీవు గుణవంతురాలవు,సుశీలవు నీ నవ్వు అకారణము కాదు, సంకొచరహితంగా నీ నవ్వుకు కారణం చెప్పు" అని అన్నాడు.
అంత ద్రౌపది ముకుళితహస్తయై "పితామహ ఈ విషయము వ్యక్తపరచరానిదీ,అయినా మీరు ఆదేశిస్తున్నారు కనుక చెబుతున్నాను.మీరు నేడు చేస్తూన్న ధర్మోపదేశాలను వింటుంటే నాకు ఆశ్చర్యము భాదకలిగాయి.కారణము నాడు కౌరవ సభలొ దుశ్శాసనుడు నన్ను వివస్త్రను చేసే సమయములో మీ ధర్మఙ్ఞానము ఏమయిపొయింది? లేక ఇంత ధర్మఙ్ఞానము మీరు ఈ మధ్య నేర్చుకున్నరా అని నాకు నవ్వు వచ్చినది.నన్ను పెద్దవారు క్షమించేదురు గాక !
మహభారత యుద్ధము ముగిసినది.అంపశయ్యపై భీష్ముడు. శ్రీక్రిష్ణ అదేశనుసారము ధర్మరాజు సతిసొదరసమేతుడై అంపశయ్యపై ఉత్తరాయణపుణ్యకాలనికై నిరీక్షిస్తున్న పితామహుని సన్నిధికి రాగా, భీష్ముడు ధర్మారాజకోరికపై సకలరాజ ధర్మాలు బొధిస్తున్నాడు.ఈ ధర్మొపదేశాలు జరుగుతుండగా ద్రౌపది నవ్వసాగింది.అది చూసి పితామహుడు "అమ్మాయి!నువ్వు నవ్వటానికి కారణము ఏమిటి? అని ప్రశ్న.
ద్రౌపది సంకొచిస్తు "పితామహ నావల్ల పొరపాటు జరిగినది" అనిపలుకగా.అంతమాత్రముచే సంతోషపడని వాడై "అమ్మా! శీలవతి ఆయిన ఏ కులవధువూ గురుజనుల,సభాముఖముగా అకారణముగా నవ్వదు.నీవు గుణవంతురాలవు,సుశీలవు నీ నవ్వు అకారణము కాదు, సంకొచరహితంగా నీ నవ్వుకు కారణం చెప్పు" అని అన్నాడు.
అంత ద్రౌపది ముకుళితహస్తయై "పితామహ ఈ విషయము వ్యక్తపరచరానిదీ,అయినా మీరు ఆదేశిస్తున్నారు కనుక చెబుతున్నాను.మీరు నేడు చేస్తూన్న ధర్మోపదేశాలను వింటుంటే నాకు ఆశ్చర్యము భాదకలిగాయి.కారణము నాడు కౌరవ సభలొ దుశ్శాసనుడు నన్ను వివస్త్రను చేసే సమయములో మీ ధర్మఙ్ఞానము ఏమయిపొయింది? లేక ఇంత ధర్మఙ్ఞానము మీరు ఈ మధ్య నేర్చుకున్నరా అని నాకు నవ్వు వచ్చినది.నన్ను పెద్దవారు క్షమించేదురు గాక !
అంత భీష్ముడు అమ్మా! నీవు ఈనాడు ఈ ప్రశ్నతో సకలజనులకు ఆనాటి నా మౌనానికి కారణము తెలుస్తుంది అని పలికి.సమాధానముగా ఇలా అన్నాడు "పుత్రీ! నేను నా తండ్రి కొరకు రాజ్యాధికారము వొదలుకొని, నేనుకూడా పాలితుడనయ్యాను.మరియు ఆనాటి నా ప్రతిఙ్ఞప్రకారము నేను నా ఆజన్మపర్యంతము ఈరాజ్యనికి,రాజుకు బద్దుడనయి వుంటాను. మరి ఆనాటి నారాజు దుర్యొధనుడు. అతను నాకుకావలసిన సర్వసౌకర్యాలు సమకూర్చినాడు.అతని దుష్ట పాలన వల్లలభించిన ఆహారప్రభావము వల్ల నేను మౌనముగా వున్నాను.కాని అర్జునుని శరపరంపరలవలన అనేకగాయలు ఆయినాయి, ఈగాయాల నుంచి ఆ కలుషిత అన్నప్రభావముచే ఉత్పన్నమయిన రక్తము పొయినది.ఈనాటి దేహములొ నామాత్రుగర్భమునుంచి వొచ్చినప్పుడున్న రక్తము వున్నది . అదియును గాక ఈనాడు ఈరాజ్యానికి రాజు ధర్మరాజు అతని ప్రభావము అప్పుడే ప్రారంభించినదని ఇది సూచన.ఆదియునుగాక నేను ఈనాడు స్వేచ్చాజీవిని".
మరి భీష్మునిలాంటి మహమహుల ప్రతిచర్యకు ఒక అంతరార్ధంవుంటుంది.
***********************లోకా సమస్తా సుఖినోభవంతు ****************************
సరైన వివరణే కాని ఎందుకో తృప్తిగా లేదు.
రిప్లయితొలగించండిభీష్ముడిని తప్పుపట్టే అర్హత నాకు లేదు గాని, దేశ/ప్రజా హితం రాజహితానికి కన్నా గొప్పదైన ధర్మం కాదా! ఏమో!
తాను అధర్మ పక్షములో ఉన్నాడన్న సంగతి భీష్మునికి తెలుసు. అధర్మానికి సహకరించిన దేహాన్ని ధర్మయుద్దములో త్యాగము చెయ్యాలని సంకల్పించే యుద్దము చేశాడు.
రిప్లయితొలగించండిప్రజాహితం కోసము తల్లిచెప్పినట్లు విని వివాహము చేసికొన్నచో అతడు అవతారపురుషుడయ్యేవాడు. కానీ తన ప్రతిజ్ఞను ఎలా ధిక్కరించగలను అన్న విషయంలో సరియైన ధర్మమునకు తలొగ్గొకపోవటము వలన మహాభారత యుద్దము వరకు వచ్చినది. శ్రీకృష్ణుడంత వాడయ్యునూ అవతారపురుషుడు కాలేకపోవటానికి అదే కారణము.
చక్కటి పోస్ట్ వేశారండి. ,.SNKR గారి ....భీష్ముడిని తప్పుపట్టే అర్హత నాకు లేదు గాని, దేశ/ప్రజా హితం రాజహితానికి కన్నా గొప్పదైన ధర్మం కాదా ! ఏమో...అన్న వ్యాఖ్య చదివిన తరువాత నాకు తెలిసింది వ్రాయాలనిపించింది.
రిప్లయితొలగించండిరాముడు తండ్రి యొక్క ప్రతిజ్ఞాపాలన కోసం వనవాసం చేస్తే, భీష్ముడు తండ్రి కొరకు తాను చేసిన ప్రతిజ్ఞను తప్పటం ఇష్టం లేక అలా ఉండిపోయారు. భీష్ముని కధ వల్ల , ఆహారశుధ్ధి నుంచి చిత్తశుధ్ధి ఏర్పడుతుంది అన్న ముఖ్య విషయం లోకానికి తెలిసింది. ఆహారశుధ్ధి అంటే మనం తీసుకునే ఆహారం ధర్మబధ్ధమైన సంపాదన నుంచీ పొందినదై ఉండాలి. దుర్యోధనుని వంటి అధర్మబధ్ధులైన వారి నుంచి పొందిన ఆహారం వల్ల భీష్ముని వంటి గొప్పవారికి కూడా ఇబ్బందులు వస్తాయని తెలిసింది.
అందుకే మనం ఇతరులనుంచి ఆహారం స్వీకరించటం విషయంలో చూడవలసినది వారు ధర్మపరులా ? లేక అధర్మపరులా ? అని. కౌరవులు అధర్మపరులైనందువల్ల వారి నుండి స్వీకరించిన ఆహారం వల్ల భీష్ముడంతటి వారికి కష్టాలు వచ్చాయి.
అందుకే అందరూ ధర్మబధ్ధమైన విధంగా సంపాదించిన సొమ్ముతో పొందిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని పెద్దలు పురాణేతిహాసాల ద్వారా తెలియజేస్తున్నారు అనిపిస్తుంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిanrd గారు, మీరు చెప్పింది బాగుంది. ఇక్కడ 'భీష్ముడికి కష్టాలు ' అంటే యుద్ధంలో మనమడిచేతిలో క్షతగాత్రుడవడమనేనా? ఆ పరిస్థితి ఇరువైపులా కలిగింది, అతనికి ఒక్కడికే కాదు. కృష్ణుడి చేతనే ఆయుధం పట్టించిన ఘనత భీష్ముడిది. భారతంలో 'ఒక్కడు' టైపు అని ఎవరా అని తిరగేస్తే, భీష్ముడి తరవాతా ఎవరైనా అనే అద్భుత వ్యక్తిత్వం భీష్ముడిది.
రిప్లయితొలగించండి**భీష్ముని వంటి మంచివారు దూరంగా పోకుండా దుర్యోధనుని వద్ద ఉండటం వల్ల రాజ్యంలో చెడ్డపాలకుల వల్ల జరిగే అనర్ధాలు కొన్నింటినయినా ఆపగలుగుతారు.
రిప్లయితొలగించండి** ఇక భీష్ముడికి కష్టాలు అంటే , యుద్ధంలో మనమడి చేతిలో క్షతగాత్రుడవడవటం కూడా కష్టమే. **ఇంకా, . తండ్రి కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహామనీషి భీష్ముల వారు. అంతటి గొప్ప భీష్ముడు, .......... ద్రౌపదిని పరాభవించటానికి దుశ్శాసనుడు ప్రయత్నించిన సమయంలో మౌనాన్ని వహించారనే నిందను పడవలసి వచ్చింది .. భీష్ముడంతటి గొప్పవారికి లోకనిందను మోయవలసి రావటం పెద్ద కష్టమే ..
** దుర్యోధనుని వంటి దుష్టుల వల్ల లభించిన ఆహారప్రభావము వల్ల ఆ సమయంలో తాను అలా మౌనంగా ఉండటం జరిగిందని వారు చెప్పటం జరిగిందట. దీనిని బట్టి మనం తీసుకునే ఆహారం మనపై ఎంత ప్రభావాన్ని చూపుతుందో అన్న విషయం అర్ధమవుతుంది. ( ** ఇది భీష్ముని వల్ల లోకానికి అందిన గొప్ప సందేశం. ఇది తెలుసుకుని, అందరూ ధర్మబద్ధమైన ఆహారాన్ని పొందటం వల్ల లోకంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. )
** ఇంకా , ఇతరుల వద్ద ఆహారం స్వీకరించే విషయంలో గమనించవలసింది ఎదుటి వ్యక్తి యొక్క గుణాన్నే కానీ సంఘంలో అతని పలుకుబడిని కాదు అని తెలుస్తుంది. అందరూ ఈ విషయాన్ని గమనించి ఆచరిస్తే మనుషుల మధ్య ఎన్నో వైషమ్యాలు తగ్గుతాయి. ).
**వ్యాఖ్య టపాలా అయిపోయింది . బ్లాగ్ ఓనర్ గారు మన్నించాలి.
సర్వశ్రీ SNKR,anrd,MANGESH గార్లకు, నమస్కారాలు.ధన్యవాదాలు.కామేంట్ లొ వచ్చిన సందేహలన్నిటికి ఇంకొపొస్ట్ సవివరణగా వ్రాయాలి.
రిప్లయితొలగించండిసుభద్ర గారూ!
రిప్లయితొలగించండిభీష్ముడు ధర్మరాజుకి ఉపదేశం చేసినపుడు ద్రౌపది నవ్వే ఘట్టం వ్యాస భారతం మూలంలో లేదండి...
కులస్త్రీ అయిన ద్రౌపది అలా నవ్వి అంపశయ్య మీదున్న భీష్మ పితామహుని అడిగిందంటే...
అది ఆమె తన పెద్దల పట్ల గౌరవం చూపనట్లుగా వ్యక్తమౌతుంది...
నా అభిప్రాయం చెప్పానుసుమండీ!
....@శ్రీ
శ్రీ గారు! రామాయణ,భారతాలలొ చాలా సన్నివేశాలలొ చాలా గాధలు జానపదాలుగా,ప్రక్షిప్తాలుగా వున్నాయి. అలావున్న కధే ఇది. గీతాప్రెస్ వారి భీష్ముడు అనే పుస్తకములో కూడా ఈ సన్నివేశము ప్రక్షిప్తమని తెలిపి ఉదహరించారు. పంచమహప్రతివతలలొ ఓకతి,విద్వాంసురాలయిన ద్రౌపదికి కులవధువు పదిమందిలో నవ్వరాదు అన్న విషయము బాగా తెలుసు కానీ నాటి అవమానము నేటికి దహించుకుపొతుండగా, సభలో సాక్షిగా వున్న భీష్ముడు తన భర్తకు ఉపదేశము పై అమె నవ్వింది. అందుకే భీష్మునికి క్షమాపణ కూడా తెలిపింది.
రిప్లయితొలగించండి