నేరము చేస్తె శిక్షపడుతుంది అనేది సహజసూత్రము.కాని శిక్షకు ఆంతరసూత్రము పరివర్తన.నేరం చేసిన వ్యక్తియొక్క పరివర్తనే శిక్ష యొక్క ముఖ్యొద్దేశ్యము.ఈవిషయన్ని నిశ్చయపరచేది పాండవుల అఙ్ఞాతవాసము.
మనిషి త్వరగా కొల్పొని లక్షణము 'నెనూ అనే స్ప్రహా లేక ఎరుక.దీనిని (ఐడంటికల్ క్రైసిస్) వ్యక్తిగుర్తింపుగా భావించుదాము.వ్యక్తి తను నివాసపరిధిలొ,వ్రుత్తులలొ చిన్న తప్పులు లేక పొరపాట్లకు జరుగు చర్యలకు ఇబ్బందిగా ఫీల్ అయి ప్రతిచర్యగా చాలమంది తద్వారా మరలా ఆతప్పుజరుగకుండా శ్రద్ధ వహిస్తారు.
పాండవులు అరివీరులు,శత్రుభయంకరులు,సొదరసఖ్యత కలవారు ఆందుకు సందేహములేదు.పాండవప్రధముడు ధర్మరాజు పొగడ్తలు,జూదము అన్నది వ్యసనము.రాజసూయయాగముచే పాండవులకు లభించిన ఆపరిమిత సంపద వైభవాన్ని చూసికలత చెందిన దుర్యొధనుని శాంతపరచాటానికి శకుని తనకున్న ఆలొచన చెపుతాడు. దుర్యొధనా! ధర్మరాజు జూదరి,జూదమునకు ఆహ్వానము పంపు వ్యసనపరుడుకాబట్టి ఆహ్వానము మన్నించుతాడు ఆపై నాపాచికలద్వారా అతడిని వొడించుదాము అని సలహా ఇస్తాడు. గాంధారరాకుమారుడైన శకుని గురించి అందరకు తెలిసినదే.శకుని లక్ష్యము కౌరవనాశనము.అందుకు ఆతని ఆయిధాలు మాయొపాయములు,తప్పుడుసలహాలు,తనపిత్రువర్గ అస్థికలతొ చేసిన పాచికలు.
దూర్యొధన ఆహ్వానముపై ధర్మరాజు జూదక్రీడకు రావటము వొడిపొవటము 2సార్లు జరుగుతాయి.కాని ధర్మరాజులొని జూదక్రీడావ్యామొహాన్ని శకుని ఇంకా రెచ్చకొట్టి మరలా ఆడమంటాడు తద్వారా ధర్మరాజు తనను,సొదరులను,భార్యను కూడా వొడతాడు.దీనివలన ద్రౌపదిమానభంగము జరిగినా బుద్ధిరాక మరలా ఆడి వొడి 12సం. ఆరణ్యవాసము, 1సం. అఙ్ఞతవాసము లకు గురీఅవుతాడు.
ధర్మరాజులాంటి అభిమానధనునికి అరణ్యవాసము పెద్ద ఇబ్బంది కలిగించకపొయినా అఙ్ఞాతవాసము పెద్దశిక్షగా మారుతుంది. తను విరాటరాజ కొలువులొ తన క్షత్రియధర్మాని మరచి కంకుభట్టుగా రాజభ్రుత్యుడుగా వ్యవహారము.తనసొదరులు రకరకాల పేర్లు వ్రుత్తులతొ కొలువు. భార్య సైరంధ్రిగా తన కళ్ళముందు తిరుగుతు, కీచకుడితొకూడా ఆవమానానికి గురికావటము.ఇవన్ని చూసిన ధర్మరాజుకు, తనకు,సొదరలకు,భార్యకు ఈపరిస్తితి తనజూద క్రీడవల్లనే అనే చింతనకలిగి పరివర్తనచెందుతాడు. బహుశా అందుకే సభాపర్వములొ జూదక్రిడ, విరాటపర్వము నుంచి స్వర్గారొహణపర్వము వరకు మరలా జూదక్రిడ ప్రస్తావనరాదు.ధర్మరాజు అఙ్ఞాతవాస శిక్షవలన సంస్కరించబడ్డాడని భావించవొచ్చు.
bagumdi
రిప్లయితొలగించండిదుర్గేశ్వరా గారికి, ధన్యవాదములు.
తొలగించండిinni badhalu paddka judhkreeda devudukuda adaledu anadhaniki ee episode okkati chalu. HARE SRINIVASA
రిప్లయితొలగించండిఆదిగారు, నమస్కారములు.బ్లాగ్ ఫాలొ అవుతున్నందుకు ధన్యవాదాలు.మరి జూదాన్ని వ్యసనాలజాబితాలొ చెర్చినది ఇందుకే మరి వ్యసనము దూరము అయ్యి రాజ్యనికి రాజు కావాలంటే ఎలా మరి అదే శ్రిక్రిష్ణపరమాత్ముని లీలావిలాసము.
తొలగించండిశ్రీనివాసుడు మీకు సదా రక్ష.
> విరాటపర్వము నుంచి స్వర్గారొహణపర్వము వరకు మరలా జూదక్రిడ ప్రస్తావనరాదు.
రిప్లయితొలగించండికాదండి. ధర్మరాజుగారు విరాటరాజుగారివద్ద కంకుభట్టుగా ఉన్నప్పుడు ద్యూతక్రీడతో రాజుగారితో కాలక్షేపం చేసేవాడు కదా!
ఏ క్రీడ అయినా పణముగా ధనమో మరిఎదొ వుంచి ఆడితెనె జ్యూదమవుతుంది తప్ప వేరుకాదు.ఇక జూదము వ్యసనముగా మారితే మామూలు వ్యక్తికే అనేక కష్టనష్టాలు మరీ రాజు కావలసిన ధర్మరాజుకు వుంటే దాని వల్ల ప్రజలకు సంభవించే కష్టాలు వీటన్నిటికి స్వయం అనుభవానికే జూదక్రీడాహ్వానము.అపై అఙ్ఞాతవాసము.ఇక పొతే మిరే చెపుతున్నారు మీ కామేంట్ లో ద్యూత క్రీడ కంకుబట్టు విరాటరాజులు ఇరువురు కాలాక్షేపానికి ఆడుతున్నారని ఇక దాని పై ఇంకే వివరణ అనవసరము అనుకుంటా..
తొలగించండి