పంచభూతలింగాల్లో (జ్వాల) తేజోలింగము గా ప్రకాశించేది తిరువణ్ణమలై లొని అరుణాచలేశ్వరుడు.అమ్మవారి పేరు వున్నామలైఅమ్మ.ఈక్షేత్ర ప్రత్యేకము గిరిప్రదక్షిణము.దాదాపు క్షేత్రదర్శనమునకు వొచ్చిన ప్రతిభక్తుడు ఆచరించే ఒక సాంప్రదాయము.ప్రతి పౌర్ణమి రొజు రాత్రి అశేషభక్తకోటి ఈ సాంప్రదాయాన్ని పాటించే తీరు కన్నులారా కానవలసినదే. దాదాపు పౌర్ణమికి 2 రొజుల ముందునుంచే భక్తుల రాక ప్రారంభము అవుతుంది. ఈ రొజులలో యాత్రికులకు బస కొద్దిగాకష్టపడాలి. కాని పౌర్ణమి రొజు రాత్రి పూటచేసే గిరిప్రదక్షిణ లొ నిండు పున్నమి వెలుగులో శిఖరసౌందర్యము కైలాసశిఖర సమానముగా ప్రకాశిస్తుంది.అసలు పూర్తి గిరి,శిఖరము మొత్తము ను ఒక లింగముగా,ఆ ఊరుమొత్తము ఒక దేవాలయముగా భావించుతారు. దీనికి ఆధారముగా గిరికి 4 దిక్కులు,4 మూలల్లొ మొత్తము 8 దేవాలయలు నిర్మించి అందులో ఆయాదిక్కుల, అధిపతుల తాలుకు పేర్లతొ మరల లింగములు ప్రతిష్టించివున్నాయి.అంటే శిఖరం మొత్తాన్ని అష్టదిగ్భందము జరిగినది. సౌరమాన కార్తీకములొని పౌర్ణమి రొజులలొ జ్వాలాదీప ఉత్సవము చేస్తారు. ఆనాడు
శిఖరము పైన వెలిగించే జ్యొతి దాదాపు 30 నుంచి 40కిమి వరకు దర్శనము ఆవుతుంది అంటే జ్వాల పరిమాణాన్ని ఊహించుకొవలసినదే.
ఈ పర్వతముమొత్తము రెండు శిఖరాలుగా ఒకదానితొ ఒకటి ప్రక్కప్రక్కనే శివ,శక్తిల ప్రతీరూపముగా దర్శనమిస్తాయి.మనము గిరి ప్రదక్షిణలొ మనకు ఆగస్తేశ్వర ఆశ్రమము ఒక పాయింట్ ఒకటి కనిపిస్తుంది దానిప్రక్కనే ఒక పురాతన మందిరము కనపడుతుంది ఇక్కడమాత్రమే ఒక పాయింట్ నుంచి శివ,శక్తి శిఖరాల ఐక్యమై ఒక్క శిఖరముగా దర్శనమిస్తుంది. మీరు కనీసము 2 అడుగులు అటు ఇటు వేసినాకూడ మీకు ఈశిఖరాలు 2 వేరు వేరుగా దర్శనమిస్తాయి.
ఈగిరిప్రదక్షిణ మార్గములొనే మనకు రమణాశ్రమము కూడా దర్శనమిస్తుంది.ఒక్కసారి ఆమహనుభావుడు రమణుని దర్శనముచేసుకుంటే మనముకూడ కొంత సంస్కరించబడతాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.