పంచారామాల్లొ అమరావతిది ఒక విశిష్టత.ధాన్యకటక మహాసామ్రాజ్యముగా అపై బౌద్ధము ఫరిఢవిల్లినప్రదేశముగా.ఆపై వాసిరెడ్డివారి పాలన ఇదుగొ విళ్ళందరిని పరిపాలిస్తు అమరేశ్వరుడు.
సూర్యుడిని ఒక దీవిటీ పరిచయము చేస్తుంది అంటే నవ్వుతారు,సాహసము అంటారు.ఆలాగే అమరావతికథలు,రాష్ట్రపతి ఆవార్డ్ గ్రహిత శ్రీ శంకరమంచి సత్యం గురించి నాలాటి చిన్నవాడు వ్రాయటమంటే దుస్సాహసము అవుతుంది,కాని కొన్ని ఆప్త వచనాలు(Nano) కదా అని ప్రారంభము.
గత 6 నెలలుగా అమరావతికథలు పై వ్రాయలని కాని ఆ మేరునగధీర ఆసాహిత్యము గురించి ఎంతొ మందిచెప్పారు కొత్తగా నేను ఎమి చెప్పాలి. కాని మనస్సు ఆరాటపొరాటము ఎందుకొ రాత్రి ఆ అమరుడు నన్ను కరుణించాడు ఒక మార్గము సూచించాడు ఆంతే ప్రారంభం కొద్దిక్షణాల్లొనే చిత్తు ప్రతి సిద్ధము.ఆకథా మేలిముత్యాలొ కొన్ని మాత్రమే.
అమరావతి కథలు ముఖ చిత్రమే ఒకవింత ఒక అద్భుతము బాపు కళానైపుణ్యానికి మరో ఉదాహరణ.అన్ని శబ్దాలు ఢమరకుము లొంచి వొచ్చాయని అని ఒక ఐతిహ్యము, వ్యాకరణసూత్రము. అంటే పరమేశ్వరుడు అన్ని శబ్దాలకు అధిపతి. అలాగే ఆ లొకపావని పార్వతి సకల పరా,శ్రీవిద్యలకు అధినేత్రి ఆలాంటి ఆది దంపతులముందు శంకరమంచిగారు కథ పూజ. శంకరమంచిగారు కథలు చెపుతుంటే అమరేశ్వరుడు చక్కగా సిద్ధ ఆసనములో ఆలకిస్తూ,అమ్మ చెప్పరా అబ్బాయి అంటూ చెక్కిలిన చేయి పెట్టుకొని ఎంత కమ్మగా చెపుతున్నవురా బడుద్దాయి అన్నట్లు చల్లని చూపు.హరుడు ఆలావుంటె నేను లేనా అని క్షేత్రపాలకుడు వేణుగోపాలుడు గోల్లపిల్లవాడిగా మనలాంటి పామరజనాలని ప్రతిబింబిస్తూ ముల్లుకర్ర ఒకచేతిలొ,ఇంకొ చేయి సావధానముగా వింటున్నా అని తెలపటానికి అలా మడచి.విళ్లందరి హడవుడితొ క్రిష్ణమ్మ, గంగమ్మ రూపములొ తన వడి,ఉధ్రుతి తగ్గించుకొని ఎమిటావింత చూడాలని అలా. సకల ప్రాణకొటికి ఆధారమయిన 'సొహం' నాగరాజుగా శంకరమంచిగారి కథానాగస్వరానికి మైమరచి. అన్నట్లు మధ్యలొవున్న ఆవు శివుడి నందా లేక వేణుగొపాలుని గొవా, లేక సకల దేవ ఆవాసమయిన కామధేనువా అన్నది మీ ఊహ.అన్నట్లు మీకు తెలుసుగా ఆమరేశ్వరలింగము బాగా ఎత్తుగా శిఖరమునుతాకుతున్నట్లు ఆందుకే దానిని సూచిస్తూ శివుడు అలా పైదాక .
శంకరమంచిగారి కథ,కథనము,పాత్రల ఏంపిక ఒక అద్భుతము. ఏకథకు అనవసరమయిన వర్ణనలు,పడికట్టుపదాలు,ఇబ్బంది పెట్టె సంధులు,సమాసాలు వుండవు.ప్రతికథ అలా సరాసరిన విషయములొకి అలా మన మనోఫలకములొకి.మీరు మీమనస్సులో అమరెశ్వరుని కేంద్రముగా ప్రతిష్టించుకొండి శంకరమంచిగారు మనలను అమరావతి మొత్తము ప్రయాణము చేయిస్తాడు. అలా రాజబాట,ఉత్తరవీధి,కోట,రేవు అంటుపలు ప్రాంతాల్లొ విహారము చేయిస్తాడూ.మనము కూడా ఈప్రాంతాలన్ని మావే అన్నట్లుగా దర్జాగా వెళ్ళిపొతాము.కథలొని పాత్రలన్ని మాములుగా వుంటాయా చైతన్యముతొ తొణికిసలాడుతుంటాయి .ఇవి అన్ని పాత్రల్లా తొచదు వీళ్ళందరు మనతాలుకు చిరపరిచితుల్లా,స్నేహితుల్లా,బంధువుల్లా,కొన్నిపాత్రలలొకి పాఠకుడు తనను కూడా ఉహించుకుంటాడు.మనసమాజములొని అన్నికులాలు,మతాలు వర్గాలు,రాజు నుంచి పేద దాక పాత్రధారులే.గమ్మతు క్రిష్ణమ్మకూడా పాత్రధారిగా మారిపొతుంది.ఇంతటి కొలాహలాన్ని,సంబారాన్ని, వ్యక్తుల ఆనంద దుఖాలను అన్నింటిని అమరేశ్వరుడు శాంతముగా గమనీస్తునె వుంటాడు. క్రిష్ణమ్మ తన చైతన్యశీలనతొ కాలము నేను ఒక్కటేరా నాన్న అని చెపుతుంది.
మరి ఇన్ని కథలొ కొన్ని అంటే వీటినే ఎంపికనికాదు ఏమిటొ అలాజరిగింది అంతే.
1) పుణుకుల బుట్టలొ లచ్చితల్లి : మన సమాజములో ధనము ఎంత ప్రభావమో ,లౌక్యము,ఎంత అవసరమో తెలియ చెప్పుతుంది. మరి పుణుకుల సుబ్బాయి డబ్బువొచ్చింతరువాత సుబ్బరావుగారు గా మారిన వైనము.
2)రాగి చెంబులొ చేపపిల్ల : అచారలన్ని అర్థం లేనివని. సౌఖ్యముగా వుండటమే ముఖ్యమని సుబ్బమ్మగారి పాత్ర ద్వార చెప్పుతారు.
3) అద్గద్గొబస్సు : యంత్రం, దాని యాంత్రికశక్తి ముందు మానవబలము ఏపాటిది. కొత్తగా వొచ్చిన బస్సువల్ల దెబ్బతిన్న జట్కా సాయిబు జీవనచిత్రము.
4) తులసి తాంబులం : మాములుగా భొజనానంతరం తాంబుల సేవనము భుక్తయాసానికి,అరుగుదలకు అవసరమే కాని జరుగుబాటు లేని ఒక బీదబ్రాహ్మణునికి తులసి తాంబులమే ఆహారము, సకలము, సర్వము.
5) భొజనచక్రవర్తి : పిట్టతిండ్లు, ఒంటి పూటలు,అజీర్తి,గ్యాస్ సర్వసాధరణమయిన ఈ రొజులలొ అప్పంభొట్లు గురించి చదువుతుంటే అలా ఆశ్చర్యపొవలసినదే.
6) నాన్న నది : కాలము,నది ప్రవాహము ఎవరికొసము ఆగవు అలా సాగి పొవటము వాటి లక్షణము.తండ్రి పొయాడని దుఖిస్తున్న సీతయ్యకు తను ఓ బిడ్డకు తండ్రి అని గుర్తుచేసిన వైనo.
7) బలి: అర్థం లేనిగ్రామ కక్షలు ఇరు కుటుంబాల్లొ ఎంతలా హాని చేస్తాయో అని.
8) అటునుంచి కొట్టుకురండి : రాజ్యం తాలుకు కఠినత, పాలకుడు తన పాలితులపట్ల వహించవలిసిన ధర్మము,జాగరుకత.
9) విరిగినపల్లకి : మారిన వేడుకలు,ఆచారాలు,సాంప్రదయాలు వాటిమీద ఆధారపడ్డ వ్యక్తుల జీవన ఛ్ఛీద్రము. పల్లకి సంగడు మారిన సాంప్రదాయలవల్ల ఆదాయము లేక తన జీవనాధారమయిన పల్లకి బొంగుతొ చేసిన గంజిత్రాగ వలసిన జీవన చిత్రణ.
10) అంపకము : ఆడపిల్లను కన్న తండ్రి ఎంత ముద్దుగా మురిపముగా పెంచుకున్నా ఆపిల్లను అత్తారింటికి పంపవలసివస్తే ఆతండ్రి పడే వేదన. తనప్రాణాన్ని,తనమహలక్ష్మిని,తన ఆత్మను ఏవరొ తీసుకుపొతున్నారు అన్న భావన.అల్లుడిచేయి పట్టుకుని అత్తారింటికి వేళ్ళుతుంటే అంపకాలసమయములొ, అల్లుడు చేయు పట్టుకుని అయ్యా! అని పలికిన ప్రతి పలుకు ఆడపిల్ల వున్న ప్రతి తండ్రి గుండెల్లొ అలా గుచ్చుకొంటాయి.
మరి ఇలా ఎన్నొకథలతొ అమరెశ్వరుడికి పూజ. మరి శివుడంటేనే అభిషేకము చివరికథ శంకరమంచివారి అర్పణ మహరుద్రాభిషేకము.
నాకు తెలుసు మీరు ఇవిమొత్తము ఈ పాటికే చదివివుంటారని. కాని, నా త్రప్తికి.వీలుంటె మరలా అమరేశ్వర సాన్నిధ్యములొకి వెళ్ళండి.
ఈ చిన్నప్రయత్నము నచ్చితే కామెంట్ ఆశ్శీస్సులు.
*** లొకసమస్తా సుఖినొ భవంతు ***