5, ఆగస్టు 2020, బుధవారం

శ్రీరాముడు - పరిశీలన - సీరిస్ - 3

రాముడు - పరీశీలన - సీరిస్ 3
**************************
శివధనుర్భంగం

సీతా రామ కళ్యాణం మన తెలుగు వారు అందరికి ఓక పర్వదినం. అది ఏమిటో వివిధ దేవతా రూపాలకు మన తెలుగు నాట వున్న ఆచారంలో కళ్యాణం ఓకటి...ఇది మరే ఇతర ప్రాంతంలోను మనకు కనపడని ఆచారం.
మనం దేవతా రూపాలకు కళ్యాణం చేసి మురిసిపోతాం ఆనందపడిపోతాం. మరీ ఇక సీతారామకళ్యాణమంటే...ఇక ఆ హడావుడి ఊరందరిది...ఆ వైభోగమే కన్నులారా చూడవలిసినదే...అలా ఆ సమయంలో పాటలు పద్యాలు పూజలు..అబ్బో అదో సందడి అదో వేడుక...
రామ లక్ష్మణులు విశ్వామిత్రుని యాగ సంరక్షణ చేసినారు. విశ్వామిత్రడు తన శిష్యులైన రామ లక్ష్మణులను వెంట పెట్టుకుని మిధిలా నగరానికి పయనం. అదే సమయంలో జనకుడు యాగ నిర్వాహణ ...సీతాస్వయంవరం...దీనికి ఓక పరిక్ష...మహ మహిమాన్వితమైన శివధనస్సుని ఎక్కు పెట్టుట...దీనికి " వీర్యశుల్క" గా సీతతో పరిణయం అని ప్రకటిస్తాడు.
మీకు ఇక్కడ జనకుని గురించి కొంత క్లుప్తంగా తెలియచేయాలి.
మిధిలానగరానికి రాజు జనకుడు. వీరు మహ యోగి పురుషులు ఆత్మజ్ఞాన సంపన్నులు.
వీరికి ఇంకో పేరున్నది సీరద్వజుడు. వీరు యాజ్ఞవల్క్యమహర్షి అనుగ్రహం చే...బ్రహ్మత్వం పొందుతారు. వీరి వంశం పేరు నిమి. వీరి వంశ మూల పురుషుడు మిధి. వీరి వంశంలో లో దేవరాతుడు ఆనే అతను దక్షయజ్ఞంలో పాల్గోన్నాడు. దక్షయజ్ఞంలో దక్షుని అవమానంచే సతిదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఈ విషయం తెలిసిన పరమేశ్వరుడు దక్షయజ్ఞవాటికపై తాను మరియి తన అంశ వీరభద్రడు , ప్రమధగణాలు కలసి భీభిత్స భయానకంతో దక్షుని శిరస్సు ఖండించి...సతిదేవి దేహంతో విరక్తితో వైరాగ్యంతో మరలిపోయే సమయంలో తన ధనస్సును ఆక్కడే వదలి వెళ్ళిపోతాడు....దీనితో దేవతలను ప్రసన్నం చేసుకుని దేవరాతుడు శివధనస్సుని దేవతల నుంచి పొంది తన గృహంనకు తెచ్చి ఓక మంజూషలో వుంచి పూజాదికాలు నిర్వహిస్తుంటాడు. ఈ శివధనస్సు పేరు "పినాకం". ఈ దేవరాతుడు తదనంతరం ఓకరి తరువాత ఓకరికి అది సంక్రమించ బడుతూ ఇప్పుడూ అది జనకుని ఆధినంలో వున్నది.
ఈ జనకుడు , యాజ్ఞవల్క్యమహర్షి నిర్వాహణలో ఓక యజ్ఞంచేయ నిశ్చయించి...ఆ యజ్ఞవాటికకు అవసరమైన భూమి దున్నతున్న సమయంలో ఆ నాగలి చాలు నందు ఓ బాలిక లభ్యం అవుతుంది... ఆమే సీత....ఆమే భూమి నందు లభించింనందున భూజాత అయినది...అందువల్లనే ఈమే అయోనిజ...అయినది....(సీత జన్మరహస్యం వాల్మీకి రహస్యంగా వుంచదలచినట్టున్నాడు. ఆమేకు అయోనిజ లాంటి విశిష్టత కల్పించి...జనకుని తండ్రి చేసి...మరి సంక్లిష్టం చేశాడు... కారణం జనకుడు ఎన్నడు ఎవరితోనైనా అనవసరార్ధం ఓక్క మాటలేదు. దీనితో సీతాదేవి జన్మ రహస్యం పై అనేకానేక విచిత్ర వాదనలు వున్నాయి వాటిని ఇంకోసారి వివరణ). ఆమే బాలికగానున్నప్పుడు ఆటలు ఆడుతున్న సమయంలో ఓక బంతి మంజూష క్రిందకు పోగా ఈమే మంజూషను అలవోకగా ప్రక్కకు జరిపి తన బంతి తీసుకుని వెడలిపోయి..తన ఆట తాను ఆడుకుంటున్నది...ఈ సంఘటనను నారదునితో ఆద్యాత్మిక చర్చలో వున్న నారద ,జనకులు ఇరువురూ  గమనించిన వారై ఆశ్చర్య పోతారు....కాని అప్పటికే దేవరహస్యం తెలిసిన నారదుడు తెప్పరిల్లి జనకుని పరిశీలిస్తుంటాడు....ఆశ్చర్యం నుంచి తేరుకోని జనకుడు అలాగే నిశ్చేష్టుడైపోతాడు...ఎందుకంటే తానుగాని...తన వంశంలో మరి ఎవ్వరు కాని ఆ మంజూషను కదల్చిన దాఖలా లేదు...దానితో నారదసముఖంలో యుక్తవయస్కురాలు అయిన సీతను ఎవరికి   ఎలా వివాహం చేయాలి  అన్న ప్రశ్నకు దొరికిన వాడై ...ఆ ధనస్సును ఎక్కుపెట్ట కలిగిన వారికి సీతతో పరిణయం చేయ నిశ్చయం చేశాడు.
మరి ఇదే సమయంలో మిధిలానగరానికి రామలక్ష్మణులు తో  విచ్చేసిన విశ్వామిత్రుని స్వాగతపరచి సకల సత్కార మర్యాదలు ఆచరించి వినమ్రంగా వున్న సమయంలో...విశ్వామిత్రడు రామలక్ష్మణులను పరిచయం చేయటం...వారికి శివధనస్సు దర్శనాభిలాష గురించి తెలపగా....అప్పటికే తాను ప్రకటించిన సీతాస్వయం వరం....అందు నియమం గురించి ప్రకటించినందున...రేపు సభలో చూడవచ్చు అనే వినమ్రసమాధానం నకు సమ్మతించిన వాడై విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కూడి తన బసకేగి మరునాడు సభకు విచ్చేస్తారు.
సభకు మంజూషను ఎంతో కష్టంతో ఏనుగులు , అనేక వందలవేల బల శాలురు అధికప్రయాసలతో సభలో ప్రవేశపెడతారు.
జనకుడు సీతా స్వయంవర నియమం మరియి వీర్యశుల్కం సీతతో పరిణయం అంటారు...
దానితో దేశ దేశాల రాజులు , రాజకుమారులు ఆ శివధనస్సుని ఎక్కు పెట్టే ప్రయత్నం చేయబోతారు...అందరూ అభాసుపాలు అవుతారు...
దానితో రాముడు విశ్వామిత్రుని ఆదేశంతో ఆ శివధనస్సుని అలవోకగా తన చేతిలోకి తీసుకుంటాడు.....దాని అల్లేత్రాడుని దాని నారిభాగంలో బంధించి....ఓక్కసారి నారి సారించబోవ....ఆ శివధనస్సు ఫెళ్ళున విరిగి పోతుంది..... ఇది గమనించిన సర్వులు ఆశ్చర్య చకితులు అవుతారు....ఆనందంలో మునిగినవారు...ఇద్దరే...సీత...తనకు ఇష్టపడిన వరుడు లభించాడని , జనకుడు... ఆశించిన వరడు లభించాడని...గుంభనంగా వున్నది విశ్వామిత్రుడు ఓక్కరే...ఆశించిన ,అప్పచెప్పిన కార్యనిర్వాసణ పూర్తి అయినదని .....
దానితో జనకుడు , రాముని సీతను పరిణయమాడ కోరతాడు... కాని రాముడు సమ్మతించక...తాను విశ్వామిత్ర ఆదేశానుసారం పాల్గోన్నొను...తన వివాహం తన తండ్రి దశరథుని నిర్ణయాను సారమే జరుగుతుంది.. ప్రస్తుతం తాను తన తండ్రి ఆదేశంపై విశ్వామిత్రుని ఆజ్ఞపాలన చేస్తున్నాను అన్న విషయం తెలపటంతో...విశ్వామిత్రుని సూచనపై వాయువేగాలతో పోవు వార్తాహరులని పంపి అన్నీ విషయాలు విశదికరించుతాడు.
ఈ విషయాలన్ని తెలిసిన దశరధుడు ఆనందంతో తన ఆమోదం తెలుపుతాడు.
దశరథుడు తన సకల జన పరివారంతో మిథిలా నగరానికి విచ్చేస్తాడు. అంత ఇరువురి పురోహితులు ఇరువురి గోత్ర ప్రవరలు మరోకరు తెలుపుకునే సమయంలో దశరథుడు తన మనోభిష్టం చెపుతాడు...తన మిగిలిన ముగ్గురు పుత్రులకి కూడా వివాహం చేయ నిశ్చయం... అంత జనకుడు తన సోదరుడు కుశధ్వజుని కుమార్తెలు ఉర్మీళ ను లక్ష్మణునికి , మాండవిని భరతునికి , శృతకీర్తిని శతృఘ్ననికి ఇచ్చి వివాహం జరుపుతారు.
బాగుంది ఇది అంతా పౌరాణిక కధ...కాకపోతే మరికొన్ని విషయాలు మనకి తెలిసినవి...కాకపోతే శివధనస్సు రహస్యం...అందరికి అలా అపరిష్కృతంగా వుండవలసినదేనా...సీత బాలిక గా వున్నప్పుడు ఆమేకి సాధ్యం... మరలా రామునికి సాధ్యం... మరి ఎవ్వరికి ఈ కార్య నిర్వాహణ సాధ్యపడలేదు...అన్నీ తరాలు జనకుని వద్ద వున్ననూ ఎవ్వరూ దానిని కదల్చలేక పోయారు...స్వయం వరంలో పాల్గోన్న వీరాధి వీరులైన రాజులకి సాధ్యపడలేదు...ఓక్క సీతా రాములకి తప్ప....
అదే దేవరహస్యం దాన్నీ విప్పి చెప్పటమే ఈనాటి లక్ష్యం....
సీత , రాములు వైకుంఠ వాసులైన లక్ష్మీనారాయణులని....వారే ఈ విధంగా ఉద్భవించారని ఈనాడు మనకు తెలుసు....ఆనాడు దేవతలకి తెలుసు...దేవతల కార్యనిర్వాహణలో వున్న విశ్వామిత్రునికి తెలుసు....కాని సీతా , రాములు ఉభయులకు తాము వైకుంఠ వాసులమని తెలియదు...కారణం మానవ జీవితం లోని ప్రకృతి ధర్మం అయిన స్త్రీ పురుష ఆకర్షణలను వారు అనుభవించాలని...దంపతులుగా వారి దాంపత్యం...దానిలోని ధర్మాచరణ ని వారు పాటించాలని..ఆచరించాలని....ఇది బాగుంది... మరి శివ ధనస్సు....
సీత , శివుని మధ్య సోదర సోదరి సంబంధం వున్నదని మీకు తెలుసు. క్షీరసాగర మధనంలో భాగంగా వచ్చిన  లక్ష్మీ దేవిని విష్ణువు స్వీకరించారని...ఆమేతో ఉద్భవించిన హలాహలం ని శివుడు స్వీకరించారని బుధజనులకి తెలుసు...అందువల్లనే లక్ష్మీ దేవి శివునికి సోదరి అయినది.  మరి సోదర సోదరిమణులు ఇరువురునూ సమాన శక్తి కలవారు...హలహలంతో ఆమె జన్మించితే....ఆయన హలాహలాన్ని గరళంలో నిలిపి లోక రక్షణ చేసినాడు. చాలామంది ధనం విషంతో సమానం అనే మాటకి అర్ధం ఇదే...ధనం , విషం కలిసే పుడతాయి అనే నానుడి కూడా ఇక్కడి నుంచే వాడుక....
మరి సోదరిగా శివశక్తి సీతకి వశపడటం అతి సులభం....
అందుకే సీత బాలికగా వున్నప్పుడు అది సాధ్యపడుతుందా లేదా అన్న దైవపరిక్షని జాగ్రత్తగా నిర్వహించినవాడు నారదుడు.
హమ్మయ్య అది సాధ్యపడింది దైవప్రణాళికలో ఓక భాగం పూర్తి అయినది....వారు చూడండి ఎంత జాగ్రత్తగా చేస్తున్నారో...ప్రకృతి అయిన సీతకి పరిక్షపెట్టి అందులో ఆమే ఉత్తీర్ణత నిశ్చయించి తదనంతరం మాత్రమే పురుష రూపం అయిన శ్రీరామచంద్ర పాత్ర ప్రవేశం....
మనం అయినా వ్యవసాయంలో దుక్కి దున్ని...దమ్ముచేసి...నీరు పెట్టి తదనంతరం విత్తనం చల్లుతాం...అందుకే క్షేత్ర రూపం స్త్రీ రూపం అయిన సీతకి ముందు బాలికగానే పరిక్ష...తదనంతరం బీజరూపం , పురుష రూపం అయిన రాముని ప్రవేశం...పరిక్షా నిర్వాహణ.
మరి సీత పరంగా మీరు నా ఆలోచన తెలుసు కున్నారు.... మరి రాముని పరంగా ఏమిటి అన్నది తెలుపుతాను....
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు అని సృష్టి స్థితి లయలు వారి నిర్వాహణ భాధ్యతలని మీకు తెలుసు.....
శివుని ధనస్సు ఏ పరిస్థితి లో దేవరాతుని వద్దకు వచ్చినది....సతీదేవి వియోగ సమయంలో శివధనస్సు అక్కడ విడవ బడుతుంది... శివుడు సతిదేవి వియోగాన్ని భరించలేడు....మరి నారాయణ స్వరూపం అయిన శ్రీరాముడు భవిష్యత్ లో వచ్చే భార్యవియోగం తట్టుకుంటాడా లేక శివుని వలే ప్రవర్తిస్తాడా అన్నదానికి ఓక సమాధానం మనకూ మార్మీకంగా తెలియచేస్తున్నారు. సతిదేవి వియోగం లోని శివధనస్సు ఇంకనూ శివుని స్పర్శ వలన ఆనాటి తాలూకు భావనలు దానిలో నిక్షిప్తమై వున్నాయి.....
అందుకే ఆభారం దాన్నీ ఆవహించినది....అసలే శివుడు లయకారుడు...అందునా ప్రళయ సమయంలోని ధనస్సు ...స్థితి కారుడైన నారయాణుడు ఎలా నిభాయించుతాడు....
ఆత్మనిగ్రహం , మనోనిగ్రహం పూర్తిగా కల రాముడు అలవోకగా శివధనస్సు తన చేతిలోకి తీసుకోగానే లయకారుని లయతత్వం స్థితికారుని చేతిలోకి అలా రాగానే తనలక్షణం కోల్పోతుంది....అందుకే రాముడు శివధనస్సు అల్లేత్రాడు దానికి బంధించి నారి సారించే సమయంలో ఫేటిల్లున అది విరిగి పోతుంది.... దైవనిర్ణయం సక్రమంగా అమలుపరచబడుతున్నదని విశ్వామిత్రుని కి తెలుస్తుంది.... తద్వారా మనకి....
సీత ఈనాడు పూర్ణ యవ్వన వతి. ఆమే శ్రీరాముని చూసి ఆకర్షణకు లోనవుతుంది...కాని రాముడు ఆమేని దర్శించిననూ తన ఆత్మనిగ్రహత వలన తన భావం ఏమిటో ఆంగీక వాచక లక్షణాలలో ప్రదర్శించక..గుంభనంగా...అంటే స్త్రీ పూర్వకంగా వచ్చే మార్పులకు రాముడు లోనవుతాడా లేదా అనే ప్రాధమిక పరిక్ష...
ఓకే ఇదంతా పౌరాణికం...ఏమిటో మీరు...ఏనాటి కాలంలో జరిగిన వాటిని మీ సంఘటనకి అన్వయింపచేస్తున్నారు అనే బుద్ధి జీవులకి ఇంకోక్కటి.....
శివధనస్సు... శివుని శక్తికి మరో రూపం అని.
శివుడు సదా కాలరూపునిగానే మనం భావించాలి.....
మీకు కాలం బాగున్నది...సరే కృతజ్ఞతతో పరమేశ్వరార్చన...మీకు కాలం బాగోలేదు...ఆయన కరుణకి పరమేశ్వరార్చన...
మన దైనందిన జీవితాలలో పరమేశ్వరార్చన అంత విశేషం ప్రాముఖ్యత వహిస్తుంది....
మరి సీత , రాములకి సాధ్య పడింది అంటే ఆ కాలం పెట్టే పరిక్షలకి ఎవరైతే తట్టుకొని నిలబడతారో వారికే శివధనస్సు యొక్క శక్తి వారికి మాత్రమే సమన్వయపరచ బడుతుంది అనేది మనం తెలుసుకోవాలి.
అందుకే త్రేతాయుగం నాటి సీతారాములు ఈనాటికి మనకు ఆరాధన పూర్వక దంపతులు అయ్యారు.
ఇది శివధనుర్భంగంపై శ్రీరాముని దయవలన నా ఆలోచనలు.....
సర్వులకు శ్రీరామ జయం.
సర్వం శ్రీరామజయం...
శ్రీరామ చరణం దొరికితే చాలు నా ఈ జీవితానికి...
ఆయన కృపాకటాక్షంకై....
శ్రీరామజయం...
మిత్రులకి , విమర్శకులకి సదా స్వాగతం.
మీ తాలుకు సందేహలకి సమాధానం
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
94401 72262.
94401722

శ్రీరామ చంద్రుడు - పరిశీలన - సీరిస్ - 2

రాముడు పరిశీలన సీరిస్ - 2
************************************
రామునికి ఎన్నో విశిష్ట లక్షణాలు. వాటిల్లో
రాముని ఏక పత్నీ వ్రతం గురించి ఆనాటి నుంచి ఈనాటి వరకూ గొప్పగా చెప్పుతారు....
మరి రాముడు ఏకపత్నీ వ్రతం అనేది ఎందుకంత విశేషత....ఈనాటి వారికి అదో సాధారణ సంగతిలా వుంటుంది... కాని విశేషమే...అసలు రాముడు మహిళల పట్ల గౌరవ మర్యాదలు చూపే అంత విశిష్టత నిర్ణయం రావటానికి గల కారణాలు విశ్లేషించటమే...ఈనాటి టాపిక్ లక్ష్యం.
రామావతార లక్ష్యమే రావణసంహరం.
రావణుని బలహీనత స్త్రీ వ్యామోహం.
రావణునికి గల రాక్షస ప్రవృత్తి లో ఇది ఓకటి మాత్రమే....
మరి ఇటువంటి రాక్షస ప్రవృత్తిని ఎదుర్కోవాలంటే....అటువంటి అవలక్షణము లేని వ్యక్తి కావాలి...మరి దశరధుడు అటువంటి వాడా కాదు అని మనకు తెలుసు....కాని విశిష్ట వంశం...దశరధుడు కూడా దేవాసుర సంగ్రామంలో దేవతల పక్షాన పోరాడిన వాడు...ఇవి సానుకూలతలు...ఇంతమాత్రం చేత దశరధుని ఔరసపుత్రడుగా ముందుగానే జరుగలేదు...దశరధునికి ముగ్గురు భార్యలున్ననూ నిస్సంతుగా వుండటానికి కారణము దైవనిర్ణయం....మరి ఈ సమయంలో దశరధునికి పుత్రకామేష్ఠి యజ్ఞం గురించి తెలియచేసి అతనిచే ఈయాగ నిర్వాహణ. అసలు పుత్రకామేష్ఠి అంటే...పుత్రకామేష్టి యజ్ఞం సనాతన ధర్మం లో కొడుకు పుట్టడానికి చేసే ఒక ప్రత్యేక యజ్ఞము. ఇది ఒక కామ్య-కర్మ.
మరి ఈ పుత్రకామేష్ఠి యజ్ఞం ఎవరి ఆర్ధ్వర్యంలో నిర్వహించాలి.....మరి ఇంతటి శ్రేష్టుడు ఎవరు.... ఋషులందరూ గొప్పవారే కాని ఓక్కొక్కరిది ఓక్కో కధ గాధ...మరి ఆసమయంలో వారందరికి ఓక్కరే స్ఫురణకు వస్తారు వారు ఋష్యశృంగుడు.
కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడు అనే మహర్షి ఒక రోజు సంధ్యా వందనము చేసుకొను సమయమున, ఆయనకు ఆకాశమార్గాన పోతున్న ఊర్వశి కనిపిస్తుంది. ఆ ఊర్వశిని చూసి విభండక మహర్షి తన వీర్యాన్ని సరోవరములో విడిచిపెడతాడు. ఆ వీర్యాన్ని త్రాగిన ఒక జింక గర్భం ధరించి, కొమ్ము కల బాలునికి జన్మనిస్తుంది. కొమ్ముతో జన్మించాడు కావున ఆ బాలకునకు ఋష్యశృంగుడు అని పేరు పెడతాడు విభండకుడు. ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై, విభండక మహర్షి నేర్పుతాడు. విభండక మహర్షి ఋష్యశృంగుడిని బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెంచుతాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడు జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు. కనుకనే దైవనిర్ణయానుసారం..యాగ ఆర్ధ్వర్యం వీరికి ఓసగబడినది...అందునా వీరు యజుర్వేదంలో నిష్ణాతులు. యజుర్వేదంలో పుత్రకామేష్ఠి క్రతువు వున్నది.
ఇక్కడే మీరు సాధారణంగా చదువుకుంటూ వెళ్ళే సమయంలో ఓక క్షణం ఆగి ఆలోచన సాగించండి.....
మనం నిత్యపూజ సంకల్పానికే విశేషత వహించేటప్పుడు....రావణ సంహర కర్త జన్మించటానికి ఎన్ని విధాల జాగ్రత్తలు అవసరం...
మన నిత్యవంటలో దినుసులు సరి సమంగా...శుభ్రతగా...శుచిగా చేస్తాం...అలాగే పూజాదికాలు భక్తి శ్రద్ధలతో వివిధ పద్ధతులలో వివిధ రూపాల వస్తు వినియోగం చేసి సంతృప్తి చెందుతాం....మరి రావణసంహరమే లక్ష్యం గా అంశ ఉద్భవించాలంటే....స్త్రీ బలహీనత లేని యజ్ఞ ఆర్ధ్వర్యుని నిర్వాహణలో యజ్ఞ ఫలంగా అంతటి విశిష్టత గల అంశ  పుట్టుట మాత్రమే
సాధ్యం....అందుకే దేవతలు ఏరి కోరి మరి...ఋష్యశృంగుని....ఎన్నుకున్నది....
వశిష్ఠుల వారు వున్ననూ వారి కన్ననూ యజ్ఞ నిర్వాహణకి ఋష్యశృంగునికి అప్ప చెప్పినది....
మరి ఈ యాగ నిర్వాహణలో చివరగా అగ్ని ఇచ్చిన యాగ ఫలిత పాయస ప్రభావంచే...శ్రీరామ జననం.
మీకు ఇంత వివరించటానికి కారణం...ఓక కార్యసిద్ధి కి అత్యుత్తమ సంకల్పం కలిగి అటువంటి విశిష్టత గల వ్యక్తులచే నిర్వహించ బడితే అంతటి మంచి ఫలితం లభిస్తుంది...
అందు వల్లనే జన్మతః రామునికి ఈ లక్షణం వున్నది...కాని ఆనాటి సామాజిక రాజకీయ కుటుంబ నేపథ్యంలో ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకోవటానికి బలమైన కారణాలు ప్రస్తావిస్తాను.....
రాముడు క్షత్రీయుడు... అందునా రాజ్యాధికారం సిద్ధించబోయేవాడు...మరి మిగతా వారి వలనే బహు భార్యత్వాన్ని ఎందుకు ఎంచుకోలేదు...రాముడు అన్నీంటికి తన పూర్వీకుల మార్గం పాటించినా ఇందులో మాత్రం తన ప్రత్యేకత నిలుపుకోవటానికి ప్రధమ కారణం...తన తండ్రి బహు భార్యత్వానికి ప్రధమంగా ఇబ్బంది పడినది...రాముని తల్లి కౌసల్య....ఈమే పట్టపు రాణి అయిననూ భర్త ఆదరణ లేక వ్యధతో కూడిన జీవితం...మరి తల్లి తాలూకు వేదన చూసిన రాముడు అటువంటి పొరపాటు చేయగలడా....
అలాగే రాముని అరణ్యవాసం కారణం కూడా...దశరధుని వ్యామోహమే....
రామునికి ధర్మ  , కర్మ ఆచారణ పట్ల ఎంతో మక్కువ.... సీతా స్వయంవరం ముందు జరిగిన అహల్య శాపవిమోచన ఘట్టం లో తనవలన ఓక స్త్రీ కి శాపవిమోచన కి సంతోషించిననూ...అది అతని మనస్సులో ఓక ముద్ర ఏర్పరిచినది....గౌతముని వంటి తపస్వికి ఇల్లాలు అయిననూ పరపురుష వ్యామోహంచే
ఆమే ధర్మ , కర్మ భ్రష్టత్వం పొంది..ఆ విధంగా శిలగా వుండటం రాముని ఆలోచింప చేసినది...
అందుకే పురుషునకో నియమం , స్త్రీ కో నియమం వుండుటను అతను నిరసించి....ఏకపత్నీ వ్రతం అనే కొత్త సూత్రం తనదిగా చేసుకున్నాడు....
ఇటువంటి నూతన విధానంలో కాబోవు రాజు మక్కువ చూపుతున్నారు అని ప్రజలలో తెలిస్తే వారికి రాముని పట్ల గౌరవం పెరుగుతుంది.
రాజుకి రాజ్యం లోని ప్రజలకి ఉభయుల మధ్య ఓక విధమైన సంఘటితం ఏర్పడుతుంది... ఆ రాజ్యం బలపడుతుంది.
మీరు ఈ వివరణ సాగిన విధం గమనించండి...
రావణుని రాక్షసత్వంచే విసిగి వేసారిన దైవ , ఋషి వర్గాల అభిప్రాయం అణుగుణంగా నారాయణుడు జన్మ తీసుకోవాలి..అందుకూ అతని వరంలోని వున్న మానవ , వానరులు వలన నాకు మృత్యువు రాకూడదు అన్నది విస్మరింపో లేక అహంకార పూరితమో అయినా దేవ , ఋషి ప్రణాళిక లో అదే మూలం అయి...నారాయణుడు మానవజన్మ తీసుకోవటానికి ప్రధాన కారణం అయినది. రావణుని పర స్త్రీ వ్యామోహం అనే దుర్బలత్వానికి విరుగుడు ఏకపత్నీ వ్రతం అనే బలమైన ఆయుధం...ధర్మ , కర్మ ఆచారణ కు బలంగా మారినాయి...ఇక తదుపరి వివరణలు కుటుంబ , రాజకీయ ,సామాజిక వివరణలు...
ఇలా రామాయణాన్ని, రాముని మనం ఇష్టపడుతూ...ఆ జగదభిరాముని లీలావిలాసాన్ని ఓక్కసారి ఆయన పాదం పట్టి అడిగితే తన తత్వాన్ని ఓకింత మన బుద్ధి మేర కొంత కరుణిస్తాడు.....సర్వం శ్రీరామ మయం...
సర్వులకు సర్వం శ్రీరామ జయం......
మిత్రులు, విమర్శలు సదా స్వాగతం.....
మీ యొక్క సందేహలకి సమాధానం...
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ.
94401 72262.





శ్రీరామచంద్రుడు - పరిశీలన - సీరిస్ - 1

రాముడు -   పరిశీలన సీరిస్ - 1
*******************************
రాముడు భరతవర్ష ఆత్మ. మిత్రులు గమనించారో లేదో నేను భారతదేశం అన్న పదం ఉపయోగించలేదు...భరతవర్ష అనే మన పూజాదికాలలో సంకల్పం లోని పదం... కారణం పౌరాణిక భారతవిస్తారం చాలా చాలా విస్తృతం కనుక...ఇంత భూభాగం పై రాముని ప్రభావమున్నది అనుటలో సందేహం లేదు. మిత్రులు ఈనాటి రాజకీయ ,మత ప్రాభవాలు కాదు...త్రేతాయుగం నాటి నుంచి నేటి కాలం వరకు రాముడు వారి వారి సమాజాలలో సాహిత్యం లో వారి మనస్సులో వారి కుటుంబ సాంప్రదాయాలలోకి చొచ్చుకుపోయేలా ఓ ప్రత్యేక స్థానం లభించేలా వుండటానికి...రాముని కధ జన కధగా ప్రతి ఓక్కరి జీవనానికి ఆధారసూచికలా మారటానికి గల కారణాలు మనం పరిశీలించటమే ఈ కధనం ముఖ్యోద్దేశ్యం.......
రాముడు దశవతారాలలో ఏడవదిగా మనకు మొదటసారిగా భాగవతం పరిచయం చేస్తుంది. వాల్మీకి రామాయణం రాముని వైశిష్ట్యాన్ని రాముని జీవనప్రయాణాన్ని మాత్రమే పరిచయం చేస్తుంది. రామాయణంలో మొదట ఉత్తర కాండ లేదని...తదనంతర కాలాల్లో అది ప్రక్షిప్తమని వాదించేవారు కోకొల్లలు. రాముని జీవనగాధ ఎంత సరళమో ఆచరణ అంత సంక్లిష్టమైనది...కారణం రాముని జీవతం లోని ప్రతిక్షణం ప్రతి అడుగు ధర్మబద్ధంగా వేదప్రమాణంగా పూర్వుల ఔన్నత్యం భంగపడని రీతిలో అదేసమయంలో తనతో కలసివున్నవారితో కల ఆత్మీయసంబంధాలు మానవ జీవత ప్రమాణాలలో ఉదాహరణకు నిలిపే విధంగా సాగింది. ఇంతటి సంక్లిష్టతగా మనకు తోచిననూ రాముడు అవలీలగా పాటించుతూ ఇది ధర్మం ఇది జీవనవిధానం అని పాటించి చూపాడు. ఈ మహకావ్య నాయకుని ఇంత గొప్పగా తీర్చిదీద్దటం వాల్మీకి వారికి తప్ప ప్రపంచంలో ఏభాషలోను మరే రచయిత చేయలేని చేయని ఓ అద్భుత పాత్ర రాముడు.
అది అలా అలా జనుల జీవన వేదం గా నిలచిపోయింది.
అసలు రాముడు వైశిష్ట్యాన్ని రామునితోనే ముడి పడినదా లేదంటారు రఘువంశకర్త కాళీదాసు... ఈ రఘువంశంలో రాముని పూర్వ తరాలు వారి విశిష్టత మనకు వివరంగా చెపుతారు...
సూర్యుడు , సంధ్య లు వంశమూల పురుషులైతే
రాముడు వీరి పరంపరలో 62వ తరం వాడు....
మనకు రఘువంశం లో రాముని పూర్వులు ఇక్ష్వాకుడు ,నాభాగుడు, మాంధాత ,సత్యవ్రతుడు ,హరిశ్చంద్రుడు ,సగరుడు, దీలిపుడు,భగీరధుడు ,అంబరీషుడు,రఘువు ,అజుడు ....ఈయన కుమారుడే దశరథుడు... ఇంతటి వంశక్రమంలో దశరధునికి మాత్రమే పుత్రకామేష్ఠి యాగ ఫలితంగా శ్రీరామ జననం గా మనకు తెలియవస్తుంది. మీకు ఇంత వివరంగా తెలుపుటకు కారణం...శ్రీమన్నారాయణుడు వైకుంఠం వీడి పూర్ణ మానవ అవతారంగా తన ప్రకటన వుండాలంటే ఆ వంశం ఏంత గొప్పగానో మరియు ఏంతటి ధర్మదీక్షాపరులో ఏంతటీ పట్టుదల కలవారిగా వుండాలో తెలిసిన వారు కాబట్టి ఏర్చి కూర్చి కోరి మరి ఈ వంశంలో తన జననం...పోని అది అయినా దశరధుడు , కౌసల్య సంయోగ ఫలితమా కాదే నిస్సాంతన పరితాపాన్ని కలిగించి ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ...పుత్రకామేష్ఠి యాగ ఫలితంగా మాత్రమే రాముని అవతార ప్రకటన....అనగా రాముడు అగ్నితః జన్మించినవాడయినాడు...అగ్ని సర్వాన్ని పునీతం చేయ గల శక్తి కలది....
అలాగే రాముని లక్షణాలు వారి వంశమూలపురుషుల ఓక్కోక్కరి శక్తి...రాముడు వీరందరి జీవనం లో కల మూలన్ని గ్రహించినవాడై సంపూర్తిగా ఆ విధంగా ఆచరించి చూపాడు....పట్టుదల సగరుని నుంచి... దీక్ష భగీరధుని నుంచి... సత్యవాక్పరిపాలన హరిశ్చంద్రుడు నుండి...ఇలా అనేకానేకం....
అందుకే రాముడు జీవితంలో కఠిన సందర్భం అరణ్యవాసం పాలంచే ముందు స్వయంగా తండ్రి సలహ ఇస్తాడు...నాయనా రామా! నేను వృద్ధుడను చాంచల్యం చే ఏనాడో వరం ఇచ్చాను...అది ఈనాడు కాలం తెచ్చిన కఠిన పరిక్షలా మారింది.... అదియినూ నేనూ నీ జీవితం పై నిర్ణయం తగదు కనుక నీవు నా నిర్ణయాన్ని తోసిరాజనే హక్కు వున్నది...ఎలాగు అంతఃపుర అధికారం నీ తల్లిదే కనుక...నీవు నన్ను ఖైదు చేసి రాజుగా వుండూ....అని కోరినా...రాముడు ఓకపరి సున్నితంగా మరొకంత కఠిన పదాలు ఉపయోగించిననూ...మీ సలహ విని నేను ఈనాడు రాజ్యపాలన చేస్తే...నేను వంశంలో తప్పు పుట్టినవాడినవుతాను....మీతో సహ నా పూర్వుల ఔన్నత్యాన్ని నేను కాలరాచిన వాడినవుతాను ....అయిననూ ఆత్మావై పుత్ర నామాసి అనే ఆర్యోక్తి ప్రకారం మీరే నేను....కనుక ..మీ వారసుడు గా మీ హక్కులు నాకు సంక్రమిస్తున్నప్పుడు యధావిధిగా మీ భాధ్యతలు నాకు దఖలు పడతాయి... అందునా ఈసమయంలో మీరు పాలకులు మేమంతా పాలితులం...కాకపోతే రేపు నేను పాలకుడను అవ్వాలి మరి ఇటువంటి సమయంలో మీ స్వార్థం గురించి నన్ను ధర్మం తప్పమనే హక్కు మీకు లేదు...పాలకుడుగా రాజశాసనం ఆచరించండి అని రేపు నేను చేయబోయే ఆజ్ఞకు ఈనాటి మీమాట ప్రకారం మిమ్మల్ని ఖైదు చేసి అధికారంలో వస్తే విలువ వుండదు...అయిననూ మన అంతఃపురం ఏవరు లేని ఏకాంతం కాదు...మీ అంతరంగం కాదు...ఇది ఓ బహిరంగ రహస్యం..దాసదాసీజన నిండిన ఈ అంతఃపుర విషయం రేపు రాజ్యం అంతా ప్రాకటానికి ఎంత సమయం పడుతుంది... మరి ఆసమయంలో నేను ప్రజల దృష్టిలో హినుడను హేయమైన పని చేసినవాడుగాను స్వార్థపూరిత వ్యక్తిగాను...అందులో భరతుడు లేని ఈ విపత్కర సమయంలో మీ వరప్రభావంచే అతనికి బదాలాయించవలసిన రాజ్యాధికారం నేను కుట్రతో కుయిక్తులతో నేను స్వాధినపరచుకున్నట్టు అవుతుంది.... ఏమి చేయగలం సిద్ధాన్నం సిద్ధించటానికి నాకు యోగ్యత వున్ననూ కాలం అనుకూలించటం లేదు....ఇలా కొనసాగుతుంది....ఇటువంటి ఆత్మవిచక్షణ రాముని ఆజీవనపర్యంతం కొనసాగుతుంది...సీతాగ్నిప్రవేశంలోను...సీతాపరిత్యజంలోను ఇటువంటి సన్నివేశం వచ్చింది...వీటి వివరణ మరియొక పరి....
మిత్రులు...
నమస్కారం.... అసలు ఈ రామ రావణ వైరుద్ధ్యాలను వివరంగా తెలియచెప్పాలనే ప్రయత్నం... అదేమిటో రాముని పై నా ఆలోచన కొనసాగుతున్నంత సేపు రావణునిపై రాయబుద్ధి కాలేదు...అందునా..ఇది ఓక వ్యాసంలో పూర్తి అయ్యే లక్షణం కనపడటం లేదు...రాముడు అనుగ్రహించ నంత వరకూ...ఇంకనూ ఇంకనూ నా అభిప్రాయం లను మీ సముఖానికి తీసుకుని రాగల ప్రయత్నం... అంతయినూ ఆయన కటాక్షము వల్లనే సాధ్యం.... సకలం సర్వం శ్రీరామ జయం.
మీ సందేహం సమాధానం....
ఆలపాటి రమేష్ బాబు...
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
94401 72262.

4, ఆగస్టు 2020, మంగళవారం

మా అమ్మతో వాట్సప్ డైరి - 1

ఈ బ్లాగు నామధేయమే..మా అమ్మ పేరు.
కాకపోతే ఈమే మా మమ్మి 2.0.
ఇదిగో ఈ మాట అంటేనే ఆమే అలిగేది ఆగ్రహించేది. నా తల్లి కీ.శే. సుభద్రాదేవి గారు నన్ను శ్రావణ బహుళ విదియ , 09/08/1968 న ఈ లోకానికి పరిచయం... నేను కన్న తల్లి సుభద్రాకీర్తి చైత్ర పౌర్ణమి రోజు 15/04/1995 న..నన్ను మురిపించటానికి , నాతో మాట్లాడటానికి , నాతో ఆడటానికి , నన్ను లాలించటానికి , నన్ను పాలించటానికి అబ్బో ఓకటేమిటి..అన్నియునూ ఆమే అంతట ఆమే అన్న రీతిలో , దీనికి తోడు ఆమే కృష్ణ అనురక్తురాలు , దానితో ఆమే నాకు సజీవ కృష్ఢ స్వరూపం... ఆమే ఆట, పాట, కోపం అన్నియునూ నాకు లీలా వైభవాలే...
దీనితో ఆమే నాకు అమ్మ , అమ్మి , అమ్మరో , స్వాములు , స్వామి వారు...ఇవే పదాలతో పిలుపు...
అదేమిటో నా హృదయ తంత్రి ఇంకనూ ఆమేను..చిన్ని బుజ్జి పిల్లగానే గుర్తింపు...
ఇన్ని విశేషాల మధ్య..ఆమే..MCA First class లో ఉత్తీర్ణత...
యుక్తవయస్కురాలు అయ్యారు మా మమ్మి వారు.
దైవం అనుకూలించి అల్లుడు గారు... సతీష్ చంద్ర గుప్తా గారు... వీరి వివాహం ఫిబ్రవరి 14, 2019 న...వాలంటైన్స్ డే రోజున..
మా అమ్మాయి...ఓ చైతన్య ఝరి...మా అల్లుడు గారు నెమ్మది వివేక వంతులు...ఆయన మాకో వరప్రసాదం..మా అమ్మాయికి కొంగు బంగారం... వారిద్దరి మధ్య స్నేహం మాకో ముచ్చట... నా భావన ప్రకారం.. దంపతుల మధ్య వుండ వలసినది ...మొదప స్నేహం...తదుపరి దాంపత్యం..
ఇన్ని సంగతుల మధ్య..మా అల్లుడు గారు..మా అమ్మాయి తో అమెరికా చేరిక...దానితో రోజు...నా వాట్సప్ సందేశాలు...
వాటిల్లో కొన్ని మీకు అలా...
10/3/2019, 6:33 PM
మమ్మి
జయహో మాత శ్రీ అనసూయ... రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి...
అమ్మరో...
జాగ్రత్త....
 శ్రీ చక్ర సంచారణి...నా తల్లి... నన్ను ఏలు నా కల్పవల్లి....
10/3/2019, 8:35 PM: స్వామి వారిని మరువ వద్దు...
 అన్నిటా అంతటా ఆయనే...సతతం నిరంతరం...ప్రతి పని ఆయనకు చెప్పు....నిరంతర నామ ధ్యానం...నీకు డెస్టిని చేరటానికి ఉపయోగపడుతుంది.
డబ్బు జాగ్రత్త....
18/03/2019
వరాలు
వజ్రాలు
వైఢూర్యాలు
రత్నాలు
పగడాలు
గోమేధికాలు
పుష్యరాగాలు
మరకతాలు
మాణిక్యాలు
ముత్యాలు
పచ్చలు
కెంపులు
ఇంద్రనీలమణులు
.ఇవి అన్నీ ...
మా బంగారం.

[19/3/2019, 10:28 AM] Alapati Ramesh Babu: లావోక్కింతయి లేదు ధైర్యం విలోలంబైయ్యే...

పై పద్యం నీకు చాలా సార్లు వినిపించా కాని ఆనాడు నీవు చిన్నదానివి , నా సంరక్షణ లో వున్నదానివి...కాని నీవు నేడు అమెరికాలో భర్త తో ఒంటరి కాపురం..
ఈ సమయంలో ఆత్మస్థైర్యం అన్ని విధాలా అవసరం.
 స్థిరంగా వుండు...
 స్వామి పై స్థిరచిత్తంతో ముందుకు వెళ్ళు...
సదా జాగురుకత...
21/03/2019
జిజ్జోయమ్మ...
గుడ్ మార్నింగ్...
ఈ రోజు హోలి.
స్వామికి వసంతం చల్లి...
మీ ఆయన మీద కూడ చల్లు...
అలాగే పాలు , తీపి ప్రసాదం గా పెట్టు...
హోళీ హోళి ర హోళి చమ్మ కేళిర హోళి...
అనందం సంతోషం నిండుగా మెండుగా ప్రతి రోజు పున్నమి వెన్నేల లా సరదాగా కలసి మెలసి వుండాలని 
హోళి శుభాకాంక్షలు.
01/04/2019
అమ్మ మీరు అమెరికా వెళ్ళి నెల రోజులు అయింది. ఆ దేశం వాతావరణం మీకు బాగున్నదా...
అల్లుడు గారు మీరు అరమరికలు లేకుండా చక్కగా వున్నారు అని భావిస్తున్నాను.
మీరు సతిష్ గారిని భర్త గా కాకుండా ఓ స్నేహితులు గా భావించండి....పొరపచ్చాలు లేకుండా చల్లగా చక్కగా సాగిపోండి. మిమ్మల్ని కూడా సతిష్ గారు భార్యగా కన్నా ఓ స్నేహితురాలుగా మెలిగే విధంగా చూడండి. జీవితంలో ప్రతిక్షణం మధురమే  దానిని అనుభవంనకు సదా సిద్ధంగా వుండండి.
మీ అమ్మ మంచిదే కాని ఇంటలెక్చువల్ కాదు అందువలన ఆమె స్థాయి కి నేను వెళ్ళినా నా భావజాలం ఆమెకు ఏన్నటికి అర్ధం కాదు...ఇది అలా కొనసాగుతున్న జీవన నాటకం.
 మీరు చదువుకున్నావారు జీవితం పట్ల ఓ దృక్పథం ఓ లక్ష్యం వున్నవారు అందులోను పరిణితి చెందిన కాలం.
మీకు మీ చిన్నప్పుడు సౌకర్యాలు తెలుసు పెరిగిన తరువాత నా ఆర్ధిక పరిస్థితి తెలుసు. 
ఇలా అనేక రకాల వత్తిడిలు ఇబ్బందులు మధ్య దైవకృపతో మీ వివాహం చేయగలిగా...
డబ్బు అనే సౌకర్యం తప్పితే మిగిలినవి బాగానే వుంటవని నామనసు చెపుతుంది.
నేను మిమ్మల్ని ఈ విషయం మీద ఏమన్నా ప్రశ్న వేసినా తప్పు , వేయకున్నా తప్పు... నా బంగారు తల్లి ఈ రెండిటికి మధ్య వున్న సన్నని గీతను మీరు అర్ధం చేసుకుంటారని నా భావం.
ఓ తండ్రిగా నా బిడ్డ సదా చిరునవ్వుతో వుండాలని కోరిక....

13/04/2019
అమ్మీ ! ఉదయాన్నే ఏన్నింటికి లేస్తున్నారూ...
ఇంకా 2 మినిట్స్ లీలలు కొనసాగుతున్నవా...
( మా అమ్మికి ఓ అలవాటు... నేను ఉదయాన్నే..ఎన్ని సార్లు లేపినా..2 మినిట్స్.. అదో ప్రహసనం..కాని వాళ్ళమ్మ..ఓక్క పిలుపే..ఈమే సిద్ధం)
15/04/2019
అమ్మరో!
మండువేసవిలో వెన్నేల ఉదయం అంటే ఈ బుజ్జి బంగారం ...ఓరే నేను వచ్చేస్తున్నా అని కొండమీద నుండి వచ్చారట....
కలిమితో , బలిమితో , సౌభాగ్యం తో కలకాలం వర్ధీల్లాలని... మా ఆకాంక్ష.....
శతమానం భవతి...
జయహోమాత శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి...
20/04/2019
No matter how old my daughter get , She'll always be my baby girl.
21/04/2019
ఇది ఏలా వున్నదో తెలుసా....
కోర్టు లో జడ్జిగారి దగ్గర "యువరానర్ ! అని ప్రారంభించి అనేక సెక్షన్లు అనేక క్లాజులు ఉదాహరించుతూ రెండు గంటలు పాటు అనర్గళంగా వాదించితే సింపుల్ గా వాదన "కొట్టివేయటమైనది" అని ఓక్కమాట లో తేల్చివేశారు.... అలా వున్నది...
అసలు మీ స్వామి వారు వచ్చి ఈ రోజు మీ అమ్మాయి పాలు ఇవ్వకుండా బజ్జీలు పెట్టిందంటూ ఏవో కంప్లైంట్స్ చెపితే పోవయ్యా బాబు మా మమ్మీ వారు మీ మాటే వింటారు కదా అంటే..అదేప్పటి మాట అమెరికా విమానం ఏక్కిన దగ్గర నుండి ఆమె నేనే వింటున్నా ...నా మాట వినటంలేదు...అని ఎదురుమాటలు.....
పోనిలే అని ఆయన చూపించిన బజ్జీల ఇమేజ్ తో అనాలసిస్ చేసి కారణం మీకు చెపితే....మీరేమో సింపుల్ గా ok అని ఓక్కమాటతో తేల్చారు...
అదిదా....ఈ రోజు కధ...
సరేనా తల్లీ.....
జయహోమాత శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీపరాత్పరి......
అంగరక్ష ఆదిరక్ష మా అమ్మకి సర్వకాల సర్వావస్థలందు సర్వేశ్వరుని రక్ష శ్రీరామ రక్ష...

అమ్మరో

అమ్మరో!
పుట్టినరోజు శుభాకాంక్షలు...
నన్ను ఏలు నాతల్లి! నా కల్పవల్లి!
అంగరక్ష ఆదిరక్ష శ్రీరామ రక్ష.....
వసంతకాలంలో కోకిల..
చల్లని సాయంత్రంలో ఇంద్రధనస్సు...
గలగలా గోదారి అలల సవ్వడి...
విరబూసిన పండువెన్నెల...
అరవిచ్చిన గుండుమల్లెల పరిమళం...
విరబూసిన పూదోట మనోహరం...
పసి నవ్వుల స్వచ్ఛత....
ఇలా ఎన్నో ఎన్నేనో నాచేతీలోకి...
వచ్చిన రోజు...
గుండె నిండటం అంటే తెలిసినరోజు...
చెప్పినవి కొన్నే చెప్పనవి ఎన్నో...
ఇంకొకసారి మరోక్కసారి...
పుట్టినరోజు శుభాకాంక్షలు...
ఆడుతూ పాడుతూ వర్ధిల్లు....

నిర్వాణషట్కం

జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత ''నిర్వాణ షట్కం'' 

**********

ఇది  'నిర్వాణ షట్కము'నకు సాహిత్యానువాదము, కొద్ది వ్యాఖ్యానముతో. ఆది శంకరాచార్యులవారి సాహిత్యమును స్తోత్ర (భక్తి) సాహిత్యము, వైరాగ్య ప్రకరణములు అని రెండుగా విభజించవచ్చు క్లుప్తముగా. ఇది వైరాగ్య ప్రకరణముల కోవలోనిది.  నిర్వాణషట్కం భారతీయ వేదాంత మార్గంలో ఉన్నతమైన రచన. నిజానికి ఎంతో దీర్ఘమైన వ్యాఖ్యానము, వివరణ అవసరము కాని, ఇక్కడ క్లుప్తముగా మాత్రమే చర్చ ప్రస్తుతానికి! ఆదిశంకరుల సారస్వతాన్ని క్లుప్తంగా పరిచయం చేయడానికి నాకున్న కొద్దిపరిధిలో, అల్పజ్ఞానముతో చేస్తున్న ప్రయత్నము ఇది.

ఆధునిక పోటీ పరీక్షలలో జవాబులు తప్పుగా ఇచ్చినప్పుడు, సరిగా జవాబులిచ్చిన కారణంగా వచ్చే 'మార్కుల'నుండి తప్పుగా ఇచ్చిన వాటికి శిక్షగా మార్కులు తగ్గించే పద్ధతి వుంటుంది కొన్ని పరిక్షలలో, (నెగెటివ్ మార్కింగ్) అందుకని సమాధానం సరిగా తెలియనప్పుడు, సరైనవి కాని సమాధానములను వరుసగా ఇది కాదు, ఇది కాదు అని చివరికి సరిఐన లేదా సరిఐనట్లు అనిపించిన సమాధానమును చేరుకొనే పద్ధతి ఒకటి ఉంది. దీనినే తీసివేత పద్ధతి లేదా ఆంగ్లంలో ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు. భగవంతుని రూపమును, తత్త్వమును తెలిసికొనడం అసాధ్యం కనుక, ఏది భగవంతుడో తెలియనప్పుడు, ఏది భగవంతుని తత్త్వమో తెలియనప్పుడు ఏది భగవంతుని తత్త్వము కాదో తెలిసికొనడం తేలిక కనుక 'ఇది కాదు' 'ఇది కాదు'అని తీసి వేస్తూ చివరికి మిగిలిన వర్ణనకు, వ్యాఖ్యానమునకూ అందని తత్త్వమేదో అదే పరమాత్మ తత్త్వము అని తెలిసికొనడాన్ని వేదాంతం 'నేతి','నేతి', అంటే, 'న ఇతి', 'న ఇతి', అంటే, 'ఇది కాదు' 'ఇది కాదు'..అనే 'నేతి' మార్గం అని చెప్పింది! ఈ 'నిర్వాణ షట్కము' లో 'చిదానంద రూపుడైన శివుడు' అనే పరమాత్మ తత్త్వాన్నిఅదే మార్గంలో ఆది శంకరుడు తెలియ జేశారు!

మనో బుద్ధ్య హంకార చిత్తాని నాహం న కర్ణం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే
నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు: చిదానంద రూపశ్శివోహం శివోహం

నేను మనసునూ కాను, బుద్దినీ కాను, అహంకారమునూ కాను,చిత్తమునూ కాను, నేను కర్ణములనూ కాను, నేను జిహ్వనూ కాను, నేను ఘ్రాణ ఇంద్రియము ఐననాసికనూ కాను,నేను చక్షురింద్రియము ఐన నేత్రములనూ కాను. నేను ఆకాశమునూ కాను, నేను భూమినీ కాను నేను తేజస్సునూ కాను, నేను వాయువునూ కాను, చిదానంద రూపుదనైన శివుడనే, శివుడనే. నేను అంతః కరణ చతుష్టయము ఐన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములను కాను. నేను జ్ఞానేద్రియములైన త్వక్, చక్షు, శ్రోత్ర, (జిహ్వ)రసన, ఘ్రాణ ఇంద్రియములు అంటే చర్మము, కనులు, చెవులు, నాలుక, నాసిక(ముక్కునూ) కాను.అంటే 'నాకోసం' అని ఎవరి కోసం అయితే చర్మము ద్వారా, కనుల ద్వారా, చెవుల ద్వారా, నాలుక ద్వారా, ముక్కు ద్వారా ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నానో ఆ అనుభవించేది నేను కాను. ఆ అనుభవము నాదీ కాదు. అంటే అనుభవించే వాడు వేరే, నేను కాదు. అంటే నాకోసం అని తుచ్చమైన ఆనందాలకు నేను లోను కానవసరం లేదు, కాకూడదు, అంటే నేనే కాదు, ఎవరూ కూడా లోను కావలసిన అవసరం లేదు. ఎందుకంటే వీటి ద్వారా కలిగే ఆనందాలు క్షణికాలు కనుక! నేను పంచ మహా భూతములు ఐన పృదివ్యాపస్తేజో వాయురాకాశములను కాను.అంటే నేను భూమిని కాను, జలమును అంటే నీరునూ కాను, తేజస్సు అంటే అగ్నినీ కాను, నేను వాయువునూ కాను, ఆకాశమునూ కాను. పంచ భూతాత్మకమైన ఈ శరీరమును నేను కాను. ఎందుకంటే పంచ భూతాత్మికమైన ఈ శరీరం పంచభూతములలో కలిసిపోతుంది కనుక. ఇక్కడి ఇంకొక రహస్యం ఏమిటంటే పంచ తన్మాత్రలైన శబ్ద, రూప, స్పర్శ, రస, గంధములనుండి వరుసగా పంచ మహా భూతములు ఐన ఆకాశము,అగ్ని,వాయువు, జలము, భూమి ఉద్భవించాయి, వీనిని గ్రహించడానికి, అనుభవించడానికి వరుసగా పంచ జ్ఞానేంద్రియములు ఐన చెవులు, కనులు, చర్మము, జిహ్వ, నాసిక ఉద్భవించాయి. వీటి ద్వారా ఈ జ్ఞానములు అనుభవం లోకి వస్తాయి కనుక వీటిని జ్ఞానేంద్రియములు అన్నారు.

నచ ప్రాణ సంజ్ఞో నవై పంచ వాయుర్నవా సప్త ధాతుర్నవా పంచ కోశః
న వాక్ పాణి పాదౌ నచోపస్థ పాయు చిదానంద రూపశ్శివోహం శివోహం

నేను ప్రాణ వాయువులైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయు సంఘమును కాను, సప్త ధాతువులైన రక్త, మాంస, మేథ, అస్థి, మజ్జ, శుక్ర, రసములను కాను, నేను అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనే పంచ కోశములను కాను, నేను పంచ కర్మేంద్రియములైన వాక్కు, చేతులు, పాదములు, కామయిచ్చను తీర్చుకునే ఇంద్రియమును కాను, విసర్జక అవయవ ఇంద్రియమునూ కాను, చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే!

న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ
న ధర్మో నచార్దో న కామో న మోక్షః చిదానంద రూపశ్శివోహం శివోహం

నాకు ద్వేషము లేదు, రాగము లేదు, నాకు లోభము లేదు, మోహము లేదు, నాకు మదము కానీ, మాత్సర్యము కానీ లేవు, నాకు ధర్మము, అర్ధము, కామము, మోక్షము లేవు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! అనగా నాకు ఏ ద్వంద్వములూ లేవు, నాకు యే పురుషార్ధములూ లేవు, ఎందుకనగా, నేను భౌతిక శరీరాన్ని కలిగిన మానవుడిని కాను కనుక, నేను సాక్షాత్తూ శివుడను కనుక, మానవ సహజమైన మంచి చెడులకు అతీతుడను కనుక!

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శ్శివోహం శివోహం

నాకు పుణ్యము లేదు, పాపమూ లేదు, సౌఖ్యము లేదు, దు:ఖము లేదు,మంత్రము, తీర్ధము,వేదము, యజ్ఞము, ఏవీ లేవు. నేను అనుభవమును కాను, అనుభవించుట యను క్రియనూ కాను, అనుభవించే వాడినీ కాను, నేను చిదానంద రూపుడనైన శివుడను, నేను శివుడను!

న మృత్యుర్నశంకా నమే జాతి భేద: పితా నైవ మే నైవ మాతా చ జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపశ్శివోహం శివోహం

నాకు మృత్యువు లేదు, శంకా లేదు, జాతి భేదములు లేవు, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, జన్మ లేదు, నాకు బంధువులు లేరు, మిత్రులు లేరు, గురువు లేడు, శిష్యులు లేరు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! జనన, మరణములు, జాతి భేదములు, తల్లి దండ్రులు, గురు శిష్యులు, ఏ బంధములు లేవు, ఎందుకనగా, నేను శివుడను కనుక, అన్ని బంధములకు, అనుబంధములకు అతీతుడను కనుక!

అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణామ్
న చా సంగతం నైవ ముక్తిర్నబంధః చిదానంద రూపశ్శివోహం శివోహం

నేను నిర్వికల్పుడను అనగా నాకు వేరే సాటి ఐనది లేదు, నేను నిరాకారుడను, ఎందుకంటే ఈ ఆకారం శాశ్వతం కాదు కనుక, అన్నింటికీ, అంతటా అన్ని ఇంద్రియములకూనేనే అధిపతిని, నాకు సంబంధించినవి, సంబంధించనివి ఏవీ లేవు, నాకు ముక్తి లేదు, బంధమూ లేదు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! 'మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం' మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగువిధములైన అంతఃకరణ ప్రవృత్తులు వున్నాయి. మనసు అన్నింటికీ అధిపతి. లేని దాన్ని ఉన్నట్లుగా, తనది కాని దాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైన దానిని శాశ్వతమన్నట్లుగా మరులు గొల్పుతుంది, వుసి గొల్పుతుంది, పురి కొల్పుతుంది, భ్రమింప జేస్తుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది, ఆకాశానికి ఎత్తేస్తుంది, అందలాలెక్కిస్తుంది, అధః పాతాళానికి తొక్కేస్తుంది.

కనుకనే మనసే అన్నింటికీ కారణం, ప్రేరణం, ఉత్ప్రేరకం, వినాశకరం. అందుకే ' మన ఏవ మనుష్యాణామ్ కారణం బంధ మోక్షయో:' మనుషుల బంధాలకు, మోక్షానికి కారణం మనసే అన్నది ఒక ఉపనిషత్తు! 'ద్వే శబ్దే బంధ మోక్షాయ మమేతి న మమేతిచ, మమేతి బధ్యతే జంతు: న మమేతి విముచ్యతే., 'నాది', 'నాది కాదు' అనే రెండు శబ్దాలే బంధానికీ, మోక్షానికీ కారణాలు, నాది అనుకుంటే బంధం, ఎందుకంటే నాది అనే దానితో మొదలై, నాది మాత్రమే, నాకు మాత్రమే, నాకు కాకున్నా పరవాలేదు ఎవరికీ కాకూడదు, నాది కాకున్నా పరవా లేదు, ఎవరిదీ కాకూడదు, ఎవరికీ చెందకూడదు..అనే దాకా దారి తీస్తుంది. ఆది వినాశనానికి దారి తీస్తుంది. ఈ నాడు సమాజంలో జరుగుతున్న హింసకు, దౌర్జన్యానికీ అదే కారణం! బుద్ధి విచక్షణను కలిగిస్తుంది. మంచి, చెడులను గ్రహింప గలుగుతుంది. చిత్తము తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేలా చేస్తుంది.

అహంకారం మహదహంకారం(గొప్ప అంధకారం) మిధ్యాహంకారం (మిధ్యాన్ధకారం) అని రెండు రకాలుగా ఉన్నది. అహంకారం అంటేనే అంధ కారం. సృష్టికి మొదలు మహా అంధకారం వ్యాపించి వున్నది. ఏదీ తెలియని బ్రహ్మ దేవుడు తనకన్నా పరమాత్ముడు ఐన వాడిని ప్రార్ధిస్తే ఆ శ్రీ మహా విష్ణువు తన తేజః పుంజములతో దానిని తొలగించి కరుణిస్తే, అప్పుడు బ్రహ్మ తన సృష్టిని కొనసాగించాడు అని పురాణ గాధ. నేను అనేది సాత్త్వికాహంకారం, నేను కూడా అనేది రాజసిక అహంకారం, నేను మాత్రమే అనేది తామసిక అహంకారం! నేను ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎక్కడి నుండి, ఎక్కడికి అనే అన్వేషణ సాత్త్వికమైనది, మనిషిని వున్నతుడిని చేస్తుంది. నేను కూడా అనేది రాజసికమైనది, నాకూ ఒక ఉనికి, ఒక సత్తా ఉంది అనే సాధనకు ఉపకరిస్తుంది. ఈ రెండూ మంచివే.అవసరమైనవే. నేను మాత్రమే, నాకు మాత్రమే, నాది మాత్రమే అనేది తామసికమైనది, అది దాన్ని కలిగివున్నవాడిని, వాడి ద్వారా సర్వాన్నీ నాశనం చేస్తుంది. ఈ నాశనానికి చిత్తం బాటు వేస్తుంది, చిత్తం వచ్చినట్లు ప్రవర్తించడం ద్వారా, దానికి మనసు కారణమౌతుంది సరిగా వుపయోగించకుంటే, మనసే అన్నింటికీ కారణం కనుక దానిని బుద్ధికి స్వాధీనం చేసి, అప్పుడు బుద్ధి ద్వారా కలిగిన విచక్షణతో మంచి చెడులను తెలిసికొని, మంచిని గ్రహించి, చెడును విసర్జించాలి కనుక బుద్ధి పరమాత్మ తత్త్వం. ఉపనిషత్తులు అన్నీ ఇదే చెప్పాయి.

"ఆత్మానగుం రధినం విద్ధి శరీరం రధమేవతు బుద్ధించ సారధిం విద్ధి, మనః ప్రగ్రహమేవచ,
ఇన్ద్రియాణి హయాన్యాహు: తేషాం విషయ గోచరాన్, ఆత్మేంద్రియ మనో యుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః " ... అన్నది ఒక ఉపనిషత్తు. అంటే శరీరమే రధము. ఆత్మ అంటే పరమాత్మ స్వరూపి ఐన జీవాత్మ రధికుడు. అంటే రధాన్ని ఎక్కేవాడు. బుద్ధి సారధి. అంటే పరమాత్మ రూపకమైన బుద్ధి ఈ రధాన్ని నడిపితే, గుర్రములవంటి ఇంద్రియములను మనసుఅనే కళ్ళెంతో అదుపు చేస్తూ, పరమాత్ముడి సారధ్యంలో, సర్వం ఆయనకే అప్పగించి, నమ్మి,కూర్చుంటే రధాన్ని క్షేమంగా గమ్యానికి నడుపుతాడు, కనుక మనసు అనే కళ్ళెమును కూడా సారధి ఐన పరమాత్ముడికి అప్పగించాలి అంటే మనసును పరమాత్ముని యందు లగ్నం చేయాలి. ఆత్మ, ఇంద్రియాలు, మనసు కలిగిన వాడిని భోక్త అంటారు, దానికి బుద్ధిని కూడా జోడిస్తే ఆ భోక్తృత్వభావన నశిస్తుంది. అప్పుడు నేను చేస్తున్నాను, చూస్తున్నాను, అనుభవిస్తున్నాను అనే భావన నశిస్తుంది. అప్పుడు సుఖ దు:ఖాలూ, రాగ ద్వేషాలు, బంధ మోక్షాలూ, మంచీ చెడూ, ఇలాంటి ద్వంద్వాలు నశిస్తాయి. శివమే అంటే శాంతమే, సౌఖ్యమే, ఆనందమే మిగులుతుంది. కనుక శివోహం, శివోహం! బుద్ధికి అప్పజెప్పి ప్రయాణం చేస్తే కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రియాలూ దారి తప్పవు, మంచికర్మలే మిగులుతాయి, మంచిజ్ఞానమే మిగులుతుంది అప్పుడు శివుడౌతాడు మానవుడు, కనుక ఇంతా కలిగిన శివుడనే నేను! సప్త ధాతువులు, పంచ ప్రాణాలు, పంచ కోశాలు, బంధాలు, భవ బంధాలు, అనుబంధాలు, సంబంధాలు అన్నీ నేను దేహం అనుకుంటే అవి గెలుస్తాయి, నేను దేహమును కాను, ఎందుకంటే దేహం శాశ్వతం కాదు కనుక, అని తెలిసికొంటే దేహం నశిస్తుంది, ఆత్మ రహిస్తుంది, ఆత్మ మిగులుతుంది, ఆ ఆత్మ పరమాత్మ తత్త్వం కనుక, 'జీవం ఉన్నంతకాలం జీవునితో వుండి తరువాత దేవునితో కలిసిపోతుంది' కనుక, దానికి మరణం లేదు, కనుక ఆది శాశ్వతం. ఈజ్ఞానం కలిగితే దేహం ద్వారా వచ్చే ఏ మంచి చెడు, సుఖ దు:ఖాలు, మొదలైన ద్వంద్వాలుండవు కనుక అప్పుడు మిగిలేది పరమానందమే, కనుక నేను శివుడను, నేను శివుడనే! మనసును బుద్ధి ద్వారా నియమించుకుని కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను జయించి, కర్మేన్ద్రియములను, జ్ఞానేన్ద్రియములను, ప్రాణ వాయువులను, సప్త ధాతువులను,పంచమహాభూతాలను, పంచ కోశాలను జయించి అంటే ఇవన్నీ జయించడం ద్వారా మిగిలిన పరమానందమును అనుభవించడం ద్వారా చిదానంద రూపుడైన శివుడను నేను, శివుడనే నేను!

యద్వాచా నాభ్యు దితం యేన వాగభ్యుధ్యతే ....
యన్మనసా న మనుతే ఏనాహుర్మనోమతం ....
యత్ చక్షుసా న పశ్యతి యేన చక్షూగుమ్సి పశ్యతి....
యత్ శ్రోత్రే ణ న శ్రుణోతి యేన శ్రోత్రమిదం శ్రుతం...
యత్ ప్రాణేన న ప్రాణితి యేన ప్రాణాః ప్రణీయతే...
తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిద ముపాసతే!!!

ఏది వాక్కుల ద్వారా తెలిసికొన బడ జాలదో, దేని ద్వారా వాక్కు పలుకడం జరుగుతుందో, ఏది మనసు ద్వారా తెలిసికొన బడజాలదో, దేని ద్వారా మనసు దేనినైనా తెలిసికొన గలుగుతుందో, ఏది కనుల ద్వారా చూడ బడ జాలదో, దేనిద్వారా కనులు చూడ గలుగుతాయో, ఏది చెవుల ద్వారా వినబడ జాలదో దేని ద్వారా చెవులు విన గలుగుతాయో, ఏది ప్రాణములచేత జీవింపదో, దేని ద్వారా ప్రాణములు జీవింప గలుగుతాయో అదియే బ్రహ్మము, వేరేది ఏదీ కాదు, అని చెప్పింది ఒక ఉపనిషత్తు. రెండు పెదవులు, ముప్పై రెండు పళ్ళూ, నాలుక, కొండ నాలుక వున్నవాళ్ళు కూడా పలుకలేని వారు వున్నారు, మూగ వాళ్ళు, అంటే వీటన్నింటికీ పలుకును ఇచ్చే శక్తి ఒకటి వున్నది కదా, ఆది లేక పోతే ఇవన్నీ వున్న వాళ్ళు కూడా పలుకలేరు కదా, కళ్ళు, కను బొమలు, కను గుడ్లు అన్నీ సరిగా వున్నా చూపులేని వాళ్ళు గుడ్డివాళ్ళు వున్నారు, అంటే వీటన్నింటికీ చూపును ఇచ్చే శక్తి ఒకటి వేరేది వున్నది, అలాగే చెవులున్నా, కర్ణభేరి వున్నా మిగిలినవి అన్నీ సరిగా వున్నా వినలేని చెవిటి వాళ్ళు వున్నారు, అంటే వీటన్నిటికీ విన గలిగిన శక్తిని ఇచ్చే శక్తి ఒకటి వున్నది కదా, ప్రాణములు వున్నప్పుడూ తెలియబడనిది, అదేదో తెలియనిది ఐన ఏది లేకుంటే ప్రాణములు లేకుండా పోతాయో, దానివల్లనే ప్రాణములున్నట్లు, జీవం వున్నట్లు కనిపిస్తుందో, .అదియే బ్రహ్మము. అంటే కేవలం పైకి కనిపించే నోరు, కళ్ళు, చెవులు,ఇవన్నీ సరిగా వున్నా అవి పని చేయకుండ పోతాయి, అంటే వీటికి శక్తినిచ్చే శక్తి ఒకటి ఉందికదా, అదే బ్రహ్మం. పంచకర్మేంద్రియాలూ, పంచ జ్ఞానేంద్రియాలు అలాగే వున్నా ప్రాణం లేని శరీరం ఎందుకూ పనికిరాదు, ఏదీ చేయ లేదు. నోరున్నా పలుకలేదు, చేతులున్నా పనులు చేయ లేవు, కాళ్ళు వున్నా నడువలేవు, కామేంద్రియం వున్నా పని చేయదు, కామం వుండదు, విసర్జక అవయవం వున్నా విసర్జించే శక్తి వుండదు , చర్మం వున్నా స్పర్శను గ్రహింపలేదు, కనులు వున్నా చూడలేవు, చెవులు వున్నా వినలేవు, నాలుక వున్నా రుచి చూడ లేదు, ముక్కు వున్నా వాసన చూడలేదు, సప్త ధాతువులూ వున్నా వాటి పని అవి చేయ లేవు, పంచ కోశాలు వున్నా పనికి రావు. ఇవన్నీ వున్నా ఏది లేకుంటే ఇవన్నీ లేనట్లే లెక్కనో అదే ప్రాణ శక్తి, అదే బ్రహ్మం, అదే జీవం, అదే నాదం, అదే వేదం! కనుక ఆ శక్తిని మాత్రమే శాశ్వతము ఐన శక్తిగా తెలిసికొంటే మిగిలినవన్నీఅశాశ్వతాలు అని తెలిసికొనడం జరుగుతుంది. అప్పుడు మిగిలిన వాటి ద్వారా వచ్చే సుఖ దు:ఖాలు, జయాపజయాలు,

క్షణికమైనవి అని తెలుస్తుంది, ఆనందమే మిగులుతుంది, కనుక శివుడనై  పోతాను కనుక నేను శివుడను, నేను శివుడనే!

"అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం
తథా అరసం నిత్య మగంధ వచ్చయత్
అనాద్యనంతం మహతః పరం ధృవం
నిచాయ్య తన్మ్రుత్యు ముఖాత్ప్ర ముచ్యతే"

అన్నది ఒక ఉపనిషత్తు ఇదే భావాన్ని తెలియజేస్తూ. ఈ జ్ఞానం కలిగినప్పుడు మృత్యువు లేకుండా పోతుంది, పుట్టుకే శాశ్వతం కాదు అని తెలిస్తే మృత్యువూ శాశ్వతం కాదు అని తెలుస్తుంది కనుక మృత్యువు వుండదు, ఇదంతా అశాశ్వతం అని తెలుస్తుంది కనుక ఇవన్నీ పోయేవే అని తెలుస్తుంది కనుక భయం వుండదు, ఆ భయమే మృత్యువు, ఆ బలహీనతే మృత్యువు, తెలిసికొన్న ఆ శాశ్వత సత్యం, ఆ శక్తి అదే జీవం, ఎందుకంటే దానికి చావు, అంతం అనేది లేదు కనుక, ఇదే భావాన్ని స్వామి వివేకానంద చెప్పింది! ఇక్కడ చావు వుండదు అంటే పుట్టుకా శాశ్వతం కాదు, చావూ శాశ్వతం కాదు, అవి సహజ ధర్మాలు,అనివార్యాలు అని తెలియడం వలన కలిగే జ్ఞానం వలన కలిగే ఆనందం వలన మృత్యు భీతి వుండదు, కనుక మృత్యు భావం వుండదు, కనుక మృత్యువు వుండదు అని అర్థం, అంతే కానీ, ఈ జ్ఞానం కలిగిన వాడు శారీరకంగా చిరంజీవి అని కాదు, శరీరానికే మృత్యువు, ఆత్మకు కాదు అని తెలిసికొనడం వలన కలిగే చావులేని ఆత్మజ్ఞానం అని అర్థం! ఎందుకంటే ఆ ఆత్మకు చావు లేదు కనుక. ఇదే శ్రీ కృష్ణుడు అర్జునునితో చెప్పింది!

ఇన్ని ఉపనిషత్తుల మర్మాలను స్ఫురింపజేస్తూ, నిత్యమూ శివమూ, శాంతమూ, అద్వైతమూ ఐన పరమాత్మఅనుభవమునకు సంబంధించిన బ్రహ్మానందానుభూతిని పొందటానికి కావలసిన సాధనా విధానాన్ని, భావనా విధానాన్ని ఈ  'నిర్వాణ షట్కము' లో తెలిపి పరమోత్క్రుష్టమైన వేదాంత దర్శనం చేశారు ఆదిశంకరాచార్యుల వారు. నా అల్పబుద్ధికి అందినమేరకు  ఆ విషయాన్ని ఇక్కడ ఇవ్వడానికి ప్రేరణనిచ్చిన ఆదిశంకరుల పాదపద్మములకు వినయంగా అంజలిస్తూ, స్వస్తి!


రామో విగ్రహన్ ధర్మః

రామో విగ్రహన్ ధర్మః
ఈ వాక్యం రాముని ధర్మనిరతిని సూచిస్తూ పలువురు ప్రస్తావిస్తారు. అయితే రామాయణం లో ఈ వాక్యాన్ని వాల్మీకి గారు మారీచునితో అనిపిస్తాడు. వినటానికి మనకు గమ్మత్తుగా వున్నది. మారీచుడు ఏమిటి రాముని అంతలా విగ్రహన్ ధర్మః అనే అంతగా...వివరాలు లోకి వెళితే ...మారీచుడు రావణాసురిని వద్ధ ముఖ్యుడు. ఏంత అంటే రావణాసురిని అంతరింగక వర్గంలోని ముఖ్యుడు రావణాసురిని బంధువు. తాటకి కుమారుడు. తాటకి రావణాసురిని అమ్మమ్మ. అంటే మారీచుడు రావణాసురుని మేనమామ. ఇది వారి  సంబంధం. ఇంత విశ్వసనీయత వారి మధ్య వున్నది.
రావణుడు మారీచుని సీతాపహరణంనకు ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో మారీచునకు అంతకు క్రితమే విశ్వామిత్రులతో యాగసంరక్షణార్ధం వచ్చిన రాముని చేతిలో తనతల్లి మరణం , తనసోదరుడు సుబాహు మరణం ఇత్యాదులవలన మరియు సహజ సిద్ధమైన తన రాక్షసమాయలతో ప్రజలద్వారా చారుల ద్వారా ఇలే అనేక విధాలుగా రామచంద్రుని ధర్మనిరతి ఆయన వీరత్వం కర్తవ్యపరాయణత్వం రాముని బాణం యొక్క వాడి వేడి తెలిసిన వాడగుటచేత రావణాసురునికి సీతాపహరణం కూడదు అని హితవు చెప్పే సమయంలో రావణాసురిని ఉద్దేశించి  ఉద్దశేంచి " రామో విగ్రహన్ ధర్మః" అని ప్రస్తావిస్తాడు. రావణా విను రాముడు మామూలు వాడు కాదు ధర్మం పోత పోసి సశరీరంగా నడయాడే స్వరూపం అటువంటి ధర్మశిఖతో ప్రజ్వరిల్లే రాముని ధర్మపత్నిని అపహరించమంటున్నావు నీవు శలభంలా మాడిపోతావు అంతేకాదు నీవు , నీతో అనుసరించిన నేను , మేము కడకు ఈ రాక్షసజాతి వినాశనమునకు ,లంకకు మంగళకరము కాదు అని పలువిధాలా బ్రతిమలాడుతాడు కాని వినడు చివరకు విధిలేని పరిస్థితి లో బంగారు జింక వేషం ధరించి వెళ్ళి రామబాణం తగిలి మరణిస్తాడు కాని రాక్షస బుద్ధిగా చనిపోయో సమయంలో హలక్ష్మణా అనే ఆర్తనాదాలు చేసి చనిపోతాడు.తదుపరీ సీతాపహరణం , ఆతదుపరి రావణసంహరం . ఇది అంతా రాముని ధర్మనిరతిని తెలుసుకోవటమో. అందుకే రామో విగ్రహన్ ధర్మః.
అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
శ్రీరామ జయం.
ఆలపాటి రమేష్ బాబు
విజయవాడ.
94401 72262.

లోకఃసమస్తా సుఖినో భవంతు

లోకఃసమస్తా సుఖినో భవంతు.
*********************************
లోకః సమస్తా సుఖినోభవంతు. ఈ వాక్యం మనలో చాలా మంది అనేకసార్లు విని , చదవి వుంటారు. కాని దీని విశేషం తెలుపుటతో పాటు
వర్తమాన కాల అన్వయం చేసి మన భరతజాతి గొప్పదనాన్ని పునఃశ్చరణ చేయిటయే ఈ వ్యాస ముఖ్యోద్దేశ్యం.
మన భరతజాతి లో హైందవం అనేది నేడు మతము అయినా ఇది ఓ జీవనమార్గం అనేది సత్యం.
మనం తెలుసుకో కోరే వాక్యం స్వస్తి వచనాలలో ఓ భాగంగా వున్నది. ఈ స్వస్తి వాక్యాలు మనం విశేషకార్యక్రమాలు నిర్వహించినప్పడు ఆకార్యక్రమం చివరలో బ్రహ్మగారు ఈ క్రింది మంత్రాలతో దీవిస్తారు అవి...

*******
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం!

న్యాయేన మార్గేణ మహీం మహీశాః!!

గోబ్రాహ్మణ్యేభ శ్శుభ మస్తు నిత్యం!

లోకాస్సమస్తా స్సుఖినోభవంతు !!

కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యస్యాలినీ!
దేశోయం క్షోభ రహితో బ్రాహ్మణా స్సంతు నిర్భయాః!!
అపుత్రాః పుత్రిణస్సంత్తు,పుత్రిణస్సంత్తు పౌత్రిణః!
అధనా స్సధనా స్సంతు జీవంతు శరదాం శతం!!
యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే!
వృతనాళౌ సమభవత్ తత్తే భవతు మంగళం!!
ఋతవ స్సాగరా ద్వీపా వేదా లోకా దిశశ్చతే!
మంగళాని మహారాహో దిశంతు తవ సర్వదా!!

పై శ్లోకాలు కి అర్ధం
శుభం కలుగుగాక! ప్రజలకి, న్యాయమార్గంలో వుండి ఈ భూమిని ప్రజలను ,రక్షించు ప్రభువులకి.
గోవులు  , బ్రాహ్మణులకు సదా శుభం కలుగుగాక.
లోకములో అందరు శుభముగా వుందురుగాక.
అన్నీకాలములలోను భూమిపైన వర్షాలు కురిసి పంటలు పచ్చగా పండుగాక.
దేశాలు అన్నీ ఈతి భాధలు కరువు కాటకాలు లేకుండా వుండుగాక , బ్రాహ్మణులు వారి సంతానం వారి గురుకులాలు శుభంగా వుండుగాక.
పుత్రులు లేని వారికి పుత్రులు , పుత్రులు వున్నవారు పౌత్రులు ప్రపౌత్రులతో శుభంగా వుండుగాక.
ధనంలేని వారు ధనం కలిగి , ధనం కలిగిన వారు పాడి పంటలతో చల్లగా వందసంవత్సరాలు జీవింతురుగాక.
మాకు జయం కలిగించు ఇంద్రాది దేవతలకి శుభం.
ఈ జీవనచక్రమార్గం నుంచి ఆత్మదర్శనం కావించే భగవంతునికి శుభం.
సకల సమాయాలలో సకల దిక్కులలో శుభం కలుగుగాక.
చూశారా వేల సంవత్సరాలుగా ఈ వేదభూమిలో ప్రతి ఓక్కరి మనుగడ ప్రతి జీవ జాలం మనుగడే మన కాంక్ష ఆకాంక్ష...ఈ పద్ధతే మన జీవన విధానం.
కాని వర్తమానం లో ఈ భూగోళం పై జరుగుతున్న విధానం ఏమిటి... మేము మాత్రమే బాగుండాలి అన్న అహంకార పూరిత విధానం ప్రదర్శించిన ప్రతి సమయంలో కాలపురుషుడు ప్రకృతి రూపంలో ఈ వైపరిత్యం ను సమం చేసే వెళుతున్నారు...కాలపురుషుడు తన పాఠాలు నిర్దయగా చెప్పుకుంటూ వెళుతున్నా మూర్ఖ పద్ధతిలో వున్న అనేక దేశాలకి వర్తమాన వైరస్ ఓక దండనే...ఈ వైరస్ ప్రారంభ దేశం నుంచి గమనించండి...వాళ్ళు నిజం చెప్పటానికి సిద్ధంగా లేరు కాని..ఆ దేశంలో అనేక వేల మరణాలు...మరి అగ్ర రాజ్యంలో మరణాలు లెక్క కొనసాగుతుంది...మతవాదంతో , కుట్రలు కుహకాలతో నిండిన ఇటలి పీనుగల పోగు...మరి కొన్ని దేశాలది అదే పరిస్థితి... అంత ఎందుకు మన ప్రక్కనే వుండే పాకిస్థాన్ పరిస్థితి ఏమిటి వున్నవాడు ఎవరో చచ్చేవారు ఎవరో తెలియని దిక్కుమోక్కులేని స్థితి....
ఇలా గమనించండి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే భారతదేశం బాగానే వున్నది. మేమే బాగుండాలి అన్న ప్రతి ఓక్క దేశంనకు ఈ కరోనా వైరస్ శిక్ష గా తన భాధ్యత నేరవేర్చాడు కాలపురుషుడు.

"లోకః సమస్తా సుఖినో భవంతు"
" మన సంకల్పం ఓకటై వుండుగాక
మన భావం ఓకటై వుండుగాక
మన చింతన ఓకటై వుండుగాక
మన మధ్య అద్భుతమైన సామరస్యం నెలకొనుగాక"
(అధర్వ  - 6 - 64 - 4)
ఓం శాంతి శాంతి శాంతిః.
శ్రీరామ జయం.
ఆలపాటి రమేష్ బాబు
విజయవాడ
94401 72262..




రుద్ర నమక చమక పారాయణ విశేషాలు

మిత్రులు,
నమస్కారం...
మనవారు తమ జీవన ఆనందాలకి కృతజ్ఞతలు మరియు కష్టనష్టాల నివేదనకు రుద్రాభిషేకం, అభిషేకం చేశాం చేస్తాం..మరి ఈ అభిషేకంలో అయ్యవారు కొన్ని మంత్రాలు చదువుతారు చివరకు మనకు రెండు చుక్కల తీర్ధం ఇస్తే పుచ్చుకుని వస్తున్నాం. ఆ భోళాశంకరుడు మన మన ప్రాప్త , అప్రాప్తలను బట్టి తన కరుణప్రసాదిస్తున్నారు. మరి ఇంతటి రుద్రాభిషేకంలో ఏమున్నాయి..మనం స్వామి వారిని ఏమి అడుగుతున్నాం స్వామి వారిని ఏ ఏ ప్రదేశాలలో దర్శిస్తున్నామో తెలుసా..వీటిని తెలియచెప్పేది . ఈ రుద్రాభిషేకవిధిలో వున్నవి మహన్యాసం , రుద్రనమక , చమకాలు.
శివుని (రుద్ర) దర్శించాలంటే శివుడు కానివాడు శివుని చూడలేరు. అంటే స్థిరచిత్తంతో ధ్యానంలో వున్న శివుని అంతే స్థిరచిత్తంతో మీ ఆత్మనందు మీ మనస్సు నందు స్థిర పరచిన కాని ఆయన దర్శనం కాదు..ఆయనను స్పృశించలేము. మరి స్వామిని స్పృశించటం అంటే అగ్నిశిఖలా ప్రజ్వరిల్లే స్వామిని ఈ కారణభూత శరీరంతో ఎలా స్పృశించాలో తెలియచేసే ప్రక్రియ మహన్యాసం.దీనిని రౌద్రికరణ అంటారు. ఈ ప్రక్రియలో ఐదురకాల అంగన్యాసాలు వుంటాయి..అంటే శిఖాది పర్యంతం పాదాంతం వరకూ శుద్ధి చేతనత్వం కలిగించే ప్రక్రియ ఈ మహన్యాసం.
గమనించారా అయ్యవారు మనలను పైకి క్రిందకూ చూడమంటారు. మన సహస్రారం నుండి పాయువు వరకూ , మన శిఖ నుండి అరి పాదం వరకూ ప్రతి అంగాన్ని స్పృశించి శుద్ధి చేయమంటారు. ఈ సమయంలో ఆయా ప్రదేశాలలో వున్న అంతఃశ్చక్రశక్తిని సమంత్రపూర్వకంగా చేతనత్వం కలిగించటమే ఈ మసన్యాస లక్ష్యం.
దీని తదుపరి రుద్రనమక,చమకపారాయణ చేస్తారు. మరి ఇవి ఏమిటి ....
రుద్రపారాయణ..ఇది శివుని వైభవాన్ని ప్రస్తుతించే మంత్రాలు..ఇందు శివుడు ఏక్కడ ఏక్కడ వున్నాడో తన దర్శనాలు , ప్రజ్ఞ ,కరుణ ఇత్యాది అనేకానేకం ఈ రుద్రంలో వుంటాయి.
ఇది మొదట రుద్రం ఇది రుద్రధ్యానం..తదుపరి నమకం... ఇందు శివుని ప్రస్తుతించుతూ 11 అనువాకాలు వుంటాయి..ఈ 11అనువాకాలలో ఈ సృష్టిలోని జీవ అజీవ పశు పక్ష్యాదులు సూర్య చంద్రగోళాదులు సకల దిక్కులు సకల చర అచర ప్రపంచం మొత్తంలో శివుని దర్శించుతూ అంజలి ఘటించటం అనగా నమస్కరించటం..ఇది ఏ విధంగా వుంటుందో క్లుప్తంగా ప్రథమ , పదకొండవ అనువాకాలు మీకు తెలియచేస్తాను..
ఇక్కడ నేను మంత్రాలు తెలుపను వచనం మాత్రమే..
మొదటి అనువాకం :
:
భగవంతుడైన రుద్రునికి నా నమస్కారములు. ఓ రుద్ర! నీ శరములకు, ధనుస్సుకు, బాహువులకు నమస్కారము. ఎంతో శుభకరమైన నీ అమ్ముల పొది, అస్త్ర శస్త్రముల్తో మాకు ఆనందాన్ని కలిగించు. వెండి కొండ పైనుండి మమ్మల్ని ఆనంద పరిచే ఓ రుద్రా! ఎంతో శాంతి కలిగిన, శుభకరమైన, పాపరహితమైన, మోక్షకరమైన, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే నీ వీక్షణములను మా వైపు ప్రసరించు. మాకు ఆత్మ జ్ఞానాన్ని కలిగించు. ధవళగిరిపై కూర్చుని మాకు ఆనందము, ఉపశమనము కలిగించే, పాపులను నాశనం చేయటానికి పొందిన అస్త్రాలను శాంతింప చేయుము. నిన్ను కాన్చుటకు మేము నిన్ను స్తుతించి, నుతించు చున్నాము. ప్రసన్నుడవై మమ్ము, మా బంధువులను, గోవులను కాపాడి మాకు రోగములనుండి విముక్తి కలిగించుము. మేము ప్రేమతో ఉండునట్లుగా చేయుము. అన్నిటా ప్రథముడై, దేవతలలో దైవత్వమై, భక్తుల రోగాలను బాపే వైద్యుడై, భక్తుల సత్కార్యములను పొగడే వాడి, వారి పాపములను పోగోట్టేవాడైన ఓ రుద్ర! అసురులను, క్రూర మృగములను నాశనము చేసి మమ్ము కాపాడుము.  ఎరుపు, బంగారపు వర్ణములో ఉండి, తానే సూర్యుడై ఉన్నాడు ఆ రుద్రుడు. అటువంటి సహస్ర దిక్కులలో ఉన్న సహస్ర రుద్రులకు మా నమస్కారములు. వారంతా శాంతిన్చెదరు గాక.  గరళము కంఠం నందు కలిగి పశుకాపరులకు, స్త్రీలకు కూడా ఎర్రని కాంతితో రాగి రంగులో సూర్యుని వలె కనిపించే ఆ రుద్రుడు మా అందరికి ఆనందమునిచ్చు గాక. నీలకంఠుడు, వేయి కన్నులు కలవాడు, అనంతమైన వరాలు ఇచ్చేవాడు అయిన ఆ రుద్రునికి, ఆయన భక్తులకు నా నమస్కారములు. ఓ దేవా! ధనుస్సు యొక్క తాడు ముడి తీసి, దానిని దించి, అస్త్రములను అమ్ములపొదిలో ఉంచి దానిని పక్కకు పెట్టుము. బాణముల పదునైన మొనలను త్రుంచి, ధనుస్సును దించి, శాంత రూపంతో మమ్మల్ని ప్రసన్నించు. అస్త్రములు, ఆయుధములు అన్ని శాంతించి, వాటి స్థానాల్లో ఉండు గాక. భక్తుల కోర్కెలను తీర్చే ఓ రుద్రా! మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు. నీ ఆయుధాలకు, ధనుస్సుకు నా వందనములు. నీ అస్త్ర శస్త్రాలు మా శత్రువులను నాశనము చేయు గాక (శత్రువులంటే పాపములు). అవి మా నుండి దూరముగా వెళ్ళు గాక. జగత్పతి, దేవాదిదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, ప్రళయాగ్ని రూపుడు, నీలకంఠుడు, యముని జయించిన వాడు, అన్నిటికి నాథుడు, శాంతముర్తి, సమస్త శుభకరుడు అయిన రుద్రునికి నా నమస్కారములు.
పదకొండవ అనువాకం :

ఓ రుద్రా! వేల కొలది, వేల రకాల ఆయుధాలు కలిగి ఉన్న వేల మంది నీ సైనికులను మాకు వేల మైళ్ళ దూరమున ఉంచు. ఈ విశ్వములో ఉన్న అనంతమైన రుద్రుని సైనికులు - కంఠములు నీలము, తెల్లగను గలిగిన వారు, పాతాళంలో, స్వర్గంలో ఉండే వారు,   కంఠములు నీలము, ఎరుపుగాను ఉండి వ్రుక్షములపై ఉన్నవారు, ముడి వేసుకున్నవారు, కేశములు లేని వారు, జనులను బాధించి వారు పాత్రలనుండి ఆహారము, నీరు తీసుకునే వారు, అన్ని మార్గములలో నున్న వారిని రక్షించే వారు, కాపాడే వారు, పదునైన ఆయుధములు కలిగిన వారు,  పవిత్రమైన జలాలను కాపాడే వారు - వివిధ దిక్కులలో నున్న వీరందరినీ, వారి ఆయుధాలను మానుండి దూరముగా ఉంచుము. భూమి, ఆకాశము, ఇతర లోకములలో ఉండి మమ్మల్ని కాపాడే సైనికులకు మా వ్రేళ్ళతో, చేతులతో, దిక్కు దిక్కున నమస్కారములు. మాకు వారు ఆనందము కలిగింతురు గాక. వారికి మేము మా శత్రువులను ఆహారముగా సమర్పిస్తున్నాము. సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!. సమస్త జగత్తు యందు ఉన్న ఆ శివునికి మా నమస్కారములు. ఉత్తమమైన అస్త్ర శాస్త్రములు కలిగి, వైద్యుడై మన రోగాలను నిర్మూలించే, రాక్షసులను సంహరించే రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారములు. శివుని తాకి, పూజించే ఈ హస్తము మాకు దేవునితో సమానము. శివుని తాకినా ఈ హస్తము నా సర్వ రోగములకు దివ్యౌషధము. ఓ దేవా! ప్రాణులను చంపుటకు ఉపయోగించే సహస్రమైన నీ పాశములను మాకు దూరముగా యుంచమని మా ప్రార్థన. దానికోరకై మేము ఈ అగ్నిహోత్రము ద్వారా నీకు ప్రీతిని సమర్పిస్తున్నాము. రుద్రునకు నా నమస్కారములు. మృత్యుదేవత నా వాద్దకు రాకుండు గాక. ప్రాణము, ఇంద్రియముల కలిసే గ్రంధులలో నివసించే ఓ దేవా! నేను సమర్పిస్తున్న ఆహారమును స్వీకరించి నాయందు నివసించుము. మృత్యు దేవతను నా నుండి దూరముగా ఉండు గాక.
ఇవేకాదు మానవజీవతంలో ప్రతి అవస్ధలో ప్రతి స్వభావం లో శివుని దర్శించారు మన పూర్వీకులు. బాల్య యవ్వనాది అవస్థలలో శాంత కోపాది స్వభావాలలో దర్శనం..
చమకపారాయణం:
ఇది ఇంకా విశిష్టం అయినది. చమే అంటే నాకు ప్రసాదించు అని వేడుకోవటమే..మానవ జీవితానికి అవసరం అయిన ప్రతి దానిని ప్రసాదించమని వేడుకోవటమే..
జన్మనుంచి జన్మరాహిత్యం వరుకు , పుట్టుక నుండి మరణం వరకూ...మీరు చదివినది నిజమే మరణం..అవును నాయన మాకు బాధ నొప్పి ఎవరి మీద ఆధారపడని మరణం ప్రసాదించమని వేడుకోవటం..జీవితానికి కావలసిన తేజస్సు ఓజస్సు ఊర్జత్వం ఇలా ప్రతి ఓక్కటి..ఇంతేనా ఆహరం పానియం ...భూమి ఆకాశం , జ్ఞానం అజ్ఞానం ఇలా ప్రతి ఓక్కటి ప్రసాదించమని వేడుకోవటమే..
ఇది  కూడా పదకొండు అనువాకాలు వుంటుంది
కొన్నిటి గురించి తెలుసుకుందాం
ఇక్కడ కూడా నేను మంత్రాలు తెలుపట లేదు వచన వివరణ మాత్రమే...
1వ అనువాకం.
ఓ దేవా! అగ్ని విష్ణు రూపమైన వాడ!  మీరు నా పట్ల సంతుష్టులై ఉండుటకు నేను నుతించే ఈ పదములు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుండు గాక. నాకు ఎల్లపుడు ఆహారము, ధనము సమృద్ధిగా నుండు గాక. 
2 వ అనువాకం:
నేను రుద్రుని అర్చించుట వలన - ఆహారము, దాన్ని ఇచ్చే మనసు,  ఉత్సాహము, కాపాడుకునే శక్తి, ఆహారాన్ని సంపాదించే శక్తి, దోషములు లేకుండా మంత్రోచ్చారణ చేసే సామర్థ్యం, యశస్సు, ఉచ్చారణ, వివేకము, స్వర్గము, ఆత్మ శక్తి,  అపాన వ్యానాదులు,  ఆత్మ, ఆలోచన, ఆలోచనచే గ్రహించ బడేవి, వాక్కు, మనస్సు, ఇంద్రియములు, జ్ఞానమును పొందుటకు కావలసిన ఇంద్రియ శక్తి, ఆత్మ బలము, శత్రువులను సంహరించే శక్తి, ఆయుష్షు, వృద్ధాప్యం, ఆరోగ్యకరమైన శరీరము, ఆనందము, శరీరాన్ని కాపాడటానికి ఆయుధాలు, బలమైన, స్థిరమైన అవయవములు, ఎముకలు, కీళ్ళు మొదలగు అవయవములు - నాతో, నాలో ఉండు గాక. 
3వ అనువాకం
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - కీర్తి, నాయకత్వము, క్రోధము, చలించని మనసు, చల్లని నీరు, గెలిచే మరియు గౌరవము పొందే సామర్థ్యము, స్థిరాస్తులు, పుత్ర పౌత్రాదులు,   అప మృత్యువు లేని సంతానము, ధన ధాన్యములు, పెరిగే జ్ఞానము, సత్యము, వివరము పట్ల ధ్యాస, ఆకట్టుకునే సామర్థ్యము, శరీర సౌందర్యము, క్రీడలు ఇతర విషయముల వలన కలిగే ఆనందము, చేసేది, చేయబడేది, దేవతలా ఆశీర్వాదము, సత్కార్యములు, ఖజానా, నిలిచే సంపాదన, ఎక్కువ సంపాదించే సామర్థ్యము, ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి, మంచి మార్గములు, మంచి యజ్ఞ ఫలము, పుణ్యము, సత్సంపాదన, పని చేయ గలిగిన మంచి సామర్థ్యము, ముందు చూపు, నిలకడ - నాకు కలిగి, నాతో ఉండు గాక.
ఇలా విశేషమైనది విశిష్టమైనది..



మార్కండేయుని చరిత్ర - మరి కొన్ని విశేషాలు

మార్కండేయుని చరిత్ర.
మార్కండేయుడి చరిత్ర చదవటం అంటే ఈనాటి వారికి తెలియదుకాని పాతరోజులలో చిన్నపిల్లలు ఆరోగ్యం లేక విధివశాత్తు వ్యాధిగ్రస్తుడై బాధపడుతుంటే ఏమి చేయాలో తెలియక తోచని స్థితిలో వున్నవారికి  ఇచ్చే సలహా మార్కండేయపురాణం చదవమని.
ఈనాటి పిల్లలకు పురాణమంటే అవగాహన పోయింది కాని పురాణపఠనమంటే కధారూప పూజ , కధారూప ఈశ్వరార్చన. కధ చదువుతు ఈశ్వరమహిమను ప్రభుతను విభుతను అర్ధం చేసుకుంటూ ధ్యానసమాధి కావటమే అని ఎందరికి తెలుసు. ఆసమయంలో తమ పిల్లల ఆరోగ్య సంరక్షణ చేయమని భగవంతుని వేడుకోవటం...అలాగే చిన్నపిల్లలు వరుసగా తుమ్ము తే చిరంజీవ చిరంజీవతో పాటు మార్కేండేయ ఆయష్షు , హనుమంత ఆయష్షు అని ఉచ్ఛరించేవారు..ఈ ఆచారం మెల్లగా పోయింది. కారణం తుమ్మిన సమయంలో కొన్ని సార్లు హృదయస్పందన ఆగిపోయి ప్రాణాపాయం జరిగేవి...వాటికి కారణాలు తెలియక అన్నిటికి దేవుడే దిక్కు అనే రోజులలో ఇటువంటి ఆచారాలు ప్రవేశం...
ఇక మన మార్కండేయుని కధ తెలుసుకుందం.
మార్కండేయుడు కధ భృగువు కి జైమినికి సంవాదరూపకంగా ఓకసారి , భాగవతపురాణంలో ఇంకొకసారి ప్రస్తావనకి వస్తుంది.
మార్కండేయుడు  తండ్రి మృకండుమహర్షి , తల్లి మరుద్వతి. మృకండుడు గొప్పతపఃశాలి..ఆయన ఎంత నిశ్చలంగా వుండేవాడంటే ఆయన తపస్సలో వున్నప్పడు ఆయన శరీరం కొండలా మారిపోతే జంతుజాలం ఆ శిలకు తభ శరీరం ను రాపాడించి వాటి దేహభాధ ఉపశమింప చేసుకునేవి కాబట్టి మృగముల కండూతి తీర్చిన వాడు కాబట్టి మృకండుడు అని పిలిచేవారు. 
ఈ దంపతులకి పిల్లలు లేరు. అపుత్రస్య గతిఃర్నాస్తి ..అనగా పుత్రులు లేకపోతే ఉత్తమగతులు వుండవని వాడుక దీనితో ఆ దంపతులు కాశీలో రెండు శివలింగాలు ప్రతిష్టించి శ్రద్ధగా అర్చించగా పరమేశ్వరుడు వారికి ప్రత్యక్షం అయి  సకల సద్గుణవంతుడు పదహరు సంవత్సరాల ఆయుష్షు కలవాడు కావాలా లేక దురవ్యసనపరుడైన చిరాయువు వున్నవాడు కావలనగా .వారు సద్గుణవంతుడు అయిన పుత్రవరం పొందితే ఆ దంపతులకి మాఘపౌర్ణమి రోజున మార్కండేయుడి జననం. ఆ రోజునే మార్కండేయుడి జననానికి కారణం..
మాఘమాసం పౌర్ణమి రోజు మఖ నక్షత్రం. ఈ మఖనక్షత్రం అధిపతి కేతువు. ఈ కేతువు ఆధ్యాత్మిక కారకుడు , మోక్షకారకుడు..అదియునుగాక మాఘమాసంలో చంద్రుడుపూర్ణకళలతో విరాజిల్లుతాడు. సింహరాశిలో చంద్రుడు కేతువు వుంటారు..కుంభరాశిలో రవి వుండటం ఆ రోజు ప్రత్యేకత..
ఈ బాలుడు మృకండుడు పుత్రుడు కాబట్టి మార్కండేయనామధేయంతో పిలుస్తున్నారు.అతను దిన దిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు. ఈ సమయంలో సప్త ఋషులు మృకండుని ఆశ్రమంనకు వచ్చిన సమయంలో వారు మార్కండేయుడి ని చిరంజీవ అని దీవిస్తారు దానితో మృకండుని మదిలో కొత్త ఆశలు వచ్చి నా బిడ్డ చిరంజీవికదా అని ప్రశ్నించగా...సప్త ఋషులు తమ యోగదృష్టితో శివుని వరం గురించి తెలుసుకున్నవారై..అయ్యా ఈశ్వరానుగ్రహం ఎలాగున్నదో ఆయన లీల ఏమిటో ఎరుగక వున్నాం అయిననూ ఋషివాక్కు వ్యర్ధం కాదు అంటూ బాలునితో బ్రహ్మవద్దకు వెళ్ళగా ఆయనకూడా అప్రయత్నంగా చిరంజీవ అని దీవిస్తారు... అప్పుడు బ్రహ్మదేవ అలా ఎలా ఆశ్వీరదించారు మీ లలాటలిఖితం చూడలేదా అనగా..అయ్యయో అని ఆయన విచారిస్తూ తన భార్య సరస్వతి వంక ఏమి ఇటువంటి వాక్కు ఇచ్చావు అని ప్రశ్నించగా మన తప్పు ఏమిలేదు అంతా కాలపురుషుడు అయిన పరమేశ్వరుని లీలావినోదం అని ఆమె పలికినది. దీనితో బ్రహ్మదేవుడు మార్కండేయుని ఓ సలహ ఇచ్చాడు నాయనా మార్కండేయ కనురెప్పపాటు కూడ విడవక ఈశ్వరార్చన చేయమని ప్రభోదించాడు. దానితో మార్కండేయుడి శివలింగ ప్రతిష్టకావించి బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం అకుంఠిత దీక్షతో శివోపాసన చేయసాగాడు. ఈ శివోపాసన తీక్షణతకు లోకాలు అల్లకల్లోలం అవుతున్నాయి.అంతలో మార్కండేయునికి పదహరుసంవత్సరాలు నిండపోతున్నాయి...ఈ హడావుడి అంతా గమనించిన నారదుడు యముని వద్దకు పోయి..ఏమిటి యమ ధర్మరాజ మార్కండేయుని ఆయష్షు ఇంకనూ రోజులు ఘడియలలో వున్నవి తమరు ఆ బాలకుని వదిలివేస్తున్నారా అని ప్రశ్నించగా..యమధర్మరాజు నా మృత్యుపాశంనకు సర్వులు సమమే వాని విధివ్రాత ప్రకారం జరుగవలిసినదే అని తన కింకరులను ఆదేశిస్తారు మార్కండేయుని తీసుకుని రమ్మని.. ఆజ్ఞ మేర కింకరులు మార్కండేయుని తీసుకుని రావటంనకు అతనివద్దకు చేరటం సరికదా మార్కండేయుని తపఃతీక్షణతకు అతని వద్దకు అడుగు పెట్టలేని స్థితిలో యమధర్మరాజు కి తమ అశక్తతను మొరపెట్టుకున్నారు. దానితో యమధర్మరాజు తన మృత్యుపాశంతో మార్కండేయుడు వున్న ప్రదేశంనకు ప్రవేశించి తన కాలపాశం ప్రయోగించగా...మార్కండేయుడు భయంతో మహదేవ పాహిమాం రక్షమాం అంటూ శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. దానితో యమధర్మరాజు ప్రయోగించిన కాలపాశం లింగంను కౌగిలించుకున్న మార్కండేయుని స్పృశించునంతలో ఫెఠిల్లున పరమ ఉగ్రరూపంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై నాసన్నిధిలో నా వొడిలో నారక్షణలో వున్న మార్కండేయునిపై నీ మృత్యుపాశమా అని ఆగ్రహంతో తన త్రిశూలం తో మృత్యుపాశంను ఏదుర్కొన్నాడు...అంత ఆమృత్యుపాశం ప్రయోగించిన యమధర్మరాజు మీదకి రాసాగినది...దానితో యమధర్మరాజు సంకటస్థితికి లోనై ...శివా! మీ అజ్ఞానుసారం నాకర్తవ్య నిర్వాహణతప్ప వేరుకాదు ...నన్ను మన్నించి అనుగ్రహించి నాకర్తవ్యబోధ చేయమని ప్రార్ధన చేయగా...పరమేశ్వరుడు ప్రసన్నత చెందిన వాడై...యమునికి కూడా అభయప్రదాయం చేస్తూ  మార్కండేయుడు నా వీక్షణతో అమృతత్వం పొంది చిరంజీవి అయినాడు అనే వరం ప్రసాదించాడు...దానితో మార్కండేయుడు పరమేశ్వరానుగ్రహంతో చిరంజీవత్వం సాధించాడు.
ఆ తదనంతరం మార్కండేయుడు తన వంశస్థులకు , తనను ఆరాధించేవారికి పాశములను బంధన శక్తి వుండే విధంగా అనుగ్రహించాడు...అందుకే ఆయన పరంపరలోని వారే పద్మశాలిలు.. వారి నేత పోగులు (దారాలు ,పాశాలు) అంత ధృడంగా వుండుటకు ఆయన వరమే కారణం అని వారి నమ్మిక. అందుకే పద్మసాలిలు వున్న ప్రాంతాలలో మార్కండేయుని మందిరాలు వుంటాయి.
మార్కండేయునిపై యముడు తన యమపాశం ప్రయోగించిన సమయంలో మార్కండేయుడు స్తుతించినది "చంద్రశేఖరాష్టకం" .
ఇందు మొదటిది ఓక శ్లోకం రాస్తాను...
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహి మామ్‌ |

చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్ష మామ్‌| 1


రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం |

శింజినీకృతపన్నగేశ్వర మచ్చుతానలసాయకం |

క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయై రభివందితం |

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| 2
ఇంకనూ ఆరు శ్లోకాలు వున్నాయి అన్నింటా చివర కిం కరిష్యతి వై యమః అని వుంటుంది.. ఈ యముని బారి నుండి  నన్ను ఎందుకు  రక్షించవు అని వుంటుంది.
ఈ సంఘటన తరువాత పరమశివుని "కాలంతక" అనే నామంతో పిలుస్తారు.
మార్కండేయునికి అమృతత్వం ప్రసాదించారు కాబట్టి అమృతేశ్వరుడు అంటారు.
ఈ అమృతేశ్వర దేవాలయం తమిళనాడులోని మాయవరం కి 21కిమి దూరంలో వున్న తిరుకడయూరు అనే ఊరు వున్నది . అక్కడ ఓ పెద్ద దేవాలయం వున్నది. అది అత్యద్భుతంగా వుంటుంది. ఈ గుడి విశిష్టత షష్టిపూర్తి చేయించటం. ఈ గుడిలో షష్టిపూర్తి చేసుకొనటానికి వందలు వేలకొద్ది వస్తారు. అన్నీ వేదోక్తంగా చేయటానికి చాలా మంది అయ్యవార్లు వున్నారు.



భావయామి గోపాలబాలం..నా భావనలు

  💐భావయామి గోపాల బాలం💐
మనం అందరం కలియుగ దైవం వేంకటేశ్వరుని
నివాసమైన తిరుమల దర్శన సమయంలో షుమారు 1980 ప్రాంతం నుండి వివిధ ప్రదేశాలు సందర్శన సమయంలో మనకు దేవస్థాన ప్రసారమాధ్యమాల ద్వారా  అమ్మ M.S.సుబ్బలక్ష్మి మృధుమధురంగా "భావయామి గోపాలబాలం" అన్న కీర్తన వినని వారు అరుదు..మనవారు అందరు తెలియకుండా నే ఆ ముగ్ధమనోహర స్వరం, ఆ గోపాల బాలుని పాదవిన్యాసాలు మన హృదయంలో ముద్రపడి మనం కూడా శృతి కట్టి ఓక పదం అయినా పాడుతాం. అంతటి ఓ గొప్ప కీర్తన , అందులోను అమ్మ పాట పై ఓ నాలుగు మాటలు...

భావయామి గోపాలబాలం 
రాగం: యమునా కళ్యాణి
తాళం : ఖాండ చాపు

ప|| భావయామి గోపాలబాలం మన- | స్సేవితం తత్పదం చింతయేయం సదా ||

చ|| కటి ఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా- | పటల నినదేన విభ్రాజమానం |
కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం | చటుల నటనా సముజ్జ్వల విలాసం ||

చ|| నిరతకర కలితనవనీతం బ్రహ్మాది- | సుర నికర భావనా శోభిత పదం |
తిరువేంకటాచల స్థిత మనుపమం హరిం | పరమ పురుషం గోపాలబాలం ||
ఇది ఆ కీర్తన... పూర్తి రూపం.
ఈ కీర్తన రచించినవారు అన్నమాచార్యులు.
వీరి సంస్కృత కీర్తన ఇది. ఇది దేవస్థానంలో వెలుగు చూసిన అన్నమయ్య కీర్తనలో స్వర్గీయ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పరిష్కరించిన రేకు నంబరు 23/1 గల దానిలో వున్నది.
ఇక కీర్తన వివరణలు వచన రూపంలోనే...
ఈ ప్రకృతి మొత్తం ఆ పరమపురుషుడైన గోవిందుని రూపమే.. మీరు ఆయన పట్ల అనురక్తితో వుంటే ఆయన మీకు బాలగోపాలునిగా మీ హృదయంలో ప్రతిష్టించుకుంటే..ఆ బాలగోపాలుని ఆలోచనలో వుంటే ఆ గోపాలుని అడుగుల సవ్వడి మీకు ఖచ్చితంగా వినపడుతుంది ..ఎంతలా అంటే..
ఆయన మొలకు కట్టబడిన చిరుగంటల సవ్వడి..తో కూడి  రత్నాలు పొదగ బడిన మేఖల అంటే వడ్డాణం...సుందరంగా మనోహరంగా... అసలు క్రిష్ణుడంటేనే అలంకరణ ఆయినను ఎన్ని రూపాలలో ఎన్ని రకాలుగా అలంకరించిననూ మనకు తనివి తీరనంత కావాలంటే చూడండీ కంఠహారాలు , పూలమాలలు ,తులసి , కడియాలు.,దండకడియిలు ,బాజుబంద్ లు , నెమలిపింఛాలు ,మురళీ ,నిరంతరం ఆయన చేతిలో నవనీతం ఇలా అనేకం...
ఇన్నీ అలంకారలతో కూడిన ఆ బాలగోపాలుని పదవిన్యాసాల వలన మనకు వినబడే అలంకరణ భూషణముల శబ్దాలు ఎంతో మనోహరంగా వున్నాయి..ఈ బాలగోపాలుని దర్శించి మనం వివశులం అవుతున్నాం...ఈ బాలగోపాలుడే ఆలయంలో పరమపురుషుడు..ఆయనను దర్శించిటానికి బ్రహ్మాది దేవతలు, దేవతా సముహాలు కూడా పోటి పడుతున్నాయి.
మరి ఇంతటి మహత్తు గల ఆ బాలగోపాలుని మీ మనస్సులో నిలుపుకుంటే ఆ వేంకటాచలపతిని మనం సులువుగా దర్శించ వచ్చు.


జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం..వివరణ

"జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఎనుగులు తిన్న వెలగపండు జీర్ణం గుర్రాలు తిన్న గుగ్గిళ్ళు జీర్ణం కృష్ణుని తిన్న వెన్న ముద్ద  జీర్ణం ఈ పాపాయి తినే పాల బువ్వ జీర్ణం..."
బహుశా ఈ శ్లోకం తెలియని తెలుగువారు వుండరు. మన ఇండ్లలో పసివారికి పాలబువ్వ తినిపించిన తరువాత తల్లులు పాపాయికి తినిపించిన పాలబువ్వ గిన్నేను దిష్టి తీస్తూ
పై పద్యం చదువుతారు.
హైందవ సాంప్రదాయం లో జాతకర్మలైన షోడశకర్మలలో ఏడవది అన్నప్రాసన.
శిశువు జన్మ లగాయితు మాతృ స్తన్యం తో అతని జీవన అవసరాలు తీరుతాయి. ఆరు నెలల తరువాత శిశువు ఎదుగుదలకు శారీరక పటుత్వానికి స్తన్యం చాలదు. అదియును గాక మహిళ శారీరక నిర్మాణం వలనకాని , నిత్యకృత్యాలైన గృహకృత్యాల వలన కాని , సంసార జీవనం ప్రారంభం వలన కాని ఆమేయందు స్తన్యం లభించటం తగ్గుతుంది. అందువలన శిశువు కు ఘన ఆహరం పెట్టాలి. ఈ విషయం సుశ్రుతుడు కూడా తన గ్రంధాలలో తెలిపియున్నాడు. దీనినే మన వారు వేదోక్తంగా మంత్రబద్ధంగా షోడశ కర్మలలో ఓకటిగా ఆచరిస్తున్నారు. తదాదిగా శిశువుకు తెలికగా జీర్ణం అయ్యే పాల బువ్వ తినిపిస్తారు.
అన్నం ప్రాణ ఆధారం, జీవ ఆధారం. దీనిని ఆశ్రయించి అనేక పాప పుణ్యాలు వుంటాయి.
శిశువు భూవాతావరణం వచ్చిన తదాదిగా ఈ భూప్రపంచంలో వున్న కర్మలు ప్రారంభం అయితే అది స్టేజి ఓకటి అయితే అన్న ప్రాసన నుండి మరో స్టేజి .
ఇది అలావుంటే ఇక మన శ్లోక వివరణకు వస్తే...
అహరం ఆశ్రయించి అనేక సూక్ష్మ జీవులు , ఆహరం పులిసి పాడయిపోయి విషతుల్యం అయి ఓక్కోసారి ప్రాణం మీదకు వస్తాయి. దీనిని సూచిస్తూ రామాయణం లో ఓకధ వున్నది.
వాతాపి , ఇల్వలుడు అనే సోదరులు రాక్షసులు. వీరు అనేక కపట మాయోపాయాలతో ప్రజలను చంపి తింటారు. వీరిలో వాతాపి మేక రూపం ధరిస్తాడు. ఇక ఇల్వలుడు దారిన పోతున్న సాధుజనులను , బుషుల వద్దకు వెళ్ళి అయ్యా ఈ రోజు మాతండ్రిగారి ఆబ్దీకం మీరు భోక్తగా రావాలి అని ఆహ్వానిస్తాడు. సరే అని వెళ్ళిన అతిధికి మేక రూపంలో వున్న వాతాపిని వధించి భోజనంగా వడ్డిస్తాడు. అతిధి భోజనం ముగియగానే ఇల్వలుడు వాతాపి రా..అని పిలుస్తాడు..దానితో అతిధి కుక్షి చీల్చుకుంటూ వాతాపి వస్తాడు . దీనితో మరణించిన అతిధిని సోదరులు ఇరువురు శుభ్రంగా తినేస్తారు.
వీరి ఈ క్రూర కార్యం వలన ప్రజలు భయవిహ్వలు అయి అగస్త్యమహర్షిని శరణు కోరతారు. సరే అని అభయమిచ్చిన అగస్త్యులవారు వారి అతిధిగా వెళ్లి భోజన కార్యక్రమం అవగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనే మంత్రం పలుకు తారు. దీనితో అగస్త్యులవారి మంత్రశక్తికి వాతాపి జీర్ణం అయిపోతాడు. ఇది తెలియని ఇల్వలుడు వాతాపి రా అని పిలుస్తాడు కాని ఇంకేక్కడ వాతాపి వాడు ఎప్పుడో అగస్త్యులవారి కుక్షిలో జీర్ణం. ఇది కధ కాని పరిశీలిస్తే...సోదరులు ఇద్దరు వైరస్ లు గా ఆహరాన్ని పాడుచేసేవారుగా భావన చేయాలి. ఇక వాతాపి మేక రూపం చూడండి..మేక ఓక్కటే కనపడిన ప్రతి ఆకును మేస్తాయి...ఇది అది అని లేదు ప్రతి ఆకును ఆబగా మేస్తూనే వుంటాయి. అందువలన వాటి జీర్ణవ్యవస్థ సరిగా వుండక మేక విసర్జన పెంటికలుగా గోలిలుగా వుంటుంది.
ఇటువంటి లక్షణాలు శిశువుకూడా వుంటాయి...శిశువు దోగాడుతున్నప్పుడు, పాకుతున్నప్పుడు ఏది కనపడితే అది ..అతనిని ఆకర్షించిన ప్రతి ఆహర , వస్తు సంచయాలను నోట్లో పెట్టుకుంటాడు దాని వలన అతనికి విరోచనాది లక్షణాలు కలుగుతాయి...అందుకే వాతాపి లాంటి రాక్షసుడే జీర్ణం అవ్వగా తల్లి తన మాతృహృదయ మమకారంతో తన బిడ్డకు అంతటి జీర్ణశక్తి కలగాలని కోరుకుంటుంది.
ఇక రెండోవ వాక్యం ఏనుగులు తిన్న వెలగుపండు జీర్ణం. సహజంగా ఏనుగు భారి పరిమాణంలో వున్నను దానికి దంతాలు బాహ్యంగా వుండి చమన పద్దతి అనగా నమిలే అవకాశం లేక అన్నీటిని అలా మ్రింగుతాయి . వెలగపండు లోపల గుజ్జు వుంటుంది. దాని చుట్టూ వున్న దాని ఉపరితల భాగం బాగా కఠినంగా వుంటుంది. కాని ఏనుగు పొట్టలోనికి వెళ్ళిన వెలగపండు అక్కడి ఉష్ణోగ్రత కి లోపలి గుజ్జు జీర్ణం అయి విసర్జకంగా పండు పండుగానే వస్తుంది. ఇది  మనకి గమత్తుగా వింతగా వున్నను ఇది వాస్తవం. చూడండి ఏనుగు లక్షణం ఆహరభాగం మాత్రమే స్వీకరించి పిప్పి భాగాన్ని విసర్జిస్తుంది.
కనుక తల్లికి  తన బిడ్డకు అంతటి జీర్ణశక్తి కావాలనే అర్ధం. ఇక ఇంకో అంతరంగీక అర్ధం వున్నది. గజముఖుడు వినాయకుడు అన్న సంగతి తెలిసినదే. మరి వినాయకుని విఘ్నాధిపతిగాను , విద్యలకెల్ల ఒజ్జ అయిన గణాధిప అనే భావంలో కొలుస్తాం. మరి ఇంతటి మహనీయిడి లక్షణం మాతాపితురుల ప్రదక్షిణం భూప్రదక్షిణం అని నమ్మీ విజయం పొంది విఘ్నాధిపత్యం స్వీకరిస్తాడు. కనుక తల్లికి తన బిడ్డ మంచి విషయాలు మంచి జ్ఞానం తల్లితండ్రులపట్ల ప్రేమ , బిడ్డశరిరంలో జీర్ణం అవ్వాలని కోరికతో ఏనుగులు తిన్న వెలగపండు జీర్ణం అంటారు.
ఇక మూడవ వాక్యం గుర్రాలు తిన్న గుగ్గిళ్ళు జీర్ణం. గుర్రం అత్యంత వేగంగా పరుగు తీయగల జీవి. అలాగే గుర్రం ఎన్నడూ నేలపై పడుకోదు ...నించునే నిద్రపోతాయి...వాటి శక్తి అనంతం . అందుకే మన మోటారులను కూడా అశ్వశక్తితో పోల్చుతాం. ఇంతటి చలన శక్తికి వాటి కాళ్ళకున్న గిట్టలే కారణం. వీటి వలన కొండలు లాంటి కఠిన ప్రదేశాలలో కూడా పయనం. మరి వీటి ఆహరం గుగ్గిళ్ళు. మరి తల్లి అందుకే తన బిడ్డకు అశ్వం లాంటి శక్తి కోరుతున్నది. ఇది జీవలక్షణం. ఇక దైవరహస్యం పరిశీలించుదాం. హయగ్రీవుడు వైష్ణవసాంప్రదాయంలో సకల విద్యాధిపతి. వీరి తల గుర్రం గా వుంటుంది. తలమాత్రమే గుర్రంగా వుండటం అంటే మన మేధ అంత వేగంగా వుండాలి అని. జ్ఞాన స్వీకరణలో అంత వేగంగాను అంత స్థిరంగా వుండాలని. మన మెదడు అనేక ఆలోచనలు స్వీకరించి శోషణ చేసి తృటిలో మంచి చెడులను మనకు తెలియచెప్పుతుంది. అంటే ఈనాటి అడ్వాన్స్ ప్రోసేసర్ పని అంతా మన మెదడు నిర్వహిస్తుంది. కాబట్టి తల్లి తనబిడ్డ అంత జ్ఞానసంపన్నుడు , వేగ కార్య నిపుణుడు కావాలని గుర్రాలు తినే గుగ్గిళ్ళు జీర్ణం అని పలుకుతుంది.
ఇక నాలుగో వాక్యం కృష్ణుడు తిన్న వెన్నముద్ద జీర్ణం. వెన్న ,పెరుగు చిలకగా మజ్జిగ మరియు వెన్న వస్తుంది అన్న విషయం సర్వులకి విదితమే. పాలు కాచి తోడు వేయగా పెరుగు ఏర్పడుతుంది. పాలు తోడు వేయటం వలన ఈష్ట్ గా మారి ..పెరుగు ఏర్పడుతుంది. దీనిని సైన్స్ పరిభాషలో ఫెర్మంటేషన్ అంటారు. పెరుగు రుచిగా వున్నను వాత లక్షణం కలది. అందుకే రాత్రి ఆహరంలో పెరుగు నిషిద్ధం. మరి ఈ పెరుగు చిలకగా ఆ ఉష్ణంనకు అందులోవున్న ప్రోటిన్ మరియి శక్తినిచ్చే పదార్థాలు వెన్నగాను . మిగిలిన ద్రవరూపం అంతా మజ్జిగ గాను ఏర్పడుతుంది. మరి కృష్ణుడికి ఇష్టమైన వెన్న వలనే ఆయన క్రీడా వినోదాలు , రాసలీలలు , లీలామానుషత్వ లక్షణాలు , సర్వులను అతను ఆకర్షించే లక్షణాలు , స్థిరమైన పురుషత్వ లక్షణాలు ఏర్పడుతాయని తల్లి నమ్మకం. అందుకే తన బిడ్డ కూడా కృష్ణుడంత మహనీయుడు కావాలని కృష్ణుడు తిన్న వెన్నముద్ద జీర్ణం అని పలికేది. చూశారా మన దేశంలో ప్రతి తల్లి దేవకి , యశోదలే ప్రతి శిశువు చిన్ని క్రిష్ణుడే....
ఇక చివరిదైన పాపాయి తిన్న పాల బువ్వ జీర్ణం.
ఇది మామూలే తన అనురాగతో ప్రేమతో తినిపించే పాల బువ్వ వలన శక్తితో ఆరోగ్యంతో తన బిడ్డ కలకాలం మనుగడ సాగించాలనే ఆకాంక్ష.
చూశారా మీకు ఓ చిన్న శ్లోకం లాగా పద్యపాదం లా కనపడే ఈ నాలుగు వాక్యాలలో మన పూర్వీకులు ఇంత అంతరార్ధం లో  మనకు సాంప్రదాయాలుగా ఆచారాలుగా ఏర్చి కూర్చినారు.
ప్రతి శిశువు కి తల్లి చక్కని ఆరోగ్యవంతమైన ఆహరం అందచేయాలని , వారికి లభించాలని శ్రీరాముని ప్రార్ధిస్తున్నాను.
సకలం సర్వం శ్రీరామ జయం.
చదివి నచ్చినవారు ఓ చిన్న నవ్వు...సందేహం వున్నవారు తెలపండి నివృత్తికై...
ఆలపాటి రమేష్ బాబు
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
94401 72262.

సామజ వర గమనా - శంకరాభరణం.. ఓ పరిశీలన

సామజవరగమన - శంకరాభరణం ఓక పరిశీలన.
మానవమేధో వికాసంలో లలిత కళలు ఓక విభిన్నపరిణామం. లలితకళలలో సంగీతం మరి విశిష్టమైనది. సప్తస్వరాలు స , రి , గ , మ , ప ,ద ,ని. ఈ ఏడు స్వరాల కలయికే అనంతకోటి రాగాలు . ఈ సంగీత శాస్త్రం బహు విస్తారమైనది. ఇందు లయ , శృతి ప్రధాన్యత వహిస్తాయి. ఈ సంగీత సాధనలో మనస్సు కేంద్రీకరించి శృతి ,లయలతో పాటు రాగయుక్త స్వరసహితంగా పాడగలిగినదే సాంప్రదాయ కర్నాటక సంగీతం. మన భారతదేశ సంగీతాన్ని దక్షిణ భారత సాంప్రదాయం కర్నాటక సంగీతంగా , ఉత్తర భారత సాంప్రదాయం  హిందుస్తాని సంగీతంగా ప్రాధమికంగా విభజించారు. మరలా ప్రాంతాలని అనుసరించి మత పరంగా జరిగే కార్యక్రమాలను అనుసరించి అనేక విభజనలు. మరలా ఇందులో గాత్ర సంగీతం వాయిద్య సంగీతం అనే విభజనలు....
ఇలా మీకు కూలంకషగా వివరించాలని వున్నా ప్రస్తుత అంశంనకు అణుగుణంగా వివరించవలసి వున్నందున విస్తారభీతిచే ఇంతవరకూ చాలు...ఇక అంశం పరిధిలోకి వద్దాం......
మన దక్షిణ భారత సంగీతంలో విశిష్టమైనది త్యాగరాజకీర్తనలు. త్యాగరాజుగారు   ప్రస్తుత తమిళనాడు లోని తిరువైయ్యారులో జన్మించిన అచంచల రామభక్తుడు. ఆయన రాముని పరంగా ఏన్నో వేల కీర్తనలను సృజించారు....
అందులో ఓక కీర్తన సామజవరగమన....
సామజవరగమనా” త్యాగరాయ కీర్తన :
హిందోళరాగం , ఆది తాళం...
పల్లవి: సామజవరగమనా! సాధుహృత్సారసాబ్జపాల! కాలాతీతవిఖ్యాత! ॥సామజ॥
అనుపల్లవి: సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల! దయాలవాల! మాంపాలయ! ॥సామజ॥
చరణం: వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా। స్వీకృత యాదవకులమురళీ!
గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥సామజ॥

 

ప్రతి పదార్ధం :

సామజ(ఏనుగు) వర(వంటి) గమనా(నడక కలిగిన వాడ) – ఏనుగు నడక లాంటి గంభీరమైన నడక కలవాడా

సాధుహృత్సారసాబ్జపాల – సాధువులు, సజ్జనుల హృదయపద్మములను పాలించేవాడా

కాలాతీతవిఖ్యాత – అన్నికాలములలోనూ కీర్తింపబడేవాడా

సామనిగమజ సుధామయగానవిచక్షణ – సామ వేదానికి మొదలు గా ఆ సంగీతముని నిత్యం పరిశీలిస్తూ పర్యవేక్షించేటి వాడ

గుణశీలదయాలవాల – గుణముకు దయకు ఉదాహరణగా నిలిచేటి వాడ

మాంపాలయ – నన్ను పాలించు

వేదశిరోమాతృజ – వేదములలో గొప్పదైన సామవేదమునుండి పుట్టిన

సప్తస్వరనాదాచలదీప – సప్తస్వరముల లయము వలన కలిగిన కదలని దీపమువంటి నాదమువలె ప్రకాశించువాడా

స్వీకృతయాదవకుల – యాదవకులములో జన్మించినవాడా

మురళీగానవినోదనమోహనకర – మురళీగానముచే వినోదించుచూ అందరిని ఆనదింప జేసేవాడా;

త్యాగరాజ వందనీయ – త్యాగరాజుచే నమస్కరింపబడినవాడా

 

అర్ధం:

ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో, మునులు మనిషులు హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరి, నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చేత పొగడ బడతావు..
సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకి, దయకి ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి..
సామావేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల, ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళి గానం తో మమ్మలందరిని ఆనంద పరుస్తూ.., ఈ త్యాగరాజ వందనములను అందుకో..
ఇది భక్తి పరంగా...శ్రీకృష్ణుని పరంగా...మన సాంప్రదాయ కీర్తన.....
ఇక శంకరాభరణం సినిమా తెలుగు సినిమా ప్రాశస్త్యం మనందరికి తెలిసినదే....అదో గర్వించదగ్గ తెలుగు సినిమా...
ఇందులో ఓ సాంప్రదాయ సంగీతకారుని జీవన వైభవాన్ని...కాల మహిమచే సమాజ నిరాదరణ వలన అతని జీవనంలో ఓడిదొడుకులను దర్శకులు విశ్వనాధ్ గారు ఏంతో చక్కగా దృశ్యకావ్యంలా వివరించారు...
శంకరశాస్త్రికి సంగీతం అంటే ప్రాణ సమానం...
ఓక రాగం ఆలాపన చేయాలంటే స్వరసహితంగా ఎక్కడా పొరపాటు పోనివ్వని నైజం...మనకు ఇదే విషయాన్ని శంకరశాస్త్రి తన కుమార్తె కి కృష్ణానదినీటిలో మంచులో గొంతువరకు చిన్న పాపను వుంచి సంగీత సాధన చేయించే దృశ్యం మనకు ఉపమానంగా చూపుతాడు. ఆ పాప సాధనలో ఓక స్వరం తప్పుగా పలకగానే..శంకరశాస్త్రి...ఊ ....అనే హూంకారంతో స్వరంను షరిదిద్దటం కూడా మీరు గమనించవచ్చు...ఈ దృశ్యం చూసిన వారికి శంకరశాస్త్రి శుద్ధ ఛాంధసుడిలాగా...ఫక్తూ సాంప్రదాయవాది లాగా కన పడతాడు...కాని  సాంప్రదాయ సంగీత కారుల సాధన వైశిష్ట్యాన్ని మనకు దర్శకుడు ఈ విధంగా స్పృశించారను కోవచ్చు...
ఓక రాగా ఆలాపాన స్వరసహితంగా ఆరోహణ ,అవరోహణ స్వర ప్రస్తారాలు తప్పు పోకుండా వుండాలి అంటే కఠోర సాధన మరియి మానసిక పరిపక్వత , మానసిక నిగ్రహం తద్వారా శరీరం ప్రతి అణువు సంగీతంకై కేటాయించిన విధంగా తయారవుతుంది.
ఇక సినిమా విషయానికి వస్తే....శంకరశాస్త్రి జీవితం కాలమహిమచే కష్టాలపాలు...కచేరిలు లేవు సంపాదన లేదు...కాని అతని కూతురు యుక్తవయస్కురాలు అవుతుంది. యుక్తవయస్సు వచ్చిన అమ్మాయి సహజంగా తోడు కోరుకోవటం సహజం.....
శంకరశాస్త్రి తో స్నేహాతీతంగా మాటమంతి జరిపే అల్లు గారు...శంకరశాస్త్రి కూతురు రాజ్యలక్ష్మి ని తీసుకుని అన్నవరం వెళ్ళటం...అక్కడ గుడి ప్రాంగణంలో చంద్రమోహన్ , రాజ్యలక్ష్మి ల కలయిక తద్వారా ఓకరంటే ఓకరు మరులు కొలిపి అభిమానం కలిగి ఉభయుల మధ్య ప్రేమ పుడుతుంది....కాని సాంప్రదాయ కుటుంబాలు అవటం వలన ఆ ప్రేమ గుడి ప్రాంగణంలోనే  విరామం....కాని అల్లు వారు చంద్రమోహన్ నే పెళ్ళి చూపులకు ఆహ్వానిస్తారు కధా పరంగా...ఇక పెళ్ళి చూపులలో మరలా చంద్రమోహన్ , రాజ్యలక్ష్మి ల పునః పరిచయం...కాకపోతే ఇద్దరూ వధు , వరుల గా ఓకరికొకరు పరిచయం.... దానితో ఇద్దరి మనస్సులో అన్నవరం తాలుకు తీపి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని...ఓకరంటే ఓకరు ఆసక్తి అనురక్తి తో ఉత్సాహంగా వున్నారు....ఆ సమయంలో... సాంప్రదాయ అనుసారం వధువు కి గల అర్హతలు పరిశీలనలో ఓక పాట పాడమంటే...రాజ్యలక్ష్మి...
సామజవరగమన పాట పాడుతుంది...
**********
సామజవరగమనా
సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీతవిఖ్యాత సామజవరగమన
సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీతవిఖ్యాత సామజవరగమన
ఆ ఆ ఆ...

సామనిగమజసుధా ఆ ఆ ఆ...
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల
దయాలవాల మాం పాలయ
సామజవరగమనా

ఆమని కోయిలా ఇలా నా జీవనవేణువు లూదగా
ఆమని కోయిలా ఇలా నా జీవనవేణువు లూదగా
మధురలాలసల మధుప లాలనల
మధురలాలసల మధుప లాలనల
పెదవిలోసి మధువులాను వ్రతము పూని జతకు చేరగా

నిసా దనీ మదా గమా
సమమగ గదదమ
మనిసద నసదమ గససని నిగగస
సనినిద దనినిస మదదని గమదని గమదని
సనిద మగసా
సామజవరగమనా సాధుహృత్ సారసాబ్జపాల
కాలాతీతవిఖ్యాత సామజవరగమన

వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా
వేసవి రేయిలా ఇలా…
ఈ విధంగా జరుగుతున్న సన్నీవేశంలో శంకరశాస్త్రి " శారద" అనే పెద్ద కేకతో సన్నివేశం మొత్తం రసాభస అవుతుంది... శంకరశాస్త్రి తన కుమార్తె ను నీవు పాడుతున్న రాగం ఏమిటి... దాని ఆరోహణ అవరోహణ ఏమిటి అనే విషయంతో ప్రేక్షకుడు అది రాగం తప్పుగా భావిస్తాడు...కాని కఠోర సాధనతో మనస్సు నిగ్రహపరచి సంగీతం పాడుతుంటే...యుక్తవయస్కురాలు అయిన
రాజ్యలక్ష్మి , చంద్రమోహన్ పై ఆసక్తితో పాటలో తన భావిజీవితాన్ని ఊహించుకోవటం... తద్వారా ఇల్లాలుగా తన మధురోహలతో తనపై తాను అదుపు కోల్పోవుతుంది...దానితో రాగ ఆలాపనలో స్వరం తప్పుగా పాడుతుంది....
ఇదంతా పరిశీలిస్తున్న శంకరశాస్త్రి తన కుమార్తె మానసిక పరిస్థితి తదుపరి దేహపరిస్థితి అవగాహన వచ్చిన వాడు...కాని పెళ్ళి చేయలేని ఆర్ధిక స్థితి...కాని కుమార్తె వయస్సు వచ్చినందున ఎదుట వున్న వరునితో తన భావిజీవతం అనే భావనతో కుటుంబ సాంప్రదాయ కట్టు దాటిపోతున్న విషయం పరిగణలోకి తీసుకున్న దర్శకుడు... దాన్ని నర్మగర్భంగా రాగం పై మరలచి....నీవు నీ స్వాధీనం లో వున్నావా అని కుమార్తె ను అన్యాపదేశంగా ప్రశ్నించారు......
ఇలా ఈ చిత్రం లో మన దృశ్యమాన విషయం వేరు...అంతఃకోణంలో వివరం వేరు....
ఇది ఓక పరిశీలన మాత్రమే....
ఇక శంకరాభరణం సినిమాలోని సామజవరగమన పాట...పల్లవి , మకుటం త్యాగరాజకీర్తన లోనివి తదుపరి భావవ్యక్తీకరణ పార్ట్ వేటూరి సుందరరామ్ముర్తీ రాసినది.....
ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన సామజవరగమన గురించి వివరించాలని వున్నా వివరించలేని పరిస్థితి.... అది  సీతారామశాస్త్రి మాత్రమే చెప్ప తగ్గరు....
ఇది నా పరిశీలన మాత్రమే....
సర్వులకు శ్రీరామ జయం.
మీ అభిప్రాయాలను తెలపవలసినది
ఆలపాటి రమేష్ బాబు...
శ్రీ సంతోషి సాయి బుక్ డిపో
విజయవాడ
9440172262.
మీ ఖండనలు , విమర్శలు కై ఎదురుచూపులు...




సత్యనారాయణ వ్రతం విశిష్టత అంతరార్ధం

సత్యనారాయణ వ్రతం విశిష్టత.
కార్తీక మాసంలో ను , మరి 
విశిష్ట సమయంలో సర్వ బాహుళ్యం వారి నివాసంలోను , అన్నవరం లోను , వనభోజనం సమయంలో వ్రతం చేస్తారు కాని వీరిలో ఒక్క శాతం వారికి కూడా దీని విశిష్టత పై అవగాహన లేదు. మరి నేను నా కోణంలో తెలియచెప్పే ప్రయత్నం మాత్రమే అని గ్రహించ ప్రార్ధన.
మనకున్న అనేకానేక పూజా విధానములలో సత్యనారాయణ వ్రతం ఎంతో విశిష్టత కలది.
సహజంగా అందరు వివాహంతో గృహస్థులు కాగానే చేయి మొదటి దైవ కార్యం. చాలా మంది ఆసక్తిగా చేసినా తదనంతరం పరిణామం లో కొంత ఆసక్తి తగ్గుతుంది దానితో యాంత్రికత కలుగుతుంది. కాని వ్రతం శ్రద్ధగా చేయివారికి కొంగుబంగారంగా  స్వామి వారిని కరుణిస్తారు అనటంలో సందేహం వలదు.
ఈ వ్రతం స్మార్త విధానంలో గణపతిపూజతోను వైష్ణవవిధానంలో విష్వక్సేన పూజతో ప్రారంభం.
అ తరువాత వ్రత కధ ప్రారంభం.
ఈ వ్రత కధ ఐదు అధ్యాయాలు కలదిగా బహుళ ప్రచారంలో వున్నను ఇది 9 అధ్యాయాల వ్రత కధ. ఇందు మొదటి ఐదు కధలు పూజ సమయంలోను. తదుపరి నాలుగు కధలు వ్రతం ముగిసిన తరువాత రాత్రి సమయంలో భగవత్సేవ కైంకర్యం సమయంలో వినాలి అని నిర్దేశించారు.    మరి ఏ సమయంలో ఏ పెద్దలు ఈ క్రతువును ఐదు కధలు కలదిగా మార్చే సంకల్పం చేసి కల్పోక్తపూజవిధానంగా మార్పు చేసి సుజనరంజకము సుభోదకముగా చేశారనుటలో సందేహంలేదు.
ఈ విధానం మొత్తం రెండు భాగాలుగా  విభజన. ప్రధమ భాగం దేవత ఆహ్వానం , వ్రత కధ రెండోవ భాగం.
ఈనాడు గృహస్థులు యాంత్రిక తో చేయిచున్నారు కాని వారికి అవగాహన వున్న శ్రద్ధగా చేయగలరు అనుటలో సందేహం లేదు. దేవతా ఆహ్వానం ను మండపారాధన అంటారు. సాధారణంగా మనం గృహమునకు అతిధి వస్తే  ఆసనం,నీరు లాంటి మర్యాదపూర్వక చర్యలు చేస్తాం కాని నేడు మనం దేవాది దేవుడు అగు సత్యనారాయణ స్వామిని, మన వ్రత ప్రదేశం నకు స్వామిని అర్చారూపకంగా ఆహ్వానం పలికి  కలశరూపంలో స్థాపన చేయిటయే మండపారాధన.
ఈ మండపారాధన కు, ఓ క్రమ పద్ధతి వున్నది.
వ్రతం ప్రదేశం నందు చక్కగా రంగవల్లులు తో తీర్చి ఆపై అరటిఆకు గాని , వెడల్పయిన పీటగాని వేసి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై ప్రాణం జీవనాధారం అగు ధాన్యం (బియ్యం) ను పరిచి
ఆపై గణేశాది పంచపాలకులు (గణపతి , బ్రహ్మ, విష్ణు, రుద్రుడు,గౌరి)  తదనంతరం నవగ్రహాలు వాటి తాలూకు అధి దేవతా ప్రత్యధిదేవతా సహితంగా వీరిని   క్రమంలో సమంత్రకంగా ఆహ్వానం చెపుతూ వారి వారి గ్రహ యొక్క శక్తి మన దేహంపై మన నిత్య జీవితంలో ఏవిభాగం పై వుంటుందో తెలుపుతూ ఆహ్వానిస్తారు.

(సూర్యుడు - ఆత్మ - అగ్ని - రుద్రుడు
చంద్రుడు - మనస్సు - ఆపః - గౌరి
కుజుడు - రోగ,  - భూమి - క్షేత్రపాలకం.
బుధుడు - బుద్ధి - విష్ణుం - నారాయణం
గురువు - సంతానం - బ్రహ్మణం - ఇంద్రుడు
శుక్రుడు - కళత్ర - ఇంద్రాణి - ఇంద్రమరుత్తులు
శని - కర్మ  - యమం - ప్రజాపతి
రాహువు - చక్షువు - గామం - సర్వాంగ
కేతువు - మోక్ష - చిత్రగుప్తుడు -బ్రహ్మణం)
తదనంతరం అష్టదిక్పాలకులు, వాస్తు పురుషుడు, క్షేత్ర పాలకుడు,భూమి,ఆకాశం ఇలా సమస్త దేవతలను వారు ,వారి కుటుంబ ,పరివారం,వాహనం,ఆయుధసమేతంగా విచ్చేయమని సమంత్రకంగా ఆృహ్వానిస్తూ వారి వారి స్థానాలకు వారిని ఉపస్థితులను కావింప చేయాలి.
మరి వీరితో పాటు గృహస్థులు యెక్క జన్మనక్షత్రం అధిదేవత ప్రత్యధిదేవత సహితంగా ఆహ్వానం. దీని వలన గృహస్థులు కు గోచార రీత్యా క్షేమం.
మరి వీరందరి ఆహ్వానంనకు ప్రతి ఒక్కరిని
ఓ తమలపాకు పై వక్క, పసుపు కొమ్ము, ఖర్జూరం, అక్షింతలు, రూపాయికాసు సహితంగా ఆహ్వానం చేస్తాం. ఇందు వక్క దేవతాంశ గాను , పసుపు కొమ్ము దేవతాంశ స్త్రీ రూపం గాను ఖర్జూరం నివేదనగాను , అక్షింతలు వారికి అర్చన గాను , రూపాయి కాసు హిరణ్యరూపకంగాను (పాపం మన వాళ్ళు ఈ రూపాయి కాసు అయ్యవారికి వెళుతుందని లోభిస్తారు ) ఇది లోపం లేకుండా వుండాలి.
‌కారణం విశ్వాంతరాళలలోనుండి వచ్చే దేవతలకు వారి పరివారాలకు ఆహ్వానం పలుకుటలో మనకు తెలియని లోపాలను నివృత్తి కై మరియి వారి నిమిత్తం దాన, దక్షిణకై...
ఇలా ఇవి అన్ని కలిపి సుమారు 50 పైగా అవుతాయి. ఇలా వీరందరి మధ్య స్వామి ని కలశరూపకంగా సకల నది జలాలు సకల దిజ్మండలాల మధ్య సకల పరివారం సహితంగా శ్రీ సత్యనారాయణ స్వామి ని ప్రతిష్ట చేస్తాం.
తదనంతరం స్వామి పురుష సూక్త పూజ , ఆ తదుపరి స్వామివారి రూపును పంచామృత అభిషేకం మన్యుసూక్తసహితంగా చేసి తదనంతరం స్వామి వారి అష్టోత్తర, సహస్రనామాలు తో స్తుతించడం తదనంతరం లక్ష్మీ దేవిని అష్టోత్తర పూజలతో వ్రతం నందు మొదటి భాగం పూర్తి.
తదుపరి వ్రతం యొక్క ఉత్తర భాగం కధ భాగంలో అడుగు పెడతాం.
మనం ఇప్పటి వరకూ వ్రత విధానం తెలుసుకున్నాం. మరి స్వామి వారు ఎవరు మన వ్రతం యెుక్క లక్ష్యం,ప్రసాదం మహిమ ఏమిటి చేస్తే వచ్చే ఫలితం ,చేయగలమని అనుకోని చేయకపోవటులో ఇబ్బంది తెలుసుకోవటమే కధ రూపకంగా.
* ప్రధమ అధ్యాయం*
వ్రతం ప్రధమ కధ నందు.
నైమిశారణ్యం నందు సూతమహాముని శౌనకాది మహర్షులు కు మానవులు కష్టనష్టాలు తీర్చుటకు తరుణోపాయం అన్న వ్యాఖ్యలు తో కధ ప్రారంభం .

ఈ సకల చరాచర విశ్వం నందు జీవంతో కలిగిన గోళం ఒక్క భూగోళం మాత్రం...ఇందు గల అనేకానేక జీవావరుణంలో మానవుడు మాత్రమే అన్య ప్రాణులకు భిన్న ప్రకృతి కలవాడై వున్నాడు. బుద్ధి మనస్సు వాక్కు కలిగిన వాడుగా వున్నాడు. మిగిలిన ప్రాణులు ఇవి లభించక తమ మనుగడకు ప్రకృతిపై ఆధారపడి ప్రకృతిలో ఒకటిగా మనుగడ సాగిస్తున్నాయి కాని మానవుడు తన భిన్న ప్రకృతి చే తనకు గల విశిష్టత ను వినియోగం పరిచి ప్రకృతి ని తన ఆధిపత్యాన్ని కి తెచ్చుకుని పంచ భూతాలయిన వాటిని తనకు అనుకూలమైన వినియోగం మైన విధముగా చేశారు.అయనను అతని ఆశ తీరిక ఇంకను ఇంకనూ అన్న స్వభావం వలన అతని జీవన పరిణామం క్రమం తప్పి అనేక కష్టనష్టాలను చవి చూస్తున్నాడు . దీని వలన మానసిక సంతులనం కోల్పోయి దిగులుగా ఇబ్బంది గా వున్నాడు...
ఈ సమయంలో నారదమహర్షి భూలోకం సంచారం చేయిచూ పై విషయాలను వైకుంఠ వాసుడైన విష్ణువుతో ప్రస్తావన...
ఆసమయంలో స్వామి వారి వర్ణన ....
స్వామి వారు తన అంశం రూపం అయిన సత్యనారాయణ వ్రతం చేసిన మానవుల కష్టాలు దూరం అవుతాయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని అంటారు.
ఇక్కడే మన పూర్వీకులు మహర్షులు చమత్కారం మనకు తెలియజేస్తుంది...
సాధారణ మానవుడు భోగలాలసతో జ్ఞాన శూన్యతతో భగవంతునికై కృషి సల్పుటలో అలసత్వం తో వుంటారు. మరి వారి మోక్ష ప్రాప్తి కి కొన్ని రకాల వ్రతం ,నోములు, పారాయణలు ప్రవేశం ...వీటి అన్నింటిలోను ఉత్తమమం నామధ్యానం....
అసలు నారాయణుడు అంటే ఎవరు?
మనం నారాయణుడు విష్ణ్వంశగా భావిస్తాం.
ఈయన పని లోక పాలన...
నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమమ్ అన్ని భాగవత వాక్యం అనుసరించి
ఆయన మహ పురుషుడు...మరి ఆయన నామం రూప ధ్యానమే సత్యనారాయణ వ్రతం అన్నది రహస్యం.
సత్ + య + నారాయణ అన్న పద సముచ్ఛయం సత్యనారాయణ గా వాడుక.
ఇందు సత్ అన్ని పదానికి అర్ధం ఎల్లప్పుడు , సతతం , అన్నివేళలా అని......
యం అన్నది మన దేహం నందు గల కుండలిని చక్రంలోని అనాహత చక్ర బీజాక్షరం.
ఈ అనాహత చక్రం దేహం నందు
హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం యం.
అనగా నారాయణ అన్న నామమును హృదయమందు ప్రతిష్టించుకోవాలి.
ఇంకను వ్రతం విధానం తెలుపుట మొదటి అధ్యాయం నందు కలదు. ఏ ఏ కాలాలు చేయాలి, ఏ విధంగా చేయాలి కావలసిన వస్తువులు అన్ని తెలుపుతుంది .

*రెండవ అధ్యాయం*
ఈ అధ్యాయం నందు
కాశీ పట్టణం నందు శతానందుడు అను బ్రాహ్మణుడు వేదం చదువుకున్న వాడయినను ఉపాధి లేక అనేక కష్టనష్టాలను చవి చూసి భగవత్ కృప వలన ఈ వ్రతం చేయిట మరియి ఈయన ను చూసిన కాలకష్ఠుడు అనే కట్టేలు కొట్టే వాడు అతని శక్త్యానుసారం చేసి తరించుట.
చూడండి శతానందుడు అన్ని రకాల ఆనందాలు అన్నది నామధేయం లో , విద్య కలవాడు కాని ఉపాధి లేకపోవటమే పెద్ద కష్టం...
కాలకష్ఠుడు అనేది దురదృష్టవంతుడు అనే పదానికి పర్యాయ పదం.
ఇటువంటి పరిస్థితుల్లో వున్నవారు స్వామి వారి వ్రతం చేసిన వారి కష్టం నివారణ జరుగుతుంది అని తెలుపుట రెండవ అధ్యాయం అంతరార్ధం.
*మూడవ అధ్యాయము*
ఈ అధ్యాయం నందు ఉల్కాముఖుడు అను రాజుగారి రాజ్యం నందు ఒక వైశ్యుడు ఈ వ్రతం కధ తెలుసుకుని సంతానలేమి చే బాధ పడుతున్న అతను భగవంతుని కృపచే సంతానం లభించటం అయినను వ్రతం చేయక వాయిదాలు వేయటం అలా తన కుమార్తె వివాహం సమయంలో కూడా వాయిదా వేసి తన సంపాదన నిమిత్తం చంద్రకేతు మహరాజు
పరిపాలనలోని రత్నసానుపురం వెళ్ళుట...ఇలా దైవ ధిక్కారం నకు పాల్పడుటతో అతని కుటుంబం ,అతను అనేక కష్టాలు గురి అవటం...దీనికి తరుణోపాయం గా వ్రతం చేసిన
కష్టాలు తీరును అన్న బుద్ధి కలిగించును...
ఈ క్రమంలో వ్రతం నిర్వాహణా లోపం శ్రద్ధాలోపం భక్తి లోపం వలన కలుగు ఇబ్బందులు తెలుపుట ఈ అధ్యాయం యెక్క ఉద్దేశ్యం.
*నాలుగవ అధ్యాయము*
ఈ అధ్యాయం నందు పై అధ్యాయం పాత్రలే వారి తప్పులు మన్నించి స్వామి వారు తరుణోపాయం చూపుట.
భగవంతుడు భక్త సులభుడు మీకు దొరుకు సహాయం ఆకాశవాణి గా అన్యాపదేశంగా అజ్ఞాతం గా జరుగగలదని తెలుపట ఈ అధ్యాయం యెక్క లక్ష్యం.
*ఐదవ అధ్యాయము*
ఈ అధ్యాయం నందు తుంగధ్వజ మహరాజు అడవికి వేటకు వెళ్ళి ఆ సమయంలో అడవిలోని గొల్లవారు స్వామి వారి ప్రసాదం ఇవ్వగా వారు అనాచారులు అని ఆక్షేపణ చేస్తూ ప్రసాద్ స్వీకరణ చేయక నిర్లక్ష్యం వహించిన దైవ ఆగ్రహంనకు గురి అయి రాజ్యం ,సంతానం పోవటం అన్న కష్టం నాకు గురి అయి దైవజ్ఞల వలన ప్రసాద్ స్వీకరణ నిర్లక్ష్యం అని తెలుసుకుని తప్పు సరిదిద్దుకునటచే స్వామి వారిని కరుణించుట.
ఈ అధ్యాయం లో ధర్మ సూక్ష్మం తుంగధ్వజుడు అన్న పేరుతో తెలిపారు. తుంగ ఎంతటీ నిస్సారవంతమైన భూమిలోను కూడా పెరుగుతుంది అంతేకాక తను పెరిగిన భూమి నిరుపయోగం అవుతుంది.
అలాగే ధ్వజం అనగా జెండా.
మనిషిలో అహంకారంతో, అధికార , ధనమదంతో
దైవదూషణ ధిక్కారం చేస్తే తగిన ఫలితం అనుభవిస్తారని తెలుపుట, భగవంతుని సన్నిధిలో రాజు పేద  అన్నది లేదు కావలసినది శ్రద్ధ, భక్తి మాత్రమే.. అలాగే స్వామి వారి వ్రత ప్రసాదం నందు నిర్లక్ష్యం కూడదు అని తెలుపుట.
శ్రీరామ జయం.
****************************************
మిత్రులు నమస్కారం.
ఇందు తప్పు ఒప్పు లు మన్నించి మీ సమాధానం పంపగలరు.
Send your feedback to
Alapati Ramesh Babu
9440172262.