drowpadi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
drowpadi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, ఏప్రిల్ 2012, మంగళవారం

ద్రౌపది నవ్వు - శరం లాంటి ప్రశ్న - భీష్మ సమాధానము.


మహభారతములొ సభాపర్వములొ జూదక్రిడయందు పాండవ ఓటమి తద్వారా ద్రౌపది పరాభవము సర్వులకు తెలిసినదే.ఆమేను   నగ్నముగా చూడాలన్న పరిస్థితి వరకు వొచ్చినది.కాని భగవదనుగ్రహము వల్ల ఆమె రక్షించబడినది.ద్రౌపది పదే పదే ప్రశ్నించినా బదులు పలుకలేనతగా అక్కడ వాయు మండలము దూషితము,భారమయిపోయాయి.అధిక సంఖ్యాకులు తమ తలలు తిప్పుకున్నారు మరి భీష్ముడు? భీష్ముడు కూడా స్పష్టముగా సమాధానమివ్వక ధర్మరాజుకే వదిలేశాడు.

దీనికి సమాధానము మనకు భీష్మ నిర్యాణములొనే మనకు తెలుస్తుంది.ఇది మహభారతములో వున్నదా అన్నవిషయము తెలియదు కాని గురుజనుల ముఖతా వినవస్తున్నది.
          మహభారత యుద్ధము ముగిసినది.అంపశయ్యపై భీష్ముడు. శ్రీక్రిష్ణ అదేశనుసారము ధర్మరాజు సతిసొదరసమేతుడై అంపశయ్యపై ఉత్తరాయణపుణ్యకాలనికై నిరీక్షిస్తున్న పితామహుని సన్నిధికి రాగా, భీష్ముడు ధర్మారాజకోరికపై సకలరాజ ధర్మాలు బొధిస్తున్నాడు.ఈ ధర్మొపదేశాలు జరుగుతుండగా ద్రౌపది నవ్వసాగింది.అది చూసి పితామహుడు "అమ్మాయి!నువ్వు నవ్వటానికి కారణము ఏమిటి? అని ప్రశ్న.
   ద్రౌపది సంకొచిస్తు "పితామహ నావల్ల పొరపాటు జరిగినది" అనిపలుకగా.అంతమాత్రముచే సంతోషపడని వాడై "అమ్మా! శీలవతి ఆయిన ఏ కులవధువూ గురుజనుల,సభాముఖముగా అకారణముగా నవ్వదు.నీవు గుణవంతురాలవు,సుశీలవు నీ నవ్వు అకారణము కాదు, సంకొచరహితంగా నీ నవ్వుకు కారణం చెప్పు" అని అన్నాడు.
     అంత ద్రౌపది ముకుళితహస్తయై  "పితామహ ఈ విషయము  వ్యక్తపరచరానిదీ,అయినా మీరు ఆదేశిస్తున్నారు కనుక చెబుతున్నాను.మీరు నేడు చేస్తూన్న ధర్మోపదేశాలను వింటుంటే నాకు ఆశ్చర్యము భాదకలిగాయి.కారణము నాడు కౌరవ సభలొ దుశ్శాసనుడు నన్ను వివస్త్రను చేసే సమయములో మీ ధర్మఙ్ఞానము ఏమయిపొయింది? లేక ఇంత ధర్మఙ్ఞానము మీరు ఈ మధ్య నేర్చుకున్నరా అని  నాకు నవ్వు వచ్చినది.నన్ను పెద్దవారు క్షమించేదురు గాక !          
అంత భీష్ముడు అమ్మా! నీవు ఈనాడు ఈ ప్రశ్నతో సకలజనులకు ఆనాటి నా మౌనానికి కారణము తెలుస్తుంది అని పలికి.సమాధానముగా ఇలా అన్నాడు "పుత్రీ! నేను నా తండ్రి కొరకు రాజ్యాధికారము వొదలుకొని, నేనుకూడా పాలితుడనయ్యాను.మరియు ఆనాటి నా ప్రతిఙ్ఞప్రకారము  నేను నా ఆజన్మపర్యంతము ఈరాజ్యనికి,రాజుకు బద్దుడనయి వుంటాను. మరి ఆనాటి నారాజు దుర్యొధనుడు. అతను నాకుకావలసిన సర్వసౌకర్యాలు సమకూర్చినాడు.అతని దుష్ట పాలన వల్లలభించిన ఆహారప్రభావము వల్ల నేను మౌనముగా వున్నాను.కాని అర్జునుని శరపరంపరలవలన అనేకగాయలు ఆయినాయి, ఈగాయాల నుంచి ఆ కలుషిత అన్నప్రభావముచే ఉత్పన్నమయిన రక్తము పొయినది.ఈనాటి దేహములొ నామాత్రుగర్భమునుంచి వొచ్చినప్పుడున్న రక్తము వున్నది . అదియును గాక ఈనాడు ఈరాజ్యానికి రాజు ధర్మరాజు అతని ప్రభావము అప్పుడే ప్రారంభించినదని ఇది సూచన.ఆదియునుగాక నేను ఈనాడు స్వేచ్చాజీవిని". 
          మరి భీష్మునిలాంటి మహమహుల ప్రతిచర్యకు ఒక అంతరార్ధంవుంటుంది.



***********************లోకా సమస్తా సుఖినోభవంతు ****************************