30, ఏప్రిల్ 2012, సోమవారం

శబరి, గుహులది భక్త పారవశ్యమా? మూఢత్వమా?


భగవంతుడు భక్త సులభుడు.ఈవిషయాన్ని అనేక ద్రుష్టాంతాల్లొ నిరూపణజరిగినది.
మరి మనం ఇన్ని పూజలు పునస్కారాలు అని ఇన్ని క్రియలు చేస్తున్నాము.మరి మనకు దర్శనము జరిగినదా అంటే?....... ఇది సమాధానము .కారణము మన వద్ద 'అర్పణ ' ఏది?  ఎవరయితే తన చిత్తాన్ని సకలధా,సర్వదా,ఆ పరంధాముని గురించి  పరితపిస్తారో వారి వద్దకు స్వయముగా తనకుతానుగా సశరీరముగా దర్శనము ఇస్తాడు.

  మరి గుహుని చూడండి అలామదిలో నిలిపినవాడు,రాముని సఖునిగాభావించినవాడు.అంతటి గుహుడు రాముడు నావ ఎక్కబొతె పాదాలుకడిగాడు మూఢత్వమా కాదు అమాయకత్వము.
శబరి వద్దకు రాముడు స్వయముగా  నడచి వస్తే ,ఆమె అంతటి ముదిమిలో ఏదొ చేయాలనే తపన,శరీరము సహరించనందుకూ వ్యధ.కన్నులుకానరాక క్షొభ,కాని మనొనేత్రముతో దగ్ధాయామానముగా రాముడు మదిలో.అలాంటీ రాముడు స్వయముగా తన గుడిసేకు వచ్చి "శబరి" అన్న కమ్మని పిలుపు, అంతకన్నా చల్లని స్పర్శ ప్రసాదించిన ఆశ్రీరామచంద్రునికీ ఆతిధ్యము ఇవ్వాలి! ఏలా? వున్నవొ ఎవొ కొన్ని ఆడవి పండ్లు అవే పెడదాము అన్న తలంపు కాని ఎలావున్నవొ ఎమిటో అని కన్నులకు తెలియక,తీపిగావున్నవా,పుల్లగావున్నవా అని తేలుసుకునేందుకు కొరకటము అదే ఏంగిలి ఆరామునికి అందివ్వటము. ఆయితే ఆయిన అంతకన్నా ఆనందముగా,ఆపేక్షగా ఆ పండ్ల ఆరగింపు.
మరి శబరిది రామునికి ఏంగిలి పెట్టెంతటి మూఢత్వమా ?

కాదు అమాయకత్వముతొ కూడిన భక్త పారవశ్యము.      
మూఢత్వము ఎప్పుడు కారు చీకటే.

కాని, పసిమనస్సులాంటి అమాయకత్వానికి ధ్యాన,యోగాలాంటీ భక్తపారవశ్యము తొడు అయితే.ఆపరంధాముడు సదా,సర్వదా మనతొనే,మనము ఆయినతొనే.

29, ఏప్రిల్ 2012, ఆదివారం

ఆడపిల్లల డిమాండ్ - పెళ్ళి కాని ప్రసాదుల గోల


మీరు ఈసారి గుడికి వెళ్ళినప్పుడు బాగా గమనించండి.రకరకాల మొక్కులకొరకై అనేక మంది యువకులు ప్రదక్షిణలు చేస్తూ మీకు దర్శనము ఇస్తారు.తరచి చూడండి,ప్రశ్నించండి.దాదాపు సగముమంది అవివాహితులే.వీళ్ళందరు తమకు జతకోసము,వివాహ భాగ్యము కొసము ఆప్రదక్షిణలు,వేడికొళ్ళు.
ఓక్కొడికి 30 సం. నిండుతున్నాయి.గడ్డము ముదిరిపొతుంది,జుట్టు రాలి బట్ట తలలు ఆవుతున్నాయి.ఇంకా ఏన్నాళ్ళు మేము చేసిపెట్టాలంటు అమ్మల సతాయంపు,తోడులేక నిద్రరాక ఇబ్బందులు.చెప్పలేరు,చెప్పుకొలేరు.పొని వీళ్ళకు ఏమన్నా ఇబ్బందులా? అబ్బే చక్కని బుద్దిమంతులు,రూపసులు,4అంకెలలొ జీతాలు,కొద్దొగొప్పో ఆస్థిపాస్థులు వున్నవారు.కాని నిట్టూర్పులు విడవకతప్పటములేదు. ఫలితముగా వీళ్ళందరు పెళ్ళికాని ప్రసాదులుగా చలామణి.      
ఇంతటి వైపరిత్యానికి కారణము "ఆడపిల్లలు". మీరు చదివింది నిజమే ప్రస్తుతము ఆడపిల్లల డిమాండ్లు,వారి తండ్రుల కండీషన్స్ తిర్చలేక వీళ్ళకు ఈపాట్లు.
 
అసలు ఆడపిల్ల వుందంటేచాలు పూర్వము అమ్మలు,నానమ్మలు అందరు ఆడపిల్ల రజస్వల అయినవద్దనుంచి ఆపిల్లకు పెళ్ళిప్రయత్నాలు ప్రారంభించమని ఇంటి యజమానిని సతాయింపు.ఇక ఆయిన తనం ముద్దులకూతురుకు జతకొసము కాళ్ళకు బలపము కట్టుకొని ఊరు ఊరు తిరిగి తనకు సాధ్యమయిన సంబందము తేచ్చేవాడు.ఆ వచ్చిన వరుడు తరుపువాళ్ళూ, అబ్బో! దర్జా వొలకబొస్తూ పైనుంచిక్రిందకు దిగివచ్చినరేంజీలో వచ్చమా అన్న రీతీలో పిల్ల ఇంటికివచ్చి పిల్లను చూసి,అతిధి మర్యాదలు అవి ముగిసినతరువాత ఎవొకొన్ని ప్రశ్నలు వేసి,అమ్మాయి నచ్చితే కబురు చేస్తాము అని వెళ్ళీ, మధ్యనవున్న పెళ్ళిళ్ళపేరయ్యను  అమ్మాయి నచ్చింది వాళ్ళపెట్టుపొతల భొగట్టా చేసి అమ్మాయి తరుపువాళ్ళకు తమ అంగీకారము తేలిపేవారు.ఆపై లాంఛనాలు,కట్నకానుకల విషయాలన్ని ముగిసిన తరువాత నిశ్చయతాంబూలాలు, ఆపై వివాహము.ఇంత విధి విధానము అమ్మాయి పెళ్ళికి వుండేది.ఇంత ప్రొసిస్ లొను అమ్మాయి తండ్రి వొదిగి వుండటమే. 
    కాలము మారింది.బండి చక్రం ఆకులు క్రిందవి పైకి వచ్చింది.ఇప్పటి ఆడపిల్లలు వాళ్ళ ముందు తరమువారి ఇబ్బందులకు రివేంజ్ అన్నట్లు పెళ్ళికొడుకులకు చుక్కలు చూపుతున్నారు.

క్రమముగా ఇప్పుడు ఆడపిల్లల పెళ్ళివయస్సు 20 నుంచి 25 వరకు జరిగినది.ప్రస్తుతము ఆడపిల్లలు బాగా చదువుకోవటము,వ్యక్తులు కావటము,సంపాదానపరులు కావటముతొపాటు,చెప్పకూడదు కానీ వీళ్ళు తమ "ఫిగర్" వాల్యూ బాగా ఆంచనా వేస్తున్నారు.దానితో 'ఫిగర్ ' కొసము తహతహ లాడే కుర్రాళ్ళని తమ 'పిటపిటలాడే సౌందర్యముతో' ఒక తొక్కు తొక్కుతున్నారు.దీనికీ తోడు అమ్మాయి తండ్రుల అంచనాలకు అబ్బాయిలు తూగటములేదు.కారణము వారికి అబ్బాయికి స్వంత ఇల్లు, కారు. 20 లక్షల ప్యాకెజి జీతము,స్థిరాస్థులు లాంటివి చాలావుంటేకానీ తమ అమ్మాయిని చూడటానికి కూడా ఆహ్వానించటలేదు. 
     నేను ఎదొ వేళాకొళాని ఈపొస్ట్ వ్రాయటములేదు. ఈ మధ్య మా ఆవిడ కజిన్ కు సంబంధం గురించి వేతికితే కళ్ళు తిరిగే విషయాలు కనపడ్డాయి.వివాహ బయోడేటాలో వాళ్ళ కోరికలు,అభిప్రాయాలు చూసి నేను ఆశ్చర్యపొవలసి వచ్చింది.
 

అన్నట్లు ఇంకొ కొత్తసాంప్రదాయము వూడిపడ్డది. అబ్బాయి వాటాకు వచ్చే ఆస్తిని బట్టి అమ్మాయి వాళ్ళు 1% నుంచి 3% వరకు కట్నము.
మరి ఇన్ని నిబంధనలు దాటి తమ జత తెచ్చుకునేదాక పెళ్ళికాని ప్రసాదులు ..........
ఎమిటి మీ దారి ?  

28, ఏప్రిల్ 2012, శనివారం

వేసవి కాల మహొత్సవాలు -డాబా మీద నిద్రలు.



ఇలా వేసవిరాగానే అలా వాతావరణములొ మార్పులు.ఈ వేసవికాల వేడి,ఉక్కకు రాత్రిపూట ఇంట్లో నిద్రకు ఇబ్బందిగా మారి ఆందరు అలా ఆరుబయటకో,దొడ్లో చెట్టుక్రిందకో లేక డాబామీదకో తమ రాత్రినిద్రకార్యక్రమము బదలాయంపు.

             మా గ్రామములో రాత్రి 8గం. అయితేచాలు, అప్పటికే చల్లగా నీళ్ళుచల్లి సిద్ధపరిచిన చెట్లనీడన,ఇళ్ళ ముందర మంచాలు సిద్దము.మంచముక్రింద చెంబుతొ నీరు.ఓక వీసనకర్రతొ మనుషులు సిద్దము.అదే ముసలివారు అయితే బహుసందడి వచ్చేపొయేవారి యోగక్షేమాలు పరామర్శ. మరికొందరు బావా ఇది,మావా ఇది అని సరసాలు.ఆడవారు  ఏవొ లొకాభిరామాయణాలు.ఇవి అన్ని డాబాలు లేనివారు ఆచరించేపద్దతులు.
             డాబాసౌకర్యమువున్నవారికి వేసవికాలము తమపడక డాబామీదకు మార్పుతో  సౌకర్యము,ఆనందము,హోదా.
            రాత్రికి చల్లగావుండటానికి ఓక్కసారి నీళ్ళతొ డాబా అంతటిని సంధ్యవేళదాటగానే తడుపుతారు.ఆపై తుంగచాపలు వాటిపై పరుపులు లేకపొతే బొంతలు(గుర్తువున్నయా మరచిపొయారా)తో పడక సిద్దము.అలావేసిన పరుపులపై సౌకర్యమునకు దిండ్ల అమరిక.ఇంతపని ఆడుకుంటుచేయటము పిల్లలకు ఒక సరదా.
అలా డాబా మీద పడుకుని, ఆనిర్మల ఆకాశాన్ని మినుకు మినుకు మనే నక్షత్రాలను చూడటము,లెక్కించటము,గుర్తుపట్టటము,ఏంత దూరములొ వున్నాయో ఉహించి ఇంత పెద్ద  అంటూ చేతులు అలా విశాలముగా చూపటము.మధ్య మధ్యలో రాలీ పడే ఉల్కలను చూసి సంబరపడటము.చంద్రకళలను బట్టి ఆరొజు తిథి లాంటివి ఉహించటము.ఆకాశములొని దిక్కులు,మూలలు లాంటివన్ని గుర్తుపట్టటము.పౌర్ణమి రోజులలో చంద్రుడిని చూసి,దానిలొని మచ్చలను చూసి కుందేలని,ముసలమ్మని రకరకాలయిన కథలు.చంద్రుడిచుట్టు వలయాలు,అప్పుడప్పుడు ఏర్పడే ఇంద్రధనస్సు చూడటము ఒక అనుభూతి.
       వీటికన్నా, అలా డాబామీద పడుకొని నిరంతరము కదిలే మేఘాలను వాటి రూపాలను,వాటి ప్రయాణాన్ని గురించి కథలతో పాటు మనముకూడా అలా విశ్వములో ప్రయాణిస్తున్న అనుభూతి.
అప్పుడప్పుడు అలా వెన్నెల్లో అమ్మ కలిపిపెట్టిన ఆవకాయ అన్నము, చల్లని మజ్జిగలతో మామిడికాయ.ఇంతకన్నా గొప్ప భొజనము వుండదు వుండబోదు.

ఈడాబామీద నిద్రలో ఇంకొన్ని వినోదాలు.రకరకాలయిన భంగిమల్లొ నిద్రపొయే వారు అలా చిక్కిపొతారు.కొత్త దంపతుల ఊసులు,సరసాలకై అలా దూరముగా పడక కాని గాలివాటుకు అన్ని వినపడి పొద్దున్నే వదినను ఆటపట్టించే మరదళ్ళు.లేకపొతే ఏ ప్రక్కింటి మామో తొందరపడే సరసముతాలుకు ధ్వనులు.కొంతమంది పెట్టే గురక.      
      పిల్లలకు పెద్దలు నేర్పే బాలగీతాలు,పాటలు,పద్యాలు,కథలు,పెద్దల చిన్ననాటి ముచ్చట్లు,పిల్లల పసితనపు కబుర్లతో జోకొట్టి నిద్రపుచ్చుతారు.

మరి ఈనాడు! ఇది అంతా హుష్ కాకి. ఏవరకు వారు ఓంటికాయ సొంటికొమ్ము అయిపొయారు.కూలర్లు,ఏసి ల సంగతేమొకాని ప్రక్రుతికిమాత్రము దూరమయ్యారు.తద్వార ఖర్చు,అర్థములేని ఆందొళన.



         
     

27, ఏప్రిల్ 2012, శుక్రవారం

వేసవి కాల మహొత్సవాలు







కాలపురుషుడి కదలికతో ప్రక్రుతి మాత ఓడిలొకి వేసవికాలం వొచ్చింది. ఈ వేసవి వస్తుందని కొయిలమ్మ కుహుకుహు ధ్వ్హనులతొ,వసంతము చిగురు ఆకులతో స్వాగతం చెప్పింది.ఈవేసవి గ్రీష్మఋతువు వరకు వుండేకాలము అయినా చైత్రంలో తనను కొద్దిగానే పరిచయముచేస్తుంది.వైశాఖము నుండి దాదాపు భరణికార్తే లగాయతు తన ఉగ్రరూపము ప్రజలమీద చూపేడుతుంది. సూర్యుడి అత్యుగ్రరూపం ,ఏర్రని ఆగ్నికీలలులాంటి ఏండ,గాలిలొని తేమవాతవరణము వలన ఉక్క వీటీన్నింటి కలబొతతొ ప్రజల ఆపసొపాలు.కాని ఇంతటి వాతావరణము లొను ప్రజల జీవనములో చాలామార్పులు.ప్రత్యేకించి వేసవికాలమునకు మాత్రమే వున్నవి.
మరి ఇంతటి మార్పుకు కారణమయిన ప్రత్యక్ష నారాయణుడైన ఆ సూర్యభగవానునికి నాబ్లాగ్ తో మహొత్సవాలు జరపాలని .....

5 రోజుల ఈ మహొత్సవాలకు  ఈ రోజు నాంది ......            

24, ఏప్రిల్ 2012, మంగళవారం

ద్రౌపది నవ్వు - శరం లాంటి ప్రశ్న - భీష్మ సమాధానము.


మహభారతములొ సభాపర్వములొ జూదక్రిడయందు పాండవ ఓటమి తద్వారా ద్రౌపది పరాభవము సర్వులకు తెలిసినదే.ఆమేను   నగ్నముగా చూడాలన్న పరిస్థితి వరకు వొచ్చినది.కాని భగవదనుగ్రహము వల్ల ఆమె రక్షించబడినది.ద్రౌపది పదే పదే ప్రశ్నించినా బదులు పలుకలేనతగా అక్కడ వాయు మండలము దూషితము,భారమయిపోయాయి.అధిక సంఖ్యాకులు తమ తలలు తిప్పుకున్నారు మరి భీష్ముడు? భీష్ముడు కూడా స్పష్టముగా సమాధానమివ్వక ధర్మరాజుకే వదిలేశాడు.

దీనికి సమాధానము మనకు భీష్మ నిర్యాణములొనే మనకు తెలుస్తుంది.ఇది మహభారతములో వున్నదా అన్నవిషయము తెలియదు కాని గురుజనుల ముఖతా వినవస్తున్నది.
          మహభారత యుద్ధము ముగిసినది.అంపశయ్యపై భీష్ముడు. శ్రీక్రిష్ణ అదేశనుసారము ధర్మరాజు సతిసొదరసమేతుడై అంపశయ్యపై ఉత్తరాయణపుణ్యకాలనికై నిరీక్షిస్తున్న పితామహుని సన్నిధికి రాగా, భీష్ముడు ధర్మారాజకోరికపై సకలరాజ ధర్మాలు బొధిస్తున్నాడు.ఈ ధర్మొపదేశాలు జరుగుతుండగా ద్రౌపది నవ్వసాగింది.అది చూసి పితామహుడు "అమ్మాయి!నువ్వు నవ్వటానికి కారణము ఏమిటి? అని ప్రశ్న.
   ద్రౌపది సంకొచిస్తు "పితామహ నావల్ల పొరపాటు జరిగినది" అనిపలుకగా.అంతమాత్రముచే సంతోషపడని వాడై "అమ్మా! శీలవతి ఆయిన ఏ కులవధువూ గురుజనుల,సభాముఖముగా అకారణముగా నవ్వదు.నీవు గుణవంతురాలవు,సుశీలవు నీ నవ్వు అకారణము కాదు, సంకొచరహితంగా నీ నవ్వుకు కారణం చెప్పు" అని అన్నాడు.
     అంత ద్రౌపది ముకుళితహస్తయై  "పితామహ ఈ విషయము  వ్యక్తపరచరానిదీ,అయినా మీరు ఆదేశిస్తున్నారు కనుక చెబుతున్నాను.మీరు నేడు చేస్తూన్న ధర్మోపదేశాలను వింటుంటే నాకు ఆశ్చర్యము భాదకలిగాయి.కారణము నాడు కౌరవ సభలొ దుశ్శాసనుడు నన్ను వివస్త్రను చేసే సమయములో మీ ధర్మఙ్ఞానము ఏమయిపొయింది? లేక ఇంత ధర్మఙ్ఞానము మీరు ఈ మధ్య నేర్చుకున్నరా అని  నాకు నవ్వు వచ్చినది.నన్ను పెద్దవారు క్షమించేదురు గాక !          
అంత భీష్ముడు అమ్మా! నీవు ఈనాడు ఈ ప్రశ్నతో సకలజనులకు ఆనాటి నా మౌనానికి కారణము తెలుస్తుంది అని పలికి.సమాధానముగా ఇలా అన్నాడు "పుత్రీ! నేను నా తండ్రి కొరకు రాజ్యాధికారము వొదలుకొని, నేనుకూడా పాలితుడనయ్యాను.మరియు ఆనాటి నా ప్రతిఙ్ఞప్రకారము  నేను నా ఆజన్మపర్యంతము ఈరాజ్యనికి,రాజుకు బద్దుడనయి వుంటాను. మరి ఆనాటి నారాజు దుర్యొధనుడు. అతను నాకుకావలసిన సర్వసౌకర్యాలు సమకూర్చినాడు.అతని దుష్ట పాలన వల్లలభించిన ఆహారప్రభావము వల్ల నేను మౌనముగా వున్నాను.కాని అర్జునుని శరపరంపరలవలన అనేకగాయలు ఆయినాయి, ఈగాయాల నుంచి ఆ కలుషిత అన్నప్రభావముచే ఉత్పన్నమయిన రక్తము పొయినది.ఈనాటి దేహములొ నామాత్రుగర్భమునుంచి వొచ్చినప్పుడున్న రక్తము వున్నది . అదియును గాక ఈనాడు ఈరాజ్యానికి రాజు ధర్మరాజు అతని ప్రభావము అప్పుడే ప్రారంభించినదని ఇది సూచన.ఆదియునుగాక నేను ఈనాడు స్వేచ్చాజీవిని". 
          మరి భీష్మునిలాంటి మహమహుల ప్రతిచర్యకు ఒక అంతరార్ధంవుంటుంది.



***********************లోకా సమస్తా సుఖినోభవంతు **************************** 
            
            

23, ఏప్రిల్ 2012, సోమవారం

చంద్రశేఖరా! నీను సన్నుతీ చేయ








చంద్రశేఖరా! నీను సన్నుతీ చేయ పదజాలమే రాని పాపినయితి!

శ్రీకంఠ నీ సేవ చేయ కరచరణాదులు కదపనయితి!

శ్రీశైలవాస కన్నులుండియు నీన్ను కాంచనయితి!

మ్రుత్యుంజయా నీ సేవ చేయ ముదముతొ సమయమ్ము సమకూర్చ జాలనయితి!

అన్నికలిగి వుండియి ఏమిచేయ నయితి!

పూర్వసంచితము ఏ రీతి కలిగినదియో?

కాలం ఈరీతీ కదులుచుండా కరుణకనుమా!

హర!హర!శంకర!భవహర పురహర కరుణార్థ హ్రుదయ పార్వతినాథ!

ప్రవిమల తేజొమూర్తి! ఆరవిళ మంగళ ప్రదాత!.






22, ఏప్రిల్ 2012, ఆదివారం

దీపారాధన వత్తుల సిలబస్


మాఅమ్మ గారు శ్రీమతి సుభద్రాదేవి గారి కి బొలేడు విశిష్టలక్షణాలు అవి అన్ని తెలుసుకుంటే మీరు ఎంత అభిమానిస్తారొ, ఎంత సంతొషిస్తారొ. మాఅమ్మగారి దగ్గర పరాయి అన్నది అసలు లేదు,సర్వజీవులు తన వాళ్ళే.అంతటి విశాల హ్రుదయము,బొళా.నాకొ అనుమానము హిరణ్యాక్షుడు లాంటి వ్యక్తిత్వము వున్నవాడు కూడా మాఅమ్మదగ్గర వొటు సంపాదించగలడని.ఆడపిల్లలైతె అది ఇంకా సులభము, ఎముంది అలా పట్టులంగా పట్టు వొణి ధరించి రెండు జడలొతొ కనబడితె చాలు మాఅమ్మగారి కళ్ళకు పూతన,తాటకిలు కూడా విశ్వసుందరిమణులా అవపడతారు.

మాచిన్నప్పుడు మాఆమ్మగారికి చాలావ్యాపకాలు,సాధనలు వుండేవి.మరి అందులొ ఏ శుభ ముహుర్తానొ ప్రారంభించారొకాని దీపారాధన వత్తులు తీసె కార్యక్రమము దాదాపు 35సం.లు నిరాటంకముగా కొనసాగింది. మరి ఈమధ్య కాలములొ తనపత్తి బుట్టతొ స దసర్వదా సిద్ధం, దారము తీయటానికి వుపకరణలా పాలగిన్నె. దారము మొత్తము చేతితొనె తీస్తారు కాని దారము సన్నగా రావటానికి మధ్య మధ్యలొ అలాపాలతొ వ్రేలుని తడిచెసుకుంటారు. దారము  సన్నగా,నాజుకుగా,పద్ధతిగా బహుచక్కగా అలా తీయగలరు. మిరునమ్మరుకాని 'రిలయన్స్ ' వారి యార్న్ కన్నా మా అమ్మగారి దారము సన్నము నాణ్యము. ఈ విషయము లొ పొటికయినా సిద్ధము.
.
వత్తులుగదా అని మీరు తక్కువ చూడకండి దీనికి బొలేడు సిలబస్ వుందట. నిత్యవత్తులని,అడ్డవత్తులని,గుబ్బవత్తులని.3,5,11 పొగులతొ ప్రారంభించి 108 పొగులడాక చెస్తారు. మీకు ఇంకొ వివరణ  ఇస్తున్నా పొగు వేరు, వత్తి వేరు.సన్నటి దారాన్ని పొగు అంటారు ఇవి కలిపి, చుట్టి మనకు కావలసిన విధముగా అలా ఒక నిర్ణిత పరిమాణములొ చేయటాన్ని వత్తి అంటారు.మరలా ఈవత్తులన్ని కలిపి కట్టలుగా కడతారు.సాధారణ పొడవు వొత్తుల తొ ప్రారంభించి నక్షత్ర వత్తి ,శ్రీచక్ర వత్తి  అని ఇంకా 20 నుంచి 30 రూపాల్లొ చేస్తారు.

నిత్య వత్తులు వేరు,వ్రతము లాంటి విశేష పూజకు వేరు శ్రావణ,కార్తిక,మాఘ,మార్గశిర మాసాల్లొ ఆ మాసాలకు సంభందించి మరల వేరు. శైవులకు,వైష్ణవులకు వేరు.దాదాపు  20 గుళ్ళు, మా ఉరిలొని వారు,మా బంధు కొటి లొని ప్రతివొక్కరికి తన వత్తులతొ సేవాభాగ్యము చేసుకున్నారు. ఇక కార్తికానికి 3 నెల ముందే మాఅమ్మగారి వద్ద హడావుడి ప్రారంభము. చక్కటి ప్రత్తి తెచ్చి అలా ఎండబెట్టీ దానిలొని గింజ లాంటివాని తీసి శుద్ధిచేసి సిద్ధం చేసెవారు.కార్తికము లొ పత్తికి గింజ తీయకూడదట.ఈతీసిన గింజ ఆవుకుమాత్రమే ఆహారం.కార్తికమాసములొ 11వత్తులతొ ప్రారంభించి 365,1008, లక్ష,కొటి వత్తులదాకా చేస్తారు.మేము ఎన్ని గుళ్ళలొ ఈ లక్ష వత్తులు,కొటివత్తుల దీపారాధన కార్యక్రమము చేసినామొ లెక్క లేదు.

         ఇలా ఈవత్తులు ఎవరికి చేయి,ఎన్ని చేయి. గుడికయినా,వ్యక్తికయినా పత్తి తొ సహా మొత్తము అమె సొమ్ము పెట్టి, శ్రమ చేసి సేవ చేసెది.
ఈవిశేషత మా అక్కలకుగాని, మాఇంటి కొడళ్ళకు గాని లేదు.

ఇంతటి ఈ భగిరధ ప్రయత్నము ఒక సం. కాలముగా అమె అనారొగ్య కారణముగా ఆగిపొయింది.

అమ్మా! త్వరగా కొలుకొ  అమ్మా! మన గుళ్ళు, బంధువులు ఆందరు నీ వొత్తులకు ఎదురుచూస్తున్నారు.

నాయినా రామచంద్ర నా ఈమొరని ఆలకించి, ఆమెకు ఆరొగ్యాన్నిప్రసాదించవయ్య నీకు సేవ చేసుకుంటది.        
                 
                      నా ఈచిన్నికథనము మాఅమ్మపాదాలకే.

            ***********లొకా సమస్తా  సుఖినొ భవంతు ************             
                               

21, ఏప్రిల్ 2012, శనివారం

శివా!నా నిర్మలదేహమ్ము







శివా!నా నిర్మలదేహమ్ముతో
నీకు స్నానమ్ము కావింతు
నా మనస్సు నీకు శిఖరం
నా నాసికము నీ ముఖద్వార మండపం
నా అఙ్ఞానమే నీ నిత్య దీపము
నా సుఙ్ఞానమే నీ ఆనంద దీపము
నా ఓంకారమే నీ శంఖు నాదము
నా కుక్షి నీ గర్భగుడి
నా నయనములు నీ కరవత్తులు 
నా కరములు నీ అవసరపు గంటలు
నా మనస్సు నీకు మారేడు దళము
నా శరీరమే నీకు లింగ నైవెద్యము
నా చుట్టూ ఆకారం నీకు ప్రాకారము 
గంగాధర! కరుణా కటాక్ష!
శ్రీశైల మల్లిఖార్జున కరుణకనుమా!    


అరుణాచలగిరి ప్రదక్షిణము లొని శివ శక్తిల సంగమము.



పంచభూతలింగాల్లో (జ్వాల) తేజోలింగము గా ప్రకాశించేది తిరువణ్ణమలై లొని అరుణాచలేశ్వరుడు.అమ్మవారి పేరు వున్నామలైఅమ్మ.ఈక్షేత్ర ప్రత్యేకము గిరిప్రదక్షిణము.దాదాపు క్షేత్రదర్శనమునకు వొచ్చిన ప్రతిభక్తుడు ఆచరించే ఒక సాంప్రదాయము.ప్రతి పౌర్ణమి రొజు రాత్రి అశేషభక్తకోటి ఈ సాంప్రదాయాన్ని పాటించే తీరు కన్నులారా కానవలసినదే. దాదాపు పౌర్ణమికి 2 రొజుల ముందునుంచే భక్తుల రాక ప్రారంభము అవుతుంది. ఈ రొజులలో యాత్రికులకు బస కొద్దిగాకష్టపడాలి. కాని పౌర్ణమి రొజు రాత్రి  పూటచేసే గిరిప్రదక్షిణ లొ నిండు పున్నమి వెలుగులో శిఖరసౌందర్యము కైలాసశిఖర సమానముగా ప్రకాశిస్తుంది.అసలు పూర్తి గిరి,శిఖరము మొత్తము ను ఒక లింగముగా,ఆ ఊరుమొత్తము ఒక దేవాలయముగా భావించుతారు. దీనికి ఆధారముగా గిరికి 4 దిక్కులు,4 మూలల్లొ మొత్తము 8 దేవాలయలు నిర్మించి అందులో ఆయాదిక్కుల, అధిపతుల తాలుకు పేర్లతొ మరల లింగములు ప్రతిష్టించివున్నాయి.అంటే శిఖరం  మొత్తాన్ని అష్టదిగ్భందము జరిగినది. సౌరమాన కార్తీకములొని పౌర్ణమి రొజులలొ జ్వాలాదీప ఉత్సవము చేస్తారు. ఆనాడు
శిఖరము పైన వెలిగించే జ్యొతి దాదాపు 30 నుంచి 40కిమి వరకు దర్శనము ఆవుతుంది అంటే జ్వాల పరిమాణాన్ని ఊహించుకొవలసినదే.          
 
       ఈ పర్వతముమొత్తము రెండు శిఖరాలుగా ఒకదానితొ ఒకటి ప్రక్కప్రక్కనే శివ,శక్తిల ప్రతీరూపముగా దర్శనమిస్తాయి.మనము గిరి ప్రదక్షిణలొ మనకు ఆగస్తేశ్వర ఆశ్రమము ఒక పాయింట్ ఒకటి కనిపిస్తుంది దానిప్రక్కనే ఒక పురాతన మందిరము కనపడుతుంది ఇక్కడమాత్రమే ఒక పాయింట్ నుంచి శివ,శక్తి శిఖరాల ఐక్యమై ఒక్క శిఖరముగా దర్శనమిస్తుంది. మీరు కనీసము 2 అడుగులు అటు ఇటు వేసినాకూడ మీకు ఈశిఖరాలు 2 వేరు వేరుగా దర్శనమిస్తాయి.
ఈగిరిప్రదక్షిణ  మార్గములొనే మనకు రమణాశ్రమము కూడా దర్శనమిస్తుంది.ఒక్కసారి ఆమహనుభావుడు రమణుని దర్శనముచేసుకుంటే మనముకూడ కొంత సంస్కరించబడతాము.        

20, ఏప్రిల్ 2012, శుక్రవారం

శ్రీ రాముని పై ఒక శ్లోకం.






                               సీతామనో మానసరాజ హంస! సంసార సంతాప హర! దయాళో!

                               శ్రీరామ! దైత్యాంతక! శాంతరూప! శ్రీతారకబ్రహ్మ నమోనమస్తే!.

శ్రీ రాముని పై పద్యము - ఇది ఎక్కడిదొ మీకు తెలుసా ?





**************************
దండమొక్కటి నీకు దశరథాత్మజ రామ

రెండు దండంమ్ములు రామచంద్రాయ

మూడు దండంమ్ములు ముల్లొక పూజిత

నాలుగు దండంమ్ములు నళిననేత్ర

ఐదు దండంమ్ములు అమరేంద్ర వందిత

పది దండంమ్ములు పద్మనాభ

నూరు దండంమ్ములు నుత జన పొషిత

వేయి దండంమ్ములు వేదవేద్యా

లక్ష  దండంమ్ములు పక్షీంద్ర వాహన

కోటీ దండంమ్ములు కొమలాంగ

దండములు దండములు పదికొట్లు నీకు

కన్నతండ్రీ మమ్ము కాపాడి రక్షించవయ్యా.
********************************

ఈ పద్యము  నా చిన్ననాటి నుంచి మాఅమ్మ  తన పూజ సమయములొ పాడేవారు.నేను కూడా అలా నేటికి నా పూజ సమయములొ పాడుతాను.కాని నాకు దీని మూలము ఎక్కడిదొ తెలియదు. మీకు ఎవరికన్న తెలుసా? ఇవే కాదు ఇంకాచాలా పద్యాలు వున్నాయి వీలుని బట్టి అలా వరుసగా.  





19, ఏప్రిల్ 2012, గురువారం

జొన్న చేనుకాడ చిన్నదాని చూచి



జొన్న చేనుకాడ చిన్న దాని చూచి

నిన్నటేల నుంచి నిదురలేదు దాని

నన్ను  కూర్చి దయతో చూడు మాధవ

పొన్నపూల చేత పూజ చేతు.







అమరావతి కథలు ముఖచిత్ర వివరణ - కథలపై 'నానొ ' పరిశీలన.



పంచారామాల్లొ అమరావతిది ఒక విశిష్టత.ధాన్యకటక మహాసామ్రాజ్యముగా అపై బౌద్ధము ఫరిఢవిల్లినప్రదేశముగా.ఆపై వాసిరెడ్డివారి పాలన ఇదుగొ విళ్ళందరిని పరిపాలిస్తు అమరేశ్వరుడు.
సూర్యుడిని ఒక దీవిటీ పరిచయము చేస్తుంది అంటే నవ్వుతారు,సాహసము అంటారు.ఆలాగే అమరావతికథలు,రాష్ట్రపతి ఆవార్డ్  గ్రహిత  శ్రీ శంకరమంచి సత్యం గురించి నాలాటి చిన్నవాడు వ్రాయటమంటే దుస్సాహసము అవుతుంది,కాని కొన్ని ఆప్త వచనాలు(Nano) కదా అని ప్రారంభము.  

గత 6 నెలలుగా అమరావతికథలు పై వ్రాయలని కాని ఆ మేరునగధీర  ఆసాహిత్యము గురించి ఎంతొ మందిచెప్పారు కొత్తగా నేను ఎమి చెప్పాలి. కాని మనస్సు ఆరాటపొరాటము ఎందుకొ రాత్రి ఆ అమరుడు నన్ను కరుణించాడు ఒక మార్గము సూచించాడు ఆంతే ప్రారంభం కొద్దిక్షణాల్లొనే చిత్తు ప్రతి సిద్ధము.ఆకథా మేలిముత్యాలొ కొన్ని మాత్రమే.

  అమరావతి కథలు ముఖ చిత్రమే ఒకవింత ఒక అద్భుతము బాపు కళానైపుణ్యానికి  మరో ఉదాహరణ.అన్ని శబ్దాలు ఢమరకుము లొంచి వొచ్చాయని అని ఒక ఐతిహ్యము, వ్యాకరణసూత్రము. అంటే పరమేశ్వరుడు అన్ని శబ్దాలకు అధిపతి. అలాగే ఆ లొకపావని పార్వతి సకల పరా,శ్రీవిద్యలకు అధినేత్రి ఆలాంటి ఆది దంపతులముందు శంకరమంచిగారు కథ పూజ. శంకరమంచిగారు కథలు చెపుతుంటే అమరేశ్వరుడు  చక్కగా సిద్ధ ఆసనములో ఆలకిస్తూ,అమ్మ చెప్పరా అబ్బాయి అంటూ చెక్కిలిన చేయి పెట్టుకొని ఎంత కమ్మగా చెపుతున్నవురా బడుద్దాయి  అన్నట్లు చల్లని చూపు.హరుడు ఆలావుంటె నేను లేనా అని క్షేత్రపాలకుడు వేణుగోపాలుడు గోల్లపిల్లవాడిగా మనలాంటి పామరజనాలని ప్రతిబింబిస్తూ ముల్లుకర్ర ఒకచేతిలొ,ఇంకొ చేయి సావధానముగా వింటున్నా అని తెలపటానికి అలా మడచి.విళ్లందరి హడవుడితొ క్రిష్ణమ్మ, గంగమ్మ రూపములొ  తన వడి,ఉధ్రుతి తగ్గించుకొని ఎమిటావింత చూడాలని అలా. సకల ప్రాణకొటికి ఆధారమయిన  'సొహం'   నాగరాజుగా శంకరమంచిగారి కథానాగస్వరానికి మైమరచి. అన్నట్లు మధ్యలొవున్న ఆవు శివుడి నందా లేక వేణుగొపాలుని గొవా, లేక సకల దేవ ఆవాసమయిన కామధేనువా అన్నది మీ ఊహ.అన్నట్లు మీకు తెలుసుగా ఆమరేశ్వరలింగము బాగా ఎత్తుగా శిఖరమునుతాకుతున్నట్లు ఆందుకే దానిని సూచిస్తూ శివుడు అలా పైదాక .

శంకరమంచిగారి కథ,కథనము,పాత్రల ఏంపిక ఒక అద్భుతము. ఏకథకు అనవసరమయిన వర్ణనలు,పడికట్టుపదాలు,ఇబ్బంది పెట్టె సంధులు,సమాసాలు వుండవు.ప్రతికథ అలా సరాసరిన విషయములొకి అలా మన మనోఫలకములొకి.మీరు మీమనస్సులో అమరెశ్వరుని కేంద్రముగా ప్రతిష్టించుకొండి శంకరమంచిగారు మనలను అమరావతి మొత్తము ప్రయాణము చేయిస్తాడు. అలా రాజబాట,ఉత్తరవీధి,కోట,రేవు అంటుపలు ప్రాంతాల్లొ విహారము చేయిస్తాడూ.మనము కూడా ఈప్రాంతాలన్ని మావే అన్నట్లుగా దర్జాగా వెళ్ళిపొతాము.కథలొని పాత్రలన్ని మాములుగా వుంటాయా చైతన్యముతొ తొణికిసలాడుతుంటాయి .ఇవి అన్ని పాత్రల్లా తొచదు వీళ్ళందరు  మనతాలుకు చిరపరిచితుల్లా,స్నేహితుల్లా,బంధువుల్లా,కొన్నిపాత్రలలొకి పాఠకుడు తనను కూడా ఉహించుకుంటాడు.మనసమాజములొని అన్నికులాలు,మతాలు వర్గాలు,రాజు నుంచి పేద దాక పాత్రధారులే.గమ్మతు క్రిష్ణమ్మకూడా పాత్రధారిగా మారిపొతుంది.ఇంతటి కొలాహలాన్ని,సంబారాన్ని, వ్యక్తుల ఆనంద దుఖాలను అన్నింటిని అమరేశ్వరుడు శాంతముగా గమనీస్తునె వుంటాడు. క్రిష్ణమ్మ తన చైతన్యశీలనతొ కాలము నేను ఒక్కటేరా నాన్న అని చెపుతుంది.


మరి ఇన్ని కథలొ కొన్ని అంటే వీటినే ఎంపికనికాదు ఏమిటొ అలాజరిగింది అంతే.
1) పుణుకుల బుట్టలొ లచ్చితల్లి : మన సమాజములో ధనము ఎంత ప్రభావమో ,లౌక్యము,ఎంత అవసరమో తెలియ చెప్పుతుంది. మరి పుణుకుల సుబ్బాయి డబ్బువొచ్చింతరువాత సుబ్బరావుగారు గా మారిన వైనము.
2)రాగి చెంబులొ చేపపిల్ల : అచారలన్ని అర్థం లేనివని. సౌఖ్యముగా వుండటమే ముఖ్యమని సుబ్బమ్మగారి  పాత్ర ద్వార చెప్పుతారు.
3) అద్గద్గొబస్సు : యంత్రం, దాని యాంత్రికశక్తి ముందు మానవబలము ఏపాటిది. కొత్తగా వొచ్చిన బస్సువల్ల దెబ్బతిన్న జట్కా సాయిబు జీవనచిత్రము.
4) తులసి తాంబులం : మాములుగా భొజనానంతరం తాంబుల సేవనము భుక్తయాసానికి,అరుగుదలకు అవసరమే కాని జరుగుబాటు లేని ఒక బీదబ్రాహ్మణునికి తులసి తాంబులమే ఆహారము, సకలము, సర్వము.
5) భొజనచక్రవర్తి : పిట్టతిండ్లు, ఒంటి పూటలు,అజీర్తి,గ్యాస్ సర్వసాధరణమయిన ఈ రొజులలొ అప్పంభొట్లు గురించి చదువుతుంటే అలా ఆశ్చర్యపొవలసినదే.
6) నాన్న నది : కాలము,నది ప్రవాహము ఎవరికొసము ఆగవు అలా సాగి పొవటము వాటి లక్షణము.తండ్రి పొయాడని దుఖిస్తున్న సీతయ్యకు తను ఓ బిడ్డకు తండ్రి అని గుర్తుచేసిన వైనo. 
           7) బలి: అర్థం లేనిగ్రామ కక్షలు ఇరు కుటుంబాల్లొ ఎంతలా హాని చేస్తాయో  అని.
8) అటునుంచి కొట్టుకురండి : రాజ్యం తాలుకు కఠినత, పాలకుడు తన పాలితులపట్ల వహించవలిసిన ధర్మము,జాగరుకత.
9) విరిగినపల్లకి  : మారిన వేడుకలు,ఆచారాలు,సాంప్రదయాలు వాటిమీద ఆధారపడ్డ వ్యక్తుల జీవన ఛ్ఛీద్రము. పల్లకి సంగడు మారిన సాంప్రదాయలవల్ల ఆదాయము లేక తన జీవనాధారమయిన పల్లకి బొంగుతొ చేసిన గంజిత్రాగ వలసిన జీవన చిత్రణ.
10) అంపకము : ఆడపిల్లను కన్న తండ్రి ఎంత ముద్దుగా మురిపముగా పెంచుకున్నా ఆపిల్లను అత్తారింటికి పంపవలసివస్తే ఆతండ్రి పడే వేదన. తనప్రాణాన్ని,తనమహలక్ష్మిని,తన ఆత్మను ఏవరొ తీసుకుపొతున్నారు అన్న భావన.అల్లుడిచేయి పట్టుకుని అత్తారింటికి వేళ్ళుతుంటే అంపకాలసమయములొ, అల్లుడు చేయు పట్టుకుని అయ్యా! అని పలికిన ప్రతి పలుకు ఆడపిల్ల వున్న ప్రతి తండ్రి గుండెల్లొ అలా గుచ్చుకొంటాయి.
మరి ఇలా ఎన్నొకథలతొ అమరెశ్వరుడికి పూజ. మరి శివుడంటేనే అభిషేకము చివరికథ శంకరమంచివారి అర్పణ మహరుద్రాభిషేకము.
నాకు తెలుసు  మీరు ఇవిమొత్తము ఈ పాటికే చదివివుంటారని. కాని, నా త్రప్తికి.వీలుంటె మరలా అమరేశ్వర సాన్నిధ్యములొకి వెళ్ళండి.

ఈ చిన్నప్రయత్నము  నచ్చితే కామెంట్ ఆశ్శీస్సులు.
       
                         *** లొకసమస్తా సుఖినొ భవంతు ***              
             







18, ఏప్రిల్ 2012, బుధవారం

శ్రీరామకొటి - అసిధారావ్రతము.


శ్రీరామనామము మన జాతీయజీవనాడికి ఒక ఇంధనము.రామమందిరము లేని వూరు వాడ వుండదు ఆంటే అతిశయోక్తికాదు రాముని మనలొ ఆంతలానిలుపుకున్నాము.ఉత్తమపురుషలక్షణాలయిన 24 కలవాడు,16 కళా ప్రపూర్ణుడని ఉత్తరాదివారు మర్యాదపురుషొత్తం శ్రీరాము అని పలుకుతారు.మన స్త్రిమూర్తులకు ఆదర్శనీయుడు.గ్రుహస్తులకు,ఆచారవంతులకు శ్రీరాముని పిత్రువాక్యపరిపాలన,కర్తవ్యనిష్ట,ధర్మనిరతి,సొదరప్రేమ,మిత్రరక్షణ ఒకటేమిటి,
ఇలా ఆయనను ఆదర్శముగా తీసుకొని తమజీవనవిధానము నడుపుతున్నవారునేటికి కొకొల్లలు.శ్రిరాముని పై తమతమ భాషలలొ రామాయణాలు,కావ్యాలు,గేయాలు,కీర్తనలు  రచించి పండితులు తరించిపొయారు.ఇక కళాకారులు సరేసరి.మరి పామరులకు మాత్రము ఇవిఎమి తెలవదు ' రాములోరు ' మాదేవుడు అంతే. శ్రీరాముడు సచ్చిదానందస్వరూపుడు అన్నది జగద్విఖ్యాతము.మరి అందుకే రామనామము తారకమంత్రమయినది.రామదాసు తారకమంత్రము కోరిన దోరికేను ...అన్నా ,త్యాగారాజు భక్తితో అన్ని కీర్తనలు ఆలాపించి రామనామము లొ రమించి తరించారు.కానీ సామాన్యులకు శ్రీరామకొటి లేఖనము భవ తారకము.

ఇంతటివిశిష్టమయిన శ్రీరామకొటి నామలేఖనాన్ని ఒకవ్యక్తి   కొరినవారందరికి ఉచితముగా ఇస్తూ ఒక ఆసిధారవ్రతములా చేస్తున్న వ్యక్తి పేరు "శ్రీ వూటుకూరి రామయ్య గారు" ఊరు మార్కాపురం,కస్తురిబాయి వీధి.
ఆర్థికముగా భారమయిన ఈరొజులలొ 50పై ల పొస్ట్ కార్ద్ వ్రాస్తె చాలు మీ ఇంట్లొ శ్రీరామకొటి లేఖనాగ్రంథము ప్రత్యక్షము.అది పూర్తి ఉచితముగా.వీరుమనకు పుస్తకము పంపి వూరుకొనరు మనపేరున ఒక ఖాత ప్రారంభించి మనతాలుకు రామకొటి గ్రంథాల రాక, మనము వ్రాసినతరువాత ఎప్పుడు చేరినది నమోదు చేస్తారు. ఎవరన్న గ్రంథానికి ధరకాని,ఆర్థికసహాయానికి నిధులుకాని పంపుతామన్న ససేమిరా అంగీకరించరు.మీరు ఆనిధులను మీవద్దవున్న మీఇష్టదైవాలకు,మందిరాలకు,ధర్మకార్యాలకు వినియొగించండి నాకు వొద్దు అంటారు.
వీరు 1933లొ జననము.చిన్నతనము నుండి అధ్యాత్మికత అంటేఅభిమానము.విరు మంత్రదిక్ష పొంది నేటికి సాధనలొనే వున్నారు.వీరు కుండలని సాధకులు.ఆఙ్ఞాచక్రము వరకు సాధన చేసి ఆరొగ్యము సహకరించక విరమించినారు.వీరు వి.అర్.ఎజెన్సిస్ పేరున 18సం.ల క్రితము వరకు వ్యాపరము చేసినారు. వీరికి 3 పుత్రికా సంతానల వివాహము చేసినారు.వీరిభార్య గతించినతరువాత వీరి పుత్రికలకు  అభిమానము మేరకు కొంత ధనము ఇచ్చి మిగతా ధనము,ఆస్తులపై వొచ్చు ఆదాయాని పూర్తిగా ఈ ధర్మకార్యానికి వినియొగిస్తారు.

  శ్రీరామనామ లేఖనా మహిమలు గురించి అడిగితే చాలు ఎన్నొ ప్రత్యక్ష ఉదాహరణలు : గూడూరు మునిసిపాలిటిలో సకల దురవ్యసనాలకు లొనై ఆతని కుటుంబము చేకూడా ఆసహ్యహించబడ్డ వ్యక్తి రామనామలేఖన వల్ల అతనిలొ వొచ్చిన మార్పు అతని కుటుంబము నుంచి వొచ్చిన ఆదరణతొ హాయిగావున్నడు. రాజమండ్రి లొని ఒక సంపన్నునికి అన్ని వున్నా అతని బిడ్డకు మాటలు రాక ఆ,వూ అని పలుకుతుంటే పడె క్షొభకు పరిహారముగా వీరు రామనామ లేఖనము చేస్తే వీరి బిడ్డ అమ్మా అని పిలిచిన పిలుపుకు వారు పొందిన ఆనందము. తమిళనాడు లొని గుడియాట్టం నుంచి విరి గురించి తెలుసుకొని మర్కాపురమునకు ఒక బస్సులొ వొచ్చి వారు పొందిన ఆనందము. ఇలా ఎన్నొ వున్నాయి. నేడు వీరు సామన్యులకు అవకాశముమేర వున్నాయి ఆ అవకాశములేని ఖైదిలకు తొడ్పాటుగా వుండాలని వరంగల్ ఖైదిలకు పంపితె వొచ్చిన స్పందన.               

ఇవి ఆన్ని పుక్కిటిపురాణాలు కాదు, కల్పనలు అంతకన్నకాదు ప్రత్యక్ష నిదర్శనాలు.
వీరు రామకొటి లేఖనా గ్రంథాలేకాక, ఎన్నొకరపత్రాలు , సుందరకాండ చంపుకావ్యము కూడా పంచుతూనెవున్నారు. మరి వీరిదీ ఆసిధార వ్రతము అవునాకాదా!
మీకు రామనామ లేఖన పై సందేహాలు  వివరణలకు ఉదయము 11గం. తరువాత 9491179822 సంప్రదించగలరు.
 

ఇంతటి విశిష్టమయిన వ్యక్తిని 5సం. క్రితము పరిచయము చేసినవారు మా మిత్రులు శ్రీదేవిశెట్టీ ఆదినారాయణరావు ను ఇక్కడ స్మరించకుండా వుండలేను.
  

       

17, ఏప్రిల్ 2012, మంగళవారం

ప్రారబ్దము - నిజమయిన సంఘటన.



ప్రారబ్దము బహుశా ఈమాట తెలీయని ఆస్థిక జనులు వుండరు. మనము చేసిన కర్మల ఫలితము ప్రారబ్దము.ఈ విషయాన్ని నిరుపించటానికి శ్రీ పి.వి.అర్.కె.ప్రసాద్ గారి పుస్తకము "ఆసలేంజరిగిందంటే..." లొని ఆఖరి 2 పేజిలలొని వారుతెలిపిన వ్రుత్తాంతము మీరుకూడా తెలుసుకొవాలని ఇక్కడ పరిచయము చేస్తున్నాను.ఇక ఇక్కడినుంచి వారి మాటల్లొనే.

.
గుంటూరులో నేను చదివిన హిందు కలేజీ హైస్కూల్లో క్రిష్ణారావు మాష్టారని ఇంగ్లిష్ ఉపధ్యాయులుండేవారు. అందరు విద్యార్థులు గౌరవించే ఉపధ్యాయిడు.మహాదైవభక్తి పరుడు.అనునిత్యం జపతపాలు. ఆయినకు 13 మంది పిల్లలు.మాష్టారుగారి అబ్బాయి సదాశివ నాసహధ్యాయి.మాష్టారు ఉద్యొగములొ వున్నరొజుల్లొ పెద్దజబ్బు చేసి మాట పడిపొతే 2సం. శెలవు పెట్టి ఆధ్యాత్మిక సాధన చేసి మాట్లాడగలిగే గలిగే శక్తి సంపాదించుకున్నరు.కొద్దికాలము తరువాత సదాశివను కలిసేసమయానికి ఆతను టి.బితొ హాస్పటల్ లొవున్నాడు. అతనికిపైన చాలామంది అక్కలు,అన్నలు వుండాలి.కాని వాళ్ళంతా పెద్దవాళ్ళయ్యాక చనిపోయారు.నన్ను చూసి సదాశివ ఏడ్చేసాడు.                      
మానాన్నకు మిగిలింది నేను మాతమ్ముడూ.వాడింకా చిన్నవాడు.నేను సంపాదనకొచ్చే సమయానికి ఇలా జరిగింది,నేను బ్రతకను,మాకు ఆస్తిపాస్తులు లేవు మా అమ్మా,నాన్న ఎలానొ ....అంటు వలవలా ఏడ్చాడు. తరువాత కొద్దిరొజులకు సదాశివ చనిపొయినాడు.

మాష్టారి కుటుంబము ఎక్కడికెళ్ళీపోయారో తెలీదు ....14సం.తరువాత, ఒకమిత్రుడిద్వార మాష్టారు పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలొ వున్నారని,హైదరాబద్ మూసినది ఒడ్దున ఒక తాటాకులపాకలొ నివాసము. మాష్టారి దర్శనమునకు వెళ్ళాను.
నేను వెళ్ళెసరికి మాష్టారు చిన్న తుండుగుడ్డకట్టుకొని పూలుకొసుకుంటున్నారు.బాగాముసలివాళ్ళూఅయిపొయారు.ఆవిడా ఆలాగే ఆవస్థపడుతూ నీరు మొసుకొనివస్తొంది.ఆయిన నన్ను గుర్తు పట్టటానికి సమయముపట్టింది.ఆయిన చేప్పిన విషయాలు విని నిశ్చేష్టుడయినాను ! 
       రొజు కొన్ని గంటలుపాటు భగవద్ధ్యానము లొ మాత్రమే మునిగిపొయే భక్తుడి 13మంది పిల్లలొ ఒక్కడు కూడా ఆయిన వ్రుద్ధాప్యములొ మిగలలేదు.మరి ఆఖరివాడు ?...వాడు మానసికముగా ఎదగలేదు.మాతొనేవుంటే చచ్చిపొతాడని దత్తత ఇచ్చెసామయ్య  కాని వాడు కూడా బతకడు" అన్నారు నిర్వెదముతొ. ఆయిన అన్న ప్రతిమాట నాకు గుర్తుంది...నేను గంటలకొద్దిసమయము ఆసర్వేశ్వరుడి పూజలొనేగడుపుతున్నాను.నాకు ఇన్నికష్టాలు ఎందుకు ఇచ్చావని అడగటానికికాదు .నాకు తెలుసుకదా!ఎదొజన్మలొ చెసిన కర్మఫలాన్నె  అనుభవిస్తున్నాను.... 80ఎళ్ళు దాటాయి దుఖము అలావాటయిపొయింది.శరీరభాధ భాధనిపించదు.దుఖము ఎడుపుతెప్పించదు ...ఇంకా మంచిరొజులు ఎమివొస్తాయని ఆశించాలి ?. ఈచేతులమీదుగా పెళ్ళిడుకువొచ్చిన, చేతికి అందివొచ్చిన 12 మంది పిల్లలకు దహనకాండలు చేసిన తండ్రినయ్యా ...అయినా ఇప్పటికి గంటలతరబడి జపతపాల్లొ ఆరధిస్తున్నానంటె - ఈ కష్టాన్ని అనుభవించె శక్తి ఇమ్మని, కనీసము ఇతరులనయిన సుఖశాంతులతొ బ్రతకనిమ్మని కొరటంకొసమే." లొకాసమస్తాసుఖినొభవంతు  అని ప్రార్ధించటము ఒక్కటె చెస్తున్నను ... నాసమస్యల్లా నాభార్య వుండుండి రొదిస్తుంటె ఎలావొదార్చాలొ తెలియకపొవటము.జీవించినంతకాలము  పొట్టగడవాలి గదా? ఎలా?ఎలా? ఆందరు సుఖంగావుండాలని దేవునిప్రార్ధించటానికయినా నాకు శక్తి వుండాలిగదా...!?  ఆంతటి దుఖములొను,ఆంతటినిస్సహాయస్థితిలొను ప్రజలందరు బాగుండాలని దేవుని ప్రార్థించే మాష్టారుకు మించిన ఆదర్శంవుంటుందా?....


     ఇదండి ప్రారబ్దం అంటే.ప్రసాదుగారు తరువాత మాష్టారుకు తిరుమలనుంచి సహాయము ఇప్పించారు.        
        

108 సార్లు కాశీ యాత్ర - ఒక విచిత్ర దీక్ష.






యుగయుగాలుగా తరతరాలుగా మానవుడు ఈభౌతికప్రపంచానికన్నా సుదూరముగా ఒక లొకమున్నదని దాని అధిపతి పరమేశ్వరుడని మరణాంతరము తమకు ఒకజీవితము వున్నదీఅని దానినిచేరటానికి అనేక మతాలువారు అనేకమార్గాల్లొ పరిశ్రమచేస్తూనే వున్నారు.పరమేశ్వరుడు ఒక శిఖరముగా భావించుదాము.శిఖరానికి సాధారణ ద్రుష్టిలొ ఒకేమార్గముగా గొచరిస్తుంది. కాని విహాంగవీక్షణము చేయండి ఎన్నొ మార్గాలు. అలాగే భగవంతుని చేరాటానికి కూడా ఎన్నొమార్గాలు. వాటిల్లొ ఒకటి పుణ్యక్షేత్రయాత్ర.నేను పరిచయము చేయబొయే వ్యక్తి కథ కూడా అలాంటిదే.

   కాశీ ఒక అద్భుత అధ్యాత్మిక క్షేత్రము. చూసినవారికి చూసిన విధముగా దర్శనము ఇవ్వగలగిన ప్రత్యేకత.యోగులకు,భక్తులకు,సాధకులకు,మార్మికులకు,జీవులకు  ఒక కల్పతరువు.భొగులకు, ఐహిక జీవులకు ఒక కామధేనువు. జీవులకే గాక నిర్జీవులకు కూడా ఒక ఆశ్రయప్రదేశము. ఇలా ఇంతమందికి మార్గదర్శకమయినది కాశీ.   పూర్వము కాశీయాత్ర కష్టతరముగావుండేది.ఆధునిక సౌకర్యాలు ప్రయాణాన్ని సులభతరము చేసినా చాలామంది నేటికి కష్టతరముగా భావించుతారు.కాని 108 సార్లు కాశీయాత్ర అనేది లక్ష్యముగా ఎంచుకున్న ఈవ్యక్తి పేరు సమయమంతుల సత్యనారాయణ ,విజయవాడ, వ్రుత్తి ఒకచిన్నపాటి వ్యాపారము. వ్యాపకము లక్ష్యముగురించిచెప్పవలసినపనిలేదు మీకు ఈపాటికే ఆర్థమయివుంటుంది.ఇలా వీరు నేటికి 71 సార్లు యాత్ర ముగించారు.ఈయన ప్రతినెల కాశీయాత్ర చెస్తారు.కాశిలొ గంగాస్నానము, విశ్వెశ్వరదర్శనము 2 లేక 3 రొజుల నివాసము. ఇది కార్యక్రమము.ఇంతా చేసి వీరు స్థితిమంతుడు అనుకునేరు  ఓకనిరుపేద.పనిచేస్తేనే జరుగుబాటు.తనసంపాదనలొ కొంతభాగాన్ని ఖచ్చితముగా కేటాయిస్తారు.    
వీరిని యాత్రతాలుకు పూర్వాపరాలు అడిగితే వీరి తండ్రీగారు 8సార్లు కాశీయాత్ర చేశారంట.ఒకేప్రదేశానికి అన్ని సార్లు ఎందుకు అని తల్లిని ప్రశ్నించిగా ఆమె నాయినా కాశీయాత్ర అనేది జన్మసాఫల్యము చెందాటానికి ఒకమార్గము .కాశీ స్మరణము,దర్శనము,నివాసము అన్ని పుణ్యప్రదయమయినవే. వ్యక్తుల వారి వారి ఆవకాశాన్నిబట్టి 9సార్లు,5సార్లు,3సార్లు కనీసము ఒకాసారన్న తమజీవితకాలములొ యాత్రచేస్తారు.9నవమాసాలని,5పంచాక్షరిని,3ప్రణవాన్ని ప్రతిబింబిస్తాయిని, జీవనసాఫల్యానికి ఒక్కసారన్న అని చెప్పారు.ప్రాప్తములేనివారు అదిలేదు.వీరు జీవితములొ కుదురుకున్న తరువాత మాతృ ఉద్భొదతొ 108సార్ల యాత్రాదీక్ష చేపట్టినారు.ఇలా ఈప్రయాణములొ ఎన్నొ మధురభావనలు,మరుపురాని తీపిగురుతులు.వీరికీ కాశీ ఆంటే ఒక అద్భుత దివ్యధామము,అధ్యాత్మిక విజ్ఙానముకు,అనుభవాలకు అక్షయపాత్రవంటిది ఎన్నికన్నా,విన్నా,తెలుసుకున్నా ఇంకా యెదొమిగిలివుంటుంది. వారు వారితొపాటు వీలు అయినంతమందిని దర్శనము చేయించటము లక్ష్యము,సంకల్పము. 
    వీరు కాశీయాత్ర పెట్టుకున్న చిన్న చిన్న గ్రూపులకు,వృద్ధులకు సహాయకులగా వ్యవహరిస్తారు.కాశీ గురించి ఎమి వివరములు కావాలన్న 9494054549 ని సంప్రదించగలరు.



16, ఏప్రిల్ 2012, సోమవారం

అఙ్ఞాతవాసము - ఒక పరిశీలన.


నేరము చేస్తె శిక్షపడుతుంది అనేది సహజసూత్రము.కాని శిక్షకు ఆంతరసూత్రము పరివర్తన.నేరం చేసిన వ్యక్తియొక్క పరివర్తనే శిక్ష యొక్క ముఖ్యొద్దేశ్యము.ఈవిషయన్ని నిశ్చయపరచేది పాండవుల అఙ్ఞాతవాసము.

మనిషి త్వరగా కొల్పొని లక్షణము 'నెనూ అనే స్ప్రహా లేక ఎరుక.దీనిని (ఐడంటికల్ క్రైసిస్) వ్యక్తిగుర్తింపుగా భావించుదాము.వ్యక్తి తను నివాసపరిధిలొ,వ్రుత్తులలొ  చిన్న తప్పులు లేక పొరపాట్లకు జరుగు చర్యలకు ఇబ్బందిగా ఫీల్ అయి ప్రతిచర్యగా చాలమంది తద్వారా మరలా ఆతప్పుజరుగకుండా శ్రద్ధ వహిస్తారు. 
                    
పాండవులు అరివీరులు,శత్రుభయంకరులు,సొదరసఖ్యత కలవారు ఆందుకు సందేహములేదు.పాండవప్రధముడు ధర్మరాజు పొగడ్తలు,జూదము అన్నది వ్యసనము.రాజసూయయాగముచే  పాండవులకు లభించిన ఆపరిమిత సంపద వైభవాన్ని చూసికలత చెందిన దుర్యొధనుని  శాంతపరచాటానికి శకుని తనకున్న ఆలొచన చెపుతాడు. దుర్యొధనా! ధర్మరాజు జూదరి,జూదమునకు ఆహ్వానము పంపు వ్యసనపరుడుకాబట్టి  ఆహ్వానము మన్నించుతాడు ఆపై నాపాచికలద్వారా అతడిని వొడించుదాము అని సలహా ఇస్తాడు. గాంధారరాకుమారుడైన శకుని గురించి అందరకు తెలిసినదే.శకుని లక్ష్యము కౌరవనాశనము.అందుకు ఆతని ఆయిధాలు మాయొపాయములు,తప్పుడుసలహాలు,తనపిత్రువర్గ అస్థికలతొ చేసిన పాచికలు.   
దూర్యొధన ఆహ్వానముపై ధర్మరాజు జూదక్రీడకు రావటము వొడిపొవటము 2సార్లు జరుగుతాయి.కాని ధర్మరాజులొని జూదక్రీడావ్యామొహాన్ని శకుని ఇంకా రెచ్చకొట్టి మరలా ఆడమంటాడు తద్వారా ధర్మరాజు తనను,సొదరులను,భార్యను కూడా వొడతాడు.దీనివలన ద్రౌపదిమానభంగము జరిగినా బుద్ధిరాక మరలా ఆడి వొడి 12సం. ఆరణ్యవాసము, 1సం. అఙ్ఞతవాసము లకు గురీఅవుతాడు.
ధర్మరాజులాంటి అభిమానధనునికి అరణ్యవాసము పెద్ద ఇబ్బంది కలిగించకపొయినా అఙ్ఞాతవాసము పెద్దశిక్షగా మారుతుంది. తను విరాటరాజ కొలువులొ తన క్షత్రియధర్మాని మరచి కంకుభట్టుగా రాజభ్రుత్యుడుగా వ్యవహారము.తనసొదరులు రకరకాల పేర్లు వ్రుత్తులతొ కొలువు. భార్య సైరంధ్రిగా తన కళ్ళముందు తిరుగుతు, కీచకుడితొకూడా  ఆవమానానికి గురికావటము.ఇవన్ని చూసిన ధర్మరాజుకు, తనకు,సొదరలకు,భార్యకు ఈపరిస్తితి తనజూద క్రీడవల్లనే అనే చింతనకలిగి పరివర్తనచెందుతాడు. బహుశా అందుకే సభాపర్వములొ జూదక్రిడ, విరాటపర్వము నుంచి స్వర్గారొహణపర్వము వరకు మరలా జూదక్రిడ ప్రస్తావనరాదు.ధర్మరాజు అఙ్ఞాతవాస శిక్షవలన సంస్కరించబడ్డాడని భావించవొచ్చు.             

                  

పూలజడలు


ఆడపిల్లలకు ఆలంకరణే అందము. ఈఆలంకరణలో మొదటిస్థానము పూలజడది అంటే అతిశయొక్తికాదు.నట్టింట్లొ పట్టుపరికిణి,పూలజడ,పిల్లకుప్పెలు,కాలికి పట్టిలతొ ఘల్లుఘల్లున తిరుగుతా వుంటే తండ్రులుపడే ముచ్చట విరీద్దరిని చూసి ఇల్లాలు పడే ఆనందం చూడాలిసిందేకాని చెప్పతరముకాదు.

మాచిన్నప్పుడు వేసవికాలము వచ్చిందంటే చాలు అదోక ఉద్యమములావుండేది.అందులొను మాఅమ్మగారు ఈ విషయములో మరి ప్రఖ్యాతిగాంచారు.ఇక చూడండి వైశాఖమాసము మొత్తము మాఇంటిచుట్టు ఆడపిల్లలప్రవాహము.అత్తామాకు,పెద్దమ్మమాకు,పిన్నిమాకు అంటు.వొదినా మాఅమ్మాయి సంగతి చూడువొదినా అని వాళ్ళతల్లులు ఇదివరస.మాఅమ్మగారికి ఇటువంటి పనులంటే మహసరదా,దానికి తొడు నాకు ఇద్దరు అక్కలు దానాదీన షుమారు మొత్తము 30 నుంచి 40 దాకా లెక్కకువొచ్చెవారు.మరి ఆందరకు ఒక్కసారి ఆంటేకుదరదుకాబట్టి షేడ్యుల్ నిర్ణయించేవారు.అంతేమాకు చావొచ్చిపడేది.ఆడపిల్లలు జడవేసుకుంటె మీకు ఎమీఇబ్బంది అంటారా ?రోజు పూలకొసం ఎండలొ 4కిమి దూరంలొవున్న పొన్నపల్లి పూలతొటలవద్దకు వెళ్ళి మల్లెలు,కనకాంబరాలు,దవనము,మరువము,సంపంగిమొగ్గలు ఇంకా కావలసినవి ఆన్ని తేప్పించేవారు.దీనితొపాటు మేదరవాళ్ళవద్ద సన్నగాచెక్కిన వెదురుపుల్లలు కూడా ఆవసరం పడేది.
    ఎప్పుడన్నా మేదరవాళ్ళు లభ్యతకాకపొతే పూచికపుల్లలు,కొత్తకొబ్బరి ఆకు చీల్చిదానిలొనిపుల్లతిసి వుపయొగించేవారు.ఇలా సమస్తసంభారాలు ప్రతిరొజు మధ్యానము 1గం. కల్లాతయారు.ఆరొజు వరుసలొవున్న అమ్మాయిలు వాళ్ళతల్లులు ఇరుగుపొరుగువారు కూడా హాజరు.అందరుకలసి మల్లిపూలనుంచి మొగ్గలుతీయటము,తొడిమలువొలవటము నాణ్యముగావున్నమొగ్గలతొ మాలలాగా,చెండ్లులాగ,చక్రాల్లాగా దవనము,మరువలతొ కలిపి కట్టటము,గుచ్చటము లాంటిపనులు సాగిపొయెవి.కొందరు వెదురుపుల్లలకు పూలుగుచ్చెవారు.ఈలొపు అమ్మయిలకు తలలుచక్కగాదువ్వి కదలకుండాకూర్చొండి అంటూవాళ్ళకు జడగంటలు,పిల్లకుప్పేలు,సవరాలు ఇత్యాదిసామాగ్రితొ జడవేసేవారు.ఇలా ఆరొజు అమ్మాయిలకు ముగేసరికి సాయంత్రం 5గం. రొజు హడావుడి, ఈ వేడుక చూసి చేసి మురిసిపొవాలి. ఆ అమ్మాయిలందరు ఇళ్ళకు వెళ్ళి పట్టుపరికిణిలు ఆలంకరణలతొ చూపటానికి మరలా ప్రత్యక్షం.చాలామందికి ఈఆలంకరణలొ ఫొటొ తియించుకొవటము ఒక ఫ్యాషన్.తండ్రులు తమ ఇంటిమహలక్ష్ములను చూసి వుబ్బితబ్బిబ్బూ అయి కొరిన కానుకలు ఇచ్చెవారు. రాత్రికి ఆ అమ్మాయిలందరికి దిష్టి తీసేవారు.వీళ్ళందరు రాత్రి నిద్ర చాలా జాగ్రత్తగా పడుకునేవారు.

ఎమిటొ కాలంతొపాటు అన్నిమారినట్టున్నాయి,ఈరొజుల్లొవాళ్ళకు రెడిమేడ్ బొటిక్ వొచ్చినాయి.
అదియునుగాక పాత రొజులంత కనబడుటలేదు.                    


   
       
     

15, ఏప్రిల్ 2012, ఆదివారం

నీళ్ళొసుకున్నారా?!...

నీళ్ళొసుకున్నారా?!... ఈమాట వినగానే కొత్తగా పెళ్ళి ఆయిన అమ్మాయిలు సిగ్గుపడటం నాకు ఇంకాగుర్తే. పాత రొజుల్లొ సాయంత్రం ఆడవాళ్ళు వారివారి ఇంటిపనులు ఆయినతరువాత్ లొకాభిరామయణమునకు ఒకచొట చేరినప్పుడు వారి వారి కూతురు,కొడలు,మరదలు ఇలా వరసైన వారిగురించి ఈమాట ఆడిగెవారు. ఆంతే ఈపదం ఆడగగానే కొందరి మొఖాలు సంతొషంతొ వెలిగిపొయవి,ఇంకొందరు సిగ్గుపడేవారు మరికొందరు నిరాశతొ వూహూ ఆని ఒకభారమయిన శ్వాస ఆఖరివర్గం వారు పుల్లవిరిపు మాటలు ఇలా ఇన్ని భావాలు ఈపదముచుట్టు వున్నాయి.
నాచిన్నప్పుడు ఒకనొకనాడు మాఅమ్మగారు తనస్నెహితులతొ లొకాభిరామయణానికి వెళ్ళారు,మాచదువులు ఆవి ముగిసి రాత్రి భొజన సమయానికి అమ్మాఅకలి అని ఆమేను పిలవటానికి వెళ్ళాను ఇదిగొ ఆసమయములొ ఒకామెను ఈమాట అడగటము ఆమేదొసమాధానము చెప్పటము జరిగిపొయాయి కాని ఆనాటి నాచిన్నబుర్రకు ఎమిటిరొజు స్నానము చెస్తాముగా ఇలాఅడిగారూని ఒక ధర్మసందేహం పుట్టుకొచ్చి "అమ్మా! ఎమెటి నీళ్ళొసుకున్నరా అని అడుగుతున్నవు ఎమన్నా మంచిరొజు చూసి ఆపనిచేయాల అని నాఫ్రశ్న ?" అంతె తేడాలు వొచ్చాయి మాఅమ్మగారు పదరా అని ఇంటికితీసుకువొచ్చారు.నా అనుమానానికి సమాధానము లభించల దేహశుద్దిజరగలా ..  కాని కాలమే నాకు సమాధానము చెప్పింది.      
ఇంత ఘన చరిత్రవున్న ఈమాటకుకూడా ఇంగ్లిష్ చదువుల ప్రవాహం మారుతున్న సమాజపొకడలకు గురీఅయినది. ఇప్పుడు అమ్మాయిలకు ఈమాట మోటు,నాటు వాళ్ళకు 'కన్సివ్' అనేమాట తత్సమానమయిన ఇంగ్లిష్ పదము పలుకుతున్నరు. ఎమిటొ కాల మహిమ.    

శ్రీరామ రామ రామ రామేతి........


శ్రీవేదవ్యాసప్రణీతమైన శ్రీమహభారత అనుశాసనిక పర్వములొ కురుక్షేత్రములొని ఆంపశయ్యపైవున్న భీష్ముని ధర్మరాజు "కిమేకం దైవతంలొకే....అంటూ మనము ఎదైవాన్ని ఆశ్రయిస్తే  ఈజన్మ తరించగలదు అనే ప్రశ్నద్వార అడిగితే, దీనికి సమాధానముగ అంపశయ్యపైనవున్న భీష్ముడు ఆభగవానునిసమక్షములొ ఆయనగుణగణాలని,నామవైభవాన్ని కీర్తిస్తూ విష్ణుసహస్రనామన్ని  ధర్మరాజుకు భోధజరిగినదని మనందరము విష్ణుసహస్రనామన్నిఎంతొభక్తితొ పఠించుతాము.  
ఈవిష్ణుసహస్రనామములో కొన్ని పదాలు సామాన్యులకు పలుకుటకొద్దిగా కష్టము అదియునుగాక ఈసహస్రనామ పూర్వపిఠిక,ఉత్తరపిఠికతొ కలిపి షుమారుగా 160 శ్లొకాలు వుంటాయి.మనము ఈ పూర్తి పారాయణకు కొంత సమయము కేటాయించాలి.మరి సమయములేని,భాషరాని,నొరుతిరగని వారు తరింపచేసేదిఎలా? దీనికిసమాధానముగా విష్ణుసహస్ర నామ ఉత్తరపిఠికలొ ఫలశ్రుతిభాగములో  సహస్రనామము ఎవరకు ఎవిధముగా ఉపయోగపడుతుంది అనిచెపుతూ ఆర్జునుడు,భగవానుడు ఒక్కొక్క విధముగా తమ వ్యాఖ్య  చేరుస్తారు.ఆసమయములొ లొకమాత పార్వతి ఇంతపలుకలేని తనసామాన్య భక్తులకొసము "కేనోపాయేనలఘునా .....ప్రభొ "అని తన పతి పరమేశ్వరుని అడుగుతుంది. ఎంతయినా అమ్మకదండి మరితన బిడ్దలే తనకు ఎక్కువ  వాళ్ళకు ఎమితక్కువతుందోని ఆమేఆదుర్దా.మరి అమ్మ అడిగితే అయ్య వూరుకుంటాడా "శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే , సహస్రనామ తత్తుల్యము రామనామ వరాననే, శ్రీరామనమ వరానన ఓం నమ ఇతి" అని పలుకుతాడు.          
శ్రీరామ రామ రామ ఆంటు మనమనస్సుని శ్రీరామనామములొ సంగమింపచేసి శ్రీరామ రామ రామ అనిపలికితే చాలు మనకు పరమేశ్వరుడు సహస్రనామఫలితాన్ని ప్రసాదించాడు.చూశారా ధర్మరాజు ప్రశ్నద్వార మనకు భీష్ముని ద్వార సహస్రనామధార,శివునిద్వార ఈజన్మ తరింపచేయటానికి అవసరమయిన తారకమంత్ర బొధజరిగినది.ఈ విషయాన్ని పరమెశ్వరుడు పలుసార్లు  ఉదహారణలద్వారకూడా నిరుపించాడు. ఆయన కైలాసములొ సదా తారకమంత్రమయిన రామనామాన్ని ధ్యానిస్తువుంటాడని తెలుసుగదా. ఆలాగే ఆంజనేయుడు ఆయనస్వరూపమేనని మీకు ఇంకాబాగతెలుసు.మరి రాముడుకి ఆంజనేయుడుకి రామనామానికి వున్న సంబంధము జగద్విఖ్యాతం.ఆంజనేయుడయితే రామునికన్న రామనామము గొప్పదని పలుకుతాడు.కాబట్టి శ్రీరామనామాన్ని పఠించితరించండి.     
 సర్వము ఆశ్రీరామచంద్రుని కటాక్షము. 

కత్తి గొప్పా పిల్లగొప్ప





చూశారుగా పై ఫొటొ ఎలావున్నదో... మన నాయకామణులు ఆందరు ఆహ వొహొ అని రకరకాలైన ఆహార్యలవెంటపడతారుకాని కాని మన సాంప్రదాయ వేషధారణలొ ఆంతకన్నా చక్కగా కుర్రకారుకొరుకున్నరీతిలొ వుండవచ్చని తెలుస్తుందికదా. ఇంతకు మీరు ఒక ఆంచనాకు వొచ్చారా కత్తి గొప్పా పిల్లగొప్పా అని ....... ఎమిటి కత్తి ఎక్కడవున్నదని అంటున్నరా ఆదండి పిల్లగొప్పా.....      

13, ఏప్రిల్ 2012, శుక్రవారం

గజేంద్రమోక్షము - మానవజీవితమునకు సంబంధము.

 



 


       

బమ్మెరపొతనామాత్యుని మహభాగవత పద్యకావ్యము తెలుగువారికి ఒకమరుపురాని కానుక.ఆందులొ ప్రతిపద్యము ఒక ఆణిముత్యము మరిముఖ్యంగా "గజేంద్రమోక్షం" ఘట్టములొని ప్రతిపద్యము చదివి పదసౌందర్యం,అర్థసౌందర్యం స్వయంగా అనుభవించాలిసిందేకాని ఎంతరాసిన,ఎంతచెప్పినా తీరదు."గజేంద్రమోక్షం"ను కష్టాల్లొ వున్నవారినిపారాయణ చేయమని చెపుతారు.చాలమంది పారాయణ ఆనగానే ఒక కథలా ఆలా కానిస్తారు కాని దాని ఆంత రార్థాన్ని ఆకళింపు చేసుకొనరు.

  "గజేంద్రమోక్షం"ఘట్టము తాలుకు స్థూలంగా కథ ఇది గజేంద్రుడు తన రాణులతొ,పరివారము తొ వనములొ వుంటాడు.ఆలావనసంచారములొ ఒకనాడు ఒకనీటిమడుగుకు వెళతాడు ఆందులొని మకరము గజేంద్రుని పట్టిబంధిస్తుంది.సాధారణంగా ఎనుగు బలమైనదె సింహము కూడా సందేహించేంత కాని మొసలికి ఆకరిరాజుని కూడా బంధించేంత స్థానబలము,పట్టు ఇకనే "కరి,మకరి కి చిక్కి".... పొరాటము ఇలా 1000సం పొరాటము ఈపొరులొ గజేంద్రుని పరివారము,రాణులు,సొదరసమూహాలు,సంతానము ఆన్ని......చివరకు తన ఆరాట పొరాటము మకరముతొకాదని మనస్సుచెపుతుంది.ఆంతే త్రికరణ శుద్ధిగా "లావొక్కింతయు" ఆంటాడు  ఆంతే ఆ శ్రీహరికూడా "సిరింకిచెప్పడు" ఆన్నరీతిలొ ప్రత్యక్షమై  మకరిని సంహరించి గజేంద్రుని సంరక్షిస్తాడు.            

భాగవతగాధలన్ని మానవజీవితాన్ని పట్టిచూపుతుంటాయి.మానవుడు సకలసంపదలతొ వున్నాను ఆనుకొంటాడు కాని వీటితొ భొగలాలసకు ఆనేక మదాలకు బానిస అవుతాడు.ధనమదం,అధికారమదము,స్థానమదం,బలమదము,వర్గమదము,వచొమదము ఇలా గురి అవుతారు.ఆంతే గజేంద్రునిలా నాకు యేమి అనే ఆంతులేనిస్వేచ్చాప్రవ్రుతి.దీనితొ పాపకర్మల ప్రభావంతొ పాపం గూడుకట్టుకొంటుంది.పాటక జనం ఆంతువుంటారుచూడండి పాపంపండాలి ఆంతే కాలమనే మడుగులొ ప్రవేశం. అవకాశంకొసంచూస్తున్న కాలపురుష స్వరూప మకరము ఠప్పున దాడిచేసి వాడినీఅలా పట్టివుంచుతుంది.ఆంతే మనము ఈనాటిదాక ఎమిగొప్పనిభావించామో ఆవీఅన్ని ఒక్కొక్కటి దూరంకావటం,దిక్కుతొచక గతజలసేతుబంధనములా ఆనాడు విచారిస్తే ఆయ్యో అంతపాపం చేసినామా అనేచింత పడి ఆదేవదేవుని త్రికరణశుద్ధిగా చేతులెత్తి "నీవేతప్ప ఇహపరంబు " ఎరుగా ఆనాలి.అప్పటిదాక అయ్యవారుకూడా వినొదము చూస్తుంటారు.ఈవిషయన్ని పొతనగారు మనకు అన్యాపదేశంగా తెలిపినారు.ప్రక్రుతి పురుషుడైన నారాయణుడు  ఆదిలక్ష్మితొ చదరంగము ఆడుతుంటాడని.ఆంటేమనతాలుకు పాపపుణ్యాలపై ఆయిన లీలామానుష వినొదము చూస్తున్నాడని.ఆప్పుడు మనము వివేచనతొ నాయినా నీవేతప్ప నాకు ఇంకేవ్వరు దిక్కు అనిమనము స్వామివారిని మనహ్ పూర్వక రోదనతొ (ఈవిషయము  రామక్రిష్ణపరమహంస పలుమార్లు చెప్పారు 'సామాన్యరాజదర్శనానికే మీరుఇంత వ్యాకులపడుతున్నారు మరి సకల జగత్ కు ఆధినెత ఆయిన భగవంతుని దర్శనానికి వ్యాకులపడాలి,రొదించాలి ప్రాణము త్రుణప్రాయం గాభావించాలి )   ధ్రఢచిత్తముతొ తలిస్తే తత్క్షణము ఆయిన ఆన్ని ఆచారాలు,ఆయిధాలు,రాజలాంఛనాలు చివరకు ఆమహలక్ష్మినికూడాకాదని నాకు నాభక్తుడేముఖ్యము ఆన్యులుకాదని వొస్తాడు. ఈవిషయాన్ని మనము 'సిరికించెప్పడూ పద్యంలొ గ్రహించవచ్చు .ఆప్పుడు ఆమహలక్ష్మి కూడా ఆశ్చర్యపొతుంది  ఎమిటి స్వామివారు ఇప్పటిదాక నాతొ కేళివిలాసాలతొ వున్నారు ఇంతలొ ఎమయినదని ఆమెకూడా స్త్రికి మాన సమ్రక్షణయిన చీరకూడా సరిగావున్నదాలెదాని చూడకుండా పతివెంట, విరుఇద్దరు కదలికతొ శంఖ,చక్ర,గధా,నందక,గరుడ ఇలా సకల పరివారము వైకుంఠము మొత్తము భక్తునివద్దకు భూమికి కదలివొస్తాయి. చూశార భగవత్కరుణ,భక్తమహిమ.

గజేంద్రునికి ఆన్నివున్నాయి  కాని కాల మహిమలొ ఆన్నిదూరం ఆయినాయి,కాని భగవత్కరుణతొ దైవదర్శనము, వైకుంఠమునే భువికిరప్పించినవాడు గజేంద్రుడు. చూసారా, నారాయణునిలీలామానుషం.

ఇదండి ఆస్వామివారికరుణతొ నాకు ఆర్థమయినది మీకుతెలిపినాను.

సర్వము ఆశ్రీరామచంద్రమూర్తిదయ.  

                                 
         
                        
         
                           
         

12, ఏప్రిల్ 2012, గురువారం

 ఒకే వ్యక్తికి రెండురకాల ప్రచారం ..........


 





2 రొజుల క్రితం నిమ్మగడ్డప్రసాద్ మార్గదర్శకత్వములొని మాటివి 30% సొని వారికి అమ్మి నిమ్మగడ్డప్రసాద్ లాభం సంపాదించారని వారి పెట్టుబడులు ఎప్పుడు తెలివిగావుంటాయని ఎల్లొ(జగన్ భాషలొ)మీడీయా ప్రచురించారు. ఇందులొ అభ్యంతరము ఎమిలేదు  కాని ఇదె నిమ్మగడ్డ సాక్షి లొ పెట్టుబడులు పెడితె నిజాంపట్నం పొర్ట్ కు ఆంటకట్టి ఆవినీతి అన్నారు. ఇది విళ్ళ భాగవతము. సాధరణముగా వ్యాపారి లాభం చూసుకొనె పెట్టుబడులుపెడతారు ఆన్నది బహిరంగరహస్యమే.  
ఆంటే సాక్షి లొ తప్ప ప్రసాద్ గారు ఎక్కడ పెట్టుబడులు పెట్టినా మంచి, సాక్షిలొ మాత్రం ఆవినీతి.