16, ఏప్రిల్ 2012, సోమవారం

పూలజడలు


ఆడపిల్లలకు ఆలంకరణే అందము. ఈఆలంకరణలో మొదటిస్థానము పూలజడది అంటే అతిశయొక్తికాదు.నట్టింట్లొ పట్టుపరికిణి,పూలజడ,పిల్లకుప్పెలు,కాలికి పట్టిలతొ ఘల్లుఘల్లున తిరుగుతా వుంటే తండ్రులుపడే ముచ్చట విరీద్దరిని చూసి ఇల్లాలు పడే ఆనందం చూడాలిసిందేకాని చెప్పతరముకాదు.

మాచిన్నప్పుడు వేసవికాలము వచ్చిందంటే చాలు అదోక ఉద్యమములావుండేది.అందులొను మాఅమ్మగారు ఈ విషయములో మరి ప్రఖ్యాతిగాంచారు.ఇక చూడండి వైశాఖమాసము మొత్తము మాఇంటిచుట్టు ఆడపిల్లలప్రవాహము.అత్తామాకు,పెద్దమ్మమాకు,పిన్నిమాకు అంటు.వొదినా మాఅమ్మాయి సంగతి చూడువొదినా అని వాళ్ళతల్లులు ఇదివరస.మాఅమ్మగారికి ఇటువంటి పనులంటే మహసరదా,దానికి తొడు నాకు ఇద్దరు అక్కలు దానాదీన షుమారు మొత్తము 30 నుంచి 40 దాకా లెక్కకువొచ్చెవారు.మరి ఆందరకు ఒక్కసారి ఆంటేకుదరదుకాబట్టి షేడ్యుల్ నిర్ణయించేవారు.అంతేమాకు చావొచ్చిపడేది.ఆడపిల్లలు జడవేసుకుంటె మీకు ఎమీఇబ్బంది అంటారా ?రోజు పూలకొసం ఎండలొ 4కిమి దూరంలొవున్న పొన్నపల్లి పూలతొటలవద్దకు వెళ్ళి మల్లెలు,కనకాంబరాలు,దవనము,మరువము,సంపంగిమొగ్గలు ఇంకా కావలసినవి ఆన్ని తేప్పించేవారు.దీనితొపాటు మేదరవాళ్ళవద్ద సన్నగాచెక్కిన వెదురుపుల్లలు కూడా ఆవసరం పడేది.
    ఎప్పుడన్నా మేదరవాళ్ళు లభ్యతకాకపొతే పూచికపుల్లలు,కొత్తకొబ్బరి ఆకు చీల్చిదానిలొనిపుల్లతిసి వుపయొగించేవారు.ఇలా సమస్తసంభారాలు ప్రతిరొజు మధ్యానము 1గం. కల్లాతయారు.ఆరొజు వరుసలొవున్న అమ్మాయిలు వాళ్ళతల్లులు ఇరుగుపొరుగువారు కూడా హాజరు.అందరుకలసి మల్లిపూలనుంచి మొగ్గలుతీయటము,తొడిమలువొలవటము నాణ్యముగావున్నమొగ్గలతొ మాలలాగా,చెండ్లులాగ,చక్రాల్లాగా దవనము,మరువలతొ కలిపి కట్టటము,గుచ్చటము లాంటిపనులు సాగిపొయెవి.కొందరు వెదురుపుల్లలకు పూలుగుచ్చెవారు.ఈలొపు అమ్మయిలకు తలలుచక్కగాదువ్వి కదలకుండాకూర్చొండి అంటూవాళ్ళకు జడగంటలు,పిల్లకుప్పేలు,సవరాలు ఇత్యాదిసామాగ్రితొ జడవేసేవారు.ఇలా ఆరొజు అమ్మాయిలకు ముగేసరికి సాయంత్రం 5గం. రొజు హడావుడి, ఈ వేడుక చూసి చేసి మురిసిపొవాలి. ఆ అమ్మాయిలందరు ఇళ్ళకు వెళ్ళి పట్టుపరికిణిలు ఆలంకరణలతొ చూపటానికి మరలా ప్రత్యక్షం.చాలామందికి ఈఆలంకరణలొ ఫొటొ తియించుకొవటము ఒక ఫ్యాషన్.తండ్రులు తమ ఇంటిమహలక్ష్ములను చూసి వుబ్బితబ్బిబ్బూ అయి కొరిన కానుకలు ఇచ్చెవారు. రాత్రికి ఆ అమ్మాయిలందరికి దిష్టి తీసేవారు.వీళ్ళందరు రాత్రి నిద్ర చాలా జాగ్రత్తగా పడుకునేవారు.

ఎమిటొ కాలంతొపాటు అన్నిమారినట్టున్నాయి,ఈరొజుల్లొవాళ్ళకు రెడిమేడ్ బొటిక్ వొచ్చినాయి.
అదియునుగాక పాత రొజులంత కనబడుటలేదు.                    


   
       
     

9 కామెంట్‌లు:

  1. బాగా చెప్పారండీ! చిన్నప్పుడు మా ఇంట్లో మల్లె పూలు పూయటం ఆలస్యం వాటితో మధ్యలో మరువం వేయించుకుని మరీ కుట్టించుకునేదానిని అమ్మతో పూల జడ. చదువులకని హాస్టళ్ళకి వచ్చే ముందు వరుకూ కూడా ఇంచుముంచు ఈ కాలం రోజు విడిచి రోజు పూల జడ కుట్టవలసినదే! ఎంత బాగుండేవో ఆ రోజులన్నీ!!!

    రిప్లయితొలగించండి
  2. పూలజడలు వేసుకునే అంత పెద్ద జడలు ఇప్పుడెంతమందికి ఉంటున్నాయండి? ఎంత కష్టపడి సంరక్షించుకుందామన్నా ఈ కాలుష్యానికి జుత్తు రాలిపోతూనే ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ సంబరం ఉహిస్తేనే ఉత్సాహం గా వుంది .

      ఈ కాలం లో అంత జడలు కావాలన్నా ఎవరికీ పెరగటమే లేదు :) బాగుంది పోస్ట్ .

      తొలగించండి
    2. జాహ్నవిగారికి,మాలాకుమార్ గారికి ధన్యవాదాలు.

      తొలగించండి
  3. poola jadalu poyi baabd hair vachhe damm damm. thanku for posting nice article.

    రిప్లయితొలగించండి
  4. రసఙ్ఞగారు, ధన్యవాదాలు.

    ఆదిగారు, ఏప్పుడు కొత్తక వింత పాత ఒక రొత అనుకుంటారు కాని అవసరము వొచ్చినప్పుడు ఈపాత దానికొరకే పరుగు.

    రిప్లయితొలగించండి
  5. baaga chepparandi............!! endhe baaga cheppindhi rasajna

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.