ఒక అందాల అద్బుతం, ఒక వసంత సమీరం, మెరిసే మెరుపు, అనంత ఆత్మీయత, ఒక అల్లరి, ఒక పెంకి, కొద్దిగా కోపం, ఇంకొద్దిగా అలక, అందరికన్నా చిన్నది, అన్నిటా తానే, ఒక అనంత శక్తీ రూపం, అమ్మకు బొమ్మ, అన్నయ్యకు ముద్దుల చెల్లి ,నాన్నకు "అమ్మ"........అమ్మ అంటే నిజంగా అమ్మ
2, ఆగస్టు 2012, గురువారం
22, జులై 2012, ఆదివారం
భారతదేశం లౌకికరాజ్యం అన్నమాట నిజమేనా?
ఈ శీర్షిక ఇలా పెట్టినందుకు చాల మందికి అభ్యంతరముగాను మరికొద్ది మందికి ఇబ్బందిగాను తోస్తుంది. కాని నేటి వార్తాపత్రికలలో ఈ క్రింది వార్త చదివిన తరువాత నాకు సందేహం వచ్చింది. అది కూడా తెలుపుతాను.
ముస్లిం ఉద్యోగులు ముందే వెళ్లొచ్చు..
రంజాన్ ప్రార్థనలకు అనుమతిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్, జూలై 21: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం సాయంత్రం 4 గంటలకే ఆఫీసుల నుంచి వెళ్లేందుకు ఉత్తర్వులిచ్చిందని ఏపీ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ షౌకత్ ఆలీ, మహమ్మద్ అబ్దుల్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పై వార్త నా సందేహం నకు కారణమైనది,
ముందుగా ముస్లిం సోదరులకు రమజాన్ మాస శుభాకాంక్షలు.వారికి పవిత్ర మాస౦ ప్రారంభం అయినది. వారి మత ఆచారం ప్రకారం ఈ మాస౦ లో దాదాపు ఆవకాశం వున్న ముస్లిం మత అవలంబీకులు ఉపవాస దీక్ష నిర్వహిస్తారని సర్వులకు తెలుసు. అది పవిత్రమైనది సంతోషకరమైనది.కారణ౦ వారి ధార్మిక ప్రవర్తనకు మనకు ఆనందమే.కాని వారికి మాత్రమే ఇటు వంటి ప్రత్యేక ప్రతిపత్తి ఈ మాసంలో కల్పిస్తున్నారు మంచిదే.
మరి హిందువులకు కార్తిక మాసం అంతే పవిత్రం అన్న సంగతికూడా లోక విదితమే. ఈ మాసంలో హిందువులకు ఉపవాస దీక్షలు,అభిషేకాలు,వ్రతాలు ఇలా ఎన్నో ఆచారవ్యవహారాలు ఉన్నాయి అన్నస౦గతి కూడా విదితమే. మరి ప్రభుత్వం ఆనాడు హిందువులకు అటువంటి ప్రత్యేక అవకాశం కల్పించ గలదా?
మరి ఇటువంటిదే క్రైస్తవులకు క్రిస్టమస్ మాసం ఉన్నప్పటికీ వారికి శుక్రవారం,ఆదివారం ప్రార్ధనలు మాత్రమే ఉన్నట్లు నాకు ఆవగాహన.మరి వారికి కూడా ఇవ్వగలరా?
అటువంటివి అందరికి కల్పించటం సాధ్యం కానప్పుడు వీరి ఒక్కరికే ఎలా ఇవ్వగలుగుతున్నారు?ఇదే బంతిలో వలపక్షం అన్న భావనలు తప్పు.
లౌకికరాజ్య భావనకు ఇది విరుద్ధం కాదా?
మెజారిటి వోట్లు సంపాదించిన వారు అధికారంలోకి వస్తారు. మరి ఈ సూత్రం మాత్రం అన్నిటా మాత్రం వర్తించదు.
వివక్ష వు౦డకుడదు.దీనికి కారణం మాత్రం వ్యక్తుల కుహనా లౌకిక వాదం, కొంతమంది స్వార్ధ బుద్ధి.
ఎవరైనా వారి వారి మతం తరుపున మాట్లాడటం తప్పా వారికి మతవాదులు అన్న ముద్ర ఎలా?
ఇలా ఎన్నో ప్రశ్నలు?
చెప్పండి భారతదేశం లౌకిక రాజ్యం అన్నది ఎంత వరకు సబబు.
21, జులై 2012, శనివారం
దశరధ కృత శని స్తోత్రమ్ - అసలు ప్రతి
పై స్తోత్రం దశరధ కృత శని స్తోత్రమ్ ఈ స్తోత్రమ్ చాల వెర్షన్స్ లో కనబడుతుంది. నేను షుమారు 10 రకాల వెర్షన్స్ చూసి వుంటాను. కాని శని తత్వానికి దగ్గరగా ప్రాచిన సాంప్రదాయంగా ఒక వరుసలో వుండేది ఇది మాత్రమే.
ఇది దేవనాగారలిపి లో వున్నది. తెలుగులోకి మార్చు కొని చదువుకోవాలి.
మిత్రుల స్పందన బట్టి ఆ కార్యక్రమం చేయాలి.
20, జులై 2012, శుక్రవారం
గోవర్ధనగిరి - కృష్ణ లీలా విశేషం
గోవర్ధన ఘట్టం మహాభాగవత౦ లోని శ్రీకృష్ణలీలావినోదాలలో ఒకటి గా కనిపించిన తరచి చూచిన ఒక చక్కని విశేషం మనకు గోచరిస్తుంది.
నందగోకులము లోని యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. మరి గోవులకు అవసరమైన గ్రాసం నకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి. ఈ పర్వతం పై వున్న పశు సంభంద ఆహారం గోవులకు ఆహారంగా స్వీకరించి యాదవులకు పాడి అనుగ్రహించేవి. ఈ పర్వతం పైన ఈ గ్రాసం పెరుగుటకు జలం అవసరం, ఈ జలం వర్షం ఆధారంగా వుండేది.
అందువలన యాదవులు మేఘాలకు ప్రభువైన ఇంద్రుడు తాము గోవుల్ని మేపే గోవర్ధన గిరి మీద వర్షాలు కురిపించి పంటలు పండించటానికి ప్రతి సంవత్సరం ఇంద్ర యాగం చేస్తుంటారు.
కాని ఒకనోకనాడు కృష్ణుడు ఈ యాగ నిర్వాహణను అడ్డుకొన్నాడు.మనకు ప్రధాన వనరు గోవర్ధనం కనుక నాకు గోవుల్ని,బ్రాహ్మణులని,గోవర్ధనం ను అరాధి౦చుదామ్, ఇంద్ర యజ్ఞం నాకు సమ్మతం కాదు అని సర్వులకు నచ్చచెప్పి ఇంద్ర యజ్ఞ నిర్వహణ నిలుపుదల చేస్తాడు.
దీనితో యాదవులందరు గోవర్ధన ప్రదక్షిణతో అచలవ్రతం చేయనారంభిస్తారు.
ఈ విషయం గమనించిన ఇంద్రుడు మహోగ్రంతో యాదవులను శిక్షించ పూనుకుంటాడు. ప్రళయకాల గర్జన్లతో విద్యుత్ సమాన మెరుపులతో కారు మబ్బులతో ధారపాతమైన వర్షం ను గోకులం పైన ఎడ తెరిపి లేకుండా కురిపిస్తాడు. కొద్ది సేపటికే ప్రజలు అక్కడ జీవనం సాగించలేని పరిస్థితి నెల కొన్నది. దీనితో యాదవులందరు శ్రీకృష్ణుని శరణాగతి కోరటం తో స్వామీ గోవర్ధనగిరిని తన చిటికిన వ్రేలిపై ధరించి సర్వప్రజలకు,గోవులకు రక్షణ కల్పిస్తాడు. ఈ విధంగా 7 రాత్రులు 7 పగళ్ళు నిరంతర వర్షం కురుస్తున్న తనను శరణాగతి కోరిన వారికి రక్షణ కల్పిస్తాడు.తన ఆశ్రయం లో వున్న వారికి తాము ఇన్ని రోజులు వున్నాం అనే భావన రాకు౦డా యోగమాయ ద్వార వారు ఆనందసాగరం లో వుండే విధంగా అనుగ్రహిస్తాడు.ఈ విధంగా ఇంద్రుని గర్వభంగం చేస్తాడు.
ప్రజలందరు గోవులను కాపాడిన వాడు కాబట్టి గోవిందుడు అని పొగడుతు తమ నివాసాలకు తిరిగి చేరుతారు.
స్థూలంగా భాగవతంలో ఈ ఘట్టంలోని కధ ఇది.
మరి మనం కధగా చదువుకొ౦దామా లేక స్వామీ లీల యొక్క విశేషం గ్రహి౦చుదామా?
ఈ విశేషం పై పండిత అంతరార్ధం వేరుగా వున్నది, స్వామీ వారి అనుగ్రహం పై కలిగిన భావనను ఇక్కడ తెలుపుచున్నాను.
గోవర్ధనం అనేది ఒక అచల పర్వతం.గోవులకు అవసరమైన ఆహరం సమృద్ధిగా లభించు ప్రదేశం. అలాగే కొ౦డ అంటేనే సకల జీవజాలంనకు ఆవాలం. గోవును కామధేను ప్రతి రూపముగా కొలుస్తాము.కామధేనువు సర్వదేవ ఆవాసం గా కొలుస్తాము.అలాగే గోవు ఆనాటి ప్రజల సిరిస౦పదలకు మూలం. ఎన్ని గోవులు వుంటే అంత సంపద. పురుషుడి వలన వంశం,గోవుల వలన పాడి సమృద్ధిగా పెరుగుతాయని ఆర్యుల నమ్మకం.అదే పౌరాణిక గాధలో నిక్షిప్తం.అలాగే ఇంద్రుడు అష్టదిక్పాలకులకు అధిపతి.రాజుతో సమానం. సర్వులు ఆయనకు లోబడి వుండాలి.
కాని విశ్వ సంరక్షకుడు విష్ణువు ఈనాడు శ్రీకృష్ణ అవతారంలో నందగోకులం లో వుండి శిష్ట రక్షణ చేస్తున్నాడు.
అ౦దువలన సర్వ ప్రజలు పరమాత్మను కొనియాడుతున్నారు.కాని కృష్ణుడు ఈ సమయములో ఇంద్రునికి పూజని అడ్డుకోవటము వలన ఇ౦ద్రునిలొ ఈర్ష్యతో రగలి ప్రకృతి నియమ విరుద్ధముగా వర్షము,తన పాలిత ప్రజలపై తానే దాడికి పూనుకొన్నాడు.దీని వలన ప్రాణకోటికి ఇబ్బంది.కాని ఆసమయములో కృష్ణుడు గోవర్ధనమును తన చిటికిన వ్రేలి పై నిలిపి ప్రాణకోటిని,ప్రకృతిని రక్షించాడు.
సర్వజన హితం కోరే కార్యం సాధించ పూనినప్పుడు ఎవరు ఎన్ని ఆటంకములు తలపెట్టిన,రాజు తాను గాని,తన ఆదినములోని వ్యవస్థల ద్వారా కాని అడ్డుకోవడం జరిగినప్పుడు.దిక్కులన్ని ఏకమైన ప్రకృతి నియమ నిభందనలకు విరుద్ధముగా జరిగిన,జరుగుచున్న కార్యక్రమములు అన్నిటిని అడ్డుకొని బహుజన హితమే తన లక్ష్యమని అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాను అని తెలపటమే ఈ గోవర్ధనగిరి ఘట్ట లక్ష్యం గా నేను భావిస్తున్నా!
19, జులై 2012, గురువారం
ఆది శంకరులు స్థాపించిన మఠ స్థాపనం - పంచలింగ స్థాపనం.
ప్రజలు,ప్రభువులు ఆదరిస్తున్న అద్వైత తత్వం శాశ్వతంగా కొనసాగాలనీ మానవులందరు ఒక్కటే అనే ఐక్యమత్య భావం వర్ధిల్లాలనీ శంకరులు భారతదేశం నాలుగు దిక్కులా నాలుగు అద్వైత ప్రచార స్థానాలు ఉండాలనీ సంకల్పించారు.
తూర్పున జగన్నధ క్షేత్రం పూరిలొ గొవర్ధన మఠం పేరుతో ఓక అద్వైత పీఠాన్ని ఏర్పరచి, దానికి అధిపతులుగా పద్మపాదాచార్యుల వారిని నియమించారు.ఇది ఋగ్వేద ప్రధాన క్షేత్రం.
దక్షిణములొ శృంగేరి శారదా పీఠం ఏర్పరచి దానికి సురేశ్వరాచార్యుల వారిని అధిపతులగా నీయమించారు.ఇది యజుర్వేద ప్రధాన క్షేత్రం.
పశ్చిమంలో ద్వారకలొ కాళికా పీఠాన్ని నెలకొల్పి దానికి హస్తామలకాచార్యుల వారిని అధిపతులు గా చేశారు.ఇది సామ వేద ప్రధాన క్షేత్రం.
ఉత్తరంలో బదరీ క్షేత్రములొ జ్యొతిర్మఠాన్ని ఎర్పరచి, దానికి అధిపతులుగా తోటకాచార్యులవారిని నియమించారు.ఇది అధర్వణ ప్రధాన క్షేత్రం.
ఈ విధంగా శంకరుల భాధ్యత శిష్యుల భుజస్కంధాలమీదకు వచ్చింది.ఆనంతరం ఆయన బదరికాశ్రమంలొ ఉండి, తమ పరమ గురువులైన గౌడపాదులవారిని దర్శించారట.
పంచలింగ స్థాపన: శంకరులు కైలాసం నుంచి ఐదు స్పటిక లింగాలను తీసుకొని మరలా దక్షిణాభిముఖంగా భారతదేశ పర్యటనకు బయలు దేరారు.
మొదట కేదార క్షేత్రంలొ ఒక స్ఫటిక లింగాన్ని స్థాపించారు. అది ముక్తిలింగం మని ప్రసిద్ధి చెందినది.నేపాల్ నీలకంఠ క్షేత్రంలొ వర లింగాన్ని,చిదంబరంలొ మోక్ష లింగాన్ని, శృంగేరిలో భోగ లింగాన్ని, కంచిలో యోగ లింగాన్ని ప్రతిష్టించారు.
శంకరులు ఈ విధముగా 4 మఠాలు, 5 స్ఫటిక లింగాలను స్థాపించి.కంచికామకోటి పీఠంలొ తామే అధిపతులుగా ఉంటూ సమస్త కార్యపర్యవేక్షణ సాగించారు.
18, జులై 2012, బుధవారం
"నారాయణీయం" గురించి కొన్ని విశేషాలు.
మేల్పత్తూర్ నారాయణ భట్టతిరి నంబూద్రి వంశ బ్రాహ్మణుడు. ఆయిన 1560 లో జన్మించారు.అనన్య సామాన్య అకుఠింతటదీక్షతో 16 సం లకే వేదవిద్యలు, ధర్మ శాస్త్రాలను ఆయిన గురువైన శ్రీ పిషరడీ గారివద్ద అభ్యసించారు.వీరు గురువు గారికి గురుదక్షణగా తనసంపూర్ణ అరోగ్యాన్ని సమర్పించి వారి దీర్ఘకాల వ్యాధీయిన వాత రొగాన్ని తాను స్వీకరించిన మహానుభావుడు.గురువు గరికి ఉపశమనము లభించినది కాని భట్టతిరి గారికి వాతరోగం దుర్భరమయినది.దీనిని తప్పుకొవటానికి భగవంతుని కరుణ తప్ప వేరు మార్గము లేదని తలచి గురువాయూర్ నందు నారాయణుడు స్వయంభూవుగా వున్నాడని గురువాయూర్ చేరి ఆ నారాయణుని ప్రస్తుతిస్తూ భాగవత రచనా కార్యక్రమాన్ని ప్రారంభించాడు.ఇది 100 రోజుల పాటు కొనసాగింది.నారాయణ భట్టతిరి రచన మరియు నారాయణుని గాధ కనుక "నారాయణీయము" అని పిలువ బడింది.
ఈ రచనాకాలములో భట్టతిరీ గారి అనన్య భక్తికి మెచ్చి కృష్ణుడు స్వయముగా వినేవాడని,మధ్య మధ్యలో అంగీకార సూచికముగా తల,కరముల కదలికతో తన అంగీకారాన్ని తేలిపేవాడని అనేక గాధలు వున్నాయి.
నరసింహావతారాన్ని వ్రాసే ముందు అవతార అవిర్భావము ఎలా వర్ణించను, సింహాన్ని ఎలా వర్ణించను అని చింతన చేస్తే ఎదురుగావున్న రాతి స్థంభము ఫెళ ఫెళా విరిగిపొతు అందులో భీమ ఉగ్ర నరసింహ రూపాన్ని కని నరసింహావతారము వ్రాశాడని.అలాగే సీత హనుమకు చూడామణి అనుగ్రహించే ఘట్టములో ఒక పదము వ్రాస్తే భావపరిపూర్ణత రాక మధనపడుతుంటే సరి అయినా ప్రత్యామ్నాయాన్ని కృష్ణుడు చూపించాడని ఇలా అనేక గాధలు ప్రచారములో వున్నాయి.
ఇలా నారాయణీయము పూర్తి అగిసమయానికి భట్టతీరి గారి ఆరొగ్యము గుణపడి సంపూర్ణారొగ్యం చేకూరినది.ఆయిన చరమ శ్లొకముగా ఇలా వ్రాసాడు
"కృష్ణా! బుద్ధికి గాని, ఇంద్రియాలకు గాని కనిపించనది నీ అవ్యక్త రూపము.అది సామాన్యులకు ఉహకు కూడా అందదు.కనుక వారికి ఫలితము దుర్లభమే.కానీ ఈ గురువాయూర్ లో నీ ప్రత్యక్ష తేజ స్వరూపము అపూర్వము.అతి మనొహరము.ఈ శుద్ధ సత్వాన్ని అశ్రయించి పునః పునః ప్రమాణాలు అర్పణ చేస్తున్నాను నన్ను అనుగ్రహించు అని పలుకగా ఉత్తర క్షణములో పరమాత్మ ఎట్టేదుట సాక్షాత్కరించాడు.
17, జులై 2012, మంగళవారం
భగవదారాధనలొ ముద్రలు
భగవదారాధనలొ ముద్రలకూడా స్థానం ఉన్నది. ముద్ర అంటే ఎమిటి? అంటే ఓక రూపానికి ప్రతీకాత్మకముగా వ్రేళ్ళను, చేతులను వివిధ ఆకారాలలొ ముడచి,పెనవేసి,ఆరాధన సమయాలలొ భగవంతునికి ఆరాధన పూర్వకముగా చూపటమని సూక్ష్మమముగా చెప్పవచ్చు.అంతే కాకుండా యోగవిధానలలో మొత్తం శరీర భాగం పంచుకోనే ఒక ఆచరణ అని కూడా చెప్పవచ్చు. నృత్యరీతులలొ సంగీతమునకు,లయ స్వరలకు తోడుగా, జతులు తో సహితముగా నృత్య భంగిమలో భాగముగా అది నటరాజ అర్చనలో ఓక భాగముగా అక్కడ భావిస్తారు.
" ముదం కుర్వంతి దేవానం రాక్షసాన్ ద్రావయంతీచ" అన్నదాన్ని బట్టి దేవతలకు సంతోషాన్ని,సంతృప్తిని కలిగిస్తుంది.రాక్షస శక్తులను పారద్రోలుతుంది కాబట్టి ముద్ర అనే పేరు వచ్చిందని విష్ణుసంహిత తెలుపుతున్నది.దేవతల యోక్క అర్చన,జప,ధ్యానములలొనే కాక కామ్యకర్మలలొ ను విగ్రహ ప్రతిష్ట,ఆవాహన,నైవేద్యము,విసర్జనలలో వివిధ ముద్రలు ఉపయోగించబడతాయి.
ముద్రలు అనేకాలు పురాణాలలో పేర్కోని వివరించబడ్డాయి బ్రహ్మండ,ఆగ్ని,నారద,బ్రహ్మ,దేవిభాగవతాలలొ ముద్రలను గురించిన విస్తృత వర్ణన వున్నది.గాయత్రీ జపం చేసటప్పుడు ఉపయోగించే 24 ముద్రలు,నిత్యం సంధ్యావందనం చేసే వారికి అనుభవమే.కాళికా పురాణములో 108 ముద్రలు ఉన్నాయని తెలుపుతున్నది. జైనులు.బౌద్ధమతస్థులు కూడా తమ ఆరాధనలో ముద్రలను ఉపయోగిస్తారు.
ముద్రలలొ ఆవాహని,స్థాపని,సన్నిధాపన మొదలైన తోమ్మిది ముద్రలు చాలా సాధారణముగా అన్నిరకాల అర్చనలలో అర్చన విధానలలో ఉపయోగించబడతాయి.శంఖముద్ర,గదాముద్ర,వారాహిముద్ర,పరశుముద్ర మొదలైనవి విష్ణువు ప్రియమైనవిగా మనపురాణాలు పేర్కోంటున్నాయి.

16, జులై 2012, సోమవారం
అంబోధి,జలధి,పయోధి,ఉదధి, వారాంనిధి,వారిధి
అంబోధి,జలధి,పయోధి,ఉదధి, వారాంనిధి,వారిధి ఈ ఆరు పదాలు సముద్రానికి పర్యాయపదాలుగా వాడుక. కాని ఇన్ని పదాలు వెనువెంటనే ఇదే క్రమములో పద్యము ఏవరైనా చెప్పగలరా అంటే ఈ నాటికాలములో కొద్దిగా కష్టము కాని పూర్వ కాలములో ఇది సులువుగా జరిగే ఓ క్రియ. ఈ పద్యము శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రీ గారి కృషి ఫలితముగా వెలువడిన "చాటుపద్య మణిమంజరి" లోనిది. దీని తాత్పర్యము కూడా చిన్న కధలా చెప్పుకోనవచ్చును.
ఓకనాడు కైలాసములో సవతుల మధ్య రచ్చ జరిగింది. భవాని ఎమో తన పుత్రుడు కార్తికేయునితో ఫిర్యాదు చేసింది. తల్లి అంటే అభిమానము మెండుగా కలవాడైన షణ్ముఖుడు, అసలే కోపధారి తండ్రీ వద్దకు వేళ్ళి విషయము ప్రస్తావించాడు.ఆసమయములో శివుడు,షణ్ముఖుడు మధ్య జరిగిన సంభాషణే ఈ పద్యము.
శ్లో!! ఆంబా కువ్యతితాత!మూర్ధ్ని విహిత గంగేయ మత్సృజ్యతాం
విద్వన్ షణ్ముఖ కాగతి ర్మయి చిరం తస్యాస్థ్సితాయ వద
రోషోత్కర్షవశా దశేషవదనైః ప్రత్యుత్తరం దత్తవా
నంబోధి ర్జలధిః పయోధి ర్వారాన్నిధి ర్వారిధిః.
తాత్పర్యము: "నాన్న అమ్మకు కోపము వస్తున్నది. నీ తల మీద ఉన్న ఈ గంగను విడచిపెట్టు".కుమారాస్వామి! నీవు అన్నీ తెలిసినవాడవు కదా! ఇన్నాళ్ళూ నా నెత్తిమీద ఉన్న అమెగతి ఏం కావాలో చెప్పు. ఆ మాటవినగానే కోపం పట్టజాలక " అమెకు ఏమిగతి అంటావా-" అంబోధి,జలధి,పయోధి,ఉదధి, వారాంనిధి,వారిధి అని ఆరుముఖాలతో ఒక్కమాటే చెప్పాడు.
14, జులై 2012, శనివారం
కొన్ని మంచి మాటలు!
ధర్మఏవ హతో హంతి, ధర్మోరక్షతి రక్షతః
తస్మాద్ధర్మోన హంతవ్యో మానో ధర్మోహతోవధీత్
ధర్మాన్ని బాధిస్తే అది తిరిగి మనల్నే బాధిస్తుంది.ధర్మాన్ని రక్షిస్తే అది మనను రక్షిస్తుంది. కాబట్టి ధర్మాన్ని నాశనం చేయకూడదు.ధర్మం నశించి మనలను నశింప చేయకుండుగాక.
----------------------------------------------------------------------------------------------
అష్టాదశ పురాణానం సారంసారం సముద్ధృతం
పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం.
18 పురాణాల సారాన్ని పిండగ పిండగా తేలినది ఏమనగా పరోపకారం చేస్తే పుణ్యం - పరపీడనం చేస్తే పాపం.
----------------------------------------------------------------------------------------------
అన్నంన నింద్యాత్, తద్రవతము - తైత్తరీయ సంహిత.
అన్నాన్ని పారవేయటము కాని, అగౌరపరచటముకాని,వ్యర్ధపరచటముకాని చేయరాదు.శ్రద్ధగా చేయాలి.
-----------------------------------------------------------------------------------------------
గుణాః పూజాస్థానం గుణిఘ నచ లింగం న చవ వయః
గుణాలే గౌరవానికి కారణం.గుణవంతుల విషయంలో లింగభేదం కాని వయోభేదం కాని పాటించకూడదు.
-----------------------------------------------------------------------------------------------
కరార విందేన పదార విదం,ముఖారవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటేశయానం,బాలం ముకుందం మనసాస్మరామి.
పద్మం వంటి తన పదాన్ని,పద్మంవంటి చేతితో, పద్మంవంటి నోటిలో చోప్పిస్తూ మర్రి ఆకుదొన్నెలో శయనించియున్న బాలముకుందునికి మనసా నమస్కరిస్తున్నాను.
13, జులై 2012, శుక్రవారం
అవతారం లు ఎన్నివిధములు? - వివరణ!.
అవతారశబ్దం 'అవ ' ఉపసర్గ ముందు గల 'తౄ' ధాతువుకు 'ఘట్' ప్రత్యయం చెరగా ఏర్పడినది.'అవే తృస్త్రర్ఘజ్' అనే పాణినీయ సూత్రం ప్రకారం 'ఘజ్' ప్రత్యయం చేరటంతో అవతార శబ్దం సిద్ధిస్తుంది.'అవతారం' అనే శబ్దానికి ఏదైనా ఉన్నత స్థానం నుంచి క్రిందకు దిగటం లేక 'క్రియా అనికాని,'స్థానం' అనికాని దీనికి అర్ధం.ఇంతేకాకుండా పురాణాలను అనుసరించి మహాశక్తి సంపన్నమయిన ఒకానొక దైవంకాని,దేవరకాని,పై లోకం నుంచి క్రింది లోకానికి మానవ రూపాన్ని కాని మానవతేర రూపాన్ని కాని ధరించి విచ్చేయటం. ఇదే అర్ధంలో 'అవిర్భావం' అనే శబ్దం పురాణాలలో ఉపయోగించబడింది.
తన భక్తుల భయనివారణ కోసం భగవంతుడు అప్పుడప్పుడు తన విభూతి అనగా తన ప్రభావంతో ఆ భయనివారణ చేస్తాడు. ఈ ప్రభావం పనిచేయనప్పుడు ఆయన్ అంశావతరం లేకపొతే పూర్ణావతారం ధరించి ఈ లోకసముద్ధరణ చేసి ధర్మరక్షణకోసం అవతారం ధరిస్తాడు.అవి 1)పూర్ణావతారం 2) అంశావతారం 3) విశేషావతారం 4)ఆది శేషావతారం 5) నిత్యావతారం అనేవి.
1)పూర్ణావతారం: మానవుని లాగే తల్లి గర్భవాసంలో జన్మించి పెరిగి ధర్మరక్షణ చేయటం.ఇందులో భగవంతుని షోడశ కళలు నిండి వుంటాయి.భగవంతుడు శ్రీకృష్ణునిది,శ్రీరామునిది పూర్ణావతారం.
2)అంశావతారం: భగవంతుని షోడశ కళలలో ఎనిమిది కంటే ఎక్కువ కళలు అవలంబించబడి అవతారం ధరించినది. వామనావతారం అంశావతారం.
3)విశేషావతారం: దీక్షా సమయములో గురువు శిష్యుని యొక్క మనస్సులో ప్రత్యేక రూపంలో ఆవిష్కరణం చెంది ఉంటాడు. అందువలన ఆ సమయములో తన ఎదుటగల గురువు శిష్యునికి భగవంతునిగానే కనబడతాడు. అందుకే గురువు,బ్రహ్మ,విష్ణు,శివునిగా భావించబడేది. గురువు యోక్క ఈ స్థితి విశేషావతార రూపం.
4)ఆదిశేషావతారం: భగవంతుని పై భక్తునికి తీవ్రమయిన భక్తి ఆవేశం కలిగినప్పుడు ఆ భక్తుడే భగవత్ స్వరూపుడుగా భాసిస్తాడు.ఇతర సమయాలలొ అతడు సాధారణ మానవుడే.సనకాది మహమునులు, నారదాది దేవర్షులు, పృధువువంటి రాజర్షులు ఈ అవిశేష అవతార మూర్తులుగా పరిగణింపబడతారు.అయితే ఈ స్థితి తాత్కాలికమయినది.
5)నిత్యావతారం: మనుష్యులు అంతఃకరణంలొనే నిత్యావతారుడుగా భగవంతుడు వెలసి ఉంటాడు. సర్వవ్యాపకుడు,సర్వఙ్ఞానమయుడు,అయిన భగవంతుని యోక్క ఉనికిని సర్వచరాచర ప్రకృతిలోను ఉన్నది.అతడు అన్ని జీవుల హృదయక్షేత్రాలలోను విరాజిల్లుతుంటాడు. అందరితోను ఉంటాడు.జీవులు పాపకర్మరహితులై నివృత్తిని పొందగలుగుతారు ఇదే నిత్యావతారం.
12, జులై 2012, గురువారం
అంతిమ సంస్కారములలొ ఘటము యొక్క అంతరార్ధము.
పుట్టుక వుంటే గిట్టుక వున్నది. ఇది సత్యము. ప్రతిజీవుడు ఇది తెలుసుకోన వలసిన సత్యము.హైందవ సాంప్రదాయములొ అంతిమ సంస్కారములలొ ఘటము ఉపయోగిస్తారు. ఈ ఘటము యొక్క ఉపయోగము గురించి అక్షరవాచస్పతి దాశరధి రంగాచార్యగారు తన వేదం జీవననాదం లో వివరించారు.ఇక్కడ నుంచి వారి మాటల్లోనే!
జీవితం నీటికుండ. దహనసంస్కారంలో కర్త భుజం మీద నీటి కుండ ఎత్తుకుంటాడు.చితికి తొలిసారి ప్రదక్షిణకు ఒక రంధ్రం చేస్తారు.కారిపొతున్న నీరు బాల్యం.కర్తకు ఇది కనిపించదు.నీరు వెనుక కారిపొతుంటుది.రెండవ ప్రదక్షిణలో రెండవ రంధ్రము చెస్తారు ఈ ధారగా కారిపొయే నీరు యవ్వనం.మూడవ ప్రదక్షిణలో కారిపొయేది వార్ధక్యము.చివరి ప్రదక్షిణలొ కుండను నేలకు కోట్టి కర్త వెనక్కు చూడకుండా పొతాడు.బద్ధలైన కుండ విగత జీవికి సంబంధించినది. నీవు వెనక్కు చూడక జీవతంలొ సాగిపో అనే ఉపదేశం కర్తకు!.
ఇందులో వైరాగ్యం లేదు సన్యాసంలేదు. జీవిత పరమసత్యాన్ని అతి సామాన్యునికి కూడా ఇంత సులభంగా బొధించారు.దీనిమీద ఎవరి పెత్తనము లేదు గాలివలె,నీటివలె సర్వజన సామ్యం! అంతారార్ధం అందరికీ తెలియకపొవచ్చు.ఆచరణ మాత్రము జరుగుతున్నది.అన్ని విషయల్లోను అన్నికాలల్లోను అలాగే ఉంటుంది.

11, జులై 2012, బుధవారం
దేవాలయము - నాలుగు గోపురములు - వివరణ.
అధ్యాత్మిక మార్గంలో మానవుడు పరమాత్మస్వరూపుడైన భగవంతుని చేరటానికి రెండు రకాల పద్ధతులు అవి సాకార ఉపాసన, నిరాకార ఉపసాన. సాకార ఉపాసకులు భగవంతుని ఒక రూపముగా అర్చిస్తారు.నిత్య ఉపసానకు గృహములొ మందిరాలుగాను, సర్వ మానవాళి గురించి దేవాలయ నిర్మాణము జరిగినది. ఈ దేవాలయ నిర్మాణానికి అనేక రకాల పద్ధతులు. ఇలా శాస్త్ర ప్రకారముగా నిర్మించిన దేవాలయము మధ్యగా పరమాత్మ స్వరూపుడైన భగవంతుడు విరాజిల్లుతారు. ఈ కేంద్ర నిర్మాణానికి ప్రాకారమునకు నాలుగు దిక్కులలోను నాలుగు గోపురములు నిర్మిస్తారు.ఈ నాలుగు గొపురములు ప్రజలు స్వామిని అర్చించటానికి అంతర్గమ,నిర్గమ మార్గాలుగా ఉపయోగిస్తారు.ఇది భౌతికపరముగా కనబడేది. మరి శాస్త్రం యోక్క మూల ఉద్దేశ్యం భక్తుడిని పరమాత్మకు చేరటానికి నాలుగు మార్గాలు వున్నాయని. 1)కర్మ 2)భక్తి 3) ఙ్ఞాన 4) వైరాగ్య లు ఈ నాలుగు మార్గాలుగా గుర్తింపు.వాటిని ప్రతిఫలిస్తూ నాలుగు గోపురముల నిర్మాణము.
మానవుడు ఈ 4 మార్గాలలొ ఏ మార్గము ఎంచుకున్నా పరమాత్మను చేరెమార్గాన్ని ఎంచుకున్న వారు అవుతారు. దీక్షగా అందులో కృషి చేస్తె ఆ మార్గము యోక్క చివరి లక్ష్యము అయిన పరమాత్మను దర్శించి మోక్షము పొందగలుగుతారు.అలా కాకుండా ఈ మార్గము కొన్ని రోజులు, ఆమార్గము కొన్ని రోజులు అని భావిస్తే ఇక్కడే చక్రభమణములో చిక్కుకోని పోతారు తప్ప పరమాత్మను పోందలేరు.
1)కర్మ : కర్మ అనగా ఏమిటి? జన్మించిన ప్రతి ఒక్కరు జీవిక గురించి ఎదో ఒక వృత్తి, దేహ కార్య నిమిత్తము దైనిందిన క్రియలు చేయాలి.ఏ విధమయిన క్రియలు జరపకుండా ఒక్క క్షణమయినా ఉండలేడు. ఇది మనము చేసె కర్మ. మన చేత చేయించె కర్మ కూడా ఉన్నది అదే కర్మసిద్ధాంతము.మానవుని చర్యకు ప్రతిచర్యగా లభించు పాప,పుణ్యములను కర్మఫలముగా భావించవచ్చు.మరి ఈ విధముగా దైనిందిన క్రియలు,వృత్తిపర నిర్వాహణలో కర్మ ఫలితం వల్ల తప్పు ఒప్పులు క్షణక్షణము పరీశీలించుకొంటూ,బేరీజు వేసుకుంటూ జీవనము సాగించటము సాధ్యమా ! సాధ్యము కాదు! పోని కర్మలను మానటముకాని,నిరాకారించటముకాని,త్యాగము చేయటముకాని సాధ్యమా కాదు . మరి ఇలా కర్మలను పరంపరలుగా చేస్తూ వేళ్ళితే పాపపుణ్యాలు మానవునికి తెలిసేది ఎలా? అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మలను మీరు విధిగా భావించి చేయండి, పాప పుణ్యాలను నారయణునికి ఇవ్వండి.
అనగా మీరు చేయు ప్రతి వృత్తి ధర్మ కర్తవ్యం,దేహ సంబంద కార్యాలు, దైనిందిన కార్యక్రమాలలొ అన్నింటా పరమాత్మ రూపముగాను,పరమాత్మ ప్రమేయముగాను,పరమాత్మ ఆఙ్ఞానుసారము గాను ఆయన కోసము,ఆయిన వలన చేస్తున్నాము అనే ఎరుకలో ఉండటము.ఆహారము జీవుడు నేను చేస్తున్నాను అనే ఉద్దేశ్యము కన్నా ఇది పరమాత్మ ప్రసాద రూపమని తలచి నారాయణ అర్పణము చేసి స్వీకరి౦చట౦.అలాగే దానధర్మాలలో నేను ఇస్తున్నాను అనే భావన కన్నా శ్రీరామార్పణము భగవతార్పణము గా తలచమని. కారణము తీసుకునే అతను కూడా దైవ రూపముగా భావన.ఇవి కర్మ సిద్ధంతాన్ని పరిపుష్టము చేస్తుంది.
అనగా ఇలా చేయు పనులలొ మానవునికి ఆక్రియలకు మధ్య వున్న అనుభంధం తగ్గి మనస్సు త్యాగపూరితముగా మారుతుంది. అది యోగముగా మారి పరమాత్మ సన్నిధికి తీసుకోని వెళ్ళుతుంది.దీనికి ఉదాహరణలుగా కుమ్మరి అయిన కురువత్తి నంబి కథ, ధర్మ వ్యాధుని కధ చెప్పుకోనవచ్చును.

2) భక్తి : భక్తి అంటే విభక్తి లేనిది. విభక్తి అనగా విభజించుట. విభజన లేనిది భక్తి.రెండిటిని కలపటము భక్తి అయితే వేటిని కలపాలి? మనిషి తన అంతరంగాన్ని భగవంతునిలో లయం చేయటమే భక్తి.అంటే మనిషి తన వ్యక్తిత్వాన్ని భగవంతునితో ఎకత్వము చేందటము భక్తిగా గుర్తింపు.జీవుడు+దేవుడు = భక్తి!.మనము సాధరణముగా ఆలయములో నమస్కారము చేస్తాము ఇది భక్తికి గుర్తు.కుడిచేయి దైవత్వానికి,ఎడమచేయి మానవత్వానికి గుర్తు ఈ రెండు కలిపితే భక్తికి గుర్తు.మరి దేవుడుని ఎలా కలిపేది.నవజాత శిశువు తల్లిని ఎలా గుర్తుపడుతుంది?తల్లి తన బిడ్డ ఏదుపుని ఎంత పనిలో వున్న ఎలా గ్రహించ గలుగుతుంది.మొదటిది ప్రేమ అయితే,రెండవది శ్రద్ధ. ప్రేమతో శ్రద్ధగా భగవంతుని ఆరాధించటమే భక్తి.నారదభక్తి సూత్రాలలో ఇదే విషయాన్ని చెప్పారు "భక్తిర్హి,పరమప్రేమ రూపా ".మరి ప్రేమ అంటే ?సాధరాణముగా ప్రేమ అంటే మనకు అనుభవమే మనకు నచ్చిన వారి గురించి అలొచించటము వారితో గడపటము వారి అవసరాలను చూడటము. మరి ఇది లౌకిక ప్రేమ. కాని భగవంతుని చూడవలసినది అంతరింగికప్రేమతో ,భగవంతుని సర్వకాల సర్వావస్థలయందు తన అంతరంగము నందు నిలుపుకోవటమే భక్తి. ప్రహ్లదుడుని నృశింహుడు కరుణించి నీకు ఏమికావాలి అని అడిగాడు?"యా ప్రీతరవివేకానాం విషయేష్వనపాయినీ" అని ప్రహ్లదుడు అన్నారు. అనగా వివేకము లేనివారికి, ఙ్ఞాన శూన్యులకు విషయవాంఛలయందు అనగా డబ్బు,అస్థి లాంటి వ్యవహారలపై ఏలా అత్యంత ప్రీతి కలుగుతుందో అలా అటువంటి ఆసక్తే నాకు నీ పాదములపై కలిగే విధముగా అనుగ్రహించు అని అడిగాడు.అందుకే తనను ఎన్ని బాధలకు గురిచేసినా అకుఠింత దీక్షతో తన భక్తి మార్గాన్ని విడవని వాడు ప్రహ్లాదుడు.
ఇదే విషయాన్ని భగవద్గీత నందు "అనన్యేనైవ యోగేన భక్తిరవ్యభిచారిణి" అనన్యమైన యోగముతో ఎవరైతే నన్ను భక్తితో అరాధిస్తారొ వారి యోగ్క్షెమాలు నేనే వహిస్తా అని శ్రీకృష్ణుడు అన్నారు.ఈ భక్తి ఎలా ఉండాలన్నారు తైలధారలాగా వుండాలని.పైనుండి నీరు ధారగా పొస్తే తుంపరలుగా పడతాయి కాని నూనే,అముదము లాంటి తైలములను పొస్తే ఏకధారగా అవిచ్ఛినముగా పదుతుంది.ఇలా నిరంతర అలోచనా సరళే అనన్యభక్తి.ఈ నిరంత భగవంతుని అరాధించటము పరాభక్తిగా మారి సర్వ జీవులయందు, సర్వ రూపాలయందు భగవంతుని చూడగలుగుతాడు.ఈ భక్తి మరలా తొమ్మిది విధాలుగా గుర్తించారు.
1)శ్రవణం- భగవంతుని గురించి వినటము ఉదా:పరిక్షిత్తు. 2)కీర్తనము - భగవంతుని గుణ గానాలు పాడటము ఉదా:శుకుడు 3) స్మరణము - భగవంతుని ఙ్ఞాపకాలు ఆయిన లీలా వైభవాలు అయిన విభూతి ఙ్ఞప్తికి తెచ్చుకోవటము. ఉదా: ప్రహ్లాదుడు.4)పాదసేవనము: సదా ఆయిన పాదములపై ధ్యాస వుంచటమే .5) అర్చన - అయినను పూజించటము.ఉదా: పృధువు.6)వందనము - హృదయపూర్వక నమస్కారము ఉదా: అక్రూరుడు.7)దాస్యము - సేవచేయటము. ఉదా: ఆంజనేయుడు. 8) సఖ్యము - స్నేహితునిగా అరాధించటము. ఉదా: అర్జునుడు,కుచేలుడు.9)ఆత్మనివేదనము - తననుతాను సమర్పణ చేయటము. ఉదా: బలి
.
3)ఙ్ఞానము: సహజముగా లౌకిక జీవనములో వ్యక్తి జీవనము గడపటానికి సరిపొయిన విద్యను,లౌకిక సంబంధ వస్తువిషయాలపై అవగాహనను ఙ్ఞానముగా గుర్తింపు.కానీ అధ్యాత్మజీవనములో ఙ్ఞానము అంటే స్వస్వరూప ఙ్ఞానమే ఙ్ఞానముగాగుర్తింపు.దేహములో వున్న ఆత్మను దర్శనానుభవమే ఙ్ఞానము గా గుర్తింపు.ఈ ఙ్ఞానము ఇలా కలుగుతుందో క్లుప్తముగా తెలుసుకుందాం.ఆత్మను ఇంద్రియాలవల్ల చూడలేము.మరీ ఎలా చూడాలి. మనస్సు,ఇంద్రియాలు అన్ని కుడా బహిర్ముఖాన్ని మాత్రమే చూస్తాయి.వీటిని నియంత్రించి తనలోపలకు చూపే విధముగా అనగా అంతర్ముఖం గా దర్శించే విధముగా సాధన చేస్తే ప్రపంచమును చూడటము మాని ప్రపంచమును చూస్తున్న ఆత్మను తనలో దర్శిస్తాడు.అప్పుడు మాత్రమే ఙ్ఞానము సిద్ధిస్తుంది.
4)వైరాగ్యము: ఈ మార్గము కొంచెము కష్టతరమయినది కాని పైన వున్న 3 మార్గాలలొ అంతర్లీనముగా కలసివుంటుంది. వైరాగ్యము అంటే ఎమిటి?ఈ లౌకీక జీవనములో వున్న వస్తువిషయసంగ్రహాలలొ మునిగి అవి లెక పొతే జీవనము ఎలా అన్న చింతనలో గడుపుతాడు.ఇవి అన్ని ఇక్కడవరకే పరమునకు పనికీరావు అన్న గుర్తు ఎరిగి వీటిని తృణికరించటము,నిరాకరించటము లాంటి విరాగ లక్షణాలు.
ఈ మార్గాలని అనుసరిస్తే లోపల వున్న భగవంతుని చూడగలుగుతారని తెలపటమే పూర్వుల అలోచన సారము.

10, జులై 2012, మంగళవారం
సృజనాత్మక అ౦టే ఇదేనా
రె౦డు రోజుల క్రితం సాక్షి పేపర్లో విజయవాడ ఒకానొక షోరూమ్ ప్రకటనలో చీరను ఒక మోడలమ్మ వైపరిత్య ధోరణిలో వు౦డుటతొ పాఠకుల ముందుకు తీసుకు వస్తే సృజనాత్మకత ఆ౦టు కొన్ని కామెంట్స్ ఒకానొకరు చేసారు. వారికి నేను ప్రత్యుత్తరం ఇచ్చినా వారు వివాద ప్రతి వాఖ్యలు,మరలా దీనికి తోకలా వచ్చే అజ్ఞాత ప్రత్యక్షం అయి వంకర టింకర కామెంట్స్. ఒకే వ్యక్తి ఖ౦డనలు,ము౦డనలు,అజ్ఞాత ప్రక్షిప్తాలు ఇలా వున్నది. నాకు ఇబ్బంది అని పించి మరలా అన్ని కామెంట్స్ తీసివేసా. కాని ఆ ముసుగు వీరుడు మరలా నేటి పోస్ట్ లో షరా మామూలే!
సృజనాత్మకత అంటే ఇది. కారణం వీళ్ళు విద్యా స౦స్థలు,ఆ నాటి మోడల్ కు నేటి మోడల్ కు తేడా మీరు పరిశిలించి
సృజనాత్మకత ఏదో నిర్ణయం చేయండి.
సృజనాత్మకత అంటే ఇది. కారణం వీళ్ళు విద్యా స౦స్థలు,ఆ నాటి మోడల్ కు నేటి మోడల్ కు తేడా మీరు పరిశిలించి
సృజనాత్మకత ఏదో నిర్ణయం చేయండి.
9, జులై 2012, సోమవారం
జానపద పాటల్లో ధర్మరాజు జూదం - కొన్ని కొత్త సంగతులు.
జానపద సాహిత్యములో రామాయణ,భారత,భాగవతల్లొని దాదాపు ప్రముఖమయిన సంఘటనలను పాటలుగాపాడి నీతిబొధలుగాను అనేక విధములయిన వినొద సాధనములుగాను ఉపయొగించేవారు అన్నది సర్వులు విదితమే. అటువంటిదే ధర్మరాజ జూదము. ఈ జ్యూదవ్యసనము వలన ధర్మరాజు ఎమికొల్పొయాడు ఎంత ఇబ్బంది పడ్డాడో తెలపటమే పాట లక్ష్యం.
ఈ పాటలొని కధ మహభారతములోని సభాపర్వం లోని ద్వితీయాశ్వసం లోనిది.అంశం భారతములోనిది అయినా ఇది కేవలము జానపదుల ఉహజనితమయిన కల్పిత గాధ.
ఈ పాట ధర్మరాజు జూదమాడటానికి హస్తినాపురమునకు బయలుదేరటముతో ప్రారంభము అవుతుంది. అలా బయలు దేరేముందు ధర్మరాజును సహదేవుడు అతణ్ణి
"బింబకార్యములు చేయబొకయ్యా
ఆడకుమి జూదములు ఓడబొకయ్యా
ఓయన్న యెట్లయినా నామాట వినుమా
పతులు చూడగా మన సతి చెర బడుద్రు
ఈడ్చుకు బోదురు సభకు రాజల్లు "
అని హెచ్చరించాడు. సహదేవుడుని జానపదులు ఎంచుకొవటానికి కారణము. అతనికి పశుపక్ష్యాది భాషలు తెలుసు. సహదేవ పశువైద్య శాస్త్రము బాగా ప్రసిద్ధము.వారి దృష్టిలో ఇతడు చావుపుట్టకలు తెలిసినవాడని తామరకోలనులోని భమిడిగుండాన స్నానమాచరించి తడివస్త్రాలు ధరించి నిష్ఠతో భవితవ్యాన్ని అన్నకు చెప్పినట్లు ఇందు తెలుప బడినది.వ్యాస భారతములో కూడా సహదేవుడు అన్నను హెచ్చరిస్తాడు.
వీరు హస్తిన పొయేటప్పుడు
"నీళ్ళోసి పెంచిన నెలతలను
ఉగ్గొసి పెంచిన యువిదలను
పాలిచ్చి పెంచిన పణతులను" వెంట తీసుకోని వెళ్తారు.
హస్తినలో జూదము ప్రారంభము అయినది.ముందు ధర్మరాజు సింహాసనము మీద రారాజు లోహసింహాసనము మీద కూర్చోని జూదమాడగా రారాజు సర్వము కొల్పొతాడు.దీనితో రారాజు చేతిలోని పాచికలను శకుని చేతికిచ్చి జ్యేష్టాదేవి దగ్గరకు వేళ్ళి అమెను ప్రార్ధిస్తాడు.దీనితో అమె తన చెల్లెలు అయిన లక్ష్మీ వద్దకు పయనము అవుతుంది.లక్ష్మీ ఈమె రాక చూసి
"యెవ్వరిని చెరుప వచ్చేనో అక్క
పొకుడ్డ చాలవే పుట్టిలాజెల్లు
అరిచేత కలహంము పెంచుకొని వచ్చె" అని మదిలో తలచి అమెకు ఎదురెగి ముమ్మారు ప్రదక్షిణ చేసి సాష్టంగ దండ నమస్కారములుచేసి అమె వచ్చిన పని ఎమిటని అడుగుతుంది.రారాజు తనను శరణుజొచ్చాడని "శరణుజొచ్చినవారిని చేడగొట్టుటాకు - మనస్సు నొప్పదు నాకు ఓ మాలక్ష్మీ " అని తెలుపుతూ అదియి కాకుండా రాజసూయ యాగము చేసేణాదు తాను తన పిల్లలతో యఙ్ఞశాలలో భోజనాల పంక్తీలో ఆకులు వేసుకోని కూర్చొగా భీముడు "ఆడుదానివి నీవు ఇది నీతిగాదు - మగవారితో కుడువ పాటి లేదనచు" తనను ఆవమాన పరచాడని అప్పుడు తాను శాపం ఇచ్చను అని ఆ శాపం ఫలించే రోజు నేడు వచ్చింది కనుక తనతో సహకరించి ధర్మరాజును వదిలి రారాజును పొందమంటుంది. కానీ లక్ష్మీ ధర్మరాజు ధర్మం తప్పని వాడని అతడివదిలి అధర్మపరుడైన రారాజును పొందటానికి అంగీకరించదు. కానీ అక్క క్రోధానికి జడసి ధర్మరాజును విడచి రారాజును చేరుతుంది.
ఈ సారి ధర్మ్రాజు లోహసింహసనము మీద,రారాజు సింహసనము మీద కూర్చుని జూదమాడతారు.లోహసింహసనము శనికి సూచన.జూదములో ఏవరు జయించేది సింహసనములను బట్టి సూచన జరిగినది.పాచికలు శకుని హస్తాన్ని అలంకరిస్తాయి.ధర్మరాజు ఓక్కొక్కటిగా సర్వసంపదలు, చివరకు ద్రౌపదిని ఒడ్డి ఓడిపొతాడు.
తనను సభకు తొడ్కొని పొవడానికి వచ్చిన దుశ్శాసనునితో ద్రౌపది
"వదినగారిని సుమ్మి పరసతిని సుమ్మి - వావి తప్పగరాదు వరపుత్ర వినుమా" అని పలుకుతుంది.
అంత దుశ్శాసనుడు నీవు కేవలము దాసివి మాత్రమే అని ధ్వనింపచేస్తూ "వదినగారివి కావు వరుసలు లేవు" అని అంటాడు.
అంత అమె తను ఋతుస్నాత అని స్నానమయితేగాని సభకు రాజాలను అంటే ఆదుష్టుడు
"వెండి కాగులతో వెణ్ణీళ్ళు గాచి
భమిడి కాగులతో చన్నీళ్ళు దెచ్చి
వెణ్ణీళ్ళు చన్నీళ్ళు సమముగా తోలిపి
పాపకర్ముడు బోసే పాంచాలీమీద"
8, జులై 2012, ఆదివారం
లక్ష్మణదేవర నవ్వు - జానపద పాట ఆధారముగా వ్రాసిన కధ.
రామాయణము జాతి జీవనాడిగా మారిందనటానికి అనేక ఉదాహరణలు. అనేక భాషల్లో,అనేక రూపాల్లో దీనికి స్థానం కల్పించారు.చిన్న చిన్న విషయాలను రామాయణపాత్రల ద్వార కధలు పాటలు అల్లి ప్రచారము కల్పించారు. మాములు వ్యక్తికధలుకన్న రామునికధలు అంటే ప్రభావము ఎక్కువ ప్రభావము చూపుతాయని కారణము రాముని వ్యక్తిత్వం అటువంటి చెరుగని ముద్ర వేసింది అని . నేటి కధ లక్ష్మణదేవర నవ్వు అనే జానపద పాట నుంచి సేకరించటము జరిగింది.ఈ జానపద పాటలు వినాలేకాని బహు సొంపుగా వుంటాయి చిన్న చిన్నపదాలు,రోజు మనచుట్టువున్న విషయాలు వాటిల్లోంచి సేకరణ వాటిగురించే నీతి ఇలా బహు గమ్మత్తుగా వుంటాయి.నేటి కధ ఉత్తర రామాయణములో ఉన్నదంటారు.నేను పరీశీలించలా.అనుశృతముగా వస్తున్న పాటను ఆధారముగానే ఈపొస్ట్ వ్రాస్తున్నా.
అది శ్రీరామచంద్రునికి పట్టభిషేక సమయము.దేవలొకమునుంచి సర్వదేవగణాలు,లంకనుంచి విభిషణుడు,కిష్కిందనుంచి వాలి సుగ్రివులు, ముని వాటికలనుంచి ఋషిగణాలు,వేదగానము చేస్తూ భూసురులు,రాముని మహిమలు గానము చేస్తూ సాంస్కృతిక బృందాలు,రామునిపాలనపై తమసంతోషాన్ని అంగీకారము తెలియ చేస్తూ అనేక సామంత రాజ్యలరాజులు,దండనాయకులు,సేనానాయకులు,ఆటవీక జాతులు,భిల్లులు,కొయలు,చెంచులు ఇలా అనేక సంచార జాతుల సముహాలతోపాటు అబ్బో మారాములోరి పట్టాబిసేకమంటా అని సామాన్య జనాలు.

శ్రీరామచంద్రునికి కీరటధారణ తద్వార రాజ్యపాలన భారం అప్పగింత జరిగింది. రాముడు తనకు రాజ్యపాలనలో అందరి సహకారము కావాలని అర్ధించాడు.అన్యాయాన్ని సహించనని తెలిపాడు.వనవాస సమయములోను,యుద్ధమునందు తనకు సహయము చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరున గౌరవ మర్యాదలు చేస్తున్నాడు.ఆ సమయములో లక్ష్మణుడు ఓక్కసారిగా గట్టిగా నవ్వాడు.లక్ష్మణుడు అలా నవ్వటముతో సన్మానము జరిగిన,జరగబోతున్న ప్రముఖులందరు ప్రతి ఒక్కరు లక్ష్మణుడు తనను చూసి నవ్వాడు అని తలపొస్తున్నారు.
పట్టాభిషేక ఉత్సవములో వున్న పరమేశ్వరుడు "జాలరి వీధుల నీలకన్యకను జడలెత్తి శిరస్సున ధరియిస్తినా "అని,
"సాహసమ్మున తండ్రిని చంపిన రాజు తలచి కోలచి రాజ వేడుక కూడు కుడిచేను " అని అంగదుడు,
"తన వెనుక తన అన్న వాలిని చంపి -వాలిచంపి తన వదినను సతి చేసుకోనె" అని సుగ్రీవుడు,
"ఆయివులు దెలిపి ఉపాయముతెలిపి అన్నప్రాణము తీసి లంక పట్నపు రాజైనడు " అని విభీషుణుడు,
"కారడవిలో దశకంఠుని చేత పట్టు పడ్డటి సతితోడల మీద చేయి పెట్టుకొని యున్నడే నా అన్న సృష్టీశ్వరుడు " అని సీత

ఇలా ప్రతి ఒక్కరు తమలో వున్న గుట్టుమట్టులను ఙ్ఞప్తికి తెచ్చుకోని లక్ష్మణుడు అదే కారణము పై నవ్వాడని తలపోస్తు చింతాక్రాంతులైనారు.ఇది ఒక్క క్షణములో పరీశీలించిన శ్రీరాముడు కత్తి దూసి లక్ష్మణుని దండించటానికి ప్రయత్నించాడు.వశిష్టుడు రాముని వారించి లక్ష్మణా నీవు రాజసోదరునివి అకారణముగా సభాముఖముగా నవ్వరాదు కారణము తెలిపినా తెలుసుకొనగోరుచున్నాము లేని పక్షమున దండన తప్పదు అని హెచ్చిరిక పూర్వితముగా తెలిపినాడు.అంత లక్ష్మణుడు ఈ విధముగా జరగటానికి కారణము ఈ విధముగా తెలిపినాడు.
వనవాసకాలములో శ్రీరాముడు సీత దంపతులకు లక్ష్మణుడు అన్ని భాధ్యతలు నెరవెర్చే వాడు.దీని వలన ఒక్క క్షణముకూడా విశ్రాంతి కాని నిద్రకాని లేకుండా తన కార్య నిర్వాహణలో శ్రమించేవాడు.ఒకనాటి రాత్రి ఒక స్త్రీ ఆశ్రమము బయట దుఖిఃస్తూ ఉన్నది అమెను గమనించిన లక్ష్మణుడు నీవు ఎవరని ప్రశ్నించాడు? దాని తో అమె అయ్యా నేను నిద్రా దేవతను "అష్టదిగ్గజములు అరి ఋషులా!వైకుంఠ నాభులను వసి యింతు నేను, సప్త్సాగరములను చవట పడుగులను,పారేటి నదులను భ్రమియింతు నేను, పక్షుల జాతులను పర్వతంబులను, వృక్షాలపై నుండి విహరింతు నేను, నరులు ఎవ్వారు నను గేలవలేరు" అని సృష్టిలోని సకల స్థావర జంగములు నిద్రలో తన ఆధీనములే కానీ నిన్ను చేరలేకున్నాను అందుకే దుఖిఃస్తున్నాను అని తెలిపినది.అంత లక్ష్మణుడు అమ్మా నేను ఈనాడు రామకార్యము పై వారి సేవలో వున్నాను కనుక దయవుంచి నన్ను ఆవహించకు రామపట్టాభిషేకము ముగిసిన పిదప నీవు నన్ను ఆవహించ వచ్చు అని పలికినాను.అందువలన ఇన్ని రోజులు నాకు నిద్ర రాలేదు కాని శ్రీరామ పట్టాభిషేకము అయిన ఉత్తరక్షణము నిద్రాదేవి నన్ను ఆవహించి సభలోనే నిద్ర వొస్తున్నది.ఇన్ని రోజులు ఆగిన అమె ఒక్క క్షణము అగక తన ప్రభావము చూపుతున్నదని నాకు నవ్వువొచ్చినది తప్ప వేరు కాదు. మా ఆహుతులను,అతిధులను అగౌరపరచాలన్న ఉద్దేశ్యము ఎమాత్రము లేదు అని తెలిపినాడు.
7, జులై 2012, శనివారం
ఏక పత్ని వ్యవస్థలోని శ్వేత కేతు గురించి మరి కొన్ని విషయాలు!
నేను గతనెల 25 వ తేదిన ఏకపత్ని వ్యవస్థ పై ఒక పోస్ట్ వ్రాసాను.
http://subhadrakeerthi.blogspot.in/2012/06/blog-post_25.html
ఈ పోస్టులో కామెంట్ విభాగంలో శ్రీమతి అనురాధ గారు ఒక పెద్ద కామెంట్ చేసారు. దానికి కొంత వివరణ ఇచ్చాను.కాని వారు సంతృప్తి పడి నట్లు లేదు దానికి ఉదాహరణగా వారి బ్లాగ్ నందు వారు కొ౦త వివరణ ఇచ్చారు.
http://aanamdam.blogspot.in/2012/07/blog-post_04.html ఈ పోస్ట్ తాలుకు కామె౦ట్ విభాగంలో మరలా వివరణ ఇచ్చే ప్రయత్నం మరియు కొంత ఆవేదన వ్యక్తం చేసినారు.మరలా ఆసమయములో సుదీర్ఘమైన ప్రత్యుత్తరాలు అక్కడే ఇచ్చాను కాని. సోదరిని పూర్తిగా మెప్పి౦చానో లేదో నాకు తెలియదు. కాని అనురాధ గారు మాత్రం మొదట నాబ్లాగ్ కామె౦ట్లో సనాతనమయితే ఆమె బ్లాగ్ చివరకు వచ్చుసరికి కొంత శాస్త్రీయ ఆలోచనకు వచ్చే ప్రయత్నం చేసారు.ఇది అభినందించాలి.విజ్ఞానం ఎప్పుడు ఆలోచన,అన్వేషణ ఫలితంగా ఉద్భవిస్తుంది.ఇది సత్యం.అలాగే శ్వేతకేతు అనేది పురుష శుక్రం నకు మరో పేరు గా కూడా ఆలోచించ వచ్చని నా భావన.
అలాగే శ్వేతకేతు గురించి మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఎలా.
అందుకే అసలు ఇటువంటి వారిని, ఇటు వంటి సంఘటనలు వుండే "పూర్వగాధలహరి" నీ , "పురాణనామ చంద్రిక" ను ఆశ్రయించా వాటిలో తెలిపిన విషయాలే నేటి పోస్ట్.
పూర్వగాధలహరి : ఓ మహర్షి. అరుణి లేక ఉద్దాలకుడు ఋషి కుమారుడు.గౌతమి గోత్రికుడు.ఇతని సోదరి సుజాత.సుజాత కుమారుడే అష్టావక్రుడు.అనగా శ్వేతకేతునికి అష్టావక్రుడు మేనల్లుడు.వీరిద్దరు ఉద్దాలకుని ఆశ్రమములోనే పెరిగారు.
శ్వేతకేతుని గర్వభంగం : తండ్రి వద్ద నేర్చుకొన్న విద్యతో గర్విష్టి కాగా తండ్రి నీవు విన్నవి,కన్నవి,నాదగ్గర నేర్చుకున్నవి కాక వినని కనని విషయాలు ఏమైనా నేర్చు కొన్నావా అనగా దానికి అతడు తెలియదని అ౦గీకర౦చగ పరమాత్మ అంటే మొదట ముగింపు లేనిది కారణం ఏమిటో తెలుసుకోమ్మన్నాడు తండ్రి విద్య అనంతరం పాంచాల దేశం వెళ్ళి రాజకుటుంబ౦ కొలువైన జైవాలి వెళ్లగా ప్రవాహానరాజు కొన్ని ప్రశ్నలు వేయగా వాటికి సమాధానం చెప్పలేక తండ్రి ఉద్దాలకుడికే చెప్పగా రాజు వద్దకే వెళ్ళి సమాధానం తెలుసుకొమంటాడు. అతడు తడబడగా ఉద్దాలకుడే రాజు వద్దకు వెళ్ళి వాటి సమాధానం తెలుసుకుంటాడు. (చా౦దోగ్యోపనిషత్)
యజ్ఞ విధానాల రూప శిల్పి : కౌసకి బ్రాహ్మణుల్లో శ్వేతకేతుడు అరాధ్యుడనదగ్గవాడు. యజ్ఞాలలో పాల్గొనే పురోహితులకు కొన్ని విధి విధానాలు ఏర్పరచాడు. ఇంతేకాక బ్రహ్మచారిణులకు,తపస్వినులకు ప్రత్యేకమైన ఆచారాలు రూపొందించాడు.ఇతనికి ముందు ధర్మ శాస్త్రాలలో తీపి రుచిగల పదార్ధాలు వీరికి నిషిద్దం.శ్వేతకేతు ఇది తప్పుడు సిద్ధాంతం అని తేల్చాడు.ఒకసారి జాతకర్న్యుడు అను బ్రాహ్మణుడు కాశి విదేహ కోసల రాజులకు పౌరోహిత్యం వెళ్లగా కోపించి తండ్రితో చెప్పగా పౌరోహిత్యం తెలివి తేటలను పెంచుకోవడంకోసం వెళ్ళాలి గాని భౌతిక అవసరాలకు కాదన్నాడు.
కామశాస్త్ర గ్రంధ రచన : ఇతడు నంది వ్రాసిన కామ శాస్త్ర గ్రంధాన్ని 500 అధ్యాయాలుగా సంక్షిప్తికారి౦చాడు తరువాత బాభ్రవ్యుడు మరి౦త స౦క్షిప్తి౦చెయగా దీనికి రెండు గ్రంధాలను జతపరచి సంక్షిప్తికారి౦చి తన ప్రసిద్ధ గ్రంధం కామసూత్ర రచించాడు.ఇతడు మద్యపానం,పరస్త్రీ పొందు బ్రాహ్మణులకు పాపమని ఎలుగెత్తి చాటిన మొదటి వాడు.దీనికి మహాభారతం లోని ఓ చిన్న కధ ఆధారముగా చెప్తారు.ఇతడు ఉద్దాలకుని భార్యకు వేరే అతని శిష్యుడి అక్రమసంభందం వల్ల జన్మి౦చాడు. ఆ తర్వాత తన తల్లిని వేరే బ్రాహ్మణుడు ఎత్తుకుపోయాడు.ఏకపత్ని,ఏకభర్త విధానాన్ని ఇతడు ప్రతిపాదించి ప్రచారం చేసాడు.
పురాణ నామ చంద్రిక : పుట 213 పరిశిలించగలరు. పై విషయాలే పునశ్చరణ. కాలం,శ్రమ దండుగని ఈ విధముగా తెలుపుచున్నాను.
అలాగే మరలా మరొక్కసారి నేను వ్రాసిన రెండు పోస్ట్ లు సాధికారము గా వ్రాసినవేనని గమనించ గలరు.
మన వేద,ఉపనిషత్తులు,ఇతిహాసాల్లో ప్రక్షిప్తాలు ఎక్కువ కారణం అవి ఉద్భవ కాలం నకు లిపి కాలమునకు మధ్య అనేక వందల సంవత్సరాలు ఉన్నాయని, అలాగే గత వేదకాల విద్యా విధానాలు ముఖతా, పునఃశ్చరణ విధానం లో అనేక విపరిణామాలు సంభవించాయి ఇది కూడా గమనించండి.
మన వాళ్ళు ఆ రోజుల్లో ఏమైనా కొత్త విషయం కనుగొన్న వాటికి పేరు కాని వాటి లక్షణాలు చూసి పెట్టే వాళ్ళు నా అభిప్రాయం ప్రకారం పురుష వీర్యం లోని శుక్ర కణములవలన సంతానం పుడుతున్నారు అన్న విషయం కనుగొని ఇటు వంటి విధానం పెట్టారు అన్నది నా అభిప్రాయం.
ఇక అనురాధ గారిని ఇబ్బంది పెట్టిన ఆచారం గురించి చర్చించ దలుచుకోలేదు.వాటి మీద చర్చ సోదరి మణులకు ఇబ్బంది గాను, అదుపు తప్పు తుంది కనుక ఎవరు ఏమనుకొన్న ఆవిషయం మీద చర్చ చేయను. నా వద్ద వాదనకు సరి పోను సమాచారం వున్నది కాని మౌనమే నా సమాధానం. వారి వారి బుద్ధి,కర్మలనుబట్టి వారి వద్దకు ఆ ప్రశ్నలకు సమాధానం లభిమ్చుతు౦ది.అప్పటి వరకు ఓ౦ నమో నారాయణ ఆశ్రయం.
http://archive.org/stream/puranicencyclopa00maniuoft#page/780/mode/2up
పై లింక్ నందు ఆంగ్లములో పురాణిక్ ఎన్ సైక్లోపీడియా లో కూడా శ్వేతకేతు తాలుకు వివరము ఉన్నది.ఆసక్తి వున్న వారు ప్రయత్నించండి.
6, జులై 2012, శుక్రవారం
కాలమహిమ
కాలమహిమ ఈ విషయము ఎవరికైనా అనుభవములోకి వస్తే కాని తెలియనిది. ఎంత గొప్ప వారైనా ఈ విషయములో తల వంచవలసినదే అందుకు తార్కాణమే ఈ పద్యం.ఇది శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రీ గారి కృషిఫలితముగా వెలువడిన చాటుపద్య మణిమంజరి లోనిది.
శ్లో!! రామో దారవియోగ్య బధ్యత బలి శ్చోరో హతశ్శూద్రకః
ధ్వాంక్షశీఖలు విక్రమార్క నృపతిర్ధర్మోవనం ప్రస్థితః
చండాలాశ్రయ దూషితో బత హరిశ్చంద్రో జగద్వల్లభః
ప్రాప్తేకాలవశే విధిర్ బలయుతో ధిగ్ధిగ్వృధాపౌరుషము .
రాముడికి భార్యా వియోగం కలిగింది. బలికి బంధనం లభించింది.శూద్రకుణ్ణి చోరులు చంపివేశారు.విక్రమార్కుడు కాకుల్ని తిన్నాడు.ధర్మరాజు అరణ్యానికి వెళ్ళాడు.జగత్తుకు ఇష్టుడైన హరిశ్చంద్రుడు ఛండాలుణ్ణి ఆశ్రయించడంచేత దూషితుడయ్యాడు.కాలం వచ్చినప్పుడు దైవమే బలవత్తరమై పురుషాకారం వ్యర్ధం అయిపొతుంది.
ఈ విషయాలు గత 37 నెలలుగా అనుభవిస్తున్న నాకన్నా బాగా తెలిసిన వ్యక్తి ఇంకొకరు వుండరు. సమయము కానప్పుడు ప్రతి మనతో సహాయము పొందిన వారే ఎంతలా ఇబ్బంది పెడతారో అనుభవం.
నా జీవిత లక్ష్యం అని చెప్పలేను కాని నా స్వఫ్న సౌధం నిన్న ఒక్కసారి కూలి పోయింది.ఇప్పుడు నా ముందున్న సమస్యలు చెప్పలేనివి,చెప్పరానివి.25 మంది సిబ్బందితో నెలకు లక్ష రూపాయల జీతాలు ఇచ్చిన నాకు జీవనం సమరం,చదరంగం,ఆరాట పోరాటం,
అయినా నా పోరాటం ఆపను.నా ఉపిరి ఉన్నంత వరకు నా లక్షణం అయిన సహాయపడటం అనే దుర్గుణం పోదు.
నన్ను ఆదుకో అన్న వాడిని ఆదుకున్నా,ముద్ద పెట్ట గలవా అన్నవాడికి పెళ్లి కూడా చేసాను.
కాని మనుషులు కదా వారి నైచ్యం వారు చుపుకున్నారు.
కొడుకు గా నా బాద్యత నెరవేర్చా,కాని .................
ఇక కట్టుకున్న భార్య తరుపున నాటి నుంచి నేటి వరకు అడగరాదు అన్న ఇంగిత౦.అయినా నేడు బోలేడు ..........
ఇటువంటి వాస్తవ పరిస్థితుల్లో మన తోటి బ్లాగర్ adidevisetty.blogspot.in సోదర సమానుడు నా పరిస్థితులకు ప్రత్యక్ష సాక్షి వారు చేసిన సహాయం వెల కట్ట లేనిది. నేడు నా తాలుకు అస్థిత్వం నిలబెట్టే ప్రక్రియలో పాలు పంచు కున్నారు.
వారికి బ్లాగ్ ముఖతా ఉత్త ధన్యవాదాలు చెపితే చాలదు. ప్రణామాలు అయినా తక్కువే కాని మా adi సోదరుడు ఒప్పుకోడు. వారిని,వారి శ్రీమతి హిమబిందు గారిని,పిల్లలు అమ్మాయిలు ఇద్దరినీ వారి ఆరాధ్య దైవం శ్రీనీవాసుడు సదా రక్షించాలని కోరుకునుచున్నాను.

5, జులై 2012, గురువారం
గాంధీజీని ఆకర్షించిన సీత సత్యాగ్రహ లక్షణము.
గాంధీజీని మన జాతిపిత అన్నసంగతి సర్వులకు విదితమే. వారికి రామాయణభాగవతాలలొ వున్న ఆసక్తీ ఆయిన ఆత్మకధలో కూడ వున్నది.గాంధీజీకి ఈ రామాయణపఠనములో సీతకుగల సత్యాగ్రహ లక్షణము ఆయనను ఆకర్షించి భారత జాతియోద్యమానికి ఆయుధముగా ఎంచుకున్నాడు.ఆధునిక కాలములో మహాద్భుతపొరాటము చెయటమేకాదు లక్ష్యము సాధించాడు.ఈ విషయము హింది పుస్తకము ధర్మపాలన్ నందు వున్నది.ఇది గాంధిజీ సబర్మతీ ఆశ్రమము లైబ్రరీ నందు పరిశీలించా. అందలి విశేషాలు క్లుప్తముగా మీముందుకు.
రాముడు సత్యపరాక్రముడైనట్లు సీత సత్యాగ్రహస్వరూప.తానెన్ని కష్టముల్నైన నొర్చునుగాని తన నిశ్చతమునకు భంగమురానీయదు. ఎన్ని బాధలనైన సహించునుగాని తన ధర్మమునకు చిన్నమెత్తులోపమైన రానీయలేదు.ఆ వ్రతనిర్వాహణమున దేదీప్యమానముగా ప్రకాశించుచుండును.ఆ వ్రతనిర్వాహణమున తన వినయమును వీడలేదు.తన సాధుత్వమును సమసిపొనీయలేదు. తన శాంతమును చల్లారనీయలేదు.ఇట్టి సత్తువగల సత్యాగ్రహవ్రతము రామాయణమును బంగారమునకు పరీమళము కల్పించినది సత్యాగ్రహమే అనుటలో సంశయము ఎంతమాత్రము లేదు.ఇట్టి సత్యాగ్రహశక్తితో సమరము చేయబూనిన దుష్టబుద్ధియగు రావణుడు కూకటివేళ్ళతో కూలిపొవుట ఆశ్చర్యముకాదు.ఇట్లు సీతావ్రతమహత్యమువలనే చివికి క్షీణించిపొయిన రావణుని సంహరించుట రాముని కర్తవ్యపరాయణునికి ఒక లెక్కలొనిది కాదు.ధర్మప్రాణములకు దూరమయిన రావణుని తనువు నరకుటకు సీత సత్యాగ్రహ శక్తి రాముని కర్తవ్యమును సుగమమొనర్చెను.

సీత పాత్ర ద్వారా సత్యాగ్రహవ్రత శక్తి తెలుసుకున్న గాంధీజీ బ్రిటిష్ వారిపై అదే ఆయుధము ప్రయోగించాడు.రావణుడే మట్టి కరఛాడు ఇక వీళ్ళు ఎంత.
సత్యాగ్రహముతో జాతియోద్యమము నిర్మించాడు సాధించాడు.
4, జులై 2012, బుధవారం
పసుపు కుంకుమలు - పుట్టిల్లు మెట్టినిల్లు వీటిల్లో స్త్రీ కి ఏది ముఖ్యం?
హైందవ సంస్కృతిలో పసుపు,కు౦కుమలకు వున్న విలువ ఎంత చెప్పిన తరగదు.రకరకాల కారణాలపై వీటి విలువ అపరిమితంగా వున్నది. పూజ విధానాల్లో ఇవి ప్రాముఖ్యం సంతరించు కున్నాయి.పసుపు గణపతి,కు౦కుమ పూజ ఇత్యాదివి పరిశీలన కు మాత్రమే.
అలాగే సాంఘిక జీవనములో పసుపు,కుంకుమలు అంటే ప్రతి స్త్రీ సౌభాగ్య చిహ్నాలుగా ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకం గా చెప్పవలసిన పని లేదు. కొద్దిపాటి ఈ పసుపు కుంకుమల గురించి వోపికగా ఎంతోసేపు వ్రతాలకు,వాయినాలకు ఎంతలా ప్రయాస పడి వుంటారో అని పిస్తుంది. అలాగే ప్రతి ఆడపిల్ల కు పుట్టింటి నుంచి హక్కు గా కోరు కునేవి సిరిసంపదలు కాదు పసుపు కుంకుమలే.ఇవి ఆమె గౌరవమునకు,అస్తిత్వమునకు గుర్తు.
మరి ఇవి స్త్రీ లకే ఎందుకు వాడుతూ అంత ప్రత్యేకత గా చెపుతున్నారు.
ఆడ పిల్లకు పెళ్లి అయి పాతిక సంవత్సరాలు గడచినా పుట్టింటి ఆశ పోదు, పోరాదు. కారణం అది ఆమె వ్యక్తిగత గుర్తింపు.భర్త తో కూడా చెప్పని మాటలను తల్లి తో పంచుకుంటారు.తన సుఖ,దుఖాల్లో మేమున్నాము అనే నమ్మకం, భరోసా పుట్టిల్లు నుంచి ఆమె అవిచ్చనంగా కోరుకుంటుంది.తన బాల్యం,తన ఆట,పాట అన్ని ఆ ఇంటి తో ముడి పడ్డాయని తన పిల్లలకు తన బాల్య ముచ్చటలు గా చెప్పి తన అనురాగాన్ని సదా బిడ్డలకు చెప్పుతూ వుంటుంది. చిన్న వేడుక చేసినా,పెళ్లి, పేరంటాలకు ఇలా అన్నింటికి ఆమె ముందల తన మనస్సులో ఉంచుకునే పేరు పుట్టిల్లు. అందుకే ఆమె కార్యక్రమం ప్రారంభ లగాయత్తు తన వారి కోసం ఆరాటంగా కళ్ళలో వత్తులు వేసుకుని గుమ్మం వంక చూస్తుంది.తన చుట్టూ ఎందరు వున్నా తన పుట్టింటి వారు వుంటే ఏనుగు అంబారి ఎక్కినంత సంబరం,దేవే౦ద్ర పదవి దక్కిన ఆనందం. ఇంత,ఇన్ని ప్రత్యేకతలు వున్న పుట్టిల్లు ఆడవారికి "పసుపు" రూపంలో గుర్తించాలి.
పసుపు భూమినుంచి లభించే కొమ్ముల నుంచి వస్తుందని. సీతమ్మ వారు కూడా భూమి నుంచి పుట్టినదని.పార్వతి గిరి పుత్రిక అని . అలాగే ప్రతి పూజలో పసుపు గణపతి తన బాల్యం జ్ఞాపకాలు గా భావిస్తుంది. తన పుట్టిల్లులో నేర్చుకున్న మంచి,మర్యాద మన్ననలు ఆమె అత్తింట గౌరవాన్ని పెంచుతాయి అన్నది నిర్వివాదాంశం.పసుపును
పాదాలకు,మంగళసూత్రం నకు ,స్నానంలో ముఖం నకు వాడుతారు. పాదాలు నీ చిన్న నాడు నేర్చుకున్నవోర్పు,వొద్దిక,అణుకువ, జ్ఞానం నిన్ను జీవితాంతం నిలబెట్టాలని,మంగళ సూత్రం ఏ విషయమైన గుండెల్లో నే వుంచుకోవాలని, ముఖమునకు ఎన్నడు తన వ్యక్తిత్వం,అస్తిత్వం నిలబెట్టుకోమని ఇలా పసుపు వాడతారు.
ఇక వధువుగా మారి భర్తతో అత్తింట అడుగు పెట్టి తన జీవితం మొత్తం ఇక్కడే గడుపుతుంది.పిల్ల పాపలతో చల్లగా వుంటుంది. భర్త తో అనురాగం తో వుంటుంది.ఈ మెట్టినిల్లు కుంకుమతో సూచన చేయాలి.
కుంకుమ భర్తకు చిహ్నం. స్త్రీ కి ఎంతో ప్రియమైనది తన భర్త యొక్క ప్రేమ అనురాగం. ఎంతో వత్తిడి లో వున్న ఆమె భర్త, ఆమెను దర్శించినంతనే స్వా౦తన పోంద బడే ముఖ ప్రసన్నత ఆమె సొత్తు. మరి ఇందులో ప్రముఖ పాత్ర వహించేది ఆమె నుదుట కుంకుమ బొట్టు.అందుకే అమ్మవార్లకు కుంకుమ పూజలు ప్రత్యేకంగా చేసేది .మరి ఇంత ప్రాముఖ్యం వున్న కుంకుమ ఈ రోజుల్లో స్టిక్కర్లుగా మారి పోయింది.
ఇంకో గమత్తు గమనించారో లేదో కాని పసుపు కుంకుమ గా మారుతుంది. పసుపునకు కొన్ని ప్రత్యేక ద్రవ్యాలు కలిపి కుంకుమ తయారు చేస్తారు. అంతే కాని ఏమి చేసిన కుంకుమ పసుపు కాదు.
మరి పుట్టింటి ఆడపిల్ల, ఇల్లాలు గా మారుతుంది అనేది దీనికి సూచన.
మరి అందుకే ప్రతి స్త్రీ మూర్తి ఈ రెండిటికి అంత విలువ ఇచ్చేది.
ఇవి నా ఆలోచనలు మాత్రమే. శాస్త్ర ప్రమాణాలు గట్రా అంటే ఏమి లేవు.
ఇవి ఇంతలా వ్రాయటానికి కారణం మొన్న ఆదివారం నాడు నా శ్రీమతి మహాలక్ష్మి ఎదుర్కొన్న స౦క్షోభం, అందుకు ఆమె దుఃఖ నివారణకు నేను అనేక రకాల వోదార్పు ప్రక్రియలో భాగం గా అనేక మాటలు. వాటిల్లో కొన్ని నా బ్లాగ్ సోదరి మణులకు పనికొస్తాయని. అలాగే సోదరులారా ఇది గమని౦చి మీ సోదరి మణులపై ఆదరఅభిమానాలు ,ప్రేమ ను రెట్టింపు చేయండి. ఆమె కోరుకునేది ఈ రెండు మాత్రమే. కాని సదా మీరు మీ పరివారం మొత్తం బాగుండాలని కోరుకునే వాళ్ళు మీ ఇంటి ఆడపడుచులు.ఇది ఓ విజ్ఞప్తి.
3, జులై 2012, మంగళవారం
NTR Vs Babu Vs YSR ప్రభుత్వ పధకాలు.- ప్రతి ఒక్కరు చదవ వలసిన కధనం.!
ప్రజల చేత ప్రజలకొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల మనుగడకు, ప్రజాస౦క్షేమానికి ప్రతి ప్రభుత్వ౦ కొన్ని పధకాలను అమలు చేస్తు౦ది. ఈ పధకాల సార్వజనీనత,విశ్వసనీయత,పధకాలు చివరి దశ వరకు చేరే తీరులోనే ప్రభుత్వాల మనుగడ ఆధారపడి వున్నది అంటే ఆశ్చర్యం లేదు.వీటికి అదనంగా ప్రభుత్వ అధినేతల వ్యక్తిగత ఆలోచన సరళి,సమాజ౦ పట్ల వారి అవగాహన తో పాటు వారి చరిష్మా మరియు ప్రభుత్వ మనుగడ,ప్రజాసంక్షేమం ఆధారపడటం తో అన్ని వర్గాలకు వీటిపై ఆసక్తి.ఈ పధకాల అమలులో బ్యురోక్రసి మరియు కాంట్రాక్టర్స్ ప్రమేయం ఎక్కువైన కొద్ది వీటికి గ్రహణ౦ పట్టిస్తారు.అలా మన రాష్ట్రంలో ప్రజాసంక్షేమానికి పేరు పడ్డ మూడు ప్రభుత్వాల తీరు తెన్నులపై నాకు తోచిన కొన్ని మాటలు.
ప్రభుత్వపధకాల రూపకల్పన లో NTR,YSR ఇరువురిది ఒకే స్వభావం.ప్రజల అవసరాలను గమనించి కాని, ప్రజలలో వున్నప్పుడు ఉత్తేజం చెంది దీనికి అనుగుణంగా అప్పటికప్పుడు ఏదో ఒక పధకం ప్రకటించి ప్రజల హర్షం పొందేవారు.ఇటు వంటి పధకాలు ల్లో NTR దే అగ్రతాంబూలం.NTR,YSR ను పోలిస్తే NTR చాలా ఉత్తమం.
NTR స్వతహాగా ఆవేశపరుడు,భోళ మనిషి. తనను తాను దైవా౦శ వున్నవాడి గా భావిస్తారో,కృష్ణుని వేష ప్రభావం వలన తాను గజేంద్రమోక్షం లోని విష్ణువు అనుకోనే వారు ఏమో తెలియదు కాని కొన్ని పధకాలు అప్పటికప్పుడు ప్రకటించే వాడు.కాని అమలులో అధికారులు పడరాని పాట్లు పడే వారు.కాని NTR కున్న వ్యక్తిగత చరిష్మా వలన ఆపధకాలు అప్పటికే ప్రాచుర్యం పో౦దేవి.కాని అధికారులు సక్రమంగా నిధులు కేటాయించక,కేటాయించిన నిధులు సక్రమ వినియోగం చేయక పధకాలను ప్రక్క దారి పట్టించే వాళ్ళు.కారణ౦ ఈ పధకాల అమలులో వాళ్ళ పాత్ర తక్కువ ప్రజల ఆవసరాలు,ప్రజల లాభాలు ఎక్కువ దీని వలన వాళ్ళకు అ౦దవలసినది అ౦దక పధకాల ప్రక్కదారి.
ఏది ఏమైనా ప్రభుత్వాలకు కావలసినది ప్రచారం. అది NTR తో పుష్కలంగా జరిగేది.అయిన 'వారుణి వాహిని', 'న౦దమూరి తారకరామ సాగర తీర అరామ౦' లాంటి డాంబిక పేర్లు ఎన్నుకోనేవాడు.అచ్చ తెలుగు పేర్లతో హడావుడి చేసేవాడు.
కాని బాబు దీనికి పూర్తిగా రివర్స్. కాంగ్రస్ దళారి వ్యవస్థ కుదురులొ౦చి వచ్చిన వాడు బాబు.ఎంత మామను వెన్నుపోటు పొడిచి అధికారం,పార్టి కబళించిన తన సహజ దళారి తనాన్ని వదులుకోలేక పోయాడు.అందుకే NTR
హయంలో పారశ్రామిక వేత్తలు అ౦దరు బాబు వెంట పడటంతో బాబు హవా నడచినది.అందుకే బాబును ఆరోజుల్లో కొన్ని మీడియాలు percentage babu గా వ్యవహరించాయి.ఈ విషయం దగ్గుబాటి తన రచనల్లో తెలిపాడు.NTR తన ఆఖరి ప్రస౦గాల్లో ప్రస్తావించాడు.ఇది బాబు నైజం.అటువంటి బాబు పధకాలు ఎలాగు౦డేవి అలాగే వుండేవి.NTR ప్రభుత్వంలోని పధకాల లోటు పాట్లు గమనించిన బాబు NTR లా ప్రజల్లో నిర్ణయాలు కాకుండా ము౦దస్తుగా అధికారులతో చర్చించి,పార్టి వర్గాలను సంప్రదించి, పార్టి సిద్ధాంతాలకు అనుగుణంగా అంటూ ప్రకటించేవాడు.అన్నట్లు బాబు హాయంలో పార్టి సిద్ధాంతాలు అనేది పెద్ద జోక్. వ్యక్తుల ఆవసరాలను,వ్యక్తుల మనస్తత్వాలను తనకు అనుగుణంగా మార్పు చేస్తూ,స్వలాభాన్ని చూసుకుంటూ అవి పార్టి సిద్ధాంతాలుగా భ్రమింప చేసేవాడు.ఈ కళలో బాబు దిట్ట. అందుకే బాబు management నిపుణుడు అనే వాళ్ళు.
ఇలా పై వ్యవస్థలో తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ground realities కు వ్యతిరేకంగా.సామాన్య ప్రజల అభిమానం
చూరగోనేవి కాదు.అందుకు పెద్ద ఉదాహరణలు బియ్యం పధకాలపై ధరలు,విద్యుత్ ధరలు,వ్యవసాయ రంగ ప్రోత్సాహం.సహకారరంగ వ్యవస్థను భ్రష్టు పట్టించిన తీరు.పాలసరఫరా వ్యవస్థలను నాశనం చేసి వాటి పునాదులపై సొంత పాల డైరి వ్యాపారం పెంపు.అసలు బాబు గ్రామీణ ప్రాంతం వాడు,విద్యార్ధి వ్యవస్థ నుంచి నాయకుడుగా ఎదిగి రాష్ట్ర అత్యున్నత పదవి అలంకరించిన ఈ రెండిటిని బాబు నమ్మలేదు. సరి కదా వ్యవసాయం దండుగ అన్నాడో లేదో తెలియదు కాని ప్రచారంలో మాత్రం వున్నది.అలాగే విద్యాసంస్థల్లో ఎన్నికలు నిషేది౦చాడు.పార్టిలో విద్యార్ధి విభాగం రద్దు చేసాడు.అలాగని బాబు అన్ని తప్పులు చేసాడని అనలేము.యువజనులు పెరుగుతున్నారని గణాంకాలు తెలుపుటతో అందుకు అనుగుణంగా సాంకేతిక విద్యను ప్రొత్సాహి౦చాదు.సాంకేతిక సంస్థలను ఆహ్వానించాడు.దీనితో అప్పటి వరకు యువజనులు ఉద్యోగం కోసం బయటకు వెళ్ళటం తగ్గి స్వరాష్ట్రంలోనే పొందగలిగారు. పెద్దజీతాలు లభించటంతో ప్రభుత్వ ఉద్యోగాలకన్న ఈ మార్గ౦ పట్టి సుఖపడ్డవాళ్ళు ఉన్నారు.ఈ కేటగిరిలో మధ్యతరగతి వాళ్ళు నగర వాతావరణం లో పెరిగిన వాళ్ళు లాభ పడ్డారు.అందుకే దేశం పార్టి ఆనాడు నగర వ్యవస్థలు చురుకుగా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో స్వంత కార్యాలయాలు ఏర్పరుచుకునే స్థాయికి వెళ్లాయి.అదే సమయములో చేతి వృత్తులు కునారిల్లటం,రాష్ట్రంలో రెండొవ ప్రధాన వృత్తి అయిన చేనేత కాలపరంగా అనాదరణ పొ౦దితే ఇందుకు తగ్గ ప్రభత్వ ప్రోత్సాహం లభించక ప్రతి రోజు ఆత్మహత్యల లెక్క ఈనాడు పత్రిక లెక్కించే స్థాయి లో వుందంటే పరిస్థితి ఎంత దారుణంగా వున్నదో ఉహించ వచ్చు.కాని ఈ కసరత్తులు,హాడావుడులు లను ప్రజలకు అనుగుణ౦గా లేక పోవటంతో చాల పధకాల పట్ల ప్రజలకు నిరాసక్తి.ఈ విషయంలో బాబు అధికారుల మాట మన్నించాడు.బాబు నేను పని చేస్తున్నాను,మీరు కూడా కలసి పనిచేయండి,ప్రజలు ప్రభుత్వం భాగస్వామి గా వుంటే అభివృద్ధి సాధ్యం అనే పలుకుల నేపధ్యం తో జన్మభూమి పధకం ప్రవేశపెట్టాడు.ప్రారంభములో ఈ పధకం బానే వుండి చెరువులు,కాలువలు పూడిక తీయటానికి,తూడుకర్ర,గుర్రపుడెక్క,గట్లు సరి చేయటం ఇత్యాది పనులకు ప్రజలు ఉత్సాహ పడిన రెండు రోజులకే స్వంత పనుల ఆవసరరార్ధం పోయేవాళ్ళు.అసలు బాబు వర్గాలకు కావలసినది ఇదే.దీనితో బాబు తాలూకు కాంట్రాక్టర్ వ్యవస్థలు ప్రవేసించి సగం ఆపిన పనిని జన్మభూమి ముసుగులో అధిక ధరలకు చేసేవాళ్ళు.దీనితో గ్రామగ్రామన దేశం పార్టి నాయకులు కాంట్రాక్టర్స్ గా మార్పు చెంది కోట్లు సంపాదించారు.ఇవి అన్ని నాటి ప్రతి పక్షాలు ఎ౦డకడుతూనే వుండేవి.గ్రామాల్లో అణా,కాణి ఆస్తి లేని దేశం పార్టి వర్గాలు కొద్ది రోజుల్లో కోట్ల విలువ చేసే ఆస్థులు,కార్లులో తిరగటం చూసి కాంగ్రేస్ వర్గాలకు కళ్ళు కుట్టినవి.ఆవకాశం కోసం ఓపికగా గోతికాడ నక్కాల్లా ఎదురు చూసారు.YSR రూపంలో వాళ్ళకు బంగారం లాంటి ఆవకాశం రావటంతో మీద పడి అందుకున్నారు.
YSR ఫ్యాక్షన్ రాజకీయాలు,రాబిన్ హుడ్ తత్వాలు, క్రైస్తవ సేవ భావాలు ఇలా అనేకం కలగాపులగం లా కనిపిస్తాడు.YSR తనను ఆశ్రయించిన,నమ్మిన వాడికి కడదాక ఏదో చేయాలనే తపన వున్న వ్యక్తి.ఈ ఒక్క సుగుణమే YSR అనే ఆరాధన భావమునకు కారణమయినది.YSR మొదట్లో దూకుడుగాను.అసమ్మతి వాదిగాను ముద్రపడిన వ్యక్తి వీటి వల్ల తాత్కాలిక లాభమే కాని తన అంతిమ లక్ష్యం అయిన ముఖ్యమంత్రి పదవికి దూరం చేస్తున్నాయని సమూలంగా మార్పు చెందాడు.దీనికి పెద్ద ఉదాహరణ శాసన సభలో నాకు కోపం నరం తెగిపోయిందని వ్యాఖ్య,తన నవ్వుతో బాబును ఉడికించటం.అలాగే YSR క్రైస్తవ మిషనరి సేవా భావాన్ని అనుసరి౦చేవాడో,అనుకరించే వాడో తెలియదు కాని ఈ రెండిటిలో ఒక్కటి చేసేవాడు.
ఇక ప్రభత్వ పధకాల వద్దకు వచ్చే సరికి YSR తన ముందు వున్న కాంగ్రేస్ పధకాల సరళిని కాదని,ఇందిరాగాంధీ,రాజీవ్ విధానాల ముసుగులో స్వంత నిర్ణయాలు,తెలుగు దేశం విధానాలు ఆచరించాడు.కారణం ఇవి కొంత ప్రాంతీయ లక్షణాలను కలిగి వుండటమె.మరలా దీనిలో NTR + బాబు ఇద్దరినీ కలిపి,తన ఆలోచనలతో తనదైన ఒక కొత్త ప౦ధా ప్రవేశ పెట్టాడు.
YSR కూడా పధకాలు ప్రజల్లో ప్రవేశ పెట్టటానికి ఇష్ట పడే వాడు.దాదాపు అందుకు అనుగుణంగా నిధుల కేటాయింపులు జరిగేవి.ఒక వేళ ప్రజల కోసమయిన ప్రజల భాగ స్వామ్యం లభించని ఆరోగ్యశ్రీ వంటి పధకాలకు నేరుగా కార్పరేట్ వర్గాలను ప్రవేశ పెట్టిప్రజలకు ఆలంబన,వ్యాపార వర్గాలకు ఆవకాశలతో దళారీ వ్యవస్థ పెంచాడు.
ఉచిత విద్యుత్ పధకం,బియ్యం పధకం సాధ్యసాధ్యాలను తాను అధికార పోరాటంలో వున్నప్పుడే సర్వే చేయించి,ఫలితాలు సరి చూసుకొని,ప్రజలకు ప్రకటించి,విజయం సాధించి న తరువాత అమలు చేసాడు.
YSR తన పాదయాత్రలో సామాన్య ప్రజలకు ఇంకను వ్యవసాయ రంగం ఆవసరం ఎంత వున్నది గ్రహించాడు.ఈ రంగానికి ప్రాధమిక అవసరాలయిన భూమి,నీరు,ఎరువులు,విత్తనాలపై ఆవగాహన వుండుటతో రాష్ట వ్యాప్తంగా పడావు గా వున్న భూమిని సాగులోకి తీసుకు' రావాలని విస్తృతంగా జల పధకాలు ప్రవేశ పెట్టాడు.దాదాపు ఈ పధకాలన్ని నెలకు ఒకటి చొప్పున ప్రవేశ పెట్టబడ్డాయి.ఈ పధకాల అమలు త్వరితంగా కావాలని విస్తృతంగా కాంట్రాక్టర్ వ్యవస్థలు ప్రవేశించి ప్రజాధనం దోచుకోబడినది.కాంగ్రేస్ స్కంధవారాలకు YSR అనే వాడు దేవుడైనాడు.ఇంతలో ప్రభుత్వ ఆదాయం పెరగటంతో ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఫించిన్ పధకాలు.అణగారిన వర్గాలకు ఇంకను సాంకేతిక విద్య,ఉన్నత విద్యలు భారమై దూరమవుతున్నాయని అనే కారణం ముసుగులో ఫీజు రీ ఎ౦బర్స్ పధకం ప్రవేశ పెట్టాడు.అసలు కారణం విపరీతంగా వున్న కాలేజిలు చేరే వాళ్ళు లేక నిర్వాహణ ఖర్చులు రాక ఈ మార్గం పట్టించాయి.
అత్త సొమ్ము అల్లుడి దానం లా ప్రజల సొమ్మును దాన౦ చేశారు,దోపిడీ చేశారు.
గమనిస్తే బాబు మరియు YSR దోపిడీ చేయటంలో ఒకే తీరు కాక పొతే పద్ధతులు,వ్యక్తులు మార్పు అంతే.
అ౦తిమ౦గా మోసపోయేది,పోయింది,మునిగేది,మునిగింది ప్రజలే.
గొర్రెలు ఎప్పుడు కసాయి వాళ్ళనే నమ్ముతున్నాయి.
కొత్తా దేవుడండి కొంగ్రొత్త దేవుడండి
జగన్ గారు కొత్త దేవుడండి
దిక్కుయి మొక్కయి దోచేట౦దుకు
ఓదార్పు యాత్ర చేస్తాడండి
వస్తే గిస్తే మా భవిష్యత్ మొత్తం
దోచేనండి,మాకు సున్నా ఏమో మిగిలేనండి
పిల్లా దేవుడండి బాబు బుల్లి దేవుడండి
లోకేష్ బాబు వచ్చెన౦ట అండి
వస్తే గిస్తే ఇచ్చేనండి నగదు బదలి పధకాల
పప్పు బెల్లాలు సిద్ధం అండి
కొత్త బలి పశువులం మెమేనండి!
కాబట్టి ప్రజలారా ఎవరు వచ్చినా సర్వే జనా "ఖానో" భవంతు, సర్వే జనా "ఖూని" బృవంతు.
ఓం ఇతి సుత్తి ముగి౦తు.

2, జులై 2012, సోమవారం
ధర్మసంస్థల అధికారులు అవీనితీకి పాల్పడితే మరు జన్మకు ఏమవుతారు?
శ్లో II
పౌరోహిత్యం రజనిచరితం గ్రామణీత్వం నియోగో,
మఠాపత్యం హ్యనృతవచనం సాక్షివాదః పరాన్నం,
బ్రహ్మద్వేషః ఖలజరతిః ప్రాణినాం నిర్దయత్వం,
మభూ దేవం మమ పశుపతే జన్మజన్మాంతరేషు.
ఓ పశుపతీ ! పౌరోహిత్యము, జాగరణము, గ్రామాధిపత్యము, నియోగము, మఠాధిపత్యము, అసత్యవాదిత్వము, సాక్షిగ బోవుట, పరాన్నభోజనము, బ్రాహ్మణ ద్వేషము, దుష్టసాంగత్యము, నిర్దయత్వము - యివి నాకు జన్మజన్మాంతరములకూ కలుగనీయవద్దు, స్వామీ !
ఈ శ్లోకాన్ని బలపరిచే కధ ఓకటి ఉత్తరరామాయణములో వున్నది.
ఓకనాడు శ్రీరామచంద్రుడు సకల మంత్రి,సామంత,సేనానాయక,దండనాధ,సకలదేశప్రజా సమూహలాతో సభతీరి వున్నాడు.అంతలో కొలువులోకి ఓక కుక్క రక్తముతో,వళ్ళుంతా గాయలతో పాహిమాం రామచంద్ర పాహిమాం అంటూ ప్రవేసించింది.రామరాజ్యములో ధర్మముతప్పటానికిగాని,ఇటువంటి అమానుషత్వానికిగాని చొటులేదు.కాని జరిగింది. విచారాణ జరిగింది. నిందితుడు నేర నిరూపణ అయినది.శ్రీరాచంద్రుడు తీర్పు ఇవ్వాలి.శ్రీరాముడు జరిగింది పూర్తిగా పరిశీలించి అన్యామునకు గురి అయినదని మరియు సాధారణ జంతువని అతనికి శిక్ష విధించాలి ఎమి నీ అభిప్రాయమని కుక్కను ప్రశ్నించారు.ఆ సమయములో కుక్క రామచంద్రుని అయ్యా! నన్ను గాయపరచిన ఈ వ్యక్తిని ఫలానా ధర్మసంస్థకు అధికారిగా నీయమించగలరు.ఈ కొరిక విన్న శ్రీరాముడు మాత్రము మందహాసము మిగతా సర్వజనకొటీ ఆశ్చర్యమునకు లొను ఆయి. ఓశునకరాజమా! నీవు అడిగింది వానికి దండనకాదు,సత్కారములా వున్నది అన్నారు.అప్పుడు ఆకుక్క నాయానలార మీరు ఇలా ఉహించటములో ఎమి పొరపాటు లేదు.కాని నేను అదే ధర్మ సంస్థకు గతజన్మలో అధికారిగా వుండి, అక్కడవున్న పరిస్థితుల ప్రాబల్యము వలన నేను కొద్ది అవినీతికి పాల్పడ్డాను అందుకే నాకు ఈ శునకజన్మ వీనికి కూడా ఈజన్మలోని లొటుపాట్లు తెలియాలంటే అతడిని కూడా ఆధర్మసంస్థకు అధికారిగా నీయమిస్తే అతను పాల్పడ్డ అవీనీతీ వలన మరుజన్మలో కుక్కగా పుట్టి ఈజన్మ తాలుకు హీనస్థితి తెలుసుకుంటాడు.
1, జులై 2012, ఆదివారం
సాల వృక్ష బేధనం - కృష్ణలీలా అంతరార్ధం.
పాఠక మిత్రులు గతంలో కుబ్జ,పూతన ఘట్టాలలొని అంతరార్ధము తెలుసుకున్నారు. ఇప్పుడు సాల వృక్ష బేధనములోని అంతరార్ధము పరిశీలించండి.
కుబేరుడు ఐశ్వర్యవంతుడు శివపూజా దురంధరుడు. కుబేరుని కుమారులు నలకుబేరుడు,మణిగ్రీవుడు మాత్రము ఐశ్వర్యమదముతో సప్తవ్యసనాలకు బానిసగా వున్నారు. వారు చేయని దురాగతo లేదు. వారు ఒకనాడు వారకాంతలతో కూడి మందాకిని నదీ తీరములో నిర్లజ్జగా దిశమొలతో స్నానపానాలు, విచ్చలవిడి శృంగారము అనుభవిస్తున్నారు.అదే సమయములో నారదులవారు వైకుంఠము నుంచి నారాయణుని దర్శించి నారాయణ సంకీర్తనా గానముతో అటువైపుగా వస్తున్నారు. సంకిర్తనా గానము విన్న మహిళలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డవారై అక్కడవున్న ఆకులు, అలములు, వీలయిన వారు తమ వస్త్రాలను తమ దేహ భాగాలకు కప్పుకున్నారు.కానీ నలకుబేరుడు,మణీగ్రీవులు సురాపనముతో మత్తెక్కి ఎవరో ఎమిటో కూడా గమనించక అలాగే నగ్నముగా నారదుల వారిని అవహేళన చేసారు. దానితో అగ్రహో దగ్రుడైన నారదులు మీరు సాలవృక్షాలుగా జన్మించమని శాపము ఇచ్చారు. దానితో వారికి ఓక్కసారిగా మత్తు దిగినట్లయి నారదుని కాళ్ళమీద పడి తమ తప్పుని వొప్పుకోని క్షమించమని ప్రార్ధించారు. దీనితో నారదుడు శాంతించి శాపవిమోచనము మాత్రము తెలుపుతాను తప్పుకు మాత్రము శిక్ష ( శాపం) అనుభవించవలసినదే అని తెలుపగా. వారి కొరిక మీదశాపవిమోచనముగా ఈ విషయము తెలిపినారు. ద్వాపరయుగములో శ్రీమన్నారయణుడు కృష్ణునిగా జన్మించనున్నారు వారిద్వారా మాత్రమే మీకు విముక్తి అని తెలిపినారు. దానితో నలకుబేరుడు,మణీగ్రీవుడు ఇరువురు గోకుల ప్రాంతములో సాలవృక్షాలుగా జన్మించి కృష్ణునిద్వార శాపవిమొచనమునకై నిరిక్షణ చేస్తూ ప్రార్ధించసాగారు.
ద్వాపరము వచ్చినది శ్రీమన్నారాయణుడు దుష్టశిక్షణార్ధము శిష్టరక్షణార్ధము కృష్ణునిగా జన్మము అపై గొకులమునకు రాక.
బాలకృష్ణుని లీలావైభవములు ఏక్కువ అవుతున్న కొద్ది యశోదకు ఆందోళన తనబిడ్దడు ఎమవుతాడో అన్న భయము. పాపం అమెకు తెలియదు కదా తనవద్ద వున్నది,లోకపావనమూర్తి,లోకకళ్యాణమూర్తి,సర్వజనరక్షకుడని. తను తల్లికాబట్టి సహజమయిన మాతృత్వ మమకారానికి లోనై భయాందోళనకు గురి అవుతుంది.
ఓకనాడు గోకులం లోని స్త్రీలందరు యశోద వద్దకు వచ్చి బాలకృష్ణుని అల్లరి గురించి రచ్చచేస్తారు. దీనితో యశోద కృష్ణుని ప్రక్కనే వున్న రోటికి ఒక త్రాడుతో కట్ట నిశ్చయించి త్రాడుతో కట్టటం ప్రారంభించినది కాని స్వామీ వారి లీలలు వల్లన ఆత్రాడు చాలదు ఇంకో త్రాడు తెచ్చిన అది కూడాఅలానే, ఎన్ని తెచ్చికలిపి కట్టినా కొద్దిగా తక్కువ దీనితో యశోద కన్నా నా వల్ల కాదు అని బాధ పడుతుంది దీనితో స్వామి తన మాయ ఉపసంహరణ. ఇక త్రాడు సరిపోయి స్వామీ రోలుకు బంధించ బడ్డాడు. యశోద కన్నయ్యకు బుద్ధిగా వుండు ఇది నీకు శిక్ష అని తెలిపి గృహ కార్యనిమిత్తము వెళ్ళుతుంది. అమే అలా వెళ్ళగానే బాలకృష్ణుడు త్రాడుని రోటితో సహ లాగుకుంటూ ప్రాకుతూ పెరటిలోనికి వస్తాడు అక్కడ ఏనాటినుంచో రెండు సాలవృక్షాలు (మద్దిచెట్లు) వున్నాయి ఇవి ఆకాశమంత ఎత్తు,నలుగురుమనుషులు తమ చేతులు బార్లాచాపి చెట్టుమ్రాను కౌగిలించుకున్నా సరిపోని కైవారము చుట్టుకోలతగావున్నది.ఇవి రెండు ప్రక్కప్రక్కనే వున్నాయి . బాలకృష్ణుడు ఈ రెండు సాలవృక్షాల మధ్యకు రోటితో సహ వెళ్ళాడు. రోలు రాలేదు అంతే బాలుడు ఒక్కసారిగా రొలుతో ఆవృక్షాలను తాటించగా ఆ వృక్షరాజములు రెండు ఫెళఫెళమని నేల కొరిగినవి.అందునుండి ఇరువురు దివ్య పురుషులు వచ్చి స్వామికి నమస్కరించి.తమను నలకుబేరుడు,మణీగ్రీవుడుగా పరిచయము చేసుకోని శాప వృత్తంతము తెలిపి, స్వామిని ప్రార్ధించి ఆకాశమార్గాన వెడలిపొయినారు. ఈ వృక్షముల శబ్దమునకు లోపల వున్న యశోద ఓక్క పరుగున వచ్చి తన కన్నయ్యను తీసుకొని పెద్ద ఆపద తప్పినదని ముద్దులాడసాగినది.
ఇంతవరకు భాగవతములొ ఈ ఘట్టము వున్నది.
అంతరార్ధము : స్థిరముగా వుండే సాలవృక్షాలు మనిషిలో స్థిరముగా వుండే నేను,నాది అనే లక్షణాలు అహంకారానికి చిహ్నం.అందుకే నిట్టనిలువుగా పెరిగే సాలవృక్షాలనే వ్యాసులవారు ఎంచుకొన్నారు.అలాగే మీకు తెలిసినదే వృక్షము ఎంత ఎత్తుకు పెరిగితే దాని వ్రేళ్ళు భూమిలో అంత బలముగా వ్యాపించి వుంటాయి అన్న సంగతి .అనగా మనము నేను నాది అనే అహoకారము ఎంత ఎక్కువగా చూపుతామో అంత ఎక్కువగా జన్మజన్మల ప్రారబ్దకర్మఫలము వృక్షములా స్థిరముగా వుండి జీవుడు ఇక్కదే వుండి మోక్షమార్గము పట్టడు.
ఈ అహంకారం సాధారణముగా ఎప్పుడు కలుగుతుంది. వీపరీత ధనం, అంతకుమించి ప్రాపంచిక విషయానురక్తుల వలన కలుగుతుంది. దీనికి సూచనగా దివ్య పురుషులు కుబేరుని పుత్రులగాను, వ్యసనపరులుగాను వుంటారు.వాళ్ళ పేర్ల లోనే వాళ్ళ బుద్ధులు కూడా సూచించారు.
నల అనగా సంస్కృతమున వాసన,గంధము అనే అర్ధాలు వున్నాయి. అనగా నలకుబేరుడు. మరి చూడండి కుబేరుడి కోడుకు కాబట్టి ధనమధాంధుడని అర్ధము. రెండొవ వాని పేరు మణిగ్రీవుడు దీని అర్ధము చూడండి మణి అంటే భూమినుంచి తీసిన ఒకరాయి అని అర్ధము.(సాధరణముగా మణి అంటే విలువైనదిగా భావిస్తారు కాని భూమినుంచి తీసిన రాయికి సానపెట్టి అది రత్నమా,నీలమా అని విలువ కడతారు. ముడిగా వుంటే మణిగానే పిలుస్తారు.ఇది నాకు తెలియదు చాటుపద్య మణిమంజరి పిఠికలో ఆరుద్రగారు తెలిపారు)గ్రీవము అంటే కోమ్ము.రాయి లాంటి ఆహంకారానికి కొమ్ములు కూడా వచ్చాయి అని అర్ధము.మరి వారి ప్రవర్తన కూడ నారదుల వారితో అందుకు తగ్గట్లుగా వున్నది. కాబట్టి శాపము పొందారు అనుభవించారు. చూసారా వ్యాసులవారు వీళ్ళ పేర్లతో బుద్ధులు,ప్రవృత్తులు తెలుపుచున్నాడో.

మరి జీవునికి కింకర్తవ్యం! మరి అందుకే కృష్ణుడు బహు చక్కని మార్గము సూచించాడు.
కృష్ణుడు,నారాయణ రూపుడని,నారాయణుడు పరామాత్మ స్వరూపమని మీకు తెలుసు. అలాగే బాలకృష్ణుడు మన మనస్సుని సూచిస్తాడు.రోలు నిశ్చల భక్తికి సంకేతం.మనస్సుకి నిశ్చల భక్తిని ముడివేసి అహంకార, మమకారాలను కూల్చండి. అప్పుడే మీలోని దివ్యత్వము బయటకు వస్తుంది. అదే శాప విమోచనము.
ఇదే భగవతత్వము.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)