13, జులై 2012, శుక్రవారం

అవతారం లు ఎన్నివిధములు? - వివరణ!.


అవతారశబ్దం 'అవ ' ఉపసర్గ ముందు గల 'తౄ' ధాతువుకు 'ఘట్' ప్రత్యయం చెరగా ఏర్పడినది.'అవే తృస్త్రర్ఘజ్' అనే పాణినీయ సూత్రం ప్రకారం 'ఘజ్' ప్రత్యయం చేరటంతో అవతార శబ్దం సిద్ధిస్తుంది.'అవతారం' అనే శబ్దానికి ఏదైనా ఉన్నత స్థానం నుంచి క్రిందకు దిగటం లేక 'క్రియా అనికాని,'స్థానం' అనికాని దీనికి అర్ధం.ఇంతేకాకుండా పురాణాలను అనుసరించి మహాశక్తి సంపన్నమయిన ఒకానొక దైవంకాని,దేవరకాని,పై లోకం నుంచి క్రింది లోకానికి మానవ రూపాన్ని కాని మానవతేర రూపాన్ని కాని ధరించి విచ్చేయటం. ఇదే అర్ధంలో 'అవిర్భావం' అనే శబ్దం పురాణాలలో ఉపయోగించబడింది.    

తన భక్తుల భయనివారణ కోసం భగవంతుడు అప్పుడప్పుడు తన విభూతి అనగా తన ప్రభావంతో ఆ భయనివారణ చేస్తాడు. ఈ ప్రభావం పనిచేయనప్పుడు ఆయన్ అంశావతరం లేకపొతే పూర్ణావతారం ధరించి ఈ లోకసముద్ధరణ చేసి ధర్మరక్షణకోసం  అవతారం ధరిస్తాడు.అవి 1)పూర్ణావతారం  2) అంశావతారం 3) విశేషావతారం 4)ఆది శేషావతారం 5) నిత్యావతారం అనేవి.

1)పూర్ణావతారం: మానవుని లాగే తల్లి గర్భవాసంలో జన్మించి పెరిగి ధర్మరక్షణ చేయటం.ఇందులో భగవంతుని షోడశ కళలు నిండి వుంటాయి.భగవంతుడు శ్రీకృష్ణునిది,శ్రీరామునిది పూర్ణావతారం.

2)అంశావతారం: భగవంతుని షోడశ కళలలో ఎనిమిది కంటే ఎక్కువ కళలు అవలంబించబడి అవతారం ధరించినది. వామనావతారం అంశావతారం.

3)విశేషావతారం: దీక్షా సమయములో గురువు  శిష్యుని యొక్క  మనస్సులో ప్రత్యేక రూపంలో ఆవిష్కరణం చెంది ఉంటాడు. అందువలన ఆ సమయములో తన ఎదుటగల గురువు శిష్యునికి భగవంతునిగానే కనబడతాడు. అందుకే గురువు,బ్రహ్మ,విష్ణు,శివునిగా భావించబడేది. గురువు యోక్క ఈ స్థితి విశేషావతార రూపం.

4)ఆదిశేషావతారం: భగవంతుని పై భక్తునికి తీవ్రమయిన భక్తి ఆవేశం కలిగినప్పుడు ఆ భక్తుడే భగవత్ స్వరూపుడుగా భాసిస్తాడు.ఇతర సమయాలలొ అతడు సాధారణ మానవుడే.సనకాది మహమునులు, నారదాది దేవర్షులు, పృధువువంటి రాజర్షులు ఈ అవిశేష  అవతార మూర్తులుగా పరిగణింపబడతారు.అయితే ఈ స్థితి తాత్కాలికమయినది.

 5)నిత్యావతారం: మనుష్యులు అంతఃకరణంలొనే నిత్యావతారుడుగా భగవంతుడు వెలసి ఉంటాడు. సర్వవ్యాపకుడు,సర్వఙ్ఞానమయుడు,అయిన భగవంతుని యోక్క ఉనికిని సర్వచరాచర ప్రకృతిలోను ఉన్నది.అతడు అన్ని జీవుల హృదయక్షేత్రాలలోను విరాజిల్లుతుంటాడు. అందరితోను ఉంటాడు.జీవులు పాపకర్మరహితులై నివృత్తిని పొందగలుగుతారు ఇదే నిత్యావతారం.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.