30, జూన్ 2012, శనివారం

షేక్స్ పియర్ - జూలియస్ సీజర్ నాటకం కధారూపకముగ! ఇన్ని శతాబ్దములు మారిన, మారని రాజకీయ కుట్రలు! అప్పుడు అవే! ఇప్పుడు అవే!


జూలియస్ సీజర్ : రొమ్ నగర సైన్యాధిపతి, అంటోని : సీజర్ మిత్రుడు, Brutus,కేషియాస్,కాస్క : సీజర్ పై కుట్ర చేసిన రొమ్ నగర ప్రముఖులు. కాలుఫుర్నియ : భార్య.

రొమన్ సైన్యాధిపతి అయిన జూలియస్ సిజర్ మహ వీరుడు. ఎన్నొ యుద్ధాల్లొ జయించిన యోధాన యోధుడు. ఒకసారి సీజర్ విజయం సాధించి ఆఫ్రికా నుండి రొము నగరానికి తిరిగి వచ్చాడు.అంతకుముందు ఎంతొ ధనరాశులను 'పాంపే ' అనేవాడు రొము నగరానికి తెచ్చాడు నేడు అదే 'పాంపే' కుమారులను చంపిన సీజరుకు స్వాగతం పలుకుతున్నారు,జేజేలు పలుకుతున్నారు.అప్పటికి రొము గణతంత్ర రాజ్యం.ప్రజలే పాలకులను ఎన్నుకునేవారు. పాలక వర్గంలొ ముగ్గురు ప్రముఖులు వుండేవారు.వారిని అధికారత్రయం అనే వారు.ప్రజలకు న్యాయాధికారులుగా కొందరిని ఎన్నుకొనెవారు. వీరిని ట్రిబ్యున్లు గా గుర్తింపు.ఆఫ్రికా నుండి తిరిగి వచ్చిన సీజర్ కు లభించిన ఆదరణ చూసిన అధికారులు కలవరపడ్డారు. సీజర్ బలపడి తమను బానిసలుగా చేస్తాడని భయపడ్డారు.
విజయోత్సవం జరుగుచున్న కూడలికి సీజర్ బయలుదేరాడు. అతను వెళుతుంటే దారిలొ సోది చెప్పేవాడు ఎదురై "మార్చి పదిహేనువ తారీఖు వస్తుంది జాగ్రత్త " అని హెచ్చరించాడు. కాని సీజర్ లెక్కచేయలేదు.
సీజర్ బలపడిపొతున్నాడని భయపడిన వారిలొ బ్రూటస్ ఒకడు.బ్రూటస్ పెద్ద మనిషి,ఉదాత్తుడు.సీజర్ మీద అతనికి అభిమానం వుంది.కానీ ఆయనకు రొము నగరమన్నా,రొమన్ సామ్రాజ్యమన్నా మహ భక్తి. గణతంత్ర పాలనను నాశనం చేసి సీజర్ మహరాజు అవుతాడేమో అని బ్రూటస్ భయం.
రొము నగర ప్రముఖుడైన కేషియస్ కొందరు కుట్రదారులను కూడగట్టాడు.సిజర్ రొము నియంత కాబోతున్నాడు, అందరు అతన్ని దైవాంశ సంభూతుడుగా భావిస్తున్నారు.రొము నగర భవిష్యత్కు అతని చావు అవసరమని కేషియస్ తెలివిగా బ్రూటస్ కు నూరి పొశాడు.                                   
కేషియస్ స్వభావాన్ని సీజర్ బాగా అర్ధం చేసుకున్నాడు.ఒకసారి బ్రూటస్ ప్రక్కనే వున్న కేషియస్ ను సీజర్ చూశాడు."ఆంటొని! కేషియస్ గుంటనక్క లాంటివాడు,అసూయాపరుడు,ప్రక్కవారికి ప్రమాదకారి అని అంటాదు తన మిత్రుడు ఆంటొనితో.అలాంటి పరిస్థితులలొ ఆంటొని బహిరంగముగా మూడుసార్లు సీజర్ కు కిరీటాన్ని బహుకరించబొయాడు. కాని రొము రాజ్యాధికార చిహ్నమైన ఆ కిరీటాన్ని సీజర్ స్వికరించలేదు.
అది మార్చి 14వతేది. ఆకాశం ఉరుములు,మెరుపులతో గర్జించసాగింది. ఆ మరునాడు మార్చి 15వ తేదిన రొము సెనేట్ సమావేశం జరగబొతుంది.ఆసమావేశములొ సీజర్ ను రాజుగా ప్రకటిస్తారని విన్నాడు కేషియస్. వెంటనే కేషియస్ కాస్క మొదలైన వాళ్ళను తనతో కలుపుకున్నాడు.ఎలాగైన బ్రూటస్ ను తన వలలొ వేసుకోవాలనుకున్నాడు.       
అదే రోజు రాత్రి బ్రూటస్ గది కిటికి వద్ద ఒక కాగితం ముక్క పడింది. దానిపై "బ్రూటస్! నిద్ర పొతున్నావా?మేలుకో!ప్రజలను మేలుకొలుపు!శత్రువును వధించు!దేశాన్ని కాపాడు!అని వున్నది.ఇది చదివిన బ్రూటస్ "అమ్మా రొము నగరమా!ఇదే నా వాగ్దానం! బ్రూటస్ నీ కోరిక తీర్చుతాడు"అని ప్రతిఙ్ఞ చేశాడు.అదే తెల్లవారు ఝూమున కేషియస్ కొందరు కుట్రదారులను వెంటబెట్టుకొని బ్రూటస్ ఇంటికి వెళ్ళాడు."బ్రూటస్!సీజర్ తో పాటు ఆంటోని కూడా మరణించాలి అని అన్నాడు.
కేషియస్ తల నరికివేశాక కాళ్ళూ,చేతులు నరకటం ఆగ్రహంతో కూడిన పని. మనం సీజర్ను బలి ఇవ్వాలి.చిత్రవధ చేయ కూడదు.అయ్యో! రొము కొసము సీజర్ నెత్తురు ప్రవహించక తప్పదు. మనం సీజర్ ను ధైర్యం గా చంపుదాం.సాధారణ మనుషులు మనలను శుద్ధి చేసిన మనుషులుగా గుర్తించాలి.అంతేకాని హంతకులుగా కాదు. సీజర్ శరీరంలొ ఒక భాగం లాంటివాడు ఆంటొని.సీజర్ తల పొయిననాడు ఆంటొని ఏమి చేయలేడు.అప్పటికి తెల్లవారు ఝామున 3 గంటలయింది.రేపు ఉదయం 8గంటలకు కలుసుకుండాం"అని పలికి కుట్రదారులు వెళ్ళి పొయారు.
అదే సమయములో బ్రూటస్ భార్య మెల్కొన్నది.అమె ఎమిటి ఇంత రాత్రి నుంచి చికాకుగా వున్నారు,భొజనము కూడా సరిగా చేయలేదు.మీ చికాకు ఎమిటో నాకు చెప్పండి.కాని బ్రూటస్ నాకు కొద్దిగ ఆరొగ్యం బాగోలేదు అని అన్నాడు.కాదు బ్రూటస్ నేను నీ భార్యను నీ మనస్సు నాకు తెలియదా. వచ్చిన వాళ్ళని గమనించాను చీకటిలో కూడా ముసుగుతీయలేదు.వాళ్ళు ఎవరో చెప్పండి.అని అన్నది.మీరు కఠినంగా వుండక మన వివాహ సమయములోని నాపై  గల ప్రేమను గుర్తు చేసుకోని చెప్పండి.నేను స్త్రీ నే అయితే బ్రూటస్ భార్యను,క్యాటో కుమార్తెను.నా గుండే ధైర్యం చూడు !ఇదిగో నా తోడలో గాయం చేసుకుంటున్నాను.ఈ గాయాన్ని భరించగలను,అలాగే మీ రహస్యాన్ని కాపాడగలను.అలాగే నీకు చెప్పుతాను కాని, ఇప్పుడు ఎవ్వరో వస్తున్న సవ్వడి అవుతున్నది తప్పుకో అన్నాడు బ్రూటస్.              
ఇక్కడ ఇలాగుంటే సీజర్ భవనంలో సీజర్ భార్యకు ఎన్నో పిడకలలు వస్తాయి.సీజర్ ను హత్య చేస్తున్నారు అని 3సార్లు అరచింది.ఈ పిడకలలకు భయపడిన అమె సీజర్ ను సెనేట్ కు వెళ్ళవద్దు అని ప్రార్ధిస్తుంది.కాని సీజర్ అహము గా ఈ పీడకలలు సాధరణ ప్రజలకే గాని సీజర్ ను ఎమి చేయలేవు అని అన్నాడు.కాని సీజర్ భార్య, నాకు ఆకాశంలో అనేక దుశ్శకునాలు కనిపించాయి అని అంటుంది.కాని సీజర్ అమె మాటలను త్రోసిరాజని "పిరికి పందలు భయంతొ అనేకసార్లు చస్తారు,కాని వీరులు ఒక్కసారే మరణిస్తారు.రేపు సీజర్ ఇంట్లో వుండడు. ఈ సీజర్ మృత్యువు కంటే ప్రమాదకారి.అని గర్జించాడు.
  అయ్యో!ప్రభూ! ఆవేశం మీ వివేకాన్ని చంపివేస్తుంది.అని బ్రతిమలాడటముతొ సీజర్ సెనేట్ కు వెళ్ళనన్నాడు.కాని కుట్రదారులు తనను భార్య మాటవినే పిరికి వాడు అంటాడని సీజర్ సెనేట్ కు బయలుదేరాడు.
సీజర్ సెనేట్ భవనములోకి ప్రవేశించినప్పుడు, కుట్రదారులు అతని చుట్టూ ఏవో వినతి పత్రాలు ఇచ్చే మిషతో సీజర్ చుట్టూముట్టి,కుట్రదారుల ప్రవర్తన వలన సీజర్ తనపై దాడి గ్రహించి తప్పించుకోబోయాడు కాని కుట్రదారులు వెంటనే సీజర్ ను కత్తితో పొడిచారు.బ్రూటస్  ది చివరి పోటు. "బ్రూటస్! నీవు కూడానా?" అంటూ సీజర్ ప్రాణం వదిలాడు.
స్వేచ్చ స్వాతంత్ర్యాలు వర్ధిల్లు గాక అని కేషియస్ అరిచాడు. అధికార కాంక్ష రుణం తీరిపోయింది అన్నాడు బ్రూటస్.
పదండి! పదండి! బ్రూటస్ మన నాయకుడు!.అని కేషియస్ ప్రకటించాడు.పారిపోయిన అంటోని తన మద్దతు బ్రూటస్ కు ప్రకటించి సీజర్ అ౦త్యక్రియలలొ ప్రసంగించటానికి అనుమతి కోరాడు.బ్రూటస్ ముందు నేను ప్రసంగిస్తాను ఆతరువాత సీజర్ ను పొగడుతూ అంటోని మాట్లాడవచ్చు అని అన్నాడు.నేను రోము ప్రజల కోసం,రోము దేశం కోసం మాత్రమే సీజర్ ను చంపాము.సీజర్ లోఅధికార కాంక్ష పెరిగినది,మిగతా వారందరు బానిసలుగా మారే కన్నా సీజర్ మరణం మంచిదని చంపాము.ఇలా అనేక కబుర్లతో రోము ప్రజల ఆమోదముద్ర పొందాడు.ఇంతలో అంటోని తన మిత్రుడు సీజర్ మృత దేహం తో అక్కడకు వచ్చాడు.అంటోని తన ఉపన్యాసములో సీజర్ యొక్క గొప్పతనం వివరించాడు.బ్రూటస్ ను కేషియస్ మభ్య పెట్టాడు అని చెప్పాడు.దానితో ప్రజలకు కుట్ర తెలిసి ప్రజలు తిరుగుబాటు ప్రకటి౦చటముతో కుట్రదారులు పారిపోయారు.ఇలా అనేక రాజకీయ మార్పులు సంభవించి రోము మొత్తం అల్లకల్లోలం అయినది.ఇంతలో బ్రూటస్ భార్య చనిపోవటం. సీజర్ అన్యాయంగా చంపాను అనే వేదన,కుట్రలో తన పాత్రపై దుఃఖం ఇలా అనేక కారణాలతో బ్రూటస్ ఆత్మహత్య చేసుకున్నాడు.కేషియస్ మత్తు పదార్ధాలకు బానిస అయ్యాడు. ఈ ఉద్రేకంలో సీజర్ ను పొడిచిన కత్తితో తనను తానే పోడుచుకొని చనిపోయాడు.
ఇలా కుట్ర దారులందరు మరణించారు.బ్రూటస్ చివరి క్షణములో సీజర్ ను చంపినందుకు విచారం ప్రకటించాడు.
ఆతరువాత ఆక్టేవియాస్ సీజర్ రోమన్ సామ్రాజ్యానికి సర్వాధికారి అయ్యాడు.
-------------------------------------------------------------------------------------
ఈ నాటకం మొత్తం రాజకీయ కుట్రలు నేపధ్యంలో సాగుతూ అనేక జీవన సత్యాలు వెల్లడించింది.   

తొలి ఏకాదశి - మీకు తెలిసిన ,తెలియని సంగతులతో




30/06/2012 తోలి ఏకాదశి పండుగ. ఈ సందర్భముగా దిని గురించి కొన్ని విషయాలు తెలుపుదామని.

తొలి ఏకాదశి ఆషాడ శుద్ధఏకాదశి  నాడు ఆచరిస్తారు. ఆషాడమాసము లోనే ప్రత్యక్షనారాయణుడు తన మార్గాన్ని దక్షిణాయనములోనికి మార్చుకునేది.ఈ పండుగ దాదాపు దక్షిణాయనము ప్రారంభము అయిన తరువాత మొదటి పండుగని తోలి ఏకాదశి గా ప్రజలు చేస్తారు.ఈ పండుగ పూర్వ కాలములో ఏరువాక వేడుకల్లో భాగముగా చేసేవారు.


తొలి ఏకాదశి వైష్ణవ౦ లో ముఖ్యమైన పండుగ. విష్ణుమూర్తి తన లోక పాలకత్వానికి కొద్దిగా విశ్రాంతినిస్తూ ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు శేషువు పైన శయనించుటకు ప్రారంభించిన రోజు అందుకని తోలి ఏకాదశి అని శయనైక ఏకాదశి అని పిలుస్తారు.దశమి నాడు ముక్కోటి దేవతలు విష్ణువు ను పూజించి సేవిస్తారు.
ఆయన ఈరోజున యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. ఆదిశేషువు పైన తన యోగనిద్రకు ఉపక్రమిస్తాడు అందువలన  శేషశయన ఏకాదశి అని పిలుస్తారు.అందువలన దశమి నాటి రాత్రి నుంచి ముక్కోటి దేవతలు అయినను అర్చిస్తారు.
ఈ ఏకాదశిని పద్మఏకాదశి గా కూడా పిలుస్తారు.విష్ణువు లోక పాలకుడు. ప్రజల చైతన్యానికి ప్రతిక. మరి విష్ణువు యోగ నిద్ర అంటే.
ఈ యోగ నిద్ర అనేది భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన.తద్వార ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి.
భవిష్యోత్తరపురాణం లో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని వున్నది.
సూర్య వంశం లో ప్రఖ్యాతరాజు మాంధాత. అతడు ధర్మము తప్పడు,సత్యసంధుడు. అతని రాజ్యం లో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచన పై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా వున్నారని పురాణాలు చెపుతున్నాయి.


ఆధ్యాత్మిక గురువులు,పిఠాధీపతులు తదితరులు అందరు తమ పయనములను అన్నింటిని నిలిపి ఆషాడం నుంచి
నాలుగు మాసములు ఎక్కడకు కదలకుండా ఒకే ప్రదేశములో వుండి తమ శిష్య బృందానికి అనుగ్రహభాషణలు ఇస్తారు అ౦దువలన ఈ దీక్ష కాలమును చాతుర్మాస్య దీక్ష గా వాడుక.ఈ దిక్షాకాలంలో తొలి ఏకాదశి గా కూడా గుర్తింపు.
మన ప్రాంతములో "తొలి ఏకాదశి తో పండుగలన్నీ తోసుకు వస్తాయి" అనే నానుడి వున్నది.
ఏకాదశి వ్రతం ఆచరించే వారితో పాటు అందరికి ఉపవాసం శ్రేష్టం.
ఈ పండుగకు గ్రామ ప్రాంతములో పేల పిండిని తినే ఆచారము మాచిన్ననాడు విపరీతముగా  వుండేది.
బజార్ల నిండా మొక్కజొన్నలు,పచ్చజోన్నలు అమ్ముతు, వీటిని పేలాలుగా వేపటానికి  పొయ్యిలు ఏర్పాటు వాటి మంగలములలో వేపి, ప్రక్కనే వున్న పిండి మర లో పిండి ఆడించటం ఓ వేడుక.ఇది పిల్లలకు పెద్ద ఆట విడుపు.
పేలపిండిలో బెల్లం గుండ కలిపి తింటే ఆ మజా వేరు.

29, జూన్ 2012, శుక్రవారం

బకాసుర వధ అంతరార్ధము - భాగవత అంతరార్ధములు ఏ విధముగా తెలిపానో వివరణ.


భాగవత అంతరార్ధములు : మనము తరచి చూచినకొద్ది భాగవతము దశమస్కంధములో కృష్ణలీలలు ఓక్కొక్కటి ఓక్కో విధమయిన అధ్యాత్మిక రహస్యాలను వెలిబుచ్చుతుంది.అందుకే ప్రాచీనులు కృష్ణుని "కృష్ణం వందే జగద్గురుం " అని ప్రస్తుతించారు.గీత  కృష్ణుని ముఖతా వెలువడిన అమర బోధ.అయితే కృష్ణలీలలు అనేవి అధ్యాత్మిక సంకేతాలు.భగవంతుని దర్శించటానికి మనలోని ఏ అసుర లక్షణాలు వర్జించాలో, నిర్మూలించాలో తెలిపిన రహస్య కధారూప కృష్ణలీలా బొధలు. అందుకే వ్యాసుల వారు జీవులలొ వర్జించవలసిన లక్షణాలకు అసురరూపాన్ని అందుకు తగ్గ నామధేయాలు ఇచ్చి వాటినే భగవానునిచే నిర్మూలనచేయిస్తూ మనకు ప్రచ్చన్న బొధ చేశారు.

మాములు మానవ బాలుడు చేసినది అల్లరిగా సూచించుతాము. కాని కృష్ణుడు లొకనాయకుడు కాబట్టి కృష్ణుని అధిమానవ చేష్టలను లీలావైభవాలుగా గుర్తించి కీర్తిస్తున్నారు. మరి మనము కూడా కారణములేకుండా కీర్తించుదామా  లేక ఇలా ఎందుకు అని ప్రశ్నించుకోని ఆగి ఓక్కసారి పరిశీలిస్తే మనకు కారణము దోరకుతుంది.ఇందుకు ఎవరిని ఆశ్రయించాలి. ఎవరో ఎందుకు ముందుగానే అనుకున్నాముగా వందే జగద్గురుం అని,ఆయిననే స్మరించి  ఆయిన లీలవైభవాన్ని  మనకు తర్క రూపముగ లభింపచేయమని కోరితే, మన బుద్ధికి ఇది ఇలా అని ప్రశ్నలను సంధించుకుంటూ కారణాన్వేషణ  జరిపితే అప్పుడు స్వామీ మనకు అంతరార్ధ బోధను మనసుకు తట్టిస్తాడు.ఇది సర్వులకు ఓకే విధమని అనుకోవద్దు. ఏవరికి వారు తరచి,ప్రశ్నించి చూస్తే రకరకాలయిన సమాధానాలు వస్తాయి.ఇవి వారి బుద్ధి,ప్రారబ్దము,భక్తి అంతరంగాన్ని బట్టి దర్శనము ఇస్తాయి.అంతే కానీ వీటికి పెద్ద పాండితీ ప్రకర్ష అవసరము లేదు.కావలసినది అచంచల విశ్వాసము,నమ్మకము,భక్తి.            
ప్రతి ఘట్టములోను కృష్ణుడు సూత్రధారి,పాత్రధారి,ముఖ్యకధానాయకుడు కాబట్టి ఆయిన వుంటాడు. ఇక ఆయిన లక్షణాలు, మామూలు మానవుడు ఎవిధముగా వుంటే భగవదర్శనము కలుగుతుందో వూహించితే, అప్పుడు మనకు కృష్ణుడు మనకు శుద్ధ పరమాత్మ రూపముగా, నారాయణ రూపముగా దర్శనము ఇస్తాడు.మధ్య మధ్య అయిన మాయ మనమీదకు కూడ వస్తుంది.శుద్ధ ఆత్మకు కావలసిన గుణగణాల  గురించి మీకు ముందే అంచనాకు వచ్చి వుంటారు కనుక భగవత్ స్వరూపము మీకు బొధ పడినట్లే.ఇకపోతే ఆఘట్టములోని అసుర ప్రకృతి కలవారు ఎవరో చూసి వారి నామ,రూప,గుణగణాలను తెలుసుకోని వారు మన జీవితములో ఏ అవలక్షణాలను సూచిస్తున్నారో గ్రహించి అపై విశ్లేషణ చేస్తే అప్పుడు మనకు ఆఘట్టము యొక్క అంతరార్ధము, వ్యాసుల హృదయము దర్శనమయినట్లే.           
కొన్ని ఘట్టాలలొ అసురలక్షణాలు లేక మానవాతీత కార్యక్రమాలు వున్నాయి, గొవర్ధనము,కాళీయమర్ధనము లాంటివి.ఎందువలన ఈ అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యమవుతున్నాయి ఓక్కసారి వాటి మూలానికి, ఆకార్యక్రమ లబ్దిదారులు ఎవరు ఇలా అన్ని ఓక్కసారి నిశితంగా పరీశీలించండి.సర్వము బొధ పడుతుంది మొత్తము ఆచరణకు వస్తుంది. కాకపొతే ఇలా సంతృప్తికరముగా ఆఖరి సమాధానము వచ్చేవరకు భాగవత కధలను మనము,స్మరణము,పఠనము చేస్తే అప్పుడు తార్కికరూప అంతరార్ధము మీముందుకు వచ్చి  నిలుస్తుంది.            
   ఇది నేను అనుసరించిన పద్ధతి.ఇప్పటివరకు ఇలా వ్రాయించింది నా ఆరాధ్యదైవమయిన శ్రీరామచంద్రమూర్తి కరుణాకటాక్షాలే.అలాగే శ్రీరామ నామ ధురంధరులు, స్వఫ్నదర్శన కటాక్ష పరులు మా పితామహులు కీ.శే. శ్రీ ఆలపాటి శ్రీరాములుగారు , నా మార్గదర్శకులు నాకు దైవ స్వరూపులైన మానాన్నగారు కీ.శే.  శ్రీ ఆలపాటీ పాండు రంగారావుగారి ఆశ్వీర్వపూర్వక కరుణాకటాక్షలే ఈ నాలుగు మాటలు వ్రాయగలిగాను.

బకాసురవధ అంతరార్ధము : బకము అంటే కొంగ అన్నసంగతి మీకు తెలిసిందే. కొంగ మోసానికి చిహ్నము. సాధరణ కొంగ ఎమి చేస్తుంది చెరువులో దొంగజపము చేస్తు చేపలను పడుతుంది.మరి మనలను అధాయత్మిక జీవనములో  మోసము చేయటానికి కొంగను సంకేతముగా చూపారు. నీరు మనస్సుకు గుర్తు.ఈ నీటిలో కదిలే చేపలు వున్నాయి,అరచే కప్పలు వున్నాయి,అందమయిన కలువ పూలు వున్నాయి.ఇవి అన్ని ఒక్కోటి ఒక్కో దాన్ని సంకేతం.చేపలు నీటిలో స్థిరంగా వుండవు.కప్పలు ఉరకనే అరుస్తూ లోపల బయట గంతులు వేస్తుంటాయి.కలువ పూలు ఇవి ఏవి దానికి పట్టదు బురదలో పుట్టినా అందముగా సౌందర్యాన్ని లక్ష్మీకళను వెదజల్లుతుంది.మరి తామరాకు చూడండి నీటిలో పుట్టినా దాని జీవనానికి నీరు అవసరమైనా నీటిని తన పై నిలువ నివ్వదు.

 మానవుని మోసానికి గురిచేసేవి ఇంద్రియాలు. ఇంద్రియాలు ఏమి చేస్తాయి.   
 కన్ను తనకు ఇంపుగా వున్న దృశ్యాలను కొరుకుంటుంది.చెవి సొంపుయిన శబ్దాన్ని,సంగీతాన్ని కోరుకుంటుంది.నాసిక సొగసైన సుగంధాలు, జిహ్వ మధురమయిన భక్ష్య భొజ్యాలు అనేక విధములయిన రుచులను కోరుకుంటుంది.చర్మం హాయిని,సౌఖ్యాన్ని కోరుకుంటుంది,పురుష ఇంద్రియము అంతులేని నిరంతర కామాన్ని ప్రజ్వరిల్ల చేస్తుంది.పోని వీటిని ఓక్కసారి అనుభవింప చేస్తే వూరుకుంటయా అబ్బే మరల మరల ఆ అనుభవానికై వెంపర్లాట ఆరంభిస్తాయి. మరి ఇవీ దేనిని సూచిస్తాయి చెరువులో స్థిరముగా వుండని చేపలను.      
కొంగకు చేప చిక్కటమంటే మనో నిగ్రహములేక ఇంద్రియలోలత్వమునకు  గురి కావటమని అర్ధము.అందుకే కొంగలు ఈచెరువులో చేపలు కాగానే ఆ చెరువులోకి పొతాయి.అంటే మనస్సు ఈ సౌఖ్యము  ఆ సౌఖ్యమని పరుగుతీయటమే దీని అంతరార్ధము.ఇవి ఇలా చేసి మనిషిని అధఃపాతాళానికి తొక్కుతాయి. ఇంద్రియ నిగ్రహమే జీవన సౌఖ్యానికి,అధ్యాత్మిక వున్నతికి మొదటి మెట్టు. అదే బకాసుర వధ.   
     

28, జూన్ 2012, గురువారం

మనవాడు మనతెలుగువాడు పి.వి.నరసింహుడు - వీరి పట్ల తప్పు చేసిన ముగ్గురికి ఒకే శాపం.


స్వ. శ్రీ  పి.వి.నరసింహారావు  గారిని తలచుకుంటే నే మనవాడు మనదైన తెలుగు వాడు అని పిస్తుంది.ఎన్నో తరాలు కు వచ్చే ఆవకాశం దేశ పాలన. అవకాశం వచ్చిన రీతి,పాలించిన పధ్ధతి అన్ని విశేషమే.రాజకీయ కార్యకలాపాలు చాలించి కుర్తాళం పిఠాధి పతి గా వెళ్లే సమయములో అనుకోని అవాంతరం రావటం. వీరిని ప్రధాని గా ఎన్నిక కావటం కాకతాళీయం అది వీరి అదృష్టం అంత కన్నా దురదృష్టం.ఏళ్ల తరబడి నమ్ముకొన్న పార్టి, దేశ ప్రజలు పై అభిమానం తో పదవి స్వీకరించారు.
వీరు పండితులు అన్న సంగతి చర్వితచర్వణం.
"దుష్ట స౦హారం దురిత నివారణ౦" అన్నది నరిసింహ అవతార తత్వం. దీనిపై అవగాహన వున్నపీవీ గారు దేశము నకు సంభవించిన గొప్పవిపత్తునును నివారించారు.బంగారం విదేశాలకు తాకట్టులో పెట్టే స్థితి నుంచి దేశం ను రక్షించారు.ఆపై ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టటముతో ఎన్నడు చూడని దేశాలనుంచి మునుపు ఎన్నడు రానన్ని సంస్థలు వచ్చి దేశములో ఉద్యోగ అవకాశాలు తద్వార దేశంలో సంపద వృద్ధి.
ఇలా ఎన్ని చేసినా కాంగ్రేస్ వాళ్ళ స్వార్ధమునకు బలి అయ్యారు. దేశము నకు ప్రధానిగా, ఎన్నో సంవత్సరాలు మంత్రిగా,ముఖ్యమంత్రి గా ఏమి మిగుల్చుకోలేదు. చివరి సమయాలలో కోర్ట్ లో వున్న కేసులకు న్యాయవాదులకు సొమ్ము కోసం ఇబ్బంది పడ్డాడని తెలిస్తే ఆశ్చర్యమే.
పీవీ  అంతర్ముఖుడు. ఎంత పెద్ద వివాదమయిన మౌనమే. ఈ విషయంలో వీరు రెండు సమాధానాలు చరిత్రలో నిలిచి పోయేవి. అవి మౌనం కూడా సమాధానం , నిష్క్రియ కూడా క్రియే.
వీరి పట్ల సోనియా అగౌరవము లోక విదితమే. ఆమెకు కోపం.తనను విదేశి అనిపి౦చాడని.
పీవీ కీ తెలుసుగా సంవత్సరాల తరబడి వీళ్ళ గుట్టు సోనియ ఇటలి మాఫియ పద్ధతులు తెలిసిన వాడు అయినా విజ్ఞుడు "కుదురు లేని కోడలు కులానికి చేటు" ఇది పాత కాలం సామెత. వీళ్ళ లక్షణాలు తెలిసిన పీవీ దూరంగా జరిపి దేశంను కాపాడాలని భావించి ఉండవచ్చు.
ఈమె కనిసం వీరి పార్ధివ దేహం కాంగ్రేస్ ఆఫీస్ లోకి అనుమతి ఇవ్వ నంత కసి.
కొంగున కట్టిన పాపం,కడుపున బిడ్డ దాచిన దాగవు కారిచ్చు లా మననే దహిస్తాయి. అందుకే సోనియా కు చెప్పరాని చెప్పుకోలేని చోట  కేన్సర్.
అలాగే మాధవరావు సింధియ, రాజేష్ పైలెట్ సోనియా కోటరీలో వుండి వీరిని ఎంతలా ఇబ్బంది పెట్టారో లోక విదితమే.
అలాగే వై.యస్ కూడా పీవీ పై చెప్పులు రాళ్ళు వేసిన వాడే. కాకపొతే  వై.యస్ అధికారం లో వున్న సమయములో వీరు స్వర్గవాసి కావటం. వీరి పార్ధివ దేహం కనీసం దహనం కాకపోవటం కూడా దారుణమే.
చూడండి పై ముగ్గురు ఒకేలా మరణించారు. రాళ్ళు వేసిన వై.యస్ కొండల్లో పోయాడు.
మరి చూడండి వింత కాకపొతే ముగ్గురు ప్రమాదంలో పైకి పోయారు.
అందుకే  ప్రక్క వాడిని ఇబ్బంది పెడితే వాడి సహనం,క్షోభ పాములాగా మారి యమపాశం అవుతుంది.
"కొన్ని విషయాలు చేసిన వాడు చెప్పాలి, లేక పొతే కాలం చెప్పాలి."సోనియా పట్ల వీరి మౌనం చాతకాని తనంగా భావించారు. ఇటువంటి వ్యవహారాలు ఎన్నో చూసిన పీవీ గారు మౌనంగా వురుకొన్నారు.

ఈ రోజు 28 జూన్. ఈ సందర్బముగా వీరిని స్మరణ.

మీరందరు ఈ విధంగా రాహుల్ కు ఆశీస్సులు అందించండి. రాహుల్ నీవు కలకాలం ఇలాగే బ్రహ్మచారిగా
వర్ధిల్లు వచ్చే తరాలకన్న మాకు మీ పీడ తప్పుతుంది.
అయినా సోనియా తెలియదు ఈ కాంగ్రేస్ పోతురాజులకు ఈమె వలన లాభం వుంటే పోలేరమ్మ అని కొలుస్తారు లేదా
పోలేరమ్మకు బలి ఇచ్చే మేక ను చేస్తారు.

స్వర్గ వాసి నందమూరి తారకరాముని తో ఏవో కొన్ని మాటలు


ఈ రోజు పేపర్ చూసారా  దేశం పార్టి గురించి ఒక ఆర్టికల్ చదివారా! మీకు ఏమి అనిపించింది.
హమ్మయ్య బాబులోని కాంగ్రేస్ వాది చహర మెల్లగా ఆవిష్కరము అవుతుంది. నిన్నటి దాక రహస్య స్నేహాలు తో పార్టిని చంక నాకి౦చాడు.ఈ రోజు తన అంతే వాసుల తో లోకేష్ ను యువజన నాయకుడును చేయండి అని అనిపిస్తున్నాడు.
అసలు దేశం పార్టి వ్యవస్థాపకుడైన స్వర్గీయ శ్రీ నందమూరి వారి దృక్ పదానికి వ్యతిరేకం. వారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే సమయములో ఈ వారసుల సరళిని కూడా ఎండ కట్టారు. అందుకే ఏదో ఒక్కసారో రెండు సార్లో తన  తరువాత బాలయ్య బాబు అన్నాడు కాని. తన సంతానం ను ప్రోత్సాహించలేదు.అర్హత లేక పొతే సున్నా, అది ఎవరైనా ఒక్కటే అనేది రామారావు గారి విధానం,సిద్ధాంతం. అది కడ దాక నమ్మాడు ఆచరించాడు అందుకే "ఏను తెలుగు వల్లభుండ" అని సగర్వముగ ప్రకటించుకున్న ఏకైక తెలుగు జాతి సింహం.అందుకే ప్రజలు గుండెల్లో గుడి కట్టి ఆరాధించారు. ఈ నాటికి ఆరాధిస్తున్నారు. మరి వీళ్ళు అయిన భాషలోనే "కుక్కమూతి పిందెలు".
అందుకే బాబును ప్రజలు నమ్మరు నమ్మరు నమ్మరు ఇది ముమ్మారు సత్యం.
విధానం మార్చమానండి ప్రజలకు దగ్గర కమ్మనండి.ఆరాధిస్తారు అధికారం ఇస్తారు.
బాబు అయినా కొద్దిగా నయం గ్రామీణ వాతావరణం లో పుట్టాడు కష్టాలు చూసాడు,విద్యార్ధి రాజకీయాలు చేసాడు. అనుభవం వున్నది.కాని అధికార దాహం,పుత్ర ప్రేమ ఇలాంటి అవలక్షణాలు వదులుకోడు ,లేడు.
కాబట్టి బాబు గతం గతః అవుతాడా లేక విజయ పతాక చూస్తాడా అన్ని వారి విధానాలపైనే దేశం పార్టీ భవిష్యత్ ఆధార పడింది

అన్నగారు! మీరు పై నుంచి చూస్తున్నారా!దేశం పార్టీ నాతోనే పోతుంది అన్నారు!సవరించండి! మా అల్లుడు గారితో అన్యాయం అయిపోయాను,ఇప్పుడు పార్టీ పోతుంది అని గర్జించండి! ఎలాగు మీ బాలయ్య, బావకు బానిస అయ్యాడు!ఇంకా మీ అభిమానులు మీరంటే ఉత్తేజం పొ౦దుతున్నారు వాళ్ళ మనస్సులో ఆత్మ దిపులై చైతన్యం వెలిగించండి.మీ పార్టీ కి మీరు,మీ విధానాలు తప్ప వేరు దిక్కు మొక్కు లేదని తెలపండి.సామాన్యుడే నా వెంట నేను వాడి వెంట అన్న మీ విధానం మరొక్కసారి రావాలంటే ఇది తప్ప వేరు శరణ్యం లేదు.
ఈ విషయాన్నీ గమనించిన వై.యస్.ఆర్ కూడా మిమ్ములను,మీ విదానాలను మెచ్చుకొని తనదైన పద్ధతిలో విజయం సాధించాడు. అతని కొడుకు  కు కూడా మీరు కావలసి వచ్చారు! పరాయి వాళ్ళకు పటికబెల్లం లా వున్నారు.అయిన వాళ్ళు మాత్రం విషం లా ప్రక్కన పెట్టారు.సన్నాసులు,దుర్మార్గులు.అందుకే అనుభవిస్తున్నారు.అయినా బుద్ధి రాలేదు.
అన్నగారు! మీతో ఓ మాట - పరామర్శ- మీరు పైన స్వర్గంలో బసవతారకం గారితోనే కాలక్షేపం చేయండి. మరలా అక్కడ మేనకలు,హరికధలు అంటూ అక్కడ కూడా ఆమెను ఇబ్బంది పెడుతున్నారా! లేక ఇంద్రుడు వాడి దుర్మార్గులు అని ఆవేశ పడుతున్నారా! మీలోని ఆవేశం మిమ్ములను వూరకనే కూర్చోవటం మీతరం కాదు!

కార్పోరేట్ విద్యాలయాల కొత్త మాయ - ఇంకో వల ప్రారంభం.



సాంప్రదాయంగా వ్యాపారం అంటే లాభం నకు వస్తువు ఇచ్చి డబ్బు సంపాదించేది అని భావన.
సేవలు కూడా వ్యాపారం లో చేరబడ్డాక అనేక కొత్త పద్ధతులు వ్యాపారం లో చేర్చబడ్డాయి.అలా౦టిదే విద్యాలయలు వాటిలోని వివిధ  సేవలు.
విద్య విజ్ఞానం నకు,జీవనమునకు అవసరమయినది.
విద్య మన దేశంలో తరతరాలు గా ఉచితం గా విద్యార్ధులకు అందించినా కాలక్రమేణ జీవితాల్లో అవసరాలు ప్రభుత్వాల స్వార్ధం నకు ఈ వ్యవస్థలో ప్రైవేటు వర్గాలు విద్యా సేవ ముసుగులో కార్పోరేట్ విద్యాలయాలు ఉరు వాడ అంతా ప్రారంభి౦చబడ్డాయి.వీటిల్లో నేటి కాలమునకు అవసరమయిన విద్యను,పోటి పరీక్షలకు కావలసిన సిద్ధం కావలసిన విద్యార్ధులకు ఆపద్ధతిలో విద్యను అ౦దిస్తు౦డటము తో ప్రజలు విస్తృతముగా ఆ విధానమునకు మొగ్గి కోట్లాది రూపాయల వ్యాపార అవకాశములు వు౦టముతొ  అనేక సంస్థలు ప్రవేసించి రకరకాల పద్ధతులకు తెర తీసాయి.ఓలంపియాడ్ పరిక్షలు, 6 th class lo start iit entrance కు కోచింగ్.
మరలా వీటిల్లో అనేక రకాల అక్రమాలు.
ఈ అక్రమాలపై వివరముగా వ్రాస్తాను.
ఈ నాటి పోస్ట్ యొక్క అంశము నకు వస్తాను.
మా బావమరిది పిల్లలు విశాఖలో శ్రీప్రకాష్ లో చదువుతున్నారు. ఈ మధ్య వాళ్ళ స్కూల్ డైరి పరిశీలిస్తే ఓ కొత్త విషయం ఆసక్తికరంగా వున్నది. అది ప్రతి విద్యార్ధి ఉదయపు ఉపాహారం నకు అవసరమయిన దిన వారి పట్టిక ఇచ్చారు.దాని ప్రకారము పిల్లలకు ఇంటి నుంచి పట్టికలోని ఆహార పదార్థాలు సిద్ధము చేసి పంపితే బ్రేక్ ఫాస్ట్ బెల్ సమయములో విద్యార్ధులందరు అవి స్వీకరించాలి.
ఈ ఉపహార పట్టిక ఈ క్రింది విధముగా వున్నది.
Monday             Bread,Jam  Banana
Tuesday             Idly / Chapathi   Nuts
Wednsday          Sponze cake, Oats  Sprouts
Thursday            Dosa / Chapathi  Palmgrove nuts
Friday                Milk bikis      Fruit Salad
Saturday            Poori / Chapathi   Veg Salad
ఇలా వున్నది. మామూలు గా చూస్తే ఇది పిల్లలందరికీ ఒకే ఆహారం, న్యూట్రిషన్ ప్రోగ్రాం సిద్ధం చేసామని స్కూల్ చెబుతుంది.
అంతా బాగున్నడానికి సందేహం ఏమిటా అనా? ఇటు వంటివి అన్ని మొదట ఉచితముగాను తదుపరి సేవలకు విలువ కడతాయి.మన వాళ్ళకు సొమ్ము పోయినా ఫరవాలేదు కాని సోకు మాత్రం కావాలి. ఇదే అవకాశం  కార్పోరేట్ విద్యాలయాలకు.
ఏముంది మీరు రోజు పిల్లలను పంపండి మేము ఈ ఆహారం సిద్ధం చేసి పెడతాము అంటారు.ఎలాగు మనవాళ్ళకు అర్ధరాత్రి వరకు టీవిలో సీరియల్స్ తో సరిపోతుంది కాబట్టి + స్టేటస్ సింబల్ కాబట్టి మహాఅర్జంట్ గా ఎంత సొమ్ము అయిన ఈ సేవకు చెల్లించటానికి సిద్ధం అవుతారు.స్కూల్  యాజమాన్యాలు ఏ కంపినిలకో అవుట్ సోర్సింగ్ ఇచ్చి సొమ్ము చేస్తాయి.సాధారణముగా సంవత్సరమునకు 220 రోజులు విద్యా దినాలు' వుంటాయి.సగటున విద్యార్ధి 195నుంచి 2౦౦ రోజుల వరకు హాజరు అవుతాడు.పిల్లవాడికి 25 రూ. చొప్పున 5౦౦౦ రూ. సగటున సంవత్సరమునకు ఖర్చు అయితే విద్యాలయాలు 1౦,౦౦౦ రూ ఛార్జ్ చేసినా విద్యార్థి కి 5000 లాభం.
ఇంత సొమ్మును వాళ్ళు వదులుకుంటారా! వల పడ్డది గా చేపలు కొద్దిగా ఆలస్యం అయితేనేమి.
ఇది ఒక వైపు. అసలు ఆ పట్టిక గమనించండి. మన ప్రాంతీయ ఆహారాలు రెండు రోజులు మరలా వాటికి ఎంపికలు ఇచ్చారు.వీళ్ళు ఏ అంతర్జాతీయ కంపెనీలకు దాసోహం. మనదైన ఆహరం కూడా మెల్లగా పిల్లలను దూరం చేసే ప్రక్రియ.విద్య ఇంగ్లీష్ ఆయనది,జీవనం సగానికి పైగా విదేశి సరళికి వచ్చింది.పిజ్జాలు,బర్గర్లు సాయంత్రం పూట నుంచి ఇలాంటి స్కూల్లో పిల్లలకు అలవాటు అయితే నిత్యం సదా అవే అవుతాయి.సాంస్కృతిక దాడి అయిపోయినది.ఇప్పుడు ఆహార దాడి జరుగుతుంది.మనం ఏమి చేయలేమా? అధికారులు,ప్రభుత్వాలు  వ్యవస్థలోని అన్ని అంగాలు  డబ్బు వున్నవాడి కాపలా కుక్కగా మారిపోయాయి.


ఇంటర్లో సత్యనారాయణ అనే స్నేహితుడుకు రోజుకు ఒక్కపూట మాత్రమే ఆహరం లభించేది,అతనికి ఒక్కటే జత దుస్తులు అయన చదవాలి అన్న తన కోరికను బలీయంగా ఉండటం చేత చక్కగా చదువుకున్నాడు.


బాధాకరమయిన విషయం ఏమిటి అంటే ప్రభత్వ విద్యాలయాల్లో ఉచిత పుస్తకాలు,యూనిఫారం,ఉచిత విద్య తో పాటు మధాహ్నం భోజన పధకం అమలు లో వున్నా నిరుపేదలు కూడా చేరటం లేదు.
కాని ప్రభుత్వాలు విద్యా సెస్స్ పేరిట వేల కోట్ల రూపాయలు వసుల్ చేస్తున్నాయి.ప్రైవేట్ విద్యాలయాలు ఫీజు ల పేరిట సొమ్ము చేసుకు౦టున్నాయి.ప్రభుత్వం,ప్రైవేట్ సంస్థలు ఉభయులు కలసి ప్రజలనే దోచు కుంటున్నాయి. 





27, జూన్ 2012, బుధవారం

పాండవ స్వర్గారోహణ - మానవజీవితమునకు అన్వయము.



మనపురాణాలలో అంతర్గతముగా ప్రతి సన్నివేశములోను ఎదో ఒక అధ్యాత్మరహస్యము దాగి వుంటది.దానిని గమనించటమే మన పని.

మహభారతములోని 18వ పర్వము స్వర్గారోహణపర్వము.
కురుక్షేత్ర యుద్ధము ముగిసింది. ధర్మరాజు రాజ్యపాలన చేయ సాగాడు. కొంతకాలము గడిచినది. శ్రీక్రిష్ణుడు నిర్యాణము చెందాడు.బలరాముడు అస్తమించాడు. యాదవకులములో ముసలము పుట్టింది. అందరు స్వార్ధపురిత అలోచనలతో మెలగసాగారు.శ్రీకృష్ణ నిర్యాణముతో పాండవులు సర్వము కొల్పొయిన వారిలా బాధపడ్డారు.ఇంతలో వచ్చిన ఈ పరిణమాలు గమనించిన  ధర్మజుడు తాముకూడా హిమాలయ పర్వతములు తద్వార స్వర్గారొహణమునకు పొవ నిశ్చయించాడు.ఈ విషయము మిగిలిన వారికి తెలిపి రాజ్యాన్ని తమ వారసులకు అప్పగించి తాము సర్వము త్యజించి హిమాలయములకు సాగిపొయారు.ఈ సమయములో పాండవులతో పాటు ఒక కుక్క వెంబడించింది.ఇప్పుడు మొత్తము 7రు అయినారు.అందరుకలసి ప్రయాణము సాగించారు. పట్టణాలు,నగరాలు,గ్రామాలు,మైదానాలు,పర్వతపంక్తులు అన్ని దాటి హిమాలయ సానువులకు వచ్చారు. హిమాలయములను అధిరొహణ ప్రారంభించారు.కొద్ది దూరము వెళ్ళిన తరువాత ద్రౌపది పడిపొయినది అమె ప్రియుడైన అర్జునుడు అందోళన చెందాడు. కాని ధర్మరాజు వారి వంక కూడా చూడకుండా స్వర్గారొహణ మార్గములో పయనము సాగించాడు.ఇంతలో ద్రౌపది మరణించినది.అయినను ఆగలేదు.ఇలా ఒకరి వెంట ఒకరు నకులసహదేవులు,అర్జునుడు,భీముడు మృతిచెందారు కాని ధర్మరాజు వీరిగురించి తలచక తనమార్గములో తాను పయనిస్తున్నాడు.ఇంకను కుక్క ధర్మ్రాజును వెంబడిస్తునే వున్నది. స్వర్గ ద్వారమునకు కుక్క,ధర్మరాజు చేరుకున్నారు.అక్కడవున్న కావలి వారు ధర్మరాజుకు మాత్రము స్వాగతము చెప్పారు.కుక్కను నిరాకరించారు.కాని ధర్మరాజు నేను ఒక్కడిని ప్రయాణము సాగించలేదు నాతో సహ ప్రయాణికుడుగా ఇంత దూరము కుక్క వచ్చింది, కుక్కనుకూడా అనుమతిస్తేనే నేను రాగలను కాని ఒక్కడిని రావటము ధర్మవిరుద్ధము అవుతుంది కాబట్టి నేను ప్రవేశింపలేను అని నిరాకరించాడు. అంత కుక్క యమధర్మరాజుగా  నాయినా!ధర్మరాజ అందరు నీ ధర్మనిరతిని పోగుడుతున్నారు పుత్రుడవైన నీవు ఎలా ధర్మమార్గము పాటిస్తున్నవో అని తెలుసుకునేందుకు ఈ చిన్నపాటి పరిక్ష నాయినా అని అశ్వీరదించి. నీవే కాదు నీతాలుకు అందరు స్వర్గలోకములో నీకై ఎదురు చూస్తున్నారు  అని పలికి స్వర్గలోక ప్రవేశము కలిపించాడు.
        
ఇది మహభారతములోని స్వర్గారోహణపర్వములోని కధ సూక్ష్మముగా మరి మానవ జీవితానికి అన్వయము ఎలా?
పుట్టిన ప్రతీజీవి మరణించక తప్పదు.ఈ విషయము తెలిసిన మానవుడు పరమాత్మను పై విశ్వాసముంచి భక్తి,శ్రద్ధలతో కోలవాలి. మరి మనకు అంత్యకాలము సమీపించినఫ్ఫుడు అనగా వృద్ధాప్యకాలములొ ముందుపోవునది అందము,రూప లావణ్యాలు.దీనికి గుర్తుగా ద్రౌపది మరణము. ఆతరువాత పోవునది ఆరోగ్యము,లివర్ మొదలగునవి చేడిపోవటము.దీనికి ప్రతికగా అశ్వనిదేవతల పుత్రులు నకుల సహదేవుల మృతి.ఆతరువాత పోవునది ఇంద్రియాలు అందుకే ఇంద్రకుమారుడైన అర్జునుడు మరణించటము.అతరువాత  పోవునది శరీరములోని శక్తీ,బలము దీనికి ప్రతికగా వాయుపుత్రుడు శక్తికి ప్రతీక భీముడు మృతి.మరి స్వర్గాన్ని చేరింది ఎవరు విశ్వాసానికి  ప్రతికగా నిలచిన కుక్క,జీవునకు ప్రతికగా నిలచిన ధర్మజుడు.మరీ జీవుని రమ్మని కుక్కను వద్దంటే ? విశ్వాసములేని స్వర్గము ఎందుకు అని తృణికరించటమే భక్తి తత్వము.అందుకే సమవర్తి అయిన యమధర్మరాజు స్వర్గలోక ప్రవేశము కల్పించాడు.        

26, జూన్ 2012, మంగళవారం

కోతి - కోతి తోక - కధ





అనగ అనగా ఓ కోతి. ఈ సృష్టి లో వున్న కోతులా౦టి దైన దానికి వున్నఅధిక చపలత్వం వల్ల మనకు కధ వస్తువు అయినది.అన్ని కోతులకు వున్నట్లే దీనికి ఓతోక వున్నది. పాపం తోక గూడా దాని బాద్యత అది చేస్తున్నా మన కోతి గారికి తోకంటే కోపం, అసహనం.కారణం అది కోతి వెంట వదలకుండా వెంబడిస్తున్నది.దీనీతో కోతికి తోకను ఎలాగయినా వదిలించు కోవాలని దీక్ష బూనింది.మరి తోక లేక పొతే నిన్ను కోతిగా గుర్తు పట్టరంటే.ప్రక్క వాడి తోక లాంటిది తగిలించు కుంటా అని ఎదురు దాడి.ఇలా ఆగం ఆగం చేస్తుంది.దీనితో కోతికి తోకకు వైరం.ఈ అల్లరి కోతి అగాడల్ని గమని౦చిన ఇంకో వృద్ధ కోతి, దానిని పిలచి కారణం అడిగింది.నాకు నాతోక అంటే అసహ్యం గా వున్నది. దీనిని వదిలించు కోవాలని ఈ గోల తప్ప వేరు కాదు.
సరే, దానికి ఇది కాదు పధ్ధతి.నీవు నీ కున్న శక్తి కొద్ది ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకు దూకు ఈ దూకుడు లో నీ తోక వూడి పోతుంది. సమస్య తీరుతు౦ది.మాకు ఉప శమనం కలుగుతుంది.
ఈ సలహా విన్న కోతి ఇక తన జాతి బుద్ధి చూప నారంభించినది.దూకుడు,పల్టీలు,గెంతులు ఇలా అన్ని రకముల కోతి లక్షణాలు ఉధృతంగా చూపింది.అయినా లాభం లేదు కోతి తోక యధాతధంగా అలానే వున్నది, కాని సరైన జాగ్రత్త తీసుకోని కారణమున కోతి చెట్టు పైనుంచి పట్టు తప్పి క్రింద పడబోయింది.అప్పటి దాక కోతికి,తోకకు వైరం అయినా క్రింద పడితే దానితో పాటు తనకు అపాయమని తోక చెట్టు కొమ్మను చుట్టుకొని గట్టిగ పట్టుకొంది.
దీని తో కోతి క్రింద పడి అపాయం నకు గురి కాకుండా రక్షింప బడినది.
ఈ దెబ్బకు కోతికి తోక విలువ తెలిసి వచ్చింది.ఇప్పుడు దానికి తోక అందమయినది,విలువైనది.




ఇంతకు కోతి ఎవరంటారు.కోతి- పురుషుడు.   తోక   -  వాడి భార్య.    చపలత్వం -  పర  స్త్రీ  వాంఛ.

    

ఉపచయాలు - భోజనాల్లో నంజుడు కార్యక్రమం - అప్పడాల మామ్మ గారి కమ్మని కధ - ఓ జీవన సత్యం!

 అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ను ఆశ్రయించుకోనీ ప్రాణము  అన్న రస రూపములో   జీవాత్మగా జీవుడులో వుంటుందని వేద మంత్రం,ఉపనిషత్తు వాక్యం.అసలు ఈనాడు భోజనం అంటే ఏదో అతికాము గతికాము అన్నట్లు గా చేస్తున్నారు కాని అది ఒక తపస్సులా ఇష్టపుర్వకముగా చేయటములేదు.పిల్లల కారేజల్లో ఏవిఎవో సర్ది పంపుచున్నారు.
అసలు తెలుగు వాడి భోజనములో వున్నన్ని అధరవులు మరి ఎవరి భోజనములో వున్నాయి. భక్ష్యాలు,భోజ్యాలు,చిత్రాన్నాలు,పొడులు,రసాలు,ఇలా మరి కొన్నిటి తో పాటు ఉపచయాలు.
ఉపచయమంటే భోజనం తో పాటు తీసుకునే ప్రక్క పదార్ధాలు. చయనము అనగా నమలటము. అనగా అప్పడాలు ఓడియాలు లాంటి వాటితో పాటు ఇంకొన్ని పరిచయము.

అప్పడం అంటే మన ప్రాంతములో మినప అప్పడాలు,కంది అప్పడాలు,పెసర అప్పడాలు ఇలా చేస్తారు. పంజాబీలు మినప అప్పడాలు కు కారం బదులు మిరియాల పొడి వాడతారు దానితో ఇవి కొద్దిగా చుర్రుమనే కారము.అప్పడం ను నూనెలో వేపే కన్నా నిప్పులపై కాల్చి దానికి ఇంత నేతి చుక్క తగిలించి తినాలి.
అప్పడం అంటే పూర్వకాలం లో పెళ్లికి ఓ మహాయజ్ఞము.పదిమంది ఆడంగులు కలసి చేసే ఓ ముచ్చట.

అప్పడం అంటే మా ఉరిలో ఓ మామ్మగారు గుర్తుకొచ్చారు. మామ్మగారు పూర్వసువాసిని. ఆమెకు ఓ కొడుకు.ఇతనికి పెళ్లి చేసింది కాని'ఎందువలనో కోడలికి ఈమెకి సరిపడలేదు.ఇంటి ప్రక్కనే తనదైన గదిలో కూర్చొని ఉదయము నుంచి సాయoత్రం దాక అలా అప్పడాలు చేస్తుంటుంది.ఒక్కటి 10 పైసలు అనుకుంటా.అలా అది ఓ వ్యాపకము మాత్రమే.పై అవసరాలకు ఆమె కున్నపొలము ద్వార వచ్చే పంట ఆదాయం దైవకార్యాలకు,మిగతా గృహ అవసరాలకు ఉపయోగించేది.ఇది కాదు విశేషము  వచ్చే పోయే ప్రతి ఒక్కరు ఆమె బంధువులే ఓరే నారాయణ మీ అమ్మాయిని పురిటికి తెస్తున్నవా!సుబ్బులు మీ అల్లుడు మీ అమ్మాయిని సరిగా ఎలుకుంటున్నాడ!రాముడు చేలో కలుపు తీసి నారు మడి సిద్ధము చేశావా! లక్ష్మినారాయణ ఇల్లు గడుస్తున్నదా!పంతులుగారు అమావాస్య ఎప్పుడు ఏకాదశి ఎప్పుడు ఇలా అన్ని రకాల ప్రశ్నలతో చిన్న పెద్దా అందరిని పలకరించేది.సత్రములో ఏదైనా దైవ కార్యమయితే ఈమె ముందలగా అన్ని తెప్పించి ముత్తయుదవుల గురించి ఎదురు చూసేది! త్వరగా రండమ్మ నేను వస్తువులు సిద్ధము చేయగలను కాని ఆపనులకు నేను పనికి రానుకదమ్మ అనేది. మీరు త్వరగా వస్తే త్వరగా మీ ఇంట్లో పిల్లలకు,భర్తలకు సమయానికి వెళ్ళగలరు అనేది. అప్పుడప్పుడు ఎవరన్న ఆలస్యముగా వస్తే ఏమిటి మా అబ్బాయిని కొంగున కట్టావా,మాతమ్ముడినీ అడిస్తున్నావా,పిల్లలకు పాలు ఇస్తున్నావా అని మేలమాడేది.కొంత మంది సిగ్గుతో పో అత్తా అని అంటే,మరి కొంతమంది ప్రక్కకు చేరి ఈ ముసలిది చావదు అని అనే వాళ్ళు.ఈ విషయము గమనించిన నేను ఆమెను ఎందుకు మామ్మ నీవు ఇలా విళనీ నీవు పలకరిస్తావు అని అడిగితె.
ఓరే నాన్న! నేను అందరిని పలకిరిస్తానా పూట గడవని నారాయణ కూతురుని పురిటి కి తేవటము కష్టము రా!హంగు ఆర్భాటం వున్న సుబ్బులు కూతురు ను అల్లుడు ఏలుకోలేదని అందరికి చెప్పలేదు అలాగని గుండెల్లో దాచుకోలేదు!విత్తనాలకు అప్పు తెచ్చే రాముడు కలుపుకు తీసాడాలేదా అప్పు పుట్టిందాలేదా అని విచారణ!సంపాదన తక్కువ బాధ్యతలు ఎక్కువ వున్న లక్ష్మినారాయణ మొహమాటస్తుడు,అభిమానస్తుడు ఇల్లు సరిగా గడవటము లేదని చెప్పుకోలేడు!చెంబు పట్టుకొని ఊరిలోకి వచ్చే పంతులుగారు కి మంచి చెడు అడిగి ఓ గుప్పెడు బియ్యం ఇస్తే పూట గడుస్తుందిరా. అయిన  ఉచితముగా తీసుకోలేదని నేను ఆయినకు ధర్మం చేయలేదని భావన.కష్టం లో వున్న వాడికి ఆసరా దుఃఖం లో వున్నవాడికి ఓదార్పు అవసరము రా.ఈ పలకరింపు వల్ల వాళ్ళ గుండేల్లొ భారం కొద్దిగ తగ్గిస్తాను,కంట్లొ వున్న నీటి చుక్కను తుడుస్తాను.అంతకు మించి వేరు ఎమి చాతకాని పాతకాలపు ముసలి దాన్ని రా!నేను చేయలేక పోయినా చేసేవారు దగ్గరికి పంపటానికి తప్ప వేరు కాదు.
ఇక సత్రం లో  ఆడవారిని విచారణ అంటావ అది ఆడవారికి మాత్రమే అర్ధమయ్యేది, వాళ్ళ కాపురం సరిగా సాగుతుందా లేదా అని అరా!నేను వాళ్ళను తొందరగా వచ్చి తొందరగా ముగించు కొని వెళ్ళమనేది వాళ్ళ పిల్లాపాప లతో ముద్దుముచ్చట్లతో సరదాగా వుంటే నాకు కన్నుల పంట కడుపు నిండు రా!
ఇక వాళ్ళందరూ నన్ను అంటున్నారంటవా, పోనిలే ముసలి దానిని కాటికి కాళ్ళు జాపుకొని వున్నా,ఉరు పొమ్మoటుంది కాడు రమ్మoటుంది. వయస్సు రీత్యా వాళ్ళు నా పిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళు నన్ను అన్నా భరించాలి, నేను అంటే శాపం గా మారి వాళ్ళు కష్ట పడితే నాకు బాధ. వాళ్ళు చల్లగా వుండి ఈ ముసలి దాని దగ్గర నాలుగు అప్పడాలు కొంటే నాకు జీవితము సాగుతుంది దేవుడు నాకు ఈ పని ఒక్కటే నేర్పాడు.పైవాడు పిలేచెంత వరకు ఏదో కాలక్షేపం.
 మామ్మ గారిది వేదాంతం,జీవనసత్యం,చాదస్తము,వ్యాపారరహస్యము,సాoఘిక జీవన మర్మము అన్ని కలిపిన ఓ నిజం!మామ్మగారు చదువు కోలేదు చదువింది జీవితంను.


చూసారా ఇదే ఉపచయం పొస్ట్ ను వదిలి ప్రక్కదారి పట్టాము.
ఇంకొన్ని నంజుడు కార్య క్రమాలు.వేడివేడి అన్నం లోకి అప్పడాల పిండి ముద్ద నేతితో కలిపి తినాలి.
పప్పులొకి చల్లమిరపకాయలు,వాము మిరప కాయలు.వేడి వేడి పప్పు ఆవకాయ అన్నం లోకి మీగడకాని,వెన్నకరగ పెట్టిన అడుగున తేలిన గొదారికాని భలె వుంటాయి.పప్పులొకి వాము మిరపకాయ తినమనేది. పప్పు కొద్దిగ అరుగదల తక్కువ వాళ్ళకు వాము మిరపకాయతో ఆ ఇబ్బంది పొతుంది అని.అలానే చింతకాయ పచ్చడి లోకి,గోంగూర పచ్చడిలోకి ఉల్లిపాయ.చింతకాయ పులుపు వలన, గొంగూర దానిలొ వున్న ధాతువుల వల్లన వేడి జనిస్తుంది చలవ కి ఉల్లిపాయ.
ఇక వడియాలది ఓ ప్రత్యేక చరిత్ర. చాలా రకాలు వున్నాయి.సగ్గుబియ్యం,పిండి వడియాలు, బూడిదగుమ్మడి వడియాలు,మినప పొట్టు వడియాలు,చక్రాల వడియాలు ఇల అనేక రకాల వి మనకు మాత్రమే వున్న ప్రత్యేక ఆహర పదార్ధం.
ఇవి కాకుండా గుంటూరు లోనె దొరికెవి గరుగ్గాయలని  నిమ్మరసములొ నాన బెట్టి తినాలి చాలా బావుంటాయి.మామిడి అల్లం కొమ్ములను చక్కగ చెక్కి సన్నని ముక్కలుగా తరిగి పచ్చి మిర్చితో కలిపి నిమ్మరసములొ నాన పెట్టి తిన్న బావుంటుంది.ఇంకో రకము  శ్రావణ మాసములొ  రావటము  మొదలు అవి మారేడు కాయలు పిందలను బాగా కడిగి ఒకటి పదిసార్లు కడిగి నిమ్మరసములొ నానపెట్టి తింటే ఎటువంటి క్రిమి కీటకాలు  పొట్టలొ వున్న మొత్తము క్లియర్.ఈ మధ్య కాలములొ కేరట్ ముక్కలను కూడా నిమ్మ రసములొ నానపెట్టి స్వీకరిస్తున్నారు.
ఇవి కాకుండ భొజనములొకి బజ్జీలు, కారబ్బుంది,మిక్చరు,చక్రాలు,చెక్కలు లాంటివి కుడా తినే వాళ్ళు వున్నారు.
ఇన్ని చెప్పిన తరువాత పెరుగులోకి అని మీరు అడిగితే ఆవకాయ ముక్క,అరటి పండు,మామిడికాయ ఇలా ఎన్నొ ఉపచయాలు.

మరి మీ తాలుకు ప్రత్యేకమైన రుచులు తదితరాలు ఉంటే తెలపండి.              




25, జూన్ 2012, సోమవారం

"ఏక పత్ని "వ్యవస్థ ఎలా ఎర్పడినది?


మానవ వికాసాన్ని అలా పరిశీలనతో చూస్తే  నేటి  సహజత్వాలకి,అసహజత్వాలకు ఆనాడే ఎలా పాదుకొల్ప  బడినదో మీకు అర్ధము అవుతుంది.నేడు చాల దేశాల్లో అమలులొ వున్న ఏకపత్ని వ్యవస్థకు ఆనాడు ఎలాగు ఎందుకు రూపకల్పన చేయబడినదో కొంత తేలికగా అర్ధమయ్యే ప్రయత్నము చేస్తాను.

ఆనాటి వ్యవస్థలో మాతృస్వామ్య వ్యవస్థ గా వున్నది. ఈ సమయములో స్త్రీ తనకు నచ్చినoత మంది పురుషులు లతో తాను జీవించేది.ఈ వ్యవస్థను నేటి శాస్త్ర ప్రకారము polyandry గా పిలుస్తారు. ఈ బహు భర్త వ్యవస్థ వలన పుట్టిన సంతానములో ఒక్కొక్కరు ఒక్కో విధముగా వుండే వాళ్ళు. ఇది మొదట్లో సాధారణముగా వున్నా శతాబ్దల తరువాత అనగా స్త్రీ భాగస్వామ్యము నుంచి వ్యక్తి గత ఆస్థి గాను, భోగ,చిహ్నంగా మారటానికి మధ్య అనేక మార్పులకు లోనయింది.
మొదటిగా వున్న వ్యవస్థలోని పురుషులు ఆనాటి స్త్రీ పొందు కోసము తపించే వాళ్ళు దీనికిగాను వాళ్ళల్లో వాళ్ళు అనేక పోరాటాలకు దిగేవాళ్ళు.ఈ విధంగా పురుషుల్లో సఖ్యత లేక పోవటము ఒక కారణము అయితే సంతానములో కూడా సఖ్యత కుదిరేది కాదు.వివిధ పురుషుల వల్ల ప్రభవించిన సంతానము, తల్లి ఒక్కరయినా తండ్రులు వేరు కావటము వలన వివిధ రంగు రూపంలో ఉండటముతో వారిలో వారికి ఆనేక అభిప్రాయ బేధాలు వచ్చేవి.తద్వార గణాల్లో అశాంతి,పోరాటాలు నిత్యకృత్యమయ్యాయి.ఇలా చాల రోజులు సాగిన తరువాత   శ్వేతకేతు అనే వాడు దీనికి కారణము బహుభర్త వ్యవస్థ అని, దీనిని రద్దు పరచి ఏకపత్ని వ్యవస్థను ప్రారంభించాడు. 

ఈ విషయము మనకు రాహుల్ సాంకృత్యాయన్ తన గ్రంధం ఓల్గా సే గంగ లో తెలుపుతాడు.
 అసలు ఈ శ్వేతకేతు ఎవరా అని అరా తిస్తె ఇంకొన్ని విషయాలు బయటపడ్డాయి.అరుణఋషి కుమారుడు గౌతముడు గాను ఇతని పుత్రుడు శ్వేతకేతు గాను ,శ్వేతకేతు  అరుణి కుమారుడు గాను మరో కధలొ వివరించ బడినది.ఇది రామక్రిష్ణ మఠం వారి ఉపనిషత్కధలు అన్న దానిలో ఇది వున్నది.
శ్వేత కేతు తండ్రిలానే అచారవంతుడు. ఒక నాడు తమ ఆశ్రమమునకు అతిధిగా వచ్చిన మరో ఋషికి అతిధి సత్కారలతో పాటు గృహస్తు భార్యను కూడా అతిధికి సమర్పించే సాంప్రదాయమును అనుసరించి అతిధి శ్వేతకేతు తల్లితో భొగమును  అనుభవిస్తుంటాడు.  ఇది గమనించిన శ్వేతకేతు అవమానముతో వుడికిపొయి ఏకపత్ని వ్యవస్థను ప్రారంభించాడు.


ఈ బహు భర్త వ్యవస్థ పై చార్వాకులు తమదైన అలోచన చేశారు. వీళ్ళు దేవుడిని నిరసించినా శాస్త్రీయ ఆలోచన లకు ఓ ఉదాహరణ గా తీసుకోనే ప్రయత్నం చేశారు. వీళ్ళు పార్వతినీ మాతృస్వామ్య వ్యవస్థలో ఓక స్త్రీగా ఎంచి ఆమె ఆనాటి బహు భర్త వ్యవస్థలో భాగం గా వినాయకుడు,కుమారస్వామినీ కన్నదని వీళ్ళలో అభిప్రాయ బేధాల్లో భాగము గా శివుడు వినాయకుడు నీ చంపాడు అని వాళ్ళ ఆలోచన.

ఇన్ని గందరగోళానికి కారణమయిన శ్వేతకేతు అనే పదము లోనే పూర్తి రహస్యము దాగివున్నది.



శ్వేతము అనగా తెలుపు అని, కేతువు సర్ప రూపములొ వుంటాడు.మరి పురుషుడి వీర్యములోని శుక్ర కణాలు తెల్లగ పాముల కదులుతు స్త్రీ గర్భములోని బీజములను చేరి  శొణితమయి పిండముగా మారి తదుపరి శిశుజననమునకు కారణమవుతుంది శుక్రకణాలు కాబట్టి ఇవి బీజాలు.స్త్రీ క్షేత్రము మాత్రమే అని పరిశీలించిన వాళ్ళు .క్షేత్రములొ  రకరకాల బిజాల వల్ల వివిధ రకాల వర్ణసంకర  జాతులు ఏర్పడుతున్నాయనే కారణముతో పాటు మెల్లగ సమాజము పితృస్వామ్య వ్యవస్థకు అడుగుపెట్టే దిశలో ఏక పత్ని వ్యవస్థ మాత్రమే ఇటువంటి సమస్యలకు సమాధానమని ఎంచి అది ప్రవేశ పెట్టారు.
 
ఇక బహు పత్ని వ్యవస్థ అంటారా జాతుల దాడులు, పొరాటాలు వెరశి బానిసత్వాలు తదుపరి భొగత్వాలు ఇన్ని కలిస్థే సమాధానము వస్తుంది.

ఇంగ్లిష్ లొ ఏకపత్ని వ్యవస్థను మోనోగమిగాను, బహుపత్ని వ్యవస్థను పాలిగమి గాను వ్యవహరిస్తారు. 


         

24, జూన్ 2012, ఆదివారం

పంచభూతాలు శరీరంలో ఏవిధముగా మార్పు చేందాయి.


మనము దాదాపు అనేక ప్రవచనాలలో,పురాణలలొ,కధలలొ వింటూ వస్తాము ఈ దేహము పంచభౌతిక శరీరము. పంచభూతాలు అంటే మనకు తెలుసు. కాని శరీర నిర్మాణములో ఎవిధముగా పాలుపంచుకున్నాయి,ఎ జీవక్రియలు చేస్తున్నాయి, అవి ఎవి ఉత్పత్తి చేస్తున్నాయి అన్న వివరణ చాలమందికి తెలియదు.యోగ, ధ్యాన తరగతులలో ఇవి బొధన జరుగుతుందో లేదో. ఈ కాలములో ఈ రంగములో కూడా అన్ని ఆధునిక పద్ధతులు,మార్గాలు,క్రియలు వచ్చాయి.అంతా నవ్య ధోరణులు.విరు వారి మార్గ అనుసరుణలకు వారిమార్గము మాత్రమే బొధిస్తున్నారు.వాటి పట్ల ఆసక్తీ వున్న వారికి ఉద్దేసించినది ఈ పొస్ట్.    


ఆకాశము,వాయు,అగ్నీ,జల,పృధ్వి మొదలగునవి పంచభూతాలుగా మీకు తెలిసు.వీటిలొ ఓక్క దానిని తీసుకుని రెండు అర్ధభాగాలుగా చేసి, మొదటీ భాగము శరీరములో ఆతత్వన్ని ప్రతిబింబించే భాగాలుగాను.రెండవ అర్ధభాగము మరల 4 భాగాలుగా విడిపొయి ప్రతి ఒక్క భాగము మిగతా నాలుగు తత్వాలలో ఒక్కో తత్వముతో  కలసి శరీరములో భాగాలుగా మారి అనేక విధులు నిర్వర్తిస్తున్నాయి.    
పంచభూతాలు స్థూలశరిరములొ ఏవిధముగా ఏర్పడినాయో వివరము తెలుసుకుందాము.

పృధ్వి భూతము యొక్క స్థూల భాగములు : పృధ్వి 2 భాగములయి, మొదటి సగభాగము తన నిజ అంశనందుండి "అస్తులు" గా మరుతుంది
పృధ్వి రెండవ భాగము మరలా 4 భాగములై 1)ఆకాశముతో కలసి నఖ,రోమములు 2)వాయువుతో కలసి చర్మము  3) అగ్నీ తో కలసి నరములు 4) జలముతో కలసి మాంసముగా మార్పుచెందుతుంది.

జలభూతము యొక్క స్థూలభాగములు : జలము 2 భాగములయి మొదటి భాగము తన నిజ అంశనందు వుంది శుక్లముగాను. జలము యొక్క రెండవ భాగము మరలా 4 భాగములయి 1)ఆకాశముతో కలసి చొల్లు గాను, 2) వాయువుతో కలసి చెమటగాను,3) అగ్నీ తోకలసి మూత్రము గాను 4)పృధ్వితో కలసి రక్తమాయేను. 

అగ్ని భూతముయొక్క స్థూలభాగములు : అగ్ని 2 భాగములయి మొదటి భాగము తన నిజ అంశనందు వుండి ఆకలి గా మారుతుంది. రెండవ భాగము మరలా 4 భాగములయి 1)ఆకాశముతొకలసి నిద్రగాను 2) వాయువుతో కలసి దప్పికగాను 3)జలముతో కలసి సంగమముగాను  4) పృధ్వితో కలసి ఆలస్యమాయెను 

వాయువు భూతము యొక్క స్థూలభాగములు : వాయువు 2 భాగములయి మొదటి భాగము తన నిజ అంశనందు వుండి పరుగు గాను రెండవభాగము మరలా 4 భాగములయి 1) ఆకాశముతో కల్సి దాటుట గాను 2)అగ్ని తో కలసి తిరుగుట గాను 3)జలముతో కలసి చలనముగాను 4) పృధ్వితో కలసి సంకోచము గాను మార్పు చెందాయి.

ఆకాశభూతము యొక్క స్థూలభాగములు : ఆకాశము రెండు భాగములయి మొదటి భాగము తన నిజ అంశనందు వుండి శోకముగాను మిగిలిన రెండవ భాగము మరలా 4 భాగములయి 1)వాయువుతో కలసి కామముగాను 2) అగ్నీ తో కలసి క్రోధముగాను 3) జలముతో కలసి మోహముగాను 4) పృధ్వితో కలసి భయముగాను మార్పు చేందాయి.



23, జూన్ 2012, శనివారం

శ్రీశ్రీ గారి గురించి ఉచిత పత్రిక నిరంతరము కావాలంటే మీరు ఏమి చేయాలి

శ్రీశ్రీ సాహితి ప్రపంచములో సృష్టించిన మార్గము దానిపై అయిన గొప్పతనము చెప్పటం చర్వితచర్వణం అవుతుంది తప్ప వేరు కాదు.ఎందరికో ఆరాధ్యుడు గా వున్నారు. వారి సాహితి కృషి పై నిరంతర చర్చలు,అనేక వ్యాసాలూ ప్రచురిస్తూ అది ఉచితముగా అందరికి అందచేస్తున్నారు.
విజయవాడ నగరములో శ్రీశ్రీ సాహిత్య నిధి అనే సంస్థను శ్రీ సింగంపల్లి అశోక్ కుమార్ గారు నెలకొలిపి ఈ సాహితి సేవ చేస్తున్నారు. మీకు కావాలన్న రు 100 లను  పోస్టేజి నిమిత్తము పంపి మీ పేరు నమోదు చేసుకుంటే మీకు ప్రతి మూడు నెలలకు మీ ఇంటి ముందుకు పత్రిక నేరుగా వచ్చిచేరుటుంది.
అన్ని వివరాలకు
కన్వీనర్
శ్రీశ్రీ సాహిత్య నిధి
305,ప్రగతి టవర్స్
మారుతినగర్
విజయవాడ
520 004.
 email : srisri_sahityanidhi@yahoo.com.
Fax : 6697375
phone : 6617375
mobile : 98485 04649, 92462 77375.


ఎలాగు ఇక్కడదాక మీరు వొచ్చినందుకు మీకు శ్రీశ్రీ సిప్రాలి కవితలతో ఓ మంచి అనుభూతి కలిగిద్దాం

వెయ్యి పడగలు
లక్ష పిడకలు
లక్క పిడతలు
కాగితపు పడవలు
చాదస్తపు గొడవలు
----------------------------------------------------------------------------------------------
ముష్టి మైధునంలో
సవ్య సాచివిరా నా కొడకా
నాలుగు గోడల మధ్యా
రహస్యంగా ఏమిటాపని
నాలుగు వీధుల కూడలి వద్ద నిలబడి
నలుగురి మధ్య
నిరూపించుకో నీ మగతనం
ప్రదర్శించు నీ వ్యక్తి స్వాతంత్ర్యం
ఆంధ్రుల జాతీయ పత్రికల
సంపాదకియాలకు
ఆదర్శప్రాయంగా...
---------------------------------------------------------------------------------------------
కొంతమంది కుర్రవాళ్ళు
పుట్టుకతో వృద్ధులు
పేర్లకి పకిర్లకి పు
కార్లకి నిబద్దులు

 నడిమి తరగతికి చెందిన
అవగుణాల కుప్పలు
ఉత్తమొద్దు రాచ్చిప్పలు
నూతిలోని కప్పలు

తాతగారి నాన్నగారి
భావాలకు దాసులు
నేటి నిజం చూడలేని
కీటక సన్యాసులు

నిన్నటి లీడరు ధోక
నేడు చూడజాలరు
కన్నులున్న జాత్యంధులు
కాకినైనపోలరు

వీళ్ళకి కళలన్నా రస
మన్నా చుక్కెదురు
గోలచేసి ఆరవడమొక
టే వాళ్ళేరుగుదురు

కొంతమంది యువకులు రా
బోవు యుగం దూతలు
పావన నవజీవన బృం
దావాన నిర్మాతలు

బానిస పంధాలను తల
వంచి అనుకరిoచరు
పోనీ అని అన్యాయపు
పోకడలు సహించరు

వారికి నా ఆహ్వానం
వారికి నా సాల్యూట్
కడలి తరగ లాపెదవా
భడవా ఒకాన్యుట్



22, జూన్ 2012, శుక్రవారం

"25 బాలగేయాలు!" చిన్ననాటి మధురస్మృతులు! -ఓక్కసారి మీ బాల్యాన్ని పలకరిస్తారా!


శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసః ఫణి అని సామెత.సంగీతానికి అందరు అంతలా దాసులవుతారు.పాలు తాగని బుజ్జాయి అమ్మజొలపాటతో కమ్మగా బొజ్జనిండుగా పాలుతాగి కిలకిల నవ్వుతాడు.హాయిగా ఆడుకుంటాడు.ఇలా శిశువుకు తల్లికి మధ్య స్తన్యం జీవమయితే, పాట నాదం శృతి రూపకముగా వుండే ఓక అనిర్వచనీయ మధురమయిన రసానుభూతులకు నిలయమయిన చక్కని, కమ్మనైన బంధం. ఇలా జోలపాటకు అమ్మ మాటకు, అమ్మతో ఆటకు అలవాటు పడ్డ శిశువుకు తల్లి, ప్రాయము వస్తున్న కోద్ది చిన్న చిన్న పదాలతో ప్రకృతిని,మంచిని,చెడును,అలవాటులను నేర్పుతూ,బిడ్డడిలో ఉత్సాహాన్ని, ఉత్సుకతను, అలోచనను రేకెత్తిస్తూ సహజముగా శిశువుల్లో వున్న కొత్త విషయాలు తెలుసుకోవాలనే తృష్ణను తల్లి పాటరూపముగా బాలగేయాలుగా శిశువును ఙ్ఞానము తో పరిపుష్టము చేసేవి బాలగీతాలు.

 ఇప్పుడు మధ్య వయస్సులో వున్న తరాలకు ఇవి అనుభవమే. అనాటి పిల్లలు అమ్మా అదేమిటి అన్నారు! తరువాత పిల్లలు వాట్ ఈజ్ దట్ డాడ్ అన్నారు! నేటి పిడుగులు ఇట్ ఈజ్ దట్ గ్రాండ్ పా అని అంటున్నారు.కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గుతున్న కోద్ది పిల్లల మీద  ఆశలు ఎక్కువై, తల్లి తండ్రుల్లో పిల్లలో వత్తిడి ఎక్కువై సహజసిద్ధముగా  ప్రకృతి సిద్ధముగా వుండే బంధములో ఎదో ఒక అసహజత్వము గోచరిస్తుంది.అమ్మ అనే కమ్మదనము, నాన్న అనే గౌరవాలు మమ్మి,డాడ్ ల మోజులో కరిగి అవిరయిపొతున్నాయి. ఇంకా తడి ఆరని మనస్సులకోసము,మీ బాల్యాన్ని మీరు ఒక్కసారి గుర్తుచేసుకోని మీ అమ్మను మీతో ఆడుకున్న సొదర,సోదరిమణులను,స్నేహితులను ఙ్ఞాపకము చేసుకుంటారని భావిస్తున్నాను.  

  ఏడవకు ఏడవకు వెఱ్ఱి పాపాయి    (1)
ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు
నీలాలు కారితే నే చూడలేను
పాలైన కారవే బంగారు కళ్ళు!

దాగుడు మూత దండాకోర్           (2)
పిల్లి వచ్చే ఎలుకా చోర్
ఎక్కడి దొంగలు అక్కడనే
గప్ చిప్ సాంబార్ బుడ్డి!

బొమ్మరిల్లు కట్టుదాం                (3)
బొమ్మలాట లాడుదాం
బొమ్మలతో చుట్టు చేరి
భలే బాగ పాడుదాం

వంకర టింకర ఓ                    (4)
వాని తమ్ముడు సో
నల్లగుడ్ల మి
నాలుగు కాళ్ళ బే

వానా వానా వల్లప్ప            (5)
చేతులు చాచే చెల్లప్ప
తిరుగు తిరుగు తిమ్మప్ప
తిరుగలేను నరసప్ప

ఏనుగు ఏనుగు నల్లన         (6)
ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు
ఎంతో చక్కని దేవుడు.

బోసి నవ్వుల పాపాయి       (7)
చిలుక పలుకుల బుజ్జాయి
తప్పటడుగుల పాపాయి
బులి బులి నడుకల బుజ్జాయి
అల్లరి ఇంక అపొయి

ఒకటి రెండు ఒప్పుల కుప్ప       (8)
మూడు నాలుగు ముద్దుల గుమ్మ
ఐదు ఆరు అందాల భరిణ
ఏడు ఎనిమిది వయ్యారి భామ
తొమ్మిది పది బంగారు బొమ్మ

చందమామ రావె - జాబిల్లి రావె     (9)
కొండెక్కి రావె - కోటి పూలు తేవె
బండెక్కి రావె - బంతి పూలు తేవె
అన్నింటిని తెచ్చి - మా బుజ్జాయి కియ్యవె

పిల్లీ పిల్లీ ఎక్కడికే                       (10)
ఎలుకల వేటకు వెళుతున్నా
బల్లీ బల్లీ ఎక్కడికే
ఈగల వేటకు పోతున్నా
అన్నం ముద్ద ఎక్కడికే
మీ బుజ్జాయి నోట్లోకి పొతున్నా!


ఉయ్యా లోయి                       (11)
జంపాలోయి
కోత్త కుండోయి
కామెర్లోయి
వెన్నెల్లోయి
మల్లెలోయి
చల్లంగా వూగే
అమ్మాయిలోయి!

చిట్టి చిలకమ్మ                  (12)
అమ్మ కొట్టిందా
తోట కెళ్ళావా
పండు తెచ్చావా
గూట్లో పెట్టావా
గుటుక్కు మింగావా

పాపా పాపా రావమ్మా        (13)
పలక బలపం తేవమ్మా
అ ఆ ఇ ఈ రాసిస్తా
చక్కగా నీవు దిద్దుమ్మా
చల్లగా నీవు ఎదుగమ్మా

తారంగం తారంగం           (14)
తాండవ కృష్ణా తారంగం
వేణునాధ తారంగం
వెన్నల దొంగ తారంగం
మువ్వల చెన్నా తారంగం
గువ్వల కన్నా తారంగం


గుడు గుడు గుంజం - గుళ్ళో రాగం     (15)
పాముల పట్నం - పడిగే రాగం
పెద్దన్న గుర్రం - పెళ్ళికి పొతే
చిన్నన్న గుర్రం - పట్నం పొతే
మామా గుర్రం - అడవికి పొతే
మా నాన్న గుర్రం - మా ఇంటికి వచ్చె!


గుమ్మాడమ్మా గుమ్మాడి               (16)
ఆకులు వేసింది గుమ్మాడి
పూవులు పూసింది గుమ్మాడి
పండుల్లు పండింది గుమ్మాడి
చూడ చక్కాని గుమ్మాడి
మా చిన్ని కన్నా గుమ్మాడి!


కాళ్ళా గజ్జ - కంకాళమ్మా             (17)
వేగుల చుక్కా - వెలగ మొగ్గ
మొగ్గ కాదు - మొదుగ నీరు
నీరు కాదు - నిమ్మల బావి
బావి కాదు - బచ్చల కూర
కూర కాదు - గుమ్మడి పండు
పండూ కాదు - పాపాయి కాలు
కాలు తీసి - కడగా పెట్టు!


అట్ల తద్దోయి - ఆరట్లోయి               (18)
ముద్ద పప్పొయి - మూడట్లోయి
పడకల కింద - పిడికెడు బియ్యం
పిల్లల్లారా - జల్లల్లారా
రారరండోయి రారరండోయి
పీటల కింద - పిడికెడు బియ్యం
పిల్లల్లారా - జల్లల్లారా
రారరండోయి రారరండోయి


చుక్ చుక్ రైలు వస్తొంది             (19)
దూరం దూరం జరగండి
ఆగినాక ఎక్కండి
జోజో పాపా ఏడవకు
నాన్న రైల్లొ వస్తారు
చాక్లెట్ నీకు తెస్తారు

 బుఱ్ఱు పిట్ట -  బుఱ్ఱు పిట్ట         (20)
     తుఱ్ఱుమన్నది
పటమటింటి కాపురమ్ము
    చేయనన్నది
అత్త తెచ్చిన కొత్త చీర 
  కట్టనన్నది
మామ తెచ్చిన మల్లె మొగ్గ 
   ముడవనన్నది
మగని చేత మొట్టికాయ
    తింటానన్నది.!

చెమ్మ చెక్క - చారడేసి మొగ్గ              (21)  
అట్లు పొయంగ - ఆరగించంగ
ముత్యాల చెమ్మ చెక్క - ముగ్గులేయంగ
రత్నాల చెమ్మ చెక్క - రంగు లేయంగ
పగడాల చెమ్మ చెక్క - పంది రేయంగ
సుబ్బారాయిడి పెళ్ళి - చూచి వద్దాం రండి
మా ఇంట్లో పెళ్ళి  - మీరంతా రండి !


కాకి కాకి కడవల కాకీ               (22)
కాకీ నోట్లో పండు పెడితే
పండు తీసుకెళ్ళి దిబ్బకిస్తే
దిబ్బ నాకు గడ్ది ఇస్తే
గడ్డి తీసుకేళ్ళి ఆవుకేస్తే
ఆవు నాకు పాలు ఇస్తే
పాలు తీసుకెళ్ళి అయ్యోరికి ఇస్తే
అయ్యోరు నాకు పాఠం చెబితే
మామ ముందు పాఠం చదివితే
మామా నాకు పిల్లనిస్తే
పిల్ల పేరు మల్లెమొగ్గ
నా పేరు జమిందారు.


వానల్లు కురవాలి  - వానదేవుడా       (23)
వరిచేలు పండాలి  - వానదేవుడా
నల్లా నల్లని మేఘాలు - వానదేవుడా
జల్లుగా కురవాలి -  వానదేవుడా
చేలన్ని పండాలి - వానదేవుడా
చెఱువులన్నీ నిండాలి - వానదేవుడా
కరువంతా పోవాలి - వానదేవుడా
గాదెలన్ని నిండాలి - వానదేవుడా
మా అక్క పెళ్ళి  -    వానదేవుడా
గోప్పగ చేయాలి -వానదేవుడా !


ఇంతింత దీపమ్ము ఇల్లెల్ల వెలుగు       (24)
మాడంత దీపమ్ము మేడలకు వెలుగు
గోరంత దీపమ్ము కొండంత వెలుగు
గోపాలకృష్ణయ్య గోకులము వెలుగు
మేఘాన జాబిల్లి ఊరంతా వెలుగు
చక్కన్ని చదువు బ్రతుకంతా వెలుగు
మా చిన్ని బుజ్జాయి మా కళ్ళ వెలుగు!.


కొండాపల్లి కొయ్య బొమ్మలు          (25)
నీకొ బొమ్మా నాకో బొమ్మా
నక్కాపల్లీ లక్క పిడతలు
నీకొ పిడత నాకో పిడత
చెన్నాపట్నం పూసల గాజులు
నీకొ జత నాకొ జత
నూజీవీడు మామిడి పండ్లు
నీకొ పండు నాకో పండు
ఇస్తానుండు తెచ్చే దాక
చూస్తూ వుండు ఇచ్చేదాక.


ఇంకా చాలా వున్నాయి మరొక్కసారి ఇంకో సదర్భములో తెలుపుతాను అప్పటిదాక.

మీకు నచ్చిన మీ చిన్ననాటి అనుభవాలతో ఓ చిట్టి కామేంట్!
నచ్చలేదా ఎమిటో వీడి పిచ్చి అని నవ్వండే!











21, జూన్ 2012, గురువారం

పూతన ఘట్టము ద్వారా వ్యాసులవారు ఏమి సూచించారు ?

వ్యాసులవారు భాగవతములో కృష్ణలీలుగా ఎన్నో దివ్య ఘట్టాలను వర్ణించారు.సాధారణ పాఠకులకు అవి లీలావైభవాలుగా కనిపించినా అధ్యాత్మిక తత్పరులకు అవి నిగూఢ అధ్యాత్మిక సుగంధరహస్యాలు వెదజల్లె పుష్పాలుగా అభివర్ణిస్తారు.అటువంటిదే పూతన కధ దీని అంతారార్ధము ఓక్కసారి పరిశీలించండి.

 నందుని ఇంట కృష్ణుడు బాలునిగా పెరుగుతున్నాడు. యశోద కన్నయ్యను చూసి సర్వము మరచి పొతుంది.ఆబాలుని ముగ్ధమనొహరత్వానికి పరవశించిపొతుంది.కృష్ణుడు గోకులములో ప్రవేశతదాదిగా అనేక శుభశకునాలు చూపుతున్నాయి. గోకులములోని అందరి ఇంట పాడి సమృద్ధిగా ఓకటికి పదిరేట్లుగా వున్నది. దూడలు సంతుష్టిగా త్రావినాకూడా ఆవులు ఇంకా పాలు నిరంతరధారలుగా స్రవిస్తున్నాయి.గోకులము మొత్తము కాలముకాని కాలమయినా వసంత శోభ వెల్లివిరుస్తుంది.కొయిలలు,రామచిలుకలు తమ ధ్వనులతో ఆశ్రమవాతావరణాన్ని తలపిస్తున్నాయి.క్రూరమృగాలు కూడా సాధుజంతువుల్లా ప్రవర్తన.ప్రజలు ఓక్కసారిగా ధర్మనిరతిలో మునిగిపొయారు.
గోకులములో ఈ విధముగా వుంటే మధురలొ కంసుడు ఇందుకు విరుద్ధముగా యోగమాయ ద్వారా దేవకి అష్టమగర్భసంజాతుడు సలక్షణముగా వున్నాడు మృత్యువై నీవద్దకు వస్తాడు అని తెలపటముతో క్షణక్షణము మృత్యుభయముతో కుచించుకుపొతున్నాడు.దీనితో ఎవరిని నమ్మక, చివరకు తన నీడను కూడా చూసి భయపడే స్థితికి చేరుకుని సర్వులకు నరకము చూపుతున్నాడు.  
 ఈ అష్టమ గర్భసంజాతుడు ఎవరో జాడ కనిపెట్టమని  మంత్రులకు చెప్పాడు. వారు వేగులను రాజ్యమంతా పంపగా సర్వము ఓకేలా వున్నా  నందగోకులములో మాత్రము అసాధారణ సిరి సంపదలు. పశు, పక్ష్య, మృగాలలొ,ప్రజలలో ఆనందము, మమేకత్వము గమనించారు.అదియునుగాక గోకులము యమునకు దగ్గర. ఇవి అన్ని గమనించిన వేగులు కంసునకు పూర్తీ వివరాలు తెలియచేసారు.  
కంసుడు తన మంత్రులతో సమిక్షించి. ఇది తనను సంహరించుటకు దైవమాయగా నిశ్చయపరచుకోని. బాలుని పరిమార్చుటకు పూతను పంపాడు.
పూతన ఓక రాక్ష స్త్రీ. మాయవి, కామరూపధారిణి.గొకులమునకు అమె ఓక ఆకర్షణీయమయిన మానవ కాంతగా మారి గోకులములోకి అడుగు పెట్టింది.ఆసమయములో గోకులములొ నృత్యగాన కేళి వినోదము జరుగుతుంది.తనుకూడా వారితో ఆడిపాడి. యశోదను సమీపించి బాలకృష్ణుని చూసి మొటికలు విరచి, బాలుని చూడగానే పాలిండ్లు చేపుతున్నాయి పాలుఇస్తాను అని శిశువుని తీసుకోని ముద్దు చేస్తున్నది.అమే మాయాప్రయోగముతో యశోద శిశువును అప్పగించి కొంత దవ్వుకు అలా వెడలినది.     
ఇదే అదునుగా పూతన తన పాలిండ్లకు విషముపూసి బాలునకు పాలు ఇవ్వ ప్రయత్నించినది.అయితే బాలకృష్ణుడు పాలు త్రగే నెపముతో అమే చూచుకములను తన నోటిలోనికి తీసుకోని పాలతోపాటు అమె పంచప్రాణాలను హరించాడు.దీనితో పూతన దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ తన నిజరూప ధారణతో మృతి చెందినది.  
అంత బాలకృష్ణుడు పూతన దేహముపై అమె పాలిండ్లతో ఆడుకొనుచున్నాడు.పూతన అరుపులు విన్న యశోద, పూతన మృతితో మాయతోలగి ఒక్క పరుగున వచ్చి తన కన్నయ్యను, తన వోడిలోనికి తీసుకోని లాలించసాగింది.
 కన్నయ్య కూడా అప్పటివరకు పూతన దేహముతో ఆడుకున్నా, యశొదవోడిలోకి రాగానే సాధారణ శిశువులా రోదించాడు.
ఇది భాగవత గాధ.

అంతరార్ధము: మనస్సు  జన్మతః ఎప్పుడు శిశువు లాంటిదే. శిశువుకు గనక ఎటువంటి రాగ ద్వేషాలు వుండవో మనస్సు కూడా అలాగే. కాని పూతన సంసార లంపటాన్ని, పూతన విషపాలిండ్లు మాయా,మోహాన్ని సూచిస్తాయి. 
వీటిలో చిక్కుకున్న జీవుడు విషయాసక్తుడై విషపాలుత్రాగితే మాయా మొహములో  సంసారచక్రబంధములో చిక్కుకుంటాడు.కానీ ఎలా వీటిని తప్పించుకోవాలి. కృష్ణుడు అందుకే మార్గాంతరము తెలిపాడు. శ్రద్ధా,భక్తిల  ద్వారా విషనివృత్తి. తద్వార మాయామోహ నివృత్తి కలుగుతాయని సూచిస్తాడు.అప్పుడు కాని మనస్సు జన్మతః వచ్చే శిశుభావము సిద్ధుంచుతుంది అనగా రాగద్వేష రహితముగా మారి  భగవద్దర్శనము కలుగుతుంది అని సూచిస్తాడు. అందుకే పూతన శరీరము పై శిశువులా ఆడుకుంటాడు.ఇది పూతన సంహారఘట్టములొని అంతరార్ధము.
ఇదే విషయాన్ని షిరిడిసాయి శ్రద్ధ,సబూరిల ద్వార మాత్రమే తనను దర్శించ సాధ్యపడుతుంది అని తెలిపినాడు.

  

18, జూన్ 2012, సోమవారం

శ్రీ మహవిష్ణువు స్వయంవ్యక్త క్షేత్రాలు.


 లోకపాలకుడు శ్రీ మహవిష్ణువు దశావతారాలు మనందరకు తెలిసినవే.ఆయిన భక్తప్రియత్వము,దుష్టశిక్షణ సజ్జనరక్షణ భాగవతములో ఎన్నిసార్లు చదివినా తనివితీరదు. "ఓం నమో నారాయణయ" అనునది అష్టాక్షరి మంత్రముగా శ్రీ మహ విష్ణువుకు మూల మంత్రముగా భగ్వద్రామానుజలవారు ఉవాచ.ఏందరో భక్తులు ఈ మంత్ర రాజముతో వైకుంఠవాసాన్ని పొందారు.మరి సాధారణ భక్తులకు? అందుకే శ్రీమహవిష్ణువు వివిధకాలాలో వివిధ ప్రదెశాలలో తననుతాను వ్యక్తపరిచిన ప్రదేశాలను స్వయంవ్యక్తక్షేత్రాలుగా పిలుస్తారు. వింతగా ఇవి కూడా 8 గా వుండి ఒక్కో అక్షరానికి ఒక్కో క్షేత్రము సంకేతములా వుండి భక్తుల హృదయాలను చూరగొంటున్నాయి.

1)  శ్రీరంగం           రంగనాధస్వామి               శ్రీరంగం

2) వెంకటాద్రి         వేంకటెశ్వరస్వామి             తిరుమల

3)  శ్రీముష్ణము       భూవరాహస్వామి               శ్రీముష్ణము,కడలూరు.

4) తోటపర్వతము     వానమామలై పేరుమాళ్         నాన్ గునేరి

5) సాలగ్రామము      చక్రపాణి                      ముక్తినాధ్, నేపాల్

6) పుష్కరము          విష్ణు                       పుష్కర్,అజ్మీర్,రాజస్ఠాన్

7) నారాయణాశ్రమము   బదరీనారాయణ            బదరీనాథ్

8) నైమిశం            చక్రనారాయణ             నైమిశారణ్యము,నీంసార్, ఉత్తరప్రదేశ్.
 
ఈ 8 క్షేత్రాలలో నేను 5 దర్శించాను. ముక్తినాధ్ కు మాత్రము త్వరగా వెళ్ళాలి.

17, జూన్ 2012, ఆదివారం

స్వయముగా షిరిడిసాయి దర్శనము




అది ది.23/03/2000. స్థలము:పశ్చమగొదావరిజిల్లా చింతలపూడి.
వేదిక: కుమార్ బుక్స్ & స్పొర్ట్స్ నూతన ప్రారంభొత్సవము.

ఈ షాపు యజమాని రఫీ నామిత్రుడు, కష్టమర్. అతని నూతన షాపు ప్రారంభొత్సవమునకు ఆహ్వాన సంధర్భమున నేను పాల్గొనటానికి ఆరోజున చింతలపూడిలో వున్నాను. షాపు ప్రారంభమునకు లక్ష్మి,గణపతి,సరస్వతిల పూజ వైదిక పద్దతిలోను,ముల్లాల ప్రార్ధన ఇస్లాము పద్ధతిలొను జరిపిన సహృదయుడు మా రఫి.  షాపు ప్రారంభము అయినది.అతిధి మర్యాదలు జరిగినాయి.నేను మిగతా మిత్రులతో బాతాఖాని చేస్తూ షాపు కౌంటరు వెనుక వైపు కూర్చున్నా. ఈ కౌంటరు షుమారు 15 అడుగల వెడలుపు వుంటుంది.

  మధ్యాహ్నము 12గం.ల ప్రాంతములొ రొడ్డు మీద అత్యంత స్ఫురద్రూపి, మహ వర్ఛస్సుతో, అంతటి మహావర్ఛస్సు  కలిగిన వ్యక్తిని నేను అంతకుముందు కాని ఆతరువాత కాని ఎన్నడు దర్శించలేదు.ఒక అలౌకికమయిన దృష్టితో.తెల్లని ఆంగి,తలపై తెల్లని గుడ్డతో నేను షుమారు 5'.5'' వున్న వ్యక్తి చిరునవ్వుతో, ఆశ్వీరదిస్తూన్న భంగిమలో అలా నుంచుని వున్నారు.నేను వారిని చూసాను. ఇందుకు సందేహము లేదు.ఇది ముమ్మారు సత్యము.అలా వారు ఒక 30 సెకండ్స్ పాటు వుండి తదుపరి అలా కదలి రోడ్డుపైన ముందుకు కదలి వెళ్ళి పొయారు.

    అలా ఆయిన వెళ్ళి పొగానే నాలో ఎదొ చింత,అసలు చూసింది నిజమా అబద్ధమా అనే ఒక శంక,ఒక గిలి మనస్సుని తోలిచేస్తుంది.నేను అక్కడ వున్నానే కాని ఏమి తొచటములేదు.యధాలాపముగా నా ప్రక్కన వున్న వారిని అడిగా ఇప్పుడు సాయిబాబాలా వున్న ఓక ఆయిన ఇలా రొడ్డుమీద కనిపించారు మీరు గమనించారా అని.సర్వులు లేదు అన్నారు.అంతే నా గుండేల్లో బండరాయి పడ్డట్టు ఆయింది.కాని ఇంకా ప్రశ్నలు వదలలా.ఎవరన్నా ఏలూరు ప్రాంతము నుంచి సాయిబాబా వేషధారణలో చింతలపూడి వస్తున్నారా అని. ఇది శూన్యము.ఇక నా మనస్సు ఆగక వీధిలోకి దిగి సాయిబాబా వెళ్ళిన వైపుకు రోడ్డు మీదకు వెళ్ళి చాలా దూరము వెతికినాను. కాని ఫలితము లేదు.తిరిగి మరలా షాపు వద్దకు వచ్చాను.ఇది అంతా 10 నుంచి 15 నిముషాలలో జరిగింది.
 
నాకు సాయిబాబ దర్శనము జరిగినది ఇది గుర్తింపుకు వచ్చినది కాని ఏదొ ఓక డోలాయమాన స్థితి, ఎమి చేయాలొ తెలియని ఓక విధమయిన భావము తో స్థబ్దుగా కూర్చున్నా.కాని ఎందుకు ఇంత తప్పు చేసానా అని తేగ తిట్టుకుంటున్నాను.       

ఇంతలో మిత్రుడు రఫీ భొజన ఏర్పాటుతో, అది కూడా ముగించి విజయవాడకు బయలుదేరాను. ఆసమయములో రఫీ నాకు ఓక గిఫ్ట్ కవరు ఇచ్చాడు. నేను అన్య మనస్కముగా అందుకొని బస్ స్టాండు కు వచ్చి అక్కడ కూర్చుని జరిగిన సంఘటన ఓక సారి మరలా రివైండ్ చేసుకుంటున్నా. తప్పు జరిగింది కానీ ...?...? సరే అని మనస్సుకు సర్ది చేప్పుకుని మా రఫీ నాకు ఎమి గిఫ్ట్ ఇచ్చాడో చూద్దామని కవరు వొపెన్ చేసాను. అందులో మరలా చిరు నవ్వులు చిందిస్తూ (ఈ పొస్ట్ లో వుంచిన బొమ్మలాంటి) సాయిబాబా మరలా దర్శనము. నాకు ఏ విధమయిన వస్త్రధారణలో కనబడ్డారో అదే విధముగా. అంతే ఒక్కసారిగా నాకన్నులు విచ్చుకున్నాయి, మనస్సు తేలికయింది. బాబా నాకు దర్శనము ఇచ్చారు అన్న సత్యం బొధపడినది. ఇది ఆకరుణామయుని లీల.
    ఇప్పటికి ఈ ఫొటొ భద్రముగా వుంచాను.        


16, జూన్ 2012, శనివారం

షష్టిపూర్తి వివరణ


విశ్వ కుటుంబ వ్యవస్థలలో భారతీయ కుటుంబ వ్యవస్థ అగ్రగణ్యమని సర్వులకు విదితమే.
ఇంతటి కుటుంబ వ్యవస్థ ఏర్పడటానికి మూలం పెళ్ళి. ఫెళ్ళి అంటే ఒక సంబరం,ఒక ఉత్సాహము.ఒక ఉల్లాసం,ఒక వేడుక అంతకు మించి ఆచారము.ఇవి అన్ని కలబోస్తేనే భారతీయకుటుంబాలలో పెళ్ళి.అందుకే ఫెళ్ళి అంటే నూరేళ్ళ పంట అన్నారు.  


పూర్వము అష్టావర్షత్ భవేత్ కన్యా అన్నసాంప్రదాయాన్ని అనుసరించి వధువుకు 8సం. లు మరియు వరునకు 10సం.లలో వివాహము.అలాగే భారతీయ వైదిక సిద్దంతాలను అనుసరించి మానవుని కాల అవధి 120సం. లు గా గుర్తించబడినది.

ఉగ్రరధశాంతి, షష్టి అపదపూర్తి(షష్టి అబ్ద పూర్తి) అనునవి శాంతీ కర్మలు. ఉగ్రరధశాంతి 59వ సం. నుంచి 60సం. మధ్యలో,షష్టి అపదపూర్తి(షష్టి అబ్ద పూర్తి) 60వ సం. నుంచి 61వ సం. మధ్యలో జరుపుతారు. కాని కాల చక్రంలో ఉమ్మడి కార్యక్రమముగా మారిపొయినది.

 షష్టిఅపదపూర్తి(షష్టి అబ్ద పూర్తి)  వాడుకలో షష్టి పూర్తిగా వ్యవహారం.ఇది 60వ జన్మదిన వజ్రొత్సవాలు, వివాహ స్వర్ణొత్సవాలు అని పూర్వులు నిర్ణయించారు. నేడు  షష్ఠిపూర్తి ఈ రెండింటి సంయుక్త క్రియ. 

మానవుడు కుటుంబ జీవి, కుటుంబమంటేనే సకల సోదర,సొదరి, బంధు,మిత్ర,పుత్ర,పౌత్ర,ప్రపౌత్రులతో వర్ధిల్లడం.మరి ఇందరి సంక్షములో తన యిల్లాలినే వధువుగా నిలిపి తను పునరంకితము కావటము ఎంత ఆనందదాయకము.అనాడు వధువు వరునకు సత్ సంతానాన్ని ఇస్తే, నేడు వరుడు అమెకు  "నేను నీవు కలసి ఇంతటి కుటుంబ వ్యవస్థను ఏర్పరచామని " తెలపటమే ఈ షష్ఠిపూర్తి నందు వున్న మార్మిక సందేశం.
    
మానాన్నపెళ్లి,మా అన్నయ్య పెళ్ళి,మా తాతయ్య పెళ్ళి  అంటూ సకల చిరంజీవులు కలసి చేసే ఆనందహేల.ఈ షష్ఠిపూర్తి. కనుకనే ఈ వేడుకను ప్రత్యెకముగా జరపాలని కుటుంబ సభ్యులందరు ఎదురుచూస్తూ వుంటారు.


ఈ షష్టిపూర్తి వేడుకలో ఆయుష్య హోమం,ముఖ్య విధి. దీనికి నవగ్రహ హోమం,ధన్వంతరి హొమం,మృత్యుంజయ హోమం లాంటీ కూడా కలిపి ఆచారిస్తారు.  

60 సం. ల జీవనకాలంలొ ఎన్నో అనుభవాలు,అనుభూతులు,వృత్తిపరమయిన కట్టుబాట్లు, జీవనంలోని ఎగుడు దిగుడులు పరిశీలనకు మనస్సు కొరుతుంది.అదే వానప్రస్థమునకు తోలి మెట్టు.తన జీవ అనుభవాలను తన చిరంజీవులకు తెలపడమే ఈ షష్ఠిపూర్తి సారాంశం.

మరి ఇంతటి షష్టిపూర్తి కార్యక్రమము జరగాలంటే దైవానుగ్రహం సంపూర్ణముగా లభించాలి.


15, జూన్ 2012, శుక్రవారం

కృష్ణాతరంగ తారంగ నాదాలు




అమరావతి కధలు నానొ పరిశిలన పొస్ట్ రాసేటప్పుడు  అలా కృష్ణమ్మ మీద కూడా వ్రాయాలనిపించింది.ఇదిగో తల్లి ఈనాటికి కరుణించింది.
 జలము మానవజాతి మనుగడకు ఆధారము. జలము లేక పొతే జీవనమే లేదు అన్నదానికి అతిశయొక్తి కాదు.ఆర్యల కాలం   నుంచి నేటికాలం వరకు సమాజాలు,నాగరికత వెల్లి విరిసింది నదీ తీరప్రాంతాలలొనె.మన రాష్ట్రములో బౌద్ధము వ్యాపించిన, బౌద్ధస్మారకాలు వున్న ప్రదేశాలన్ని నదీతీరప్రాంతాలే కావటము గమనార్హము.నదుల గురించి తెలుసుకొవటమంటే మన గురించి మనము తెలుసుకొవటమే.


ఈ తల్లి జలవనరులతో సస్యమయిన పంటతొ పెరిగిన దేహముగా అభిమానము.25 సంవత్సరాలుగా విజయవాడలొ ఈ తల్లి వొడిలో పాపడిలా ఈ తల్లి జలము సేవనము వల్ల ఈ తల్లి అంటే చెప్పరాని బంధం.వరద వచ్చినప్పుడు ఆ వేగము, ఆసొయగము చూసి మోహము.ఇలా అన్ని భావాలు ముప్పిరికొంటాయి.  
విజయవాడలొని ప్రకాశం బ్యారేజి మీద నుంచోని పశ్చిమదిక్కుకు ఒక్కసారి అలా దృష్టిమరల్చామంటే అనంతజలరాశి, ఈ జలరాశిపై నుంచి వచ్చే పిల్లగాలులు.ఈ తల్లి అమృతధారతో కృష్ణా,గుంటూరు జిల్లా ప్రజల దాహాలు,క్షేత్రాల సస్యమలత్వాలు ఇలా యెన్నో గుర్తుకు వస్తాయి. 
కృష్ణా నది జన్మస్థానము మహారాష్ట్రలొని సతారాజిల్లాలొ గల మహాబలేశ్వర్ కొండలలొని జార్ అనే గ్రామము వద్ద జనించి తూర్పున వున్న బంగాళాఖాతములొ కృష్ణాజిల్లా హంసలదీవి వద్ద సాగరుడిని సంగమిస్తుంది.ఈ ప్రయాణము మొత్తము దాదాపు 1300 కిలొమీటర్ల దూరము. ఇంత మార్గము లో మహారాష్ట్రను,కర్నాటకను కూడా పలకరిస్తూ తన కృపను కరుణను వారికి కూడా ఇచ్చినది. కృష్ణానది భారతదేశపు 4వ పెద్దనదీ.
    ఈ మొత్తము కృష్ణా పరివాహక ప్రాంతము దాదాపు 2.5లక్షల కిలోమీటర్లగా వున్నది ఇందు 75000 చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ నందు కలదు.

ఈ పరివాహక ప్రాంతములో విభిన్నమతాలకు ఆదరణ లభించినది హైందవ,శైవ,వీరశైవ,జైన,బౌద్ధ మతాల వ్యాప్తి చెందటమే కాక అనేక పుణ్యక్షేత్రాలు,స్మారక కట్టడాలు వున్నాయి. కర్ణాటక నందు బసవేశ్వరుడు వీరశైవాన్ని ఈ నదీ ఆలంబనగానే స్థాపన ప్రచారము నిర్వర్తించారు.శ్రీశైల జ్యొతిర్లింగమునకు ఇతని రాకపొకలు నదీ మార్గము ద్వారానే.
మన రాష్ట్రములోకి వస్తే మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ వద్ద కృష్ణానది ప్రవేశిస్తుంది.మహబూబ్ నగర్ ,కర్నూల్,నల్గొండ,గుంటూరు,కృష్ణా జిల్లాల లో ఈ నదీ ప్రవహిస్తుంది.ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూరు వజ్రము ఈ నదీ పరివాహక ప్రాంతము నుంచే లభించింది.
ఈ నదీలో ఋతుపవనాల సమయములో జలము ఎక్కువగాను మిగతాసమయాలలొ సాధారణముగాను లభిస్తుంది.
శాతవాహనులు ఆంధ్రప్రాంతానికి ఈ నది ద్వారానే రాకపొకలు తమ రాజ్య విస్తరణ చేసేవారు.నదీగర్భములోతు దాదాపు 125 అడుగులవరకు వుంటుంది.వరద సమయాలలో కోత ఎక్కువగా వుండి దిగువ ప్రాంతాలలో మేట ఎక్కువగా వుంటుంది.అందుకే విజయవాడ తరువాత కృష్ణా పరివాహక ప్రాంతముగా వున్న కృష్ణా,గుంటూరు జిల్లాలలొ చాలా లంక గ్రామాలు వుండి సారవంతమయిన భూములు కలిగి పలు పంటలు పండి సకల సమృద్ధిగా వున్నాయి.   


కృష్ణానది కి ముఖ్యమయిన ఉపనది తుంగభద్రా. దీనికి ఇంకా వెన్నా,దిండి,పాలేరు లాంటివికాక ఇంకా 5 నదులు ఉపనదులుగా వున్నాయి.మూసినది ఆఖరి ఉపనదిగా గుర్తింపు పొందినది.ఇవికాక చాలా ఏర్లు,వాగులు అనేకం కలసి విజయవాడ వచ్చుసరికి ఓక అనంత జలరాశిగా దర్శనము.
మన రాష్ట్రములొని పుణ్యక్షేత్రాలు : అలంపురము,మంత్రాలయము,అహొబిలము,మహానంది,శ్రీశైలం,మట్టపల్లి,యాగంటి,సంగమేశ్వరము,కనకదుర్గమ్మ,మొవ్వ,శ్రీకాకుళపు ఆంధ్రమహవిష్ణు,వేదాద్రి,అమరావతి,నాగార్జున కొండ.మంగళగిరి. 
సాహిత్య పరముగా ఎన్నో కావ్యాలు,కథలు,గాధలు. నృత్యములొ పేరెన్నిక గన్న కూచిపూడి నృత్యము ఈ నదీ పరివాహక ప్రాంతములొనిదే.


చేనేతకు ప్రసిద్ధి చెందిన నారాయణపేట,గద్వాల,పొచంపల్లి,భట్టిప్రొలు మొదలగునవి ఎన్నొ.వరి,మిర్చి,ప్రత్తి,పసుపు,పొగాకు తో పాటు అనేక పండ్ల తోటలకు ఈ జలమే ఆధారము.శ్రీశైలము వద్ద అతిపెద్ద జలవనురుల అధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రము,నాగార్జున సాగర్ వద్ద బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ వున్నది. ఇది నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నేహ్రు చేత ఆధునిక దేవాలయముగా గుర్తింపు పొందినది.

13, జూన్ 2012, బుధవారం

యమధర్మరాజుని, వైకుంఠవాసుని సంకటస్థితికి గురిచేసినది ఎవరు ?


ఓకానోక సమయములో ఆరణ్యంలోని ఏనుగు మరణించినది.ఏనుగు ఆత్మ యమధర్మరాజు ఎదుట ప్రవేశ పెట్టబడినది. ఆత్మ మంచి చెడులు పరిశీలించిన యమధర్మరాజు " ఏమి నీకు అంత పెద్ద శరీరం లభించినది ఆ బలం తో నీవు స్వతంత్రముగా బ్రతకవచ్చు కాని నీవు  మానవునికి లోబడి అంత వూడిగము చేసినావు,బానిసగా బ్రతికినావు అని అడిగినాడు. స్వామీ! ఈ మనుషులు మహామాయావులు, స్వామి! చాలా పెద్దపెద్దవే ఇతనికి లొబడి పనిచేస్తున్నవి నేను మాములు ఆడవి జంతువును నేను ఏంత అని పలుకగా. యమధర్మరాజు మావద్దకు మానవులు వస్తున్నారుగదా ఆవిధముగాలేదు అని అన్నారు. అంత ఏనుగు స్వామి! మీవద్దకు వచ్చే వారు అంతా ఆత్మలు బ్రతికివున్నవారు కాదు అని ప్రత్యుత్తరము ఇచ్చింది.దీనితో యమధర్మరాజు అలొచనలో పడి తన దూతలను పిలచి ఓక బ్రతికి వున్నవాడిని భూలోకము నుండి యమలొకమునకు తీసుకొనిరమ్మని ఆఙ్ఞ ఇచ్చాడు.
      

అంత యమభటులు భూలొకానికి వచ్చి ఆరుబయట నిద్రపొతున్న ఓక వ్యక్తిని మంచంతో సహా లేవనెత్తి యమపురికి ప్రయాణమయినారు.ఆ వ్యక్తి ఆఊరి కరణం. చల్లటిగాలికి మెలుకువ వచ్చినది. పరిశీలించగా యమభటులు తన మంచము తీసుకొని ఆకాశమార్గాన వున్నారు  తను బుద్ధి కుశలతతొ లేకపొతే ఈ మంచముతో సహా క్రింద వుండవలసి వస్తుంది  అని భావించి వూరకనే  వున్నాడు. సాధరణముగా కరణాలు గ్రామకార్యలు అన్ని చూస్తావుంటారు, అందు వలన ఈ కరణం గారికి తన దిండు ప్రక్కనే కొన్ని కాగితాలు,ఒక కలం పెట్టుకొని నిద్రపొతుంటారు.దీనితో యమభటులను గమనించిన కరణం కాగితం పైన గబగబ ఎవో నాలుగు ముక్కలు వ్రాసి జేబులో పెట్టుకొని పడుకొన్నాడు.


దూతలు యమపురికి చేరుకొన్నారు. యమధర్మరాజు సభలో కొలువు తీరి వుండగా దూతలు ఈ కరణముని సభలో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో కరణము తన జేబులోని ఉత్తరాన్ని యమభటుల ద్వారా యమధర్మరాజుకు అందజేసినాడు.అందులో ఇలావున్నది "ఈ పత్రం కలిగన వ్యక్తి నా తరుపున వచ్చిన నూతన గణాంకుడు మరియు వ్రాయసకాడు కావున ఇతనితో మీ పనులు చేయించగలరు - ఇట్లు, నారాయణుడు,వైకుంఠం" అని వ్రాసి వున్నది. ఇది చదివిన యమధర్మరాజు  కరణం ను మర్యాదగా ఆహ్వానించి ఒక ఆసనము, పని కల్పించినాడు.మరి నారాయణుని ఆఙ్ఞ.
   సభ ప్రారంభమయినది. దూతలు పాపులను ఓక్కొకరిగా ప్రవేశపెట్టుచున్నారు. మొదటి పాపి రాగానే కరణం ఇతని వివరములు ఎమిటి అని ప్రశ్న దూతలు అయ్యా వీడు ఒక దొంగ అని సమాధానాము. వెంఠనే కరణం ఈ దొంగని వైకుంఠమునకు పంపండి అని ఆఙ్ఞ ఇచ్చాడు. ఆత్రువాత ఓక స్త్రీ ఈమే ఎవరు? అయ్యా ఈమె ఒక వ్యభిచారి మరలా ఈమెను కూడా వైకుంఠమునకు పంపండి .ఇలా భూలొకములో సకల తప్పులు చేసిన వారిని ఈ కరణం వైకుంఠమునకు పంపటము ఒక ఉద్యమంలా పెట్టుకొని అదే పని చేస్తున్నాడు.

కొద్ది రొజులకు వైకుంఠం కిక్కిరిసి పొయింది, అక్కడ నారాయణుడు పరిశీలీంచగా వచ్చన వారందరు పాపులే.కాని వైకుంఠమునకు రాకాకు కారణము ఎమిటా అని చూడగా వీరిందరు యమధర్మరాజు పంపగా వచ్చిన వారు అని తేలింది.దీనితో ఇది ఏదొ యమలొకంలో తేడా అని అది కనుగొనే నిమిత్తము నారాయణుడు స్వయంగా యమలొకమునకు పయనము.

నారాయణుని చూసిన యమధర్మరాజు ఉచితరితన సత్కరించి రాకకు కారణమడిగినాడు.
అంత నారాయణుడు సకల పాపులను వైకుంఠమునకు పంపుటకు గల కారణము ఏమిటని ప్రశ్నించాడు. స్వామీ! ఇందులో నాది ఎమి తప్పు లేదు వీరందరిని తమ అఙ్ఞపై ఇక్కడికి వచ్చిన కరణము పంపుతున్నాడు, ఇది మేము కూడా స్వామీగారి ఆఙ్ఞగా భావించి మిన్నకున్నాము అని బదులిచ్చినాడు.

కరణం : తమరే స్వామి!
నారా  : మేము పంపలేదు గదా!
కర   :  నాచేతిలొని పనా స్వామి ఇది. నా వల్ల అయ్యేపనా స్వామి. తమ సంకల్పము లేనిదే ఇది జరుగుతుందా !
నరా  :  సరే! వీరందరిని ఇలా వైకుంఠమునకు ఎందుకు పంపావు.
కర   : స్వామి వైకుంఠమునకు పంపటము పాప కార్యమయితే భూలొకములో వున్న సాధు సంతులందరికి శిక్ష      విధించాలి.ఇది మంచి పని కాకపొతే విరందరిని త్రిప్పిపంపండి కాకపొతే భగవద్గీత నందు వున్న 12/6 శ్లొకం "నా ధామానికి చేరువాడు తిరిగిరాడు" మాత్రము సవరించటమో లేక ఉపసంహరించటమో చేయాలి.
నారా :  సరి! సరి ! వైకుంఠ ప్రవేశముతోనే పాపనివృత్తి కలిగినది, కాని వీరందరిని నీవు ఎందుకు పంపావు.
కర  : స్వామి! తమ దయ వలన అధికారము కలిగినది. అధికారాముతో సర్వులకు హితము చేకూర్చాలని అందరిని వైకుంఠమునకు పంపినాను.సర్వులకు మంచి చేయటము పాపకార్యమా స్వామి!
నారా :  యమధర్మరాజా! నీవతనికి అధికారము ఎల ఇచ్చావు?
యమ   :  స్వామీ అతను మీపసుపున పంపినట్లు తమరి చేవ్రాలు  స్పృష్టముగావున్నది గమనించండి అని పత్రం ప్రవేశ పెట్టాడు.
నారా :  ఇది ఏమి పని ఈ పత్రం నేను ఎప్పుడు ఇచ్చాను అని కరణమును అడిగినాడు.


కర : తమరు గీతలో నేను అందరి హృదయాల్లొ వున్నాను అని సెలవిచ్చినారు.నాకు నా హృదయము నుంచి ఇలా చేయమని ఆఙ్ఞ వచ్చింది. దాని తమ ఆఙ్ఞగా భావించి నిర్వర్తించినాను. ఒకవేళ ఇది తప్పు అయితే మరలా గీతను సవరించాలి.
నారా : ఇతను ఇక్కడకు ఎలా వచ్చాడు?
దీనితో యమధర్మరాజు తన దూతలను ప్రశ్నించగా, వారు అయ్యా తమరు ఓక బ్రతికివున్న మానవుని ప్రవేశపెట్టమని చెప్పారు. మేము తమ ముందుకు తేగా అతను తమకు ఎదో పత్రము ఇవ్వటము అది చదివి మీరు అతనికి ఆసనం,అధికారము ఇవ్వటము గమనించిన మేము ఇంక ఏమి మాటలాడగల సాహసం చేయగలము.
ఈ సన్నివేశాన్ని మొత్తము గమనిస్తున్న ఏనుగు ముందుకు వచ్చి స్వాములకు ప్రణామములు! నేను ఎలా లొంగిపాయావని ఆడిగినారు కాని ఈ సమయములో ఈ మానవునికి వశపడినది నారాయణుడు,యమధర్మరాజు.మానవుడు తలచుకుంటే అన్నిటిని లొబర్చుకొగలడు కాని తాను మాత్రము విప్పుకోలెని సంసార చిక్కు ముడులలో చిక్కుకుపొయాడు.
నారా : సరే అయిందేదో అయింది, నీవు భూలొకానికి తిరిగిపో
కర : తమరు గీతలో (8/16) నన్ను పొందాక పునర్జన్మలేదు అన్నారు. నేడు నేను తమరిని పొందానాలేదా అని స్వాములు తెలపాలి అని అన్నాడు. 
నారా : సరే! దీనిని ఇక్కడ ఆపి నాతో రా!
కర : స్వామి కేవలము నేను అయితే ఎలా ఏనుగు దయ వల్లనే నేను ఇక్కడకు వచ్చాను కాబట్టి దానితో కూడా రాగలను.

ఇలా అందరు వైకుంఠ దివ్య ధామానికి చేరారు.
--------------------------------------------------------------------------------------
చూసారా! ఇది కల్పిత కధ అయినా మానవుడు తలచుకుంటే ఆన్ని సాధించగలడు,అధికారముంటే సర్వులకు మంచి చేయాలని తెలుపుతుంది.              


             
          


    

12, జూన్ 2012, మంగళవారం

"సీత సమర్త"



స్త్రీల పాటలు పరీశీలించినప్పుడు మనము అనేక విషయాలు గమనించవచ్చు. ఈ పాటల్లొ అలవోకగా ప్రకృతి,శారీరక లక్షణాలు, సంసారిక సంగతులు, కుటుoబ జీవనములోని లొటు పాట్లు ఇలా ఎన్నొ అలవొకగా తమదైన పద్ధతిలో పాడటమంటే తమ తరువాతి తరాలకు నేర్పే ప్రక్రియ చేసేవారు.ఇలా భర్త చెంతకు భార్య ఎలా చేరాలి, సిగ్గుతో వున్న స్త్రీని అనునయముగా పురుషుడు తనదానిగా ఎలాచేసుకొవాలో అన్నీ విషయాలు చక్కగా సులభముగా చెపుతూ అదే సమయములో అగౌరవముకాని, అసభ్యతకూ గాని తావు ఇవ్వని పద సంపద మహిళల సొత్తు, ఈ పాటల ప్రత్యేకత.ఈ విషయాలని గమనించిన యువతులకు నిశ్చంతగా అత్తవారింట అడుగుపెట్టి సలక్షణముగా వొద్దికగా కాపురం చేసి. బిడ్డపాపలతో తమకు, తమ కన్నవారికి, అత్తవారికి పేరు తెచ్చిన మహిళామణులు ఎందరో.

ఇలా నేను గమనించిన "సీత సమర్త" అనే పాట తాలుకు క్లుప్త పరిచయము.

   "సీత సమర్త" అనే పాట శివ ధనుర్భంగముతో ప్రారంభము అయి రాముడు జానకిన వివాహము ఆడటముతో మొదలవుతుంది.జనకుడు అమేను సారె పెట్టి అత్తగారింటికి పంపుతాడు.అత్తగారి ఇంటికి అమే అడుగిడు నాటికి సీత ఇంకా బాలిక.కోద్ది రోజులు గడచిన తరువాత సీత ఓకనొకనాడు తన చెలికత్తెలతో ఆటలాడుతుండగా సీత
పష్పవతి అవుతుంది. ఇది గమనించిన చెలికత్తెలు వడివడిగా వేళ్ళి కౌసల్యకు ఈ వార్త చేరవేస్తారు. కాని  సీత బాలిక అయినందున విషయము తెలియక  తన శరిరములో ఎదొ జరిగినదని ఆందోళన పడుతుంది.భయoగా వొదిగి కూర్చొని వుంటుంది.చెలికత్తెల ద్వారా విషయము  తెలుసుకున్న కౌసల్య ఆనందముతో ఓక్క పరుగున సీత వద్దకు వచ్చి చీరను చూపమంటుంది.కాని సిగ్గు భయాందొళనలతో నిండి వున్న సీత నిరాకరిస్తుంది.
  కౌసల్య, అమ్మా సీత! నేను  నేను నీకు తల్లితో సమానము,అదియునుగాక నేను కూడా స్త్రీ ని, నేను నీలాగా ఆవయస్సు దాటివచ్చిన దానినే భయపడవద్దు అని అనునయముగా చేపుతూ భయముపొగొట్టి  సీత ధరించిన చీర పరీశీలించి సీత పుష్పవతి అయినదని రూఢి పరచుకొని.

తెల్లని వస్త్రము,తాటాకు,గడ్డి మొదలగు వాటితో దడియము పరచి బాలికను దానిపై కూర్చండపెట్టి, ముత్తయిదువలను పిలచి వేడుకలు పేరంటము చేయ ప్రారంభిస్తది. చిమ్మిలి దంచడము మొదలయిన వేడుకలన్ని చెప్పబడ్డాయి.తరువాత  తరుణ సమయములో ముహుర్తము పెట్టి శొభనమునకు కూడా నిశ్చయస్తారు.జనకుడు వియ్యాల వారందరకు గౌరవ మర్యాదలు సలుపుతాడు.విధి విధానముగా హొమముచెయించి,ఫలదానము మున్నగునవి కూడా ఇప్పించి.సీతను కేళిగృహమునకు పంపుతారు.

    సీత సిగ్గుతో తలుపు వద్ద నిలచి వుండగా రాముడు అమెను తనవద్దకు రప్పించడానికి చక్కని ఉపాయము పన్నుతాడు.రాముని చేతికి వున్న రత్నపువుంగరము తీసి అమె వద్దకు విసరి అమెను  ఆ ఉంగరము  తెమ్మంటాడు. భర్త ఆఙ్ఞ మీర రాదని సీత ఉంగరము తెచ్చి ఇస్తుంది. అంత సీతను రాముడు దగ్గరకు తీసుకుంటాడు. ఈ విధముగా  గడుసరి రామయ్య తను కదలకే సీతను తన వద్దకు రప్పించుకుంటాడు.


  

11, జూన్ 2012, సోమవారం

వైద్యనాధ్ -కొన్ని విశేషాలు.



నేను 12 జ్యొతిర్లింగాలలో 11 దర్శనము చేసాను. కానీ ఈ వైద్యనాద్ ప్రయాణమే కొద్దిగా విచిత్రము.వైద్యనాధ్ జ్యొతీర్లింగాలగా జార్ఖండ్ లోని జసిడీ వద్దగల దేవఘర్ అనే పట్టణములోను, మహారాష్ట్రలోని పర్లీనందు ,హిమాచలప్రదేశ్ లోని బాజినాథ్ నందు,( ఈ బాజినాధ్ పాలంపూర్ కు 14 కిమి ల దూరము) మూడుచొట్ల వారు మాది అసలయిన జ్యొతిర్లింగము అని చెబుతుంటారు.కాని నాకు ఈ 3 మందిరాలు చూసిన తరువాత దేవఘర్ జ్యొతీర్లింగము అనే ప్రకటనకు సరిపొతుంది అనిభావించాను.  ఈ మందిరము, ఈ ప్రాంతము దాదాపు 1500 సం. క్రితమువి.పురాతాన అచార సంస్కృతి ఇంకా మనకు కనబడుతుంటుంది. ఆప్రాంతము అసలే గిరిజన ప్రాంతముకావటముతో అక్కడ దర్శనానికి వచ్చే భక్తులుకూడ పురాతన ఆటవిక సాంప్రదాయాలు ఇంకా కొన్నీ ఙ్ఞాపకాలుగా మిగిలి వున్నాయి.ఈ విషయాన్ని మీరు అమ్మవారి మందిరములో చక్కగా గమనించ వచ్చు. గుడి అత్యంత ప్రాచీనముగా వుంటుంది. గుడి లోపల వసారా, తరువాత అంతరాళము,ఆ తదుపరి గర్భగృహములో వైద్యనాధేశ్వరుడు భూమికి సమాంతరముగా లింగరూపములో విరాజిల్లుతుంటాడు.గుడి నిర్మాణపద్దతిని, ఉపయోగించిన రాళ్ళను గమినించితేనె మీకు అర్ధము అవుతుంది.

గుడిప్రాంగణములో గంగనీరు అమ్ముతారు. మనము ఆనీటితో అభిషేకము స్వయముగా చేసుకొనవచ్చు. అలాగే అనేకరకాల పుష్పాలు,మారేడు దళాలు కూడా వుంటాయి సేకరించుకోనవచ్చు.చాలామంది పండాలు వుంటారు.అవసరము అనిపిస్తే ముందలే సంభావన విషయము మాట్లాడుకొవాలి.నాకు మాత్రము అంత ఆచారవంతులులా కనబడలేదు.ఎదో సరిపుచ్చుకోవటమే.
ప్రసాదము కోసము అంత కష్ట పడవలసిన పనిలేదు దారిపొడుగునా దాదాపు ఓక 700 వందల పాలాకోవా అమ్మే దుకాణాలు.ఇన్ని దుకాణాలు నేను ఎక్కడా చూడలా అన్ని పాలకోవా దుకాణాలు.వీళ్ళను తప్పించుకోవటమే పెద్ద ప్రమాదము.

   
ఏ జ్యొతిర్లింగములొ లేని ప్రత్యేకత ఇక్కడ వున్నది.  మనము దేవాలయ కౌంటర్ లో డబ్బుకడితే మనపేరున అమ్మవారి ఆలయశిఖరానికి, అయ్యవారి ఆలయ శిఖరానికి ఎరుపురంగు నూలు దారము మనముందే కడతాడు. ఇలా శివ శక్తిల శిఖరబంధము ఇక్కడ కళ్యాణముతో సమానము. అందుకే చాలామంది ఈ సేవ చేయిస్తారు.అమ్మవారికి కూడా మీరు స్వయముగా పూజించ వచ్చు.ఆలయము, విగ్రహ రూపాలు కాలప్రభావానికి లొను ఆయివుంటాయి.  ఆలయచరిత్ర రావణుని తో ముడిపెట్ట బడింది.
  ఊరు మనతాలుకు మండలకేంద్రములా వుంటుంది. అయినా ఇక్కడ ఉదయం పూటా ఉపహారములా బజారులో మరమరాలతో చేస్తారు. మన ఇడ్లీ బండ్లలా చాలా వుంటాయి. మరమరాలు శనగలకూర, రెండు మూడు రకాలా కట్లెట్లు. భలే గుంటాయి. ధర చాలా తక్కువ . నేను మొదట భయపడ్డాను కాని రుచి భలేగున్నది.

10, జూన్ 2012, ఆదివారం

ఇషా ఫౌండేషన్,కోయంబత్తూరు - తీర్ధకుండ్ -ధ్యానలింగ - లింగ భైరవి - అనుభవాలు

ఇషా ఫౌండేషన్, కోయంబత్తూరు వద్ద సింగనల్లూరుగ్రామము వద్ద శ్రీ సద్గురు జగ్గీవాసుదేవ్ స్థాపించిన యోగగ్రామ ఆశ్రమము. ఈ సెంటర్ పూర్తిగా మానవత్వ పరిమళాలు వెదజల్లుతుంది.మీరు ఒక్కసారి దర్శించారంటే మీతాలుకు ఎన్నో మానసిక వత్తిడులు,విచారాలు,దుఃఖాలను మరచి మిమ్ములని మీరు పొందామ అన్న అనుభూతి కలుగుతుంది.అనేక వేల మంది ఉన్నత విద్యావంతుల, యోగ సాధకుల ఆలొచనాల సారాంశమే ఈ ఇషా.ఇది ప్రపంచములోని 150పట్టణాలలొని 2 మిలియన్ ప్రజలు రాకపొకలు సాగిస్తుంటారు.దీని ముఖ్యొద్దేస్యము గ్రామీణపునరుజ్జీవనము,సతత హరితము,విద్య వీటికి తగ్గ ప్రణాళికలతో అనేక వేల మంది వలంటీర్ల తొడ్పాటుతో ముందుకు పొతున్నారు.

ఇషాను స్థాపించిన శ్రీ జగ్గీవాసుదేవ్ కూడా చాలాభిన్నముగా దర్శనమిస్తారు.మాములు యతి,స్వాములు ధరించే కాషాయవస్త్రధారణలో కాక సాధారణ మానవుడులా నేను మిలో ఓక్కడినే అనిపించెలా టీషర్టులు,జీన్స్ ధరించి కాళ్ళకు స్పొర్ట్స్ షూస్ తో మనకు దర్శనమిస్తారు.అలాగే టీచింగ్స్ కూడా సనాతనము నుంచి అధునికము దాక అవసరమయినవి అన్ని వారి పద్ధతిలో బొధిస్తుంటారు.



ఇషా ఫౌండేషన్  నందు ముఖ్యముగా మన మనస్సును ఆకట్టుకొనేవి తీర్ధకుండ్,ధ్యానలింగము,లింగభైరవి.ఈ 3 ప్రదేశాలు ప్రతి ఒక్కరు దర్శింపతగినవి.

తీర్ధకుండ్ : ఇది భూమికి షుమారు 40 అడుగులలొతులో వున్న ఓక సహజ సిద్ధ జల కుండము. ఈ కుండమునకు పై నుంచి ఆధునిక సాంకేతిక సహాయముతో నీరు పరిశుద్ధపరచి సరఫరా చేయబడుతుంది.నీరు క్రిష్టల్ క్లియర్ అంటే ఆశ్చర్యపొవలిసిన పనిలేదు అంత శుద్ధము.నీరు చాలా చల్లగా జిల్ జిల్ మంటాయి.ఈ నీరు ఒక జలపాతములా కుండములోకి అలా పైనుంచి పడుతుంటాయి.ఈ తీర్ధకుండ్ లో మనము స్నానము అడేముందు పైన వున్న బాత్ రూంస్ నందు స్నానము అడి వారు ఇచ్చు ప్రత్యేక అంగవస్త్రముతో దిగవలసి వుంటుంది.ఇక్కడ ఆడవారికి,మగవారికి విడివిడిగా సమయాలు, వస్త్రధారణలు.ఈ తిర్ధకుండ్ లోతు 3"అడుగల నుంచి 6"అడుగుల వరకు వుంతుంది కాని మీరు మునిగిపొతారు అన్న భయములేక ఇక్కడ వలంటీర్లు సిద్ధముగా వుంటారు.ఆడవారికి,మగవారికి వేరువేరుగా ప్రతి 30నిముషములకు ఒక్కసారి అవకాశము. అలాగే వలంటిర్లు కూడా వేరువేరు.          

అన్నిటికన్నా ముఖ్యమయినది ఈ తీర్ధకుండము మధ్యన ప్రతిష్టించిన పాదరసలింగము.ఈ పాదరసలింగము దాదాపు షుమారు 500కిలొగ్రాముల పైనే కాని లొపు వుండదు అంత పెద్ద లింగాన్ని, పాదరసమును  అత్యంత అల్పపీడనములో శీతలికరించి లింగరూపముగా ప్రతిష్ట.ఇది రసలింగము.(పాదరసము - శివుని వీర్యమంటారు) ఈ రసలింగాన్ని పానవట్టముపై  ప్రతిష్టించగా ఈ మొత్తము జలాశయ మధ్యలో వుంటే మనము సాక్షాత్ ఆకైలాసనాధుని జలాభిషెకములో స్నానమాడుతున్నమా లేక జలాభిషేకములో పునీతము అవుతున్నామా అనే ఆనంద సందేహడొలికలు.ఆ కైలాసనాధ జలాశయములో మనము దిగి  శివశివ హరహర అని మునకలేస్తూ రసలింగాన్ని మార్కండేయుడు కౌగిలించుకున్న రీతిలో ఆశివయ్యను పట్టుకుంటే మనశరీరములో వున్న జన్మజన్మ సంస్కార మలినాలు,మనోమాలిన్యాలు, శారిరక రుగ్మతలు అనేక జడత్వాలు  మనలను వదిలిపొతాయి.మనదేహము, మనస్సు  లింగమునకు అప్రయత్నముగానే క్షణమాత్రములోనే వశ్యులమయి పొతాము.మీరు నమ్మినా నమ్మకున్నా ఇది నిజము .స్వయముగా అనుభవిస్తేనే కాని తెలియని ఒక వింత అధ్యాత్మికనుభూతి.హరహర అంటూ నీటిలో మునిగి శివశివ అని పిలుస్తూ తలను పానవట్టము పైన వుంచితే మనస్సు మరలా మరలా అని ఉరకలెత్తుతుంది.(ఇది నా స్వానుభవము,నీరు అంటే భయ పడే నా భార్య కూడా ఇదే అనుభవము)            

ధ్యానలింగం : తీర్ధకుండములో పవిత్రమయిన తరువాత అక్కడకు దగ్గరలొనే వున్న ధ్యానమందిరములో వున్న ధ్యానలింగం ను దర్శించాలి. ఈ మందిరము ముఖ్య ద్వారమునకు ఎదురుగా ధ్వజస్థంభములా ఒక రాతి స్థంభముపై 3 మతాల గుర్తులు,యోగ చక్రాల గుర్తులు చెక్కబది యెంతో ఆకర్షణీయముగా వుంటుంది. ద్వారము నుంచి మందిరమునకు వెళ్ళు మధ్య నడవాలో యోగ శాస్త్రకారుడు పతంజలి, సర్వ మేధకు అధిపతి దక్షిణామూర్తి,ఙ్ఞానసిద్ధికి గుర్తుగా రావి చెట్టు మొదలగునవి కన్నులారా తిలకించవచ్చు.  
ఇక మనము ధ్యానమందిరము నందు ప్రవేసించగానే దీని నిర్మాణకౌశలానికి,పద్ధతికి ఆశ్చర్యచకితులమవుతాము.ఇది భూమి నుంచి షుమారు 40అడుగుల ఎత్తువున్న అర్ధచంద్రాకార గోళము.ఈ అర్ధచంద్ర ఆకారము అనంత విశ్వాన్ని,మానవ మస్తిష్కాన్ని ప్రతిబింబిస్తుందా అనిపిస్తుంది.ఈ మందిర మధ్య భాగము, గోళ కేంద్రభాగము ఖచ్చితముగా  ఒక్కచొటు వచ్చు విధముగా నిర్మించి, ఆప్రదేశములో ప్రాణశక్తి అయిన శ్వాస రూపుడైన సర్పమును పానవట్టముగా వుంచి ఆపై లింగరూపధారిగా పరమాత్మను నిలిపి ధ్యానలింగమనే సరికొత్త మాట అంతకన్నా వినూత్నమయిన పరమాత్మను మనకు సాక్షాత్కరింపచేసారు.
    ఈ ధ్యానలింగము చుట్టూ మానవ ప్రాణాధార జలము రక్తప్రసరణకు,అనేక జీవాత్మలకు, అనంత జలరాశులకు సూచనగా చుట్టూ నీరు.ఆ నీటిలో అణిమాది అష్టసిద్ధులు,ఙ్ఞానకాంక్ష,సహస్రార, సకల లక్ష్మీ రూపాలను ప్రతిబింబిస్తూ ఏరుపు,తెలుపు పద్మాలు. ఇవి నాకు తోచిన భావాలు మీరు దర్శించినప్పుడు మీకు ఇంతకన్నా ఉన్నతభావాలు స్ఫురించవచ్చు.

ఈ ధ్యానలింగము వద్ద ప్రతిరోజు మధ్యాహ్నము12గం లకు నాద ఆరాధన అనే సంగితసహిత, ధ్యాన సహిత అర్చనకార్యక్రమము జరుగుతుంది.ఈ కార్యక్రమమునకు హాజరుకావటము మాత్రము మిస్ కావద్దు.అర్చనలో మంత్రాలు వుండవు ఒక వాయిద్యకారుడు తన వాద్యముతో లయబద్ధముగా సంగితము వినిపిస్తుంటే మందిరములో పరివేష్టితమయిన భక్తులు  ధ్యానరూపుని ధ్యానము చేయటమే అర్చన.ఈ సమూహా ధ్యానము వలన ధ్యానతరంగాలు ఆప్రదేశము అంతటా వ్యాపించి సాధకులను,కొత్తవారిని త్వరగా ధ్యాన స్థితికి తిసుకొని పోతాయి అనేక దివ్యదర్శనాలు లభిస్తాయి.    

లింగభైరవి : మనకు సహజముగా అనేక రూప దేవిస్వరూపాలను చూస్తాముకాని ఈ విధమయిన లింగరూపభైరవి ఇక్కడ తప్ప వేరు చోట కానరాదు. ఇక్కడ భైరవి మనతో భవుడు నేను వేరు కాదు ఇద్దరము ఏకమే  అన్నట్లుగా లింగభైరవి, శివ సంయుక్త ఏకరూప ఆవతారము.లింగ భైరవికి 10 భుజాలు, తీక్ష్ణముగా మనస్సులోకి ప్రసరించే చూపులతో అమ్మవారి కన్నులు.కొట్టవచ్చినట్లు కనిపించే   అమ్మవారి ముక్కుపోగు. అమ్మవారు కాళరాత్రి,కాళి అవతారాములా నల్లని రాతిలో లింగభైరవిగా జగన్మొహనముగా దర్శనిమిస్తుంది.సూర్య చంద్రులు ఈ రూపానికి అభరణాలా అన్నరీతిలో ఇరువైపులా.సకల ప్రకృతి నాచే ఆవరించబడినది,నాచే సృష్టిచబడినది అనాదానికి సాక్షీలా ఆకులు, లతలు.సృష్టిలోని దమనత్వము.క్రూరత్వము ఎప్పటికయినా అణగదొక్కబడేవి అన్న దానికి సంకేతములా లింగభైరవి పాదపీఠములా మహీషము.ఇలా సమస్త,ప్రకృతి,వికృతులు సరళముగా, లలితముగా, హృద్యముగా ఆ శ్రీచక్ర నివాసిని విరాజిల్లేతీరు నభూతో నభవిష్యతి. 
     ఈ లింగభైరవి మందిరములో హారతి కార్యక్రమము విశిష్టత కలది. ఈ కార్యక్రమములో దేవిస్తుతి "యాదేవి సర్వభూతేషు" పూర్తి శ్లొకాలను పాడుతూ హారతి కార్యక్రమము జరుగుతుంది.
ఈ గుడి ప్ర్రంగణములో వున్న చెట్టుకు స్త్రీలు మాంగల్యభాగ్యము గురించి పసుపుకొమ్ము కడతారు. అమ్మవారికి వేపాకు, ఏరుపు గాజులు,వస్త్రము, పసుపు కుంకాలు సమర్పణచేస్తారు.ఇక్కడ వున్న లింగ భైరవి యంత్రము ఓక ఆకర్షణ.      
        


ఇషా ఆవరణలోవున్న పాఠశాల,జగ్గివాసుదేవ్ ప్రవచన హాలును ప్రత్యేక అనుమతితో చూడవచ్చు.ఇషాలో మిరు ఓక్కటి గమనిస్తారు ఇక్కడ ప్రతి అలంకరణ,పూజాసామాగ్రి,స్థూపాలు,నిర్మాణాలు అన్ని సర్ప ఆకృతితో పరివేష్టితమయి వుంటాయి.మానవుడు ఆత్మరూపుడు, ఈ ఆత్మను ప్ర్రాణరూపముగా, ఈప్రాణము శ్వాసగా,ఈ శ్వాస సర్పరూపముగా భావిస్తారు.శ్వాస యోగానికి కేంద్ర బిందువు కాబట్టి అన్నిటా అలా సర్ప ఆలంకరణలు మనకు దర్శనమిస్తాయి.

9, జూన్ 2012, శనివారం

ముఖేష్ అంబానిగారిని ఓక్కసారి పరీశీలించారా!


ముఖేష్ అంబాని భారతదేశములో దాదాపు పరిచయము అవసరములేని మహమహకోటీశ్వరుడు.  ఆస్థులలొ వ్యాపారలలో ప్రపంచ ర్యాంకులుపొందిన వ్యక్తి. మీరు ఎప్పుడన్నా వీరిని గమనించరా!వీరు బగా డబ్బుచేసారు.ఇది వీరి ఆంగిక లక్షణాలలో బాగా  ప్రస్ఫుటముగా కనిపిస్తుంది. ముఖ కవళికలు చూడండి ధనమువల్ల వచ్చిన వ్యాపార కుటిలత్వం, క్రౌర్యము ఛాయలా కనబడుతుంటది.దాదాపు ఎవరన్నా ముందు మానవుడు అతరువాత ఎమయినా కాని వీరికి ముందు వ్యాపారస్తుడు, ధనవంతుడు ఆతరువాత మానవుడు.వీరీ దారికి, వ్యాపారాలకి అడ్డువచ్చినవారిని నయానో భయానో అడ్డుతప్పించటములో సిద్ధహస్తులు.డబ్బుగురించి ఏపనీఅయినా,ఎంతకయినా వెళ్ళే నైజము  ఉదా: అన్నతమ్ముల వ్యవహారాలు,గోదావరి బేసిన్లో గ్యాస్ గురించి దాని రేటు గురించి ఈన ఆడే దుర్మార్గ చదరంగ ఎత్తుగడలు.అసలు వీరి పాతాళగంగ రిఫైనరీలు,పెట్రోకెమికల్ ప్లాంట్స్ లొ వీరీ పన్ను ఎగవేతలు బహిరంగ రహస్యము అయినా అడిగే దమ్ము సాహసము ఎవరికి లేదు.అంత ఎందుకు రిలయన్స్ పెట్రొల్ అని బంకులు పెట్టించి చాలమందిని నడిరోడ్డుమీద వుంచిన ఘనుడు.ఇదే విషయము ముఖేష్ కాకుండా వేరు ఎవరైన అయితే మ మీడీయాలో లొ గోలగోల చేసేది.అలాగే ఓక రాజకీయనాయకుడు కూడా కాని లాలూచితో అంతా గప్ చుప్.వీరి తిరుమలలో గేస్ట్ హవుస్ కు ఆలయ ప్రధాన పూజారి విషయము కూడా ఓక విధముగా డబ్బు మహిమే (ఆ అలయ పూజారి కి సిగ్గు లేదు).
 కొంతమంది మనకు పరిచయము లేకపొయినా ఫొటోచూసినా కొంత ఆత్మీయముగా కనపడతారు. కానీ, నాకు ఎందుకో వీరిని చూసినప్పుడల్లా కొంత గగుర్పాటుకు లొనవుతాను.                

వీరికి గురువు మార్గదర్శి పెద్ద అంబానిగారే. ఇటువంటి కార్పొరట్ వ్యూహాలకు కొట్టిన పిండి.బొంబేడయింగ్ వాళ్ళకే పాఠాలు నేర్పిన వ్యక్తి.టాక్స్ అవకతవకలు కొట్టిన పిండి.చివరకు ఎమయింది పక్షవాతముతో బాధపడి చాలా అనారొగ్యముతో దైవసాన్నిధ్యము చేరారు.
 

ఏ మనిషికయినా ఇల్లు ఎంత కావాలి. ఈ నయా మహారాజులు మొఘల్ మహారాజులకే పాఠాలు చేప్పె విధంగా అచ్చు అకాశహర్మ్యాలు,వందలకొద్ది పనివారు,లక్షలకోద్ది విద్యుత్ వినియోగం.అంతులేని కాంక్ష.అదుపులేని ఆహారం,తిన్నదానికన్నా, వృధా ఎక్కువ.ఏమిటి వైభొగము.డబ్బు తెచ్చే జబ్బులాంటివి కదా ఇవి.

టాటాలు, బిర్లాలు ఈ విషయములో చాలా పొదుపు. టాటాలు సమాజానికి ఉపయగించే ట్రస్ట్స్, హాస్పటల్స్ లో శ్రద్ధ వహించారు.బిర్లాలు దేవాలయాలు,విద్యాసంస్థలలో శ్రద్ధ వహించారు. అంబాని ఈ మధ్యనే హాస్పిటల్ కట్టించారు.    

 


       

8, జూన్ 2012, శుక్రవారం

హనుమంతునికి దిశానిర్దేశ్యం చేసిన శ్లొకం - జయ శ్లోకం



శ్రీరామాయణము నందలి సుందరకాండలో  హనుమత్ వైభవాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు వాల్మీకి వివరించారు.సుందరకాండ పారాయణలో  ఓక్కసారి పరీశీలనతో చదవండి అనేక అంతరార్ధాలు స్పురిస్తాయి.

సీతా అన్వేషణకు ఆంజనేయుడు లంకలో అడుగుపెట్టాడు. సీత గురించి లంక అంతా గాలించినా సీత దొరకలేదు. సీత జాడలేకుండా వేళ్ళితే తన దైవము రాముని స్థితి, రాజా ఆఙ్ఞ లాంటి సుగ్రీవాఙ్ఞ అంతకన్న  తనతోటి వానరవీరులు తనపైన పెట్టుకున్న నమ్మకము తను సాగరాన్ని లంఘించేముందు వారు తనపైన ఉంచిన ఆశలసమూహము ఇలా అన్ని ఓక్కసారి ముప్పిరికొన్నాయి. దీనితో తన ప్రయత్నాన్ని తీవ్రతరము చేసాడు కాని ఫలితము లేదు.
లంకలోని రాజప్రసాదాలు,ప్రముఖుల భవనాలు అన్ని గాలించాదు కాని లాభము లేదు.
రావణ అంతరపురములోకి కామరూపముతో వెళ్ళాడు అక్కడ అనేక వందలమంది స్త్రీ సమూహాలు నృత్యగాన వీనొదాలతో మదిరత్రాగి తూలుతూ సోలుతూ అస్తవ్యస్థముగా అభాషణలు పేలుతూ ఇలా అనేక దురభ్యాసముగా కనిపించారు. అయినా రావణ అంతరింగిక మందిరములోనికి వెళ్ళాడు అక్కడ రావణుడు శయ్యపై నిద్రిస్తున్నాడు. అతని ప్రక్కన బహుసుందరమయిన స్త్రీ, ఓక్క క్షణము సీతకాదుగదా అనుకున్నాడు కాని ముందుకు వేళ్ళి అమె తాలుకు నిద్రాభింగిమలు,ముఖ కవళికలు,అంగసాముద్రిక లక్షణాలతో అమే సీత కాదని, సీత ఎన్నటికి ఆటువంటి దుశ్చర్యకు పాల్పడదని నిశ్చయించుకుని.అంతరపురం నుంచి బయటకు వచ్చాడు.
    సీత జాడలేకుండా కిష్కిందకు వెళ్ళటము అసంభవము దానికన్నా ప్రాయోప్రవేశము అన్ని విధిలా సముచితము (తను చిరంజీవి అన్న విషయాన్ని కూడా ప్రక్కనపేడతాడు) అని ఓక్కక్షణము అలొచించి కన్నులుమూసి ధ్యానము చేస్తాడు

శ్లో. జయత్యతిబలో రామోలక్ష్మణశ్చ మహాబలః!
   రాజ జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః!
   దసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణః !
  హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః!!

ఈ శ్లోక పఠనము సాగిస్తూ "శ్రీరామభద్రునికీ జయం " అని ముమ్మారు మారుతాత్మజుడు  మహొత్సనాదం చేసినట్లు వాల్మీకి కమనీయముగా ప్రకటించాడు.


ఈ శ్లోకము ధ్యానము చేసి కన్నులు తేరువగానే కన్నులముందు ఆశొకవనములో సీత ఆయినకు దర్శనము. ఇది హనుమంతుని కూడా దిశా నిర్దేస్యశ్లొకముగా గుర్తింపు.


అనుమానము లేదు ఇది జయ ఘోష .ఆపత్కాలవేళ ఈ జయ శ్లోకాలని పఠిస్తే మనశ్శాంతీ,మహాశక్తీ,జయం- శుభము కలుగాతాయని నారదుడు భరద్వాజ మహర్షితో అన్నట్లు బ్రహ్మవైవర్తపురాణములో పేర్కొంటుంది.