4, జూన్ 2012, సోమవారం

అరీయోవిల్లి,పాండిచ్చేరి - మాతృమందిర్ - యోగసాధన ఫలితము ఎమిటి అనే దానికి ప్రత్యక్ష అనుభూతి.


పాండిచ్చేరి తమిళము మాట్లాడే బంగళాఖాతం తీరప్రాంతములో వున్న ఓక కేంద్రపాలిత ప్ర్రాంతం నుంచి రాష్ట్రంగా ఈ మధ్యనే మారినది.అలాగే ఈ ప్రాంతనామము కూడా పుదుచ్చేరిగా మారినది. ఇది 3 ప్రాంతాలలో విస్తరించివున్న రాష్ట్రము. పాండిచ్చెరితో పాటు యానాం,మహి ల వద్ద కూడా వున్న ప్రదేశము ఈ రాష్ట్ర ఆధీనములొనిది.పాండిచ్చేరి మద్రాస్ నుంచి 3గం.లు  ఈ.సి.అర్. రోడ్డు నందు ప్రయాణిస్తే వచ్చు ప్రదేశము. ఈ ప్రాంతములొ సంస్కృతి,భాష,ఆహార ఆలవాట్లు అన్ని తమిళనాడులానే వున్నా సముద్రతీరప్రాంతమువలన వాతావరణములో చాలా మార్పులు.
ఈ పాండిచ్చేరి గతములో ఫ్రెంచివారి కాలనిగా వుండేది.ఇందువలన ఇక్కడివారిపై ఫ్రెంచి భాష,సంస్కృతి ప్రభావాలు ఇప్పటికి బలంగా వున్నాయి.ఈ భాష నేటికి అధికార భాషలలో ఓకటిగా గుర్తించబడినది.

పాండిచ్చేరి నందు ముఖ్యముగా చూడవలసినవి అరవింద  ఆశ్రమము,ఆరియోవిల్లి అనే విశ్వమానవ నగరం.ఆరియోవిల్లి నందు వున్న మాతృమందిర్.

 అరవిందులు(15/08/1872 -05/12/1950) కలకత్తానగరం నందు కె.డి.ఘోష్ మరియు స్వర్ణలత దంపతులకు అరవిందఘోష్ గా జననము.వీరు బ్రిటన్ నందు వైద్యవృత్తి అభ్యసించారు.అలాగే అనాటి అత్యున్నత పరిక్ష ఐ.సి.యస్ .పరిక్ష నందు ఉత్తీర్ణత సాధించినాడు.కాని ఆతరువాత భారతదేశము తిరిగివచ్చి స్వాతంత్రొత్సవ పొరాటములో పాల్గొన్నాడు.ఈ పొరాటములో వీరు అతివాదులుగా విప్లవమార్గాన్ని ఎంచుకొన్నారు."బరోడా"కుట్ర కేసు అనేది వీరి పైగల ముఖ్య కేసు.ఈ సమయములో వీరు ఆధ్యాత్మిక మార్గములో పయనించారు.వడొదరాలోని మహారాష్ట్ర యోగి అయిన విష్ణుభాస్కర్ లెలె ఉపదేశముతో అధ్యాత్మిక మార్గములో ఆకర్షితుడైనారు.ఆతరువాత కలకత్తా కేంద్ర కారాగారములో వున్నప్పుడు కలిగిన అధ్యాత్మిక అనుభూతులు వీరిని పూర్తిగా ఈ మార్గోన్నతికి కారణభూతమయినవి. అలా పాండిచ్చేరి నందు ఆశ్రమ స్థాపన. వీరి భొధనల వలన అనేక మంది వీరి శిష్యులు అయినారు.వీరిలో ముఖ్యులు మిర అలెస్సా  ఈమె ఆశ్రమ నామము "దిమదర్". ఈ పేరుతొనె ఈమె సుప్రసిద్ధము.

పాండిచ్చేరికి 16కి.మి ల దూరములో 1971 నందు అరియోవిల్లి అనే నూతన విశ్వమానవ నగర నిర్మాణానికి దిమదర్ ప్రారంభించినారు.ఈ పట్టణనిర్మాణము 2008 వరకు సాగినది.ఈ పట్టణాన్ని యునేస్కో వారు కూడా గుర్తించారు.అరియోవిల్లీ అంటే అరుణోదయనగరమని అర్ధము.అరియోవిల్లీ ఎవరికి చెందనిది, సర్వమానవుల మానవత్వము కోసము నిర్మించినది. ఇక్కడ నివాసము అధ్యాత్మిక సాధకులకు,సేవాకార్యక్రమాలలో పాల్గొనేవారికి ఆవకాశము.అరియోవిల్లీ నందు విఙ్ఞానము,ప్రగతి పురాతనము నుంచి నేటిదాక ఎలా ఎదిగినది, నేర్చుకునేందుకు, పరీశీలించేందుకు ఉద్దేశించిన నగరం.అరియోవిల్లీ అనునది పాత కొత్తల అనుసంధానము. అరియోవిల్లీ వస్తు,విషయ మరియు ఆధ్యాత్మికతల సమూహము.అంతకన్నా చిక్కనయిన మానవత్వ బంధం.

   అరియోవిల్లీ నందు మాతృమందిర్ ముఖ్యనిర్మాణము. దీనిని ప్రతి ఒక్కరు సందర్శించవలసిన అద్భుతనిర్మాణము.ఇది ఓక పెద్దగోళాకార నిర్మాణము.లోపల పలు అంతస్థులుగాను,బయట గోళానికి బంగారు రంగులోని డిస్క్ లు తాపడము చేసిన ఓక అద్భుత మందిరము.ఇది ఓక యోగస్థలము,అంతకుమించి యోగశాస్త్ర  ప్రయోగశాల. సాధకులకు సాధనశాల, సందర్శకులకు యోగ ఫలితాలు ఎలావుంటాయి,దర్శనాలు ఎలా వుంటాయో  ప్రత్య్క్షముగా కన్నులముందు నిలిపే ఒక అత్యధ్భుత నిర్మాణము.
 ఈ మాతృమందిరము 4 స్థంభాలపైన నిర్మితమయినది. ఈ 4 స్థంభాలు మహేశ్వరి,మహాకాళి,మహలక్ష్మీ,మహ సరస్వతిల ప్రతిరూపము.

  ఈ మాతృమందిర  అంతర్భాగములో మొదటి అంతస్థు మధ్యభాగము నందు ఓకపెద్ద గోళాకారస్ఫటీకం దాని క్రింద నుంచి ఓకేఒక్క కిరణము అలా ప్రసారమవుతుంది అది అలా పైకి ఋజుమార్గములో ప్రయాణిస్తూ పైకి వెళ్ళినకొద్ది దాని పరిధి విస్త్రుతమయి బాగా బాగా పెరిగి షటచక్ర  నిరూపణకు సాక్షిగా నిలుస్తుంది.సాధన వలన యోగ శక్తి మూలాధారము వద్ద ప్రారంభమయి  సహస్రారమువద్దకు వచ్చునప్పుడు ఎంత విస్త్రుతఙ్ఞాన పరిధిగా మారుతుందో సహస్రారము దాటి విశ్వశక్తిగా ఎలా మారుతుందో తెలిపే ఒక ప్రత్యక్ష నమునాగా నిలుస్తుంది.ఈ మాతృమందిర పైకప్పు అర్ధగొళముగా వుండి అనంత విశ్వానికి ప్రతికగా, మానవ మస్తిష్కానికి గుర్తుగా మనకు తోస్తుంది.ఈ లొపలి రంగులు కూడా లేత గులాబి మరియు బూడిద రంగుల మిశ్రమముతో దాదాపు మానవ మేదడు కణజాల రంగులు ప్రతిఫలించటము ఒక అద్భుతము.లొపల సాధకులు సాధన చేస్తుంటారు.ఈ నిర్మాణ విశిష్టతవలన కాని సాధకుల సాధనా తరంగాలవలన, సాధకులకు త్వరగా సాధన సాధకము అవుతుంది. సాధారణ సందర్శకులు దీని అర్ధము తెలుసుకుని చూస్తే చాలా బాగుటుంది లేక పొతే ఇబ్బందిగా మారుతుంది.
     

 ఈ మాతృమందిరాన్ని నేను 2000వ సం. నందు దర్శించి అనుభూతి చెందాను. ఆ అనుభవాలే ఈ పొస్ట్.
 




     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.