23, జూన్ 2012, శనివారం

శ్రీశ్రీ గారి గురించి ఉచిత పత్రిక నిరంతరము కావాలంటే మీరు ఏమి చేయాలి

శ్రీశ్రీ సాహితి ప్రపంచములో సృష్టించిన మార్గము దానిపై అయిన గొప్పతనము చెప్పటం చర్వితచర్వణం అవుతుంది తప్ప వేరు కాదు.ఎందరికో ఆరాధ్యుడు గా వున్నారు. వారి సాహితి కృషి పై నిరంతర చర్చలు,అనేక వ్యాసాలూ ప్రచురిస్తూ అది ఉచితముగా అందరికి అందచేస్తున్నారు.
విజయవాడ నగరములో శ్రీశ్రీ సాహిత్య నిధి అనే సంస్థను శ్రీ సింగంపల్లి అశోక్ కుమార్ గారు నెలకొలిపి ఈ సాహితి సేవ చేస్తున్నారు. మీకు కావాలన్న రు 100 లను  పోస్టేజి నిమిత్తము పంపి మీ పేరు నమోదు చేసుకుంటే మీకు ప్రతి మూడు నెలలకు మీ ఇంటి ముందుకు పత్రిక నేరుగా వచ్చిచేరుటుంది.
అన్ని వివరాలకు
కన్వీనర్
శ్రీశ్రీ సాహిత్య నిధి
305,ప్రగతి టవర్స్
మారుతినగర్
విజయవాడ
520 004.
 email : srisri_sahityanidhi@yahoo.com.
Fax : 6697375
phone : 6617375
mobile : 98485 04649, 92462 77375.


ఎలాగు ఇక్కడదాక మీరు వొచ్చినందుకు మీకు శ్రీశ్రీ సిప్రాలి కవితలతో ఓ మంచి అనుభూతి కలిగిద్దాం

వెయ్యి పడగలు
లక్ష పిడకలు
లక్క పిడతలు
కాగితపు పడవలు
చాదస్తపు గొడవలు
----------------------------------------------------------------------------------------------
ముష్టి మైధునంలో
సవ్య సాచివిరా నా కొడకా
నాలుగు గోడల మధ్యా
రహస్యంగా ఏమిటాపని
నాలుగు వీధుల కూడలి వద్ద నిలబడి
నలుగురి మధ్య
నిరూపించుకో నీ మగతనం
ప్రదర్శించు నీ వ్యక్తి స్వాతంత్ర్యం
ఆంధ్రుల జాతీయ పత్రికల
సంపాదకియాలకు
ఆదర్శప్రాయంగా...
---------------------------------------------------------------------------------------------
కొంతమంది కుర్రవాళ్ళు
పుట్టుకతో వృద్ధులు
పేర్లకి పకిర్లకి పు
కార్లకి నిబద్దులు

 నడిమి తరగతికి చెందిన
అవగుణాల కుప్పలు
ఉత్తమొద్దు రాచ్చిప్పలు
నూతిలోని కప్పలు

తాతగారి నాన్నగారి
భావాలకు దాసులు
నేటి నిజం చూడలేని
కీటక సన్యాసులు

నిన్నటి లీడరు ధోక
నేడు చూడజాలరు
కన్నులున్న జాత్యంధులు
కాకినైనపోలరు

వీళ్ళకి కళలన్నా రస
మన్నా చుక్కెదురు
గోలచేసి ఆరవడమొక
టే వాళ్ళేరుగుదురు

కొంతమంది యువకులు రా
బోవు యుగం దూతలు
పావన నవజీవన బృం
దావాన నిర్మాతలు

బానిస పంధాలను తల
వంచి అనుకరిoచరు
పోనీ అని అన్యాయపు
పోకడలు సహించరు

వారికి నా ఆహ్వానం
వారికి నా సాల్యూట్
కడలి తరగ లాపెదవా
భడవా ఒకాన్యుట్



5 కామెంట్‌లు:

  1. abbo chala peaaaaaaaaaddddaaaa blogu, kaani baagundi....
    vere oka chota mee comment meeda oka prashna?
    చాతకం అంటే వేరేది అనుకున్నాను. కోకిలే చాతక పక్షా? ఈ చాతక పక్షే వాన చినుకుని డైరెక్ట్ గ తాగేదేనా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెటకారం ఆడుతున్నారా తెలియక అడుగుతున్నారా! మీబ్లాగ్ లు రెండు సంస్కృతం ఆధారంగా వుండేవి. సృష్టిచక్రం బ్లాగ్ లో ఎక్కువగా శివబాబ గారివి,ఈరోజు గీత శ్లోకం ఇచ్చారు. ఇన్ని చూసిన మేము మిమ్ములను ఎలా అనుకోవాలి.అయినా పెద్ద అనేదానికి అంత విశేషణం గా వ్రాస్తే ఇలాగే భావిస్తారు.
      అయినా మీరు అడిగారు కాబట్టి మరోసారి చెబుతున్నా చాతకం అంటే వర్షంకొసము ఎదురు చూసే కోయిల.

      తొలగించండి
  2. ramesh gaaroo, sree.sree. gaari kavithalani konnee petaaru kaane manchi uthejaannichevi pettaru thanks

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫాతిమా గారు,
      ప్రజలందరికీ మహాప్రస్థానం,సినిమా పాటలు మాత్రమే బహుళ ప్రచారంలో వుండటము వలన అవి బాగా తెలుసు కాని సిరిసిరిమువ్వ శతకం,ప్రాసక్రిడలు,లిమరిక్కులు ఇవి అందుబాటులో లేనందున వాటిపై ప్రజలకు అవగాహన లేదు. వీలు వెంబడి అవి పరిచయము చేస్తాను.

      తొలగించండి
  3. రమేష్ గారూ, మీరు వీలుంటే నా బ్లాగ్ చుస్తే సంతోషిస్తాను, నేను శ్రీ.శ్రీ. గారి అభిమానిగా ఇంచు మించు ఆయనగారి అన్ని రచనలు చదివాను. అప్పుడప్పుడు ఆయన గారి శైలే నా రచనల్లో తొంగి చూస్తుంది. కాని మీ ప్రయత్నం గొప్పది.

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.