29, జూన్ 2012, శుక్రవారం

బకాసుర వధ అంతరార్ధము - భాగవత అంతరార్ధములు ఏ విధముగా తెలిపానో వివరణ.


భాగవత అంతరార్ధములు : మనము తరచి చూచినకొద్ది భాగవతము దశమస్కంధములో కృష్ణలీలలు ఓక్కొక్కటి ఓక్కో విధమయిన అధ్యాత్మిక రహస్యాలను వెలిబుచ్చుతుంది.అందుకే ప్రాచీనులు కృష్ణుని "కృష్ణం వందే జగద్గురుం " అని ప్రస్తుతించారు.గీత  కృష్ణుని ముఖతా వెలువడిన అమర బోధ.అయితే కృష్ణలీలలు అనేవి అధ్యాత్మిక సంకేతాలు.భగవంతుని దర్శించటానికి మనలోని ఏ అసుర లక్షణాలు వర్జించాలో, నిర్మూలించాలో తెలిపిన రహస్య కధారూప కృష్ణలీలా బొధలు. అందుకే వ్యాసుల వారు జీవులలొ వర్జించవలసిన లక్షణాలకు అసురరూపాన్ని అందుకు తగ్గ నామధేయాలు ఇచ్చి వాటినే భగవానునిచే నిర్మూలనచేయిస్తూ మనకు ప్రచ్చన్న బొధ చేశారు.

మాములు మానవ బాలుడు చేసినది అల్లరిగా సూచించుతాము. కాని కృష్ణుడు లొకనాయకుడు కాబట్టి కృష్ణుని అధిమానవ చేష్టలను లీలావైభవాలుగా గుర్తించి కీర్తిస్తున్నారు. మరి మనము కూడా కారణములేకుండా కీర్తించుదామా  లేక ఇలా ఎందుకు అని ప్రశ్నించుకోని ఆగి ఓక్కసారి పరిశీలిస్తే మనకు కారణము దోరకుతుంది.ఇందుకు ఎవరిని ఆశ్రయించాలి. ఎవరో ఎందుకు ముందుగానే అనుకున్నాముగా వందే జగద్గురుం అని,ఆయిననే స్మరించి  ఆయిన లీలవైభవాన్ని  మనకు తర్క రూపముగ లభింపచేయమని కోరితే, మన బుద్ధికి ఇది ఇలా అని ప్రశ్నలను సంధించుకుంటూ కారణాన్వేషణ  జరిపితే అప్పుడు స్వామీ మనకు అంతరార్ధ బోధను మనసుకు తట్టిస్తాడు.ఇది సర్వులకు ఓకే విధమని అనుకోవద్దు. ఏవరికి వారు తరచి,ప్రశ్నించి చూస్తే రకరకాలయిన సమాధానాలు వస్తాయి.ఇవి వారి బుద్ధి,ప్రారబ్దము,భక్తి అంతరంగాన్ని బట్టి దర్శనము ఇస్తాయి.అంతే కానీ వీటికి పెద్ద పాండితీ ప్రకర్ష అవసరము లేదు.కావలసినది అచంచల విశ్వాసము,నమ్మకము,భక్తి.            
ప్రతి ఘట్టములోను కృష్ణుడు సూత్రధారి,పాత్రధారి,ముఖ్యకధానాయకుడు కాబట్టి ఆయిన వుంటాడు. ఇక ఆయిన లక్షణాలు, మామూలు మానవుడు ఎవిధముగా వుంటే భగవదర్శనము కలుగుతుందో వూహించితే, అప్పుడు మనకు కృష్ణుడు మనకు శుద్ధ పరమాత్మ రూపముగా, నారాయణ రూపముగా దర్శనము ఇస్తాడు.మధ్య మధ్య అయిన మాయ మనమీదకు కూడ వస్తుంది.శుద్ధ ఆత్మకు కావలసిన గుణగణాల  గురించి మీకు ముందే అంచనాకు వచ్చి వుంటారు కనుక భగవత్ స్వరూపము మీకు బొధ పడినట్లే.ఇకపోతే ఆఘట్టములోని అసుర ప్రకృతి కలవారు ఎవరో చూసి వారి నామ,రూప,గుణగణాలను తెలుసుకోని వారు మన జీవితములో ఏ అవలక్షణాలను సూచిస్తున్నారో గ్రహించి అపై విశ్లేషణ చేస్తే అప్పుడు మనకు ఆఘట్టము యొక్క అంతరార్ధము, వ్యాసుల హృదయము దర్శనమయినట్లే.           
కొన్ని ఘట్టాలలొ అసురలక్షణాలు లేక మానవాతీత కార్యక్రమాలు వున్నాయి, గొవర్ధనము,కాళీయమర్ధనము లాంటివి.ఎందువలన ఈ అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యమవుతున్నాయి ఓక్కసారి వాటి మూలానికి, ఆకార్యక్రమ లబ్దిదారులు ఎవరు ఇలా అన్ని ఓక్కసారి నిశితంగా పరీశీలించండి.సర్వము బొధ పడుతుంది మొత్తము ఆచరణకు వస్తుంది. కాకపొతే ఇలా సంతృప్తికరముగా ఆఖరి సమాధానము వచ్చేవరకు భాగవత కధలను మనము,స్మరణము,పఠనము చేస్తే అప్పుడు తార్కికరూప అంతరార్ధము మీముందుకు వచ్చి  నిలుస్తుంది.            
   ఇది నేను అనుసరించిన పద్ధతి.ఇప్పటివరకు ఇలా వ్రాయించింది నా ఆరాధ్యదైవమయిన శ్రీరామచంద్రమూర్తి కరుణాకటాక్షాలే.అలాగే శ్రీరామ నామ ధురంధరులు, స్వఫ్నదర్శన కటాక్ష పరులు మా పితామహులు కీ.శే. శ్రీ ఆలపాటి శ్రీరాములుగారు , నా మార్గదర్శకులు నాకు దైవ స్వరూపులైన మానాన్నగారు కీ.శే.  శ్రీ ఆలపాటీ పాండు రంగారావుగారి ఆశ్వీర్వపూర్వక కరుణాకటాక్షలే ఈ నాలుగు మాటలు వ్రాయగలిగాను.

బకాసురవధ అంతరార్ధము : బకము అంటే కొంగ అన్నసంగతి మీకు తెలిసిందే. కొంగ మోసానికి చిహ్నము. సాధరణ కొంగ ఎమి చేస్తుంది చెరువులో దొంగజపము చేస్తు చేపలను పడుతుంది.మరి మనలను అధాయత్మిక జీవనములో  మోసము చేయటానికి కొంగను సంకేతముగా చూపారు. నీరు మనస్సుకు గుర్తు.ఈ నీటిలో కదిలే చేపలు వున్నాయి,అరచే కప్పలు వున్నాయి,అందమయిన కలువ పూలు వున్నాయి.ఇవి అన్ని ఒక్కోటి ఒక్కో దాన్ని సంకేతం.చేపలు నీటిలో స్థిరంగా వుండవు.కప్పలు ఉరకనే అరుస్తూ లోపల బయట గంతులు వేస్తుంటాయి.కలువ పూలు ఇవి ఏవి దానికి పట్టదు బురదలో పుట్టినా అందముగా సౌందర్యాన్ని లక్ష్మీకళను వెదజల్లుతుంది.మరి తామరాకు చూడండి నీటిలో పుట్టినా దాని జీవనానికి నీరు అవసరమైనా నీటిని తన పై నిలువ నివ్వదు.

 మానవుని మోసానికి గురిచేసేవి ఇంద్రియాలు. ఇంద్రియాలు ఏమి చేస్తాయి.   
 కన్ను తనకు ఇంపుగా వున్న దృశ్యాలను కొరుకుంటుంది.చెవి సొంపుయిన శబ్దాన్ని,సంగీతాన్ని కోరుకుంటుంది.నాసిక సొగసైన సుగంధాలు, జిహ్వ మధురమయిన భక్ష్య భొజ్యాలు అనేక విధములయిన రుచులను కోరుకుంటుంది.చర్మం హాయిని,సౌఖ్యాన్ని కోరుకుంటుంది,పురుష ఇంద్రియము అంతులేని నిరంతర కామాన్ని ప్రజ్వరిల్ల చేస్తుంది.పోని వీటిని ఓక్కసారి అనుభవింప చేస్తే వూరుకుంటయా అబ్బే మరల మరల ఆ అనుభవానికై వెంపర్లాట ఆరంభిస్తాయి. మరి ఇవీ దేనిని సూచిస్తాయి చెరువులో స్థిరముగా వుండని చేపలను.      
కొంగకు చేప చిక్కటమంటే మనో నిగ్రహములేక ఇంద్రియలోలత్వమునకు  గురి కావటమని అర్ధము.అందుకే కొంగలు ఈచెరువులో చేపలు కాగానే ఆ చెరువులోకి పొతాయి.అంటే మనస్సు ఈ సౌఖ్యము  ఆ సౌఖ్యమని పరుగుతీయటమే దీని అంతరార్ధము.ఇవి ఇలా చేసి మనిషిని అధఃపాతాళానికి తొక్కుతాయి. ఇంద్రియ నిగ్రహమే జీవన సౌఖ్యానికి,అధ్యాత్మిక వున్నతికి మొదటి మెట్టు. అదే బకాసుర వధ.   
     

3 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. భారతి గారికి, నమస్కారములు. నాకు ఉదయం నుంచి అనుమానం.నేను విశ్లేషణ వ్రాసి తప్పు చేస్తున్నానా అని కారణం మిత్రుల స్పందన లేక పోవటంతో సరి ఈ దారి వదలి ఇంకో దారి పట్టాలేమో అని భావించా.అదృష్టం మీరు చదివి స్పందించారు. మెప్పు కన్నా అసలు మన భావాలు కొంతమంది వ్యక్తులకు చేరుతున్నవి.వాళ్ళు ఆలోచిస్తున్నారు అనే దానికి సూచన కామెంట్స్.అంతకు తప్ప మరి ఎమి కాదు. అనవసరం వాటికి మటుకు కుప్పలు తెప్పలుగా కామెంట్స్ వస్తాయి.

      తొలగించండి
  2. నమస్తే రమేష్ గారు!
    మీరు చెప్పింది నిజమే కానీ, ఆధ్యాత్మికపరంగా చక్కటి విషయ విశ్లేషణ చేస్తున్నారు. ప్రతిస్పందన లేకున్నా చాలామంది మీ పోస్ట్స్ చూస్తున్నారు. భవిష్యత్తులో ఇప్పటి వారికీ, ముందు తరంవారికీ ఎంతో ఉపయుక్తమైన విషయాలను తెలియజేస్తున్నారు. మీ ఈ ప్రయత్నం శ్లాఘనీయం. ఆధ్యాత్మికపరంగా ఎందరికో స్ఫూర్తిదాయకమైన పని చేస్తున్నారు. మీ పోస్ట్స్ నాలాంటివారికి ఆధ్యాత్మిక జిజ్ఞాసను, అంతరశుద్ధిని కలుగజేస్తున్నాయి. అందుకే దయచేసి మీ ఈ ప్రయత్నంను ఆపకండి.

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.