2, జూన్ 2012, శనివారం

3 Idiots లోను మరికొన్ని సినిమాలలొ నన్ను కదలించిన సంఘటనలు

నాకు ఓ దుర్లక్షణము వున్నది ఏదైనా సినిమానో,కధగాని,మరి ఎదైన చూసేటప్పుడో లేక చదివిటప్పుడో లేక ఎవరితో నన్న చర్చ జరిగేటప్పుడో ఆయా సంఘటనలు,మాటలు,దృశ్యాలు నా జీవితములో ఏక్కడన్నా ప్రతిబింబించాయా అని అన్వయముచేసుకోని ఆవిధముగా పరిశీలించుకుంటా.దీని వలన మంచి సినిమా చూసేటప్పుడు ఓక్కసారిగా గతస్మృతులు, నా ఆత్మీయులు, నా హృదయములోకి ప్రవేశించి వారి ఆదరణ, అభిమానము ఙ్ఞప్తికి  వచ్చి మనస్సు భారముగాను కొండకచో కన్నులు నీటితోను నిండిపొతాయి. ఇటువంటి సంఘటనలు కోన్ని మీముందుకు.

హిట్లర్ : ఈ సినిమాలో చిరంజీవి ఓక బాధ్యతాయుతమయిన అన్నగా ఓక మంచి నటన చూపాడు( రక్తసంభంధం లో యన్.టి.ర్.,సావిత్రలు,పల్నాటి పౌరషములో కృష్ణంరాజు,రాధికల తరువాతే ఎవరైనా).పెద్ద చెల్లి కారణాంతరాలవలన ఓక ద్వితియ వివాహము చేసుకోని అత్తవారింటికి వెళ్ళుతున్న సమయములో చిరంజీవి" మీ అన్నయ్య నీకు ఎమి పెట్టడమ్మ అని ఎవరైనా అడిగితే ఎన్నో ఆశలు పెట్టాడు చివరకు ఇంత కష్టపెట్టాడు అని చెప్పమ్మా అని " సొదరితో దుఃఖ పడుతూ చెపుతాడు.అలా చూస్తు వున్న సినిమాలో  ఓక్కసారిగా ఆడైలాగ్ నా హృదయాన్ని పట్టుకొని పిండింది.      



బాగ్ భన్ : ఇది అమితాబ్,హేమమాలిని నటించిన హింది సినిమా. ఈ సినిమా పేరుకు అర్ధము పొదరిల్లు అని. ఇది మన బడిపంతులు సినిమాకు ఆధునిక రూపము. దీనిలో అమితాబ్,హేమలా కాంబినేషన్ వారి ఇరువురి నటన ఎలావుంటదంటే శృతి,లయలు కుదిరిన సంగీతములా.  వారి ఇరువురి పరిచయ సన్నివేశమే వారి మధ్య వున్న ఏకత్వాన్ని,వారి అనుభంధాని దర్శకుడు అద్భుతంగా తీసాడు. అతని అడుగులు చప్పుడు అమె హృదయానికి, అమె గాజుల సవ్వడి అతని హృదాయనికి సోకి ఇరువురు ఒక్కసారిగా కల్సి మురిసి పొతుంటారు.చూడండి భార్య భర్తల మధ్య ఎకత్వానికి ఇంతకన్నా ఎమి నిదర్శనం కావాలి.  
బాంక్ అధికారిగా అమితాబ్ రిటైర్ అవుతాడు. రిటైర్మేంట్ తరువాత వచ్చే డబ్బులు పంచుకుందామని కోడుకులు వస్తే వారికి తన ఆర్ధికపరిస్థితి చెప్పి తనను,భార్యను వారు చూడాలి అని అడగలేక అడగటము.ఆమాటలు కూడా చెప్పలేక బాధగా పలకటం.కోడుకులు తల్లితండ్రులను పంచుకుంటారు. వృద్ధాప్యములో చెరో దిక్కు అవుతారు.ఇక వారి ఇరువురికి నరకము.ఆసమయములో కర్వాచౌత్ సన్నివేశము.ఈ సినిమా మొత్తానికి అగ్రతాంబూలము.కర్వాచౌత్ మన శ్రావణశుక్రవారములా ఉత్తరాదిలో ఆచరించే వ్రతము. ఆరొజున చంద్రోదయము అయిన తరువాత పూజ చేసి జల్లెడద్వార చంద్రుని చూసి ఆపై భర్తను చూడాలి భర్తద్వారా ఆశీర్వాదాలు అందుకొవాలి ఆపై భర్తకు భొజనము పెట్టి తాము భొజనము చేయాలి. ఇది విధి. కాని సినిమాలో ఇరువురు చెరో దిక్కున.చంద్రోదయసమయానికి ఫోన్ చేసి మాట్లాడుకుంటుంటే హేమ అడుగుతుంది మీరు భొజనము చేసారా అని పాపము అక్కడ భోజనముకాదు కదా మంచినీరు కూడా వుండవు.కాని అమితాబ్ భార్యకు ఈ విషయము తెలియ కూడదని ఖాళి ప్లేట్లు స్పూన్స్ తో ఇదిగో ఈ కూర బాగుంది,ఆకూరబాగుంది అని చెపుతాడు.కాని అన్ని రొజుల కాపరము చేసిన హేమకు తెలియదా అక్కడ ఎమిజరుగుతుందో ఒకేఒక్క మాట అంటుంది మీకు అబద్ధం చెప్పటo కూడా రాకపొతే ఎలా అని. ఈ మాటతో అమితాబ్ అప్పటివరకు పట్టుకున్న దుఃఖాన్ని ఆపలెక పొతాడు.ఈ సన్నివేశము వచ్చినప్పుడు నన్ను నేను నిగ్రహించుకొవటము సాధ్యము కాలేదు. ఆ డైలాగ్ లన్ని నాకు కూడా ఎక్కడో తగులుతాయి. కారణం 22సం.లా నా వైవాహిక జీవితములో నాభార్య నాకు గాడ్స్ గిఫ్ట్. అమె అణుకువ,విధేయత ముందు నేను ఎప్పుడు పిపీలకాన్నే.నా విద్వత్తు,పురుషత్వం అన్ని అమె అణుకువ తో పొలిస్తే ఏపాటికి.  
 ఆనలుగురు : దాదాపు నా మనస్తత్వానికి దగ్గరగా వున్న సినిమా.

 మిధునం కధ : నాకు ప్రస్తుతం అంత శక్తి లేదు కాని వుంటే రమణగారికి ఖచ్చితంగా సత్కారం చేసేవాడిని.అంత మంచికధ.భార్య భర్తలు ఇరువురు ఎంత స్నేహముగా వుండాలి ఓకరి మధ్య ఒకరికి అనుబంధం ఎలా  వుండాలో హృద్యంగా తెలిపిన కధ.పల్లకీలో వేరుశనగపప్పు  పెళ్ళికోడుకు పెళ్ళికూతురికి పెడితే అమె అనుకుంటది తను తిని నాకు పెట్త స్నేహశీలి అని అలా ప్రారంభమయిన వారి దాంపత్య స్నేహం కధమొత్తం సాగి చివరకు మన గుండేలు పిండుతుంది. ఓక్క సన్నివేశం "అప్పశాస్త్రీ అటక ఎక్కి వుందగా నిచ్చేన తిసివేసి క్రింద కంది పచ్చడి రుబ్బుతుంటుంది మామ్మగారు.అప్పాశాస్త్రి మాత్రం పైనుంచి తిట్లు శాపనార్ధాలు. ఇవి అన్ని భరించిన బామ్మగారు ప్రక్కన వున్న మనవరాలితో అంటుంది అయినే అంతే చిన్నపిల్లవాడి తత్వం ఆయినకు వేది వేడి అన్నమును రోట్లోనుంచి తీసి ఇంగువ పోపుపెట్టిన కందిపచ్చడిని ఆరటి ఆకులో వడ్డిస్తే ఆయనకు తృప్తి నాకు మనశ్శాంతి అంటుంది.చూశారా భర్త హృదయమునకు భార్యకు దగ్గర దారి భోజనమే.

3 idiots :   ఈ సినిమా మొత్తము వినోదముగా వున్నా మాధవన్,అతని తండ్రి మధ్య వున్న సన్నివేశాలు వస్తే నన్ను నేను నిగ్రహించుకోవటము సాధ్యం కాలేదు.కారణము ఆతండ్రి కొడుకులకు మధ్య జరిగేదే మాఇంట్లో జరుతున్నది.నేను కూడా సినిమాలోని మధ్య తరగతి తండ్రికి ప్రతినిధినే. నా కుమారుడు మాధవన్ కు ప్రతినిధి. గమ్మత్తుగా వాడిలానే వీడుకూదా ఫోటోగ్రాఫర్ కావాలంటాడు.పుత్రుడుని పొగడ కూడదు కాని  నాబిడ్డ బంగారం, ఒక అత్యధ్భుత ఫొటోగ్రాఫర్ దానికి దృష్టాంతము వాడు తీసిన 2000 ఫోటోలు.దర్శకుడు మాజీవితములో  సంఘటన పెట్టాడా అని అనిపిస్తుంది.కాని ఎదో భయం! మధ్య తరగతి తండ్రిని కదా.ఓక్కగానొక్క కోడుకు వాడికి చదువు తప్ప ఆస్థులు అంతస్తులు అందించలేని సగటు మధ్యతరగతి  తండ్రిని.మానాన్నగారు అనే వారు మధ్యతర్గతి వారికి అన్ని ఇబ్బందిరా అని అనుభవములో కాని తేలియటములేదు.

ఆపై శ్రీరాముని దయ.


1 కామెంట్‌:

  1. avunandi...middle class jeevitham chala daarunanga untundi. baaga unnavaallaki em problem undadu, emi lenivaadiki ye aasalu undavu. kaani ee middle class lo atu aasalu , itu vaatini nijam chesukoleni stomatha to anukshanam sathamathanga , narakanga untundi.

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.