17, జులై 2012, మంగళవారం

భగవదారాధనలొ ముద్రలు

 భగవదారాధనలొ ముద్రలకూడా స్థానం ఉన్నది. ముద్ర అంటే ఎమిటి? అంటే ఓక రూపానికి ప్రతీకాత్మకముగా వ్రేళ్ళను, చేతులను వివిధ ఆకారాలలొ ముడచి,పెనవేసి,ఆరాధన సమయాలలొ భగవంతునికి ఆరాధన పూర్వకముగా చూపటమని సూక్ష్మమముగా చెప్పవచ్చు.అంతే కాకుండా యోగవిధానలలో మొత్తం శరీర భాగం పంచుకోనే ఒక ఆచరణ అని కూడా చెప్పవచ్చు. నృత్యరీతులలొ సంగీతమునకు,లయ స్వరలకు తోడుగా, జతులు తో సహితముగా నృత్య భంగిమలో భాగముగా అది నటరాజ అర్చనలో ఓక భాగముగా అక్కడ భావిస్తారు.    

" ముదం కుర్వంతి దేవానం రాక్షసాన్ ద్రావయంతీచ" అన్నదాన్ని బట్టి దేవతలకు సంతోషాన్ని,సంతృప్తిని కలిగిస్తుంది.రాక్షస శక్తులను పారద్రోలుతుంది కాబట్టి ముద్ర అనే పేరు వచ్చిందని  విష్ణుసంహిత తెలుపుతున్నది.దేవతల యోక్క అర్చన,జప,ధ్యానములలొనే కాక కామ్యకర్మలలొ ను విగ్రహ ప్రతిష్ట,ఆవాహన,నైవేద్యము,విసర్జనలలో వివిధ ముద్రలు ఉపయోగించబడతాయి.

 ముద్రలు అనేకాలు పురాణాలలో పేర్కోని వివరించబడ్డాయి బ్రహ్మండ,ఆగ్ని,నారద,బ్రహ్మ,దేవిభాగవతాలలొ ముద్రలను గురించిన విస్తృత వర్ణన వున్నది.గాయత్రీ జపం చేసటప్పుడు ఉపయోగించే 24 ముద్రలు,నిత్యం సంధ్యావందనం చేసే వారికి అనుభవమే.కాళికా పురాణములో 108 ముద్రలు ఉన్నాయని తెలుపుతున్నది. జైనులు.బౌద్ధమతస్థులు కూడా తమ ఆరాధనలో ముద్రలను ఉపయోగిస్తారు.


ముద్రలలొ ఆవాహని,స్థాపని,సన్నిధాపన మొదలైన తోమ్మిది ముద్రలు చాలా సాధారణముగా అన్నిరకాల అర్చనలలో అర్చన విధానలలో ఉపయోగించబడతాయి.శంఖముద్ర,గదాముద్ర,వారాహిముద్ర,పరశుముద్ర మొదలైనవి విష్ణువు ప్రియమైనవిగా మనపురాణాలు పేర్కోంటున్నాయి.




1 కామెంట్‌:

  1. Very informative , and quality telugu contetnts are in your website.If you like to get more traffic for free.Submit your new posts to webtelugu.com

    No need to sign up , just login with your facebook account and start posting your contents on webtelugu . We will also spread your news via facebook and twitter , and also helps you to increase your alexa rank.



    http://www.webtelugu.com/





    Thanks

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.