4, జులై 2012, బుధవారం

పసుపు కుంకుమలు - పుట్టిల్లు మెట్టినిల్లు వీటిల్లో స్త్రీ కి ఏది ముఖ్యం?



హైందవ సంస్కృతిలో పసుపు,కు౦కుమలకు వున్న విలువ ఎంత చెప్పిన తరగదు.రకరకాల కారణాలపై వీటి విలువ అపరిమితంగా వున్నది. పూజ విధానాల్లో ఇవి ప్రాముఖ్యం సంతరించు కున్నాయి.పసుపు గణపతి,కు౦కుమ పూజ ఇత్యాదివి పరిశీలన కు మాత్రమే.
అలాగే సాంఘిక జీవనములో పసుపు,కుంకుమలు అంటే  ప్రతి స్త్రీ సౌభాగ్య చిహ్నాలుగా ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకం గా చెప్పవలసిన పని లేదు. కొద్దిపాటి ఈ పసుపు కుంకుమల గురించి వోపికగా ఎంతోసేపు వ్రతాలకు,వాయినాలకు ఎంతలా ప్రయాస పడి వుంటారో అని పిస్తుంది. అలాగే ప్రతి ఆడపిల్ల కు పుట్టింటి నుంచి హక్కు గా కోరు కునేవి   సిరిసంపదలు కాదు పసుపు కుంకుమలే.ఇవి ఆమె గౌరవమునకు,అస్తిత్వమునకు గుర్తు.
మరి ఇవి స్త్రీ లకే ఎందుకు వాడుతూ అంత ప్రత్యేకత గా చెపుతున్నారు.
 ఆడ పిల్లకు పెళ్లి అయి పాతిక సంవత్సరాలు గడచినా పుట్టింటి ఆశ పోదు, పోరాదు. కారణం అది ఆమె వ్యక్తిగత గుర్తింపు.భర్త తో కూడా చెప్పని మాటలను తల్లి తో పంచుకుంటారు.తన సుఖ,దుఖాల్లో మేమున్నాము అనే నమ్మకం, భరోసా పుట్టిల్లు నుంచి ఆమె అవిచ్చనంగా కోరుకుంటుంది.తన బాల్యం,తన ఆట,పాట అన్ని ఆ ఇంటి తో ముడి పడ్డాయని తన పిల్లలకు తన బాల్య ముచ్చటలు గా చెప్పి తన అనురాగాన్ని సదా బిడ్డలకు చెప్పుతూ వుంటుంది. చిన్న వేడుక చేసినా,పెళ్లి, పేరంటాలకు ఇలా అన్నింటికి ఆమె ముందల తన మనస్సులో ఉంచుకునే పేరు పుట్టిల్లు. అందుకే ఆమె కార్యక్రమం ప్రారంభ లగాయత్తు తన వారి కోసం ఆరాటంగా కళ్ళలో వత్తులు వేసుకుని గుమ్మం వంక చూస్తుంది.తన చుట్టూ ఎందరు వున్నా తన పుట్టింటి వారు వుంటే ఏనుగు అంబారి ఎక్కినంత సంబరం,దేవే౦ద్ర పదవి దక్కిన ఆనందం. ఇంత,ఇన్ని ప్రత్యేకతలు వున్న పుట్టిల్లు ఆడవారికి "పసుపు" రూపంలో గుర్తించాలి.
పసుపు భూమినుంచి లభించే కొమ్ముల నుంచి వస్తుందని. సీతమ్మ వారు కూడా భూమి నుంచి పుట్టినదని.పార్వతి  గిరి పుత్రిక అని . అలాగే ప్రతి పూజలో పసుపు గణపతి తన బాల్యం జ్ఞాపకాలు గా భావిస్తుంది. తన పుట్టిల్లులో నేర్చుకున్న మంచి,మర్యాద మన్ననలు ఆమె అత్తింట గౌరవాన్ని పెంచుతాయి అన్నది నిర్వివాదాంశం.పసుపును
పాదాలకు,మంగళసూత్రం నకు  ,స్నానంలో ముఖం నకు వాడుతారు. పాదాలు నీ చిన్న నాడు నేర్చుకున్నవోర్పు,వొద్దిక,అణుకువ, జ్ఞానం నిన్ను జీవితాంతం నిలబెట్టాలని,మంగళ సూత్రం ఏ విషయమైన గుండెల్లో నే వుంచుకోవాలని, ముఖమునకు ఎన్నడు తన వ్యక్తిత్వం,అస్తిత్వం నిలబెట్టుకోమని ఇలా పసుపు వాడతారు.
ఇక వధువుగా మారి భర్తతో అత్తింట అడుగు పెట్టి తన జీవితం మొత్తం ఇక్కడే గడుపుతుంది.పిల్ల పాపలతో చల్లగా వుంటుంది. భర్త తో అనురాగం తో వుంటుంది.ఈ మెట్టినిల్లు కుంకుమతో సూచన చేయాలి.
కుంకుమ భర్తకు చిహ్నం. స్త్రీ కి ఎంతో ప్రియమైనది తన భర్త యొక్క ప్రేమ అనురాగం. ఎంతో వత్తిడి లో వున్న ఆమె భర్త, ఆమెను దర్శించినంతనే స్వా౦తన పోంద బడే  ముఖ ప్రసన్నత ఆమె సొత్తు. మరి ఇందులో ప్రముఖ పాత్ర వహించేది ఆమె నుదుట కుంకుమ బొట్టు.అందుకే అమ్మవార్లకు కుంకుమ పూజలు ప్రత్యేకంగా చేసేది .మరి ఇంత ప్రాముఖ్యం వున్న కుంకుమ ఈ రోజుల్లో స్టిక్కర్లుగా మారి పోయింది.
ఇంకో గమత్తు గమనించారో లేదో కాని పసుపు  కుంకుమ గా మారుతుంది. పసుపునకు కొన్ని ప్రత్యేక ద్రవ్యాలు కలిపి కుంకుమ తయారు చేస్తారు. అంతే కాని ఏమి చేసిన కుంకుమ పసుపు కాదు.
మరి పుట్టింటి ఆడపిల్ల, ఇల్లాలు గా మారుతుంది అనేది దీనికి సూచన.
మరి అందుకే ప్రతి స్త్రీ మూర్తి ఈ రెండిటికి అంత విలువ ఇచ్చేది.



ఇవి నా ఆలోచనలు మాత్రమే. శాస్త్ర ప్రమాణాలు గట్రా అంటే ఏమి లేవు.
ఇవి ఇంతలా వ్రాయటానికి కారణం మొన్న ఆదివారం నాడు నా శ్రీమతి మహాలక్ష్మి ఎదుర్కొన్న స౦క్షోభం, అందుకు ఆమె దుఃఖ నివారణకు నేను అనేక రకాల వోదార్పు ప్రక్రియలో భాగం గా అనేక మాటలు. వాటిల్లో కొన్ని నా బ్లాగ్ సోదరి మణులకు పనికొస్తాయని. అలాగే సోదరులారా ఇది గమని౦చి మీ సోదరి మణులపై ఆదరఅభిమానాలు ,ప్రేమ ను రెట్టింపు చేయండి. ఆమె కోరుకునేది ఈ రెండు మాత్రమే. కాని సదా మీరు మీ పరివారం మొత్తం బాగుండాలని కోరుకునే వాళ్ళు మీ ఇంటి ఆడపడుచులు.ఇది ఓ విజ్ఞప్తి.

4 కామెంట్‌లు:

  1. అజ్ఞాత, నేను వ్రాసింది సాంప్రదాయం, నీవు భావించేది సామాజికం. రెండిటికి బేధం చూడు.
    అలాగే క్రింద పేరా చదివి నేను ఏ సందర్భములో వ్రాసానో తెలిపాను.
    నీ భావాలు నీవి,మంచిదే అలాగే ఆచరించటానికి ప్రయత్నించు.

    రిప్లయితొలగించండి
  2. రమేష్ గారూ, ఆడవారికి భర్త ఎంత ప్రేమగా చూసుకున్నా కొన్ని పుట్టింటి వారు ఇస్తేనే ఆనందం. వారు ఏమి కోరుకోరు కాని ఈ కాలంలో వారు కోరుకొనే చిన్ని కానుకలే కరువవుతున్నాయి. ఆమె పుట్టింట ఉండే వదినలు కూడా ఓ ఇంటి ఆడపదచులే అయినా నిరాదరణ ఎందుకో, మీ పోస్ట్ కలచి వేసింది.

    రిప్లయితొలగించండి
  3. ధన్యవాదాలు! మీ హితవచనాలు చదివిన నా భార్య మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపమన్నారు.

    రిప్లయితొలగించండి
  4. sir, manchi bhartha lo ammanee biddanee chusukogaladu stree. mee aadarana chaalu aameku tanaku lopinchinadi repu tana santaanaaniki andinchagala stairyam ameku vastundi .

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.