6, జులై 2012, శుక్రవారం

కాలమహిమ




కాలమహిమ ఈ విషయము ఎవరికైనా అనుభవములోకి వస్తే కాని తెలియనిది. ఎంత గొప్ప వారైనా  ఈ విషయములో తల వంచవలసినదే అందుకు తార్కాణమే ఈ పద్యం.ఇది శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రీ గారి కృషిఫలితముగా వెలువడిన చాటుపద్య మణిమంజరి లోనిది.

శ్లో!! రామో దారవియోగ్య బధ్యత బలి శ్చోరో హతశ్శూద్రకః
    ధ్వాంక్షశీఖలు విక్రమార్క నృపతిర్ధర్మోవనం ప్రస్థితః
    చండాలాశ్రయ దూషితో బత హరిశ్చంద్రో జగద్వల్లభః
   ప్రాప్తేకాలవశే విధిర్ బలయుతో ధిగ్ధిగ్వృధాపౌరుషము .


రాముడికి భార్యా వియోగం కలిగింది. బలికి బంధనం లభించింది.శూద్రకుణ్ణి చోరులు చంపివేశారు.విక్రమార్కుడు కాకుల్ని తిన్నాడు.ధర్మరాజు అరణ్యానికి వెళ్ళాడు.జగత్తుకు ఇష్టుడైన హరిశ్చంద్రుడు ఛండాలుణ్ణి ఆశ్రయించడంచేత దూషితుడయ్యాడు.కాలం వచ్చినప్పుడు దైవమే బలవత్తరమై పురుషాకారం వ్యర్ధం అయిపొతుంది.



ఈ విషయాలు గత 37 నెలలుగా అనుభవిస్తున్న నాకన్నా బాగా తెలిసిన వ్యక్తి ఇంకొకరు వుండరు. సమయము కానప్పుడు ప్రతి మనతో సహాయము పొందిన వారే ఎంతలా ఇబ్బంది పెడతారో అనుభవం.
నా జీవిత లక్ష్యం అని చెప్పలేను కాని నా స్వఫ్న సౌధం నిన్న ఒక్కసారి కూలి పోయింది.ఇప్పుడు నా ముందున్న సమస్యలు చెప్పలేనివి,చెప్పరానివి.25 మంది సిబ్బందితో నెలకు లక్ష రూపాయల జీతాలు ఇచ్చిన నాకు జీవనం సమరం,చదరంగం,ఆరాట పోరాటం,
అయినా నా పోరాటం ఆపను.నా ఉపిరి ఉన్నంత వరకు నా లక్షణం అయిన సహాయపడటం అనే దుర్గుణం పోదు.
నన్ను ఆదుకో అన్న వాడిని ఆదుకున్నా,ముద్ద పెట్ట గలవా అన్నవాడికి పెళ్లి కూడా చేసాను.
కాని మనుషులు కదా వారి నైచ్యం వారు చుపుకున్నారు.
కొడుకు గా నా బాద్యత నెరవేర్చా,కాని .................
ఇక కట్టుకున్న భార్య తరుపున నాటి నుంచి నేటి వరకు అడగరాదు అన్న ఇంగిత౦.అయినా నేడు బోలేడు ..........
ఇటువంటి  వాస్తవ పరిస్థితుల్లో మన తోటి బ్లాగర్ adidevisetty.blogspot.in సోదర సమానుడు నా పరిస్థితులకు ప్రత్యక్ష సాక్షి వారు చేసిన సహాయం వెల కట్ట లేనిది. నేడు నా తాలుకు అస్థిత్వం నిలబెట్టే ప్రక్రియలో పాలు పంచు కున్నారు.
వారికి బ్లాగ్ ముఖతా ఉత్త ధన్యవాదాలు చెపితే చాలదు.  ప్రణామాలు అయినా తక్కువే కాని మా adi సోదరుడు ఒప్పుకోడు. వారిని,వారి శ్రీమతి హిమబిందు గారిని,పిల్లలు  అమ్మాయిలు ఇద్దరినీ వారి ఆరాధ్య దైవం శ్రీనీవాసుడు సదా రక్షించాలని కోరుకునుచున్నాను.

3 కామెంట్‌లు:

  1. దైవం దయ వల్ల , మీకు కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటున్నానండి.

    రిప్లయితొలగించండి
  2. అనురాధ గారు, ధన్యవాదాలు. శ్రీలక్ష్మీ వంటి సోదరివి నీ ఆకాంక్ష ద్వార నాకు ఆస్సిసులు లభించితే నా జీవన పోరాటం లోని ఆర్తి శమించాలని నేను కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  3. * మీ పరిస్థితి ఎటువంటిదో నాకు తెలియదు కానీ, ఎటువంటి పరిస్థితిలోనూ ధైర్యాన్ని కోల్పోవద్దండి.
    * పరిస్థితులు చక్కబడటానికి మీ ప్రయత్నాలు చేస్తూనే భగవంతుణ్ణి ప్రార్ధించండి.
    * దైవం దయామయులు. తప్పక భక్తులకు అండగా ఉంటారు.
    * దైవం దయ వల్ల పరిస్థితులు చక్కబడతాయి.

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.