8, జులై 2012, ఆదివారం

లక్ష్మణదేవర నవ్వు - జానపద పాట ఆధారముగా వ్రాసిన కధ.

రామాయణము జాతి జీవనాడిగా మారిందనటానికి అనేక ఉదాహరణలు. అనేక భాషల్లో,అనేక రూపాల్లో దీనికి స్థానం కల్పించారు.చిన్న చిన్న విషయాలను రామాయణపాత్రల ద్వార కధలు పాటలు అల్లి ప్రచారము కల్పించారు. మాములు వ్యక్తికధలుకన్న  రామునికధలు అంటే ప్రభావము ఎక్కువ ప్రభావము చూపుతాయని కారణము రాముని వ్యక్తిత్వం అటువంటి చెరుగని ముద్ర వేసింది అని . నేటి కధ లక్ష్మణదేవర నవ్వు అనే జానపద పాట నుంచి సేకరించటము జరిగింది.ఈ జానపద పాటలు వినాలేకాని బహు సొంపుగా వుంటాయి చిన్న చిన్నపదాలు,రోజు మనచుట్టువున్న విషయాలు వాటిల్లోంచి సేకరణ వాటిగురించే నీతి ఇలా బహు గమ్మత్తుగా వుంటాయి.నేటి కధ ఉత్తర రామాయణములో ఉన్నదంటారు.నేను పరీశీలించలా.అనుశృతముగా వస్తున్న పాటను ఆధారముగానే ఈపొస్ట్ వ్రాస్తున్నా.


అది శ్రీరామచంద్రునికి పట్టభిషేక సమయము.దేవలొకమునుంచి సర్వదేవగణాలు,లంకనుంచి విభిషణుడు,కిష్కిందనుంచి వాలి సుగ్రివులు, ముని వాటికలనుంచి ఋషిగణాలు,వేదగానము చేస్తూ భూసురులు,రాముని మహిమలు గానము చేస్తూ సాంస్కృతిక బృందాలు,రామునిపాలనపై తమసంతోషాన్ని అంగీకారము తెలియ చేస్తూ అనేక సామంత రాజ్యలరాజులు,దండనాయకులు,సేనానాయకులు,ఆటవీక జాతులు,భిల్లులు,కొయలు,చెంచులు ఇలా అనేక సంచార జాతుల సముహాలతోపాటు  అబ్బో మారాములోరి పట్టాబిసేకమంటా అని సామాన్య జనాలు.
శ్రీరామచంద్రునికి కీరటధారణ తద్వార రాజ్యపాలన భారం అప్పగింత జరిగింది. రాముడు తనకు రాజ్యపాలనలో అందరి సహకారము కావాలని అర్ధించాడు.అన్యాయాన్ని సహించనని తెలిపాడు.వనవాస సమయములోను,యుద్ధమునందు తనకు సహయము చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరున గౌరవ మర్యాదలు చేస్తున్నాడు.ఆ సమయములో లక్ష్మణుడు ఓక్కసారిగా గట్టిగా నవ్వాడు.లక్ష్మణుడు అలా నవ్వటముతో సన్మానము జరిగిన,జరగబోతున్న ప్రముఖులందరు ప్రతి ఒక్కరు లక్ష్మణుడు తనను చూసి నవ్వాడు అని తలపొస్తున్నారు.

పట్టాభిషేక ఉత్సవములో వున్న పరమేశ్వరుడు "జాలరి వీధుల నీలకన్యకను జడలెత్తి శిరస్సున ధరియిస్తినా "అని,
 "సాహసమ్మున తండ్రిని చంపిన రాజు తలచి కోలచి రాజ వేడుక కూడు కుడిచేను " అని అంగదుడు,
  "తన వెనుక తన అన్న వాలిని చంపి -వాలిచంపి తన వదినను సతి చేసుకోనె" అని సుగ్రీవుడు,
  "ఆయివులు దెలిపి ఉపాయముతెలిపి అన్నప్రాణము తీసి లంక పట్నపు రాజైనడు " అని విభీషుణుడు,
  "కారడవిలో దశకంఠుని చేత పట్టు పడ్డటి సతితోడల మీద చేయి పెట్టుకొని యున్నడే నా అన్న సృష్టీశ్వరుడు " అని సీత    
ఇలా ప్రతి ఒక్కరు తమలో వున్న గుట్టుమట్టులను ఙ్ఞప్తికి తెచ్చుకోని లక్ష్మణుడు అదే కారణము పై నవ్వాడని తలపోస్తు చింతాక్రాంతులైనారు.ఇది ఒక్క క్షణములో పరీశీలించిన శ్రీరాముడు కత్తి దూసి లక్ష్మణుని దండించటానికి ప్రయత్నించాడు.వశిష్టుడు రాముని వారించి లక్ష్మణా నీవు రాజసోదరునివి అకారణముగా సభాముఖముగా నవ్వరాదు కారణము తెలిపినా తెలుసుకొనగోరుచున్నాము లేని పక్షమున దండన తప్పదు అని హెచ్చిరిక పూర్వితముగా తెలిపినాడు.అంత లక్ష్మణుడు ఈ విధముగా జరగటానికి కారణము ఈ విధముగా తెలిపినాడు.    
వనవాసకాలములో శ్రీరాముడు సీత దంపతులకు లక్ష్మణుడు అన్ని భాధ్యతలు నెరవెర్చే వాడు.దీని వలన ఒక్క క్షణముకూడా విశ్రాంతి కాని నిద్రకాని లేకుండా తన కార్య నిర్వాహణలో శ్రమించేవాడు.ఒకనాటి రాత్రి ఒక స్త్రీ ఆశ్రమము బయట దుఖిఃస్తూ ఉన్నది అమెను గమనించిన లక్ష్మణుడు నీవు ఎవరని ప్రశ్నించాడు? దాని తో అమె అయ్యా నేను నిద్రా దేవతను "అష్టదిగ్గజములు అరి ఋషులా!వైకుంఠ నాభులను వసి యింతు నేను, సప్త్సాగరములను చవట పడుగులను,పారేటి నదులను భ్రమియింతు నేను, పక్షుల జాతులను పర్వతంబులను, వృక్షాలపై నుండి విహరింతు నేను, నరులు ఎవ్వారు నను గేలవలేరు" అని సృష్టిలోని సకల స్థావర జంగములు నిద్రలో తన ఆధీనములే కానీ నిన్ను చేరలేకున్నాను అందుకే దుఖిఃస్తున్నాను అని తెలిపినది.అంత లక్ష్మణుడు అమ్మా నేను ఈనాడు రామకార్యము పై వారి సేవలో వున్నాను కనుక దయవుంచి నన్ను ఆవహించకు రామపట్టాభిషేకము ముగిసిన పిదప నీవు నన్ను ఆవహించ వచ్చు అని పలికినాను.అందువలన ఇన్ని రోజులు నాకు నిద్ర రాలేదు కాని శ్రీరామ పట్టాభిషేకము అయిన ఉత్తరక్షణము నిద్రాదేవి నన్ను ఆవహించి సభలోనే నిద్ర వొస్తున్నది.ఇన్ని రోజులు ఆగిన అమె ఒక్క క్షణము అగక తన ప్రభావము చూపుతున్నదని నాకు నవ్వువొచ్చినది తప్ప వేరు కాదు. మా ఆహుతులను,అతిధులను అగౌరపరచాలన్న ఉద్దేశ్యము ఎమాత్రము లేదు అని తెలిపినాడు.                

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.