12, జులై 2012, గురువారం

అంతిమ సంస్కారములలొ ఘటము యొక్క అంతరార్ధము.


పుట్టుక వుంటే గిట్టుక వున్నది. ఇది సత్యము. ప్రతిజీవుడు ఇది తెలుసుకోన వలసిన సత్యము.హైందవ సాంప్రదాయములొ అంతిమ సంస్కారములలొ ఘటము ఉపయోగిస్తారు. ఈ ఘటము యొక్క ఉపయోగము గురించి అక్షరవాచస్పతి దాశరధి రంగాచార్యగారు తన వేదం జీవననాదం లో వివరించారు.ఇక్కడ నుంచి వారి మాటల్లోనే!


జీవితం నీటికుండ. దహనసంస్కారంలో కర్త భుజం మీద నీటి కుండ ఎత్తుకుంటాడు.చితికి తొలిసారి ప్రదక్షిణకు ఒక రంధ్రం చేస్తారు.కారిపొతున్న నీరు బాల్యం.కర్తకు ఇది కనిపించదు.నీరు వెనుక కారిపొతుంటుది.రెండవ ప్రదక్షిణలో రెండవ రంధ్రము చెస్తారు ఈ ధారగా కారిపొయే నీరు యవ్వనం.మూడవ ప్రదక్షిణలో కారిపొయేది వార్ధక్యము.చివరి ప్రదక్షిణలొ  కుండను నేలకు కోట్టి కర్త వెనక్కు చూడకుండా పొతాడు.బద్ధలైన  కుండ విగత జీవికి సంబంధించినది. నీవు వెనక్కు చూడక జీవతంలొ సాగిపో అనే ఉపదేశం కర్తకు!.


ఇందులో వైరాగ్యం లేదు సన్యాసంలేదు. జీవిత పరమసత్యాన్ని అతి సామాన్యునికి కూడా ఇంత సులభంగా బొధించారు.దీనిమీద ఎవరి పెత్తనము లేదు గాలివలె,నీటివలె సర్వజన సామ్యం! అంతారార్ధం అందరికీ తెలియకపొవచ్చు.ఆచరణ మాత్రము జరుగుతున్నది.అన్ని విషయల్లోను అన్నికాలల్లోను  అలాగే ఉంటుంది.
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.