28, ఏప్రిల్ 2012, శనివారం

వేసవి కాల మహొత్సవాలు -డాబా మీద నిద్రలు.



ఇలా వేసవిరాగానే అలా వాతావరణములొ మార్పులు.ఈ వేసవికాల వేడి,ఉక్కకు రాత్రిపూట ఇంట్లో నిద్రకు ఇబ్బందిగా మారి ఆందరు అలా ఆరుబయటకో,దొడ్లో చెట్టుక్రిందకో లేక డాబామీదకో తమ రాత్రినిద్రకార్యక్రమము బదలాయంపు.

             మా గ్రామములో రాత్రి 8గం. అయితేచాలు, అప్పటికే చల్లగా నీళ్ళుచల్లి సిద్ధపరిచిన చెట్లనీడన,ఇళ్ళ ముందర మంచాలు సిద్దము.మంచముక్రింద చెంబుతొ నీరు.ఓక వీసనకర్రతొ మనుషులు సిద్దము.అదే ముసలివారు అయితే బహుసందడి వచ్చేపొయేవారి యోగక్షేమాలు పరామర్శ. మరికొందరు బావా ఇది,మావా ఇది అని సరసాలు.ఆడవారు  ఏవొ లొకాభిరామాయణాలు.ఇవి అన్ని డాబాలు లేనివారు ఆచరించేపద్దతులు.
             డాబాసౌకర్యమువున్నవారికి వేసవికాలము తమపడక డాబామీదకు మార్పుతో  సౌకర్యము,ఆనందము,హోదా.
            రాత్రికి చల్లగావుండటానికి ఓక్కసారి నీళ్ళతొ డాబా అంతటిని సంధ్యవేళదాటగానే తడుపుతారు.ఆపై తుంగచాపలు వాటిపై పరుపులు లేకపొతే బొంతలు(గుర్తువున్నయా మరచిపొయారా)తో పడక సిద్దము.అలావేసిన పరుపులపై సౌకర్యమునకు దిండ్ల అమరిక.ఇంతపని ఆడుకుంటుచేయటము పిల్లలకు ఒక సరదా.
అలా డాబా మీద పడుకుని, ఆనిర్మల ఆకాశాన్ని మినుకు మినుకు మనే నక్షత్రాలను చూడటము,లెక్కించటము,గుర్తుపట్టటము,ఏంత దూరములొ వున్నాయో ఉహించి ఇంత పెద్ద  అంటూ చేతులు అలా విశాలముగా చూపటము.మధ్య మధ్యలో రాలీ పడే ఉల్కలను చూసి సంబరపడటము.చంద్రకళలను బట్టి ఆరొజు తిథి లాంటివి ఉహించటము.ఆకాశములొని దిక్కులు,మూలలు లాంటివన్ని గుర్తుపట్టటము.పౌర్ణమి రోజులలో చంద్రుడిని చూసి,దానిలొని మచ్చలను చూసి కుందేలని,ముసలమ్మని రకరకాలయిన కథలు.చంద్రుడిచుట్టు వలయాలు,అప్పుడప్పుడు ఏర్పడే ఇంద్రధనస్సు చూడటము ఒక అనుభూతి.
       వీటికన్నా, అలా డాబామీద పడుకొని నిరంతరము కదిలే మేఘాలను వాటి రూపాలను,వాటి ప్రయాణాన్ని గురించి కథలతో పాటు మనముకూడా అలా విశ్వములో ప్రయాణిస్తున్న అనుభూతి.
అప్పుడప్పుడు అలా వెన్నెల్లో అమ్మ కలిపిపెట్టిన ఆవకాయ అన్నము, చల్లని మజ్జిగలతో మామిడికాయ.ఇంతకన్నా గొప్ప భొజనము వుండదు వుండబోదు.

ఈడాబామీద నిద్రలో ఇంకొన్ని వినోదాలు.రకరకాలయిన భంగిమల్లొ నిద్రపొయే వారు అలా చిక్కిపొతారు.కొత్త దంపతుల ఊసులు,సరసాలకై అలా దూరముగా పడక కాని గాలివాటుకు అన్ని వినపడి పొద్దున్నే వదినను ఆటపట్టించే మరదళ్ళు.లేకపొతే ఏ ప్రక్కింటి మామో తొందరపడే సరసముతాలుకు ధ్వనులు.కొంతమంది పెట్టే గురక.      
      పిల్లలకు పెద్దలు నేర్పే బాలగీతాలు,పాటలు,పద్యాలు,కథలు,పెద్దల చిన్ననాటి ముచ్చట్లు,పిల్లల పసితనపు కబుర్లతో జోకొట్టి నిద్రపుచ్చుతారు.

మరి ఈనాడు! ఇది అంతా హుష్ కాకి. ఏవరకు వారు ఓంటికాయ సొంటికొమ్ము అయిపొయారు.కూలర్లు,ఏసి ల సంగతేమొకాని ప్రక్రుతికిమాత్రము దూరమయ్యారు.తద్వార ఖర్చు,అర్థములేని ఆందొళన.



         
     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.