29, ఏప్రిల్ 2012, ఆదివారం

ఆడపిల్లల డిమాండ్ - పెళ్ళి కాని ప్రసాదుల గోల


మీరు ఈసారి గుడికి వెళ్ళినప్పుడు బాగా గమనించండి.రకరకాల మొక్కులకొరకై అనేక మంది యువకులు ప్రదక్షిణలు చేస్తూ మీకు దర్శనము ఇస్తారు.తరచి చూడండి,ప్రశ్నించండి.దాదాపు సగముమంది అవివాహితులే.వీళ్ళందరు తమకు జతకోసము,వివాహ భాగ్యము కొసము ఆప్రదక్షిణలు,వేడికొళ్ళు.
ఓక్కొడికి 30 సం. నిండుతున్నాయి.గడ్డము ముదిరిపొతుంది,జుట్టు రాలి బట్ట తలలు ఆవుతున్నాయి.ఇంకా ఏన్నాళ్ళు మేము చేసిపెట్టాలంటు అమ్మల సతాయంపు,తోడులేక నిద్రరాక ఇబ్బందులు.చెప్పలేరు,చెప్పుకొలేరు.పొని వీళ్ళకు ఏమన్నా ఇబ్బందులా? అబ్బే చక్కని బుద్దిమంతులు,రూపసులు,4అంకెలలొ జీతాలు,కొద్దొగొప్పో ఆస్థిపాస్థులు వున్నవారు.కాని నిట్టూర్పులు విడవకతప్పటములేదు. ఫలితముగా వీళ్ళందరు పెళ్ళికాని ప్రసాదులుగా చలామణి.      
ఇంతటి వైపరిత్యానికి కారణము "ఆడపిల్లలు". మీరు చదివింది నిజమే ప్రస్తుతము ఆడపిల్లల డిమాండ్లు,వారి తండ్రుల కండీషన్స్ తిర్చలేక వీళ్ళకు ఈపాట్లు.
 
అసలు ఆడపిల్ల వుందంటేచాలు పూర్వము అమ్మలు,నానమ్మలు అందరు ఆడపిల్ల రజస్వల అయినవద్దనుంచి ఆపిల్లకు పెళ్ళిప్రయత్నాలు ప్రారంభించమని ఇంటి యజమానిని సతాయింపు.ఇక ఆయిన తనం ముద్దులకూతురుకు జతకొసము కాళ్ళకు బలపము కట్టుకొని ఊరు ఊరు తిరిగి తనకు సాధ్యమయిన సంబందము తేచ్చేవాడు.ఆ వచ్చిన వరుడు తరుపువాళ్ళూ, అబ్బో! దర్జా వొలకబొస్తూ పైనుంచిక్రిందకు దిగివచ్చినరేంజీలో వచ్చమా అన్న రీతీలో పిల్ల ఇంటికివచ్చి పిల్లను చూసి,అతిధి మర్యాదలు అవి ముగిసినతరువాత ఎవొకొన్ని ప్రశ్నలు వేసి,అమ్మాయి నచ్చితే కబురు చేస్తాము అని వెళ్ళీ, మధ్యనవున్న పెళ్ళిళ్ళపేరయ్యను  అమ్మాయి నచ్చింది వాళ్ళపెట్టుపొతల భొగట్టా చేసి అమ్మాయి తరుపువాళ్ళకు తమ అంగీకారము తేలిపేవారు.ఆపై లాంఛనాలు,కట్నకానుకల విషయాలన్ని ముగిసిన తరువాత నిశ్చయతాంబూలాలు, ఆపై వివాహము.ఇంత విధి విధానము అమ్మాయి పెళ్ళికి వుండేది.ఇంత ప్రొసిస్ లొను అమ్మాయి తండ్రి వొదిగి వుండటమే. 
    కాలము మారింది.బండి చక్రం ఆకులు క్రిందవి పైకి వచ్చింది.ఇప్పటి ఆడపిల్లలు వాళ్ళ ముందు తరమువారి ఇబ్బందులకు రివేంజ్ అన్నట్లు పెళ్ళికొడుకులకు చుక్కలు చూపుతున్నారు.

క్రమముగా ఇప్పుడు ఆడపిల్లల పెళ్ళివయస్సు 20 నుంచి 25 వరకు జరిగినది.ప్రస్తుతము ఆడపిల్లలు బాగా చదువుకోవటము,వ్యక్తులు కావటము,సంపాదానపరులు కావటముతొపాటు,చెప్పకూడదు కానీ వీళ్ళు తమ "ఫిగర్" వాల్యూ బాగా ఆంచనా వేస్తున్నారు.దానితో 'ఫిగర్ ' కొసము తహతహ లాడే కుర్రాళ్ళని తమ 'పిటపిటలాడే సౌందర్యముతో' ఒక తొక్కు తొక్కుతున్నారు.దీనికీ తోడు అమ్మాయి తండ్రుల అంచనాలకు అబ్బాయిలు తూగటములేదు.కారణము వారికి అబ్బాయికి స్వంత ఇల్లు, కారు. 20 లక్షల ప్యాకెజి జీతము,స్థిరాస్థులు లాంటివి చాలావుంటేకానీ తమ అమ్మాయిని చూడటానికి కూడా ఆహ్వానించటలేదు. 
     నేను ఎదొ వేళాకొళాని ఈపొస్ట్ వ్రాయటములేదు. ఈ మధ్య మా ఆవిడ కజిన్ కు సంబంధం గురించి వేతికితే కళ్ళు తిరిగే విషయాలు కనపడ్డాయి.వివాహ బయోడేటాలో వాళ్ళ కోరికలు,అభిప్రాయాలు చూసి నేను ఆశ్చర్యపొవలసి వచ్చింది.
 

అన్నట్లు ఇంకొ కొత్తసాంప్రదాయము వూడిపడ్డది. అబ్బాయి వాటాకు వచ్చే ఆస్తిని బట్టి అమ్మాయి వాళ్ళు 1% నుంచి 3% వరకు కట్నము.
మరి ఇన్ని నిబంధనలు దాటి తమ జత తెచ్చుకునేదాక పెళ్ళికాని ప్రసాదులు ..........
ఎమిటి మీ దారి ?  

30 కామెంట్‌లు:

  1. సింపులు. అబ్బాయిల దృక్పధములో మార్పురావాలి. అలానే ఈ ట్రెండు పోవాలంటే .. కొంత కాలం పడుతుంది కూడా. అంటే ఈ తరం అబ్బాయిలకు ఈ తిప్పలు తప్పవు.

    ఒకప్పుడంటే.. అసలు 20,000 జీతమొస్తోంది అంటే.. అబ్బో, మనోడు కేక. మరిప్పుడో.. కుర్రాడో ఈక. అలాంటి ఈకలు దేశములో సందు సందులో కనపడతాయ్. ఇప్పుడు కూడా, చక్కని ఉద్యోగం, కాస్త ఫేస్ వాల్యూ ఉన్న మగాళ్ళకి బాగానే అవుతున్నాయ్. రెండూ లేకపోయినా, ఏది కాస్త తగ్గినా .. అబ్బాయిలు తమ డిమాండ్లను కొద్దిగా తగ్గించుకోవాల్సి వస్తోంది.

    డిమాండ్లను తగ్గించుకోవడమే కదా.. తగ్గించుకుంటే పోయె. ఈ మాత్రానికే.. అదేదో బాంబు వచ్చి అబ్బాయిల నెత్తి మీద పడుతోంది అనడమే .. ఈ ఎపిసోడ్ మొత్తానికీ దారుణం. అంటే అత్త కొట్టిందని కాదు, తోడి కోడలు నవ్విందని ఫీలన్న మాట.. :-D

    రిప్లయితొలగించండి
  2. ఒకమ్మాయి అనేసిందండి బాబు! ఇప్పుడు కన్యా శుల్కం తీసుకుంటామని.అబ్బాయిల బతుకు బస్ స్టాండే!!!

    రిప్లయితొలగించండి
  3. తమకున్న డిమాండ్లేవో (expectations ఏవో) తమకూ ఉండడం చేతనే పెళ్ళికాని ప్రసాదులు ఎక్కువవుతున్నారు. డిగ్రీ లేని, సంపాదన లేని, ఇంగ్లీషు రాని అమ్మాయి కావాలంటే లక్షలాదిమంది ఉన్నారు. వాళ్ళనెందుకు ప్రిఫర్ చేయరు ఈ పెళ్ళికాని ప్రసాదులు ? అంతగా అమ్మాయి దొఱక్కపోతే తమ కులానికి/ శాఖకి బయట ఎందుకు వెతుక్కోరు ? తమ ఆలోచనల్లోని లోపాన్ని ఆడపిల్లల డిమాండ్లుగా ప్రొజెక్ట్ చేయడం తగదు.

    రిప్లయితొలగించండి
  4. అలా అని నేనూ విన్నాను. అమెరికాలో ఏదో సాఫ్ట్‌వేరు, $$$$ సంపాదన లేకపోతే పిచ్చివేరు కింద జమ కట్టేస్తున్నారట! పెళ్ళి చేసుకున్నా, గుడ్డి చట్టాలతో నానా అక్రమ కేసులు. ఇదన్యాయం, ఈ అక్రమాలకు అడ్డు కట్ట వేసి, పురుషజాతిని ఉద్ధరించేదానికి ఏదో తరుణోపాయం చేయాలి. పదండి, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి గోడు చెప్పుకుందాం. లేవాలి ... లేవాలి పురుషలోకం, దద్దరిల్లాలి ఆడప్రపంచం.

    రిప్లయితొలగించండి
  5. *అబ్బాయిల బతుకు బస్ స్టాండే*

    బాగా ఆలోచిస్తే పెళ్లనేది ఆడమగ కలసి, వరి వారి సుఖం, లాభం కొరకు చేసే పెద్ద వ్యాపారం. శర్మగారు చెప్పినట్టు అబ్బాయిల బతుకు బస్టాండ్ అయ్యే లోపు, పెళ్లి కొరకు, పెళ్లి చూపుల కొరకు టైం వేస్ట్ చేసేదానికన్నా, రోజు బస్టాండ్ దగ్గర కొంత సేపు వేళ్లి నిలుచుకొంటే మంచి ఫామిలి టైపు కాలేజి అమ్మాయిలు చిక్కే అవకాశాలు ఎక్కువ. మనకు నచ్చితే అలా తక్కువ డబ్బుతో ఎక్కువ సుఖం కొనుకొంటే పాయే! పాపం! ఆ రహస్యం తెలియక వాళ్లు గుడి చుట్టు ప్రదక్షిణాలు చేస్తున్నారు. దానికి బదులుగా విజయవాడ, తిరుపతి బస్టండ్ దగ్గరా నాలుగు రౌండ్లు వేయమనండి.

    రిప్లయితొలగించండి
  6. *పురుషజాతిని ఉద్ధరించేదానికి ఏదో తరుణోపాయం చేయాలి. *
    @SNKR,
    పురుష జాతికి వచ్చిన ముప్పేమి లేదు. ఇటువంటి కష్ట్ట సమయాలలో వారి విలువ వారు, మంచేదో, చేడేదో,నిజమేదో, అబ్బద్దమేదో తెలుసుకొంటారు. పెళ్లి వలన ఒనగూడే ప్రత్యేక లాభాలు ఎమీ లేవు. ఒకప్పుడు వంట చేయటమన్నాపని ఉండేది. ఇప్పుడు అది పెద్ద కష్ట్టం కాదు.తీరికగా ఇంట్లో కూచొని ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు అని లెక్కలు వేస్తూ, భర్తను పీడీంచటమే వారి కంట్రిబ్యుషన్. పెళ్లి లేక పోతే పీడవిరగడైందనుకో. ఒకసారి ప్రముఖ ఆర్ధిక శాస్ర వేత్త, ఒక పెద్ద వ్యాసం న్యుయార్క్ టైంస్ పేపర్లో రాశాడు. రిసేషన్ టైంలో వ్యభిచార వ్యాపారం చాలా రెట్లు పెరిగింది, భార్య పోరు పడలేక(ఉద్యోగం లేదని ఎగతాళి చేయటం మొదలు పెట్టటంవలన) మగవారు వేశ్యల దగ్గరి కివెళ్లటానికి ప్రధాన కారణం అని, ఆ వేశ్యలు కూడా ఎంతో మంచి వారని,వారిలో చాలా మంది డబ్బులు లేకపోయినా తమ దగ్గరికి వచ్చిన కష్ట్టమర్లకి , అప్పు ఇచ్చేవారని మగవారు ఇంటర్వ్యులో చెప్పారని.ఇంట్లో భార్య కన్నా వారే నయమనే అభిప్రాయం వ్యక్తం చేశారని రాశాడు. ఈ పెళ్లి చేసుకోవాలానేది తాగుడు కన్నా పెద్ద వ్యసనంలా తయారైంది.అసలికి పెళ్లి ఎందుకు చేసుకోవలను కొంటారో మగవారికి ఐడియా ఉండదు. ఇంట్లో వారికి అదొక రోటీన్ పని, ఉద్యోగముంది కనుక పెళ్లి చేసేస్తే వారి బాధ్యత నుంచి బయట పడవచ్చనే ఒక ఆత్రం. ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక, దానిని కనీసం ఇటువంటి సందర్భాలలో అయినా మానేయాలి. ఎవరికి తగ్గ ఆర్ధిక స్తోమతను పట్టి అలా స్విజర్లాండో, థాయిలాండ్, ఫుకేతో, విజయవాడో,తిరుపతోవెళ్లి పని ముగించుకోనొస్తే సరి. ఇవ్వన్ని అయిన తరువాత కూడా పెళ్లి చేసుకోవాlaని పిస్తే వాడి ఇష్ట్టం.

    రిప్లయితొలగించండి
  7. అజ్ఞాతApr 29, 2012 02:31 AM
    :))
    భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ
    భర్తకు మారకు బేచిలరూ అంటారా?! హ్హ్వాహ్వాహ్వా

    రిప్లయితొలగించండి
  8. @SNKR,
    స్విస్ లో ఇప్పుడు నిబందనలు చాలా సరళం చేశారు. ఎవరైనా 16సం||లకే ఈ వృత్తిని ఎంచుకోవచ్చు, వారికి ప్రభుత్వం లైసెస్న్ ఇచ్చేస్తారు. రానున్న రోజులలో యురోప్ లో మిగతాదేశాలు ఆర్ధిక పరిస్థితి దిగజారే కొద్ది, ఇదే పంథాను అవలంబించినా ఆశ్చర్య పోనక్కరలేదు. అలగే అక్కడికి వేళ్లే వారిని కూడా ఎదో చేడ్డ వారనట్లు తప్పు పట్టనవసరం లేదు. ఈ కాలానికి పురుషులకు ఇదొక చారిత్రక అవసరం అని మీరు గుర్తించాలి. పెళ్లి చేసుకొని రెండేళ్లకే ఆకర్షణ కోల్పోయిన వారితో, అన్యమనస్కం గా సంసారం చేస్తూ, సర్దుకు పోతూ కలసి జీవించే కన్నా, ఈ పద్దతే బేస్ట్. ఈ ఇంటర్నేట్ యుగంలో, ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారిన సమయం లో, దేశం లోని వనరులేకాక, విదేశాలలోని వనరులు కూడా మనదేశం లోని వారు సరసమైన ధరలకు ఉపయోగించుకోవచ్చు :)) మనం కన్స్యుమర్ యుగంలో ఉన్నాం.ఈ యుగంలో మంచి చేడు, తప్పు ఒప్పులనేవి ఎవీ లేవు. మనం ఉంట్టున్నదేశాలలో, చట్టబద్దంగా ఆ సేవలను ఉపయోగించు కోవచ్చ లేదా అనేదే చూడవలసినది.

    (ఆ మధ్య టైంస్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త వచ్చింది. తాను వర్జిన్ అని తన చదువుకు డబ్బులు కావాలని, తన రేట్ ఇంత అని నేట్ లో ఒక యాడ్ ఇచ్చింది. దాని తరువాత ఆ కథనాన్ని పేపర్ వారు చివరివరకు ట్రక్ చేశారు. ఆ అమ్మయికి ఇటలికి చెందిన ఒక పారిశ్రామిక వేత్త, అడిగిన డబ్బులు చెల్లించి సేవలను పొందాడని. సేవలతో పాటుగా షాపింగ్ కు తీసుకు వేళ్లి చాలా వస్తువులు కొనించాడని, ఆ ఆమ్మాయి చాలా సంతోషించిదని అని పేపర్ వాడు రాశాడు).

    రిప్లయితొలగించండి
  9. కామెంట్ చేసిన ప్రతి ఓక్కరికి ధన్యవాదాలు.
    అఙ్ఙాత గారి అభిప్రాయాలు తప్పు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. :) అజ్ఞాత వివాహంలో ఒక అంశం మీదే ఆసక్తి కలిగివున్నారని మీకనిపిస్తోంది కదూ? ప్చ్.. పాపం!! ;)

      తొలగించండి
    2. అఙ్ఞాతగారి వుద్దేశ్యాలు అర్ధమవుతున్నాయి.కాని చర్చ పెద్దదవుతుంది. అది గాక వ్యభిచారమనేది సామాజీక తప్పు,మరియు అందరు అదే దారి అంటే మన కుటుంబ వ్యవస్థ పొయి ఇంకొ బ్యాంకాక్ లా తయారు అవుతుంది. ఇప్పటికే అనేక వికారాలకి లొనయంది సమాజము ఇంకా బ్రష్టత్వము పట్టించాలా వద్దా అన్నది రాబొయే తరాలచేతులలోనె వున్నది. మన పని అప్పటి వరకు గమనించటమే.

      తొలగించండి
    3. వ్యభిచారము వ్యాపారము.దాంపత్యము అనుభంధము.వ్యాపారము లాభనష్టాలు,సరుకు మంచి చెడ్డలు చూస్తుంది. మరి అనుభందము అలానా అది వ్యక్తుల విలువల మీద ఆధారపది వుంటది.రెండుటికి ఒకటే పని రాత్రి చేసే సెక్స్ అంటే వారు చూసే చూపును బట్టి వుంటుంది. ఆ 5 నిముషాల తరువాత జీవితము ఇంక ఇంక అనేకము ఆలొచిస్తే అలా వ్రాసేవారుకాదు. అయినా వారిలో భారతియ ఆత్మ వుండబట్టే అఙ్ఞాతగా వ్రాసారు.బజార్లొ బొలేడు హొటళ్ళు అందులో అనేక రకాల పదార్థాలు, కాని ఇంటిలో పరిమితే, కాని ఎందుకు మనము రోజు ఆహరము ఇంటిలొ తయారుచేసుకుంటాము.దాదాపు నా భావన అర్థమయింది అనుకుంటాను.

      అఙ్ఞాతగారు ఫీల్ కాకండే.ఆటలో అరటిపండు.మీభావాలు మీవి. అందుకే ముందు క్లుప్తముగా తెలిపాను.

      తొలగించండి
  10. *అఙ్ఙాత గారి అభిప్రాయాలు తప్పు.*
    నా అభిప్రాయాలు తప్పు అని ఎలా చెప్పగలరు? సెక్స్ అనేదే ప్రాథమిక అవసరం. ఆ కోరికకి స్వీట్ కోటింగ్ పెళ్లి,పిల్లలు, సంసారం వగైరా వగైరా... నేను ఫండమెంటల్స్ గురించి చర్చించాను. పెళ్లిని ప్రేమ కొరకు మాత్రమే అనుకొనే వారైతే చేప్పెది ఎమీ లేదు. మీరు భార్య ని ప్రేమ గా కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ కుచొండి ఎవరొద్దన్నారు? ఇక కొంతమంది పెళ్లి చేసుకొనేది రాముడు లాంటి ఉత్తమ పౌరులకి జన్మ ఇచ్చి,వంశానికి పేరు, దేశానికి పేరు తెవచ్చు అని మీరనుకొంటే అది మీ ఇష్ట్టం . మీరు రాముడి లాంటి అబ్బాయి అయినా మార్కేట్ లో సీతలు దొరికే కాలం కాదు. ఈ క్రింది లైన్లు చదవండి.

    మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి లేదా ఒక అబ్బాయి..
    "వేరొకరి మాజీ ప్రేమికుడు లేదా మాజీ ప్రేమికురాలు "
    వినడానికి ఇబ్బందిగా ఉన్నా ఇది నిజం. కాలక్షేపపు ప్రేమలు.. విలాసాల కోసం ప్రేమలు ..ఎక్కువై ..నిజమైన ప్రేమ ఎక్కడుందో..అని అనుమాన పడుతూనే ఉంటాం.
    http://vanajavanamali.blogspot.in/2012/04/blog-post_18.html

    శంకర్ గారు,
    రేపు మీ అబ్బాయి పేళ్లి చేసుకొనే అమ్మాయి, పెళ్లి కి ముందే చాలా మంది తో ప్రేమలో పడిందని తెలిసినా, కోడలుగా స్వీకరించి, కష్ట్టపడి పగలు రాత్రి సంపాదించిన మీ ఆస్థిని, ఎటువంటి అనుమానాలు,భయాలు మనసులో ఉంచుకోకుండా మీకొడుకు కోడాలికిస్తారా?

    రిప్లయితొలగించండి
  11. నేనేమి ఫీల్ కాలేదు, తప్పు నాదే! నువ్వు బ్రాహ్మణుడవని తెలియ రాశాను. సంస్కృతి, భారతియ ఆత్మ మొద||అంశాలన్ని బ్రాహ్మణులకి చాలా ఫాసినేషన్. వాళ్లు ఇటువంటి వాటిని చాలా సృష్ట్టించి ప్రజలను తప్పుద్రోవ పట్టించారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్యా అఙ్ఞతగారు!నేను బ్రాహ్మణుడినికాను.భారతియత,భారతియ ఆత్మ అనేవి వారే కాదు, పరిశీలించండి సర్వులు వాడారు.అది వారికి సంబందించిన పేటెంటుకాదు. సామాజిక ఇబ్బందులకు కులరంగు అద్దకండి.ఇలా ప్రతిదానిని రంగు అద్దాలలొ చూస్తే అలానే కనబడుతుంది.ఏ బ్రాహ్మలు తప్ప మిగతా కులాలు పెళ్ళి చేసుకొరా, ఒక్కసారి కుల కళ్ళజొడుతిసి పరిశీలించండి అన్నికులాల్లో అన్ని వర్గాల్లో నేను రాసిన సమస్య వున్నది.ఇంత మాత్రానా మీరు నాదే తప్పు అని బాధపడవద్దు.మీ భావాలు మీవి.అందుకే ఆటలొ అరటిపండు అని ప్రత్యుత్తరము లో తెలిపినాను.

      తొలగించండి
    2. అయ్యా అఙ్ఞతగారు!నాకు సంబంధించినది కాకపొయనా.పరిశీలించండి మన సమాజములో కులవిచక్షణ ద్వారా ఎన్ని దౌష్ట్యాలకు పాల్పడ్డ అదే వర్గాలు సమాజమార్పుకు కారణమయ్యారు.ఉదాహరణ కందుకూరి వీరేశలింగము గారు.అలాగే విప్లవొద్యమములోను ఉదా సావార్కర్.అలానే చాలామంది మావొయిష్ట్ నాయకులలో చాలామంది మీరు అస్యహించుకుంటున్న వర్గములొని వారే. ఇకనైనా కులాన్ని బట్టికాక వ్యక్తుల విలువ బట్టి అంచానా వేయండి.అన్నింటికి ఒకటే మందుకాదు.బ్రాహ్మణుడు ఎక్కువకాదు, దిగువకులాలు తక్కువ కాదు అందరు సమత్వమే. ఎవరి విలువ వారిదే. సమాజానికి అందరు కావాలి.

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

      తొలగించండి
    4. వాఖ్య శృతిమించటముతో తీసివెయటమయినది.అతనికి బ్రాహ్మణవాదముమీద,హైందవముమీద
      కారణము లేని కొపము.ఎదొ విధముగా వివాదము చేయాలని చూస్తున్నారు.అయ్యా నమస్కారము మీరు మీకళ్ళతో లొకాన్ని అలానే చూడండి కాకపొతే అకళ్ళజొడు మాకొద్దు అన్నికులాలు,అన్నిమతాల స్నేహితులతో నేను బాగానే వున్నాను. నేను మీలా అలొచించలేను అలొచించను.ఇక ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు.ఇలాటి కామెంట్లు దయచేసి వ్రాయవద్దు.

      తొలగించండి
  12. *అజ్ఞాతApr 30, 2012 03:53 AM*
    ఈ అజ్ఞాత ఎవరో నాకు తెలియదు. ఎమీ రాశాడొ నేను చూడలేదు.
    *భారతీయత,భారతీయ ఆత్మ అనేవి వారే కాదు, పరిశీలించండి సర్వులు వాడారు.అది వారికి సంబందించిన పేటెంటుకాదు*
    బ్లాగుల్లో హిందూమతం ను విమర్శిస్తూ చేసే వాదాలను తిప్పి కొట్టటానికి, 95% కన్నా ఎక్కువగా బ్రాహ్మణ బ్లాగర్లే ముందుకు వచ్చేది. మిగతావారు అంటి ముట్టనట్లుగా, అదేదో వారి మతం కానట్లుగా దూరంగా ఉంటారు. మద్దతుగా వచ్చిన అబ్రాహ్మణులని వారి వర్గం వారు వచ్చి మీరు కూడా వాదనలోకి దిగారా అని ఎకసెకం మాటలడటం చూసాను. కనుకనే మీరేదో సంస్కృతి, భారతీయ ఆత్మ అని అంట్టుంటే బ్రాహ్మ్మణులను కొని పొరపడ్డాను.

    రిప్లయితొలగించండి
  13. మనము మనదేశము గురించి అందులొని మంచి గురించి అలొచించక పరాయివాడి దేశము గురించి అలొచిస్తామా. ఇక్కడ పుట్టి,పెరిగి,ఇక్కడ తిని, అనుభవిస్తూ ప్రక్కవాడి గురించి అలొచన మనకు ఎందుకు. మన సమాజములో అనేక లొపాలు,తప్పులు ఇంతకన్నా ఎక్కువ చాలా మంచిలు.తప్పులు సరిచేసుకుందాము.ఓప్పులు గుర్తు చేసుకుందాము. ఇదే జీవన సౌందర్యము.అలా కాక గతములో ఒక కులము వల్ల తప్పులు జరిగాయి కాబట్టి అన్నింటికి అదే మంత్రమంటే ఎలా.అన్ని చదుకున్న విఙ్ఞులు కొద్దిగా ఆగి అలొచిస్తే బాగుంటదికదా.
    చెప్పకూడదు కాని ఒకటి గమనించండి. పాత తరాల్లొని తప్పులకు శిక్ష మాత్రము నేటి తరాలకు.అలాగే పాత తరాల్లొని బాధిత కులాల నేటి తరాల్లొ లబ్ది. ఇదే విష్ణు మాయ.

    రిప్లయితొలగించండి
  14. బ్రాహ్మణులకి చాలా విషయాల్లో ఇతర కులాల మీద edge ఉంది. కాబట్టి ఒక్క culture, religion అనే కాకుండా Technology, sports ఇలా ఏ విషయంలోనైనా చర్చలకి వారు ముందుంటారు. అది చాలా సహజం. దేశంలో అనేకకులాల కంటే కొన్నివేల సంవత్సరాల ముందునుంచే వారు విద్యావంతులై ఉండడం బహుసా ఒక కారణం. వారి కుటుంబవాతావరనం కూడా ాలాంటి academic debates ని ప్రోత్సహించే విధంగా ఉంటుంది.

    BTW భారతీయసంస్క్రుతి అందరికీ కావాలి బ్రదర్స్. బ్రాహ్మనులొక్కరికే కాదు. ఊరికే అనవసరంగా బ్రాహ్మణుల్ని ద్వేషించి మన సంస్కృతికి మనం దూరం కావద్దు.

    - మరో అజ్ఞాతుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా తాతలు నేతులు తాగారు మామూతులు వాసన అంటే ఎలా? గతకాలాల్లో విద్య ఆఓక్కరి సొత్తు. కాని నేడు కష్ట పడ్డ ప్రతివారి ఆధినము.తద్వారా అన్ని సిరులు ముంగిట్లొకి.నేడు ప్రతి ఓక్కరికి విద్యతాలుకు విలువ తెలిసింది కాబట్టె ఆ పోటి.

      తొలగించండి
  15. @అజ్ఞాతApr 30, 2012 10:27 AM

    సంస్కృతి, సంప్రదాయం గురించి తాపత్రయపడే ప్రతివాణ్ణి బ్రాహ్మణుడనుకున్నంతకాలం మీరిట్లా పొరపడుతూనే ఉంటారు. ఇలా క్షమాపణలు చెప్పుకుంటూనే ఉంటారు. అయినా, నాకు తెలీక అడుగుతాను, ఆ టాపిక్కుల మీద బ్లాగుల్లో రాసినవాళ్ళు తాము బ్రాహ్మణులమని caste identity చెప్పుకుని మరీ రాసారా ? మరి వాళ్ళు బ్రాహ్మనులని మీరెలా ఊహించేశారు, ఏకపక్షంగా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అది అలాజరుగుతుంటది పొరపాటు మానవ సహజము.
      కాకపొతే వుడుకురక్తము,వేడి వయస్సు వాళ్ళు కాకపొతే ఇంకేవరు అలా స్పందిస్తారు.ఆయినా వివరణ చదివి సర్దుకున్నట్లున్నాడు.
      అంతా తూచ్.

      తొలగించండి
  16. /సంస్కృతి, భారతియ ఆత్మ మొద||అంశాలన్ని బ్రాహ్మణులకి చాలా ఫాసినేషన్. /
    ద్వేషం, ఆక్రోశం చూపించినా, వారి మీద వున్న మీ సదభిప్రాయాన్ని ఆశ్చర్యపోతూ అయినా మెచ్చుకోకుండా వుండలేక పోతున్నాను. కాని అది మీ ఆత్మన్యూనతకు ఆజ్యంపోయడం కడు విచారకరం. :(

    /వాళ్లు ఇటువంటి వాటిని చాలా సృష్ట్టించి ప్రజలను తప్పుద్రోవ పట్టించారు./
    తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిన మీలాంటి మేధావులు ఎందుకు పట్టారు?!! అసంస్కృతి, భారతీయ ప్రేతం ఫాసినేషన్ కల ఓ కొత్త దోవను మీరే జాతికి అదించాల్సింది? మీ దారి నచ్చితే జాతి మొత్తం ఫాలో అయి మీకు ఋణపడి వుంటుంది, ఏమంటారు? :)

    రిప్లయితొలగించండి
  17. leave this guy called SNKR, he feels like he is from some other earth, where all the population is brahmins and hard core hindus.

    just check the arrogance in his comments!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Catch if you can, don't leave me. Pleeeezzzzz...

      Are you a soft core demon or what? :)))))

      Show me your path for Hindus and enlighten them, pleeezzzzzz. enlighten Hindus!!! :(((((

      తొలగించండి
  18. Topic edaina different ga untee baguntundi. Okee topic gurunchi sudeergham ga argue cheyadam chivariki parishkaram lekunda vadile vayadam bagooledu

    రిప్లయితొలగించండి
  19. గాంధిబాబు గారు,నమస్కారము. నేను సమాధానాలు ఇద్దామని అనుకున్నా కాని ఆవతల అఙ్ఞాత పేరుతో వారు. ఎవరితో అన్నా వాదన చేసెటప్పుడు కనీసము వారితాలుకు పేరు అన్నాతెలుసుకొవాలి.కాని ఇక్కడ వివిధ వ్యక్తులు అఙ్ఞతగా వ్యవహరిస్తుండటము కారణము, రెండవది వారికి ఆన్నింటిపై ఆకారాణ ద్వేషము. భర్తృహరి గుర్తుకు వచ్చాడు. అందుకే మౌనము.

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.