భగవంతుడు భక్త సులభుడు.ఈవిషయాన్ని అనేక ద్రుష్టాంతాల్లొ నిరూపణజరిగినది.
మరి మనం ఇన్ని పూజలు పునస్కారాలు అని ఇన్ని క్రియలు చేస్తున్నాము.మరి మనకు దర్శనము జరిగినదా అంటే?....... ఇది సమాధానము .కారణము మన వద్ద 'అర్పణ ' ఏది? ఎవరయితే తన చిత్తాన్ని సకలధా,సర్వదా,ఆ పరంధాముని గురించి పరితపిస్తారో వారి వద్దకు స్వయముగా తనకుతానుగా సశరీరముగా దర్శనము ఇస్తాడు.
మరి గుహుని చూడండి అలామదిలో నిలిపినవాడు,రాముని సఖునిగాభావించినవాడు.అంతటి గుహుడు రాముడు నావ ఎక్కబొతె పాదాలుకడిగాడు మూఢత్వమా కాదు అమాయకత్వము.
శబరి వద్దకు రాముడు స్వయముగా నడచి వస్తే ,ఆమె అంతటి ముదిమిలో ఏదొ చేయాలనే తపన,శరీరము సహరించనందుకూ వ్యధ.కన్నులుకానరాక క్షొభ,కాని మనొనేత్రముతో దగ్ధాయామానముగా రాముడు మదిలో.అలాంటీ రాముడు స్వయముగా తన గుడిసేకు వచ్చి "శబరి" అన్న కమ్మని పిలుపు, అంతకన్నా చల్లని స్పర్శ ప్రసాదించిన ఆశ్రీరామచంద్రునికీ ఆతిధ్యము ఇవ్వాలి! ఏలా? వున్నవొ ఎవొ కొన్ని ఆడవి పండ్లు అవే పెడదాము అన్న తలంపు కాని ఎలావున్నవొ ఎమిటో అని కన్నులకు తెలియక,తీపిగావున్నవా,పుల్లగావున్నవా అని తేలుసుకునేందుకు కొరకటము అదే ఏంగిలి ఆరామునికి అందివ్వటము. ఆయితే ఆయిన అంతకన్నా ఆనందముగా,ఆపేక్షగా ఆ పండ్ల ఆరగింపు.
మరి శబరిది రామునికి ఏంగిలి పెట్టెంతటి మూఢత్వమా ?
కాదు అమాయకత్వముతొ కూడిన భక్త పారవశ్యము.
మూఢత్వము ఎప్పుడు కారు చీకటే.
కాని, పసిమనస్సులాంటి అమాయకత్వానికి ధ్యాన,యోగాలాంటీ భక్తపారవశ్యము తొడు అయితే.ఆపరంధాముడు సదా,సర్వదా మనతొనే,మనము ఆయినతొనే.




