ఈ పెసరట్టు పై అల్లం,మిర్చీ,జీలకర్ర,ఊల్లిపాయలు,వడపప్పు,ధనియాలకారము,కొత్తిమీర ఇలామీరుచికి తగ్గట్టుగా ఏక్కువగా వత్తుగా వేసి దోరగా కాల్పించి దానిపై ఇంత వెన్న వేసి ఆపై ఉప్మా దానికి అనువుగా పప్పు అల్లపచ్చడి(కొబ్బరిచట్ని,అల్లపచ్చడికాదు ఇది వేరె) తో కలిపి అలా అలా తింటూ వుంటే నా సామిరంగా ఆహా! వొహో! అనవలసినదే.ఆదిక్కుమాలిన పిజ్జాలు,బర్గర్లు అన్ని దీని ముందు దిగదుడుపే.
ఇంతటి పెసరట్టుని నేను మొదట్లొ తీనాలి అంటే చాలాభయపడే వాడిని కారణము మాఅమ్మగారు,మా మేనమామ భార్య మాఅత్త అయిన లక్ష్మిపంకజవల్లి గార్లకు ఈ పెసరట్టు పై పట్టు చిక్కలా.కాని నా వివాహము అయిన తరువాత కథ మారింది.మహలక్ష్మి నా ఇల్లాలు అయినది. మేము కాపురము పెట్టిన తరువాత ఆమే ఏప్పుడు పెసరట్టు అని ప్రతిపాదించని నేను పాత అనుభవాలతో వద్దు అని అడ్డు.మెల్లగా కారణము అడిగింది.నేను చేస్తానుకదా అన్న హామి అభయము.చెప్పకూడదుకాని మా మహలక్ష్మిది వంటలో ఖానాఖజానా సంజీవ్ కపూర్ కన్నా 2 మెట్లు ముందు వుండేంతటి ప్రఙ్ఞ.అంతకన్నా శుభ్రముగా చేసెటువంటి ఆచారణత్వము.
అసలు నాకో అనుమానము రాజమండ్రి,కాకినాడ వాళ్ళు ఈ పెసరట్టులో పుడుతునే ఏదో డిప్లమా కొర్స్ చేసేవుంటారు లేకపొతే అంతటి కమ్మదనము రుచి ఎలావస్తాయి?!
మా మహలక్ష్మి మాత్రము శ్రద్ధగా,పద్దతిగా కావలసిన పదార్థములన్ని నానబెట్టి,రుబ్బి, ఇంకా టాపింగ్స్ కావలసిన ఊల్లిపాయలాంటివన్ని ఓపికగా తరగటము.ఆపై దోరగా కాల్చిన పెసరట్టుకి ఉప్మా చేర్చి మాకు పెట్టటములో త్రుప్తి చెందుతుంది.
చాలా చాలా థాంక్స్ మహలక్ష్మి.
