17, మే 2012, గురువారం

పెసరట్టు! తింటే ముల్లొకాలు అదిరేట్టు రుచి ఆహా!వొహొ!




 మన ఆహారాల్లొ పెసరట్టుది ఒక ఘనమయిన స్థానము.అల్లుడుగారొచ్చరంటే అత్తగారు హడావుడిగా చేసేది పెసరట్టు.ఓక బాస్ ను ప్రసన్నము చేసుకొవాలంటే బడుగు జీవీఆశ్రయించేది పెసరట్టు.జిహ్వచాపల్యము తీరాలంటే శరణుకొరేది పెసరట్టు.
ఈ పెసరట్టు పై అల్లం,మిర్చీ,జీలకర్ర,ఊల్లిపాయలు,వడపప్పు,ధనియాలకారము,కొత్తిమీర ఇలామీరుచికి తగ్గట్టుగా ఏక్కువగా వత్తుగా వేసి దోరగా కాల్పించి దానిపై ఇంత వెన్న వేసి ఆపై ఉప్మా దానికి అనువుగా పప్పు అల్లపచ్చడి(కొబ్బరిచట్ని,అల్లపచ్చడికాదు ఇది వేరె)  తో కలిపి అలా అలా తింటూ వుంటే నా సామిరంగా ఆహా! వొహో! అనవలసినదే.ఆదిక్కుమాలిన పిజ్జాలు,బర్గర్లు అన్ని దీని ముందు దిగదుడుపే.    
ఇంతటి పెసరట్టుని నేను మొదట్లొ తీనాలి అంటే చాలాభయపడే వాడిని కారణము మాఅమ్మగారు,మా మేనమామ భార్య మాఅత్త అయిన లక్ష్మిపంకజవల్లి గార్లకు ఈ పెసరట్టు పై పట్టు చిక్కలా.కాని నా వివాహము అయిన తరువాత కథ మారింది.మహలక్ష్మి నా ఇల్లాలు అయినది. మేము కాపురము పెట్టిన తరువాత ఆమే ఏప్పుడు పెసరట్టు అని ప్రతిపాదించని నేను పాత అనుభవాలతో వద్దు అని అడ్డు.మెల్లగా కారణము అడిగింది.నేను చేస్తానుకదా అన్న హామి అభయము.చెప్పకూడదుకాని మా మహలక్ష్మిది వంటలో ఖానాఖజానా సంజీవ్ కపూర్ కన్నా 2 మెట్లు ముందు వుండేంతటి ప్రఙ్ఞ.అంతకన్నా శుభ్రముగా చేసెటువంటి ఆచారణత్వము.        
అసలు నాకో అనుమానము రాజమండ్రి,కాకినాడ వాళ్ళు ఈ పెసరట్టులో పుడుతునే ఏదో డిప్లమా కొర్స్ చేసేవుంటారు లేకపొతే అంతటి కమ్మదనము రుచి ఎలావస్తాయి?!
మా మహలక్ష్మి మాత్రము శ్రద్ధగా,పద్దతిగా కావలసిన పదార్థములన్ని నానబెట్టి,రుబ్బి, ఇంకా టాపింగ్స్ కావలసిన ఊల్లిపాయలాంటివన్ని ఓపికగా తరగటము.ఆపై దోరగా కాల్చిన పెసరట్టుకి ఉప్మా చేర్చి మాకు పెట్టటములో త్రుప్తి చెందుతుంది. 
 చాలా చాలా థాంక్స్ మహలక్ష్మి.   

6 కామెంట్‌లు:

  1. అన్న, పెసరఅట్లు మాకు ఎప్పుడు పెడతారు . మీ ఆర్టికల్ చదివినప్పటినుండి జిహ్వ పెసరటు కోసరం ఎదురు చూస్తుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నా! మొత్తానికి బ్లాగ్ ప్రారంభించావు.పొస్ట్ లు కూడా ప్రారంభించు. తెలుగు టైపింగ్ ఫరవాలేదు. మీరు మాకు ఏప్పుడు ఆవకాశము ఇస్తే అప్పుడు పెసరట్టు. ధన్యవాదాలు.

      తొలగించండి
  2. పెసరట్టు తిన్నాను అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసినా రుచి వుండదు కావునే ఉప్మాకూడా వేసుకుని నోట్లో కుక్కుకుంటారని అనుకుంటాను. ఎన్నైనా చెప్పండి అట్లలో రాజు మసాలదోశే, దోశెకున్న స్థాయి పెసరట్టుకేది?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జీహ్వను బట్టి రుచి. దేని రుచి దానిది. మసాలాదోశ కూడా బహుచక్కగా వుంటుంది. ఈ మసాలదొసే తినాలంటే రాజమండ్రి అక్షయరెస్టారంట్లో బాగుంటది.20 సంవత్సారాల క్రితము విశాఖ పూర్ణా మార్కేట్ వద్ద ఉడిపి హొటల్ ఉండేది అక్కడ కూడా భలేగా వుంతుంది. ఇప్పుదు విజయవాడలో పాతబస్టాండ్ వద్దవున్న మమతాలో ఉదయముపూట మాత్రమే బాగుంటది.పెసరట్టు మీకు సరిగా చేసిపెట్టెవారు దొరకలా ఇది కూడా చాలా బాగుంటది.

      తొలగించండి
  3. aunu attaya ni pesaraattu super ma dad amma eppudu aina pesaratu cheste mahalakshmi baga chesidi pesaraattu antaru :D (prathyusha)

    రిప్లయితొలగించండి
  4. ముద్దుల మేనకోడలకి, ఆశ్శీసులు! మరి అత్త చేతి పెసరట్టు రుచి చూడటానికి ఏప్పుడు వస్తున్నావు. ఈ సారి హైదారాబాద్ నుంచి ఓంగొలుకు వెళ్ళెటప్పుడు మధ్యలో ఈ మామయ్యను గుర్తుంచుకో.

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.