13, మే 2012, ఆదివారం

మీకు కలలో యోని చూపుతున్న స్త్రీ దర్శనమిస్తుందా!


దాదాపు ఈ శీర్షిక చూడగానే చాలామంది కొంత సందేహానికి,కొంత ఆగ్రహానికి లోను అవుతారు.


కలలు అంటే సర్వులకు తెలిసినదే,సాధారణ జీవితములో తీరని,దోరకని,సాధించలేని,సాధించవలసిన వాటిగురించి ఆలొచిస్తూ నిద్రించితే మనకు,ఆ సుషుప్తావస్థలో అనేక రంగులమయ ప్రపంచము లో అనేక దర్శనాలు.ఇవి అన్ని నిజమా, కాదు. కాని సాధించటానికి ఉత్ప్రేరకాలు.కాబట్టే కలాంగారు కలలు కనండి సాధించండి అని యువతరానికి బొధిస్తున్నారు.పాపము అంత పెద్దయాన చెపితే కాదనకూదదని మన ముదుర్లు ఇంకోకలలుకంటారు ఇది వేరే సంగతి.
      కానీ అధ్యాత్మిక జీవనములో కలలుకూడా ఒక ప్రత్యేక స్థానము,విలువ వున్నాయి.సాధారణ చర్మచక్షువులకు అందివ్వలేని దర్శనాలను,అనగా సాధన ప్రారంభీకులకు,సాధనలేనివారికి,పూర్వపుణ్యాలు బలముగా వున్నవారికి ఇలా కలలద్వారా అనేక సంఘటనలు సూచించటము,దర్శనము చేయటము జరుగుతుంది అనేది వాడుక.


మరీ ధ్యానసాధకులకు అనేక దివ్యదర్శనాలు కలుగుతాయని అంటారు.అలా కొంతమంది సాధకులకు ఇటువంటి కల వస్తుంది.కొంత మంది బెదరి తమ గురువులకు విన్నవించుకొగా వారు అనునయముగా సరిదిద్దుతారు.

మరి కారణము ఇదీ.

సకల జీవులయందు ఆత్మకలదని ఈ ఆత్మ పరమాత్మ  ప్రతిరూపమని వైదిక విఙ్ఞానం తెలుపుతుంది.జీవునకు తల్లి గర్భములో వున్నప్పుడు తాను పరమాత్మ ప్రతి రూపమని ఎరుక వుంటుంది.  ఈ ప్రపంచానికి సృష్టి నుంచి పాంచభౌతికమయిన దేహముతో యోనిమార్గం ద్వారా వచ్చామని  సర్వులకు విదితమే.ఈ ప్రపంచపు శ్వాస పీల్చగానే, పరమాత్మ తనకు ఆజీవునకు(ఆత్మ రూపునకు) గల బంధాన్ని మాయలో వుంచుతాడు. దీనితో ఆజీవునకు తను దేహరూపుడు అనే ధ్యాస తప్ప ఆత్మరూపుడనే ఎరుక కలుగదు.కాని పరమాత్మ ఆధీనములొనే జీవుని సకల కార్యక్రమాలు. అందువల్ల మయాకు గురికాబడిన జీవుడు సుకర్మ,దుష్కర్మలు చేస్తూ ప్రార్బధకర్మ ఫలాన్ని సంపాదిస్తున్నారు.ఇందువలన జన్మరాహిత్యము లేని వాడయి జన్మపరంపర సలుపుతూ ప్రతిజన్మనందు సంచిత ప్రార్బధ కర్మ ఫలాలను కొనివచ్చి ఆ జన్మనందు సుఖః దుఃఖాలకు తమకు తామే కారణమవుతున్నారు.కాని పరమాత్మ ను చేరు ఉద్దేశ్యముతో జీవుడు సాధన చేస్తే సాధన ద్వార పరమాత్మను సందర్శించవచ్చని యోగశాస్త్రం తెలుపుతుంది.
     
.   యోగశాస్త్రం నందు దేహం లోని సహస్రారం నందు పరమాత్మ కొలువుయి వున్నాడని,ఈ పాంచభౌతిక దేహముతో తీవ్రసాధన ద్వారా పరమాత్మను సందర్శించవచ్చని తెలుపుతుంది.దేహము శాశ్వతము కాదు, ఆత్మరూపము శాశ్వతమని దానిని పరమాత్మతో అనుసంధించటమే  ఆత్మఙ్ఞానం. మరి మన దేహం నందు వున్న సహస్రారం ను మనం దర్శించలేమా అని అనుకొవద్దు. ఎంతో అభిలాష, దైవానుగ్రహము వుంటేకాని సాధన ప్రారంభం కాదు ఈ విద్యకు తగ్గ గురువు లభించరు.

కానీ నేడు మనం పాంచభౌతికమయిన దేహముతో ఆత్మఙ్ఞానం కొరకు పరితపిస్తూ సాధన చేస్తూన్నప్పుడు, సాధన సాధకము అవుతున్నది అనేదానికి స్వప్నావస్తలో ఇటువంటి దర్శనం.


 నిద్రని నిత్యమరణం అనికూడా పిలుస్తారు. సాధకులకు దేహం సుషుప్తావస్తలో వుండి మనస్సుమాత్రం జాగ్రదావస్తలో ఆత్మఙ్ఞానం నకు పరితపిస్తుంది.అటువంటి సమయములో లభించు దర్శనమే ఈ కల.

   మనము సృష్టి నుండి ఈ పాంచభౌతికమయిన దేహానితో  ఈ ప్రపంచములొకి యోనిమార్గముగుండా వచ్చాము.మరి నేడు ఈ పాంచభౌతికమయన శరిరముకాదని సృష్టిస్వరూపము తెలుసుకొవటానికి తద్వార ఆత్మస్వరూపము తెలుసుకొవటానికి సాధన చేస్తున్నాము. కాబట్టి మనము సృష్టి నుండి యోని మార్గము ద్వార వచ్చాము అంటే మనము సృష్టిలోకి వేళ్ళలంటె అదే యోనిమార్గాన్ని అశ్రయించాలి.అదే ఆత్మ రూపానికి దారి.అందుకే యోగమాయ కలలో యోనినిచూపుతూ మార్గము నిర్దేసిస్తుంది.కనుక మీరు వికారాలకు లోనుకాక ఆతల్లికి నమస్కరించి అందులొనికి ప్రవేసించి ఆత్మరూపులుకండి.



       


7 కామెంట్‌లు:

  1. a small explonation to ur post sir-

    bhaga means yoni and vanthudu means allmighty.so the god itself said that he lives in yoni.Bhaga means mandinchunadi[which ignites the spiritual fire in our souls.so i feel that ur post is 100% correct

    రిప్లయితొలగించండి
  2. //యోగశాస్త్రం నందు దేహం లోని సహస్రారం నందు పరమాత్మ కొలువుయి వున్నాడని,ఈ పాంచభౌతిక దేహముతో తీవ్రసాధన ద్వారా పరమాత్మను సందర్శించవచ్చని తెలుపుతుంది.//
    శివుని గురించి పార్వతితో మాయావటువు మాట్లాడే సందర్భంలో యం యోగినం విచిన్వంతి క్షేత్రాభ్యంతరవర్తినం అన్నాడు కాళిదాసు. అంటే ఎవరినైతే యోగులు తమ క్షేత్రంలో(యోగక్షేత్రంలో అంటే శరీరంలోని షట్చక్రాలలో)వెదుకుకుంటారో ఆ పరమాత్మే శివుడు. అంటే దేవుడు ఈ శరీరంలోపలే ఉన్నాడన్నమాట. మీ వ్యాఖ్య సరైనదే, అలాగే Astrojoyd గారి అదనపు సమాచారమూ విలువైనదే.

    పూర్ణప్రజ్ఞాభారతి
    pragnabharathy@blogspot.in

    రిప్లయితొలగించండి
  3. కొన్ని సంవత్సరాల క్రితం నాకు కలలో స్మశానం లో భగ భగ మంటల్లో కాలిపోతున్న శవాలు,ఎముకలు,పుర్రెలు కనిపించేవి. ఆ తరువాత ఒకసారి చనిపోతున్నట్లు కల వచ్చింది.చనిపోయే ముందర కాశిశివుడి లింగం కలలోకి కనిపించింది. ఆ తరువాత మెలకువ వచ్చింది. ఈ మధ్యనె ఇంకొకసారి స్మశానంలో, నా శవానికి నేనే నిప్పు పెట్టి తగలబెటినట్లు కల వచ్చింది. ఈ కలలు నన్ను ఎప్పుడు భయపెట్టలేదు. వాటిని సిరియస్గా పట్టించుకోలేదు. కాకపోతే గుర్తుండిపోయాయి. చనిపోతున్నట్లు వచ్చే కలల గురించి యోగశాస్రం లో ఎమైనా చెప్పారా? ఇటువంటి కలలను దర్శనాలంటారా?:)

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.