26, మే 2012, శనివారం

శ్రీ కృష్ణ శతకము లొని - హరి అను రెండు అక్షరముల....





 మన తెనుగు భాషకు గల విలక్షణతల్లో పద్యం ఓకటి.
 దాదాపు ఈ ప్రక్రియ తెనుగులో వున్నంత విశేషత ఇంకో భాషలో కానరాదు.అలాంటి పద్యాలని 108 వున్న వాటిని శతకమని అంటారని మీరు ఎరిగనదే. ఈ శతక పద్యం నందు దాదాపు 4 పాదాలు కలిగి, సాధారణముగా ఎదో ఒక మకుటము కలిగి వుంటాయి.సుమతి,వేమన,భాస్కర,దాశరధి,నరసింహ,శ్రీకృష్ణ మొదలగునవి.ఈ పద్యాల్లో నీతి,భక్తీ ఇలా అనేక విషయాలు కలిగి వున్నాయి. పూర్వ కాలములో ఖచ్చితముగా ప్రతి విద్యార్ధి ఈశతకాలని సాధనతో అన్ని పద్యాలని ధారణచేసే శక్తి కలిగి వుండేవారు.
కాలము మారింది. జీవితాల్లోకి ఆంగ్లము చొచ్చుకొచ్చిన తరువాత వాడుక భాషగా తెనుగు మిగిలింది కాని సాధన భాషగా తెనుగు బాగా తగ్గిపొయినది.                    

కానీ దీనివల్ల అచార సంస్కృతిల్లో మార్పులు, అనుచానముగా వస్తున్న విషయాల్లో అంతరార్ధముగా వున్న నీతి గాని ఇంకేమైనా గాని తెలుసుకునే అవకాశము, తరువాత తరమునకు అందించాలనే అపేక్ష కొరవడినందువల్ల వచ్చిన విపరిణామల్లో ఇది ఓకటి.



ఇక విషయానికి వస్తే ఇక్కడ ఓక పద్యాన్ని పరిచయము చేయాలని అనుకుంటున్నా, ఇది కృష్ణ శతకములోనిది దాదాపు అందరికి తెలిసినదే కాకపొతే ఇందు దాగి వున్న అంతరార్ధాన్ని బుధజనుల ముందుకు తీసుకొని రావటమే.    

హరియను రెండక్షరములు
హరియించును పాతకంబు నంబుజనాభా !
హరి నీ నామమహత్యము
హరి హరి పొగడంగ తరమె హరి శ్రీ కృష్ణా


హరి అన్న రెండు అక్షరములతో సకల పాపములు హారాయించును అన్నది భావము. వదిలించుకొలేని లక్షణాలే పాతకాలుగా మారి మనలను జన్మ,మరుజన్మ ఇలా చక్ర భంధములో వుంచుతున్నాయి. అవి ఏవి కామ,క్రొధ,లోభ,మొహ,మద,మత్సరాలనేవి ఆరింటిని జీవుడు జయంచనంతకాలము ఇలా జరుగుతూనే వుంటది. మరి మానవుని కింకర్తవ్యము ? అందుకే "హరి" ని ఆశ్రయించి హారి నామ స్మరణతో ఈ పాతాకాలను హరాయించుకోవటమే. ఇంకా ఇక్కడ శతక కారుడు తనచాతుర్యము కూడా బాగా చూపించాడు.కరిగినది అనకుండా లేదా  తత్ సమానపదము కూడా ఉపయొగించక హారియించు అన్నదానికి కారణము. కరిగినది అంటే,  ఈ గుణరూపము మార్పు చెందినదే కాని ఇంకా అక్కడే వున్నది అని, కాని హరియించు అంటే పూర్తిగా నివృత్తి.ఇలా అయితేనే మీకు మోక్ష పదమని శతకకారుని భావన. ఇందుకు ఉదాహరణగా హరి అన్న పదాలు పద్యము మొత్తములో ఆరు సార్లు పునరావృతమై కలవు. మీరు ఓక్కసారి పద్యము మరల గమనించండి.                 
ఇలాంటి సత్ సంగతులు నాతో చర్చించే పితృసమానులు శ్రీ వూటుకూరి రామయ్యగారు నాతో జరిగిన ఓక సమావేశములో ఈ విషయము నాకు తెలిపినారు.
ఇక వారిగురించి తెలుసుకొవాలంటే ఈ క్రింది లింకు కు వెళ్ళండి.

6 కామెంట్‌లు:

  1. A few years before I got a Shree Raama Koti Book From "శ్రీ వూటుకూరి రామయ్యగారు "

    thanks

    ?!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామనామ ప్రచారమే వూపిరిగా లక్ష్యముగా ఈ వయస్సులొ కూడా శ్రమిస్తున్న అరుదైన వ్యక్తి శ్రీ వూటూకూరి రామయ్యగారు. మీకే కాదు సర్వులకు రామనామ లేఖన గ్రంధాన్ని ఉచితముగా, రామసేవ లా ఎంచి పంపుతుంటారు.మీరు నా పొస్ట్ చదివి కామెంట్ వుంచినందులకు ధన్యవాదాలు.

      తొలగించండి
  2. మంచి మంచి విషయములను ప్రస్తావిస్తున్నారు, మీకు నా అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. మీ టపాలు బాగుంటున్నాయి. పై పద్యంలో 3వ లైను హరి నీ నామ మహత్యము అని ఉండాలని గుర్తు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు, ఒక్కసారి మరలా శతకం పరిశీలించి సరిచేస్తాను. చూడగా నాకు కూడ తప్పుగానే వున్నట్లున్నది. ఎది ఎమయినా నా తప్పును సహృదయముగా చూపినందుకు మరోక్కసారి ధన్యవాదాలు.

      తొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.