8, మే 2012, మంగళవారం

పరశురామ అఙ్ఞాతవాసము

రేణుకా,జమదగ్నిల పుత్రుడు పరశురాముడు పితృవాక్యపరిపాలన వలన తల్లిని సంహరించి,మరలా అదే తండ్రీ వరప్రభావముచే తల్లిని పునర్జీవింపచేసిన విశిష్టలక్షణుడు.ఇంతటి పరశురాముడు ఊగ్రుడు,ముక్కొపి.శివుని మెప్పించి ఆయిధముగా గొడ్డలిని సంపాదించినవాడు.తన తండ్రికి జరిగిన ఘోరమునకు ప్రతీకారముగా 21 మార్లు క్షత్రియవంశ నిర్మూలన కావించి సకల ధరామండలము అంతటిని తన ఆధినములో తెచ్చుకున్నవాడు.    


ఇంతవరకు కథ బాగానేవున్నది.అసలు మలుపు ఇక్కడే ప్రారంభము. క్షత్రియిలందరి నిర్మూలన రాజ్యాలన్ని పరశురామ ఆధినములో కానీ పరశురాముడు పాలనకాక తన తపస్సులో.మరి ఇంకేముంది రాజులేని రాజ్యములో పరిపాలన లేక, రాజ ఉద్యొగుల దుర్మర్గాలకు ప్రజలు బలి.శిక్షలు లేక నేరాలు పెచ్చరిల్లటము.ఇలా అనేక ఇబ్బందులతో రాజ్యాలన్ని అల్లకల్లొలముగా వున్నాయి.అంతా అరాచకము.ఇది గమనించిన సకల మునిగణ,పండిత సభలో ఈ సమస్యపై చర్చ.చివరకు ఓక నిర్ణయానికి వచ్చి భాధ్యత కశ్యపునకు అందచేసినారు. పరశురామునకు కబురుపంపి ఆయినను ఈ మునిగణ పేరలొగమునకు ఆహ్వానము.ఆంత పరశురాముడు రాగా ఈ సభనిర్ణయము ఇది అంటు మీవద్ద వున్న సకల రాజ్యాలను కశ్యపునకు ధారపొయాలని తెలిపినారు.ఆపై పరశురాముదు సకలభూమండలాన్ని కశ్యపునకు ధారపొయగా, దానితో కశ్యపుడు ఈ రాజ్యలన్నిటికి రాజుగా మారిపొయాడు.      

దానితో కశ్యపుడు ,పరశురాముని ఉగ్రలక్షణము తెలిసినవాడై మరలా పరశురాముడు జనజీవనస్రవంతిలో వుంటే మరలా ఇటువంటి ఇబ్బంది వస్తొందని పరశురాముని సముద్రతీరప్రాంతమునకు వెళ్ళమని అదేశించాడు.దానితో పరశురాముడు నేటి గోవా ప్రాంతములో శిక్ష,అఙ్ఞాతవాసము,సముద్రతీరప్రాంత ప్రవాసము ఇలా ఎమయిన అనండి అక్కడకు వెళ్ళిపొయాడు.  


8 కామెంట్‌లు:

  1. ఇందులో శిక్ష అంటూ యేమీలేదు. అప్పటికి ఉన్న భూమండలాన్నంతటినీ వశం చేసుకొని దానిని కశ్యపునకు ధారపోసాడు పరశురాముడు. ఆ తరువాత తనది కాని భూమండలంలో నివసించటం ధర్మం కాదు కాబట్టి, సముద్రుడిని అడిగి కొత్తగా కొంత భూభాగం పొంది అక్కడ నివసించసాగాడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొత్తగా దొరికిన భూభాగం ఎక్కడ ఉండేదో?? భూమండలం-2 లొ నా??

      తొలగించండి
    2. అయ్యా అఙ్ఞాత గారు, వారు భాగవతములో వున్నది తెలిపినారు. అంతమాత్రానికే భూమండలము-2 అని వెటకారము కూడదు. వారు పెద్దవారు కనీసము ఈ విషయమన్నా గమనించండి. ఈ రొజు కాకపొతే కొద్దిరొజులకు మనము కూడా ఆవయస్సులొకి వెళితే అనాటి మన పుత్ర సమాన వయస్కుడు ఇలా వెటకారము ఆడితే మీరు ఎలా స్పందిస్తారో ఓక్కసారి ఉహించండి.

      తొలగించండి
    3. పుత్ర సమానుడైన పిల్లాడు, తెలుసుకోవాలన్న ఆసక్తితో అడుగుచున్నాడేమో! ఆతని జ్ఞానతృష్ణను చల్లార్చడం భావ్యం కాదు. అడగరా అజ్ఞాతబ్బాయ్, ఇలా అడిగేవాళ్ళు దొరకాలి గాని, మేస్టారు గారు తప్పక చెబుతారు

      తొలగించండి
    4. :) ఇది కామెంట్. సరసంగా,లలితంగా అడగాలి.

      తొలగించండి
  2. క్షత్రియరాజులపై దండయాత్ర కారణముగా భూమి ఆధినములో వున్నది.కాబట్టి రాజు అయ్యాడు కాని రాజధర్మము నిర్వర్తించలేదు.కాబట్టే ఈ ప్రవాసము. మరి ప్రవాసము దండన కాదంటారా? కాని అవతార రూపత్వానికి భంగముకలగని రీతిలో సముద్రము వద్ద భూమి తీసుకున్నారు అనే వాదన.

    రిప్లయితొలగించండి
  3. పరశురాముడు తన పరశువు (గొడ్డలి) ను సముద్రంలోకి విసరివేయగా, ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. ఇలా వెలువడ్డ భూమి లో గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు. ఉడిపి, కొల్లూరు, గోకర్ణ, కుక్కే సుబ్రమణ్య, శంకరనారాయణ, కుంభాసి/ఆనేగడ్డ, కోటేశ్వర.
    ఈ క్షేత్రాలు అన్నీ కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుమల లో ఉన్నాయి.

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.