30, మే 2012, బుధవారం

రామునికి సీత ఏమవుతుంది? ఇది హనుమంతునికి ఉదయంచిన ప్రశ్న? - వివరణ.


సాధరణముగా మన జీవనములో అన్నీ,అంతా వివరముగా చెప్పినా, మొత్తము విన్నతరువాత మూలము గురించి ఎవరైనా సందేహంగా ఆడిగితే ఇదిగో ఇలా అంటారు రామాయణమంతా విని రాముడుకు సీత ఎమవుతుంది ? అన్నాడు అని వేళాకోళము చేస్తారు.కానీ అచంచల రామభక్తుడు , సీత అన్వేషణ జరిపిన వాడు హనుమంతుడు ఇలా అంటే మనము ఆశ్చర్యపొతాము.ఈ ప్రశ్నకు మనము అర్ధము తెలుసుకుంటే రామయణ పరమార్ధము మనకు కరతలామలకమే.
సీతా అన్వేషణకై హనుమంతుడు లంకలోకి అడుగు పెట్టాడు.లంకనందు తీవ్రాతితీవ్రమయిన అన్వేషణ జరిపి పరీశీలన మీద సీత ఆశొకవనములో దర్శనము. ఏలా? ఇలా! 

సీతా రాములకు అన్నివిషయాలలొ సామ్యము,సారూప్యము,ఏకత్వము వున్నది.అశోకవనములొ సీతాదేవి రూపలావణ్యము చూసి హనుమంతుడు నివ్వెరపొతాడు. అమే అతిలోక సుందరి అయినందుకు కాదు; అమె అంగాంగసౌష్ఠవములో  ముమ్ముర్తులా రామచంద్రమూర్తి మొక్కట్లు మూసపొసినట్లు కనిపించటమువలన. 
 సామన్యముగా తల్లి పిల్లలు,తండ్రి బిడ్డలు,అన్నదమ్ములు,అక్కచెల్లెండ్లు,మేనమామ బిడ్డలు మేనత్తల పిల్లలు ఒక రూపున ఉండుట సహజము. కాని భార్య భర్తలు ఒకేరూపున ఉండటము చాలా అరుదు.సీతారాములది దగ్గరి సంబంధము కూడాకాదు. అక్కడ రామయ్యను చూసి ఇక్కడ సీతమ్మను చూస్తే అతడే స్త్రీ రూపములో ఇక్కడ ఉన్నట్టు గమనించిన హనుమంతుడు  మనస్సులో ఇలా అనుకుంటాడు:"అస్యా దేవ్యా యధారూపం - అంగప్రత్యంగ సౌష్టవము, రామస్య చ యధారూపం తస్యేయ మసితేక్షణా."  అన్ని అవే పోలికలు, ఏ అవయవము చూసినా ఆ రూపానికి ఇది ప్రతిరూపములా వున్నది తప్ప వేరుకాదు.
    ఇది ఎలా సాధ్యమయింది? ఇదే రామయణములోని అద్వైత రససిద్ధి. సీతారాములకు రూపములొనే కాదు గుణగణాల్లో,ఆలోచనల్లొ,ఆనందములో.ఆవేదనలో అన్నిటా ఏకత్వమే దేనిలోకూడా వ్యత్యాసములేదు."అస్యా దెవ్యా మనస్తస్మిన్ - తస్య చాస్యం ప్రతిష్ఠితం" అమే మనస్సు ఆయనలో లీనమయినట్లుగానే ఆయన మనస్సులో అమే లయించి ఉన్నదట. 
ఇలా ఒకరికొకరు బింబ ప్రతిబింబముగా ఉన్న సీతారాముల ఆత్మమనశ్శరీర సామరస్యాన్ని చూసిన హనుమంతుడు స్థంభించిపోతాడు.అలాంటి మనస్థితిలో హనుమంతుడులాంటి బుద్ధిమంతుడే అనుకొని వుంటాడు.ఇక మనలాంటి పామరులు ప్రశ్నించటములొ పొరపాటులేదు.   

సీతారాముల మధ్యగల అన్యొన్యతను,అభిన్నతను,అనుబంధాన్ని అక్షరరూపములో నిరూపించటమే "రామయణ" పరమావధి. శ్రీరాముడు పరామాత్మస్వరూపుడయితే సీతాదేవి పరామాత్మయందలి పరమ కళ. ఈ కళ ముల్లొకాలకుకూడా మూలాధారాన్ని ప్రసాదిస్తుంది.

8 కామెంట్‌లు:

  1. సీతారాములు ముమ్మూర్తులా ఒక్కలాగే ఉన్నారని మీరు వ్రాస్తున్నారు.
    అలా వాల్మీకిరామాయణంలో ఉందా?
    వాల్మీకం తరువాత సవాలక్ష రామాయణ గ్రంధాలు వచ్చాయి. వాటిలో దేనిలోనైనా ఉందా?
    ఒక వేళ మీరన్నట్లే పోలిక ఉన్నా, ఒకరికొకరు యేమవుతారన్న ప్రశ్న యెక్కడినుండి ఉత్పన్నం అయింది?
    ఇదంతా అసందర్భంగా ఉంది!

    రిప్లయితొలగించండి
  2. ఈ కధనము ఇలపావులూరి పాండురంగారావుగారి రామాయణపరమార్ధము అన్న పుస్తకము నుంచి తీసుకొనబడినది.ఈ పుస్తకము టిటిడి వారు ప్రచురించారు.అయినా మీరు సందేహము వ్యక్తము చేసారు కాబట్టి శ్లోకము కూడా చేరుస్తాను.

    రిప్లయితొలగించండి
  3. హనుమంతుడికి కలిగిన సందేహము సితమ్మ రామునికి భార్య లేక ప్రతిరూపమా అన్నసందేహము.మరి రామునికి సీత ఎమవుతుంది అన్నసందేహము కాదా!

    రిప్లయితొలగించండి
  4. ఇదంతా నాకు నమ్మశక్యంగా లేదు.

    సీతమ్మ అచ్చంగా రామయ్యనే పోలి ఉంటే, రాముడే ఆమాటను సీతాన్వేషణం కొరకు పయనమౌతున్న హనుమంతుడికి ఆనవాలుగా చెప్పేవాడు గదా?

    నాకు తెలిసి అటువంటి మాట యేమీ ప్రాచేతసులవారి కావ్యంలో లేదు.

    దీనిని బట్టి అనంతర కాలపు అనాలోచిత కల్పన అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  5. శ్లోకం చేర్చాను పరిశీలించండి.అలాగే పొస్ట్ కిగల మూల గ్రంధనామము తెలిపినాను. మీకు ఇంకను అనుమానమున్న ఓక్కసారి రామాయణమును పరీశిలించి చూడగలరు.
    ఈ పొస్ట్ కుగల ముఖ్య ఉద్దేస్యము ఆఖరి పేరా ఒక్కసారి మరలా పరిశీలించండి
    .నమ్మశక్యముగాలేదు,అనాలొచితకల్పన ఇవి అన్ని యద్భావముతద్భవతి. రామాయణము అనేక వందలమంది అనేక రకాలుగా వ్రాసారు.
    పెద్దలు మీరు ఎమ్మన్నా నాసమాధానము వలన ఇబ్బంది పడితే క్షమించగలరు. ఆగ్రహించక ఆశ్వీరదించగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎల్లప్పుడూ నా ఆశీర్వాదాలుంటాయి మీకు. ఆగ్రహం ప్రసక్తే లేదు.
      మీరన్నట్లు రాముడిమీద అనన్యభక్తితో అనేకమంది రామాయణ రచన చేసారు.
      ప్రాచేతసులవారు (వాల్మీకి) మొదటివారయితే ఆ తరువాత బహుశః హనుమంతులవారు. పిదప నేటిదాకా వందలాది మంది. కాని మనకు వాల్మీకమే ప్రమాణం.

      అస్యా దేవ్యా యధారూపం అంగప్రత్యంగ సౌష్టవమ్
      రామస్య చ యధారూపం తస్యేయ మసితేక్షణా.

      ఇది వాల్మీకిరామాయణంలోని దనుకోను. సుందరకాండలో వెదకాలి.
      మీ వల్లన కాదు, యీ శ్లోకము వలనే యిబ్బంది.
      తెలుసుకుందుకు ప్రయత్నిస్తాను.

      తొలగించండి
    2. సుందరకాండ 15వ సర్గనందు 51వ శ్లోకంగా వున్నది. గమనించగలరు.

      తొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.