15, మే 2012, మంగళవారం

స్వయముగా ఆంజనేయస్వామి 10 రూపాయల అనుగ్రహ ప్రసాదము - ఇది మా ప్రత్యక్ష అనుభవము.


దైవం మిమ్ములను ఓక్కొసారి ఓక్కొ విధముగా అనుగ్రహిస్తాడు.ఆ అనుగ్రహ కటాక్షాలను జీవితములో మధురక్షణాలుగా మనస్సులో భద్రపరచుకొని స్వామి వారిసేవలో గడపాలి.


మేము మా అబ్బాయి శరణ్యకుమార్ పుట్టినరోజుకు అగష్ట్ 29కి దాదాపు ప్రతి సంవత్సరము తిరుమలలో వుండే విధముగా 2004 వరకు వెళ్ళినాము.అలా 1999 సం. లో మాతో సహా ఇంకా 10మందిదాకా వున్నారు.
చాలారోజులనుంచి షొలంగీరు వెళ్ళాలని సంకల్పము.అందుకు స్నేహితులు కూడా తోడు కావటముతో ప్రయాణము ఖాయమయింది. కాట్పాడి వెళ్ళి అటునుంచి షొలంగీర్ చూసి ఆపై తిరుమలకు రావాలని ప్రొగ్రాము.కార్యక్రమములొ అనుకున్న ప్రకారము షొలంగిర్ చేరినాము.ఈ షొలంగిర్ తమిళనాడు లొనిది కాని మన చిత్తూరుకు దగ్గర. ఈ షొలంగిర్ నందు 2 కొండలు.మొదటిది నరసింహ స్వామిది, రెండోవది ఆంజనేయస్వామిది.నరసింహ స్వామి కొండ ఉదయము మాత్రమే దర్శనము అందువలన మేము కూడా,ఉదయమే నరసింహ దర్శనము   వెళ్ళి మా బసకు తిరిగి వచ్చి ఆహారము,విశ్రాంతి తీసుకొని సాయంత్రము ఆంజనేయ దర్శనమునకు వెళ్ళాము.

అలా సాయంత్రము 7.30 ప్రాంతములో ఆంజనేయస్వామి దర్శనమునకు వెళ్లివచ్చాము.అందరము సత్రము మెట్ల వుండి ఎవొ కబుర్లు ఆడుతుండగా అంతలో శ్రీ స్వామివారు వానర రూపములో అలా వచ్చారు.అందరు చూస్తుండగానే,10 మంది మధ్యలో వున్న నా భార్య మహలక్ష్మి కుడిచేయి దగ్గరకుతీసుకోని చేతిలో పదిరూపాయల నోటు వుంచి అలా వెళ్ళిపొయారు.దాని తో మేము కలా నిజమా అని నమ్మలేని పరిస్థితి ఎర్పడింది.మా అమ్మగారు కూడా ఆసమయములో మాతోనేవున్నారు.నాన్నా ఇది స్వామివారి ఆశ్వీరవాదమురా  ఆపదిరూపాయలు జాగ్రత్త అని చెప్పారు.నేటికి ఆనొటు మాపూజామందిరములో.

నమ్మినా నమ్మకున్న ఇది జరిగింది.
     


                                           
hanuman mantra in sanskrit

1 కామెంట్‌:

  1. ఫోటో తీయాల్సింది. అమధ్య హిమాలయాల్లో వున్న స్వామి వారి ఫోటో ఆంధ్రజ్యోతిలో వచ్చివుండింది. మరీ 10రూ| లేనా ప్చ్... 10రూ లకు ఏమొస్తుంది? స్వామివారు కొంత వితరణ చూపాల్సింది, తిరుగు చార్జీలు, లాడ్జి ఖర్చులూ అయినా ఇచ్చి వుంటే బాగుండేది. ఏమైనా మీరు అదృష్టవంతులు, ఇక మీకు రామానుగ్రహం దక్కిందనే అనుకోవాలి. భద్రాద్రి వెళ్ళి రండి.

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.