20, మే 2012, ఆదివారం

బడాయి భక్తి - వ్యాపార దేవాలయాలు - కార్పొరేట్ అధ్యాత్మికత.




వేదకాలం లో మానవుడు ప్రకృతి శక్తులను పూజించాడు.తదనంతర పరిణామములొ అనేక దైవరూపాలు ఉద్భవించి మానవుని అధ్యాత్మీక వున్నతికి, దైనందిన జీవనములో సంయమనముకు అచారాలు,పూజలు,వ్రతాలు కూర్చ బడ్డాయి.ఇవి వ్యక్తివికాసానికి, సంఘ అభ్యున్నతికి తొడ్పడ్డాయి.వీటికి ఆలంబనగా అనేక వేలమంది రాజులు జమిందార్లు అనేక వేల దేవాలయాలను నిర్మించారు.ఇది కొన్ని వేల సంవత్సరాలు సాగగా బౌద్ధము,జైనమత వ్యాప్తితో హిందుమతo కొన్నివందల సంవత్సరాలు ఆదరణకు నొచుకొలేదంటే ఈనాడు ఆశ్చర్యము  కలుగుతుంది కాని చరిత్ర చెప్పిన సత్యం.ఆతరువాత శంకరుల అద్వైత స్థాపనతో మరలా హిందుమతానికి పునరుజ్జీవము.శంకరులు అతికొద్ది కాలములొనే అసేతు హిమాచలము పర్యటించి అనేక వేల దేవాలయాలను పునరుద్ధరణ,పునరుజ్జీవన,పునఃస్థాపన లాంటి  దిగ్వవిజయవంతమయిన కార్యక్రమాలతో మరలా హిందుమత పతాకము ఎగిరింది.
     తదనంతర మధ్యయుగాలలో అధ్యాత్మకత ఓక భక్తిఉద్యమముగా మారి శైవ,వైష్ణవ,శాక్తేయ ఇలా అనేక శాఖలుగా మారింది. మరలా దినిలో అనేక రకాల ఉపశాఖలు, అనేక మార్గాలు ఎర్పడ్డాయి.ఈ సమయాలలొనె అనేక వందలమంది సాధులు,సంత్,మఠాదిపతులు ప్రవేశం.రామానుజాచార్యులు,మధ్వాచార్యులు,నింబార్కులు,చైతన్యులు,వల్లభాచార్యులు లాంటి మార్గదర్శకులు.తుకారాం,రామదాసు లాంటి అనేక వందల భక్తాగ్రగణ్యులు.ఈ మతాన్ని సుసంపన్నము చేసారు.వీరందరు భక్తిమార్గాలను ధ్యాన,యోగ,ఆరాధన ద్వారానేకాక సంగీత,నృత్య,సాంస్కృతిక కళలను, తమ విద్వత్ వైభవాన్ని దైవ పరంగాచేసి వారు ధన్యులు అవుతూ సమాజాన్ని ఏకీకృతము చేసారు.ఇందుకు సందేహము లేదు.
     కాల క్రమేణా మహ్మదీయదండయాత్రతో ముస్లీం మతం పరిచయము అయినది. ముస్లీం రాజులు మొదట సంపద దొచుకొవటానికి మాత్రమే ప్రాధాన్యమిచ్చి ఆ తరువాత ఇక్కడ వున్న వనరులు, వాతావరణ పరిస్థితులు ఆకర్షించి రాజ్యవిస్తరణకు పూనుకున్నారు.ఆ తరువాత తమ దేశాలనుంచి పాలన కుదరక ఇక్కడ తమ ప్రతినిధులను వుంచి రాజ్యపాలన సాగించారు.కాల క్రమేణా ఈ ప్రతినిధులు స్వతంత్రులై రాజ్యహస్తగతము చేసుకున్నారు.దీనివలన వారికి స్వంతదేశములనుంఛి మనుషులు రాక తమ విధానాలకొసము బలవంతపు మతమార్పిడీలకు తెగపడి సమాజాన్ని భీభీత్సభయానక గందరగోళానికి గురిచెసారు.ఔరంగజేబు లాంటివానికి మతసహనము అంటే అర్ధము తెలియనంతగా మతమార్పిడిలు జరిగి మసీదులు,ముస్లీం అరాధనా పద్ధతులు ప్రవేశించబడ్డాయి.  
 ఈ వాతావరణము ఇలా వుండగానే డచ్చివారు,ఫ్రైంచివారు,ఆంగ్లేయుల రాకతో క్రైస్తవము దేశములో వ్యాపించింది.క్రైస్తవము మతముగా స్వకరించటానికి ముందుకు రాని పరిస్థితులలో అనాటి సమాజములో అంటరానివారుగా జీవనము గడుపుతున్న హరిజనులకు ఆకట్టుకొని మత విస్తరణ చేసుకున్నారు. క్రైస్తవము విస్తరణలో సేవ ఒక మార్గమయితే, చర్చిలు పేదవారికి,మతము అనుసరించినవారికి బహుమతల పర్వము ఇవ్వటము సాగించి బాగా ప్రాముఖ్యత వహించాయి.

ఇలా స్వాతంత్రకాలానికి జాతిజీవనములో ఈ 3 మతాలు భాగంగావున్నా, కానరాని వైషమ్యాలు వున్నా, ఉమ్మడిగానే జీవనము సాగించారు.
దేవాలయాలు ధర్మసంస్థలు ఆనాడు పటాటోప అర్భాటాలకు దూరంగా వుండి అధ్యాత్మికవాదులకు,భక్తులకు వేదికగాను, శరణు అన్నవారికి అభయ ప్రదాతలుగాను వుండేవి. ఇందువలన అనేక మంది వితరణశీలురు, దాతలు బావులు,సత్రాలు,అన్నదాన సమాజాలు స్థాపించి వాటి నిర్వాహణకు మూలధనాన్ని,ఆస్థులను,జమాబందికి వ్యవస్థను ఎర్పరిచేవారు.దీనివలన దేవాలయాలు మున్నగునవి సాంస్కృతిక కేంద్రాలుగా, పౌరకేంద్రాలుగా వ్యవహరించాయి.కాని స్వాతంత్రయానంతర రాజకీయ నాయకుల జొక్యముతో ఈపౌరకేంద్రాలను రాజకీయకెంద్రాలుగా, కొండకచో వర్ణ,వర్గ బేధాలుగా విభజన జరిగింది. దీని వలన ఆయాప్రాంతాలలో పలుకుబడి,పట్టు వున్న నాయకుల చేతిలోకి దేవాలయాల యాజమాన్యము వెళ్ళి ఆనాయకుల అవినీతి,ఇష్టారాజ్య పాలనతో దేవాలయ ప్రాభవాలు తగ్గాయి.ఇది ఎదొ ఓకనాడు జరిగినది కాదు తరాల దోపిడి, గుట్టుచప్పుడుకాని ధార్మిక మోసము.అందుకే వేలకొద్ది ఎకరాల భూములు మాన్యముగా వున్న దేవాలయాలు కూడా దీపారాధనకు నోచుకోనివి నేటికి చాలా వున్నాయి.ఈ దుస్థితికి ప్రజలు,ప్రభువులు ఇరువురు కారణము.ప్రభువులుగా వుండే నేతలకు కావలసినది అధికారము,ధనము తప్ప వేరుకాదు.అందుకే దేవాదాయ చట్టాల పేరుతో దాదాపు అన్ని దేవాలయాలను తన అధీనములోకి తెచ్చుకోని,దేవాలయ ఆదాయాన్ని బట్టి దేవాలయ స్థాయి వర్గీకరణ దాని బట్టి నిధులు.ఇక ప్రజలు కూడా అధ్యాత్మికతను మనొవికాసానికి,జీవనగమనానికి అనువుగా ఉపయగించకుండా అనేకరకాల మొక్కులు,పూజలతో భక్తిని కూడా వ్యాపారము చేసి. దేవుడితోనె బేరాలు ప్రారంభించారు. 
     ఇవి చాలవన్నట్లు సమాజము నిండా ఊరికి,పేటకు,సందుకు ఓక బాబా,సాధు,సంత్ ల హడావుడి. అలాగే అనుచానముగా వున్న దైవరూపాలకు తోడు షిరిడిసాయి,అయ్యప్ప లాంటి రూపాలకు ఆదరణ.ఈనాడు షిరిడిసాయి మందిరము లేని వార్డు లేదంటే పరిస్థితి గమనించండి.  

ఈ స్వామీజీల మఠాలు,ఆశ్రమాలు చూడండి వైభవంగా వైకుంఠాన్ని తలపించే విధముగా 5నక్షత్రాల హోటళ్ళకన్నా ఎక్కువగా ఉదా. ఆర్ట్ ఆఫ్ లివింగ్, గణపతి సచ్చిదానంద,జియ్యర్ ఆశ్రమాలు.గమనించండి విళ్ళందరు భక్తి రూపములో చేసేది వ్యాపారమే.అధ్యాత్మికత ఓక ముసుగు. సేవ ఓక తేనే పూసిన కత్తి. అయ్యా! ఉదహిరించినవారు మాత్రమే ఇలాకాదు ఆసేతు హిమాచలము వున్న మఠాలు,ఆశ్రమాలది ఇదే తంతు.వీళ్ళ వ్యాపార ధోరణికి కొన్ని చర్చకు చూద్దాము.     
కల్కి మందిరాలలో,కల్కిఆశ్రమములో జరిగే ధనార్జన.పాదపూజ లక్ష,దర్శనానికి వేలు. యఙ్ఞాల పేరిట వేల,లక్షలకొద్ది ధనము వసూలు. ఈధనము పెట్టి స్వామిగారి అబ్బాయి మద్రాసులో సినిమాలు,రియల్ యస్టేట్ వ్యాపారాలు. 
2వది నాస్వీయ అనుభవము.5సంల క్రితము గణపతి స్వామివారు విజయవాడ సిద్ధార్ధకళాశాల ఆడిటొరియం నందు రాగచికిత్స లాంటి కార్యక్రమము ఎదొ చేయ తలపెట్టినారు.అది ఉచితముకాదు టిక్కెట్ 5000,10000 గా నిర్ణయము.ఆ రొజున నేను వీరి ఆశ్రమములోని మరకత రాజేశ్వరి దర్శనానికి వెళ్ళి స్వామివారి అనుగ్రహభాషణ అంటే అలా ఆలకిస్తున్నా.నా ప్రక్కన ఎవరో ఓక స్వామివారి సాధారణ భక్తుడు హైద్రాబాద్ నుంచి వచ్చాడు.అదే సమయములో స్వామివారి ఆంతరింగిక సిబ్బంది సాయంత్రము ప్రొగ్రాము టిక్కెట్స్ అమ్ముడుకాలేదు హాలు డబ్బులు,ప్రచారము ఖర్చు కూడా రాలేదు అని రహస్య సమాచార నివేదిక.దీనితో స్వామివారు ఒక్కసారిగా అగ్రహముతో ఉగ్రముగా మైకులో మీరు నాభక్తులై వుండి 10000 పెట్టి టిక్కెట్ తీసుకోరా డబ్బులేని వాడు కూడా భక్తుడా అన్న అభావ సంభాషణ. ఇది విన్న నేను షాక్,నా ప్రక్కన వున్నవాడు మూర్ఛ.వాడికి నాకు ఓకటే ఉమ్మడి      
ప్రశ్న డబ్బు లేని వాడు భక్తుడుకాడా? అధ్యాత్మికతకు అనర్హుడా!
ఇలా సాగుతున్నాయి స్వాముల భాగొతాలు.
ఇకపొతే దేవాలయాల వ్యవహారానికి వద్దాము.
పాపము ఈ మధ్య దేవుళ్ళందరికి డబ్బుచేసింది.
దేవాలయాలకు 1992 ఆర్ధిక సంస్కరణలు బాగా లాభించాయంటే మీరు ఆశ్చర్యపోవద్దు.30 సం.ల క్రితము దేవాలయాలు స్థితి, నేటి దేవాలయాల రూపు కు మధ్య మీకు గమనింపు వుంటే పరిశీలించండి మికు ఈ తేడా తెలుస్తుంది.ప్రజలలో డబ్బు చేరికతో అధ్యాత్మికత దర్శనాలకన్నా, హోదా, డాబు దర్జా,వేకేషన్ దర్శనాలు పేరిగి భక్త జన సందొహముతో దేవాలయాల వద్ద రద్ది పెరిగింది. ఈ జన సందొహముతో కానుకల శ్రేణి బాగా పెరిగింది. ఓకనాడు లక్ష రూపాయల కానుక ఘనము కాని నేడు కోటి కూడా తూనాబొడ్డు. 
     ఈ కానుకల హంగుతో దేవాలయ పాలకవర్గాలు దేవుడి పేరు చెప్పి బంగారు కవచాలు,దేవాలయ శీతలికరణలు, గ్రానైట్ రాళ్ళు,బంగారు గిన్నేలు,బంగారు శఠారిలు,బంగారు పాత్రలు ఇవి అవసరమా. దేవుడి పేరున చందాలు. ఈ పనుల కాంట్రాక్ట్ లో వాటాలు వీలుంటే మొత్తము గుటకాయ స్వాహాలు.పాపము సమాధి అయ్యెంతవరకు షిరిడి బాబాగారు అతి సాధారణముగా వున్నారు.కాని నేడు షిరిడిలో కాదు సందు సందుకి బాబా ఆలయాలలో వెండి, బంగారు సింహాసనాలు. ఆయన చెప్పిన శ్రద్ధ, సబూరిలు  ఓకటి వెండిగా  మరొకటి బంగారముగా మారిపొయి. బాబాగారు దొపిడిదారులకు అవకాశము అవుతున్నారు ఉదా. విజయవాడ 1 టవున్ నేహ్రు బొమ్మ వద్ద వున్న చిన్న మందిరము చేసిన తంతు. వీళ్ళ దొపిడి ఇంకొకడి పాఠములా మారి వాడుకూడా తెల్లవారెటప్పటికి మందుబాబు కాస్తా భక్తపరమాణు రూపము దాల్చి కొత్త బిచాణ సిద్ధము.దోపిడి ప్రారంభము ఇది వరుస. 
   ఓక్క పూట ఆహారము కూడ పరిశీలించి తినమని వేదము చెపుతుంది.యతులు,స్వాములు దుర్మార్గుడివద్ద ఆహార స్వీకరణ నిషిద్దము.వాళ్ళకే అన్ని వుంటే స్వామివార్లకు ఎన్ని జాగ్రత్తలు వుండాలి.మరి స్వామి వారి ధరింపచేసే ఆభరణాలు,సేవకు ఉపయొగించే పాత్రలు బంగారమువి దాతలు ఇస్తున్నారు మేము తీసుకుంటున్నమంటున్నారు కాని దాతలు ఎవరు వారి పరిస్థితి ఎమిటని ఒక్కసారి కూడా విచక్షణలేదు.గాలి లాంటివాడి వద్ద కిరిటాలు,ముఖేష్ అంబాని లాంటివాడి వద్ద డబ్బులు.అంబానిల రూముకు  వెళ్ళి ఆశ్వీరవాదాలు. ఇవి అన్ని ఎందుకు జరిగినవి దేవాలయాలు అధాత్మికత వదులుకోని వ్యాపారకెంద్రాలుగా మారిన కారణంగా జరిగిన విపరిణామాలు.
ఇది చాలదన్నట్లు వ్యాపారసంస్థల మధ్య పొటిలా స్వామీజీల సమూహలలొ ఈ మధ్య అంతర్గత పోటిలు,ఆరొపణలు,రకరకాల రూమర్స్ ప్రచారము.వీళ్ళు కూడా ఫ్యాక్షనిష్టుల్లా,భూకబ్జాదారుల్లా వీలయినంత మేరా భూఅక్రమణకు పాల్పడుతున్నారు.విశాఖపట్నము స్వామి గారు ఇదే తరహా అరోపణ ఎదుర్కుంటున్నారు.గతములో నేరాలలో ప్రమేయము,నేడు చెక్ బౌన్స్ కేసులు కర్నూల్ స్వామి మీద వున్నాయి ఇది కూడా పరీశిలనకు తీసుకొవాలి.ఇదే తరహాలో అనెక రకాల సంపాదనా మార్గాలు. దీనికి ఓ పెద్ద ఉదాహరణ.వేలూరు బంగారుగుడి. అంత బంగారము అవసరమా?హెలికాప్టర్స్ లో పూలు చల్లటము దేనిని సూచిస్తుంది.ఎన్నో వందల వేల సంవత్సరాలనుంచి వున్న దేవాలయాలు,మఠాలు చూడనంత సంపద,వైభోగాలు,పూజలు ఎలాచేస్తున్నారు.అందుకు డబ్బు ఏమార్గాల్లో వస్తుంది. ఇవి అన్ని లొకానికి అవసరము లేదు,ఓకవేళ  అడిగినా వాడి నొరు నొక్కటము బాగ తెలిసిన విద్య.రాజకీయనాయకులకు  అందవలసినది అందటముతో ప్రభుత్వాలు మాట్లాడవు.వీళ్ళందరు కొత్తతరం రాజాలు.కదిలితే మెదిలితే విమానాలు,కోట్లరూపాయల వాహనాలు,వందలమంది అంతే వాసులు,భక్తజన సందోహాలు.వీళ్ళు స్వాములు కాని అహాన్ని మాత్రము జయించలేక పొయారు.
      

అందుకు చినజీయ్యర్ ఈ మధ్యలో తిరుమలలో చేసిన పెద్ద హడావుడి.వీరు పేరుమాళ్ళు దర్శనము కూడా కాకుండా మధ్యలో తిరుగు ప్రయాణము  . ఇది వారు ఆరాధించే స్వామిని తృణికారాభావముతో చూసినట్లుకాదా? వాళ్ళు ఎన్ని రకాలా సమర్ధనలు చెప్పినప్పటికి ఈ భావము ప్రజల మనస్సులొకి వచ్చింది అన్నది నిజము.దేవాలయ అధికారులకు తనకు మధ్య వున్న వివాదానికి స్వామిదర్శనము కూడదా? రేపు ఇదే విధముగా తన భక్తులు వీరి పట్ల వ్యవహిరిస్తే అప్పుడు వీరి అనుభూతి. దేవుడు చెప్పలేదని అనుకొవద్దు ప్రజా ఆగ్రహమే  దైవనిర్ణయమని నేను భావిస్తున్నా.

మీరు గమనించారో లేదో వీళ్ళలొ కొద్దిమందికి తప్ప చాలామందికి ఓక్క శ్లోకం చెప్పటము,ఓక్క ప్రవచనము ఇవ్వటము కూడా రాదంటే ఆశ్చర్యమే.అది,ఇది, అలా,ఇలా ల తో మేకప్ చేస్తారు తప్ప ఉటంకింపులు,ఉదాహరణలు,వ్యాఖ్యానాలు,స్తొత్ర పారాయణలు వుండవు. వేలకొట్ల రూపాయలు సంపాదించిన కల్కి వారు నోరు తెరచి మాట్లాడంటే భయం,బండారము బయటపడుతుందని. టీవిలకు,దర్శనాలకు వీరు మౌనముద్రలొ ఎవరికి అందనంత ఎత్తుగా పీఠాలు,తెరలు. ఓక భాషణ,ఓక మార్గము చూపితే అందులో తప్పు ఓప్పులు చర్చకు దారితియ వచ్చని ఖండనకు గురికావలసి వుంటదని ముందునుంచే మౌనము.మౌనముగా కోట్లు సంపాదించి శిష్య,ప్రశిష్యులతో ప్రవచానాలిప్పించి.మాస్వామి అంత మహత్తు,ఇంత మహత్తు అని డాంబిక ప్రచారాలు.పాపము వీరికి తన తోడుగా ఆడ అవతారానికి ఎవరు దొరకక, దొరికినా తనకన్నా ముదురుగా మారి తనను ముంచుతారని జాగ్రత్తగా తన భార్యనే పద్మావతిగా తన ప్రక్కన స్థానము.అధ్యాత్మికత వారసత్వమా.ఓక వ్యక్తి అధ్యాత్మిక వున్నతి సాధించారని అతని భార్య, బిడ్డలకు అది అబ్బదు. దీనికి ఉదాహరణలు చాలా వున్నాయి. పురాణాలలో శుకుడుకు, వ్యాసునకు అధ్యాత్మిక స్థాయిలో ఎవరు వున్నతులో మీకు తెలియందికాదు.మరి వీళ్ళ స్థాయి ఏమిటో బుధ జనులకు తెలియాలి.
   పులి మీద పుట్రలా నిత్యానందలాంటి వాడి వ్యవహారము ఓపెద్ద తలనొప్పి,ఓసిగ్గుచేటు.అంత అంకచండాలమయిన వ్యవహారము సమర్ధనీయమా! నిత్యానంద,రంజితల వాదన,ఖండన వారికి ఇంపు మిగతావారికి కంపు.వీరి వాదనకు నైతిక,సామాజిక అమోద ముద్ర పడకపొవటమే దీనికి తార్కాణము.ఇది ఇలా గుండగానే వీరు 300కోట్ల రూపాయల ఖర్చుతో 1500 సం.ల చరిత్ర వున్న ఙ్ఞాన సంబందర్ స్థాపించిన మదురై ఆధినమనే వీరశైవ మఠానికి వీరు ఉత్తరాధికారిగా పట్టాభిషిక్తుడై సర్వప్రపంచాన్ని షాకుకు,కంచి స్వామీవారిని వేదనకు గురిచేసారు.ఈ వ్యవహారము అందరి మతవిశ్వాసాలలొ ఆజ్యము పొసీనట్లుగా మారింది. దీనితో ఇది రాజకియ పార్టీల రొచ్చు వ్యవహారములా కేసులు,ధర్నాలు,విమర్శలు,ప్రతి విమర్శలగా సాగుతుంది.

    అయ్యా! వీళ్ళందరు ఇన్ని గందరగోళాలు,వైరుధ్యాలు సృష్టించి ఎమి బాపుకుంటున్నారు. వీళ్ళ ఆధాత్మికత స్థాయి "రమణులు","రామకృష్ణ పరమ హంస" లతో  పొల్చితే సూక్ష్మాతీ సూక్ష్మము, అల్పాతీ అల్పము.
                
 ఇవి ఇలా వుంటే టీవిలలొ ఛానల్ ఛానల్ కు పురాణప్రవచనాల మేళా.మరలా మతానికొ ఛానల్ అన్ని మతాల వారు అనుచరగణాలు పెంచుకొవటానికి టివిలలొ దర్శనము.ఈ ప్రవచనాలలో ఎన్నిరకాల వైరుద్ధ్యాలో లేక్కలేదు.పూజలు స్తొత్ర పారాయణలు చెప్పె విధానాలు బొలేడు ఆచరణలు.మీరు నవ్వుతారు కాని ఈ మధ్య మాషాపుకు ఓక తిక్క మెళాము టివిల పైత్యం ముదిరినవాడు వచ్చి "పురుషుల వ్రత కధల " పుస్తకము అడిగాడు.నా 30 సం.లా వ్యాపార అనుభవములో చూడని వింత వాడిని ఎదొ విధముగా చెప్పి పంపాను.ఈ రోజు టీవిలో ఓక పూజ గురించి చెప్పారు అంటే వేలం వెర్రికి వెనుకా ముందు లేదు.ప్రస్తావించరాదు నాకు తెలిసిన ఓక అధ్యాత్మిక రచయుత,వ్యాఖ్యాత కు వున్న మందు, స్త్రీ వ్యామొహము భయంకరము,భరించరానిది.ఈ ప్రవచానాల స్వాములను ఎదో వూరు నుంచి ఓక ఆసామి అయ్యా నేను ఫలానా రొజున పుట్టాను నా సమస్య ఇది.ప్రవచన పంతులుగారు బాబు మీది అశ్వని నక్షత్రము. మేష్లగ్నము,మేష రాసి ఇది నివారణ అని వాడి సమస్యకు ఎదో తరుణొపాయాము చెప్పుతాడు  కాని ఇవతల అసలు సమస్యవాడి సంగతి మనకు తెలవదు కాని శ్రద్ధగా వినే మధ్యవాడు తనది అశ్వని నక్షత్రము అయితే వాడికి అన్వయించుకోని తన దశ, అంతర్దశ,గ్రహస్థితి లాంటివి ప్రక్కన పెట్టి యమ అర్జెంటగా ఈ పూజలు నిర్వాహణ వాడికి పనికి రాక తరువాత లబో దిబో.     
   దీనికి తోడు మాసబ్బు వాడండి, మాషాంపు వాడండీ అని అర్ధనగ్న అమ్మాయిలు ప్రచారములా ఉంగరాలకి,యంత్రాలకి అందముగా వున్న అమ్మాయిలతో ప్రచారము. ఈ మధ్య ప్రచారము అయిన శనియంత్రము కంపేని ఆ ఉత్పత్తి మీద 500కోట్లు సంపాదించినది అంటే ఎంత మంది మొసపొయారో తెలుసుకొండి.నేను 30 మంది వద్ద గమనించాను.
     పూర్వము రామకల్యాణము రేడియోలో ప్రత్య్క్షప్రసారము అవుతుంటే ముచ్చటగా వింటూ సీతరామ కల్యాణఘట్టాన్ని కనుల ముందు ఊహించుకొనేవారు.కానీ నేదు దేశములో అన్ని ప్రాంతాలలొ వున్న క్షేత్రాలలొ సేవలన్ని ప్రత్యక్ష వీక్షణము.పోని విక్షకులన్నా భక్తిగా చూస్తున్నారా! అబ్బేలేదు సీరియల్స్,సినిమాలలొ భాగముగానే ఉదాసినముగానే చూస్తున్నారు.టీవి కంపెనికి రేటింగిలు భక్తులకు కావలసింది కాలు కదపని వినొదము.చివరకు దేవుడుకూడా వినొద సాధనముగా మారిపొయాడు.   
  ఇవి అన్ని ఎందుకు జరుగు తున్నాయి? ఈ పద్దతులు అన్ని వ్యాపార లక్షణాలు కాదా?అందుకే "బడాయి భక్తి - వ్యాపార దేవాలయాలు - కార్పొరేట్ అధాత్మికత" సంఘమునిండా ఉజ్జ్వలముగా వెల్లి విరుస్తుంది.
తస్మాత్ జాగ్రత్త పైవాడికి కోపము వస్తే ....
ఈ మధ్యనే పెనుగొండ కాళేశ్వర్ బాబా పేరు కూడా తెలియని వ్యాధితో కన్నుమూసాడు.ఇది అందరు ఙ్ఞాపకము వుంచుకొవలసిన అంశము.
పాత సామేత ఓకటి  "ఇల్లాలు వెలవెల - వెలయాలు ధగధగా".కాని అంత్యకాలానికి ఇల్లాలే దిక్కు.  
---------------------------------------------------------------------------------------------

    ఈ వ్యాసము చాలా వుంది. కాని విస్తార భీతితో ఇంతవరకు ముగించా.నేను ఏ స్వాములకు మతాలకు వ్యతిరేకము కాదు కాని జరుగు తున్న దొపిడి చూసి బాధ కలిగి ఎవో కొన్ని పేర్లు, సంఘటనలు ప్రస్తావించాను బొలేడు నిజాలు,చాలామంది అవకతవకలు గమనించా.దైవము పై విశ్వాసము వున్న వాడిగా ఈ దారుణ కాండ చూడలేక ఈ విధముగా వెలి బుచ్చాను.అంతే తప్ప వేరుకాదు.
ఒక వేళ పేర్లు ఉదాహరించిన స్వాముల అభిమానులకు కొపాలు వస్తే నమస్కారపూర్వక మన్నింపులు.లేదా మావాడేలే అనుకుంటే ధన్యవాదాలు. రెండు మీ సమక్షములోనే.
   
ఏనాడో వేమన చెప్పాడు చిత్తశుద్ధిలేని శివపూజ గురించి. వీళ్ల చిత్తము డబ్బు మీద వుంటే, వీళ్ళు శివుడి పై ఏమి నిలుపుతారు.

   వేదాలు,ఉపనిషత్తులు,సర్వమతాలు,మతగ్రంధాల సారాంశము ఓక్కటే మానవుడిలోనే దేవుడు వున్నాడు.కనుక మానవత్వమే సర్వులకు సమ్మతము,హితము.

కొంత మంది మిగతా మతాల గురించి వ్రాయలేదే అని అనుమానము. నాకు నా మతమంటే ప్రేమ,అభిమానము. అలాగని ప్రక్కవారి పై నిరాదరణో,ద్వేషమో లేదు.పరిశిలించలా, పరీశిలించి ఖచ్చితముగా తదుపరి టపాలలో వ్రాస్తా.

ఇది మతము పై విమర్శకాదు.ఇలా వున్నదే,ఇలా జరుగుతున్నదే,ఇలాగయితే ఎలా అన్న పరామర్శ మాత్రమే.

12 కామెంట్‌లు:

  1. "ఈ స్వామీజీల మఠాలు,ఆశ్రమాలు చూడండి వైభవంగా వైకుంఠాన్ని తలపించే విధముగా 5నక్షత్రాల హోటళ్ళకన్నా ఎక్కువగా ఉదా. ఆర్ట్ ఆఫ్ లివింగ్, గణపతి సచ్చిదానంద,జియ్యర్ ఆశ్రమాలు"

    Any particular reason for skipping Satya Sai Baba here? :)
    Good Post :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు అనుకున్న విధముగా ఎమి లేదు. తులనాత్మక పరిశీలనలో అందరు ఓక్కటే. సమీక్షకు కొన్ని పేర్లు తీసుకున్నాం తప్ప వేరు కాదు. అందుకే అసేతు హిమాచలములో వున్నది ఇదే విధమని పొస్ట్ లో తెలిపాను గమనించండి.పొస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. రచయిత ఇంకా చాల చెప్పాలని బావించివుంటారు కానీ ధైర్యం చెయ్యలేకపోయారు . మాటలలో చెప్పలేని దుర్మార్గాలు, హత్యారాజకీయాలు చేసే mundalamuttakorlu ఈరోజు స్వామిజిలుగా అవతారం ఎత్తి ఈదేశ హిందూమత గొప్పతనాన్ని నాశనం చేసి మన పరువు తీస్తున్నారు ,ఏది ఎమైన ఒక గొప్ప సత్యాన్ని ప్రజలకు చెప్పిన రచయతకు హృదయపూర్వకమైన అబినందనలు. మనము కూడా ఇలాంటి దుర్మార్గాలను అరికట్టి మన దేశ ఖ్యాతిని ఇనుమడించి ఇంత మంచి విషయం చెప్పిన రచయతకు అండగా నిలబడుదాము .

    రిప్లయితొలగించండి
  4. ఆదిదేవిశెట్టి గారికి నమస్కారములు, మీలాంటి దైవ భక్తి పరులకు ప్రస్తుతమున్న పరిస్థితి చాలా సంకటము మరియు ఇబ్బంది. మతము పేరుతో బహిరంగముగా మాయాజాల్ నడుస్తుంది.అదే తెలిపినాను.ఇంకా ఘాటుగా వ్రాయాలంటే ఓక్కొకరి గురించి విపులంగా వ్రాయాలి. పొస్ట్ నచ్చినందులకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. meeru prathiroju oka manchi vishayam cheppi prajalaku vasthavaparisththini vivarinchi prajalanu jagrutham chesthunnanduku meeku aa devadevudi karunakatakshamulu lbinchugaka.

    రిప్లయితొలగించండి
  6. పుణ్యక్షేత్రాలు వ్యాపారక్షేత్రాలవుతాయని ,ఉల్లిగడ్డకు కూడా ఉపదేశ మిచ్చేటి కల్లగురువులు భువిన పుట్టేరయా ! అని విరబ్రహ్మేమ్ద్ర స్వామీ వారు హెచరించి ఉన్నారు కదా . తప్పదు యుగాధర్మ మిది .వినాశాకాలం దాపురిమ్చినదాకా ఎవరు వినేస్తితిలో లేరు .

    రిప్లయితొలగించండి
  7. నిజమేనండి.ఈ రోజుల్లో భక్తి విషయంలో కూడా వ్యాపారాత్మక ధోరణి ఎక్కువైపోవటం అత్యంత బాధాకరం.

    రిప్లయితొలగించండి
  8. ధన్యవాదాలు! దీనికి కారణం ప్రజలలొ వున్న విశ్వసాలు.

    రిప్లయితొలగించండి
  9. నీ గస బాగానే ఉన్నది. ఈ లంజా కొడుకలకంటే వారి వద్దకు వెళ్లే ముండల్ని, ముండాకొడుకుల గుద్దల్లో కర్రపెట్టి( ఆ కర్రకు కారం పూసి)పెడితే, అప్పుడు ఈ స్వాముల మడ్డ కుడవడానికి పోరు

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.