1, మే 2012, మంగళవారం

మామిడి ని ఙ్ఞానఫలము అని దేనికంటారు? వివరణ


ప్రకృతి ఇచ్చిన వరాలలొ మామిడి పండు ఒక విశిష్టస్థానము.మామిడి మన జీవితాల్లొ అనేకవీధాలుగా పెనవేసుకొన్నది.మామిడీఅకులేని శుభకార్యము,పండుగను వూహించలేము.

ఇంతటి విశిష్టమయిన మామిడికాయ పిందేగా వున్నప్పుడు వగరుగా,కాయగా వున్నప్పుడు పుల్లగా,పండుగా మారిన తరువాత అమ్రుతమయిన  తీపిగా. బహుశా ఈ మామిడి ఒక్కటే విభిన్నదశలలో తనరూపాన్ని,లక్షణాన్ని,రుచిని మార్చుకొనేది.
  
మరీ ఙ్ఞానముకూడా అంతే ప్రారంభదశలొ సాధనకు పడ్డకష్టము వలన ఙ్ఞానము ఇంత శ్రమతోకూడినదా అని అనిపిస్తుంది. మరి ఇది  వగరుని ప్రతిబింబిస్తుంది.

అదే సాధన కొంతదారి లొ పడ్డాక కొన్ని అనుభవాలు పొందేసరికి, ఆహా!నాకు కూడా ఏవొ తెలుస్తున్నాయి, ఎమిటి ఈ అనుభవాలు ఇంత బాగున్నయి అనే తలంపు. మరి ఇది పులుపు కదా!

అదే సాధన ఫలించి దర్శనము జరిగి తత్ ప్రభావముచే 'మౌనమే' శరణ్యమనే స్థితి.మరి ఇదేగదా తీపి.

అందుకే మామిడిపండుని ఙ్ఞానఫలమని పెద్దల ఉవాచ.

కంచి ఏకామ్రేశ్వరుడి సన్నిధిలోని మామిడిచెట్టుకువున్న పవిత్రత.

పళని గుడి వద్దవున్న కుడ్యచిత్రాలలొ నారదుడు శివునకు ఙ్ఞానఫలము రూపములొ మామిడిని ప్రసాదించటము మనము గమనింపతగినవి.          

5 కామెంట్‌లు:

  1. ఆమధ్య మాసత్సంగము లో వివేక చూడామణి చదువుంతుంటే ఇలాంటి అనుమానమే ఒకరికి కలిగింది ఇన్ని పండ్లు ఉండగా లోకం లో ప్రధానంగా ఇద్దనినే ఎందుకు ఎంచి చూపిస్తున్నారు అని,
    ఆరోజు answer అందలేదు కాని ఇప్పుడు ఈ విధమైన ఆంతర్యం దాగుందని తెలుస్తుంటే ఆశ్చర్యం గా తోస్తోంది.
    సంతోషం

    రిప్లయితొలగించండి
  2. చాలా మంచి విషయం తెలియజేసారండి ..మీకు మా ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  3. చాలా మంచి విషయం తెలియజేసారండి, ధన్యవాదాలు. వగరుగా వున్న మామిడిని పచ్చడిగా వుగాదిరోజు నినడం మంచిదే అంటారా? పుల్ల మామిడిని వూరగాయ పెట్టుకుని తినడం అపరిపక్వ జ్ఞాన సేవనం అంటారా?

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.