శ్రీరామకృష్ణ పరమహంస - కథలు
ఈ శీర్షికతో శ్రీరామకృష్ణ పరమహంస గారి కథలు కొన్నింటిని బ్లాగ్ జనులకు పరిచయము చేద్దామని ఇలా ప్రారంభము.
మీరు పరమహంసగారి జీవితచరిత్ర చదివేవుంటారు అందు కొన్ని కథలు,ఉదాహరణలు,స్వయముగా పరమహంసగారు స్వయముగా చెప్పినవి అందుకే అవి విలక్షణముగా చిన్న టైపులో వుంటాయి.శ్రీరామక్రిష్ణ మఠము వారు జీవితచరిత్ర 1/8క్రౌన్ సైజు, సమగ్రప్రామాణిక జివిత గాథ 1/8డెమ్మీ సైజులో బాక్స్, శ్రీరామకృష్ణ కథామృతము 1/4క్రౌన్ సైజులో సబ్సీడీ ధరకు ప్రజలకు అందిస్తున్నారు వీలు వున్నవారు తప్పక వుంచుకొవలిసిన బుక్స్.
ఇక కథలోకి వద్దాము.
అరణ్యవాసములో సీతారామలక్ష్మణులు అరణ్యాలగుండా సాగిపొతున్నారు.అది ఎంతో ఇరుకైన దారి ఒకరి వెంట ఒకరు మాత్రమే పోగలరు. ముందు కొదండపాణియిన రాముడు,ఆయిన వెనుక సీత,అమె వెనుక ధనుర్భాణ హస్తుడు లక్ష్మణుడు నడచి పోతున్నారు. రాముడి పట్ల భక్తి,ప్రేమాసక్తుడైన లక్ష్మణుడు ఆ శ్యామసుందరుండైన శ్రీరాముని సర్వాదా చూడగొరతాడు.కాని సీత అడ్డుగా వుండటముచే పరితపించాడు. ఇది ఎరిగిన సీత కొంచేము ప్రక్కకు తొలిగి "అదిగో చూడు" అన్నది, అప్పుడు లక్ష్మణుడు కళ్ళార తన ఇష్టమూర్తిని అవలొకించాడు.
ఇదే రీతిలో జీవునకు ఈశ్వరునికూ నడుమ మాయాశక్తి జగజ్జనని వుంది. అమె దయతలచి పక్కకు తొలిగినగాని జీవుడుకి ఎన్నటికి ఈశ్వరుని చూడలేదు.కాబట్టి అమె కృపలేకుంటే నిత్యానిత్యవస్తువివేచనము, వేదాంత విచారము ఎంత సలిపినా నిష్ప్రయోజనమే.
శ్రీరాముడు సచ్చిదానంద పరబ్రహ్మ రూపుడని సర్వులు ఎరిగినదే, అలాగే సీత, లక్ష్మీ రూపమని, ఈమే త్రిమాతలలో ఒకరని, వీరు ఆ జగజ్జనని రూపాలని కూడా తెలుసు. ఇక లక్ష్మణుడు శేషువు యొక్క రూపమని, ఈ శేషువు ప్రాణరూపుడై సర్ప రూపములో మూలాధార చక్రములో వుంటాడని కూడా ఇక్కడ మనము అన్వయించుకొవాలి.మరీ ప్రాణశక్తీ సహస్రారము అనగా పరబ్రహ్మ రూపాని చేరటానికి మధ్య సంసారము అనే మాయ వుంటుంది దానిని ప్రక్కకు తొలగమని వేడుకుంటే అనగా సాధన చేస్తేనేకాని పరబ్రహ్మస్వరూపము దొరకదని భావము.
భక్తీ, విశ్వాసాలే ఈ సాధనకు ఆయిధాలు.
కనుక ఆ శ్రీరాముని, తద్వారా సచ్చిదానంద పరబ్రహ్మాన్ని సర్వులూ చూడగలరని ఆశీస్తూ ......
చక్కటి కధనం. శ్రీ రామకృష్ణ పరమహంస కధలు అందించడం చక్కటి ప్రయత్నం. ధన్యవాదములు మీకు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు.భారతి గారు నాబ్లాగ్ ఫాలొ అవుతున్నందులకు మరియు కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలిపినందుకు.
తొలగించండిచాలా చాలా మంచి ప్రయత్నం!
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
తొలగించండిPlease see the following link
రిప్లయితొలగించండి( నీ స్వస్వరూపాన్ని సద్గురువు ఎలా చూపిస్తారు ?)
http://youtu.be/qfzYm24wU5U
భజగోవిందం పై ప్రవచనం జరుగుతూ ఉండగా, శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు,
శ్రీ రామ కృష్ణ పరమ హంసవారిని గూర్చి ఇట్లు చెప్పసాగారు ఈ video ని ఒక్కమారు వీక్షి౦చ గలరని మనవి,
మీ తదుపరి post లలో ఇద్దానిని వినియోగించిన యెడల ఎల్లరకు ప్రయోజనకరముగా నుండును,
జై (నాతండ్రి) శ్రీ రామ కృష్ణ పరమ హంస వారికి!!
జై జై (మా యమ్మ) శారదామాత కు!!
ధన్యవాదాలు.
తొలగించండి