16, మే 2012, బుధవారం

ఇది మీరు చేయగలరా.... ?............చేయగలరు!




ఈ ప్రపంచములో అనేకమంది విధివంచితులు,ఆశోపనిహతులు,దురదృష్టవంతులు,అనేకరకాల రుజగ్రస్తులు. ఇలా అనేక మంది దీనగాధలు  మీ దృష్టికి మీడీయాద్వార, న్యూస్ పేపర్లద్వరా, టీవిలద్వారా,ఇంటర్నెట్ ద్వారా మీముందుకు వస్తుంటాయి . ఈ గాధ చదవగానే మీమనస్సు కదులుతుంది,గుండే బరువుతో ఇబ్బందిగా మారుతుంది,దుఃఖము తన్నుకు వస్తుంది. మీరు తత్ క్షణము వారికి ఏదో విధముగా సహాయపడాలని కృతనిశ్చయులు అవుతారు.వీరిలో కొంతమందికి ఆర్ధిక సహాయము చేయమని బాంక్ నంబర్లు కూడా ఇస్తారు.ఈ గాధ మీముందుకు వచ్చేసమయానికి మీరు ప్రయాణము లోవుండవచ్చు,అర్ధరాత్రికావచ్చు,లేకపొతే మీకు ఆర్ధిక వెసులు బాటు లేక పొవచ్చు.మీరు దాతలైన,దయాగుణము సమృద్ధిగావున్న వారైన పరిస్థితుల ప్రాబల్యములో మీరు కూడా చిక్కుకొని వున్నారు.ఏమి చెయాలో తెలియక సతమతమవుతుమటారు.కాని వారి దినగాధకు చలించిపొతుంటారు.అయ్యో ఇదా మానవత్వము అని బాధ పడుతుమటారు. ఆ సమయములో ఈ సూచన పాటించండి. మీబాధకు ఉపశమనము, తక్షణ తరుణోపాయము ఇదే .


ఇటువంటి దీనగాధ మీదృష్టికి వచ్చినప్పుడు మీరు సహాయపడటము ప్రధమవిధి. అటువంటిది సాధ్యము కానప్పుడు, మీరు ఆవ్యక్తిని ఉద్దేసించి మీ ఇష్టదైవాన్ని ప్రార్ధించండి. ఆపదలో వున్నవారి ఇబ్బంది నివారించమని పరమాత్మను కొరండి.వారు ఎవరో తెలియకపొయనా ఫర్వాలేదు కాని వారి తరుపున మీరు  ప్రార్ధించండి. ఇటువంటి నిస్వార్ధపూరిత ప్రార్ధనను పరమాత్మను కదలించి ఏవరో ఓక వ్యక్తి,ఓక దాత సహాయపడతారు.వారు దుఃఖములో పరమాత్మను వేడుకొవచ్చు,లేకపొవచ్చు.కానీ కుల,మత,బంధుత్వాలు,ప్రాంతీయ బేధాలు లేని, అనుబంధ రహిత నిస్వార్ధపూరిత ప్రార్ధనను పరమాత్మ ఆలకిస్తాడని నా విశ్వాసము,నా నమ్మకము.ఇది నేను ఆచరిస్తున్న విధానము.

మిత్రులు కొంతమందికయినా ఉపయోగపడుతుంది ఎమో అని మీముందుకు తీసుకురావటము తప్ప వేరుకాదు.

ప్రార్ధించే పెదవులకన్నా సహాయముచేసె చేతులు మిన్న, కాని కొన్ని సమయాలలో ప్రార్ధన కూడా ఆవసరమే. ఇది మీరు నిస్వార్ధముగా చేయండి.        

3 కామెంట్‌లు:

  1. చక్కటి సూచన. అందరూ ఆచరించదగిన మంచి మాట చెప్పారు. ధన్యవాదములు. సత్ సేవయే అత్యుత్తమగు ప్రార్ధన. సేవ చేసే స్థితిలో లేనప్పుడు మీరుసూచించినట్లుగా ఆ క్షణంలో వారి శ్రేయస్సును కాంక్షిస్తూ చేసే నిస్వార్ధపూరిత ప్రార్ధన తప్పకుండా మంచి ఫలితంను ఇస్తుంది. సర్వే జనః సుఖిన భవంతు.

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.