అవి 2004 విజయదశమి రొజులు. మేము 5మందిమి విజయవాడ నుంచి వారణాసికి మామామగారి అస్థినిమజ్జనకార్యక్రమమునకు వెళ్ళినాము.వారణాసిలో మాబస గుంటూరువారిసత్రం నందు.
మాకార్యక్రమములు పూర్తిచేసినాము.దైవదర్శనము జరిగినది.స్థానిక దేవాలయాలు,సందర్శనీయస్థలాలు అన్ని కూడా చూసినాము.
మా ప్రొగ్రాములో తరువాతిది ఆయిన అయోధ్య,నైమిశారణ్యము సందర్శన.దీనికి గాను సత్రము ప్రక్కనే వున్న ట్రావెల్స్ వారిని సంప్రదించి.ఈ 2 ప్రదేశములు చూపి మమ్ము లక్నోలో డ్రాప్ చేయాలి ఈవిధముగా మాట్లాడుకొన్నాము. అడ్వాన్స్ కూడా ఇచ్చాము.మరుసటిరొజు సాయంత్రము వెళ్ళాలని నిశ్చయము.ఉదయము పూట అవకాశము వున్నదని వింధ్యవాసిని దర్శనమునకుకూడా వెళ్ళివచ్చాము.భొజనము ముగిసిన తరువాత మా బావమరదిని వెళ్ళి మేము సిద్ధమని ట్రావెల్స్ వారికి తేలిపిరా అని పంపినాను. అతను వచ్చి బావగారు 30నిముషములలోపు పాండేహవేలి వద్దకు సుమోవెహికల్ వస్తుంది అని తెలపగా.అందరము సత్రము ఖాళి చేసి 3.30ని. లకు చేరినాము.వెహికల్ రాలేదు,కొంతసేపు నిరిక్షణ తరువాత ఫొన్ చేయగా ఇదిగో అదిగో అని 6 సా.గం. ఆయినా రాదు.ఎమి చేయాలో అర్థముకాదు.ట్రావెల్స్ వాడిమీద గట్టిగా అడిగితే కొంత సహాయాపడుతాడు అనుకున్నా కాని శూన్యము.వాడికి స్థానికుడననే గీర తప్ప ఇంకొటికానరాలేదు.
ఆడవారితోసహ అందరము రోడ్డుమీద. ఎమిచేయాలో తేలియలా "నాయనా నీదే భారము నిన్నునమ్మి ఇక్కడికొచ్చాము అని మన్సులో పరమేశ్వరుడుని ప్రార్థించా". అంతే అప్పటిదాక సహకరించని ట్రావెల్స్ యజమాని సన్నగా బక్కగా వున్న వ్యక్తితో అక్కడకు వచ్చి యేమిచేయాలో తెలవటములేదని అన్నాడు.నేను కూడా ఇలా అయితే ఎలా దబ్బుతీసుకునికూడా ఇబ్బంది పేడితే ఎలా అన్నా.మేము అడగకుండానే మాతాలుకు ఇబ్బందిగ్రహించిన మధ్యవ్యక్తి నేను మిమ్ము తీసుకొనివెళ్ళతాను.డబ్బుకూడా మీఇష్టము గతములోలానే ఇవ్వండి అని.ఒక్క క్షణములో వేహికల్ తో మా మధ్య ప్రత్యక్షము.
పొని మమ్ము ఇబ్బంది పెడతాడేమోనని నాభయము.కాని మేము సుమోలొ ఎక్కిందిమొదలు మేము ఆతని స్వంత బంధువర్గములా ఆహారాలవద్ద,ఆయోధ్యలో బస వద్ద,నైమిశారణ్యములో లొకల్ వారి ఆగడాల నుంచి రక్షించి మమ్ము చూసినతీరు మాకు అతనికి ఎదొ జన్మ సంబంధములా వున్నది.అలా మా ట్రిప్ కంప్లీట్ చేసి లక్నోలో డ్రాప్ చేసినదాకా ఎదొ కలలా జరిగిపొయనది.
ఇవి ఆదేవుడు కలిపిన సంబంధాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.