ప్రతి జంట వివాహమయిన తరువాత ఎంతలా ఎదురు చూస్తారన్నది సర్వులకు విదితమే. శృంగారము ఓక కారణమయితే ఈ క్రతువు తరువాత మాత్రమే వారిని దంపతులుగా పిలువటానికి నిజమయిన అర్హత సంపాదిస్తామని. సాధారణ భాషలో కార్యమని,అక్కరని వాడుక. షోడశ జాతసంస్కరాలలో మొదటిది అయిన దీనిని ఇక్కడ గర్భాధానమని,పునహఃసంధానమని పిలుస్తారు.కాని ఎక్కువగా శొభనమని వాడుక. కారణము. శొభ అనే మాటకు కొరీక,వెలుగు,వస్త్రాభరణ భూషితముతో వచ్చు కాంతి(శబ్దరత్నాకరము) అని అర్థాలు.ఈ మూడు అర్థాలు ఈ సంధర్భానికి చక్కగా సరిపొతాయి.అనగా జీవితానికి వెలుగు, తద్వార సంతానమును ప్రసాదించు కార్యము కాబట్టి శోభనమని వాడుక.
ఇది గృహాన్నిబట్టీ,కులాన్నిబట్టీ,ప్రాంతాలని బట్టి అనేకా ఆచారాలుగా,చివరకు వేడుకగా మారిపొయింది. వీటి గురించి తెలుసుకునేముందు గర్భాధానము యొక్క పూర్వా పరాలు తెలుసుకుందాము.
మానవుని జీవితము సంస్కారములకు క్షేత్రము.అందు సంతానమును కనుట ప్రాధాన్యము. పూర్వము సంతానమే వాళ్ళ సిరి సంపద.ధర్మశాస్త్రములు సంతానముకనుట పరమ పవిత్రమని పేర్కొన్నవి.ఈ గర్భధారణ ద్వార పురుషుడు, స్త్రీ యందు తన బీజమును వుంచుచున్నాడుకనుక ఇది గర్భాధానమయినది.ఈ సంస్కారము సమంత్రకముగా జరుగనిచో అశ్వలాయనస్మృతి ప్రాయశ్చిత్తము విధించినది.
తల్లి తండ్రుల మనోప్రవృత్తులను అనుసరించి సంతానముయొక్క మనస్సు,శరీరము ఏర్పడుచున్నవి. కామ,వీర,దైవీ లాంటి వివిధ భావాలలో ఎవరు ఏ భావముతో కలిస్తే అదే భావములో సంతానము కలుగుతారు.(మహభారతములో పాండురాజు,ధృతరాష్ట్ర,విదుర జననము).
కనుకనే గర్భాధాన సమయమున పతి తాను ప్రజాపతి అంశకలవానిగాను,భార్యను వసుమతి రూపమని భావించి కలియవలేనని ప్రాచీనుల అభిప్రాయము.
స్త్రీ శారీరకముగా సమర్థురాలైనప్పుడు ఋతుస్నాత అయిన 5 రోజు రాత్రి నుండి 16 రోజు వరకు అని మనఃస్మృతి చెబుతుంది.మాసమున కొన్ని దినాలు సంగమమునకు నిషిద్ధము.సంక్రమణ దినాలు, పండుగలు,పర్వదీనాలు,పితృకార్య ముందురొజు, ఆరొజు,అష్టమి,చతుర్దశి,పౌర్ణమి,అమావాస్య,ఏకాదశీ,త్రయోదశి లు తిథులలో. శని,ఆది,మంగళ వారాలలొ, భరణి,కృత్తిక,ఆర్ధ్ర,మఘ,పుబ్బ,విశాఖ,జ్యేష్ట,మూల,పూర్వాషాడ,పూర్వాభాద్ర నక్షత్రాలలో వర్జితమని శూద్రకమలాకరము.
ఈ శొభన లగ్నానికి గురు,శుక్ర శుభదృష్టి అవసరము.
ఇక వేడుకలకు వద్దాము. వేడుక అంటే ముచ్చటగా జరుపుకునే మన గృహకార్యక్రమము.
గత కాలములో బాల్యవివాహాల వలన అమ్మాయి రజస్వల అయిన తరువాత మంచి మూహుర్తము చూసి మరి జరిపేవారు.అందువలన వివాహానికి ఈ కార్యక్రమానికి చాలా వ్యవధి వుండేది.ఇంతటి ప్రక్రియలో ఎప్పుడు వచ్చి చేరినదో తెలియదు కాని వివాహమయిన 3రొజులలో అని, 16 రోజులపండుగలోపని ఈ కార్యక్రమము జరిపే పద్ధతి ఎక్కువ అయినది .దానికి తోడు ఆగలేని కుర్రజంటలు, బిజీ జీవితాలు.
ఆరోజున "అల్లుడుగారిని పిలుస్తున్నాము" వచ్చి దంపతులను ఆశ్వీరదించి, "దంపత తాంబూలాలు "అందుకొవాలని తమకు హితులయిన బంధు మిత్రులను పిలుస్తారు.
అమ్మాయికి తెల్లని చీర ఈ చీరకు సాధారణముగా ఒక్క నల్లని చుక్కకూడాలేకుండా ఎంపిక చేస్తారు.
పాతరొజులలో అల్లుడు అలకపానుపు అని డబ్బు దండుకునేవారు.
ఇక ఇంతటి కార్యక్రమానికి వేదిక అయిన పడకకు పూలతో ఆలంకరణ చేసి జంటను పంపుతారు. నేడు ఫ్లొరిష్ట్ లు రూ40,000/- నుంచి రూ2,50,000/- వరకు చార్జ్ చేస్తున్నారు.
ఈ పడకపై రాత్రికి పానుపు వేసి వచ్చిన దంపతులకు 5,9 తాంబూలాలు ఇప్పిస్తారు.
సాధారణముగా ఎవరొ ముసలమ్మలు అమ్మాయికు అబ్బాయి చెప్పినట్లు విను అని రహస్యముగా బొధ చేసెవారు. అబ్బాయికి అయితే మిత్రులో,వరసయిన బావలో సరసము జాగ్రత్త అని హెచ్చరికలు జారిచేస్తారు.
అమ్మాయి కట్నం గా కొంగుకు బంగారము కట్టే సాంప్రదాయము ఇంకావున్నది.
ఇక గదిలో అనేకరకాల స్వీట్స్,పాలు గురించి చెప్పవలసిన పని లేదు.
ఇలా అన్ని ముచ్చట్లు ముగిసి మూహూర్తసమయానికి ఆజంటను గదిలో వదిలి ఇవతలకు వస్తారు. ఇక ఆజంట ఎమి చేస్తారంటారా ష్..ష్..గప్...చుప్.
ఇవి కాకుండా పాతరొజులలొ కొన్ని చిలిపి ముచ్చట్లు,వింత అలవాట్లు వున్నాయి.
పాతతరములో జంటలు బాగా లెత జంటలు. ఇటువంటి జంటలు పార్వతి పరమేశ్వరులని, వారు జరిపే సంసారం, సృష్టి కార్యముగా భావించి చాలామంది ముసలివారు రహస్యముగా చూడటానికి ఉత్సాహము చూపేవారు.
కొంతమంది దీనికి వెరే అర్థము చెపుతున్నారు జంటలో ఎవరికన్నా సిగ్గు,బిడియాలతొ చేరిక కాక దాంపత్యము విఫలము కాకూడదని అలా చేస్తారు అంటారు. ఎవరి ఇష్టము వారిది.
ఇది కాకుండా ఇంకొ అల్లరి. కొంతమంది కొంటె మరదళ్ళు పడకకు రహస్యముగా గజ్జేలు కడతారు, చిన్నపిల్లలను గదిలో దాచి సమయానికి పిలుస్తారు,ఇంకొంతమంది బావగారిని అల్లరి పెట్టటానికి తలుపు తీసేవరకు దబ దబా తలుపులు తట్టి, తలుపు తీసిన తరువాత మరదలు కట్నము దండుకుంటారు.
ఇంతటి ప్రాశస్థ్యము గల శోభనము నేడు ఎదొ ఒక తంతులా ముగిస్తున్నారు.
మరి ఇటువంటి కార్యక్రమాన్ని హోటల్ గదుల్లాంటి అంక చండాలమయిన చొట్ల కనిసము సంప్రొక్షణ అయిన లేకుండా ఫ్యాషన్ గురించి జరిపితే వాళ్ళ దాంపత్యాలు ఏవిధముగా సరిగా వుంటాయి.
ఇటువంటి క్రతువులు సరిగా జరగకపొతే దాని విషపరిణామాలు : సంతానలేమి,దాంపత్యములో కలతలు, ఇంకా ఇక్కడ ప్రస్థావించలేని అనేక అపభ్రంశాలు కలుగుతున్నాయి.
నేడు కొంతమంది ముదుర్లు హాడావుడి పడి (వివాహానికి)ముందే తొందరపడి ఎలాపడితే అలా ఎక్కడ పడితే అక్కడ ముగించుతున్నారు. వారిని ఆ దేవుడేకాపాడాలి.
ష్..ష్..గప్...చుప్.
రిప్లయితొలగించండిhttp://youtu.be/AyU1Q1BztDI
బాగున్నది చక్కగా వివరణ చేసారు,
ఎప్పుడో 8th sanskrit లో అనుకుంట దీలీప మహారాజు గారి అర్థ కామములు ధర్మాచరనకే తోడ్పడినవి అనే sentence చదివాను,
అది జ్ఞాపకం వచ్చెన్ మీ post చూసిన పిదప,
ప్రజాపిత ఋణం తీర్చుకోవటం అనేది శాస్త్ర బద్ధముగా పెళ్లి చేసుకొని
కామ్యాసక్తతో కాక ప్రజాపిత ఋణం తీర్వాలనేడి ఉద్దేశ్యంతో సృష్టికార్యం లో భాగాస్వములవ్వడమే ఈ శోభనం.
మీ post చదువుతుంటే, ఈ బ్రహ్మ చారికి గిలిగింతలు పెట్టినట్టు ఉంది.
అయినా! పూర్వుల ఆంతర్యాన్ని సాంప్రదాయం వెనుక దాగిన సత్యాల్ని వెలికి చూపే ప్రయత్నం చేసారు !!
?!
ధన్యవాదాలు.
తొలగించండి