10, మే 2012, గురువారం

రాధ ఏవరు ? క్రిష్ణుడు రాసలీలలు ఎందుకు ఆడాడు?




                                      శ్రీ క్రిష్ణుడు ఇలా తలవగానే మనమదిలో ఒక హాయి ఇది బాలరూపము,  ఒక అల్లరి రూపము గొకులములొది,మరల అంతలొనే బృందావనరాసలీల మనొహర రూపము ఇలా మన మనస్సుని వశపరుచుకున్న పరమపురుష స్వరూపము. 
  
గోకులం లొ  నందుని ఇంటికి  క్రిష్ణుడు రావటము మానవజాతికి గొప్ప వరము. గోకులములో ఈ బాల క్రిష్ణుని లీలావినొదము అంతటికన్న  గొప్ప దివ్యచరితము.ఈ బాల క్రిష్ణునిలోవున్న పసితనము,ముగ్ధమోహనత్వము,అమాయకత్వము,గడుసుతనము,అల్లరి.

ఈ రూపములో యశొదకు,గోవులకు,గోపాలకులకు,గొల్లభామలకు,గిరులకు,తరులకు,మడుగులకు ఇలా సర్వప్రకృతి అంతటికి తన స్పర్శ ప్రసాదించాడు,తన ప్రేమ పంచాడు.వారి ఆరాధన స్వీకరించాడు.  


అసలు ఈ గోకులములో ఎన్నిలీలలు పరిశీలించండి పూతన,బకుడు,తృణావర్తుడు,శకాటాసురుడు,గోవర్ధనము,కాళింది,యశోదకు విశ్వరూపసందర్శనము ఇలా ఎన్ని చూపినా అన్నింటిలొను  ఒకటే లీలామానుష వినోదము.

మరి అదే బృందావనములో ఈ గోపికలంతా తామే క్రిష్ణులమయి, ఖచ్చితముగా చెప్పాలంటే విదేహులయి పూర్తిగా తమను క్రిష్ణునికి అర్పించేంతంటి ఆరాధన,ప్రేమ.

ఈ ఆరాధనకు,ప్రేమకు రూపము కలిపిస్తే "రాధ" అయింది. రాధ అంటే అఖండ ప్రేమతత్వము.రాధంటే ఓక్కరు కాదు గోపికలందరి ఉమ్మడిరూపము.అంతటి ఆఖండప్రేమమయిమైన రాధప్రేమలో క్రిష్ణుడు ఓలలాడాడు,ఆ ప్రేమను స్వీకరించాటానికి పరితపించాడు.తాను కూడా ఆగొపికలందరికి ప్రేమను పంచటానికి వివిధరూపాలు ధరించి రాసలీలలు జరిపాడు. 




6 కామెంట్‌లు:

  1. అయితే రాధ కి అర్ధము ఆరాధన + ప్రేమ అన్న మాట. బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. చక్కగా వివరించారు. గతంలో నేను కూడా 'గోపికావస్త్రాపహరణం - రాసలీల - అంతరార్ధం' గురించి పోస్ట్ పెట్టాను. పురాణేతిహాసాల్నిఅవగాహన చేసుకునే ప్రయత్నంలో వివిధ భావాలు స్ఫురిస్తాయి. చక్కటి స్ఫూర్తినిస్తాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భారతి గారు నమస్కారములు, మీ పొస్ట్, గోపికావస్త్రాపహరణం - రాసలీల - అంతరార్ధం' ను ఇప్పుడే చదివాను.చక్కటి వివరణ.నా తాలుకు పొస్ట్ చదివినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  3. చక్కని విషయం వివరించినందుకు ధన్యవాదాలు.....

    రిప్లయితొలగించండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.